kaushik
-
ప్రియుడితో ఎంగేజ్మెంట్ చేసుకున్న బుల్లితెర నటి!
ప్రముఖ బుల్లితెర నటి హెచ్‌కే వర్ష త్వరలోనే వివాహబంధంలోకి అడుగుపెట్టనుంది. తాజాగా నటుడు కౌశిక్ నాయుడితో ఎంగేజ్మెంట్ చేసుకుంది ముద్దుగమ్మ. ప్రేమ ఎంత మధురం అనే సీరియల్‌తో టాలీవుడ్లో గుర్తింపు తెచ్చుకున్న కన్నడ భామ.. శాండల్‌వుడ్‌లోనూ పలు సీరియల్స్‌లో కనిపించింది. ప్రస్తుతం వీరి నిశ్చితార్థ వేడుకకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.(ఇది చదవండి: బాయ్‌ఫ్రెండ్‌తో చిల్ అవుతోన్న హార్ధిక్ పాండ్యా మాజీ భార్య!)వర్షకు కాబోయే భర్త కౌశిక్ నాయుడు సైతం కన్నడలో సీరియల్స్‌లో నటించారు. వీరిద్దరి మధ్య పరిచయం కాస్తా ప్రేమకు దారితీసింది. దీంతో పెళ్లి చేసుకునేందుకు రెడీ అయ్యారు. ప్రేమ ఎంత మధురం అనే సీరియల్‌తో తెలుగు ఇండస్ట్రీలోకి ప్రవేశించింది శాండల్‌వుడ్ బ్యూటీ వర్ష హెచ్‌కే. అంతకుముందు కన్నడలో నాగమండలం, కస్తూరి నివాస్, రాజారాణి సీరియల్స్ చేసింది. అంతే కాకుండా కొన్ని లఘు చిత్రాల్లోనూ నటించింది. ప్రస్తుతం కన్నడ, తెలుగు భాషల్లో బుల్లితెరపై అభిమానులను అలరిస్తోంది. View this post on Instagram A post shared by 𝙆𝙖𝙪𝙨𝙝𝙞𝙠 𝙉𝙖𝙞𝙙𝙪 (@peoplez_prince) -
Ambitio: ధైర్యం ఇస్తూ... దారి చూపుతూ
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ) సాంకేతికతతో విదేశీ విశ్వ విద్యాలయాలకు సంబంధించిన అడ్మిషన్ ప్రాసెస్‌ను సులభతరం చేసి ‘అంబిటియో’ పేరుతో ప్లాట్‌ఫామ్ క్రియేట్ చేశారు ఐఐటీ గ్రాడ్యుయేట్స్ దీర్ఘాయు కౌశిక్, విక్రాంత్ శివాలిక్, వైభవ్ త్యాగీ. మన దేశంలోని తొలి ఏఐ అడ్మిషన్ ప్లాట్‌ఫామ్ ‘అంబిటియో’ విజయపథంలో దూసుకు΄ోతోంది.... ఐఐటీ–బీహెచ్‌యూ(వారణాసి)లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన కౌశిక్ ఫారిన్ యూనివర్శిటీలో ఎంబీఏ చేయడం కోసం అప్లై చేయాలనుకున్నప్పుడు స్టూడెంట్స్‌కు సహాయపడే ప్లాట్ఫామ్లాంటిదేమీ తనకు కనిపించలేదు. ‘విదేశీ యూనివర్శిటీలలో చేరే విషయంలో సహాయం అందించడానికి కౌన్సెలర్లు ఉన్నప్పటికీ ఎక్కువ డబ్బులు తీసుకుంటారు. ఆ ఆర్థికభారం అందరికీ సాధ్యం కాదు. మరో విషయం ఏమిటంటే వారు ఒకటి రెండు కాలేజిల గురించి మాత్రమే చెబుతారు’ అంటాడు కౌశిక్. ఈ నేపథ్యంలోనే స్టూడెంట్స్‌కు సంబంధించి కాలేజి అప్లికేషన్స్, సరిౖయెన కాలేజీ ఎంపిక చేసుకోవడం, పర్సనల్ ఎస్సేస్...మొదలైన వాటి గురించి ఒక ప్లాట్‌ఫామ్‌ను క్రియేట్ చేయాలనుకున్నాడు. కాలేజీ ఫ్రెండ్స్ విక్రాంత్, వైభవ్ త్యాగీలకు తన ఆలోచన చెప్పాడు. వారికి ఐడియా నచ్చి కౌశిక్‌తో కలిసి పనిచేయడానికి ముందుకు వచ్చారు. అలా ‘అంబిటియో’ అంకురం మొలకెత్తింది. ‘అంబిటియో’ ప్లాట్‌ఫామ్ ద్వారా మొదట పాతిక మంది స్టూడెంట్స్‌కు టాప్ ఇనిస్టిట్యూట్స్‌లో అడ్మిషన్ దొరికేలా సహాయం చేశారు. స్టూడెంట్స్ ్ర΄÷ఫైల్స్‌పై ప్రధానంగా దృషి పెట్టి వాటికి మార్పులు, చేర్పులు చేశారు. కార్నెగి మెలన్ యూనివర్శిటీ, ఎన్‌వైయూ, ఇంపీరియల్ కాలేజ్, యూసీ బర్కిలి...మొదలైన ఇంటర్నేషనల్ యూనివర్శిటీలకు సంబంధించి 175 మంది స్టూడెంట్స్‌కు సహాయపడ్డారు. ‘అంబిటియో గురించి తెలియడానికి ముందు ఒక కౌన్సెలర్ సలహాలు తీసుకున్నానుగానీ అవి నాకు ఉపయోగపడలేదు. అంబిటియో ఉపయోగించడం మొదలు పెట్టిన తరువాత నాలో ఆత్మవిశ్వాసం పెరిగింది. సరిౖయెన దారి కనిపించింది’ అంటున్న ప్రహార్ కమల్‌కు లండన్‌లోని వార్విక్ బిజినెస్ స్కూల్లో ప్రవేశం దొరికింది. ‘అంబిటియో’ ప్లాట్ఫామ్లో ఏఐ ఎలా ఉపకరిçస్తుంది అనేదాని గురించి కో–ఫౌండర్, సీయీవో కౌశిక్ మాటల్లో... ‘రెండు ప్రైమరీ ఏరియాలలో ఏఐ టెక్నాలజీని ఉపయోగిస్తున్నాం. ప్రస్తుతం మార్కెట్లో అందుబాటులో ఉన్న మోస్ట్ సూటబుల్ ప్రోగ్రామ్ లేదా యూనివర్శిటీని ఎంపిక చేసుకోవడంలో స్టూడెంట్స్‌కు సహాయపడడం అందులో ఒకటి. తమకు అర్హత ఉన్న కోర్సులను ఫిల్టర్ చేసి చూడడానికి ప్రస్తుతం ఫిల్టరేషన్ టూల్స్ ఉన్నప్పటికీ మేము ఏఐ ద్వారా మరో అడుగు ముందుకు వేశాం’ విస్తృతస్థాయిలో సమాచారాన్ని విశ్లేషించడం ద్వారా ఈ ప్లాట్‌ఫామ్ పర్సనలైజ్డ్ రికమండేషన్లను వేగంగా అందిస్తూ స్టూడెంట్స్ టైమ్‌ను సేవ్ చేస్తుంది. ‘స్టూడెంట్స్ తమకు అవసరమైన కాలేజీని ఎంపిక చేసుకున్న తరువాత, తదుపరి దశ అద్భుతమైన వ్యాసం రాయడం. వివిధ యూనివర్శిటీలకు సంబంధించి 5,000 వ్యాసాలతో మా మోడల్‌కు శిక్షణ ఇచ్చాం. సరిౖయెన కాలేజిని ఎంపిక చేసుకోవడం నుంచి స్కాలర్షిప్కు అప్లై చేసుకోవడం వరకు మా ప్లాట్‌ఫ్లామ్‌లో అన్నీ ఉచితమే’ అంటున్నాడు కౌశిక్. ఏంజెల్ ఇన్వెస్టర్ల ద్వారా కంపెనీ 1.5 కోట్ల నిధులను సమీకరించింది. ‘భారత్ మార్కెట్లో వేగంగా దూసుకు΄ోయి మరింతగా విస్తరించాలనేది మా లక్ష్యం’ అంటున్నాడు కౌశిక్. యూనివర్శిటీలలో అడ్మిషన్లకు సంబంధించి విద్యార్థులకు ఇంటెలిజెంట్ డిజిటల్ అడ్వైజర్లుగా సేవలు అందించడమే మా లక్ష్యం. – దీర్ఘాయు కౌశిక్, అంబిటియో–సీయీవో, కోఫౌండర్ -
గ్రాండ్‌మాస్టర్‌ను ఓడించిన పిన్న వయస్కుడిగా...
క్లాసికల్ చెస్ ఫార్మాట్లో గ్రాండ్‌మాస్టర్‌ను ఓడించిన పిన్న వయస్కుడిగా భారత సంతతికి సింగపూర్ కుర్రాడు అశ్వథ్ కౌశిక్ (8 ఏళ్ల 6 నెలల 11 రోజులు) రికార్డు నెలకొల్పాడు. స్విట్జర్లాండ్‌లో జరిగిన బర్గ్డార్ఫర్ స్టాడస్ ఓపెన్ టోర్నీ నాలుగో రౌండ్లో అశ్వథ్ 45 ఎత్తుల్లో పోలాండ్‌కు చెందిన 37 ఏళ్ల గ్రాండ్‌మాస్టర్ జేసెక్ స్టోపాపై గెలిచాడు. ఈ క్రమంలో లియోనిడ్ (సెర్బియా; 8 ఏళ్ల 11 నెలల 7 రోజులు) పేరిట ఉన్న రికార్డును అశ్వథ్ బద్దలు కొట్టాడు. -
‘బాక్స్ సాగు’ భలేభలే..!
వ్యవసాయంతో పరిచయమున్న వారెవరికైనా గ్రీన్హౌస్ అంటే తెలిసే ఉంటుంది. ఎండావానలు, చీడపీడల నుంచి పంటలను కాపాడుకోవడానికి చేసుకొనే ఓ హైటెక్ ఏర్పాటు. ఒక ఎకరా విస్తీర్ణంలో ఆధునిక గ్రీన్‌హౌస్‌ను ఏర్పాటు చేసుకోవాలంటే... రూ. లక్షలకు లక్షలు ఖర్చు అవుతుంది. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఖేతీ అనే స్టార్టప్ సహ వ్యవస్థాపకుడు, సీఈవో అయిన కౌశిక్ కప్పగంతుల అత్యంత తక్కువ ఖర్చుతోనే అత్యాధునిక గ్రీన్‌హౌస్‌ను అభివృద్ధి చేశారు. అంతేకాకుండా ప్రాంతం, వేసే పంటలను బట్టి దిగుబడులు పెంచుకొనేందుకు, అత్యవసర పరిస్థితుల్లో పంటలను కాపాడుకొనేందుకు ఏమేం చేయాలో కూడా రైతులకు నేరి్పంచడం మొదలుపెట్టారు. ఈ మొత్తం వ్యవస్థ పేరే... ‘గ్రీన్హౌస్ ఇన్ ఎ బాక్స్’. ఈ వినూత్న ఆవిష్కరణకుగాను బ్రిటన్ యువరాజు చార్లెస్ స్థాపించిన ప్రతిష్టాత్మక ‘ద ఎర్త్ షాట్ ప్రైజ్–2022’ను కౌశిక్ పొందారు. – సాక్షి, హైదరాబాద్ కావాల్సిన వారికి కావాల్సినంత... ఖేతీ అభివృద్ధి చేసిన గ్రీన్‌హౌస్‌ను 240 చదరపు మీటర్లు లేదా ఎకరాలో పదహారో వంతు సైజులో ఏర్పాటు చేసుకోవచ్చు. అవసరాన్ని బట్టి ఒక్కటొక్కటిగా చేర్చుకోనూవచ్చు. ఒక్క గ్రీన్హౌస్ ఏర్పాటుకు ప్రస్తుతం రూ. 60 వేల ఖర్చవుతోంది. సాధారణ గ్రీన్హౌస్తో పోలిస్తే ఇది 90 శాతం తక్కువ. ఆసక్తికరమైన అంశం ఏమిటంటే... రైతులు రోజుకు రెండు గంటలపాటు మాత్రమే పనిచేయడం ద్వారా ఏడాదిలోనే పెట్టుబడితోపాటు కనీసం రూ. 20 వేలు అదనంగా సంపాదించవచ్చు. 240 చదరపు మీటర్ల విస్తీర్ణంలో పండే పంటకు ఏడు రెట్లు ఎక్కువగా పండటం ఒక కారణమైతే... నీటి వాడకం 95 శాతం వరకూ తక్కువ. అలాగే ఎరువులు, చీడపీడలకు పెట్టే ఖర్చులు కూడా తక్కువ కావడం వల్ల పెట్టిన పెట్టుబడికి మించిన రాబడి ఏడాదిలోనే వస్తుంది! (చదవండి: ‘చిరు’ధాన్యాల సాగుకు పెద్ద ప్రోత్సాహం) 15 రకాల పంటలు.. ఖేతీ గ్రీన్‌హౌస్‌ల అమ్మకాలు మాత్రమే చేయడం లేదు. ఏ పంట వేస్తే ఎక్కువ లాభాలుంటాయో నిత్యం తెలుసుకొనే ప్రయత్నాల్లో ఉంది. హైదరాబాద్ సమీపంలోని సొంత వ్యయసాయ క్షేత్రంలో ఇప్పటివరకూ 15 రకాల పంటలను విజయవంతంగా పండించింది కూడా. మరిన్ని పంటల సాగుపై పరిశోధనలు జరుగుతున్నాయి. 2017లో కేవలం 15 మంది రైతులతో తెలంగాణలో ఈ టెక్నాలజీ వాడకం మొదలుకాగా... మూడేళ్లలో 500 మంది రైతుల దగ్గరకు చేర్చారు. గతేడాది తెలంగాణతోపాటు మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, జార్ఖండ్లలోనూ ‘గ్రీన్హౌస్ ఇన్ ఎ బాక్స్’వాడకం మొదలైంది. మొత్తమ్మీద ఇప్పుడు సుమారు 2,500 మంది చిన్న, సన్నకారు రైతులు ఈ టెక్నాలజీని వాడుతున్నారు. 2027కల్లా 50 వేల మంది వాడేలా ప్రయత్నిస్తున్నాం... 2027 నాటికి దేశవ్యాప్తంగా కనీసం 50 వేల మంది రైతులు ‘గ్రీన్హౌస్ ఇన్ ఏ బాక్స్’ను వాడేలా చేసేందుకు ప్రయత్నిస్తున్నాం. ప్రభుత్వాలు చొరవ తీసుకొని రైతులకు వ్యవస్థీకృతమైన పద్ధతిలో రుణ సౌకర్యం కల్పిస్తే వారికి మరింత మేలు జరుగుతుంది. చిన్న, సన్నకారు రైతులు ఎంత ఎక్కువగా ఈ టెక్నాలజీని అందిపుచ్చుకుంటే.. అంత తక్కువ ధరలకు ఈ గ్రీన్‌హౌస్‌లు అందించవచ్చు. సెన్సర్ల వంటి హంగులను కూడా ఈ గ్రీన్హౌస్లో చేర్చేందుకు ప్రస్తుతం ప్రయత్నాలు చేస్తున్నాం. – కౌశిక్ కప్పగంతుల, ఖేతీ సహ వ్యవస్థాపకుడు, సీఈవో -
గెలుపు గ్రామర్
విజయం సాధించడంలో ఎంత కిక్ ఉందో....ఇతరులను విజయం సాధించేలా చేయడంలో అంత కంటే ఎక్కువ కిక్ ఉంది!ఎడ్యుకేషన్ స్టార్టప్ ‘ప్రిప్‌ఇన్‌స్టా’తో ఆశయ్ మిశ్రా, కౌశిక్, మనీష్ అగర్వాల్‌లు విజయం సాధించడమే కాదు యువత తమ కలలు సాకారం చేసుకోవడంలో కీలకపాత్ర పోషిస్తున్నారు... కౌశిక్, ఆశయ్ మిశ్రా, మనీష్ అగర్వాల్‌లు వెల్లూర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(విఐటీ యూనివర్శిటీ, తమిళనాడు)లో కలిసి చదువుకున్నారు. చదువు పూర్తయిన తరువాత బెంగళూరులో వేరు వేరు కంపెనీలలో ఉద్యోగాలు చేసేవారు.‘చాలామంది స్టూడెంట్స్‌లో ప్రతిభ ఉన్నా తమ ఉద్యోగ లక్ష్యాన్ని చేరుకోలేకపోతున్నారు. దీనికి కారణం వారిలో సాంకేతిక నైపుణ్యం లేకపోవడంతో పాటు కోరుకున్న ఉద్యోగాన్ని సాధించడంలో అనుసరించాల్సిన వ్యూహంపై అవగాహన లేకపోవడం...’ ఇలాంటి ఆలోచనలను రెగ్యులర్‌గా బ్లాగ్‌లో రాసేవాడు గూగుల్ కంపెనీలో పనిచేస్తున్న కౌశిక్.తన బ్లాగ్ ఎంత హిట్ అయిందంటే సంవత్సరం తిరిగేసరికల్లా నెలకు లక్ష వ్యూలు వచ్చేవి.ఆ టైమ్‌లోనే కౌశిక్‌కు ‘ఫ్లిప్‌కార్ట్’ నుంచి మంచి ఉద్యోగ అవకాశం వచ్చింది. అయితే దాన్ని కాదనుకొని ఇద్దరు మిత్రులతో మాట్లాడాడు.అలా ఈ ముగ్గురి మేధో మథనం నుంచి పుట్టిందే... ప్రిప్‌ఇన్‌స్టా.ప్రిప్‌ఇన్‌స్టా(ప్రిపేర్ ఫర్ ప్లేస్‌మెంట్స్ ఇన్స్టంట్లీ) అనేది వోటీటీ ఫార్మట్ ప్లాట్‌ఫామ్. యూజర్లు డబ్బులు చెల్లించి ఫిక్స్డ్ టైమ్‌లో(నెలలు లేదా సంవత్సరాలు) 200 కోర్సులతో యాక్సెస్ కావచ్చు. అప్స్కిలింగ్ సబ్జెక్ట్‌లు, క్లౌడ్ కంప్యూటింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఇంటర్వ్యూ ప్రిపరేషన్ (లాజిక్, వెర్బల్ అండ్ పర్సనాలిటీ డెవలప్మెంట్)...మొదలైనవి ఆ కోర్సులలో ఉంటాయి.‘ఎన్నో ప్లాట్‌ఫామ్స్‌లో ఎన్నో కోర్సులు అందుబాటులో ఉన్నాయి. అయితే గ్రామీణ, చిన్న పట్టణాలకు చెందిన వారు ఆ ఖర్చును భరించే స్థితిలో లేరు. దీన్ని దృష్టిలో పెట్టుకొని అందుబాటు ధరల్లో ఉండేలా ప్రిప్‌ఇన్‌స్టా తీసుకువచ్చాం. యూత్ తమ డ్రీమ్ జాబ్స్‌ను గెలుచుకునేలా చేయడంలో మా ప్లాట్‌ఫామ్ విజయం సాధించింది’ అంటున్నాడు కో–ఫౌండర్ ఆశయ్ మిశ్రా. నోయిడా(ఉత్తర్‌ప్రదేశ్), బెంగళూరు కేంద్రంగా పనిచేస్తున్న ఈ ప్లాట్‌ఫామ్ యాభైకి పైగా కాలేజీలతో కలిసిపనిచేస్తుంది. రాబోయే కాలంలో మూడు వందల కాలేజీలతో కలిసి పనిచేయాలనే లక్ష్యాన్ని నిర్దేశించుకుంది.‘మాది సెల్ఫ్–పేస్డ్ ప్లాట్‌ఫామ్. స్టూడెంట్స్ తమకు అనుకూలమైన టైమ్, షెడ్యూల్లో చదువుకోవచ్చు.బీ2సీ (బిజినెస్–టు–కన్జ్యూమర్) మోడల్లో ఈ ప్లాట్‌ఫామ్‌కు 2.25 లక్షల పెయిడ్ యాక్టివ్ సబ్స్రైబర్లు ఉన్నారు. కోవిడ్ కల్లోల కాలంలో మాత్రం ఈ స్టార్టప్ తలకిందులయ్యే పరిస్థితి వచ్చింది. ఆదాయం సగానికి సగం పడిపోయింది. పేరున్న ఎడ్టెక్ కంపెనీలు కూడా మూతపడుతున్నాయి. ‘నిరాశ’ మెల్లిగా దారి చేసుకొని దగ్గరికి వచ్చే ప్రయత్నం చేస్తోంది. అయితే ఆ సమయంలో గట్టిగా నిలబడ్డారు ముగ్గురు మిత్రులు. కంపెనీని రీవ్యాంప్ చేశారు. ఉద్యోగుల సంఖ్యను పెంచారు.‘ఇక కనిపించదు’ అనుకున్న కంపెనీ లేచి నిలబడి కాలర్ ఎగరేసింది! 25 కోట్ల క్లబ్లో చేరిన ఈ స్టార్టప్ తన విస్తరణలో భాగంగా వెంచర్ క్యాపిటల్, ఏంజెల్ ఇన్వెస్టర్లతో చర్చలు జరుపుతోంది.రిస్క్ అనిపించే చోట ‘ప్లాన్ బీ’ను దృష్టిలో పెట్టుకోవడం మామూలే. అయితే ‘ప్లాన్ ఏ’ పకడ్బందీగా ఉంటే ‘బీ’తో ఏంపని? అని ఈ ముగ్గురు అనుకున్నారు. వారి నమ్మకం నిజమైంది . ఎన్నో ప్లాట్‌ఫామ్స్‌లో ఎన్నో కోర్సులు అందుబాటులో ఉన్నాయి. అయితే గ్రామీణ, చిన్న పట్టణాలకు చెందిన వారు ఆ ఖర్చును భరించే స్థితిలో లేరు. దీన్ని దృష్టిలో పెట్టుకొని అందుబాటు ధరల్లో ఉండేలా ప్రిప్‌ఇన్‌స్టా తీసుకువచ్చాం. – ఆశయ్ మిశ్రా -
జూడాల సంఘం అధ్యక్షుడిగా కౌశిక్ కుమార్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర జూనియర్ డాక్టర్ల సంఘంనూతన కార్యవర్గం ఏర్పాౖటెంది. సంఘం అధ్యక్షునిగా డాక్టర్ పింజర్ల కౌశిక్ కుమార్ ఎన్నికయ్యారు. ప్రధాన కార్యదర్శిగా ఆర్కే అనిల్‌కుమార్, ఉపాధ్యక్షులుగా డి.శ్రీనాథ్, ప్రణయ్ మోతె, అరుణ్‌కుమార్, కౌశిక్ జోషి, తాన్యా జరార్, ప్రత్యూష్రాజ్లు ఎన్నికయ్యారు. -
విషాదం: ఒకేరోజు అటు రవీందర్ పాల్... ఇటు కౌశిక్
న్యూఢిల్లీ: భారత హాకీలో విషాదం. కరోనా కారణంగా శనివారం ఒకే రోజు ఇద్దరు మాజీ స్టార్ క్రీడాకారులు తుది శ్వాస విడిచారు. కోవిడ్–19కు చికిత్స పొందుతూ కోలుకోలేకపోయిన రవీందర్ పాల్ సింగ్ (61) లక్నోలో... ఎంకే కౌశిక్ (66) ఢిల్లీలో కన్ను మూశారు. కౌశిక్‌కు భార్య, ఒక కుమారుడు ఉండగా... రవీందర్ పాల్ అవివాహితుడు. 1980 మాస్కో ఒలింపిక్స్ క్రీడల్లో భారత హాకీ జట్టు చివరిసారిగా స్వర్ణపతకం గెలిచింది. రవీందర్ పాల్, కౌశిక్‌లు ఈ జట్టులో సభ్యులు కావడం విశేషం. ఇద్దరు మాజీ ఆటగాళ్ల మృతి పట్ల హాకీ ఇండియా (హెచ్ఐ) సంతాపం వ్యక్తం చేసింది. ఒలింపిక్స్ స్వర్ణ పతకం సాధించిన ఆటగాళ్లుగా వారిద్దరూ భారత హాకీ చరిత్రలో ఎప్పటికీ గుర్తుండిపోతారని హెచ్ఐ అధ్యక్షుడు జ్ఞానేంద్రో నింగోంబామ్ శ్రద్ధాంజలి ఘటించారు. కౌశిక్: ఆటగాడిగానే కాకుండా కోచ్‌గా కూడా కౌశిక్ భారత హాకీపై తనదైన ముద్ర వేశాడు. ఆయన శిక్షణలో భారత పురుషుల జట్టు 1998 బ్యాంకాక్ ఆసియా క్రీడల్లో స్వర్ణ పతకం గెలుచుకోగా... భారత మహిళల జట్టు 2006 దోహా ఆసియా క్రీడల్లో కాంస్యం సాధించింది. కౌశిక్ సేవలకు గుర్తింపుగా కేంద్ర ప్రభుత్వం ముందుగా అర్జున, ఆపై ‘ద్రోణాచార్య’ పురస్కారాలతో సత్కరించింది. రవీందర్ పాల్: 1979 జూనియర్ ప్రపంచకప్‌లో సభ్యుడి నుంచి సీనియర్ టీమ్‌కు వెళ్లిన రవీందర్ పాల్ 1984 వరకు సెంటర్ హాఫ్‌గా అత్యుత్తమ ప్రదర్శన కనబర్చాడు. 1984 లాస్ఏంజెలిస్ ఒలింపిక్స్‌లో కూడా పాల్గొన్న అతను 1982 ఆసియా కప్‌లో, రెండు చాంపియన్స్ ట్రోఫీలలో భారత జట్టు తరఫున బరిలోకి దిగాడు. -
బనారసీ బొమ్మలు
వారణాసిలో పుట్టి పెరిగిన కౌశికి అగర్వాల్ అక్కడ దివాలా తీసిన చెక్క బొమ్మలకు కొత్త అందాలు తెచ్చిపెట్టారు. కార్మికులలో ఆత్మవిశ్వాసం నింపి లాభాలతో ముందుకు సాగుతున్నారు. రోజులు మారాయి. బనారసి బొమ్మల పాత డిజైన్లను కొనేవారు తగ్గిపోయారు. వినియోగదారుల అభిరుచికి అనుగుణంగా బొమ్మలు తయారుచేయలేకపోయారు. జీవనాధారం కోసం ఈ కళాకారులంతా గ్రామాల నుంచి మహానగరాలకు తరలిపోవడం ప్రారంభించారు. ఈ దుస్థితి కౌశికి మనస్సును కదిలించింది. ఈ కళను నిలబెట్టడానికి ఏదో ఒకటి చేయాలని నిర్ణయించుకున్నారు అప్పటికే ఎంబిఏ పూర్తిచేసిన కౌశికి ముందుగా. ఆ కళాకారులంతా ఎందుకు వారి పని మానుకున్నారో తెలుసుకోవాలనుకున్నారు. ‘బొమ్మలు కొనేవారు సంఖ్య తగ్గిపోవడంతో, ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నామని, ఆ కారణంగానే ఈ పనులు మానేసి తామంతా నగరాలకు తరలిపోతున్నాం’ అని చెప్పారు వారు. నేటికీ కొందరు పనిచేస్తున్నారు... నేటికీ ఆ కళాకారులలో కొందరు మంచి పనిమంతులు ఉన్నారు. అటువంటి వారి నుంచి మూడు కుటుంబాలను ఎంచుకున్నారు కౌశికి. వారు చేస్తున్న పనికి ఆధునికత జోడిద్దామని సూచించారు. ఈ చెక్క బొమ్మల మీద వారు లట్టు పని చేస్తారు. లట్టు అనేది హిందీ పదం. ఈ పదానికి అలంకరించడం అని అర్థం. కొత్తవిధానంలో బొమ్మలు తయారు చేయడానికి తన సృజనను జోడించారు కౌశికి. టేబుల్ వేర్, ఫర్నిచర్, కోట్ హ్యాంగర్లు... ఇలా కొత్త కొత్త బొమ్మలను సైతం బనారసీ విధానంలోనే రూపొందిస్తున్నారు. వర్తమాన సమాజాన్ని ప్రతిబింబించేలా మార్పులు చేసి తయారుచేయించారు కౌశికి. టేబుల్ వేర్కి మాత్రం సహజ రంగులు వేసి, ఆహారపదార్థాలకు రంగులు అంటకుండా లక్క పూత పూస్తున్నారు. అందువల్ల వీటిని నీటితో శుభ్రం చేసుకోవచ్చు. ఎక్కువసేపు నీళ్లలో నానబెట్టకుండా ఉన్నంతవరకు ఈ వస్తువులు పాడు కాకుండా, కొత్తగా ఉంటాయి... అంటారు కౌశికి. శ్రమ ఫలితం... కౌశికి విజయం వెనుక చాలా కష్టం ఉంది. కళాకారులను ఒప్పిండానికి ఎంతో ఇబ్బంది పడ్డారు కౌశికి. కొన్ని తరాలుగా వారంతా ఈ పనిలోనే ఉన్నారు కనుక ఆ పని వారు మాత్రమే చేయగలరు. కొంతకాలానికి వారే కొత్త కొత్త డిజైన్లతో ముందుకు వచ్చారు. ఈ డిజైన్లను వినియోగదారులు బాగా ఆదరించారు. వస్తువులకు గిరాకీ పెరగడంతో, వృత్తి వదిలి వెళ్లిపోయిన వారంతా మళ్లీ ఒక్కరొక్కరుగా వెనక్కు రావడం ప్రారంభించారు. వ్యాపారం వృద్ధి చేసుకుని, పాత ఇళ్లను కొత్తగా మార్పులు చేసుకున్నారు. షాపులను కొత్తగా అందంగా తీర్చిదిద్దుకున్నారు. తండ్రి నుంచి దూరంగా వెళ్లి ఉద్యోగాలు చేసుకుంటున్న పిల్లలు మళ్లీ వెనక్కు వచ్చి, తండ్రి వారసత్వాన్ని అందిపుచ్చుకుంటున్నారు. కొత్త తరం వారు ఉత్సాహంగా పనిచేస్తూ, మారుతున్న అభిరుచులకు అనుగుణంగా వ్యాపారాన్ని అభివృద్ధి చేస్తున్నారు... అంటారు కౌశికి. ‘‘కళాకారులంతా నిజాయితీగా నిబద్ధతతో పనిచేయడం నాకు చాలా ఆనందం కలిగిస్తోంది.’’ అంటున్న కౌశికి ఒంటరిగా పోరాడి ఇంత విజయం సాధించారు. – జయంతి వ్యాపారం చేయడానికి మొట్టమొదటి పెట్టుబడి మా నాన్నగారు పెట్టారు. ఆ డబ్బుని సంవత్సర కాలంలోనే నాన్నకి తీర్చేశాను. ఇప్పుడు లాభాలు సంపాదించడం ప్రారంభించాక ఆ లాభాలను లట్టు కళాకారుల కోసం వినియోగిస్తున్నాను. వాళ్లు ఎంతో శ్రమకోర్చి చేస్తున్న పనికి తగ్గ ఫలితం అందకపోతే మళ్లీ వారు పనిచేయలేకపోతారు కదా, అందుకే వారి సంక్షేమం కోసం పాటుపడుతున్నాను. మరిన్ని డిజైన్లను ఎంపిక చేయాలనుకుంటున్నాను. తాటాకుతో అల్లిన బుట్టలు, చాపల మీద ఈ డిజైను ఎలా వేద్దామా అని ఆలోచిస్తున్నాను. వారణాసి పురాతన హస్తకళను అందరికీ పరిచయం చేయాలనేదే నా సంకల్పం. – కౌశికి అగర్వాల్ -
ఆమె కథేంటి?
బాలు, కౌశిక్, అనూష, రవళి ముఖ్య పాత్రల్లో రూపొందుతున్న సస్పెన్స్ థ్రిల్లర్ ‘దమయంతి’. స్వీయ దర్శకత్వంలో నౌండ్ల శ్రీనివాస్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ముహూర్తపు సన్నివేశానికి ఎమ్మెల్యే జి.కమలాకర్ కెమెరా స్విచాన్ చేయగా, మరో ఎమ్మెల్యే జి.కిశోర్ క్లాప్ ఇచ్చారు. దర్శక-నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ గౌరవ దర్శకత్వం వహించారు. నౌండ్ల శ్రీనివాస్ మాట్లాడుతూ- ‘‘దమయంతి ఎవరు? ఆమె కథ ఏంటి? అన్నది సస్పెన్స్. మూడు షెడ్యూళ్లలోనే షూటింగ్ పూర్తి చేయాలనుకుంటున్నాం’’ అన్నారు. ఈ చిత్రానికి సమర్పణ: కృష్ణ వొంటెల, కెమేరా: ఎమ్ఎస్ కిరణ్ కుమార్, సంగీతం: ఎస్ఎస్ ఆత్రేయ. -
అక్షర్ అదరహో
► ‘హ్యాట్రిక్’తో మలుపు తిప్పిన స్పిన్నర్ ► పంజాబ్ అనూహ్య విజయం ► 23 పరుగులతో ఓడిన గుజరాత్ లయన్స్ విజయ లక్ష్యం 155 పరుగులు... భారీ హిట్టర్లతో పాటు మంచి ఫామ్‌లో, పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉన్న ఆ జట్టుకు సొంతగడ్డపై దీనిని ఛేదించడం అంత కష్టమైన పనేం కాదు. అవతలివైపు ఉన్నదేమో వరుస పరాజయాలతో కునారిల్లి అట్టడుగున నిలిచిన పంజాబ్ జట్టు. కానీ అంచనాలు తారుమారయ్యాయి. స్పిన్నర్ అక్షర్ పటేల్ అద్భుత బౌలింగ్‌తో సునాయాసం అనుకున్న లక్ష్యం కాస్తా పెద్దదిగా మారి గుజరాత్‌కు షాక్ తగిలింది. రెండు ‘సింహా’ల పోరులో చివరకు కింగ్స్ ఎలెవన్‌దే పైచేయి అయింది. తన రెండో ఓవర్లో నాలుగు బంతుల వ్యవధిలో మూడు వికెట్లు తీసిన లెఫ్టార్మ్ స్పిన్నర్ అక్షర్ పటేల్, తర్వాతి ఓవర్ తొలి బంతితో హ్యాట్రిక్ పూర్తి చేశాడు. ఫలితంగా మూడు వరుస పరాజయాల తర్వాత కింగ్స్ ఎలెవన్‌కు గెలుపుతో ఊరట లభించింది. కెప్టెన్‌గా తొలి మ్యాచ్‌లో ఆకట్టుకున్న మురళీ విజయ్ కూడా అర్ధ సెంచరీతో విజయంలో కీలకపాత్ర పోషించాడు. రాజ్‌కోట్: వరుస విజయాలతో దూసుకుపోతున్న గుజరాత్ లయన్స్ జట్టుకు బ్రేక్ పడింది. మూడు మ్యాచ్‌ల తర్వాత ఆ జట్టుకు ఓటమి ఎదురైంది. పేలవ ప్రదర్శనతో సీజన్లో ఆకట్టుకోలేకపోతున్న కింగ్స్ ఎలెవన్ పంజాబ్ అనూహ్యంగా చెలరేగి లయన్స్‌కు అడ్డుకట్ట వేసింది. ఆదివారం ఇక్కడ జరిగిన లీగ్ మ్యాచ్‌లో పంజాబ్ 23 పరుగుల తేడాతో లయన్స్‌పై విజయం సాధించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన పంజాబ్ 19.5 ఓవర్లలో 154 పరుగులకు ఆలౌటైంది. మురళీ విజయ్ (41 బంతుల్లో 55; 6 ఫోర్లు) రాణించగా, వృద్ధిమాన్ సాహా (19 బంతుల్లో 33; 4 ఫోర్లు), మిల్లర్ (27 బంతుల్లో 31; 2 ఫోర్లు) ఫర్వాలేదనిపించారు. శివిల్ కౌశిక్‌కు 3 వికెట్లు దక్కాయి. అనంతరం గుజరాత్ 20 ఓవర్లలో 9 వికెట్లకు 131 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఫాల్క్‌నర్ (27 బంతుల్లో 32; 3 ఫోర్లు) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ అక్షర్ పటేల్ (4/21) సీజన్లో తొలి హ్యాట్రిక్ నమోదు చేయడం విశేషం. మోహిత్ 3 వికెట్లు పడగొట్టాడు. నాయకుడు నడిపించగా... కెప్టెన్‌గా తొలి మ్యాచ్ ఆడుతున్న మురళీ విజయ్, ప్రవీణ్ కుమార్ వేసిన మూడో ఓవర్లో మూడు ఫోర్లు బాది దూకుడుగా ఇన్నింగ్స్‌ను మొదలు పెట్టాడు. మరోవైపు స్టొయినిస్ (17 బంతుల్లో 27; 3 ఫోర్లు, 1 సిక్స్) కూడా ధాటిగా ఆడటంతో ఈ జోడి తొలి వికెట్‌కు 40 బంతుల్లోనే 65 పరుగులు జోడించింది. అయితే ఆ తర్వాత ఎనిమిది పరుగుల వ్యవధిలో పంజాబ్ 4 వికెట్లు కోల్పోయింది. స్టొయినిస్‌ను జడేజా అవుట్ చేయగా, కౌశిక్ తన తొలి ఓవర్లోనే వరుస బంతుల్లో షాన్ మార్ష్ (1), మ్యాక్స్‌వెల్ (0)లను పెవిలియన్ పంపించాడు. ఆ వెంటనే గుర్కీరత్ (0) రనౌటయ్యాడు. మరోవైపు 36 బంతుల్లో అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్న విజయ్, కౌశిక్ బౌలింగ్‌లో భారీ షాట్‌కు ప్రయత్నించి బ్రేవో చేతికి చిక్కాడు. ఈ దశలో మిల్లర్, సాహా భాగస్వామ్యం పంజాబ్‌కు మెరుగైన స్కోరు అందించింది. వీరిద్దరు ఆరో వికెట్‌కు 25 బంతుల్లో 39 పరుగులు జత చేశారు. మిల్లర్‌ను ధవల్ అవుట్ చేయగా... 19, 20 ఓవర్లలో పంజాబ్ రెండేసి వికెట్లను కోల్పోయింది. చివరి మూడు ఓవర్లలో గుజరాత్ ఒక్క ఫోర్ మాత్రమే ఇచ్చి ఐదు వికెట్లు తీసింది. అంతా కలిసికట్టుగా... తన తొలి ఓవర్లోనే మెకల్లమ్ (1)ను బౌల్డ్ చేసి మోహిత్ పంజాబ్‌కు శుభారంభం అందించాడు. ఆ తర్వాత కొద్దిసేపటికే రైనా (15 బంతుల్లో 18; 2 ఫోర్లు, 1 సిక్స్)ను కూడా చక్కటి బంతితో మోహిత్ పెవిలియన్ పంపించాడు. పవర్‌ప్లేలో గుజరాత్ 36 పరుగులు మాత్రమే చేయగలిగింది. అయితే అసలు మ్యాజిక్ ఏడో ఓవర్లో ప్రారంభమైంది. ఓవర్ మూడో బంతికి డ్వేన్ స్మిత్ (15)ను అవుట్ చేసిన అక్షర్... ఐదు, ఆరు బంతులకు కార్తీక్ (2), బ్రేవో (0)లను పెవిలియన్ పంపించాడు. మరో మూడు ఓవర్ల తర్వాత మళ్లీ బౌలింగ్‌కు దిగిన అక్షర్ తొలి బంతికే జడేజా (11)ను ‘హ్యాట్రిక్’ వికెట్‌గా అవుట్ చేశాడు. తాను వేసిన ఐదు బంతుల వ్యవధిలో పటేల్ నాలుగు వికెట్లు తీయడం విశేషం. 57 పరుగుల వద్ద ఆరో వికెట్ కోల్పోయిన గుజరాత్ ఆ తర్వాత కోలుకోలేదు. చివర్లో ఫాల్క్‌నర్, ఇషాన్ కిషన్ (24 బంతుల్లో 27; 3 ఫోర్లు) పోరాడినా లక్ష్యానికి లయన్స్ చాలా దూరంలో నిలిచిపోయింది. స్కోరు వివరాలు కింగ్స్ ఎలెవన్ పంజాబ్ ఇన్నింగ్స్: విజయ్ (సి) బ్రేవో (బి) కౌశిక్ 55; స్టొయినిస్ (స్టంప్డ్) కార్తీక్ (బి) జడేజా 27; షాన్ మార్ష్ (సి) రైనా (బి) కౌశిక్ 1; మ్యాక్స్‌వెల్ (సి) కార్తీక్ (బి) కౌశిక్ 0; గుర్కీరత్ సింగ్ (రనౌట్) 0; మిల్లర్ (సి) డ్వేన్ స్మిత్ (బి) ధావల్ 31; సాహా (బి) బ్రేవో 33; అక్షర్ (సి) కిషన్ (బి) బ్రేవో 0; మోహిత్ (బి) ప్రవీణ్ కుమార్ 1; కరియప్ప (బి) ప్రవీణ్ కుమార్ 1; సందీప్ శర్మ (నాటౌట్) 1; ఎక్స్‌ట్రాలు 4; మొత్తం (19.5 ఓవర్లలో ఆలౌట్) 154. వికెట్ల పతనం: 1-65; 2-70; 3-70; 4-73; 5-100; 6-139; 7-145; 8-151; 9-153; 10-154. బౌలింగ్: ప్రవీణ్ కుమార్ 2.5-0-25-2; ధవల్ 4-0-28-1; జడేజా 3-0-28-1; కౌశిక్ 4-0-20-3; బ్రేవో 4-0-33-2; ఫాల్క్‌నర్ 2-0-19-0. గుజరాత్ లయన్స్ ఇన్నింగ్స్: డ్వేన్ స్మిత్ (సి) గుర్కీరత్ (బి) అక్షర్ 15; మెకల్లమ్ (బి) మోహిత్ 1; రైనా (బి) మోహిత్ 18; కార్తీక్ (బి) అక్షర్ 2; జడేజా (సి) సాహా (బి) అక్షర్ 11; బ్రేవో (బి) అక్షర్ 0; కిషన్ (రనౌట్) 27; ఫాల్క్‌నర్ (సి) మిల్లర్ (బి) సందీప్ 32; ప్రవీణ్ కుమార్ (సి) కరియప్ప (బి) మోహిత్ 15; ధవల్ (నాటౌట్) 6; కౌశిక్ (నాటౌట్) 0; ఎక్స్‌ట్రాలు 4; మొత్తం (20 ఓవర్లలో 9 వికెట్లకు) 131. వికెట్ల పతనం: 1-13; 2-34; 3-38; 4-39; 5-39; 6-57; 7-86; 8-125; 9-125. బౌలింగ్: సందీప్ శర్మ 4-0-31-1; మోహిత్ 4-0-32-3; స్టొయినిస్ 4-0-23-0; అక్షర్ 4-0-21-4; కరియప్ప 3-0-15-0; గుర్కీరత్ 1-0-8-0. -
చరిత్రలో నిలిచిపోతుంది
‘‘ఎన్నో వందల, వేల సినిమాలొస్తున్నాయి. ఏ సినిమా ప్రేక్షకులను ఎలా ప్రభావితం చేస్తోందో మనకు తెలుసు. అలాగే ఏ సినిమాని ఎలా ఆదరించాలో కూడా ప్రేక్షకులకు తెలుసు. సినిమా తీసేవాళ్లల్లో ఎంత సంస్కారం ఉండాలో, చూసేవాళ్లలో కూడా అంతే సంస్కారం ఉండాలి’’ అన్నారు పరిపూర్ణానంద స్వామి. గ్లోబల్ సినీ క్రియేటర్స్ పతాకంపై జేకే భారవి దర్శకత్వంలో శ్రీమతి నారా జయశ్రీదేవి నిర్మించిన చిత్రం ‘జగద్గురు ఆదిశంకర’ ఇటీవల విడుదలైంది. టైటిల్ రోల్‌ని కౌశిక్‌బాబు, ఇతర ప్రధాన పాత్రలను నాగార్జున, శ్రీహరి, సాయికుమార్ తదితరులు పోషించారు. హైదరాబాద్‌లో జరిగిన ఈ చిత్రం విజయోత్సవ సభలో ముఖ్య అతిథిగా పాల్గొన్న పరిపూర్ణానంద స్వామి మాట్లాడుతూ -‘‘ప్రతి హిందువు, భారతీయుడు చూడాల్సిన సినిమా. ఆదిశంకర జీవితాన్ని భారవి చాలా స్పష్టంగా తెరకెక్కించాడు. ఈ సినిమా చేసి భారవ సాహసం చేయలేదు, తపస్సు చేశాడు. చరిత్రలో నిలిచిపోయే సినిమా. నేటి తరంలో ఇలాంటి సినిమా రావడం, అది ప్రేక్షకాదరణ పొందడం ఆనందంగా ఉంది’’ అన్నారు. ఈ సమావేశంలో జయశ్రీదేవి, భారవి, కౌశిక్, నాగ్ శ్రీవత్స, రాజా రవీంద్ర, ఉదయ్‌భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. -
టెన్నిస్ చాంప్స్ కౌశిక్, గుల్రాస్
జింఖానా, న్యూస్‌లైన్: ఏపీ స్టేట్ ర్యాంకింగ్ టెన్నిస్ టోర్నమెంట్లో కౌశిక్, గుల్రాస్ బేగం విజేతలుగా నిలిచారు. స్మాష్ 9 టెన్నిస్ అకాడమీ అత్తాపూర్‌లో నిర్వహించిన ఈ టోర్నీలో బాలుర అండర్-10 విభాగంలో కౌశిక్ విజయం సాధించగా, అండర్-14 బాలికల విభాగంలో సయ్యద్ గుల్రాస్ బేగం టైటిల్ కైవసం చేసుకుంది. బుధవారం జరిగిన ఫైనల్లో కౌశిక్ కుమార్ 8-1తోవర్షిత్ కుమార్‌పై గెలుపొందగా, గుల్రాస్ 8-1తో శ్రీజా రెడ్డిపై నెగ్గింది. అంతకుముందు జరిగిన సెమీఫైనల్స్‌లో వర్షిత్ 7-3తో బండి యువరాజ్‌పై గెలువగా, కౌశిక్ 7-3తో ఆయుష్ పవన్‌పై గెలిచి ఫైనల్స్‌కు అర్హత సంపాదించారు. గుల్రాస్ 7-5తో శ్రేయపై, శ్రీజ 7-4తో నిఖితపై గెలిచి తుదిపోరుకు సిద్ధపడ్డారు.