ప్రియుడితో ఎంగేజ్‌మెంట్‌ చేసుకున్న బుల్లితెర నటి! | Prema Entha Madhuram Serial Actress Varsha HK Engagement With Her Lover, Photos Goes Viral | Sakshi
Sakshi News home page

Varsha HK: తెలుగులో ఫేమస్‌ సీరియల్ నటి.. ప్రియుడితో నిశ్చితార్థం..!

Published Thu, Sep 12 2024 4:25 PM | Last Updated on Thu, Sep 12 2024 5:35 PM

Tv Avtress Varsha HK Engagement Wih Another Actor and Lover

ప్రముఖ బుల్లితెర నటి హెచ్‌కే వర్ష త్వరలోనే వివాహబంధంలోకి అడుగుపెట్టనుంది. తాజాగా నటుడు కౌశిక్‌ నాయుడితో ఎంగేజ్‌మెంట్‌ చేసుకుంది ముద్దుగమ్మ.  ప్రేమ ఎంత మ‌ధురం అనే సీరియల్‌తో టాలీవుడ్‌లో గుర్తింపు తెచ్చుకున్న కన్నడ భామ.. శాండల్‌వుడ్‌లోనూ పలు సీరియల్స్‌లో కనిపించింది. ప్రస్తుతం వీరి నిశ్చితార్థ వేడుకకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

(ఇది చదవండి: బాయ్‌ఫ్రెండ్‌తో చిల్ అవుతోన్న హార్ధిక్ పాండ్యా మాజీ భార్య!)

వర్షకు కాబోయే భర్త కౌశిక్ నాయుడు సైతం కన్నడలో సీరియల్స్‌లో నటించారు. వీరిద్దరి మధ్య పరిచయం కాస్తా ప్రేమకు దారితీసింది. దీంతో పెళ్లి చేసుకునేందుకు రెడీ అయ్యారు. ప్రేమ ఎంత మ‌ధురం అనే సీరియ‌ల్‌తో తెలుగు ఇండ‌స్ట్రీలోకి ప్రవేశించింది శాండల్‌వుడ్ బ్యూటీ వర్ష హెచ్‌కే. అంతకుముందు క‌న్న‌డలో నాగ‌మండ‌లం, క‌స్తూరి నివాస్, రాజారాణి సీరియ‌ల్స్ చేసింది. అంతే కాకుండా కొన్ని లఘు చిత్రాల్లోనూ న‌టించింది. ప్ర‌స్తుతం క‌న్న‌డ‌, తెలుగు భాష‌ల్లో బుల్లితెరపై అభిమానులను అలరిస్తోంది. 

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement