కన్నడ బుల్లితెర నటి శోభిత మృతదేహానికి పోస్టుమార్టం పూర్తయింది. హైదరాబాద్‌లోని ఉస్మానియా ఆస్పత్రిలో ఆమె మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించారు. అనంతరం శోభిత కుటుంబ సభ్యులకు మృతదేహాన్ని పోలీసులు అప్పగించారు. ఆమె స్వస్థలం కర్ణాటక కావడంతో అక్కడికి తరలించనున్నారు. అయితే పోస్టుమార్టం నివేదికలో ఆమె మరణం ఆత్మహత్యగానే వైద్యులు నిర్ధారించారు. ఒంటిపై ఎలాంటి గాయాలు లేవని నివేదికలో వైద్యులు స్పష్టం చేశారు. ఇవాళ ఆమె అంత్యక్రియలు కర్ణాటకలోని స్వగ్రామంలో నిర్వహించనున్నారు.
కాగా.. అంతకుముందు కన్నడ నటి శోభిత తాను నివాసముంటున్న ఇంట్లోనే ఆత్మహత్యకు పాల్పడింది. ఫ్యాన్‌కు ఉరేసుకుని సూసైడ్ చేసుకుంది. కన్నడలో పలు సీరియల్స్‌తో పాటు సినిమాల్లోనూ నటించింది. అయితే గతేడాది హైదరాబాద్ తుక్కుగూడకు చెందిన సుధీర్‌రెడ్డికి అనే సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌ను పెళ్లాడింది. బెంగళూరులో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్న సుధీర్.. పెళ్లి తర్వాత హైదరాబాద్‌కు షిఫ్ట్ అయ్యాడు. ప్రస్తుతం గచ్చిబౌలి శ్రీరాంనగర్ కాలనీలో ఉన్న సీ బ్లాక్‌లో ఆమె నివాసముంటున్నారు. అయితే శోభిత పెళ్లి తర్వాతే సినిమాలకు, సిరీయల్స్‌కు దూరమైంది.
సూసైడ్ నోట్ స్వాధీనం..
శోభిత ఆత్మహత్యకేసులో సూసైడ్ నోట్‌ను గచ్చిబౌలి పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సూసైడ్ చేసుకోవాలంటే యు కెన్ డూ ఇట్ అంటూ ఆ లేఖలో ఆమె పేర్కొంది. అయితే, ఎవరిని ఉద్దేశించి శోభిత అలా రాసిందో తెలుపలేదు. ఈ కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. డిప్రెషన్ వల్లే శోభిత మృతికి కారణమై ఉంటుందా అని కూడా పోలీసులు అనుమానిస్తున్నారు. సీరియల్స్, మూవీస్‌కి దూరంగా ఉండటమా..? తన భర్త సుధీర్ రెడ్డితో ఏమైనా గొడవలు ఉన్నాయా..? అనే వివిధ కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment