బోల్డ్‌ ఈజ్‌ గోల్డ్‌ | Radhika Apte saying Bold Is Gold | Sakshi
Sakshi News home page

బోల్డ్‌ ఈజ్‌ గోల్డ్‌

Published Sat, Jan 28 2017 1:43 AM | Last Updated on Tue, Sep 5 2017 2:16 AM

బోల్డ్‌ ఈజ్‌ గోల్డ్‌

బోల్డ్‌ ఈజ్‌ గోల్డ్‌

బోల్డ్‌ ఈజ్‌ గోల్డ్‌. ఏమిటీ కొత్త నిర్వచనం అనుకుంటున్నారా? ఇది నటి రాధికాఆప్తే అంటున్న మాట. నిజమే ఈ పదానికి నప్పే నటే ఈమె.అందాలారబోతకు హద్దులు తుడిచేసే రాధికాఆప్తే దక్షిణాదిలోనే కాస్త సంసార పక్ష పాత్రల్లో కనిపించారు. ఉత్తరాదిలో ఈ అమ్మడి నటన అందర్నీ ముక్కుమీద వేలేసుకునేలా చేసింది. అర్ధనగ్నంగానే కాదు నగ్నంగా నటించడానికీ ఏమాత్రం వెనుకాడని నటి రాధికాఆప్తే. పూణేకు చెందిన ఈ బోల్డ్‌ నటి స్టేజ్‌ ఆర్టిస్ట్‌ నుంచి సినీ ఆర్టిస్ట్‌గా ప్రమోట్‌ అయ్యింది.

మొదట హిందీ, ఆ తరువాత బెంగాలీ, మరాఠి చిత్రాల్లో నటించి ఆపై దక్షిణాదికి దిగుమతి అయిన ఉత్తరాది భామ రాధికాఆప్తే. ఇటీవల కబాలి చిత్రంలో సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌కు భార్యగా నటించి మంచి ప్రాచుర్యం పొందిన ఈ జాణ ఆ ఇమేజ్‌ను తుడిచేసే విధంగా పర్చడ్‌ అనే హిందీ చిత్రంలో అర్ధనగ్నంగానూ, అహల్య అనే బెంగాలీ షార్ట్‌ ఫిలింలో నగ్నంగా నటించి పెద్ద చర్చకే దారి తీసింది. ఎలా అంత ధైర్యంగా నటించగలుగుతున్నారు? నగ్నంగా నటించడానికి మీ భర్త అభ్యంతరం చెప్పరా? అన్న ప్రశ్నలకు రాధికాఆప్తే చాలా బోల్డ్‌గా బదులిచ్చారు. అవేమిటో ఆమె మాటల్లోనే చూద్దాం.

కథకు అవసరం లేకుండా అర్ధనగ్నంగా నటించడం నాకూ సమర్థనీయం కాదు. అదే కథ డిమాండ్‌ చేస్తే నగ్నంగా నటించడానికైనా నాకు ఆక్షేపణ లేదు. ఎందుకంటే బోల్డ్‌ ఈజ్‌ గోల్డ్‌. వివాహమైన స్త్రీని మీ భర్త అభ్యంతరం చెప్పరా? అని అడుగుతున్నారు. గ్లామరస్‌గా నటించడానికి.. ముఖ్యంగా నగ్నంగా నటించడానికి నా భర్త బెనెడిక్ట్‌ టె యిలర్‌ అభ్యంతరం చెప్పరు కదా, సపోర్ట్‌ చేస్తారు. ఎందుకంటే ఆ సన్నివేశాల్లో తను కథా పాత్రల్నే చూస్తారు కానీ నన్ను చూడరు అని రాధికాఆప్తే చెప్పుకొచ్చింది. చూశారా ఎంత బోల్డ్‌గా బదులిచ్చిందో.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement