టెన్నిస్ చాంప్స్ కౌశిక్, గుల్రాస్ | Tennis Champs Kaushik, gulras | Sakshi
Sakshi News home page

టెన్నిస్ చాంప్స్ కౌశిక్, గుల్రాస్

Published Thu, Aug 15 2013 12:19 AM | Last Updated on Sat, Aug 18 2018 8:49 PM

Tennis Champs Kaushik, gulras

జింఖానా, న్యూస్‌లైన్: ఏపీ స్టేట్ ర్యాంకింగ్ టెన్నిస్ టోర్నమెంట్‌లో కౌశిక్, గుల్రాస్ బేగం విజేతలుగా నిలిచారు. స్మాష్ 9 టెన్నిస్ అకాడమీ అత్తాపూర్‌లో నిర్వహించిన ఈ టోర్నీలో బాలుర అండర్-10 విభాగంలో కౌశిక్ విజయం సాధించగా, అండర్-14 బాలికల విభాగంలో సయ్యద్ గుల్రాస్ బేగం టైటిల్ కైవసం చేసుకుంది.
 
 బుధవారం జరిగిన ఫైనల్లో కౌశిక్ కుమార్ 8-1తోవర్షిత్ కుమార్‌పై గెలుపొందగా, గుల్రాస్ 8-1తో శ్రీజా రెడ్డిపై నెగ్గింది. అంతకుముందు జరిగిన సెమీఫైనల్స్‌లో వర్షిత్ 7-3తో బండి యువరాజ్‌పై గెలువగా, కౌశిక్ 7-3తో ఆయుష్ పవన్‌పై గెలిచి ఫైనల్స్‌కు అర్హత సంపాదించారు. గుల్రాస్ 7-5తో శ్రేయపై, శ్రీజ 7-4తో నిఖితపై గెలిచి తుదిపోరుకు సిద్ధపడ్డారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement