postmortem
-
రోజా కేసులో రోజుకో ట్విస్ట్
సాక్షి, విశాఖపట్నం: ఎన్ఆర్ఐ మహిళ రోజా అనుమానాస్పద మృతి క్రైం థ్రిల్లర్‌ను తలపిస్తోంది. కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. నగర పోలీసు కమిషనర్ ఆదేశాలతో ఎట్టకేలకు మృతురాలి స్నేహితుడు, నిందితుడిగా భావిస్తున్న డాక్టర్ శ్రీధర్‌ను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ఎన్ఆర్ఐ మహిళ రోజాకు.. డాక్టర్ శ్రీధర్‌కు మధ్య ఉన్న సంబంధం ఏంటి?.. రోజా హోటల్‌కు వచ్చిన రెండు గంటల్లో అనుమానాస్పదంగా మృతి చెందడం వెనుక ఏం జరిగిందో పోలీసులు ఆరా తీస్తున్నారు. ఈ నెల 6వ తేదీ మధ్యాహ్నం 1.40 గంటలకు శ్రీధర్‌ను కలిసేందుకు మేఘాలయ హోటల్లోని రూం నంబర్ 229కి రోజా వెళ్లింది. 3.35 గంటల తరువాత ఆమె బాత్రూమ్లో అపస్మారక స్థితిలో ఉందని శ్రీధర్ హోటల్ సిబ్బందికి చెప్పాడు. హత్యా? ఆత్మహత్యా? రెండు గంటల వ్యవధిలో రోజా అనుమానాస్పదంగా మృతి చెందడంపై భిన్న కథనాలు వినిపిస్తున్నాయి. రెండు గంటలు ఇద్దరూ ఒకే గదిలో ఉన్నారు. ఈ సమయంలో రోజా–శ్రీధర్‌కు మధ్య గొడవ జరిగిందా?.. ఆత్మహత్య చేసుకునేలా ప్రేరేపించాడా? అందుకే ఆమె ఆత్మహత్య చేసుకున్నా ఆపకుండా చూస్తూ ఉండిపోయాడా?.. మృతి చెందిందని నిర్ధారించుకున్న తరువాతే హోటల్ సిబ్బందికి సమాచారం ఇచ్చాడని ప్రచారం జరుగుతోంది. నిజానికి రోజాను ఆత్మహత్య చేసుకునేలా అమెరికాలో ఉన్నప్పటి నుంచే శ్రీధర్ ప్రేరేపిస్తున్నాడని పోలీసులు విచారణలో తెలినట్లు తెలిసింది. ఒకవేళ రోజాది ఆత్మహత్య కాకపోతే అదే రూమ్‌లో ఉన్న శ్రీధర్ ఆమెను హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించాడా..? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. రోజా పోస్టుమార్టం నివేదిక వస్తే తప్ప నిజనిజాలు బయట పడే అవకాశం లేదు. ఎఫ్ఐఆర్లో శ్రీధర్ పేరు చేర్చలేదెందుకు? ఈ కేసులో మొదటి నుంచి పోలీసులు నిర్లక్ష్యం కనిపిస్తూనే ఉంది. డాక్టర్ శ్రీధర్‌ను కేసు నుంచి తప్పించేయత్నం జరుగుతోందని విస్తృతంగా ప్రచారం జరిగింది. కేసు తేలిపోయేవిధంగా ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఒకే గదిలో రోజా–శ్రీధర్ ఉన్న సమయంలో.. రోజా అనుమానాస్పదంగా మృతి చెందితే ఎఫ్ఐఆర్లో శ్రీధర్ పేరు చేర్చకపోవడం చర్చనీయాంశమైంది. కేసును నీరుగార్చేందుకు పోలీసులు ఎందుకు ప్రయత్నించారు? డాక్టర్ శ్రీధర్ వెనుక ఎవరున్నారు? పోలీసులపై ఎవరి ఒత్తిడైనా ఉందా? అన్న ప్రశ్నలకు వారే సమాధానం చెప్పాలి. ఈ కేసు విషయంలో విమర్శలు రావడంతో ఎట్టకేలకు మూడో పట్టణ పోలీసులు శ్రీధర్‌ను అరెస్టు చేసినట్లు ఆదివారం ఆర్ధరాత్రి ప్రకటించారు. అన్ని వేళ్లూ పోలీసులవైపే.. ఎన్ఆర్ఐ మహిళా అనుమానాస్పద మృతిపై పోలీసులు చర్యలు విమర్శలకు తావిచ్చింది. సంఘటన జరిగిన వెంటనే శ్రీధర్‌ను అదుపులోకి తీసుకొని విచారిస్తే నిజనిజాలు బయటపడేవి. అయితే పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు నుంచి విచారణ వరకు అన్ని వేళ్లు వారివైపే చూపించేలా వ్యవహరించారు. 6వ తేదీన రోజా మృతి చెందినప్పటికీ 8వ తేదీ వరకు అటువంటి ఘటన జరగలేదు అన్నట్లు వ్యవహరించారు. పలుకుబడి ఉన్న కుటుంబాలకు చెందిన వ్యక్తులు తప్పు చేస్తే వెనకేసుకువచ్చే ప్రయత్నం ఎందుకు చేస్తున్నారు. పేద, మధ్యతరగతికి చెందిన ఎవరైనా తప్పు చేస్తే మీడియా సమావేశాలు పెట్టి మరీ ప్రచారం చేసుకునే పోలీసులు ఈ కేసు విషయంలో పాటిస్తున్న గోప్యత అనుమానాలకు తావిస్తోంది. -
పూడ్చిన మృతదేహానికి పోస్టుమార్టం
నేరేడుచర్ల: తల్లి మృతిపై కుమారుడు అనుమానం వ్యక్తం చేస్తూ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో పూడ్చిన ఆమె మృతదేహానికి మంగళవారం పోస్టుమార్టం నిర్వహించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నేరేడుచర్ల మండలం సోమారం గ్రామానికి చెందిన పెద్దపంగు అమృతం, ఆయన భార్య కనకమ్మ మేళ్లచెరువు మండలం మైహోం సిమెంట్ కర్మాగారం క్వార్టర్స్‌లో నివాసం ఉంటున్నారు.అమృతం మైహోం సిమెంట్ కర్మాగారంలో మెకానికల్ ఇంజనీర్‌గా పనిచేస్తుండగా.. కనకమ్మ కోదాడ డిపోలో కండక్టర్‌గా పనిచేస్తోంది. వీరికి ఇద్దరు కుమారులు సంతానం. జనవరి 21న ఇంట్లో ఎవరూ లేని సమయంలో కనకమ్మ అనుమానాస్పద స్థితిలో మృతిచెందింది. సోమారం గ్రామంలో కుటుంబ సభ్యుల సమక్షంలో కనకమ్మ మృతదేహాన్ని ఖననం చేశారు. అయితే కనకమ్మ పెద్ద కుమారుడు సందీప్‌కుమార్ తన తల్లి మృతిపై అనుమానం వ్యక్తం చేస్తూ మేళ్లచెరువు పోలీస్ స్టేషన్లో ఈ నెల 10వ తేదీన ఫిర్యాదు చేశాడు. కోదాడ రూరల్ సీఐ రజితారెడ్డి, మేళ్లచెరువు ఇన్చార్జి ఎస్ అంతిరెడ్డి, మేళ్లచెరువు మండల తహసీల్దార్ జ్యోతి సమక్షంలో హుజూర్నగర్ ఏరియా ఆస్పత్రి సిబ్బందితో కలిసి మంగళవారం సోమారం గ్రామంలో కనకమ్మ మృతదేహాన్ని బయటకు తీసి పోస్టుమార్టం నిర్వహించారు. -
బుల్లితెర నటి శోభిత పోస్టుమార్టం పూర్తి.. వైద్యులు ఏమన్నారంటే?
కన్నడ బుల్లితెర నటి శోభిత మృతదేహానికి పోస్టుమార్టం పూర్తయింది. హైదరాబాద్‌లోని ఉస్మానియా ఆస్పత్రిలో ఆమె మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించారు. అనంతరం శోభిత కుటుంబ సభ్యులకు మృతదేహాన్ని పోలీసులు అప్పగించారు. ఆమె స్వస్థలం కర్ణాటక కావడంతో అక్కడికి తరలించనున్నారు. అయితే పోస్టుమార్టం నివేదికలో ఆమె మరణం ఆత్మహత్యగానే వైద్యులు నిర్ధారించారు. ఒంటిపై ఎలాంటి గాయాలు లేవని నివేదికలో వైద్యులు స్పష్టం చేశారు. ఇవాళ ఆమె అంత్యక్రియలు కర్ణాటకలోని స్వగ్రామంలో నిర్వహించనున్నారు. కాగా.. అంతకుముందు కన్నడ నటి శోభిత తాను నివాసముంటున్న ఇంట్లోనే ఆత్మహత్యకు పాల్పడింది. ఫ్యాన్‌కు ఉరేసుకుని సూసైడ్ చేసుకుంది. కన్నడలో పలు సీరియల్స్‌తో పాటు సినిమాల్లోనూ నటించింది. అయితే గతేడాది హైదరాబాద్ తుక్కుగూడకు చెందిన సుధీర్‌రెడ్డికి అనే సాఫ్ట్వేర్ ఇంజినీర్‌ను పెళ్లాడింది. బెంగళూరులో సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్న సుధీర్.. పెళ్లి తర్వాత హైదరాబాద్‌కు షిఫ్ట్ అయ్యాడు. ప్రస్తుతం గచ్చిబౌలి శ్రీరాంనగర్ కాలనీలో ఉన్న సీ బ్లాక్‌లో ఆమె నివాసముంటున్నారు. అయితే శోభిత పెళ్లి తర్వాతే సినిమాలకు, సిరీయల్స్‌కు దూరమైంది. సూసైడ్ నోట్ స్వాధీనం..శోభిత ఆత్మహత్యకేసులో సూసైడ్ నోట్‌ను గచ్చిబౌలి పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సూసైడ్ చేసుకోవాలంటే యు కెన్ డూ ఇట్ అంటూ ఆ లేఖలో ఆమె పేర్కొంది. అయితే, ఎవరిని ఉద్దేశించి శోభిత అలా రాసిందో తెలుపలేదు. ఈ కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. డిప్రెషన్ వల్లే శోభిత మృతికి కారణమై ఉంటుందా అని కూడా పోలీసులు అనుమానిస్తున్నారు. సీరియల్స్, మూవీస్‌కి దూరంగా ఉండటమా..? తన భర్త సుధీర్ రెడ్డితో ఏమైనా గొడవలు ఉన్నాయా..? అనే వివిధ కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
బంగారు తల్లికి వీడ్కోలు
కారేపల్లి: ఆకేరు వాగు ఉధృతికి బలైన యువ శాస్త్ర వేత్త డాక్టర్ అశ్విని మృతదేహానికి మహబూబాబాద్ లో పోస్ట్‌మార్టం అనంతరం ఆదివారం రాత్రి స్వగ్రామమైన కారేపల్లి మండలం గంగారంతండాకు తీసుకొచ్చారు. ఇక సోమవారం మళ్లీ తనిఖీలు చేపట్టిన రెసూ్య్కటీం సభ్యులు ఆమె తండ్రి మోతీలాల్ మృతదేహాన్ని డోర్నకల్ మండలం చిలక్కొయలపాడు వద్ద గుర్తించారు. ఆపై పోస్టుమార్టం చేయించి స్వగ్రామానికి తీసుకురాగా అప్పటికే బంధువులు, గ్రామస్తులు, చుట్టుపక్కల గ్రామాల ప్రజలు వందలాదిగా తరలివచ్చారు. గంటల తరబడి కన్నీళ్లతో ఎదురుచూసుకున్న వారి కుటుంబీకులు కన్నీరుమున్నీరుగా విలపిస్తుండగా అందరూ కంటతడి పెట్టారు. కన్నీటి సంద్రమైన గంగారంతండాగంగారం తండాకు చెందిన మోతీలాల్ – నేజీకి అశ్విని, అశోక్‌కుమార్ సంతానం. పదో తరగతి కారేపల్లిలో చదివి 550 మార్కులతో మండల టాపర్‌గా నిలిచిన అశ్విని విజయవాడలో ఇంటర్, అశ్వారావుపేటలోని వ్యవసాయ కళాశాలలో అగ్రికల్చర్ బీఎస్సీ పూర్తిచేసింది. బీఎస్సీలో మూడు రజత పతకాలు, యూనివర్సిటీ స్థాయిలో ఆరు బంగారు పతకాలే కాక ఆపై ఎమ్మెస్సీలోనూ బంగారు పతకం సాధించింది. ఆతర్వాత జెనెటిక్స్ అండ్ ప్లాంట్ బ్రీడింగ్‌లో పరిశోధనలు చేసి డాక్టరేట్ పొందింది. ఇక జాతీయ స్థాయి వ్యవసాయ శాస్త్రవేత్తల నియామక మండలి(అగ్రికల్చర్ శాస్త్రవేత్తల రిక్రూట్మెంట్ బోర్డు) నిర్వహించిన పరీక్షలో వందల మంది పోటీ పడగా అశ్విని జాతీయ స్థాయిలోనూ ప్రథమ స్థానం సాధించి జెనెటిక్స్ అండ్ ప్లాంట్ బ్రీడింగ్‌లో శాస్త్రవేత్తగా ఎంపికయ్యారు. ప్రస్తుతం అశ్విని ఛత్తీస్‌గఢ్‌లోని రాయపూర్ వ్యవసాయ పరిశోధనా కేంద్రంలో శాస్త్రవేత్తగా విధులు నిర్వర్తిస్తోంది. గతనెల 29న సోదరుడు అశోక్ నిశ్చితార్థానికి హాజరైన ఆమె ఆదివారం ఉదయం హైదరాబాద్‌లో విమానం ఎక్కాల్సి ఉంది. దీంతో తండ్రి మోతీలాల్ కారులో తీసుకెళ్తుండగా మహబూబాబాద్ జిల్లా పురుషోత్తమాయగూడెం వద్ద ఆకేరులో గల్లంతైన విషయం విదితమే. ఇందులో అశ్విని మృతదేహం ఆదివారం మధ్యాహ్నం, మోతీలాల్ మృతదేహం సోమవారం లభించగా స్వగ్రామానికి తీసుకొచ్చారు. అప్పటికే చేరుకున్న స్థానికులు ఉజ్వల భవిష్యత్ ఉన్న శాస్త్రవేత్త అశ్వినిని ఆకేరు వాగు మింగిందా అంటూ కన్నీరుమున్నీరుగా విలపించారు. ఇద్దరి మృతదేహాలను ట్రాక్టర్‌పై ఊరేగింపుగా గ్రామ సమీపంలోని వ్యవసాయ క్షేత్రానికి తీసుకెళ్లి అంత్యక్రియలు పూర్తిచేశారు. ఈక్రమంలో అశ్విని తల్లి నేజీ, సోదరుడు అశోక్‌కుమార్ రోదనలను ఆపడం ఎవరి వల్లా కాలేదు.వైరా ఎమ్మెల్యేకు నిరసన సెగవాగులో గల్లంతై మృతదేహాలు లభించక తాము నరకయాతన పడినా ప్రభుత్వం ఎలాంటి చర్యలు చేపట్టలేదని మోతీలాల్ కుటుంబీకులు ఆరోపించారు. కుటుంబాన్ని పరామర్శించేందుకు వచ్చిన వైరా ఎమ్మెల్యే మాలోతు రాందాస్ నాయక్‌ను వారు నిలదీశారు. అయితే, ఆకేరులో కారు గల్లంతైనప్పటికీ అక్కడి కలెక్టర్ సహా అధికారులతో తాను మాట్లాడానని, వాతావరణం అనుకూలించక హెలికాప్టర్ రాకపోవడంతో వారిని కాపాడలేకపోయామని సర్దిచెప్పారు. ఆ కుటుంబానికి తక్షణ సాయంగా కింద రూ.50వేలు అందజేశారు. -
ముగిసిన కాంగ్రెస్ ‘పోస్టుమార్టమ్’
సాక్షి, హైదరాబాద్ : లోక్‌సభ ఎన్నికల్లో పార్టీ పనితీరు అంచనా వేసేందుకు కాంగ్రెస్ హైకమాండ్ నియమించిన త్రిసభ్యకమిటీ తొలిదఫా సమీక్షలు పూర్తయ్యాయి. వాస్తవానికి, గురు, శుక్ర, శనివారాల్లో ఈ పోస్టుమార్టమ్ జరగాల్సి ఉన్నా, అనివార్య కారణాల వల్ల రెండురోజులకే కుదించారు. కుటుంబసభ్యులు మరణించడంతో కమిటీకి నేతృత్వం వహించిన రాజ్యసభ మాజీ డిప్యూటీ చైర్మన్ పీజే.కురియన్ గురువారం రాత్రే కేరళ వెళ్లిపోయారు. దీంతో గురువారం సమీక్షల్లో పాల్గొన్న అసోం ఎమ్మెల్యే రకీబుల్ హసన్తోపాటు పంజాబ్ ఎమ్మెల్యే పర్గత్‌సింగ్‌లు శుక్రవారం గాం«దీభవన్ వేదికగా కాంగ్రెస్నేతల అభిప్రాయాలు తీసుకున్నారు.తొలిరోజు గురు వారం మొత్తం 16 మంది అభిప్రాయాలు తీసుకున్న కురియన్ కమిటీ రెండో రోజు శుక్రవారం పలువురు ఎమ్మెల్యేలు, అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన అభ్యర్థులతో సమావేశమై వారి నుంచి లోక్‌సభ ఎన్నికల ఫీడ్‌బ్యాక్ తీసుకుంది. ఉమ్మడిజిల్లాల వారీగా ఎమ్మెల్యేలు, ఇన్చార్జులతో సమావేశమైంది. పార్టీ ఎమ్మెల్యేలు రాజగోపాల్‌రెడ్డి, ఉత్తమ్‌పద్మావతిరెడ్డి, మల్రెడ్డి రంగారెడ్డి, శ్రీగణేశ్, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు షబ్బీర్‌అలీ తదితరులు కమిటీ ఎదుట హాజరై తమ అభిప్రాయాలు వెల్లడించారు.అయితే, ఎవరైనా తమ అభిప్రాయాలను ఫోన్లో అయినా తెలియజేయవచ్చంటూ కమిటీ సభ్యులు ఫోన్‌నంబర్లు ఇచ్చి వెళ్లారని, లిఖితపూర్వకంగా అయినా తమకు పంపొచ్చని నేతలకు చెప్పారని సమాచారం. శుక్రవారం కూడా కురియన్ కమిటీకి గురువారం వచి్చన తరహాలోనే ఫీడ్‌బ్యాక్ వచి్చందని, పోస్టుమార్టమ్‌కు హాజరైన పలువురు ఎమ్మెల్యేలు తమ అభిప్రాయాలు, వ్యక్తిగత ఆలోచనలను రకీబుల్హసన్, పర్గత్సింగ్లకు వివరించారు.కోదాడ ఎమ్మెల్యేఉత్తమ్పద్మావతి రెడ్డి తన నియోజకవర్గంలో అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో పోలైన ఓట్ల వివరాలను పోలింగ్ బూత్‌ల వారీగా తెచ్చి కమిటీకి సమర్పించారు. కోదాడతోపాటు మంత్రి ఉత్తమ్ ప్రాతినిధ్యం వహిస్తున్న హుజూర్నగర్ నియోజకవర్గంలో భారీ మెజారిటీలు ఎలా సాధ్యమయ్యాయని కమిటీ సభ్యులు ప్రశ్నించగా, లోక్‌సభ ఎన్నికల్లో తాము శ్రమించిన తీరును పద్మావతి వివరించారు. ఈ సందర్భంగా కమిటీ సభ్యులు ఆమెను అభినందించారు. ⇒ ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి ఉమ్మడి రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాలకు ఇప్పటివరకు ఒక్క మంత్రి పదవి కూడా ఇవ్వలేదని, దీనివల్ల రాష్ట్ర రాజధాని చుట్టూ అభివృద్ధి కార్యకలాపాలు వేగంగా సాగడం లేదని, జీహెచ్ఎంసీతో పాటు స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని తమ జిల్లాలకు చెందిన ఎవరికైనా మంత్రిపదవి ఇవ్వాలని కోరారు. ఎవరికి ఇచ్చినా ఫర్వాలేదని, అయితే, తమ జిల్లాలకు మంత్రిపదవి ఇవ్వాలని కమిటీకి స్పష్టం చేశారు. ఈ విషయాన్ని మీడియాకు వెల్లడించారు కూడా. ⇒ మెదక్ జిల్లా నేతలతో జరిగిన సమావేశంలో ఓ ఎమ్మెల్యేపై ఫిర్యాదు చేసినట్టు తెలిసింది. మిగిలిన అన్నిచోట్ల మంచిఓట్లు వచి్చనా సదరు ఎమ్మెల్యే దూకుడు కారణంగా పార్లమెంట్ ఎన్నికల్లో ఓట్లు తగ్గాయని చెప్పారు. ⇒ కరీంనగర్ జిల్లా నేతలతో సమావేశంలో పలువురు మాట్లాడుతూ ఎన్నికలకు 16 రోజుల ముందే అభ్యర్థిని ప్రకటించారని, అయినా తమ శక్తివంచన లేకుండా వెల్చాల విజయం కోసం కృషి చేశామని చెప్పుకొచ్చారు. బీజేపీ నాలుగు నెలల ముందే ఎన్నికల ప్రచారం ప్రారం భించిందని, మోదీ సభలతో పాటు అయోధ్యఅక్షింతలు ఆ పార్టీకి కలసి వచ్చా యని చెప్పినట్టు సమాచారం. ⇒ నల్లగొండజిల్లా నేతలతో జరిగిన సమావేశంలో నల్లగొండ కాంగ్రెస్ కంచుకోట అని, పార్టీకి అన్ని రకాలుగా కలసిరావడంతో మంచి మెజారిటీలు సాధ్యమయ్యాయని కమిటీకి తెలిపారు. భువనగిరిలో బీజేపీ అభ్యర్థి గెలుస్తాడనే టాక్ వచ్చినా తాను ఇన్చార్జ్గా బాధ్యతలు తీసుకున్న తర్వాత దాన్ని మార్చివేశామని, మంచి మెజారిటీతో పార్టీ అభ్యరి్థని గెలిపించుకున్నామని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి కమిటీకి వెల్లడించారు. ⇒ బీజేపీకి బీఆర్ఎస్ మద్దతిచి్చంది కాబట్టే బీజేపీకి సీట్లు పెరిగాయని నిజామాబాద్ జిల్లా నేతలు కమిటీకి స్పష్టం చేశారు. కామారెడ్డిలో బీఆర్ఎస్కు అసెంబ్లీ ఎన్నికల్లో 60వేల ఓట్లు వస్తే, లోక్‌సభ ఎన్నికల్లో అది 20వేలకు తగ్గిపోయిందని చెప్పారు. కేసీఆర్ కుమార్తె, ఎమ్మెల్సీ కవితకు బెయిల్ కోసం బీఆర్ఎస్ నేతలు బహిరంగంగానే బీజేపీకి మద్దతు ప్రకటించారని ఈ సమావేశంలో షబ్బీర్‌అలీ కమిటీకి చెప్పినట్టు సమాచారం. అందరి అభిప్రాయాలను విన్న కమిటీ నాయకుల అభిప్రాయాలను క్రోడీకరించి ఈనెల 21న అధిష్టానానికి తమ నివేదిక ఇవ్వనుంది. ఈ విషయాన్ని కమిటీ సభ్యుడు రకీబుల్ హుస్సేన్ మీడియాకు వెల్లడించారు. -
పోస్టుమార్టంలో కళ్లు మాయం..కలెక్టర్ సంచలన నిర్ణయం
ముజరియా(యూపీ): హత్యకు గురైన ఓ యువతి శరీరం నుంచి కళ్లు దొంగిలించారని యువతి బంధువులు ఆరోపించారు. పోస్టుమార్టంలోనే ఇది జరిగిందని కుటుంబ సభ్యులు ఆరోపించారు. దీంతో జిల్లా కలెక్టర్ ఆ యువతి మృతదేహానికి రెండోసారి పోస్టుమార్టం చేయాలని ఆదేశించారు. ఈ దారుణ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని ముజారియా జిల్లా రసూలా గ్రామంలో జరిగింది. ‘వరకట్న కోసం పూజ(20)ను చంపారని ఆమె భర్తపై డౌరీ కేసు నమోదైంది. ఈ కేసులో పూజ మృతదేహానికి పోస్టుమార్టం చేశారు. మృతదేహాన్ని బంధువులకు అప్పగించినపుడు అసలు విషయం బయటపడింది. పూజ కళ్లు దొంగిలించారని కుటుంబ సభ్యులు తెలిపారు. మానవ అవయవాల అక్రమ రవాణా జరిగిందని పూజ బంధువులు ఫిర్యాదు చేశారు. దీంతో మృతదేహాన్ని మళ్లీ పోస్టుమార్టం కోసం పంపించాం. కళ్లు దొంగిలించడం నిజమే అయితే బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం’అని కలెక్టర్ మనోజ్‌కుమార్ తెలిపారు. ఇదీచదవండి.. మాజీ సీఎం ఒమర్ అబ్దుల్లా విడాకులపై కోర్టు కీలక తీర్పు -
TS: బీజేపీ నేతల్లో అంతర్మథనం..ఇప్పుడేం చేద్దాం!
సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీ ఎన్నికల్లో జాతీయ, రాష్ట్ర నాయకత్వాల అంచనాలు తప్పడానికి కారణాలు ఏమై ఉంటాయా అన్న దానిపై బీజేపీలో ప్రస్తుతం ‘పోస్ట్ మార్టమ్’ సాగుతోంది. అన్ని రకాలుగా కసరత్తు చేసి, తగిన జాగ్రత్తలతో బరిలో దిగినా చివరికి నిరాశ కలిగించేలా ఫలితాలు రావడానికి ప్రభావం చూపిన అంశాలు ఏమిటన్న దానిపై లోతైన పరిశీలనలో పార్టీ నేతలు నిమగ్నమయ్యారు. ఈ ఎన్నికల్లో పార్టీ ఆశించిన ఫలితాలను సాధించి రాష్ట్ర రాజకీయాల్లో కీలకభూమి పోషిస్తుందనే అంచనాలు తప్పి కేవలం ఎనిమిది సీట్లకే పరిమితం కావడాన్ని పార్టీ నేతలు జీచ్చి చుకోలేక పోతున్నారు. గెలిచిన 8లో ఏడు స్థానాలు ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాల నుంచే ఉండడం, పార్టీకి అత్యధిక పట్టు, ప్రజల ఆదరణ, మద్దతు అధికంగా ఉందని భావిస్తున్న గ్రేటర్ హైదరాబాద్, ఉమ్మడి రంగారెడ్డి జిల్లాల నుంచి గోషామహల్ సీటు మాత్రమే రావడం వంటి పరిణామాలు నేతల అంచనాలకు పూర్తి స్థాయిలో అందడం లేదంటున్నారు. బీసీ సీఎం నినాదం, ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణకు మద్దతు, సకల జనుల సౌభాగ్య తెలంగాణ పేరిట ప్రకటించిన ఎన్నికల మేనిఫెస్టో ప్రజలపై ప్రభావం చూపించలేకపోయాయని విశ్లేషిస్తున్నారు. ఇక బీఆర్ఎస్ ప్రభుత్వ వ్యతిరేక ఓటు బీజేపీకి అనుకూలంగా మారకపోగా, కర్ణాటక గెలుపుతో ఊపు మీదున్న కాంగ్రెస్ పార్టీ దాన్ని విజయవంతంగా అనుకూలంగా మలుచుకోగలిగిందని లెక్కలు వేస్తున్నారు. ఎందుకు కమలాన్ని పట్టించుకోలేదంటే.. బీజేపీకి ట్రేడ్ మార్క్‌గా ఉన్న ‘హిందూత్వ’ఎజెండాను మరింత బలంగా తీసుకెళ్లాల్సి ఉండిందా? సామాజిక కోణంలో తీసుకున్న బీసీ సీఎం నినాదం పనిచేయక పోవడానికి కారణాలేంటి? బయటి నుంచి వచ్చిన నేతలకు ఎన్నికల్లో కీలక బాధ్యతలు అప్పగించడం నష్టం చేసిందా? వచ్చే లోక్‌సభ ఎన్నికల్లోనైనా పార్టీ సరైన ఫలితాలు సాధించాలంటే ఏయే మార్పులు చేయాలి? తదితర ప్రశ్నలు ఇప్పుడు బాధ్యులైన నేతల మధ్య ప్రధానంగా చర్చకు వస్తున్నట్టు పార్టీ వర్గాల సమాచారం. బీఆర్ఎస్–బీజేపీ ఒకటేనని, రెండింటి మధ్య లోపాయికారి మితృత్వం ఉందంటూ జరిగిన ప్రచారాన్ని సమర్థవంతంగా తిప్పి కొట్టలేకపోవడం, కాళేశ్వరం, ఇతర ప్రాజెక్ట్‌ల్లో అవినీతి, అక్రమాలు జరిగాయని స్వయంగా కేంద్రపెద్దలు విమర్శించినా ఆ మేరకు కనీస చర్యలు తీసుకోకపోవడం, ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఎమ్మెల్సీ కవిత ప్రమేయం, అరెస్ట్ ఖాయమంటూ ప్రకటనలు చేసినా ఆ మేరకు యాక్షన్ లేకపోవడం, కేసీఆర్ సర్కార్‌పై రాజీలేని పోరాటం చేసి పార్టీ కేడర్‌లో నూతనోత్సాహం నింపిన బండి సంజయ్‌ని హఠాత్తుగా అధ్యక్షుడిగా తొలగించడం, బీఆర్ఎస్ నుంచి వచ్చిన ఈటల రాజేందర్‌కు వివిధ కీలక బాధ్యతలిచ్చి ప్రాధాన్యతనివ్వడం తదితరాలు బీజేపీ ఓటమికి ప్రధాన కారణాలు కావొచ్చుననే చర్చ ఇప్పుడు పార్టీలో సాగుతోంది. అభ్యర్థుల ఖరారు ఆలస్యం కావడం, బలంలేని జనసేనకు 8 సీట్లు కేటాయించడం, పార్టీ నాయకులు ఓ జట్టుగా సమన్వయంతో పనిచేయకపోవడం వెరసి ప్రజలు బీఆర్ఎస్కు బీజేపీని ప్రత్యామ్నాయంగా చూడకపోవడంతో తీసికట్టుగా ఫలితాలు వచ్చాయని ఆ పార్టీ నేతలు విశ్లేషిస్తున్నారు. లోక్‌సభ ఎన్నికలకు ఎలా ? వచ్చే మార్చి, ఏప్రిల్‌లలో జరిగే లోక్‌సభ ఎన్నికల్లోనైనా తెలంగాణ నుంచి గణనీయమైన సంఖ్యలో (గతంలో గెలిచిన 4 ఎంపీ సీట్ల కంటే అధికంగా) సీట్లు సాధించాలనే పట్టుదల రాష్ట్ర పార్టీ నేతల్లో వ్యక్తమవుతోంది. అసెంబ్లీ ఎన్నికల ఓటమి భారంతో మునిగిన పార్టీలో నూతనోత్తేజాన్ని నింపేందుకు వెంటనే ఎలాంటి చర్యలు చేపట్టాలనే దానిపై పార్టీ నాయకులు సమాలోచనల్లో నిమగ్నమయ్యారు. కేంద్రమంత్రిగా ఉన్న కిషన్‌రెడ్డి అసెంబ్లీ ఎన్నికల తర్వాత పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా కొనసాగే విషయంలో పెద్దగా ఆసక్తి చూపించడం లేదన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మళ్లీ అధ్యక్షుడిగా బండి సంజయ్‌ను తీసుకొస్తే ప్రయోజనం ఉంటుందా? ఈటలకు ఆ బాధ్యతలు అప్పగిస్తే ఎలా ఉంటుంది? లేదా లోక్‌సభ ఎన్నికల దాకా కిషన్‌రెడ్డి నే కొనసాగించి ఆ తర్వాత వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు దీర్ఘకాలిక వ్యూహంతో ముందుకెళితే మంచిదా అన్న ఆలోచనల్లో జాతీయ నాయకత్వం ఉన్నట్టు తెలుస్తోంది. -
సిగ్నల్ కోసమా? పవర్ ప్రాబ్లమా?
సాక్షి, విశాఖపట్నం : 08532 విశాఖ–పలాస రైలు కంటకాపల్లి నుంచి బయలుదేరిన 10 నిమిషాలకు చినరావుపల్లి దగ్గర నిలిచిపోయింది. ఆ మార్గంలో మొత్తం మూడు లైన్లు ఉండగా.. మధ్యలైన్‌లో ఈ రైలు నిలిపారు. అయితే.. కంటకాపల్లి నుంచి దాని వెనుకే బయలుదేరిన 08504 రైలు అదే మూడో లైన్లోకి వచ్చేసింది. ఈ కారణంగానే ప్రమాదం జరిగిందని రైల్వే అధికారులు ప్రాథమికంగా నిర్థారించారు. విశాఖ–పలాస రైలును మధ్య లైన్లో ఎందుకు నిలిపారు? ఆలమండ స్టేషన్ నుంచి సిగ్నల్ అందలేదా? లేదా ప్రమాద సమయంలో హైటెన్షన్ వైర్లు తెగిపడి ఉన్నాయా? ప్రమాదం జరగకముందే ఇవి తెగిపడటంవల్ల రైలు నిలిచిపోయిందా అనే దానిపై దర్యాప్తు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. మరోవైపు.. ఒక రైలు ఆగి ఉన్నప్పుడు అదే మార్గంలో మరో రైలు వెళ్లేందుకు అనుమతి ఎలా ఇచ్చారనే కోణంలోనూ దర్యాప్తు ప్రారంభించారు. ఆటో సిగ్నలింగ్ వ్యవస్థ లోపంవల్లే వెనుక వస్తున్న రాయగడ రైలు.. మధ్య లైన్లోకి వచ్చినట్లు భావి స్తున్నారు.సిగ్నల్ లేక పలాస రైలును చినరావుపల్లెలో నిలిపినట్లయితే.. ఆ సమాచారాన్ని రాయగడ రైలుకు పంపాలి. అదీ జరగలేదు. పోనీ.. హైటెన్షన్ వైర్లు తెగిపడటంవల్ల నిలిచిపోయినట్లయితే.. ఆ సమాచారం కూడా వెనుక వస్తున్న రైళ్లకు చేర వేయాల్సి ఉంది. ఈ రెండూ జరగకపోవడంవల్లే ప్రమాదం జరిగినట్లు భావిస్తున్నారు. సిగ్నలింగ్ వ్యవస్థ లోపమా.. మానవ తప్పిదమా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. ఆ రైలువల్లే పెను ప్రమాదం తప్పింది.. సాధారణ రోజుల్లో ఈ 2 రైళ్లు నిరంతరం ప్రయాణికులతో నిండుగా ఉంటాయి. వ్యాపారులు, స్థానికులు, ఏదైనా పని, లేదా వైద్యం.. ఇతర అవసరాల కోసం విశాఖకి ఉదయాన్నే వచ్చి.. పనులన్నీ చూసుకుని సాయంత్రానికి తిరుగు ప్రయాణానికి ఈ రెండు రైళ్లనే ఆశ్రయిస్తుంటారు. కానీ, ఆదివారం మాత్రం.. ఈ రైళ్లలో అంతగా జనం ఉండరు. దీనికి కారణం.. ఈ రైళ్లు బయలుదేరిన కొద్దిసేపటికే విశాఖపట్నం–విజయనగరం పాసింజర్ మెము రైలు (07468) ఉంటుంది. విజయనగరం వెళ్లే వాళ్లంతా శని, ఆదివారాల్లో ఈ రైలు కోసం ఎక్కువగా ఎదురుచూస్తుంటారు. ఈ రైలు లేకపోతే.. ఇందులో వెళ్లే ప్రయాణికులంతా ఈ 2 రైళ్లనే ఆశ్రయించేవాళ్లు. అప్పుడు ప్రమాద తీవ్రత మరింత పెరిగి ఉండేది. -
10 రోజుల క్రితం మహిళ మృతి.. పూడ్చిపెట్టిన శవానికి పోస్టుమార్టం
దుబ్బాకరూరల్: అనుమానాస్పద స్థితిలో మహిళ మృతి చెందిన సంఘటన మండలంలోని హబ్సిపూర్ గ్రామంలో జరిగింది. సీఐ కృష్ణ తెలిపిన వివరాలు. బైండ్ల బాలవ్వ(50) వ్యవసాయ కూలీ పనులు చేస్తుంటుంది. భర్త ఆరేళ్ల క్రితం చనిపోయాడు. ఆమెకు ఇద్దరు కుమారులు, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. కూతుళ్లకు వివాహం కాగా, కుమారులు హైదరాబాద్‌లో ప్రైవేట్ ఉద్యోగం చేస్తుంటారు. ఈనెల 7న బాలవ్వ మృతి చెందగా ఇంటి ఎదుటఉన్నవారు కుమారులకు సమాచారం అందించారు. మంచం మీద నుంచి కింద పడి మృతి చెంది ఉండవచ్చని భావించిన కుటుంబ సభ్యులు, బంధువులు అదే రోజు అంత్యక్రియలు నిర్వహించారు. అప్పటికే బాలవ్వ ముక్కు నుంచి రక్తం కారుతుంది. శవాన్ని దించుతుండగా మృతురాలి తల కిందఉన్న దిండు జారి కిందపడింది. దానిపై రక్తం మరకలు కనిపించాయి. అంత్యక్రియలు పూర్తి చేసి ఇంటికి వచ్చి చూసే సరికి ఇంటిలో కూడా రక్తం మరకలు ఉన్నాయి. అనుమానం వచ్చి మృతురాలి కుమారులు నాగరాజు, పరుశరాములు ఈనెల 16న పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. సీఐ కృష్ణ, ఎస్ఐ గంగరాజు ఆధ్వర్యంలో పూర్తి స్థాయిలో దర్యాప్తు చేపట్టారు. ఆదివారం పూడ్చిన శవాన్ని బయటకు తీసి అక్కడే తహసీల్దార్ జయంత్, ఫోరెనిక్స్ బృందం సభ్యుల ఆధ్వర్యంలో పోస్టుమార్టం నిర్వహించారు. అనుమానిత నిందితుడు పోలీసుల అదుపులో ఉన్నట్లు సమాచారం. -
హోంగార్డు మృతి.. పోస్టుమార్టం చేయకుండానే అంత్యక్రియలు
ఒడిశా: హోంగార్డు అనుమానాస్పద మృతి ఘటనలో జిల్లా ఎస్పీ వివేకానంద శర్మ ఆదేశాల మేరకు ఖననం చేసిన మృతదేహాన్ని బయటకు తీసిన మరోసారి పోస్టుమార్టం నిర్వహించారు. జిల్లాలోని గుణుపూర్ సబ్ డివిజన్ పుటాసింగి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకున్న ఈ ఘటన హాట్ టాపిక్‌గా మారింది. దీనికి సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి. పుటాసింగి పోలీస్ స్టేషన్లో హోంగార్డుగా విధులు నిర్వహిస్తున్న అవినాష్ లిమ్మ(33) సోమవారం రాత్రి అనుమనాస్పద రీతిలో పుటాసింగిలోని ఓ మండపంపై శవమై కనిపించాడు. మంగళవారం ఉదయం అటుగా వెళ్తున్న గ్రామస్తులు గమనించి, పోలీసులకు సమాచారం అందించారు. దీనిపై పోలీసు శాఖ నుంచి సరైన స్పందన లేకపోవడంతో మతదేహాన్ని ఇంటికి తీసుకువెళ్లిన లిమ్మ కుటుంబీకులు క్రైస్తవ సంప్రదాయం ప్రకారం ఖననం చేశారు. విషయం జిల్లా ఎస్పీ వివేకానంద శర్మ దృష్టికి వెళ్లడంతో మృతదేహాన్ని పోస్టుమార్టం చేయకుండా ఎలా అప్పగిస్తారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మృతికి గల పూర్తి కారణాలను విశ్లేషించాలని ఆదేశించారు. దీంతో హుటాహుటిని గ్రామానికి చేరుకున్న సిబ్బంది.. పూడ్చి పెట్టి ఉన్న మృతదేహాన్ని బయటకు తీసేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో లిమ్మ కుటుంబీకులు, గ్రామస్తులు దీనిపై వ్యతిరేక వ్యక్తం చేయడంతో ఇరువర్గాల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. అనంతరం పోలీసులు వారికి నచ్చజెప్పి, మృతదేహాన్ని వెలుపలికి తీశారు. అనంతరం గుణుపూర్ సబ్ డివిజన్ ఆస్పత్రికి తరలించి, భద్రపరిచారు. బుధవారం ఉదయం పోస్టుమార్టం చేయనున్నారు. అయితే ఇది హత్య? లేక సహజ మరణమా అనే వివరాలు పోస్టుమార్టం రిపోర్టులో తెలుస్తుందని పోలీసులు తెలిపారు. దీనిపై దర్యాప్తు ప్రారంభించారు. -
Madanapalle: పిల్లల భవిష్యత్తు కోసం ఆ సమాధి బద్ధలు!
అన్నమయ్య: Madanapalle Postmortem Incident: ప్రమాదంలో చనిపోయిన ఓ సాఫ్ట్వేర్ ఇంజినీరు మృతదేహానికి 3 నెలల 10 రోజుల తర్వాత పోస్టుమార్టం నిర్వహించిన అరుదైన సంఘటన కురబలకోట మండలంలో శుక్రవారం జరిగింది. వివరాలు.. పిచ్చలవాండ్లపల్లె పంచాయతీ పందివానిపెంటకు చెందిన రేపన చౌడప్ప (33) బెంగళూరులోని విఫ్రో కంపెనీలో సాప్ట్వేర్ ఇంజినీరుగా పనిచేసేవాడు. ఇతడికి భార్య శిల్ప, ముగ్గురు పిల్లలు ఉన్నారు. ఈ ఏడాది ఏప్రిల్ 11న చౌడప్ప బెంగళూరు నుంచి మోటార్ సైకిల్‌పై ఇంటికి వస్తూ మదనపల్లె రూరల్ మండలంలోని చీకలబైలు వద్ద జరిగిన ప్రమాదంలో చనిపోయాడు. తీవ్ర విషాదంలో కూరుకుపోయిన కుటుంబీకులు విషయాన్ని పోలీసుల దృష్టికి తీసుకెళ్లకుండా పోస్టుమార్టం చేయకుండానే స్వగ్రామం పందివానిపెంటలో మరుసటి రోజు అంత్యక్రియలు నిర్వహించారు. అయితే చౌడప్ప సాప్ట్వేర్ ఇంజినీరు కావడంతో అతడి మృతి తర్వాత అందించే బెనిఫిట్స్ కోసం కంపెనీ పోస్టుమార్టం సర్టిఫికెట్ కావాలని కోరింది. చౌడప్ప భార్య శిల్ప స్పందన కార్యక్రమంలో భాగంగా జిల్లా ఎస్పీ గంగాధరరావును కలసి తన భర్త చౌడప్ప మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి సర్టిఫికెట్ ఇప్పించాలని కోరింది. ఆయన ఆదేశాలతో శుక్రవారం మదనపల్లె డీఎస్పీ కేశప్ప ఆధ్వర్యంలో సీఐ సత్యనారాయణ, తహసీల్దారు ఎం. భీమేశ్వరరావు పర్యవేక్షణలో సమాధిని తొలగించి మృతదేహాన్ని బయటకు తీయించారు. అక్కడే వైద్యులు పోస్టుమార్టం నిర్వహించారు. దానిని వీడియోలో చిత్రీకరించారు. మూడు నెలల తర్వాత మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహిస్తున్నారని తెలిసి పరిసర ప్రాంతాల ప్రజలు అక్కడికి పెద్ద సంఖ్యలో వచ్చారు. -
పోస్టుమార్టం కోసం సిద్ధం చేసిన శరీరం నుంచి గుండెచప్పుడు.. యూపీలో సంచలనం!
ఉత్తరప్రదేశ్‌లోని మిర్జాపూర్‌లో సంచలన ఉదంతం చోటుచేసుకుంది. ఈ ప్రాంతంలో ఒక యువతి చెరువులో తేలుతూ పోలీసులకు కనిపించింది. దీంతో పోలీసులు ఆ యవతి దేహాన్ని పోస్టుమార్టం కోసం ఆసుపత్రికి తరలించేందుకు ఏర్పాట్లు చేశారు. అయితే ఇంతలో ఆ యువతి కుటుంబ సభ్యులు తమ కుమార్తెను ఒకసారి వైద్యులకు చూపించాలని కోరారు. వెంటనే పోలీసులు వారి కోరిక మేరకు ఆ యువతిని వైద్యుల దగ్గరకు తీసుకువెళ్లారు. పోలీసుల వైద్య పరీక్షల్లో ఆ యువతి గుండె కొట్టుకుంటున్నట్లు గమనించారు. ఈ ఘటన మిర్జాపూర్ పరిధిలోని సంత్‌నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని రాహ్ కలాం హవూదవా గ్రామంలో చోటుచేసుకుంది. ఆదివారం సాయంత్రం సిర్సీకి చెందిన ఒక యువతి చెరువులో తేలుతూ కనిపించింది.స్థానికులు ఈ విషయాన్ని పంచాయతీ సభ్యులకు తెలియజేశారు. వారు ఈ సమాచారాన్ని పోలీసులకు అందించారు. పోస్టుమార్టం కోసం సిద్ధమైన పోలీసులు.. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఆ యువతి దేహాన్ని బయటకు తీశారు. ఆమె ఎవరనేది గుర్తించి, కుటుంబ సభ్యులకు తెలియజేశారు. ఆ యువతి మృతిచెందిందని భావించిన పోలీసులు పోస్టుమార్టంనకు తరలించేందుకు ఏర్పాట్లు చేశారు. యువతి ఇంటిలో ఆనందోత్సాహాలు అయితే ఆ యువతి కుటుంబ సభ్యులు తమ కుమార్తెను ఒకసారి వైద్యుల దగ్గరకు తీసుకువెళ్లాలని కోరారు. దీంతో పోలీసులు ఆ యువతిని పటెహరా ఆరోగ్య కేంద్రానికి తీసుకెళ్లారు. అక్కడి వైద్యులు ఆమెను పరిశీలించి, గుండె కొట్టుకుంటున్న విషయాన్ని గమనించారు. వెంటనే వైద్యులు ఆమెకు చికిత్స ప్రారంభించారు. తమ కుమార్తె బతికేవుందని తెలియడంతో ఆమె కుటుంబ సభ్యుల ఆనందానికి హద్దులు లేకుండా పోయాయి. యువతి తల్లి ఏమన్నదంటే.. ఆ యువతి తల్లి రత్నాదేవి మీడియాతో మాట్లాడుతూ తమ కుమార్తె మానసిక పరిస్థితి సవ్యంగా లేదన్నారు.అప్పుడప్పుడు ఇంటి నుంచి బయటకు ఎక్కడికో వెళ్లిపోతుందని తెలిపారు. ఈ సందర్భంగా ఆ యువతికి చికిత్సనందించిన వైద్యులు డాక్టర్ గణేశ్ శంకర్ త్రిపాఠి మాట్లాడుతూ పోలీసులు ఆ యువతిని చెకప్ కోసం తీసుకువచ్చారని, వైద్య పరీక్షలు చేసి, చికిత్సనందించామని, ప్రస్తుతం ఆ యువతి పూర్తి ఆరోగ్యంగానే ఉన్నదని తెలిపారు. ఇది కూడా చదవండి: రైలు రిజర్వేషన్లో సరిదిద్దలేని పొరపాట్లివే.. -
అప్సర తలకు బలమైన గాయం: పోస్ట్ మార్టం రిపోర్ట్
-
గుండెలు పగిలేలా విలపించిన కుటుంబ సభ్యులు
యానాం/కాకినాడ క్రైం/తాళ్లరేవు: కష్టపడి సంపాదించుకుని.. మెరుగైన జీవితం గడపాలని ఒకరు.. కుమార్తె వివాహం చేయాలని మరొకరు.. బిడ్డలను మంచి చదువులు చదివించి, ప్రయోజకుల్ని చేయాలని ఇంకొకరు.. ఇలా ఆ కుటుంబాలు కన్న కలలు కళ్ల ముందే చెదిరిపోయాయి.. కన్నీటినే మిగిల్చాయి.. తాళ్లరేవు ఆటో ప్రమాదంలో మృతి చెందిన యానాం మహిళల కుటుంబాల్లో సోమవారం నెలకొన్న విషాద భరిత దృశ్యమిది. తాళ్లరేవు – యానాం మధ్య సుబ్బారాయుని దిమ్మ ప్రాంతంలో 216 జాతీయ రహదారిపై ఆదివారం మధ్యాహ్నం ఆటోను ప్రైవేటు బస్సు ఢీకొన్న ఘోర ప్రమాదంలో యానాం, పరిసర ప్రాంతాలకు చెందిన ఏడుగురు మహిళలు మృతి చెందిన విషయం తెలిసిందే. వారి మృతదేహాలకు కాకినాడ జీజీహెచ్ వైద్యులు సోమవారం పోస్టుమార్టం పూర్తి చేశారు. తలకు తీవ్ర గాయాలు కావడం వల్లనే ఈ మహిళలందరూ మృతి చెందారని వైద్యులు వెల్లడించారు. మృతుల్లో ఒక మహిళకు కాళ్లు తెగిపోయాయని, ఇద్దరికి పక్కటెముకలు నుజ్జునుజ్జయ్యాయని తెలిపారు. యానాం ఎమ్మెల్యే గొల్లపల్లి శ్రీనివాస్ అశోక్, ఢిల్లీలో పుదుచ్చేరి ప్రభుత్వ ప్రతినిధి మల్లాడి కృష్ణారావు, ప్రాంతీయ పరిపాలనాధికారి మునిస్వామి, కాకినాడ రూరల్ సీఐ శ్రీనివాస్, పెదపూడి, కోరింగ ఎస్సైలు వాసు, పి.శ్రీనివాస్ కుమార్ తదితరులు ఉదయం నుంచీ కాకినాడ జీజీహెచ్ మార్చురీ వద్దనే ఉన్నారు. మృతుల కుటుంబ సభ్యులను ఓదార్చి, ధైర్యం చెప్పారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాలను ప్రత్యేక వాహనాల్లో యానాం తీసుకువచ్చి, ఘన నివాళులర్పించారు. బూడపనీటి సత్యవతి (బాలయోగి నగర్), కల్లి పద్మ (కొత్తబస్టాండ్ వెంకట్‌నగర్), బొక్కా అనంతలక్ష్మి (ఫ్రాన్స్‌తిప్ప), చెందిన శేశెట్టి వెంకటలక్ష్మి (మెట్టకూరు), నిమ్మకాయల వెంకటలక్ష్మి (కురసాంపేట), చింతపల్లి జ్యోతి (వెంకట్ నగర్) మృతదేహాలను వారి కుటుంబ సభ్యులకు అప్పగించారు. అనంతరం కుటుంబ సభ్యులు, బంధువుల రోదనల నడుమ స్థానిక టైడల్ లాక్ సమీపాన హిందూ శ్మశాన వాటిక, మెట్టకూరు శ్మశాన వాటికల్లో ఆ మహిళల మృతదేహాలకు అంత్యక్రియలు నిర్వహించారు. మృతుల ఇళ్ల వద్దకు పెద్ద సంఖ్యలో జనాలు తరలివచ్చి, కుటుంబ సభ్యులను ఓదార్చారు. హిందూ శ్మశాన వాటిక వద్ద మృతదేహాలకు మల్లాడి కృష్ణారావు, ఆర్‌ఏఓ మునిస్వామి కడసారి నివాళులర్పించారు. ఇద్దరిపై కేసు ఈ ప్రమాదానికి సంబంధించి ఇద్దరిపై కేసు నమోదు చేసినట్టు కోరంగి ఎస్సై పి.శ్రీనివాస కుమార్ తెలిపారు. బస్సును నిర్లక్ష్యంగా నడిపి, ఏడుగురి మృతికి, మరో ఏడుగురు గాయపడేందుకు కారకుడైన బస్సు డ్రైవర్ వేగిరాజు సుధీర్, క్లీనర్ ముంగమూరి మహేష్‌లపై కాకినాడ డీఎస్పీ మురళీ కృష్ణారెడ్డి ఆదేశాల మేరకు 304, 337, 338 సెక్షన్ల కింద కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నామని వివరించారు. నిందితులిద్దరినీ అరెస్టు చేసి, కోర్టుకు తరలించామన్నారు. అధైర్యం వద్దు.. ఆదుకుంటాం మృతుల కుటుంబాలను అన్ని విధాలా ఆదుకుంటామని, ఎవ్వరూ అధైర్యపడొద్దని, ఎక్కువ మొత్తంలో ఆర్థిక సహాయం వచ్చేలా కృషి చేస్తున్నామని ఎమ్మెల్యే శ్రీనివాస్ అశోక్ అన్నారు. సోమవారం ఆయన విలేకర్లతో మాట్లాడుతూ, ఇప్పటికే పుదుచ్చేరి ప్రభుత్వం మృతుల కుటుంబాలకు రూ.లక్ష చొప్పున తక్షణ ఆర్థిక సహాయం ప్రకటించిందని గుర్తు చేశారు. ఎమ్మెల్యేగా, వ్యక్తిగతంగా తాను ఒక్కో మృతురాలి కుటుంబానికి రూ.లక్ష చొప్పున రూ.7 లక్షల ఆర్థిక సహాయం అందిస్తానని చెప్పారు. మృతులకు రొయ్యల ఫ్యాక్టరీ నుంచి బీమా ఉందని, దీంతోపాటు వారు సైతం ఒక్కొకరికి రూ.5 లక్షల చొప్పున ఇవ్వనున్నారని తెలిపారు. ప్రమాదానికి కారణమైన ట్రావెల్స్ బస్సు యాజమాన్యంతో తాను మాట్లాడానని, వారి నుంచి సైతం రూ.3 లక్షల చొప్పున సహాయం అందుతుందని చెప్పారు. దీనిపై ఇప్పటికే అధికారులు సైతం చర్చిస్తున్నారన్నారు. అలాగే, మల్లాడి కృష్ణారావు కూడా వ్యక్తిగతంగా రూ.లక్ష చొప్పున ఆర్థిక సాయం ప్రకటించారని తెలిపారు. దీంతోపాటు వివిధ స్వచ్ఛంద సంస్థల నుంచి సైతం మరింత సహాయం అందేలా చర్యలు చేపట్టామని అశోక్ తెలిపారు. రాజకీయాలకు అతీతంగా ఎవ్వరైనా బాధిత కుటుంబాలను స్వచ్ఛందంగా ఆదుకోవచ్చని అన్నారు. మొత్తం మీద ఒక్కో కుటుంబానికి రూ.12 లక్షల నుంచి రూ.13 లక్షల వరకూ సహాయం అందే అవకాశం ఉందని చెప్పారు. అలాగే క్షతగాత్రులు ఒక్కొక్కరికి రూ.30 వేల చొప్పున అందిస్తామన్నారు. ఈ ప్రమాదంలో గాయపడిన ఇద్దరి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉందని, వారికి మరింత మెరుగైన వైద్యం అందించేందుకు చర్యలు చేపట్టామని చెప్పారు. మద్యం మత్తులోనే ప్రమాదం! మద్యం మత్తు కారణంగానే ఈ ప్రమాదం జరిగినట్టు భావిస్తున్నారు. డీజిల్ నింపుకొనేందుకు కాకినాడ నుంచి యానాం పట్టణానికి మోజో ట్రావెల్స్ బస్సును డ్రైవర్, క్లీనర్ తీసుకువచ్చారు. డీజిల్ నింపుకొన్న అనంతరం వారు మద్యం తాగినట్టు సమాచారం. ప్రమాద సమయానికి ఆ ఆ బస్సును డ్రైవర్‌కు బదులు క్లీనర్ నడుపుతున్నట్టు తెలిసింది. మద్యం మత్తులో బస్సును అదుపు చేయలేక, పక్కనే ఉన్న రెయిలింగ్‌ను, అనంతరం ఎదురుగా వస్తున్న ఆటోను ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగినట్టు పోలీసులు ప్రాథమికంగా గుర్తించినట్టు తెలుస్తోంది. ఇదిలా ఉండగా పరిమితికి మించి మహిళా కార్మికులను ఎక్కించుకున్న ఆటో డ్రైవర్ గిడ్డి వెంకటేశ్వరరావుపై కూడా కేసు నమోదు చేయనున్నట్టు తెలిసింది. -
గాంధీ, ఉస్మానియా మార్చురీల్లో అనాథ శవాల ఆత్మఘోష!
అవి రాష్ట్రంలోనే పేరొందిన రెండు ప్రభుత్వ పెద్దాస్పత్రులు... పేద రోగులకు కార్పొరేట్ స్థాయి వైద్య సేవలను ఉచితంగా అందిస్తూ వారికి అండగా నిలుస్తున్న గాంధీ, ఉస్మానియా ఆస్పత్రులు. కానీ ఇదంతా నాణేనికి ఒకవైపు మాత్రమే. మరోవైపు ఈ రెండు ఆస్పత్రుల్లోని మార్చురీలు (శవాగారాలు), వాటి దయనీయ పరిస్థితిని చూస్తే ఎవరికైనా కళ్లు చెమరుస్తాయి.. గుండెలు బరువెక్కుతాయి. ఎంతో మంది అనాథలు, అభాగ్యుల మృతదేహాలు ఆనవాళ్లు లేక మార్చురీల్లో కుళ్లిపోయి దుర్వాసనలు వెదజల్లుతూ శవాల దిబ్బగా మారుతున్నాయి. సరైన సమయంలో దహన సంస్కారాలకు నోచుకోక వాటి ఆత్మలు ఘోషిన్తున్నాయి.. ఈ హృదయ విదారక దుస్థితిపై ‘సాక్షి’ప్రత్యేక కథనం. సాక్షి, హైదరాబాద్: భాగ్యనగరంలోని గాంధీ, ఉస్మానియా మార్చురీల్లో నిత్యం సుమారు 50 మృతదేహాలకు పోస్టుమార్టం నిర్వహిస్తుంటారు. వాటిలో దాదాపు 10–15 వరకు అనాథ శవాలే. తాజా మృతదేహాలను మార్చురీలోని ఫ్రీజరు బాక్స్‌ల్లో భద్రపరుస్తున్న సిబ్బంది... గుర్తుతెలియని, అనాథ మృతదేహాలను పఫ్రూం (మూకుమ్మడిగా మృతదేహాలను భద్రపరిచే గది)కు తరలిస్తున్నారు. అయితే జీహెచ్ఎంసీ నిర్లక్ష్యం, పోలీసులు, ఫోరెన్సిక్ వైద్యుల మధ్య సమన్వయ లోపం కారణంగా మృతదేహాలను అక్కడ రోజుల తరబడి ఉంచాల్సి వస్తుండటంతో అవి కుళ్లిపోయి దుర్వాసన వెదజల్లుతున్నాయి. సిబ్బంది సైతం లోపలకు వెళ్లలేని దుస్థితి నెలకొంటోంది. నిబంధనలకు పాతర! పోస్ట్‌మార్టం జరిగిన 72 గంటల తర్వాత అనాథ శవాలను జీహెచ్ఎంసీ విభాగం శ్మశానవాటికకు తరలించాలనే నిబంధనలు ఉన్నా అవి అమలుకు నోచుకోవడం లేదు. జీహెచ్ఎంసీ ఓ కాంట్రాక్టు సంస్థను ఎంపిక చేసి ఒక్కో మృతదేహం తరలింపు, అంత్యక్రియల నిర్వహణకు కొంత మొత్తం చెల్లిస్తుండగా ఆ సంస్థ మాత్రం వివిధ సాకులు చెబుతూ మృతదేహాల తరలింపులో తీవ్ర జాప్యం చేస్తోంది. రవాణా ఖర్చులు మిగుల్చుకొనేందుకు దాదాపు 10 రోజులకోసారి దాదాపు 20 చొప్పున మృతదేహాల తరలింపు ప్రక్రియ చేపడుతోంది. ప్రస్తుతం ఒక్కో మృతదేహం తరలింపు, అంత్యక్రియలకు కాంట్రాక్టు సంస్థకు జీహెచ్ఎంసీ రూ. 2,000–2,500 మ«ద్య ఇస్తున్నట్లు సమాచారం. గతంలో గాంధీ, ఉస్మానియాలకు చెందిన అనాథ శవాల అంత్యక్రియలు నిర్వహించిన ఓ స్వచ్ఛంద సంస్థపై ఆరోపణలు రావడంతో దానిని తప్పించి జీహెచ్ఎంసీయే రంగంలోకి దిగినా అదే తీరు నెలకొనడం గమనార్హం. కాలేజీలకు కొన్ని అనాథ శవాలు? మార్చురీ నుంచి కొన్ని అనాథ శవాలను కొందరు ప్రైవేటు మెడికల్ కాలేజీలకు అమ్ముకుంటున్నట్లు ఆరోపణలు సైతం వెల్లువెత్తుతున్నాయి. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంసీ) నిబంధనల ప్రకారం మెడికల్ కాలేజీల్లో వైద్య విద్యార్థులకు మానవ అనాటమీ, డిసెక్షన్పై అవగాహన కల్పించాలి. ఇందుకోసం మృతదేహాలు కావాలి. అయితే రోడ్డు ప్రమాదాల్లో తీవ్ర గాయాలపాలై మృతిచెందే వ్యక్తుల మృతదేహాలు డిసెక్షన్‌కు పనికిరానందున రోడ్లు, ఫుట్‌పాత్‌లపై నివసిస్తూ సాధారణ రుగ్మతలతో మరణించే అనాథల మృతదేహాలను పోస్టుమార్టం అనంతరం కొందరు ప్రైవేటు మెడికల్ కాలేజీలకు అమ్ముకొని సొమ్ముచేసుకుంటున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. పుర్రె, ఎముకల విక్రయం! అంత్యక్రియలకు ముందు అప్పుడప్పుడూ అనాథ మృతదేహాల నుంచి పుర్రెతోపాటు కొన్ని శరీర భాగాలకు చెందిన ఎముకలను వేరు చేసి తాంత్రిక, భూత వైద్యులుగా చెలామణి అయ్యే వారికి అమ్ముకుంటున్నారన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. పుర్రెను రూ. 10 వేల నుంచి రూ. 20 వేలకు, చేతి, తొడ ఎముకలు, వెన్నెముక, జాయింట్‌గా ఉన్న ఐదు చేతివేళ్ల ఎముకలను రూ. 2 వేల నుంచి రూ.20 వేల వరకు విక్రయిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. వెంటాడుతున్న సిబ్బంది కొరత.. గాంధీ, ఉస్మానియా ఆస్పత్రులను సిబ్బంది కొరత వెంటాడుతోంది. గాంధీ మార్చురీలో ప్రస్తుతం ఏడుగురు వైద్యులు, ఆరుగురు సిబ్బంది ఉన్నారు. మరో ముగ్గురు వైద్యులు, ఆరుగురు సిబ్బందితో ఇంకో యూనిట్ ఏర్పాటు చేయాలనే ప్రతిపాదన కొన్నేళ్లుగా కార్యరూపం దాల్చడంలేదు. మరోౖవెపు ఉస్మానియాలో వైద్యుల కొరత అంతగా లేకున్నా ఏడుగురు కిందిస్థాయి సిబ్బందితో నెట్టుకొస్తున్నారు. సమన్వయంతో అంత్యక్రియలు గుర్తుతెలియని వ్యక్తుల మృతదేహాలను పఫ్ రూంలోకి తరలించాక 5–6 మృతదేహాలను ఒకసారి చొప్పున జీహెచ్ఎంíసీ సిబ్బంది తీసుకెళ్తున్నారు. వారితో సమన్వయం చేసుకుంటూ అంత్యక్రియలు నిర్వహిస్తున్నాం. – డాక్టర్ బి. నాగేందర్, ఉస్మానియా ఆస్పత్రి సూపరింటెండెంట్ చనిపోయిన వ్యక్తి అనాథ కాకూడదు గుర్తుతెలియని వ్యక్తిని అనాథ శవంలా కాకుండా వారి కుటుంబ సభ్యులకు చేరవేయాలనే మా ఉద్దేశానికి వ్యతిరేకంగా ఈ తంతు నడుస్తోంది. ప్రభుత్వంతో 8 ప్రామాణికాలకు అనుగుణంగా చేసుకున్న ఒప్పందం ప్రకారమే మేం నడుచుకున్నా మమ్మల్ని కాదని జీహెచ్ఎంసీకి అప్పగించింది. – డా. రాజేశ్వర్‌రావు, సత్యహరిశ్చంద్ర ఫౌండేషన్, ప్రధాన కార్యదర్శి తరలింపులో కొన్నిసార్లు జాప్యం అనాథ శవాల తరలింపులో కొన్నిసార్లు జాప్యం జరుగుతున్న మాట వాస్తవమే. మేం ప్రతిరోజూ జీహెచ్ఎంసీకి అనాథ శవాల వివరాలను లిఖితపూర్వకంగా అందిస్తున్నాం. గాంధీలో 60 మృతదేహాలను భద్రపరిచేందుకు అవసరమైన ఫ్రీజరు బాక్సులు, పఫ్రూంతోపాటు అన్ని వసతులు ఉన్నాయి. – ప్రొఫెసర్ రాజారావు, గాంధీ ఆస్పత్రి సూపరింటెండెంట్ జాప్యం లేదు.. 3 అనాథ శవాల తరలింపులో జాప్యం జరగట్లేదు. సమాచారం అందిన వెంటనే మార్చురీ నుంచి ప్రత్యేక వాహనంలో మృతదేహాలను శ్మశానవాటికకు తరలించి అంతిమ సంస్కారాలు నిర్వహిస్తున్నాం. – ముకుందరెడ్డి, జీహెచ్ఎంసీ డిప్యూటీ కమిషనర్, బేగంపేట సర్కిల్ -
వాణి జయరామ్ పోస్ట్ మార్టం పూర్తి..తలకు ఒకటిన్నర ఇంచు గాయం!
ప్రముఖ గాయని వాణీ జయరామ్ శనివారం ఉదయం అనుమానాస్పద స్థితిలో కన్నుమూసిన సంగతి తెలిసిందే. ఆమె మరణంపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు చెన్నైలోని ఒమేదురార్ ప్రభుత్వ ఆసుపత్రిలో వాణీ జయరామ్ మృతదేహానికి పోస్ట్ మార్టం నిర్వహించారు. ఆమె తలకు ఒకటిన్నర ఇంచు గాయం అయినట్లు గుర్తించారు. అయితే ఆ గాయంపై ఇప్పటికి ఎలాంటి నిర్ధారణకు రాలేమని పోలీసులు చెబుతున్నారు. పోస్ట్‌మార్టం నివేదిక వచ్చిన తర్వాతే స్పష్టత వస్తుందని అన్నారు. పోస్ట్‌మార్టం అనంతరం మృతదేహాన్ని వాణీ జయరామ్ నివసింసే అపార్ట్‌మెంట్‌కు తరలించారు. ఆదివారం మధ్యాహ్నం ఒంటి గంటకు అంత్యక్రియలు నిర్వహించనున్నారు. వాణీ జయరామ్ పోస్ట్ మార్టంలో ఏం రాబోతుందనేది ఇప్పుడు సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. -
సుశాంత్‌ది హత్యే!.. ఇప్పటికైనా న్యాయం చేయండి : సుశాంత్ సోదరి ఆవేదన
బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ చనిపోయి రెండేళ్లు దాటినా, అతడి మృతికి గల కారణాలు ఏంటన్నది ఇంకా క్లారిటీ రాలేదు. ఇక సుశాంత్‌ది ఆత్మహత్య కాదు, హత్యేనంటూ పోస్టుమార్టం చేసిన బృందంలోని రూప్‌కుమార్ షా అనే వ్యక్తి సంచలన వ్యాఖ్యలు చేయడంతో ఈ కేసు మరోసారి తెరమీదకి వచ్చింది. సుశాంత్ బాడీపై పలు గాయాలు ఉన్నాయని పేర్కొన్న రూప్‌కుమార్.. పోస్టుమార్టం జరిగేటప్పుడు వీడియో రికార్డు చేయకుండా కేవలం ఫోటోలు మాత్రమే తీశారని, పైఅధికారుల నుంచి వచ్చిన ఆదేశాల మేరకు త్వరగా పోస్టుమార్టం ప్రక్రియ పూర్తి చేశామని వెల్లడించారు. దీంతో సుశాంత్ మరణంపై మరోసారి అనుమానాలు రేకెత్తుతున్నాయి. తాజాగా ఇదే విషయమై ఇప్పటికైనా న్యాయం చేయాలంటూ సుశాంత్ సోదరి ట్వీట్ చేసింది. రూప్‌కుమార్ చేసిన వ్యాఖ్యలను స్క్రీన్‌షాట్స్‌లో జోడించి.. సుశాంత్ కేసును సీబీఐ విచారణ జరిపి నిజనిజాలు ఏంటో బయటకు వెల్లడిస్తారని ఎప్పటినుంచో మేం ఎదురుచూస్తున్నాము. సుశాంత్‌కు న్యాయం జరగాలి అంటూ ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. కాగా 2020 జూన్14న ముంబై బాంద్రాలోని తన ఫ్లాట్‌లో సుశాంత్ మరణించిన సంగతి తెలిసిందే. If there is an ounce of truth to this evidence, we urge CBI to really look into it diligently. We have always believed that you guys will do a fair investigation and let us know the truth. Our heart aches to find no closure as yet. 🙏 CBI Make SSRCase TimeBound pic.twitter.com/g58mj2F37q — Shweta Singh Kirti (@shwetasinghkirt) December 26, 2022 We have to make sure safety of RoopKumar Shah is insured. 🙏 CBI Make SSRCase TimeBound @narendramodi @AmitShah #SushantSinghRajput https://t.co/suY8sCuwrU — Shweta Singh Kirti (@shwetasinghkirt) December 26, 2022 -
మహిళ మృతదేహానికి రెండేళ్ల తర్వాత పోస్టుమార్టం
గన్నవరం: రెండేళ్ల క్రితం అనుమానానాస్పద స్థితిలో మృతి చెందిన ఓ వివాహిత మృతదేహానికి మంగళవారం స్థానిక ముస్లిం శ్మశానవాటికలో పోలీసులు పోస్టుమార్టం నిర్వహించారు. పోలీసులు తెలిపిన సమాచారం ప్రకారం...స్థానిక ఇస్లాంపేటకు చెందిన సఫియాబేగంకు 2015లో విజయవాడకు చెందిన సలిముల్లా షరీఫ్‌తో వివాహం జరిగింది. వివాహం అనంతరం గుంటూరులోని ఓ బ్యాంక్‌లో ఉద్యోగం చేస్తున్న సఫియాబేగం 2020 సెప్టెంబర్ 6 న ఆకస్మాత్తుగా అనారోగ్యానికి గురై మృతి చెందింది. అనంతరం మృతదేహాన్ని గన్నవరం తీసుకువచ్చి ఖననం చేశారు. కొన్ని రోజుల తర్వాత సఫియాబేగం మృతిపై అనుమానాలు రావడంతో సెప్టెంబర్ 19న ఆమె తల్లిదండ్రులు గుంటూరు పట్టాభిపురం పోలీసులను ఆశ్రయించారు. సఫియాబేగం మృతికి ఆమె భర్త సలిముల్లా షరీఫ్‌తో పాటు అత్తమామలు కారణమంటూ వారు ఇచ్చిన ఫిర్యాదుపై పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే ఈ కేసులో పురోగతి లేకపోవడంతో పాటు ఆరేళ్ల కుమారుడిని పట్టించుకోకుండా షరీఫ్ మరో పెళ్లి చేసుకోవడంతో ఇటీవల మృతురాలి తల్లిదండ్రులు మానవ హక్కుల కమిషన్‌ను ఆశ్రయించారు. కమిషన్ ఉత్తర్వుల మేరకు ఉన్నతాధికారుల ఆదేశాలతో మంగళవారం తహసీల్దారు సీహెచ్ నరసింహారావు సమక్షంలో పట్టాభిపురం సీఐ రాజశేఖర్‌రెడ్డి నేతృత్వంలో మృతదేహాన్ని వెలికితీయించి పోస్టుమార్టం నిర్వహించారు. మృతదేహంలోని పలు అవశేషాలను సేకరించి పరీక్షల నిమిత్తం ఫోరెన్సిక్ ల్యాబ్‌కు తరలించనున్నట్లు సీఐ తెలిపారు. -
స్టోన్ క్రషర్లో భారీ పేలుడు
మాలూరు / కోలారు: మాలూరు తాలూకాలోని టీకల్ ఫిర్కా కొమ్మనహళ్లి గ్రామం వద్ద మంజునాథ్‌కు చెందిన స్టోన్ క్రషర్లో గురువారం రాత్రి భారీ పేలుడు సంభవించింది. ఘటనలో బిహార్‌కు చెందిన కార్మికుడు రాకేష్ సాణి(34) దుర్మరణం పాలయ్యాడు. అయితే మాస్తి సీఐ వసంత్ రాత్రికి రాత్రే రాకేష్ సాణి మృతదేహాన్ని మాలూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి పోస్టుమార్టం చేయించి టిప్పర్ ఢీకొని మరణించినట్లుగా ప్రాథమిక నివేదికను సిద్ధం చేసినట్లు ఆరోపణలు గుప్పుమన్నాయి. మృతుడి శరీరం కాలిపోయి ఉండడం పలు అనుమానాలకు తావిచ్చింది. శుక్రవారం ఉదయం కేంద్ర వలయ ఐజీపీ చంద్రశేఖర్, కోలారు ఎస్పీ దేవరాజ్ ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. ఉన్నతాధికారుల దృష్టికి తేకుండా పోస్టుమార్టం ఎందుకు చేయించారనే ప్రశ్నలు తలెత్తాయి. ఘటనపై అనుమానాలు ఉన్న నేపథ్యంలో మాస్తి సీఐ వసంత్‌ను సస్పెండు చేశారు. మృతదేహాన్ని కోలారు జిల్లా ఆస్పత్రికి తరలించారు. రీ పోస్టుమార్టం చేయిస్తాం– మంత్రి మునిరత్న మంత్రి మునిరత్న శుక్రవారం కోలారు జిల్లా ఆస్పత్రికి వచ్చి మృతదేహాన్ని పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ స్టోన్ క్రషర్ బ్లాస్ట్‌కు సంబంధించి పోలీసుల వైఖరి అనుమానాస్పదంగా ఉందని పేర్కొన్నారు. కార్మికుడి మృతదేహాన్ని బెంగుళూరు విక్టోరియా ఆస్పత్రికి పంపి రీ పోస్టుమార్టం చేయిస్తామన్నారు. మృతదేహాన్ని విక్టోరియా ఆస్పత్రికి తరలించాలని కలెక్టర్‌కు సూచించానన్నారు. పోలీసుల తప్పు కనిపిస్తే వారిపై కఠిన చర్యలు ఉంటాయన్నారు. (చదవండి: లేడీ రజనీకాంత్.. సూపర్ టాలెంట్.. ‘వైరస్’ను గుర్తు చేసింది!) -
నిమ్న కులానికి చెందిన వైద్యుడు పోస్టుమార్టమ్ చేశారని..
బరఘా: కుల వివక్ష వెర్రి తలలు ఎలా వేస్తోందో చెప్పే ఉదంతమిది. ఒడిశాలోని బరఘా జిల్లాలో ముచును సంధా అనే వ్యక్తి ఆస్పత్రిలో మరణించారు. పోస్టుమార్టం చేసిన వైద్యడు నిమ్న కులానికి చెందిన వ్యక్తి కావడంతో గ్రామస్తులు ఏకంగా అంత్యక్రియలను బహిష్కరించారు. కనీసం బంధువులెవరూ అటువైపు తొంగి కూడా చూడలేదు. దాంతో గ్రామ సర్పంచ్ భర్త సునీల్ బెహరా ఇలా బైక్ మీద మృతదేహాన్ని తీసుకువెళ్లి ఒకరిద్దరి సహకారంతో అంతిమ సంస్కారం నిర్వహించారు. చదవండి: కాంగ్రెస్‌కు బిగ్ షాక్.. 92 మంది ఎమ్మెల్యేల రాజీనామా -
జస్టిస్ ఫర్ శ్రీమతి: పోస్ట్‌మార్టం పై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు
న్యూఢిల్లీ: తమిళనాడులో సంచలనం సృష్టించిన పాఠశాల విద్యార్థి ఆత్మహత్య కేసుకి సంబంధించి ఘటన జరిగిన మరుసటి రోజే మద్రాస్ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. విద్యార్థి మృతి నిరశిసిస్తూ మరోసారి పోస్ట్‌మార్టం నిర్వహించాలని ఆదేశించింది. అంతేగాక అల్లర్లకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవల్సిందిగా కోర్టు తీర్పు ఇచ్చింది. ఐతే మెడికల్ ప్యానెల్లో తమకు తెలిసిన వైద్యుడిని చేర్చాలన్న తల్లిదండ్రుల అభ్యర్థనను హైకోర్టు తిరస్కరించింది. దీంతో వారు తమకు తెలిసిన వైద్యుడితోనే శవపరీక్షలు నిర్వహించాలంటూ బాలిక తండ్రి సుప్రీం కోర్టును ఆశ్రయించారు. అంతేగాదు ఈ కేసును అత్యవసరంగా విచారించాలంటూ సుప్రీంకోర్టుని బాలిక కుటుంబం పట్టుబట్టింది. ఐతే ధర్మాసనం రెండోసారి నిర్వహించే పోస్ట్‌మార్టం పై స్టే ఇచ్చేందుకు నిరాకరిచడమే కాకుండా రేపు విచారణ జరుపుతామని సుప్రీం కోర్టు తెలిపింది. ఐతే బాలిక తండ్రి తరపు న్యాయవాది రాష్ట్రంలో ఈ విషయమై చాలా ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది, పైగా ఈ రోజే పోస్ట్‌మార్టం ప్రారంభమవుతుంది కాబట్టి దయచేసి దానిపై స్టే విధించండి అంటూ పట్టుబట్టారు. దీనికి ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రమణ స్పందిస్తూ...‘ఈ అంశాన్ని ఇప్పటికే హైకోర్టు సీజ్ చేసింది. మీకు హైకోర్టుపై నమ్మకం లేదా? అని మందలించడమే కాకుండా వారి అభ్యర్థనను తిరస్కరించారు. అదీగాక మద్రాస్ హైకోర్టు ఆదేశాల మేరకు అల్లర్లకు సంబంధించి దాదాపు 300 మంది అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. (చదవండి: జస్టిస్ ఫర్ శ్రీమతి: టీచర్లు హరిప్రియ, కృతిక అరెస్ట్) -
మరణించి ఉంటారులే.. బతికి ఉన్న మహిళ పోస్టుమార్టానికి..
పూతలపట్టు (యాదమరి)/పాకాల: పాకాల మండలం గానుగపెంటకు చెందిన టీచర్ దంపతులు జి.మనోహర్, శిరీష దంపతులు తమ కుమార్తెతో కలిసి బైక్‌లో తిరుపతి బయలుదేరారు. నేండ్రగుంట వద్ద ఆవు అడ్డు రావడంతో బ్రేకు వేయడంతో భార్య కింద పడిపోయింది. తీవ్రంగా గాయపడిన ఆమెను పభుత్వాస్పత్రికి తరలించారు. సిబ్బంది పరిశీలించకుండానే చనిపోయినట్టు చెప్పి పోస్టుమార్టానికి తరలించేందుకు సిద్ధమయ్యారు. బంధువులు బతికి ఉంది చూడమని చెప్పినా పట్టించుకోలేదు. చివరకు వారు ఆమెను వేలూరు సీఎంసీకి తరలించారు. ఈ సంఘటన పూతలపట్టు మండలం పి.కొత్తకోట ప్రభుత్వాస్పత్రిలో జరిగింది. చదవండి: ఇలా చేశారంటే ఎన్ని ప్రయోజనాలో తెలుసా?.. తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే.. పాకాల మండలం గానుగపెంటకు చెందిన మనోహర్ తన భార్య శిరీష(30), మూడేళ్ల కుమార్తెతో కలిసి ఆదివారం సాయంత్రం ద్విచక్ర వాహనంలో తిరుపతి బయలుదేరాడు. నేండ్రగుంట వద్ద ఉన్నట్టుండి ఆవు అడ్డు రావడంతో మనోహర్ బ్రేకు వేశాడు. దీంతో శిరీష రోడ్డుపై పడిపోయింది. తలకు తీవ్రగాయాలయ్యాయి. అతనికి, కుమార్తెకు స్వల్ప గాయాలయ్యాయి. శిరీషను ప్రైవేట్ అంబులెన్స్‌లో పూతలపట్టు మండలం పి.కొత్తకోట ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అక్కడ వైద్యులు లేరు. స్టాఫ్ నర్సుతోపాటు మరో నర్సు ఈసీజీ తీసి చనిపోయిందని బంధువులకు చెప్పారు. పోస్టుమార్టం కోసం చిత్తూరు ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లాలని చెప్పారు. అరగంట తర్వాత వైద్యురాలు వచ్చినా పరిశీలించలేదు. ఆమె సూచన మేరకు పోస్టుమార్టం కోసం చిత్తూరు ప్రభుత్వాస్పత్రికి తీసుకెళుతుండగా మార్గమధ్యంలో ఊపిరి పీ ల్చుకుంటున్నట్టు అనుమానం వచ్చి చిత్తూరు ఆర్వీఎస్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడి వైద్యులు పరిశీలించి పల్స్ ఉన్నాయని, వెంట నే వేలూరు సీఎంసీకి తీసుకెళ్లాలని రెఫర్ చేశారు. ఇంత నిర్లక్ష్యమా రోడ్డు ప్రమాదం జరిగి ఆస్పత్రికి వస్తే వైద్యులు లేరు. బతికి ఉన్నా చనిపోయినట్టు చెప్పడం దారుణమని బంధువులు వాపోయారు. ప్రభుత్వాస్పత్రుల్లో మెరుగైన వైద్యం అందిస్తారని ప్రభుత్వం చెబుతుంటే వైద్యులు ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరించడం ఎంత వరకు సబబని ఆవేదన చెందుతున్నారు. దీనిపై ఉన్నతాధికారులు తగు చర్యలు తీసుకోవాలని వారు కోరారు. -
శరవేగంగా ‘మోడ్రన్ మార్చురీ’
డాబాగార్డెన్స్ (విశాఖ దక్షిణ): కేజీహెచ్ మోడ్రన్ మార్చురీ అభివృద్ధి పనులు ప్రారంభమయ్యాయి. ప్రస్తుతం ఉన్న మార్చురీని ఆధునికీకరిస్తున్నారు. పోస్ట్‌మార్టం కోసం వచ్చే వారి మృతుల బంధువుల కోసం ప్రత్యేకంగా ఓ షెడ్ నిర్మాణం చేపట్టారు. అనంతరం ఏసీలు ఏర్పాటు చేయనున్నారు. మోడ్రన్ మార్చురీ అభివృద్ధికి కలెక్టర్ డాక్టర్ ఎ.మల్లికార్జున రూ.50 లక్షలు మంజూరు చేసిన విషయం పాఠకులకు విధితమే. ఆంధ్రా మెడికల్ కళాశాలకు అనుసంధానంగా ఉన్న మోడ్రన్ మార్చురీ ఆధునికీకరణపై ఏఎంసీ ప్రిన్సిపాల్ సాంబశివరావు, కేజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ పి.మైథిలి, ఏపీఎంఎస్ఐడీసీ అధికారులతో గత నెల 28న కలెక్టర్ చర్చించిన విషయం తెలిసిందే. కేజీహెచ్‌కు, ఆంధ్రా మెడికల్ కళాశాలకు అనుబంధంగా మార్చురీ ఉంది. ప్రమాదవశాత్తు జరిగిన సంఘటనలు, ఆత్మహత్యలు, రోడ్డు ప్రమాదాలు, బీచ్‌లో గల్లంతు, రైలు ప్రమాదాల్లో మృతులకు పోస్టుమార్టం కోసం కేజీహెచ్‌కు తీసుకు వస్తుంటారు. మృతదేహాలతో పాటు వారి బంధువులు ఇక్కడికి వస్తుంటారు. చనిపోయిన వ్యక్తి కుటుంబ సభ్యులు..మరో వైపు శవ పంచనామా చేసేందుకు పోలీసులు..తరచూ కేజీహెచ్ మార్చురీకి వస్తుంటారు. పోస్ట్‌మార్టం పూర్తయ్యే వరకు వీరంతా మండుటెండల్లోనో, జోరువానలోనో నిరీక్షించాల్సిన దుస్థితి గతంలో ఉండేది. మార్చురీ అభివృద్ధిపై కలెక్టర్ ప్రత్యేక దృష్టి కేజీహెచ్ మార్చురీ ఆధునికీకరణకు కలెక్టర్ మల్లికార్జున ప్రత్యేక దృష్టి కేంద్రీకరించారు. మార్చురీ అభివృద్ధికి సంబంధిత అధికారులతో ఇప్పటికే చర్చలు జరిపారు. తక్షణమే పనులు చేపట్టాలని గత నెలలోనే ఆదేశించారు. ముఖ్యంగా చనిపోయిన వ్యక్తి పోస్ట్ మార్టం కోసం వచ్చే బంధువులు, పోలీసులు ఎటువంటి ఇబ్బంది ఎదుర్కోకుండా, మండుటెండల్లో నిరీక్షించకుండా ఉండేందుకు వీలుగా ప్రత్యేక షెడ్డు వేసి, అందులో ఏసీల ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఈ చర్యలు యుద్ధప్రాతిపదికన చేపట్టాలని సంబంధిత అధికారులను ఆదేశించడమే గాక ఈ పనుల కోసం రూ.50 లక్షలు మంజూరు చేశారు. కొద్ది రోజుల్లో ఈ పనులు పూర్తి కానున్నాయని, త్వరలోనే అందుబాటులోకి తేనున్నట్టు ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. (చదవండి: బొర్రా గుహలకు మెట్రో గేటు) -
‘షేన్ వార్న్‌ది సహజ మరణమే’
మెల్బోర్న్: స్పిన్ దిగ్గజం షేన్ వార్న్ మృతి విషయంలో అనుమానించాల్సిన అంశమేమీ లేదని తేలింది. అతనిది సహజ మరణమేనని, గుండె పోటు కారణంగానే చనిపోయినట్లు థాయ్‌లాండ్ పోలీసులు అధికారికంగా ప్రకటించారు. వార్న్ మృతదేహానికి పోస్ట్‌మార్టమ్ నిర్వహించిన వైద్యుడు థాయ్ పోలీసులకు నివేదిక ఇవ్వగా, దానిని వారు ఆస్ట్రేలియా రాయబార కార్యాలయానికి అందజేశారు. ‘వార్న్ మృతికి సంబంధించి సందేహించాల్సిన అంశాలేమీ కనపడలేదు. ఇది హత్య కాదు. అతను సహజంగానే చనిపోయినట్లు పోస్ట్‌మార్టమ్ చేసిన డాక్టర్ వెల్లడించారు. అంతకుముందే తనకు ఛాతీలో కొంత నొప్పి వస్తోందని, థాయ్‌లాండ్ నుంచి తిరిగి రాగానే వైద్యులను కలుస్తానని వార్న్ తన తండ్రితో కూడా చెప్పాడు’ అని అసిస్టెంట్ పోలీస్ కమిషనర్ సురచటే హక్‌పర్న్ స్పష్టం చేశారు. మరోవైపు సెలవుల కోసం థాయ్‌లాండ్ వెళ్లడానికి ముందే వార్న్ ఛాతీ నొప్పితో బాధపడినట్లు, అతని డైట్లో మార్పు కూడా అందుకు కారణం కావచ్చని వార్న్ మేనేజర్ జేమ్స్ ఎర్స్కైన్ వెల్లడించాడు. ‘బరువు తగ్గే క్రమంలో వార్న్ కఠోర ఆహార నియమాలను అలవాటు చేసుకున్నాడు. థాయ్ వెళ్లే ముందు రెండు వారాలుగా అతను కేవలం ద్రవ పదార్థాలు మాత్రమే తీసుకుంటూ వచ్చాడు. అతను తన జీవితంలో చాలా ఎక్కువగా ధూమపానం చేసేవాడు. బహుశా అది కూడా గుండెపోటుకు కారణం కావచ్చేమో’ అని అతను వివరించాడు. అధికారిక లాంఛనాలతో... వార్న్ అంత్యక్రియలను ఆస్ట్రేలియా ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో నిర్వహించేందుకు అతని కుటుంబ సభ్యులు అంగీకరించారు. వార్న్ కెరీర్లో ఎన్నో చిరస్మరణీయ ప్రదర్శనలకు నెలవైన మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్ (ఎంసీజీ)లో సుమారు లక్ష మంది అభిమానుల మధ్య ఈ కార్యక్రమం జరిగే అవకాశం ఉంది. ఎంసీజీ బయట వార్న్ విగ్రహం ఉండగా, మైదానంలో ఒక స్టాండ్‌కు కూడా అతని పేరు పెట్టనున్నారు. ఇంకా తేదీ ధ్రువీకరించకపోయినా... వచ్చే రెండు వారాల్లోగా అంత్యక్రియలు నిర్వహించవచ్చు. దేశ ప్రధాని స్కాట్ మోరిసన్, విక్టోరియా ముఖ్యమంత్రి డానియెల్ ఆండ్రూస్ అంత్యక్రియలకు హాజరవుతారు. ‘ఇది ఎప్పటికీ ముగిసిపోని పీడకలలాంటిది. వార్న్ లేని జీవితాన్ని ఊహించలేకపోతున్నాం. అతను అందించిన జ్ఞాపకాలతో బతికేస్తాం’ అని అతని తల్లిదండ్రులు కీత్, బ్రిగిట్ ఆవేదనగా చెప్పగా... ‘నా గుండెల్లో ఎప్పటికీ నిలిచిపోయి ఉంటావు. నువ్వో గొప్ప తండ్రివి, స్నేహితుడివి’ అంటూ అతని కుమారుడు జాక్సన్ తన బాధను వ్యక్తం చేశాడు. థాయ్‌లాండ్ నుంచి వార్న్ మృతదేహం ఇంకా అతని ఇంటికి చేరలేదు. -
షేన్ వార్న్ మృతిపై అనుమానాలు.. గదిలో రక్తపు మరకలు..!
స్పిన్ మాంత్రికుడు, ఆస్ట్రేలియా క్రికెట్ దిగ్గజం షేన్ వార్న్(52) శుక్రవారం థాయ్‌లాండ్‌లోని తన విల్లాలో గుండెపోటుతో మరణించిన విషయం తెలిసిందే. వార్న్ ఆకస్మిక మృతిపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించిన థాయ్ పోలీసులు సంచలన విషయాలు వెల్లడించారు. వార్న్ మరణించిన గదిలో ఫ్లోర్, టవల్స్‌పై అధిక మోతాదులో రక్తపు మరకలు గుర్తించామని పేర్కొన్నారు. వార్న్ మరణించడానికి ముందు భయాందోళనలకు గురై, నరక యాతన అనుభవించి ఉంటాడని అనుమానం వ్యక్తం చేశారు. కాగా, వార్న్ విగతజీవిగా పడి ఉండటాన్ని గుర్తించి, ఆసుపత్రికి తరలించడానికి ముందు సీపీఆర్ చేశామని, గుండెపై ఒత్తిడి తెచ్చే క్రమంలో అతను రక్తపు వాంతులు చేసుకున్నాడని వార్న్ స్నేహితులు ప్రాధమిక విచారణలో వెల్లడించినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే, ఆదివారం థాయ్ అధికారులు వార్న్ భౌతికకాయానికి శవ పరీక్ష నిర్వహించారు. పోస్టుమార్టం రిపోర్టు సోమవారం వచ్చే అవకాశం ఉంది. ఒక వేళ వార్న్‌ది అసాధారణ మరణం అయితే పోస్టుమార్టం నివేదికలో వెల్లడయ్యే అవకాశం ఉంది. పోస్టుమార్టం అనంతరం ఆదివారమే వార్న్ భౌతికకాయాన్ని స్వస్థలమైన ఆస్ట్రేలియాకు తరలించనున్నారు. ఇప్పటికే ఆ దేశ ప్రభుత్వం అధికారిక లాంచనాలతో వార్న్ అంత్యక్రియలకు ఏర్పాట్లు పూర్తి చేసింది. సోమవారం స్పిన్ దిగ్గజం అంత్యక్రియలు జరిగే అవకాశం ఉంది. ఇదిలా ఉంటే, 1992-2007 మధ్య 15 ఏళ్ల పాటు ఆస్ట్రేలియా క్రికెట్‌కు సేవలందించిన వార్న్..145 టెస్టుల్లో 708 వికెట్లు, 194 వన్డేల్లో 293 వికెట్లు తీశాడు. ఓవరాల్‌గా అంతర్జాతీయ క్రికెట్లో వెయ్యి వికెట్లు తీసిన రెండో ఆటగాడిగా వార్న్ రికార్డుల్లో నిలిచాడు. చదవండి: శవ పరీక్షకు వార్న్ భౌతికకాయం.. బోరుమన్న కుమారుడు -
Juscti For Manikandan: సంచలన ఆదేశం.. రీపోస్ట్ మార్టం చేయాల్సిందే!
Juscti For Manikandan: పోలీసు కస్టోడియల్ మరణాలు ఇటీవలి కాలంలో ఎక్కువగా వెలుగులోకి వస్తున్నాయి. 21ఏళ్ల విద్యార్థి ఎల్ మణికందన్ పోలీసు కస్టడీ నుంచి విడుదలైన మరుసటిరోజే మృతి చెందటం కలకలం రేపుతోంది. తన కుమారుడిది పోలీసు కస్టోడియల్ మరణమంటూ అతని తల్లి కోర్టును ఆశ్రయించింది. మంగళవారం మద్రాసు హైకోర్టు మధురై బెంచ్ మణికందన్ మృతదేహానికి తిరిగి పోస్ట్ మార్టం చేయాలని ఆదేశించింది. వివరాలు.. ఓ ప్రైవేటు కాలేజీలో డిగ్రీ చదువుతున్న ఎల్ మణికందన్ తన స్నేహితుడితో బైక్ మీద వెళుతుండగా.. పరమకుడి-కీజాతొరోవల్ రోడ్డులో వెహికల్ చెకప్ చేస్తున్న పోలీసులు ఆపారు. అయితే వారి నుంచి తప్పించుకోవడానికి మణికందన్, అతని స్నేహితుడు ప్రయత్నించారు. కానీ, పోలీసులు వారిని పట్టుకొగా అతని స్నేహితుడు భయంతో పారిపోయాడు. దీంతో పోలీసులు మణికందన్‌ను స్టేషన్‌కు తరలించారు. అనంతరం అతని తల్లి రామలక్ష్మీకి సమాచారం అందించగా.. మణికందన్‌ను తల్లిదండ్రులు పోలీసు స్టేషన్ వచ్చి ఇంటికి తీసుకువెళ్లారు. అయితే మరుసటి రోజు ఉదయం మణికందన్ సృహలో లేకపోవడం గమనించిన తల్లిదండ్రులు స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే మణికందన్ మృతిచెందాడు. మణికందన్‌కు పోస్ట్ మార్టం చేయించిన పోలీసులు.. తల్లిందండ్రులకు అప్పగించారు. అయితే తమ కొడుకు పోలీసులే స్టేషన్లో హింసించడం వల్ల మారణించాడని తల్లిదండ్రులు నిరసన వ్యక్తం చేశారు. దీనిపై విచారణ జరుపుతామని పోలీసు అధికారలు చెప్పడంతో నిరసన విరమించారు. సోమవారం పోలీసులు పోలీసు స్టేషన్‌కు సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్‌ను విడుదల చేశారు. అతని శరీరానికి ఎటువంటి గాయం లేదని, పోలీసులు హింసించలేదని పోలీసు ఉన్నతాధికారి పేర్కొన్నారు. వాహన తనిఖీల్లో భాగంగా అడ్డుకున్నామని, అతని(మణికందన్) స్నేహితుడు గంజాయి కేసుల్లో ఉన్నాడని తెలిపారు. పోలీసులు హింసించారని దానికారణంగా మణికందన్ తల్లిదండ్రులు కోర్టును అశ్రయించారు. పోలీసులు చాలా తక్కువ నిడివి ఉన్న సీసీటీవీ ఫుటేజ్ మాత్రమే విడుదల చేశారని పిటిషనర్ తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. దీంతో మణికందన్ మృతదేహానికి రీపోస్ట్ మార్టం చేయాలని కోర్టు ఆదేశించింది. అయితే మణికందన్ ఘటనపై సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. పోలీసు దౌర్జన్యం, కస్టోడియల్ మరణాలకు వ్యతిరేకంగా ‘జై భీం’ మూవీ విడుదలైన కొన్ని రోజుల్లోనే ఈ ఘటన చోటు చేసుకోవడంతో పోలీసుల తీరుపై నెటిజన్లు మండిపడుతున్నారు. -
ఇకపై సూర్యాస్తమయం తర్వాత కూడా పోస్ట్‌మార్టం
సాక్షి, హైదరాబాద్: ఇక తెలంగాణలో సూర్యాస్తమయం తర్వాత కూడా పోస్ట్‌మార్టం నిర్వహించనున్నారు. కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ విడుదల చేసిన కొత్త పోస్ట్ మార్టం ప్రోటోకాల్ గైడ్ లైన్స్ అనుసరించి తెలంగాణ వైద్య విధాన పరిషత్ కమిషనర్ డాక్టర్ రమేష్‌రెడ్డి ఆదివారం ఉత్తర్వులు జారీచేశారు. సూర్యాస్తమయం తర్వాత కూడా పోస్ట్ మార్టం నిర్వహించే విధానం అవయవ దానాన్ని, మార్పిడిని కూడా ప్రోత్సహిస్తుందన్నారు. రాత్రిపూట నిర్వహించే అన్ని పోస్ట్‌మార్టంలను వీడియో రికార్డింగ్ చేయాల్సి ఉంటుందన్నారు. అన్ని జిల్లా, ఏరియా, సామాజిక ఆసుపత్రుల్లోనూ రాత్రి వేళల్లో పోస్ట్‌మార్టం నిర్వహిస్తారని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. -
తెలంగాణ వైద్యారోగ్యశాఖ కీలక ఉత్తర్వులు..
సాక్షి, హైదరాబాద్: ఇటీవలే కేంద్ర ఆరోగ్య శాఖ విడుదల చేసిన కొత్త పోస్టుమార్టం ప్రోటోకాల్ నిబంధనలను తెలంగాణలో అమలు చేయనున్నట్లు తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. దీంతో ఇకపై తెలంగాణలో డే అండ్ నైట్ పోస్టుమార్టం నిర్వహించనున్నారు. ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్యశాఖ ఆదివారం ఉత్తర్వులు జారీ చేసింది. చదవండి: (ఒకే వేదికపై రెండు తెలుగు రాష్ట్రాల సీఎంలు..) -
ఇకపై రాత్రి వేళల్లోనూ పోస్టుమార్టం
న్యూఢిల్లీ: సరైన సదుపాయాలు ఉన్న ఆసుపత్రుల్లో సాయంత్రం తర్వాత కూడా పోస్టుమార్టం చేసేందుకు కేంద్రం అనుమతి ఇచ్చింది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సూక్ మాండవీయ సోమవారం ట్విట్టర్లో ప్రకటించారు. ‘బ్రిటిష్ కాలం నుంచి ఉన్న విధానానికి ఇప్పుడు తెరపడింది. పోస్టుమార్టం ఇకపై 24 గంటల పాటు నిర్వహించవచ్చు. గుడ్ గవర్నెన్స్‌లో భాగంగా.. సరైన సదుపాయాలు ఉన్న ఆసుపత్రుల్లో రాత్రి వేళ కూడా పోస్టుమార్టం చేసుకునేందుకు ఆరోగ్య శాఖ అనుమతిచ్చింది’అని ట్వీట్ చేశారు. ఈ నిర్ణయం సోమవారం నుంచి అమల్లోకి రానుందని పేర్కొంది. అయితే హత్య, ఆత్మహత్య, అత్యాచారం, కుళ్లిపోయిన మృతదేహాలు, అనుమానాస్పద మృతి వంటి కేసుల్లో మాత్రం అనుమతివ్వలేదు. ఈ నిర్ణయంతో మరణించిన వారి కుటుంబసభ్యులు, స్నేహితులకు మేలు కలుగుతుందన్నారు. అలాగే అవయవదానం చేయాలనుకునే వారి నుంచి అవయవాలు తీసుకునే వీలు కలుగుతుందని తెలిపారు. రాత్రి వేళల్లో నిర్వహించే పోస్టుమార్టం ప్రక్రియ మొత్తాన్ని వీడియో చిత్రీకరించాలని, దీంతో ఎలాంటి అనుమానాలు ఉన్నా భవిష్యత్తులో నివృత్తి చేసుకోవచ్చని కేంద్ర ఆరోగ్య శాఖ పేర్కొంది. -
పోస్ట్‌మార్టం చేయడానికి వెళ్తే గురక శబ్దం.. తీరా చూస్తే
మాడ్రిడ్: దైవానికి, సాంకేతికతకు మధ్య నిత్యం వివాదం రాజుకుంటూనే ఉంటుంది. దైవం లేదని సైన్స్ అంటుంది. కానీ సాంకేతికతకు అంతుపట్టని రహస్యాలు ఈ సృష్టిలో కోకొల్లలు. ఈ కోవకు చెందిన ఓ సంఘటన స్పెయిన్‌లో వెలుగు చూసింది. ఓ వ్యక్తి మరణించినట్లు ఒక్కరు కాదు ఇద్దరు కాదు ఏకంగా ముగ్గురు డాక్లర్లు నిర్ధారించారు. పోస్ట్‌మార్టం చేయడానికి సిద్ధం అవుతుండగా.. ఓ భయానక సంఘటన చోటు చేసుకుంది. మృతి చెందినట్లు భావించిన వ్యక్తి అకస్మాత్తుగా లేచి కూర్చున్నాడు. ఈ సంఘటన చూసి వైద్యులు ఒణికిపోయారు. ఆ వివరాలు.. మూడేళ్ల క్రితం జరిగిన ఈ సంఘటన గురించి సైన్స్ అలర్ట్‌లో ప్రచురించడంతో మరోసారి వార్తల్లోకి వచ్చింది. దీని ప్రకారం.. జనవరి 7, 2018న స్పెయిన్ జైలులో శిక్ష అనుభవిస్తున్న గొంజలో మోంటోయా జిమెనెజ్ అనే ఖైదీ ఉన్నట్లుండి స్పృహ కోల్పోయాడు. అధికారులు అతడిని లేపేందుకు ప్రయత్నించారు.. కానీ అతడిలో ఎలాంటి చలనం లేదు. దాంతో జైలులో ఆ రోజు విధుల్లో ఉన్న ఇద్దరు వైద్యులను పిలిచి గొంజలోకు వైద్య పరీక్షలు చేయించారు. సదరు ఖైదీని పరీక్షించిన ఆ ఇద్దరు వైద్యులు గొంజలో చనిపోయినట్లు ప్రకటించారు. ఎందుకైనా మంచిది మరోసారి నిర్ధారించుకుందామని భావించి ఫోరెన్సిక్ వైద్యుడిని పిలిపించి పరీక్షలు చేయించారు. అతడు కూడా గొంజలో మృతి చెందినట్లు తెలిపాడు. ఇక అధికారిక నియమాల ప్రకారం గొంజలో మృతదేహాన్ని బ్యాగ్‌లో ఉంచి మార్చురీ కోల్డ్ స్టోరేజ్‌లో ఉంచారు. శవపరీక్ష నిర్వహించడానికి అతని మృతదేహాన్ని స్కాల్పెల్ గుర్తులతో గుర్తించారు. పోస్ట్‌మార్టం నిర్వహించడానికి మార్చురీలోకి వచ్చిన వైద్యులు అక్కడ చోటు చేసుకున్న సంఘటన చూసి భయంతో వణికిపోయారు. శవాలు మాత్రమే ఉండే ఆ గదిలో వారికి పెద్ద గురక శబ్దం వినిపించింది. భయంతో షాక్‌కు గురైన వైద్యులు.. ఆ తర్వాత తేరుకుని.. శబ్దం ఎక్కడ నుంచి వస్తుందో తెలుసుకునేందుకు తేరిపార గమనించారు. గొంజలో మృతదేహం ఉన్న బ్యాగ్ లోపలి నుంచి శబ్దం వస్తోందని తెలుసుకున్నారు. చనిపోయాడని వైద్యులు ధ్రువీకరించి.. కోల్డ్ స్టోరేజ్‌లో పెట్టిన తర్వాత గొంజలో శరీరంలో చలనం వచ్చింది. వెంటనే అతడి బాడీని ఆసుపత్రికి తరలించగా గొంజలో బతికే ఉన్నట్లు తెలిపారు వైద్యులు. ఈ సందర్భంగా హాస్పిటల్ అధికారులు మీడియాతో మాట్లాడుతూ ‘‘ఇది ఉత్ప్రేరక కేసు కావచ్చు ఈ లాంటి సందర్భంలో మానవ శరీరం బందీకావడం లేదా ట్రాన్స్ లాంటి దశలోకి ప్రవేశించి స్పృహ, అనుభూతిని కోల్పోతుంది. ఫలితంగా సదరు వ్యక్తి మరణించినట్లు నిర్ధారిస్తాం’’ అని తెలిపారు. -
ఖమ్మం మైనర్ బాలిక ఘటనలో పోలీసుల ఓవరాక్షన్
సాక్షి, ఖమ్మం: ఓ వైపు హథ్రాస్ బాధితురాలి విషయంలో అర్థరాత్రి, కుటుంబ సభ్యులు లేకుండా అంత్యక్రియలు నిర్వహించడం పట్ల కోర్టు అభ్యంతరం వ్యక్తం చేసినప్పటికి అధికారులు తీరు మాత్రం మారడం లేదు. తాజాగా ఖమ్మం మైనర్ బాలిక ఘటనలో కూడా పోలీసులు ఇలానే ఓవరాక్షన్ చేశారు. కుటుంబ సభ్యులు లేకుండానే పోస్టుమార్టం పూర్తి చేసి, సంతకాలు పెట్టించుకుని పంపించారు. ఖమ్మం రూరల్ మండలం పల్లెగూడేనికి చెందిన ఉప్పలయ్య కుమార్తె కామాంధుడి చేతిలో దారుణ అత్యాచారానికి గురై దాదాపు నెల రోజుల పాటు మృత్యువుతో పోరాడి గురువారం కన్ను మూసిన సంగతి తెలిసిందే.(చదవండి: ఆ ఘటన మా కుటుంబానికి తీరని లోటు) ఈ క్రమంలో పోలీసులు కుటుంబ సభ్యులు లేకుండానే పోస్టుమార్టం పూర్తి చేసి హుటాహుటిన ఉస్మానియా ఆస్పత్రి నుంచి మృతదేహాన్ని తరలించారు. ఇదేంటని మీడియా ప్రశ్నిస్తే లోపల పోస్టుమార్టం నడుస్తుందని తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నించారు. పోలీసుల తీరుపై బాధితురాలి కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. -
గీసుకొండ ఘటన: పోస్ట్‌మార్టం నివేదిక
సాక్షి, వరంగల్ : రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపిన వరంగల్ జిల్లా గీసుకొండ మండలం గొర్రెకుంట బావిలో వెలుగుచూసిన తొమ్మిది మృతదేహాలకు పోస్ట్‌మార్టం పూర్తయింది. వరంగల్ ఎంజీఎంలో వైద్యులు శనివారం పోస్ట్‌మార్టం చేసి, ప్రాథమిక నివేదికను విడుదల చేశారు. ఆ తొమ్మిదిమంది నీటిలో మునిగే చనిపోయినట్లు పోస్ట్‌మార్టం నివేదికలో వెల్లడి అయింది. అలాగే బావిలో పడినప్పుడు ఎనిమిదిమంది శరీరాలపై గాయాలు ఏర్పడినట్లు తెలుస్తోంది. (పోలీసుల అదుపులో యాకూబ్.. సెల్ఫోన్లు ఎక్కడ?) మృతదేహాల నుంచి శాంపిల్స్ సేకరించి, నమునాలను ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపారు. కాగా సాయిదత్త ట్రేడర్స్‌కు చెందిన గోనె సంచులు కుట్టే గోదాం పక్కన ఉన్న బావిలో మొత్తం 9 మంది శవాలు లభ్యమైన ఉదంతం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. వీరందరి మరణానికి దారితీసిన కారణాలు ఏంటని పోలీసులు ఆరా తీస్తున్నారు. వీరందరికీ మత్తు ఇచ్చారా? లేక విష ప్రయోగం జరిగిందా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. (గీసుకొండ బావిలో 9 మృత దేహాలు) -
శవాగారం.. శోకసంద్రం
పాతపోస్టాఫీసు (విశాఖ): విషాదం వెల్లువైంది. కన్నీరు కాలువకట్టింది. ఎల్జీ పాలిమర్స్ సంఘటనలో మృతుల భౌతిక దేహాలను మార్చురీ వద్ద చూసిన బంధువుల ఆక్రందనలతో ఆ ప్రాంతం ప్రతిధ్వనించింది. ఘటనలో మృతి చెందిన మెడికో మృతదేహాన్ని గురువారం అప్పగించారు. మిగిలిన 10 మంది మృతదేహాలకు శుక్రవారం పోస్టుమార్టం నిర్వహించి వైద్యాధికారులు మృతదేహాలను వారివారి బంధువులకు అప్పగించారు. మృతుల కుటుంబాలకు చెందినవారి ఆర్తనాదాలు, శోకాలతో పోస్టుమార్టం పరిసరాలు ప్రతిధ్వనించాయి. తమ వారి మృతదేహాల కోసం ఉదయం నుంచి పోస్టుమార్టం వద్ద బంధువులు పడిగాపులు పడ్డారు. కడసారి చూసుకుందామని కన్నీళ్లతో ఎదురుచూశారు. మృతదేహాలను చూసి గగ్గోలు పెట్టారు. ♦ నాగులాపల్లి గ్రీష్మ (9) మృతదేహాన్ని చూసి తల్లి ఎలుగెత్తి శోకించింది. కూతురు బాగుందని చెప్పి చివరికి శవాన్ని అప్పగించారా అంటూ అమె కన్నీళ్లు పెట్టుకుంది. గ్రీష్మ అన్న పార్ధు కేజీహెచ్‌లో చికిత్స పొందుతున్నాడు. ♦ గండిబోయిన కుందన శ్రియ (6) మృతదేహాన్ని చూసి తల్లి శోభ స్పృహ కోల్పోయింది. ఆమె అన్న శ్రీకర్ కేజీహెచ్‌లో చికిత్స పొందుతున్నాడు. ♦ నేమర్తి నాని (30) కూలిపనులు చేసేవాడు. అతడి భార్య లక్ష్మి మార్చురీ వద్ద రోదించడంతో అందరి కళ్లు చెమర్చాయి. నాని తల్లి అప్పలనర్సమ్మకు విషయం తెలియకుండా బంధువులు జాగ్రత్త పడ్డారు. ♦ మృతురాలు రావాడ నారాయణమ్మ (45) భర్త సత్యవంతుడు విజయనగరం జిల్లా కల్లేపల్లిలో వ్యవసాయకూలీ. లాక్డౌన్ వల్ల అక్కడే ఉండిపోవడంతో మృతదేహాన్ని బంధువులు తీసుకెళ్లారు. ♦ శివకోటి గోవిందరాజులు (33) పాలిమర్స్ కంపెనీలోనే కార్పెంటర్‌గా విధులు నిర్వర్తిస్తున్నాడు. అతడి మృతదేహాన్ని తీసుకువెళ్లేందుకు తల్లిదండ్రులు వచ్చారు. ♦ ఎండోమెంట్లో రిటైర్డ్ ఈవో మేకా కృష్ణమూర్తి (73) మృతదేహాన్ని తీసుకువెళ్లేందుకు అతడి అల్లుళ్లు వచ్చారు. ♦ మరణించిన యలమంచిలి అప్పలనర్సమ్మ (45)కు భర్త పైడిరాజు, కుమారులు వెంకటేష్, రమేష్ ఉన్నారు. వీరంతా వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ♦ నూతిలో పడి చనిపోయిన సిహెచ్.గంగరాజు (40) భవన నిర్మాణ కార్మికుడు. భార్య నాగమణి, ఇద్దరు పిల్లలు కేజీహెచ్‌లో చికిత్స పొందుతున్నారు. సోదరుడు సన్యాసిరావు అన్న మృతదేహాన్ని తీసుకువెళ్లాడు. ♦ మృతుడు పిట్టా శంకరరావు (46) భవననిర్మాణ కార్మికుడు. బంధువులు మృతదేహాన్ని తీసుకువెళ్లారు. ♦ దుర్ఘటనలో మరణించిన అన్నెపు చంద్రమౌళి (19) వైద్య విద్యార్థి. గురువారం రాత్రి పోస్ట్‌మార్టం అనంతరం మృతదేహాన్ని శ్రీకాకుళం తరలించారు. -
నిందితుల మృతదేహాలకు నేడు రీ పోస్టుమార్టం
-
నేడు ‘దిశ’ నిందితుల రీ పోస్టుమార్టం
సాక్షి, హైదరాబాద్: చటాన్‌పల్లి ఎన్కౌంటర్లో మరణించిన ‘దిశ’అత్యాచార నిందితుల మృతదేహాలకు సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రి మార్చురీలో సోమవారం రీ పోస్టుమార్టం నిర్వహించనున్నారు. హైకోర్టు ఆదేశాల మేరకు ఢిల్లీలోని ఆలిండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్)కు చెందిన ముగ్గురు సీనియర్ ఫోరెన్సిక్ వైద్యులు ఆదివారం నగరానికి చేరుకున్నారు. ఈ బృందం లో ఎయిమ్స్ ఫోరెన్సిక్ అధిపతి డాక్టర్ సుధీర్ గుప్తా, డాక్టర్ ఆదర్శ్ కుమార్, డాక్టర్ అభిషేక్ యాదవ్ ఉన్నారు. వారికి సహాయకుడిగా డాక్టర్ వరుణ్ చంద్ర వ్యవహరిస్తారు. ఈ బృందం సోమ వారం ఉదయం 9 గంటలకు రీ పోస్టుమార్టం ప్రక్రియ ప్రారంభిస్తుంది. ఈ ప్రక్రియ మొత్తాన్ని వీడియోలో చిత్రీకరిస్తారు. నాలుగు మృతదేహాలకు రీ పోస్టుమార్టం పూర్తి చేసేందుకు సుమారు 6 గంటల సమయం పట్టనుంది. రీ పోస్టుమార్టం ముగిసిన వెంటనే సాయంత్రం 4 గంటలకు నివేదికతోపాటు వీడియో దృశ్యాలను పెన్‌డ్రైవ్‌లో కోర్టుకు అందించేందుకు తగిన ఏర్పాట్లు చేపట్టా రు. రీ పోస్టుమార్టం ముగిసిన తర్వాత మృతదేహాలను సంబంధిత కుటుంబసభ్యులకు అందించేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. మృతదేహాలను స్వగ్రామాలకు తీసుకువెళ్లేటప్పటికే రాత్రి అవుతుందని, అప్పుడు అంత్యక్రియలు జరిపే అవకాశం ఉండదని కుటుంబ సభ్యులు తెలిపితే రీ పోస్టుమార్టం చేసిన మృతదేహాలను మళ్లీ మార్చురీలోనే భద్రపరిచి, మంగళవారం ఉదయం అందజేస్తామని గాంధీ ఆస్పత్రి సూపరింటెండెంట్ శ్రవణ్‌కుమార్ తెలిపారు. దిశ అత్యాచార నిందితుల మృతదేహాలకు పోస్టుమార్టం నిర్వహిస్తున్న సమయంలో, ఇతర మృతదేహాలకు చేయాల్సిన పోస్టుమార్టం ప్రక్రియ చేపట్టకూడదని నిర్ణయం తీసుకున్నారు. కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు.. గాంధీ మార్చురీ వద్ద ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టారు. నార్త్‌జోన్ డీసీపీ కల్మేశ్వర్ సింగనవార్ నేతృత్వంలో గోపాలపురం ఏసీపీ వెంకటరమణ ఆధ్వర్యంలో చిలకలగూడ సీఐ బాలగంగిరెడ్డి భద్రతా ఏర్పాట్లు చేపట్టారు. ముగ్గురు సీఐలు, ఆరుగురు ఎస్ఐలు, సుమారు వంద మంది కానిస్టేబుళ్లు, మహిళా కానిస్టేబుళ్లు, హోంగార్డులతో గాంధీ మార్చురీ వద్ద మూడంచెల భద్రత ఏర్పాటు చేశారు. -
మహబూబ్‌నగర్ ఆస్పత్రి వద్ద క్షణం క్షణం ఉత్కంఠ
సాక్షి, మహబూబ్‌నగర్: క్షణం క్షణం ఉత్కంఠ భరితం. కుయ్... కుయ్ అంటూ మహబూబ్‌నగర్ జిల్లాస్పత్రికి చేరుకుంటోన్న అరగంటకో వాహనం.. ఏ వాహనంలో ఎవరు..? ఎప్పుడొస్తున్నారో తెలియదు. ప్రతి వాహనంలో వస్తున్న పోలీసు అధికారులకు స్థానిక డీఎస్పీ, ఇతర అధికారుల సెల్యూట్. గేటు ముందు వాహనాలు నిలిపి.. ఆస్పత్రిలోకి వెళ్లిన అధికారులు. కొందరు ఫోరెన్సిక్ నిపుణులంటే.. ఇంకొందరు ఇంటెలిజెన్స్ అధికారులని పోలీసుల చర్చలు. ఆస్పత్రి చుట్టూ భారీగా మోహరించిన పోలీసులు. ఇంతకు జిల్లాస్పత్రిలో ఏం జరుగుతుందో అనే ఉత్కంఠతో ఆస్పత్రి పరిసర ప్రాంతాల్లో గుమికూడిన జనం..! జిల్లా ఆస్పత్రి వద్ద జనం ఎన్కౌంటర్లో చనిపోయిన ‘దిశ’ నిందితుల మృతదేహాల కోసం ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4.40గంటల వరకు తీవ్ర ఉత్కంఠతో ఎదురుచూసిన పోలీసులు. సాయంత్రం 6 గంటల ప్రాంతంలో నిందితుల మృతదేహాలకు పూర్తయిన పోస్టుమార్టం. ఇదీ మహబూబ్‌నగర్ జిల్లాస్పత్రి ముందు శుక్రవారం ఉదయం 10 గంటల నుంచి రాత్రి 7గంటల వరకు నడిచిన హైడ్రామా. ఎన్కౌంటర్లో చనిపోయిన ‘దిశ’ నిందితుల పోస్టుమార్టం ఉమ్మడి జిల్లా పోలీసులకే కాదూ హైదరాబాద్ నుంచి వచ్చిన పోలీసు అధికారుల కంటిమీద కునుకు లేకుండా చేసింది. ఎప్పుడు ఏమవుతుందో అనే ఉత్కంఠతో పోలీసులు అత్యంత జాగ్రత్తతో విధులు నిర్వర్తించారు. అక్కడా..? ఇక్కడా..? రంగారెడ్డి షాద్‌నగర్ చటాన్‌పల్లిలో జరిగిన ఎన్కౌంటర్లో చనిపోయిన ‘దిశ’ నిందితుల మృతదేహాలకు మహబూబ్‌నగర్ జిల్లాస్పత్రిలోనే పోస్టుమార్టం నిర్వహిస్తారని ప్రసార మాద్యమాల్లో తెలుసుకున్న పాలమూరు ప్రజలు మధ్యాహ్నం 12గంటల ప్రాంతంలో పెద్ద ఎత్తున జిల్లాస్పత్రికి చేరుకున్నారు. దీంతో అప్పటికే అక్కడికి చేరుకున్న జిల్లా ఎస్పీ రెమా రాజేశ్వరి.. ఇద్దరు డీఎస్పీల ఆధ్వర్యంలో ఆస్పత్రిలో సుమారు వంద మంది పోలీసులతో గట్టిబందో బస్తు ఏర్పాటు చేశారు. అనంతరం పోలీసు కార్యాలయానికి వెళ్లిపోయారు. ఎస్పీ ఆదేశాల మేరకు ప్రధాన ద్వారం నుంచి పోస్టుమార్టం వరకు ఉన్న మార్గాన్ని తమ ఆధీనంలో పెట్టుకున్న పోలీసులు ఎవరినీ అటు వైపు వెళ్లనీయలేదు. రెండు గంటల ప్రాంతంలో నిందితులకు ఎన్కౌంటర్ స్థలంలోనే పోస్టుమార్టం నిర్వహిస్తారనే ప్రచారం జరిగింది. దీంతో పోలీసులు కాస్త ఊపిరిపీల్చుకున్నారు. మృతుల తల్లిదండ్రులను ఓదారుస్తున్న వనపర్తి ఎస్పీ అపూర్వరావు సాయంత్రం 3.10 గంటలకు జిల్లాస్పత్రికి చేరుకున్న ఎస్పీ మృతదేహాలను మహబూబ్‌నగర్‌కే తీసుకువస్తున్నారని.. అందరూ సిద్ధంగా ఉండాలని పోలీసులను అప్రమత్తం చేశారు. ఇదే క్రమంలో ఉదయం నుంచి అప్పటి వరకు ఆస్పత్రిలో నెలకొన్న పరిస్థితులు, మృతదేహాలు వస్తే ఏవైనా శాంతిభద్రతలు తలెత్తుతాయా..? అలాంటి పరిస్థితి రాకుండా ఇంకేం చేద్దామని డీఎస్పీలతో చర్చించారు. 3.40 గంటల ప్రాంతంలో ఆస్పత్రి ప్రాంగణంలో ఉన్న సాధారణ జనంతో పాటు మీడియాను సైతం ప్రధాన గేటు బయటికి పంపించేశారు. ఆస్పత్రి అంతా పోలీసుల హడావిడి మొదలవడం.. మీడియా రోడ్డుపైకి రావడంతో ఆ మార్గాన వెళ్లే జనం ‘దిశ’ నిందితుల మృతదేహాలను చూసేందుకు ఆగింది. దీంతో తేరుకున్న పోలీసులు ఆస్పత్రి పరిసర ప్రాంతాల్లో గుమికూడిన జనాన్ని బలవంతంగా అక్కడ్నుంచీ పంపించేశారు. సుమారు 40మీటర్ల వరకు పోలీసులు పహారాగా నిలిచారు. మరోవైపు పోస్టుమార్టం నిర్వహించే సమయంలో జిల్లాకు చెందిన వైద్యులను పోలీసులు అనుమతించలేదు. -
పోస్టుమార్టం చేయకుండానే పంపించేశారు
సాక్షి, కర్నూలు : మెడికో లీగల్ కేసు నమోదై చనిపోయిన ఓ మహిళ మృతదేహానికి ఆసుపత్రి సిబ్బంది పోస్టుమార్టం చేయకుండా ఇంటికి పంపించేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఆమె ఇంటికెళ్లి మృతదేహాన్ని మార్చురీకి తీసుకొచ్చిన సంఘటన గురువారం చోటు చేసుకుంది. స్థానిక గణేష్ నగర్‌కు చెందిన వెంకటమ్మ ప్రమాదవశాత్తు కింద పడి వారం క్రితం ఆసుపత్రిలోని న్యూరో సర్జరీ విభాగంలో చేరింది. తలకు గాయం కావడంతో వైద్యులు మెడికో లీగల్ కేసు (ఎంఎల్సీ)గా నమోదు చేశారు. అయితే ఆమె చికిత్స పొందుతూ గురువారం మృతి చెందింది. న్యూరోసర్జరీ విభాగం సిబ్బంది మృతదేహాన్ని పోస్టుమారా్టనికి పంపంకుండా ఇంటికి పంపించేశారు. విషయం ఆ నోటా ఈ నోటా బయటికి పొక్కడంతో న్యూరో సర్జరీ సిబ్బంది ఆందోళన చెందారు. ఆసుపత్రి స్వీపర్‌ను మృతురాలి ఇంటికి పంపించారు. అయితే ఎంఎల్సీ విషయం తెలియకుండా వార్డు సిబ్బంది ఎలా మృతదేహాన్ని ఇంటికి పంపిస్తారని తిట్టి పంపించారు. విషయం తెలుసుకున్న ఆసుపత్రి అవుట్ పోస్టు పోలీసులు మృతురాలి ఇంటికెళ్లి కుటుంబసభ్యులతో మాట్లాడి మృతదేహాన్ని ఆసుపత్రిలోని మార్చురీకి తరలించారు. -
కోడెల మృతదేహానికి పోస్ట్‌మార్టం పూర్తి
సాక్షి, హైదరాబాద్ : టీడీపీ సీనియర్ నేత, మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు అంత్యక్రియలు మంగళవారం నర్సరావుపేటలో జరగనున్నాయి. మరోవైపు కోడెల మృతదేహానికి ఉస్మానియా ఆస్పత్రిలో పోస్ట్‌మార్టం పూర్తియింది. ఇద్దరు ప్రొఫెసర్లు, ఓ అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్ట్‌మార్టం నిర్వహించగా, ఈ ప్రక్రియను పోలీసులు వీడియో రికార్డు చేశారు. అలాగే కోడెల మృతదేహాన్ని ఫోరెన్సిక్ బృందం పరిశీలించగా, ఆయన చెవుల దగ్గర నుంచి గొంతు మీదగా ఉరి వేసుకున్నట్లు గుర్తులు ఉన్నట్లు వెల్లడించారు. ఎన్టీఆర్ భవన్‌కు కోడెల భౌతికకాయం పోస్ట్‌మార్టం అనంతరం భౌతికకాయాన్ని పార్టీ నేతలు, కార్యకర్తల సందర్శనార్థం ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌కు తరలించారు. టీడీపీ నేతలు ట్రస్ట్ భవన్ చేరుకుని, కోడెలకు నివాళులు అర్పిస్తున్నారు. ఇవాళ రాత్రి అక్కడే ఉంచి, రేపు (మంగళవారం) ఉదయం ఆరు గంటలకు హైదరాబాద్‌లో కోడెల పార్దీవదేహంతో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు, ఆయన తనయుడు లోకష్ రోడ్డు మార్గంలో బయల్దేరనున్నారు. సూర్యాపేట, విజయవాడ మీదగా మధ్యాహ్నం గుంటూరులోని టీడీపీ పార్టీ కార్యాలయంలో సందర్శకుల కోసం కొద్దిసేపు ఉంచి, అనంతరం నర్సరావుపేట తీసుకు వెళతారు. మరోవైపు కోడెల అనుమానాస్పద మృతిపై బంజారాహిల్స్ ఏపీసీ ఆధ్వర్యంలో సిట్ ఏర్పాటు అయింది. సిట్ బృందం కోడెల నివాసంలో తనిఖీలు నిర్వహించి, ప్రత్యక్ష సాక్షులు, సెక్యూరిటీ, డ్రైవర్‌ను ప్రశ్నించారు. క్లూస్ టీమ్ కూడా పలు ఆధారాలను సేకరించింది. చదవండి: శివరామే తండ్రిని హత్య చేశాడని ఫిర్యాదు కోడెల మృతితో షాక్‌కు గురయ్యాను... కోడెల మరణం: క్షణక్షణం అనేక వార్తలు! కోడెల మెడపై గాట్లు ఉన్నాయి కాబట్టి: సోమిరెడ్డి కోడెల మృతిపై అనేక సందేహాలు: అంబటి కోడెల మృతిపై కేసు నమోదు కోడెల కొడుకు ఆస్పత్రికి ఎందుకు రాలేదు? కోడెలది ఆత్మహత్యా? సహజ మరణమా? సుదీర్ఘ రాజకీయ జీవితం.. అనూహ్య విషాదం! కోడెల శివప్రసాదరావు కన్నుమూత -
ఆడపిల్ల అని చంపేశారు
రాయపర్తి: రెండో కాన్పులోనూ ఆడపిల్ల పుట్టిందని గొంతులో వడ్ల గింజ వేసి రెండ్రోజుల పసిగుడ్డును చంపేశారు. ఈ ఘటన వరంగల్ రూరల్ జిల్లా రాయపర్తి మండలం కేశవాపురం శివారు ఎర్రకుంట తండాలో మం గళవారం ఆలస్యంగా వెలుగు చూసింది. తండాకు చెందిన భూక్యా సాలమ్మ, లచ్చు నాయక్‌కు నలుగురు కుమార్తెలు, కుమారుడు తిరుపతి ఉన్నారు. తిరుపతికి మమతతో వివాహం జరిపించారు. వీరికి గత ఏడాది ఆడపిల్ల పుట్టింది. ఈ నెల 4న రెండో కాన్పులోనూ మమత మళ్లీ ఆడపిల్లకు జన్మనిచ్చింది. తల్లీకూతుళ్లు క్షేమంగా ఉండటంతో వైద్యులు డిశ్చార్జి చేశారు. అయితే.. మళ్లీ ఆడపిల్ల పుట్టిందని అక్కసుతో భూక్యా సాలమ్మ, లచ్చునాయక్లు ఈ నెల 7వ తేదీన పాప గొంతులో వడ్ల గింజ వేసి చంపారు. ఎవరికీ తెలియకుండా తమ పొలంలో మృతదేహాన్ని ఖననం చేశారు. అయితే.. అసలు విషయం బయటకు పొక్కడంతో బాలల సంరక్షణాధికారి మహేందర్ రెడ్డి ఆధ్వర్యాన స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యా దు చేశారు. ఫోరెన్సిక్ నిపుణులు మృతదేహాన్ని బయటకు తీసి పోస్టుమార్టం నిర్వహించి అవశేషాలను ల్యాబ్‌కు తరలించారు. -
రెండేళ్ల తర్వాత పోస్టుమార్టం
సాక్షి, గురజాల: పురిటినొప్పులతో బాధపడుతూ రెండేళ్ల కిందట గురజాలలోని శ్రీకాంత్ నర్సింగ్ హోంలో తల్లీబిడ్డ మృతి చెందారు. మృతురాలి తల్లిదండ్రులు తమ బిడ్డకు అప్పట్లో సరైన వైద్యం అందించడంలో డాక్టర్ నిర్లక్ష్యంగా వ్యవహరించారని... అందువల్లే తల్లీబిడ్డ మృతి చెందారని ఇటీవల రాష్ట్ర మానవహక్కుల కమిషన్, ముఖ్యమంత్రి కార్యాలయంతో పాటు పోలీసు, ఇతర ప్రభుత్వ శాఖలకు ఫిర్యాదు చేశారు. మాడుగుల గ్రామానికి చెందిన గనిపల్లి శ్యామ్ రెండో కుమార్తె మాచర్ల శిరీషా రెండోసారి గర్భం దాల్చడంతో 2017 మే నెల 26వ తేదీన గురజాల శ్రీకాంత్ నర్సింగ్ హోంలో చేర్పించారు. వైద్యం చేసే క్రమంలో తల్లీ బిడ్డ మృతి చెందారు. అనంతరం అంత్యక్రియలు నిర్వహించిన కుటుంబసభ్యులు మృతదేహాలను మాడుగుల శ్మశానవాటికలో పూడ్చిపెట్టారు. అప్పట్లో బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేయలేదు. ప్రస్తుతం 10 రోజుల నుంచి మృతురాలి కుటుంబీకులు మాచర్ల శిరీషా, ఆమెకు పుట్టిన బిడ్డ మరణంపై అనుమానం ఉందని ఫిర్యాదులు చేశారు. దీంతో సీఐ ఓ.దుర్గాప్రసాద్, తహసీల్దార్ షేక్ గౌస్‌బుడేసాహేబ్ సమక్షంలో బుధవారం గుంటూరు మెడికల్ కాలేజీ నుంచి వచ్చిన ఫోరెన్సిక్ నిపుణులు డాక్టర్ రమేష్‌బాబు, డాక్టర్ శివకామేశ్వరావు తల్లీబిడ్డ ఖననం చేసిన చోటు తవ్వకాలు చేపట్టి పోస్టుమార్టం నిర్వహించారు. అనంతరం వివరాలను నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఎస్ఐ బాలకృష్ణ, రెవెన్యూ, పోలీస్ సిబ్బంది, మృతురాలి బంధువులు పాల్గొన్నారు. -
జ్యోతి మృతదేహానికి రీపోస్టుమార్టం
సాక్షి, గుంటూరు: అమరావతిలో ప్రేమ జంట శ్రీనివాస రావు- జ్యోతిపై జరిగిన దాడి కేసు విచారిస్తున్న పోలీసులు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ కేసులో పోలీసులు సరిగా విచారించడం లేదంటూ మృతురాలి కుటుంబ సభ్యులు మంగళగిరి రూరల్ పోలీస్ స్టేషన్ ఎదుట ధర్నాకు దిగిన సంగతి తెలిసిందే. అయితే దీనిపై స్పందించిన ఏఎస్పీ లక్ష్మీనారాయణ.. జ్యోతి మృతదేహానికి గురువారం రీపోస్టుమార్టం నిర్వహించనున్నట్టు తెలిపారు. పోస్టుమార్టంపై జ్యోతి కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేశారని చెప్పారు. పోస్టుమార్టంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులపై చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. హత్యకేసులో నిర్లక్ష్యంగా వ్యవహరించిన సీఐ బాలజీని సస్పెండ్ చెస్తామని ప్రకటించారు. గత సోమవారం రాత్రి తాడేపల్లి పట్టణంలోని మహానాడు రోడ్డుకు చెందిన చుంచు శ్రీనివాసరావు, అంగడి జ్యోతిలపై గుర్తు తెలియని దుండగులు దాడి చేశారు. ఈ దాడిలో యువతి జ్యోతి మృతి చెందగా.. శ్రీనివాసరావు ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. -
చితి నుంచి.. పోస్టుమార్టంకు
ముజఫర్‌నగర్: చితిపై దహనమవుతున్న మృతదేహన్ని పోలీసులు పోస్ట్‌మార్టంకు తరలించిన ఘటన ఉత్తరప్రదేశ్‌లో చోటుచేసుకుంది. ముజఫర్‌నగర్ జిల్లాలోని గోథానా గ్రామానికి చెందిన 50 ఏళ్ల మహిళ మరణించడంతో కుటుంబ సభ్యులు దహన సంస్కారాలకు ఏర్పాట్లు చేశారు. అయితే మహిళను అత్తింటివారే చంపారని ఆమె సోదరుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు చితిపై కాలుతున్న మృతదేహన్ని తీసి పోస్ట్‌మార్టంకు పంపించారు. మహిళ భర్త విజయ్‌పాల్‌తో పాటు మరో నలుగురుపై కేసు నమోదు చేశామని, నిందితులు అందరూ పరారీలో ఉన్నారని పోలీసు అధికారి అమర్దీప్ లాల్ తెలిపారు. -
కిరాయి
ఆ రోజు నా ఆటోతో దూరప్రాంతం కిరాయికి వెళ్ళాను. డ్రాపింగ్ మాత్రమే, వెయిటింగ్ లేదు. మనసంతా ప్రశాంతంగా ఉంది. లోకల్ ఆటోస్టాండ్‌లో ఉంటే పొద్దస్తమానం గడబిడే. సీరియల్ ఎప్పుడొస్తుందో తెలియదు. కడుపులో ఆకలి చచ్చిపోతుంది. అసలు ఆటోవాళ్ళ బతుకే ఓ విచిత్ర యుద్ధం. విపక్షమైన ఆర్టీసీ వాళ్ళతోనే కాక స్వపక్షమైన ఆటోవాళ్ళతోనూ పోరాడాలి. పొద్దస్తమానం పైచేయి సాధిస్తేనే చేతిలో చిల్లిగవ్వలుంటాయి. ఇక బ్రేక్ ఇన్స్పెక్టరొక పద్మవ్యూహం. చిక్కకపోతే సంతోషిస్తాం, చిక్కితే చితికిపోతాం. రోడ్ ట్యాక్స్‌లతో పాటు అనధికార ట్యాక్‌లు సైంధవుల్లాంటి ట్రాఫిక్ కానిస్టేబుళ్ళకు కట్టాలి. ఆటో విడి పరికరాల ధరలు విరుగుడులేని విషంలా మంటపెడుతుంటాయి. ఏ ఆటోవాడైనా అత్యాచారం కేసులో ఇరుక్కున్నాడని టీవీలో కనబడితే చాలు అనుమానపు చూపులు, అవమానపు మాటలు ఎదుర్కోవాలి. ఆ మధ్యాహ్నం పాసింజర్లను దింపేసి రోడ్డుపక్క తోపుడు బండి దగ్గర టీ తాగుతూ వెనక్కి వెళ్ళేటప్పుడు కూడా పాసింజర్లు ఫుల్‌గా తగలాలని కోరుకుంటుండగా నాకు వినబడిందా వాక్యం. ‘అయ్యా కిరాయికొస్తావా?’ తిరిగి చూస్తే ముసలావిడ. బలం కోల్పోయిన ఒంటితో బక్కగా బొమికల బొమ్మలా ఉంది.‘ఎంతమంది?’ ఉత్సాహంగా అడిగాన్నేను.శవాన్ని తీసుకెళ్ళాలి బలహీనమైన గొంతుతో చెప్పిందామె.శవం అనగానే జంకినా జవసత్త్వాలు తెచ్చుకున్నాను. కొన్నిసార్లు నిర్ణయానికి ఈ జన్మ కూడా చాలదు, కొన్నిసార్లు మాత్రం సెకను చాలు.‘పదండి’ అని ఆటోస్టార్ట్ చేసి ధర్మాసుపత్రికి పోనిచ్చాను. మామూలుగా వంద రూపాయలు తీసుకునేది, శవం అంటే వెయ్యవుతుంది. కిరాయి రెండువేలకి ఒప్పుకుంది.మా ఆవిడెప్పుడూ దెప్పి పొడుస్తుంది.‘ఆ అరవిందన్నయ్యను చూడండి. చేతికి బ్రాస్లెట్ చేయించుకున్నాడట! వాళ్ళావిడకు నెక్లెస్ చేయిస్తానన్నాడట! మీరూ ఉన్నారు.ఎందుకూ? ఎప్పుడూ ఆ ఐదొందలే తెస్తుంటారు’ అని ఎప్పుడూ దీర్ఘాలు తీస్తుంది.అరవింద్ గాడు నా ఫ్రెండ్ అండ్ అంబులెన్స్ డ్రైవర్ .నెలరోజుల క్రితం నేను ఆటో కొన్నప్పుడే చెప్పాడు. ‘అసలే నువ్వు మెతక మనిషివి.పాసింజర్లు ఎంతిచ్చినా తీసుకుంటావు. డిమాండ్ చెయ్యాల్రా, దబాయింపు కావాల్రా. నా అనుభవాలే ఇప్పుడు నీ అనుభవాలుగా చేసుకో’ అని రోజంతా క్లాస్ పీకాడు.ధర్మాసుపత్రి దగ్గరకొచ్చాం. మాకు ముందే ఆసుపత్రికి అంబులెన్స్‌లో యాక్సిడెంట్ కేసొకటి వచ్చింది. చెయ్యి విరిగిన తను మిన్ను విరిగి మీద పడ్డట్టు అరుస్తున్నాడు. డాక్టర్ గారు లేరు. ఎప్పుడొస్తారో తెలియదని నర్సు ప్రథమ చికిత్స మొదలెట్టింది. డాక్టరుకో ప్రైవేటు హాస్పిటల్ ఉందని తరువాత తెలిసింది నాకు. హాస్పిటల్ కి మూలన మార్చురీ రూమ్, పక్కన పోస్ట్ మార్టమ్ రూమ్ దగ్గర బయట పడుకోబెట్టి ఉందో కుర్రాడి శవం. కొంచెం దూరంగా కానిస్టేబుల్ కూర్చున్నాడు. ఆటో దిగి ముసలావిడ గబగబా నడుస్తూ ఆ శవం దగ్గరికెళ్ళి తన కొంగుతో కుర్రాడి శవం మీద ఈగల్ని తోలూతూ కుర్చుంది. నేను కానిస్టేబుల్ దగ్గరికెళ్ళి నమస్తే చెప్పి ఈ దారుణం ఎలా జరిగిందో ఎంక్వైరీ మొదలెట్టాను.ఈ కుర్రాడు కరంటు లైన్ మేన్ దగ్గర హెల్పర్. విద్యుత్ స్టేషన్లో లైన్ కటింగ్ తీసుకుని స్తంభం మీద కరంటు ఆపించి ఈ కుర్రాణ్ణి రిపేర్ నిమిత్తం స్తంభం పైకి ఎక్కించారు. ఆపరేటర్లు డ్యూటీలు మారి ఆ వచ్చిన ఆపరేటర్ కరెంటు లైన్ ఆన్ చేసాడు. ఈ కుర్రాడు స్తంభం మీదే గిలగిలలాడి చచ్చిపోయాడు. కేసు ఫైలయ్యింది. పోస్ట్ మార్టమ్ చెయ్యాలి అని ఏదో సర్వసాధారణ విషయంలా చెప్పాడు కానిస్టేబుల్. సాయంత్రమవుతోంది. చెయ్యి విరిగిన యాక్సిడెంట్ కేసు అప్పటిదాకా అరిచి నొప్పి అలవాటయ్యి ఊరుకున్నాడు. వ్యవస్థ మీద విరక్తితో కూడిన నవ్వొకటొచ్చింది. ఇక్కడ ఈవిడ్ని పట్టించుకున్న వాళ్ళు లేరు, పలకరించిన వాళ్ళు లేరు. ధర్మాసుపత్రుల్లో ధర్మం లేదు. డబ్బు అనే ధనాత్మక శక్తి మనదగ్గరుంటే కార్పొరేట్ హాస్పిటళ్ళు కార్పెట్లు తెరచి మరీ వాళ్ళ ధర్మాన్ని నిర్వర్తిస్తారు. చీకటి చిక్కగా మారుతుంది. ఆలస్యమవుతున్న కొద్దీ నాకు ఆనందంగా ఉంది. వెయిటింగ్‌తో నా కిరాయి మరింత పెరుగుతుంది. ఆవిడ వైపు నడిచాను. కిరాయి మూడు వేలని చెప్పాను. తనలో తానే కుమిలిపోతూ కన్నీరు పెట్టుకుందావిడ. నేను కరిగిపోతున్నా లేని కాఠిన్యాన్ని తెచ్చుకున్నాను. ఆటోవాళ్ళ కాలగమనంలో ఇలాంటివి కోకొల్లలు.అర్ధరాత్రప్పుడు పోలీస్ జీపొచ్చింది. కానిస్టేబుల్ జీప్ దగ్గరకు పరిగెత్తాడు. ఏవో కాగితాలు తెచ్చి ఆవిడతో వేలిముద్రలు వేయించుకున్నాడు. డాక్టర్ పోస్ట్‌మార్టమ్ చేసిన తరువాత శవాన్ని తీసుకెళ్ళాలన్నాడు. బతికే ఉన్న కొడుకుని కత్తులతో కోస్తారేమోనన్న భ్రాంతిలాంటి భయంతో ఆమె పోస్ట్‌మార్టమ్ వద్దని వేడుకుంది. చట్టం తమ చుట్టమే కాబట్టి పోస్ట్‌మార్టమ్ చెయ్యకుండానే చేశారన్న డాక్టర్ రిపోర్టుకు తాము ఒప్పుకోడానికి పదివేలిమ్మన్నాడు. అంత ఇచ్చుకోలేమని వ్యధాభరిత çహృదయంతో చెప్పిందావిడ. బేరసారాలు సాగించి కానిస్టేబుల్ ఐదువేలకి తేల్చి, డబ్బు తీసుకుని జీపు దగ్గరికెళ్ళాడు. ఇప్పుడు నేను కూడా కిరాయి తేల్చుకోవాలి. అరవింద్ పాఠాలు నా చెవుల్లో మార్మోగుతూనే నేనే అరవిందయ్యాను. ఆటో కిరాయి నాలుగు వేలు ఇమ్మని, ఇష్టం లేకపోతే వెయిటింగ్ ఛార్జీ మూడువేలివ్వండి వెళ్ళిపోతానన్నాను. ఆమె విలవిలలాడినట్టు కనిపించింది. జీవనోపాధి కోసం జంతువులా ప్రవర్తించాననిపించింది. మాటల మంత్రాలతో మమేకమై మానవత్వాన్ని మరిచిపోయానా! ఆవిడేదో అనబోయింది. అరవింద్ నాలో పూర్తిగా పరకాయ ప్రవేశం చేశాడు. మళ్ళీ నాలో పశుత్వం పైకొచ్చింది. ససేమిరా కుదరదన్నాను. ఆవిడ మౌనంగా తల దించుకుంది. రాత్రి పరిగెడుతోంది. ఆవిడ కళ్ళకు కునుకు రావట్లేదు, కన్నీళ్ళొస్తున్నాయి. అరవింద్ గాడింట్లో కొన్న ఎల్ఈడీ టీవీని చూసి మా కాలనీ మొత్తం ఎంత గొప్పగా చెప్పుకుందో! డబ్బుని మాత్రమే మనిషికి ప్రామాణికంగా చూస్తుందీ లోకం. ఆకలి కంటే గొప్ప శత్రువు, డబ్బుకంటే గొప్ప మిత్రుడు లేరు. డబ్బువల్ల వచ్చే సుఖాలు తలుచుకుంటుంటేనే ఎంత సుఖంగా ఉందో! ఆ సుఖాలే అందమైన జ్ఞాపకాలుగా మారతాయి. లేకపోతే బతుకంతా ఓ పీడకలే. సుషుప్తిలో నిద్రపోతున్న కోరికలు ఒళ్ళు విరుచుకుని లేచి నిలబడ్డాయి. కోరికల కొలిమిలో కాలిపోతున్నాను. రోజుకు ఐదొందలు సంపాదించే నేను ఇప్పుడు నాలుగు వేలు సంపాదించబోతున్నాను. ఆ డబ్బు మా ఆవిడకిస్తే ఎంత సంబరపడుతుందో! ఇది విని అరవింద్ గాడు నన్నెంతలా అభినందిస్తాడో! అన్న ఆలోచనలతో, ఆనందంతో ఆ రాత్రి ఆవిడతో పాటు నేనూ నిద్రపోలేదు.తెల్లవారుఝూమున ఇద్దరు వ్యక్తులొచ్చారు. డాక్టర్లకి పోస్ట్‌మార్టమ్ హెల్పర్లమని చెప్పారు. చెరో ఐదొందలివ్వండి. మందు వెయ్యకపోతే ఈ శవాన్ని పోస్ట్‌మార్టమ్ రూమ్ కి తీసుకెళ్ళలేం అని అదో ఆనవాయితీగా చెప్పారు. నేనామె వైపు వకాల్తా పుచ్చుకుని పోస్ట్‌మార్టమ్ వద్దని పోలీసులకు డబ్బులిచ్చాంగా అని నిద్రపోతున్న కానిస్టేబుల్ వైపు చూశాను. ‘పోలీసుల వాటా వేరు, డాక్టర్ల వాటా వేరు. ఇంతకు మించి మీకు చెప్పక్కర్లేదనుకుంటా’ అని తల్లిదండ్రుల ఆస్తిని పిల్లలు పంచుకోవడం సహజం అన్నట్టు చెప్పాడు అందులో ఒకాయన. ఆవిడను మభ్యపెట్టి వాళ్ళు మద్యానికి డబ్బులు పట్టుకుపోయారు. తూర్పుకి తొలి వెలుగు తగిలింది. సూర్యుడు కూడా ఈమెను బాధ పెట్టడానికే వస్తున్నట్టు నాకనిపించింది. చాలాసేపటి తరువాత ఇందాకటి జంటలో ఒకాయన మళ్ళీ వచ్చాడు. డాక్టర్ తరపున వాదానికి దిగాడు. పోస్ట్ మార్టమ్ చెయ్యకుండానే రిపోర్ట్ ఇచ్చేయడానికి పెద్ద మొత్తం అడిగాడు. ఆవిడ భయపడిపోయింది. అంత ఇచ్చుకోలేనని బతిమాలింది. కొంత ఇచ్చుకుంటానని బేరమాడింది. చివరికి పోలీసులకిచ్చినంత ఫైనలయ్యింది. డబ్బు తీసుకెళ్ళి కాగితాలు తీసుకొచ్చి ఈవిడ వేలిముద్రలు వేయించుకుని శవాన్ని తీసుకెళ్ళొచ్చన్నాడు. తను వెళ్ళిపోయాడు. తన పని కూడా అయిపోయినట్టు పోలీసూ వెళ్ళిపోయాడు. నేను,ఆమె,శవం మిగిలాం. శవాన్ని ఆటోలో పెట్టడానికి సాయం పట్టడానికి కూడా ఆమెకి ఎవరూ లేరు. సహాయం లేని బాధామయ జీవితం. ఒంటరితనం, నిస్సహాయత బాధను అనేక రెట్లు పెంచుతాయి. సానుభూతి చూపించడానికి దేశంలో 130 కోట్లమంది ప్రజలున్నారు, సాయం చెయ్యడానికి మాత్రం ఒక్కడూ లేడు. శవం చుట్టూ దుప్పటి చుట్టి ఆటోలో పెట్టడానికి సహాయం చేశాను. ఆమె కళ్ళతో కృతజ్ఞతా భావం చూపింది.నాలుగ్గంటల్లో గమ్యం చేరతాం. ఉదయం తొమ్మిదయ్యింది. త్వరగా టీ తాగి త్వరత్వరగా ఇంటి ఆదుర్దాతో ఆటోస్టార్ట్ చేశాను. శవమైన కుర్రాడి తలను ఆమె ఒడిలో పడుకోబెట్టుకుని కూర్చుంది. రెండు గంటల ప్రయాణం తరువాత బైపాస్ లో పెద్ద ధర్నాతో ట్రాఫిక్ జామ్ లో ఇరుక్కున్నాం. కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. పైన ఎండ మాడ్చేస్తుంది, లోపల ఆకలి దంచేస్తుంది. అదే అదనుగా హోటల్ కెళ్ళి భోంచేసి వచ్చాను. ఆటోలో మాత్రం ఒళ్ళో నిద్రపోతున్న పిల్లాడికి నిద్రాభంగం అవుతుందేమోనని కాళ్ళు కదల్చకుండా ఉన్న ఆమెని చూశాను. ఒళ్ళు గగుర్పొడిచింది. ఎండ వేడిమికి ఆమె ఒళ్ళంతా వర్షధారల్లా చెమట. నా ఊహ నిజమే, సూర్యుడు కూడా ఆమెను హింసిస్తున్నాడు. నాకు తెలిసి ఆమె నిన్న మధ్యాహ్నం అన్నం మెతుకు ముట్టినట్టు నేనెరుగను. అన్నం తినమని అడిగాన్నేను. తల అడ్డంగా ఊపింది. అసలు ఆమె మనలో లేదు. నా అజ్ఞానానికి నవ్వొచ్చింది. నిజానికి అమ్మ కడుపు తృప్తిగా నిండేది బిడ్డ భోంచేశాకే గదా! ఉద్యమకారుల వైపు చూశాను. అంతలోనే మట్టిపిడతలో బంధించిన భూతం బయటపడ్డట్టు నాలో అంతర్లీనంగా ఉన్న రాక్షసుడు బయటకొచ్చాడు. సాయంత్రం దాకా ధర్నా పూర్తయ్యేలా లేదు. ఆటో వెయిటింగ్ ఛార్జి ఇంకో వెయ్యి పెరుగుతుందని ఆమెతో అన్నాను. మారు మాట్లాడలేదామె. ఎవరో తప్పు చేస్తే ఆ శిక్ష ఇలాంటోళ్ళు అనుభవించాలి. సాయంత్రం మూడు గంటలకు ట్రాఫిక్ క్లియరయ్యింది. ఆమె వంక చూసాను. ఆ గుండెల్లో ధైర్యం లేదు,దిగులు మాత్రమే ఉంది.ఈ జన్మకు ఆ దిగులు పుట్టిన శరీరంలో ఆనందం ఉండదు. ఆటో అద్దంలో నుండి ఆమెని చూశాను. ఆమె చూపులు ముందుకు చూస్తున్నా లోచూపు మాత్రం ఎటో ఉంది. దేవుడ్ని క్షమించమని వేడుకున్నాను. అయినా దేవుడి గురించో, దేశం గురించో ఆలోచిస్తే మనం బతకలేం, సుఖంగా ఉండలేం అని నాకు నేను సర్దిచెప్పుకున్నాను. అణాకాసు లేనోళ్ళదెప్పుడూ అరణ్యరోదనే. వినే వాడుండడు. విన్నా ఆలోచించే వాడుండడు. ఆలోచించినా ఆదరించే వాడుండడు.అడవి గుండా ప్రయాణం.సాయంత్రం నీరెండ, నిశ్శబ్దం. మట్టి రోడ్డులో ఆటో పాకుతోంది. చాలా దూరం ప్రయాణించాక ఐదారు పాకలున్న గూడెం దగ్గర ఆటో ఆపమంది. తురాయి చెట్టున్న పాక నీడలో చిన్న అరుగు పక్కన ఒక మంచం వాల్చి వచ్చింది. ఈలోగా చుట్టుపక్కల పాకలోళ్ళు పోగయ్యి శవాన్ని మంచం మీద పడుకోబెట్టారు. శోకాలు మిన్నంటాయి. శవం చెడిపోతుండడంతో కాసేపటికే శవాన్ని దహనానికి తీసుకెళ్ళిపోయారు. ముసలావిడ్ని ఓదార్చి ఒక్కొక్కరుగా వెళ్ళిపోయారు.ఇంకో మంచం మీద కూర్చున్న నాకు నవ్వారు ముడులు గుచ్చుతున్నాయి.పేడతో అలికిన అరుగు వాసన కొడుతోంది. ఎర్రబడ్డ కళ్ళతో ముసలావిడ డబ్బులు తీసి నా చేతికిచ్చింది. లెక్కబెడితే మూడువేలొచ్చాయి. సహజత్వం గొంతును నొక్కిపడుతున్నా కృత్రిమ కోపం కట్టలు తెచ్చుకుంది. ‘ముష్టి ఏమైనా వేస్తున్నావా?’ అని గట్టిగా అరిచాను. మూడువేలు మంచం మూలకి విసిరి కొట్టాను. ఆవిడ వణికింది. ‘అడివి మీద కడుపునింపుకొనే వోళ్ళం. దయ సూపయ్యా..’ అని దీనంగా అంది.అసలేమీ లేదు అనే వాళ్ళ దగ్గరే అంతా ఉంటుందని నా అనుమానం. పిల్లల్ని పెంచే స్థోమత లేనప్పుడు కనకూడదు అన్నాను కర్కశంగా.కనిపించని కత్తేదో ఆవిడ మెడనరాలు తెంపేసినట్టు తల దించుకుంది. నెత్తిమీద నుండి స్నానం చేసినట్టు ఆవిడకు చెమటలు కారిపోతున్నాయి.కత్తికంటే కంఠ ధ్వని ఎంత దారుణంగా గాయపరుస్తుందో నాకప్పుడే తెలిసింది. అయినా నాలో అరవింద్ ఆనందపడ్డాడు. వాడి ఆనందమే కానీ ఈవిడ విషాదం నాకక్కర్లేదనిపించింది. నేను అరిస్తే ఆమె నిస్సహాయంగా ఉండడం తప్ప మారు మాట్లాడదని నాకు తెలుసు. ఆలోచించే అవకాశం ఇవ్వకూడదని అరిచినట్టు మాట్లాడడం మొదలు పెట్టాను. నాకు తెలిసి నాకంటే ముందు విధి ఈమెకు పుట్టుక నుండి మాట్లాడే అవకాశం ఇవ్వలేదనుకుంటున్నాను.కాసేపటి తరువాత ఆవిడ తలెత్తి ‘రెక్కాడితే గానీ,డొక్కాడని బతుకులు మాయి.. కనికరించయ్యా’ అని పాదాలు పట్టుకోబోయింది.నా ఆశల చెట్టు ఎవరో నరికేసినట్టు నేను దూరంగా జరిగి ‘నువ్వెన్ని నాటకాలు ఆడినా ఐదువేలకి రూపాయి తక్కువైనా తీసుకోను’ అని కుత్తుక మీద కత్తి పెట్టినట్టు చెప్పాను. ఇంకిపోయిన ఆవిడ కళ్ళ నుండి సెల ఉబుకుతోంది. పైట కొంగుతో ముఖమంతా తుడుచుకుని ఇప్పుడే వస్తానని పక్కనున్న గుడిసెల వైపుకెళ్ళింది.నాలో రాజీకి తెచ్చాననే రాక్షసత్వం చల్లబడింది. ఎక్కడో అప్పు పుట్టిందనుకుంటా... నేను విసిరేసిన మూడువేలు ఏరుకొచ్చి రెండు వేలు కలిపి వణుకుతున్న చేతులతో నా చేతిలో పెట్టింది. ఆ డబ్బును నా చేతుల్లోకి తీసుకోగానే పెద్ద సామ్రాజ్యాన్ని హస్తగతం చేసుకున్న ఆనందంతో ఆటో ఎక్కాను. చెమటకు చల్లగాలి తగిలి హాయిగా ఉంది.నెమ్మదిగా కోపంతో పాటు గుండెవేగం తగ్గింది. ‘అయ్యా పొద్దుబోయింది. అడివి మా సెడ్డది. ఈ రాతిరికి ఈడే పొడుకుని పొద్దెక్కాక పోదువు’ అంది ముసలావిడ. అదేమీ పట్టించుకోకుండా ఆటో స్టార్ట్ చేశాను. స్టార్టవలేదు. చీకటిని చూసి ఆటో భయపడ్డట్టుంది.అడవి మధ్యలో దారిలో ఎక్కడన్నా ఇలానే మొరాయిస్తే... నా పరిస్థితి తలుచుకుని నాకే భయమేసింది. ఆటో దిగి అడవిని చూశాను. చీకటిని మింగి ఆకలి తీరక నోరు తెరుచుక్కూచ్చున్నట్టుంది. ఉండిపోతానన్నాను.అరుగు మీద కూర్చున్నాను.ముసలమ్మ పక్క గుడిసెలకెళ్ళి పుట్టగొడుగులు, పచ్చి జీడి గింజలు పట్టుకొచ్చింది. ఇంట్లోంచి వెదురు బియ్యం తీసుకొచ్చి తురాయి చెట్టు కింద పొయ్యి వెలిగించింది. మంట వెలుగులో తురాయి పూలు కళ్ళెర్రజేసి నన్ను చూస్తున్నాయి.చూస్తుండగానే చలి నాలో ఆకలిలా పెరిగిపోయింది. ఒంటిమీద రెండు చెంబుల నీళ్ళు పోసుకొచ్చేసరికి దాదాపు సగం ప్రాణం పోయింది. విప్పిన బట్టలే కట్టుకుని గుడిసెలో కెళ్ళాను. పాక చూరుకు లాంతరు వేలాడుతోంది. విందులో వెలుగుకి కూడా వాటా కావాలని లాంతర్లో జ్వాల నాలుక ఆడిస్తుంది. ఆకలి మీద ఎంత తిన్నా ఆహారపు రుచికి ఆకలి చావట్లేదు. ముసలమ్మ దగ్గర కూర్చుని అన్నం మెతుకంత కోపం కూడా లేకుండా కొడుక్కి పెట్టినట్టు వద్దన్నా వడ్డిస్తోంది.మంచం మీద దుప్పటి దులిపి రగ్గూ ఇచ్చింది. నేను తినగా మిగిలిన అన్నం తిని ముసలమ్మ చీరకొంగు కప్పుకుని పడుకుంది. భుక్తాయాసం తీరాక చలి చుట్టుముట్టింది. రగ్గులో దూరి భుజాలెగరేశాక మంచానికి కొంచెం దూరంగా పడుకున్న ఆమె కనబడింది. దీపపు వెలుగులో ముడతలు పడిన ముఖంలో జీవం లేదు. ఆ దేహంలో ప్రాణముందంటే దేవుడి ముందైనా లేదనగలం. ఆ దేహంలో మానవత్వం లేదంటే దేవుడిని ఎదిరించైనా కాదనగలం. అరవింద్ , నా ఇల్లాలు నన్ను హీరో వర్షిప్ ముంచేస్తున్న దృశ్యాలు కరిగిపోతున్నాయి. నా అంతర్లీన ప్రపంచంలో ఎవరో నాటిన విత్తనాలు ఇంత బలంగా వేళ్ళూనుకున్నాయేమిటి? మాటల కాఠిన్యానికి మెరుగులు దిద్దుకుంటూ ముచ్చట పడిపోయానేమిటి?! పదిరోజుల్లో సంపాదించే డబ్బు అన్యాయంగా రెండ్రోజుల్లో జలగలా ఆమె రక్తం పీల్చి సంపాదించాను.వేడికి వెన్న తగిలినట్టు కరగడం మొదలయ్యాను.ఆమె ముఖం నేను రోజూ మొక్కే దేవత దగ్గర నా పాపపు భారం పెంచేసింది. తప్పు చేసేశాను. దిద్దుకోవాలి.నా ఆత్మ నా మీదే తిరగబడుతోంది. ప్రపంచంలో ఇంతకన్నా మనిషి మీద గొప్ప తిరుగుబాటు ఇంకొకటి ఉండదు. నా మనసు నుండి అరవిందుని తోసేశా... మేకపోతు గాంభీర్యాన్ని కూడా.ఎక్కడో మర్యాదస్తులకు దూరంగా...రాత్రిని కప్పుకున్న పాకలో... గొడ్డుచలి నుండి దూరంగా జరగడానికి కప్పుకోవడానికి ఏమీ లేని జీవిలో అమ్మను చూసినప్పుడు నాలోంచి నేను విడిపోయాను. బతికుండగానే నేను పునర్జన్మెత్తాలనిపించింది. ఓ నిర్ణయానికొచ్చాను.జీవితంలో ఇంత గొప్ప భోజనం చేసిన రోజు లేనట్టే, ఇంత గొప్పగా నిద్రపోయిన రోజు కూడా లేదు.ముసలావిడ లేచేసరికి మంచం మీద మనిషి లేడు. ఆమె ఇచ్చిన డబ్బులన్నీ మంచం మీదే ఉన్నాయి. మర్చిపోయాడేమోననుకుని వాటిని పట్టుకుని గుడిసె బయటకొచ్చింది. ఆటో కనబడలేదు.అతడు తిరిగొస్తాడనుకుని ఆమె కళ్ళు ఎదురు చూస్తూనే ఉన్నాయి. గుడిసె తడిక తెరిచే ఉంది. హంతకుల్ని కూడా అమాయకులనుకునే అమ్మతనానికి కిరాయి కట్టడానికి అతడు రాడని ఆమెకు తెలియదు. జుజ్జూరి వేణుగోపాల్ -
బెల్ట్ బిగించింది
దూరంగా పారిపోయినానేరం పారిపోనివ్వదు.చేసిన పాపం ఊరికే ఉండనివ్వదు.కెలికే మనస్సు ఆరా తీయమంటుంది. ఆ పని కాస్తా పట్టుబడేలా చేస్తుంది.అనుమానానికి మించిన అపాయం లేదు. 2005, ఫిబ్రవరి 9.ఉదయం 8:30.పోలీసు జీపు సైరన్‌తో గుమికూడిన జనాల్లో కదలిక వచ్చింది.ఆ ఇంటి ముందున్న జనం రోడ్డు వైపు తలలు తిప్పారు.జీప్ వచ్చి ఆ ఇంటి ముందాగింది. వచ్చినంత వేగంగా జీపులో నుంచి దిగిన పోలీసులు అంతే వేగంగా ఆ ఇంట్లో అడుగుపెట్టారు. ఎదురుగా కనిపించిన దృశ్యానికి కడుపులో దేవినట్టుగా అయ్యింది వాళ్లకి.ఇంకా పూర్తిగా ఆరకుండా మడుగు కట్టిన రక్తంతో ఒకలాంటి దుర్వాసన వస్తోంది.ఏడెనిమిదేళ్లుంటాయి ఆ పిల్లవాడికి. మూడు పదులు దాటిన ఓ ఆడమనిషి. ఇద్దరూ విగతజీవులుగా పడిఉన్నారు. ఒళ్లంతా కత్తిగాట్లు ఉన్నాయి. ఆ ఇద్దరినీ అతి కిరాతకంగా చంపేశారు ఎవరో! ఆ గదిలో చుట్టూ చూశారు పోలీసులు. మూలన ఓ బట్టల మూట, పాతబడిన రెండు బెడ్షీట్లు. ఓ మూలన పాత స్టౌవ్, నాలుగైదు గిన్నెలు కనిపిస్తున్నాయి.‘సార్, ఇది మా ఇల్లే సార్. నెల క్రితం ఈ గదిని ఈమెకు అద్దెకు ఇచ్చాను’ అన్నాడు గుంపులో నుంచి వచ్చిన ఓ వ్యక్తి. ‘ఆమె పేరు రేఖ. పిల్లవాడి పేరు బబ్లూ. దగ్గరలో హాస్పిటల్ బిల్డింగ్ కడుతున్నారు. దాంట్లో పనిచేసేది. పిల్లవాడు కూడా ఆమెతో పాటు తిరుగుతూండేవాడు. తనకు ఎవరూ లేరని, భర్త చనిపోయాడని చెప్పింది. పోనీలే పాపం అని గది అద్దెకు ఇచ్చాను’ అన్నాడతను. ఆంబులెన్స్, క్లూస్ టీమ్ వచ్చింది. మార్కింగ్ చేసి, శవాలను ఆంబులెన్స్‌లో తరలించారు పోలీసులు. స్టేషన్లో ఎస్సై ఆలోచనలో ఉన్నాడు.వాళ్లిద్దరిని చంపి వెళ్లిన వ్యక్తి ఎవరో తెలియడం లేదు.ఆ ఏరియాలో సిసి కెమెరాలు లేవు ఏదైనా క్లూ దొరుకుతుందనుకుంటే. దిక్కులేని వారి హత్యల కింద ఈ కేసు మరుగున పడిపోతుందా?కానిస్టేబుల్ వచ్చి పోస్ట్‌మార్టం రిపోర్ట్ ఇచ్చాడు.మెడ, ఛాతీ భాగంలో లోతైన కత్తిపోట్ల వల్ల మరణించారని ఉంది అందులో. ‘ఆ చుట్టుపక్కల వారిని అడిగాం సార్. ఏ వివరాలు తెలియలేదు. గదిలో ఏ ఆధారాలు దొరకలేదు సార్’ అన్నాడు కానిస్టేబుల్.‘ఏ ఆధారం లేకుండా నేరస్తుడు ఈ పని చేశాడంటే అతడు నేరాలు చేయడంలో ఆరితేరిన వాడై ఉండాలి. ఆ నేరస్తుడు ఎవరో.. ఎలా కనిపెట్టడం..?’ ఆలోచనలో పడ్డాడు ఎస్సై. కానిస్టేబుల్‌ను తనతో పాటు రమ్మన్నట్టు సైగ చేసి వెళ్లి జీపులో కూర్చున్నాడు. ఇద్దరూ మళ్లీ ఆ గది వద్దకు వెళ్లారు. అక్కడ ఒక్కో వస్తువును పరిశీలన గా చూశారు. గోడకు ఒక చిన్న పాత సంచి ఉంది. అందులో పిల్లవాడి బట్టలు ఉన్నాయి. గది అంతా ఒకసారి కలియతిరిగి ‘వెళ్దాం పద’.. అన్నట్టు కానిస్టేబుల్ వైపు చూశాడు ఎస్సై.కానిస్టేబుల్ బయటకు నడిచాడు. బయటకు వెళ్లబోతున్న ఎస్సైని ఒక వస్తువు ఆకర్షించింది. అది బట్టల మధ్య ఉన్న స్కూల్ బెల్ట్. తెలుపు, నీలం రంగు చారలతో ఉంది. దగ్గరగా వెళ్లి ఆ బెల్ట్‌ని తీసుకొని చూశాడు. విద్యానికేతన్ స్కూల్ అని ప్రింట్ చేసి ఉంది. ఎస్సై కోసం తిరిగి లోపలికి వచ్చిన కానిస్టేబుల్ వైపు చూస్తూ..‘ఇది స్కూల్ బెల్ట్. ఈ కేసులో ఇదే క్లూ.ఇక్కడికి దగ్గరలో ఈ పేరుతో ఏ స్కూల్ ఉందో వెరిఫై చేయ్!’ అన్నాడు.ఇద్దరూ ఆ బెల్ట్ తీసుకొని గదికి తాళం వేసి బయటకు నడిచారు. ‘సార్! ఇది మా స్కూల్‌కి సంబంధించిన బెల్ట్’ చెప్పింది స్కూల్ ప్రిన్సిపాల్.‘ఈ ఫొటోలో ఉన్న పిల్లవాడు మీ దగ్గర చదువుకుంటున్నట్టు ఎలా తెలుసుకోవచ్చు. ఈ పిల్లవాడి పేరు బబ్లూ’ వివరాలు చెప్పాడుఎస్సై బబ్లూ డెడ్‌బాడీ ఫొటో చూపిస్తూ.‘ఫైవ్ మినిట్స్ సార్! వెరీఫై చేసి చెబుతా!’ అంది ప్రిన్సిపల్.‘సార్ ఆ పిల్లవాడు మా దగ్గరే చదువుతున్నాడు. సెకండ్ క్లాస్. నెల రోజులుగా స్కూల్‌కి రావడంలేదు’ చెబుతూ రిజిస్టర్ ఎస్సై ముందుంచింది ప్రిన్సిపాల్.ఆ రిజిస్టర్లో పిల్లవాడి ఫొటో, వివరాలతో పాటు తండ్రి అని ఉన్న బాక్స్ పక్కన ఓ ఫొటో అతికించి ఉంది. పేరు బిజ్జూ అని రాసుంది.తం్రyì ఫొటోతో పాటు, ఆ రిజిస్టర్లో అడ్రస్ ఉంది. కాని అది హత్య జరిగిన ఇల్లు ఉన్న అడ్రస్ కాదు. ఆ చుట్టుపక్కల ఉన్న వేరే అడ్రస్. ఆ అడ్రస్ ఉన్న చోటును వెతుక్కుంటూ వెళ్లారు. పోచమ్మ గుడి పక్క సందు, చంపాపేట్.అక్కడ అందరికీ ఆ ఫొటో చూపించారు. ‘సార్! ఇతని పేరు బిజ్జూ. ఇళ్లకు పెయింట్లు వేస్తుంటాడు. కొడుకు, భార్యతో కలిసి ఈ కాలనీలోనే రెండేళ్లుగా ఉండేవాడు. అర్థరాత్రి తాగొచ్చి భార్య, కొడుకును కొడుతుండేవాడు.వాళ్లది బీహార్ అని, చుట్టాలు అక్కడే ఉన్నారని చెప్పేవాడు. కాని ఇప్పుడు ఆ కుటుంబం ఇక్కడ లేదు’ అన్నారు అక్కడివాళ్లు.‘ఇతనికి సంబంధించిన వివరాలు ఇంకేమైనా తెలిస్తే మాకు వెంటనే చెప్పండి’ అన్నాడు ఎస్సై.ఆ తర్వాత బిజ్జూ ఫొటోని బీహార్ పోలీస్ట్ స్టేషన్‌కి ఫ్యాక్స్ చేశారు. మరుసటి రోజు ఉదయం పోలీస్ స్టేషన్లో ఫోన్ మోగింది. ‘సార్, మీరు నిన్న వచ్చారు కదా! ఆ బిజ్జూ ఫోన్ చేశాడు. వాళ్ల బంధువులకు ఎవరికో బాగోలేదట. అందుకే బిహార్‌లో ఉన్నారట. అతని భార్య, పిల్లవాడి గురించి అడిగితే బాగున్నారు అని చెప్పాడు సార్!’ అన్నాడు ఫోన్లో సమాచారం చెప్పిన వ్యక్తి. పోలీసులు వెంటనే అలెర్ట్ అయ్యారు.ఫోన్ నెంబర్ ఆధారంగా బిజ్జూను పట్టుకున్నారు పోలీసులు. నల్లగా పొట్టిగా సిగరెట్లు తాగి తాగి నల్లబడిన పెదాలతో గుంటలు పడిన కళ్లతో అస్థిమితంగా కనిపించాడు.హైదరాబాద్ తీసుకొచ్చాక విచారణ మొదలైంది.‘చెప్పు ఎందుకు చంపావు నీ భార్యా పిల్లలను’‘నేను చంపడం ఏమిటి?’ అన్నాడతను.ఎస్సై అతని ఎదురుగా కొన్ని కాగితాలు పెట్టాడు. వాటి మీద వేలిముద్రలు ఉన్నాయి. కాని అవి ఉత్తుత్తివి అని ఎస్సైకి తెలుసు.‘నీ వేలి ముద్రలు మేచ్ అయ్యాయి.చూడు.నువ్వు తప్పించుకోలేవు’ అన్నాడు.బిజ్జూ నోరు విప్పాడు. బిజ్జూ, రేఖలది బీహార్. రేఖ పెళ్లయి పదేళ్లయ్యింది. పిల్లవాడికి ఐదేళ్ల వయసులో భర్త ప్రమాదంలో చనిపోయాడు. పుట్టింట్లో కొడుకుతో పాటు ఉండేది రేఖ. అక్కడే కొన్నాళ్లకు బిజ్జూతో పరిచయం ఏర్పడింది. హైదరాబాద్‌లో తెలిసినవారున్నారని, అక్కడ పనులు సులువుగా దొరుకుతాయని, అక్కడే బతకొచ్చని రేఖకు చెప్పాడు బిజ్జూ. ఆ మాటలను నమ్మిన రేఖ అమ్మనాన్నలను వదిలేసి కొడుకును తీసుకొని హైదరాబాద్ వచ్చింది. చంపాపేట్‌లో ఇల్లు అద్దెకు తీసుకొని ఉన్నారు. బిజ్జూ ఇళ్లకు పెయింటింగ్ వేసే పనులు చేస్తుండేవాడు. రేఖ ఇంటిపట్టునే ఉండేది. పిల్లవాడిని అదే కాలనీలో ఉండే స్కూల్లో చేర్చాడు బిజ్జూ. తండ్రి స్థానంలో తన పేరు, ఫొటో వివరాలు ఇచ్చాడు. పిల్లవాడు రోజూ స్కూల్కెళుతున్నాడు. బిజ్జూ పెయింటింగ్ పనులకు వెళుతున్నాడు.ఒకరోజు...‘అతనెవరు?’ అడిగాడు బిజ్జూ.‘ఎవరు?’ అడిగింది రేఖ.‘ఇందాక నువ్వు మాట్లాడుతున్న వ్యక్తి’‘ఏదో అడ్రస్ అడిగితే చెప్పాను’‘అబద్ధం’‘అయ్యో.. అదే నిజం’‘మగావాళ్లు కనిపిస్తే చాలు నవ్వుతూ మాట్లాడతావు’‘అది కూడా తప్పేనా?’‘నన్ను తగులుకున్నది చాలదా. ఇంకా ఎంతమందిని తగలుకోవాలనుకుంటున్నావ్?’ఫట్‌మంటూ దెబ్బ పడింది.ఆరోజున పడ్డ అనుమానం పెనుభూతం అయ్యింది. మద్యానికి అలవాటైన బిజ్జూ పగలు కూడా తాగుతూ పనులు కెళ్లడం తగ్గించాడు. నిజానికి రేఖ మీద కాపలా కోసం ఇంట్లోనే ఉండిపోసాగాడు. కాని ఇల్లు గడవాలిగా. చుట్టుపక్కల తెలిసిన వారి ద్వారా భవన నిర్మాణ కూలీగా పనులకు వెళ్లడం మొదలుపెట్టింది రేఖ. దీంతో బిజ్జూకి ఇంకా అనుమానం పెరిగింది. పని మానేయమని లేకుంటే పిల్లవాడిని చంపేస్తానని బెదిరించేవాడు. ఓ రోజు రాత్రి అన్నంత పని చేయబోయాడు. కూరగాయలు కోసే కత్తితో పిల్లవాడి మీద దాడి చేయబోయాడు. అడ్డం పడ్డ రేఖ బిజ్జూని నెట్టేసి కొడుకును తీసుకొని బయటకు నడిచింది. ఆ రోజు రాత్రి ఇంటి బయటే ఉండిపోయింది. బిజ్జూతో ఉంటే తను, తన కొడుకు బతకడం కష్టమే అనిపించింది రేఖకు. తను పనిచేసే చోట ఒకామె సాయంతో గది చూసుకొని, బిజ్జూ తాగి పడుకున్న సమయంలో కొడుకును తీసుకొని ఆ ఇంటి నుంచి బయటకు వచ్చేసింది. బిజ్జూ రేఖ కోసం వెతుకుతూనే ఉన్నాడు. ఆమె పని చేసే చోటుకి వెళ్లాడు. అక్కడ పని మానేసిందని తెలిసింది. రేఖ మరో చోట కూలీ పని చూసుకుంటూ కొడుకును పోషించుకుంటూ రోజులు వెళ్లబుచ్చుతోంది. నెల రోజుల తర్వాత ఓ రోజు రేఖ ఎక్కడ ఉందో కనిపెట్టిన బిజ్జూ ఆమెను వెంబడించాడు. రాత్రి వరకు ఆ చుట్టుపక్కలనే తిరిగాడు. చుట్టుపక్కల అంతటా సద్దుమణిగాక రేఖ ఇంట్లోకి జొరపడ్డాడు. వెంట తెచ్చుకున్న కత్తితో తల్లీ, కొడుకులిద్దరినీ చంపేసి వెళ్లిపోయాడు. కొద్దిపాటి సామాను, పిల్లవాడి బట్టలు ఇంటి నుంచి వస్తూ వస్తూ తనతో పాటు తెచ్చుకుంది రేఖ. బిజ్జూకు తెలియకుండా ఎక్కడో ఓ మూలన కొడుకుతో హాయిగా బతికేయచ్చు అనుకుంది. తనను కాదని వెళ్లిపోయి మరెవరికో సొంతమవుతుందన్న అనుమానంతో రేఖపై ద్వేషాన్ని పెంచుకున్నాడు బిజ్జూ. ఆ అనుమానంతోనే రేఖ, ఆమె కొడుకు బబ్లూను చంపేశాడు. పోలీసులకు పట్టుబడకూడదని బీహార్ వెళ్లిపోయాడు. తన గురించి పోలీసులకు తెలిసుండే అవకాశమే లేదనుకున్నాడు బిజ్జూ.కాని హైదరాబాద్‌లో పరిస్థితి ఏమిటో తెలుసుకోవడానికి మనసు ఆగక ప్రతి నేరస్తుడు చేసినట్టే వివరాల కోసం ఫోన్ చేశాడు. ఆ ఫోన్ కాల్ అతడెక్కడున్నాడో తెలుసుకునే వీలు కల్పించింది. నమ్మకం కోల్పోయిన వ్యక్తి నరకం చూపిస్తాడు నరకం అనుభవిస్తాడు ప్రస్తుతం బిజ్జూ కటకటాల వెనుక ఉన్నాడు. – నిర్మలారెడ్డి -
కళాశాలలో విషాద‘గీతిక’
తిరుపతి అర్బన్: తిరుపతిలోని ఎస్వీ ప్రభుత్వ మెడికల్ కాలేజీలో వారం రోజుల వ్యవధిలోనే ఇద్దరు మెడికోలు ఆత్మహత్య చేసుకున్న సంఘటనలు సంచలనం సృష్టించాయి. తక్కువ కాల వ్యవధిలో ఇద్దరు తనువు చాలించడంపై విస్తృత చర్చ జరుగుతోంది. వరుస సంఘటనలు జరగడంతో కళాశాలలో ఉద్విగ్న వాతావరణం ఏర్పడింది. సహచరులు సోమవారం ఆందోళన చెందా రు. విషాద వాతావరణం అలముకుంది. ప్రభుత్వం స్పందించి చర్యలు తీసుకోవాలని తిరుపతి మాజీ ఎంపీ వెలగపల్లి వరప్రసాద్ డిమాండ్ చేశారు. ఆది వారం ఆత్మహత్య చేసుకున్న ఎంబీబీ ఎస్ విద్యార్థిని పి.గీతిక మృతదేహాన్ని సోమవారం ఆయన రుయా మార్చురీలో పరిశీలించారు. ఆమె కుటుంబ స భ్యులతో మాట్లాడి వివరాలను తెలుసుకున్నారు. రుయా ప్రభుత్వ వైద్యులు, జూడాల సంఘం నాయకులు సోమవారం మెడికల్ కాలేజీ ఆడిటోరియంలో సంతాప సభ ఏర్పాటు చేశారు. కార్యక్రమానికి తిరుపతి మాజీ ఎంపీ వరప్రసాద్, ప్రభుత్వ వైద్యుల సంఘం కోశాధికారి డాక్టర్ శ్రీనివాసరావు, జూడాల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎం.వెంకటరమణ, సభ్యురాలు లావణ్య తదితరులు హాజరై ఇద్దరు వైద్య విద్యార్థుల చిత్ర పటాలకు పుష్పాంజలితో నివాళులర్పించారు. వారిద్దరి పవిత్ర ఆత్మలకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. దర్యాప్తు చేస్తున్నాం: డీఎస్పీ గీతిక మృతదేహానికి రుయా సూపరింటెండెంట్ డాక్టర్ సిద్ధానాయక్ ఆధ్వర్యంలో సోమవారం పోస్టుమార్టం పూర్తి చేశారు. తిరుపతి ఈస్ట్ డీఎస్పీ మునిరామ య్య మీడియాతో మాట్లాడుతూ గీతిక మృతి పూర్తిగా వ్యక్తిగతమని కుటుంబ సభ్యులు చెబుతున్నప్పటికీ డివిజన్ మే జిస్ట్రేట్ (ఆర్డీఓ), తహసీల్దార్ల పర్యవేక్షణలో పోస్టుమార్టం పూర్తి చేసినట్లు వెల్లడిం చారు. కేసు నమోదు చేసి సమగ్ర దర్యాప్తు చేపడుతున్నట్లు వెల్లడించారు. గీతిక మృతికి మెడికల్ కాలేజీలో వేధింపులు, ఇతర సమస్యలు కారణం కాదని, చదు వులో వెనుకబాటుతనం మాత్రమే ఉందని ఆమె తల్లి చెప్పినట్లు స్పష్ట్టం చేశారు. గీతిక సూసైడ్ నోట్లో కూడా ఎవరి పేర్లు లేవని, ఎవరిపైనా అనుమానాలు వ్యక్తం చేయలేదని డీఎస్పీ పేర్కొన్నారు. గీతిక మృతదేహానికి సోమవారం మధ్యాహ్నం 12 గంటలకు పోస్టుమార్టం పూర్తిచేసి స్వస్థలం కడప నగరానికి తరలించారు. -
మధ్యప్రదేశ్‌లో హృదయ విదారక ఘటన
-
బైక్‌పై తల్లిశవంతో 35 కిలోమీటర్లు..
టికామ్‌గఢ్ : మధ్యప్రదేశ్‌లో హృదయ విదారక సంఘటన చోటుచేసుకుంది. పోస్టుమార్టం కోసం ఆస్పత్రి సిబ్బంది వాహనాన్ని నిరాకరించడంతో తన తల్లి శవాన్ని బైక్‌పై తరలించాడు ఓ వ్యక్తి. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మస్తాపూర్ గ్రామానికి చెందిన కున్వర్ భాయ్ అనే మహిళ గత ఆదివారం పాముకాటుకు గురైంది. దీంతో ఆమెను వెంటనే స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు డాక్టర్లు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని శవాన్ని పోస్టుమార్టంకు తరలించాల్సిందిగా సూచించారు. పోస్టుమార్టం కోసం వాహన సదుపాయాన్ని కల్పించాల్సిందిగా కున్వర్ భాయ్ కుమారుడు రాజేశ్ ఆస్పత్రి సిబ్బందిని కోరాడు. దీనికి సిబ్బంది నిరాకరించింది. దీంతో గత్యంతరం లేక తన బైక్‌పై తల్లి శవాన్ని 35 కిలోమీటర్ల దూరంలో ఉన్న పోస్టుమార్టం సెంటర్‌కు తరలించాడు. ఈ ఘటనను స్థానిక ప్రజలు వీడియో తీసు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇప్పడా వీడియో వైరల్ అయింది. ఈ ఘటనపై జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. బాధ్యులపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఆమెను సకాలంలో ఆసుపత్రికి తరలిస్తే బతికేదన్నారు. ‘పాముకాటుకు గురైన మహిళను మొదటగా స్థానికంగా ఉన్న దేవాలయంకు తరలించారని, అనంతరం ఆస్పత్రికి తరలించారు. సమయం మించిపోవడంతో ఆమె చనిపోయినట్లు విచారణలో తేలింది’ అని కలెక్టర్ తెలిపారు. అంబులెన్స్‌కు ఫోన్ చేసి ఉంటే వాహన సదుపాయం కల్పించేవాళ్లని పేర్కొన్నారు . -
రెండు రోజులుగా అంబులెన్స్‌లోనే మృతదేహం
హైదరాబాద్: పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని 2 రోజులుగా అంబులెన్స్‌లోనే ఉంచిన ఘటన సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రిలో చోటుచేసుకుంది. తీవ్రమైన దుర్వాసన వెలువడటంతో అంబులెన్స్‌లో మృతదేహం ఉన్నట్లు ఆస్పత్రి సెక్యూరిటీ సిబ్బంది, అవుట్‌పోస్టు పోలీసులు శనివారం గుర్తించారు. ఉత్తరప్రదేశ్‌కు చెందిన మంగర ముండా (36) 2నెలల క్రితం ఎల్అండ్టీ సంస్థలో కాంట్రాక్టు పద్ధతిన హెల్పర్‌గా చేరాడు. ఉప్పల్ విజయపురి సమీపంలోని ఎల్అండ్టీ లేబర్ కాలనీలో ఉంటున్నాడు. ఈ నెల 20న కాలనీ సమీపంలోని గడ్డిపొలాల్లో శవమై కనిపించాడు. మెడకు టవల్ చుట్టి హత్య చేసినట్లు పోలీసులు భావించారు. మంగర మృతదేహానికి శుక్రవారం గాంధీ మార్చురీలో పోస్టుమార్టం నిర్వహించాక బంధువులకు అప్పగించారు. అదే రోజు మీనా ఆస్పత్రికి చెందిన అంబులెన్స్ (ఏపీ05 డబ్ల్యూ 1948)లో మృతదేహాన్ని తీసుకువెళ్లారు. ఏమైందో తెలియదు కానీ మృతదేహంతోపాటు సదరు అంబులెన్స్ గాంధీ మార్చురీ సమీపంలోనే పార్కింగ్ చేసి ఉంది. రోగి సహాయకుల ఫిర్యాదు మేరకు మృతదేహంతో ఉన్న అంబులెన్స్‌ను పోలీసులు గుర్తించారు. ఎల్అండ్టీ యాజమాన్యంతోపాటు ఉప్పల్ పోలీసులకు సమాచారం అందించడంతో మృతదేహాన్ని తరలించినట్లు ఆస్పత్రి యంత్రాంగం తెలిపింది. -
డిపార్ట్మెంట్!
గెలుపులో ఉన్న ఒక ముఖ్యమైన దుర్లక్షణం ఏమిటంటే అది ఎదుటివారికి ఓటమి ఇస్తుంది. ‘ఏంటండీ డ్యూటీకి వెళ్లరా ఏంటి?’ ఇంకా పడుకునే ఉన్న భర్తని తట్టిలేపింది వల్లి (పేరు మార్చాం). అప్పటికే పిల్లలిద్దరూ స్కూల్‌కి వెళ్లిపోయారు. సాధారణంగా ఆ టైమ్‌కు భర్త రెడీ అయిపోతాడు.కాని రూఫ్‌ను చూస్తూ ముభావంగా ఉన్న భర్తను చూసే సరికి జంకు పుట్టింది వల్లికి.‘ఏటండీ... ఏదైనా సమస్యా! ఎందుకు ఈ మధ్య ఇలా ఉంటున్నారు..’ అనునయంగా అడిగింది.భర్త ఆమెను దీర్ఘంగా చూశాడు.‘ఏమీ లేదులే.. స్నానానికి నీళ్లు పెట్టు..’బాత్రూమ్కు వెళ్లిపోయాడు.పది నిమిషాల్లో రెడీ అయి డ్యూటీకి వెళ్లబోతున్న భర్తను వారించి, ‘అదేంటి... టిఫిన్ కూడా చేయకుండా...’ అంది కంగారుగా. ‘లేదు.. అర్జంట్‌గా వెళ్లాలి’ అంటూ వెళ్లిపోయాడు.ఆమె చూస్తూ ఉండిపోయింది. చీకటి పడింది. పిల్లలకు భోజనాలు పెట్టి, భర్త రాక కోసం ఎదురుచూస్తూ ఉంది వల్లి. ఇది కొత్తేమీ కాదు. టైమ్‌కు ఇల్లు చేరని డ్యూటీ అతనిది.‘మా పోలీసు డ్యూటీ ఇలాగే ఉంటుంది. ఎదురుచూడద్దు...’ అంటూ ఉంటాడు. అర్థరాత్రి కావస్తూ ఉంది. వల్లికి కళ్ళు మూతలు పడుతున్నాయి. గిన్నెలపై మూతలు సర్ది, పిల్లల పక్కన ముడుచుకుపడుకుంది. మెల్లగా కళ్లు నిద్ర అనే చీకటిని కప్పుకున్నాయి. అప్పుడే తెల తెలవారుతోంది. తలుపులెవరో దబ దబ బాదుతుండటంతో ఉలిక్కిపడి లేచింది వల్లి. డోర్ తీసింది. ఎదురుగా పోలీస్కానిస్టేబుల్. ఆశ్చర్యంగా చూసింది. ‘మేడమ్, సురేశ్ (పేరు మార్చాం) రాత్రి టూ వీలర్ మీద ఇంటికి వస్తుంటే యాక్సిడెంట్ అయ్యింది. ఆసుపత్రిలో ఉన్నాడు’.... అతనేదో చెప్తున్నాడు. కాని వల్లి స్థాణువులా వెర్రిగా అతణ్ణే చూస్తూ నిలుచుంది. పోస్ట్‌మార్టం రిపోర్ట్ పోలీసుల చేతికి అందింది. అందులో ఇలా ఉంది– 2010 ఫిబ్రవరి 9నాడు రాత్రి 7–7.30 గంటల సమయంలో టూ వీలర్ రోడ్ డివైడర్ ఢీ కొట్టడంతో తలకు గాయలు అయి మరణం సంభవించింది. పేరు: సురేశ్, వయసు: 33. వృత్తి, కానిస్టేబుల్, గోదావరిఖని వన్టౌన్చనిపోయినవారి ఇంటికి ఓదార్పు కోసం పై అధికారులు రావడం మామూలే.మరణించిన కానిస్టేబుల్ సురేశ్ ఇంటికి డీఐజీ పరామర్శకు వచ్చాడు. బూట్లు బయట వదిలి ఖాకీ మేజోళ్లతో ఇంట్లోకి వచ్చి కుర్చీలో కూర్చున్నాడు. సురేశ్ పటానికి పెద్ద పూలదండ వేసి ఉంది. పిల్లలు,వల్లిదుఃఖం నుంచి కోలుకోలేదని తెలుస్తూ ఉంది.‘ఊహించని యాక్సిడెంట్ అమ్మా. ధైర్యంగా ఉండండి. డిపార్ట్మెంట్ మీకు సపోర్ట్‌గా ఉంటుంది’ అన్నాడాయన.వల్లి తల అడ్డంగా ఊపింది.‘సార్, ఇది ప్రమాదం కాదు. హత్య’ అంది.డీఐజీ ఉలిక్కిపడ్డారు. ‘అవున్నార్! మీవాళ్లే చంపారు. మా సీఐ నన్ను బతకనిచ్చేట్టు లేడు అని నెల రోజులుగా ఆయన అంటూనే ఉన్నాడు. అతని వల్లే నా భర్త చనిపోయాడు’ ఆమె చెబుతున్న మాటలు డీఐజీని ఆలోచనలో పడేశాయి. బాధితులకు ఒక సిక్స్ సెన్స్ ఉంటుంది. ఆ సిక్స్›్తసెన్స్తోనే ఆమె తన భర్తది హత్య అని చెప్పిందేమో అనిపించింది డిఐజీకి. వెంటనే సురేశ్ పోస్ట్‌మార్టం రిపోర్ట్ వెరిఫై చేశాడు. ఆ తర్వాత ఒక స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్‌ను నియమించాడు. రంగంలో దిగిన సిట్ కేసుపై అనేక కోణాల్లో దర్యాప్తు చేసింది. ఎటువంటి క్లూ లభించలేదు. పోస్ట్‌మార్టమ్ రిపోర్టు క్లియర్‌గా యాక్సిడెంట్ అని చెబుతోంది. మరి ఎలా చంపినట్టు?! సిట్‌కి ఆదేశాలు వెళ్లాయి. సిట్ పట్టుదలగా దర్యాప్తు మొదలెట్టింది. ఘటన జరిగిన రోజు రాత్రి.. ఘటన జరిగిన చోట ట్రాన్స్ఫార్మర్ పేలిన చప్పుడు విన్నానని ఒక పేవ్మెంట్ మనిషి చెప్పాడు. దానికీ హత్యకీ సంబంధం ఉండే అవకాశం లేదు. ఎందుకంటే సురేశ్ ఎలక్ట్రిక్ షాక్ వల్ల చనిపోలేదు. మరి ఏంటి క్లూ?కాని పోలీసు బుర్ర ఊరికే ఉండదు. ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్కు ఫోన్ చేశారు.‘ట్రాన్స్ఫార్మర్ మార్చే సమయంలో స్ట్రేంజ్‌గా ఏదైనా గమనించారా?’ అని అడిగారు.‘మేం ట్రాన్స్ఫార్మర్ మార్చితే కదా. అసలు ట్రాన్స్ఫార్మర్ పేల్లేదు’ అని జవాబు వచ్చింది.మరి ఆ శబ్దం? టపాకాయలది కాదు. మరి?ఎస్. గన్ షాట్.అంటే సురేశ్ గన్ షాట్‌తో చనిపోయాడా?తీగలాగితే డొంకంతా కదిలింది. పోస్ట్‌మార్టమ్‌ను మేనేజ్ చేశారు. దీనికి వెనుక డిపార్ట్మెంట్లో చాలామంది తలకాయలు ఉన్నాయి. సురేశ్ బాడీకి రీపోస్ట్‌మార్టమ్ చేయాలని హుటాహుటిన ఆదేశాలు అందాయి. ఆ రిపోర్ట్‌లో సురేశ్ ముఖం భాగంలో కుడి కన్ను కింద పిస్టల్‌తో కాల్చినట్టుగా, 0.32 బుల్లెట్‌ను రిపోర్ట్‌తో జత చేసి ఇచ్చారు. 0.32 బుల్లెట్‌ను పోలీసులు ఉపయోగిస్తారు. దీనిని ఉపయోగించింది ఎవరు?! పోలీస్ ఇన్ఫార్మర్ వాసు(పేరుమార్చాం)కు 0.32 బుల్లెట్లు జారీ చేసినట్టు రికార్డులో రాసుంది. అంటే కూపీ ఇతని దగ్గరే ఉంది. వెంటనే పోలీసులు వాసును పట్టుకుని డిఐజీ ముందు హాజరుపరిచారు. ‘సార్ ఇది ఆధిపత్యం గొడవ సార్’ అన్నాడతను.‘అంటే?’ డిఐజీ అడిగాడు.‘నేను ఐదేళ్లుగా పోలీస్ ఇన్ఫార్మర్గా ఉన్నాను. డిపార్ట్మెంట్ పేరు చెప్పి లాండ్ సెటిల్మెంట్, దందాలు చేస్తూ ఉండేవాడిని. నా పనికి సురేశ్ అడ్డుపడేవాడు. పెద్ద సార్లకు చెబుతా అంటూ బెదిరించేవాడు. ఈ దందాల్లో పెద్దసార్లూ ఉన్నారని అతనికి తెలియదు. సార్... నేను గెలుస్తూ వెళుతుంటే నన్ను ఓడించడానికి ఎవరైనా వస్తే ఎలా ఉంటుంది? అందుకే అవకాశం కోసం ఎదురు చూస్తూ ఉన్నాను. ఆ రోజు రాత్రి సురేశ్ నాకు ఎదురయ్యాడు. ‘నీ సంగతి చూస్తాను’ అని బెదిరించాడు. కోపంలో పిస్టల్ తీసి కాల్చేశాను. విషయం పెద్దసార్లకు చెప్పాను. వాళ్లు మేం చూసుకుంటాం అన్నారు’ అంటూ ముగించాడు. సురేశ్‌ది యాక్సిడెంట్ కాదని హత్య అని కేసు నమోదయ్యింది.పోస్ట్‌మార్టమ్ రిపోర్టును తప్పు దోవ పట్టించిన డాక్టర్‌తో సహా మొత్తం ఏడు మంది ముద్దాయిలుగా ఉన్నారు. వారిలో కొందరు పోలీస్ డిపార్ట్మెంట్లో పెద్ద పోస్టుల్లో ఉన్నారు కూడా. కేసు నడుస్తూ ఉంది. న్యాయం జరగాల్సి ఉంది.చట్టం చేతుల్లో ఉందని తప్పు చేసినవారు కొన్నాళ్లు తప్పించుకోవచ్చు.కాని చట్టం కఠినమైనది. న్యాయంతో కలిసి నేరస్తులను దండించే తీరుతుంది. కుటుంబానికి ఉద్యోగం ఇవ్వలేదు... హత్యకు గురైనట్టుగా చెబుతున్న సురేశ్ కుటుంబ సభ్యులకు ప్రభుత్వం నుంచి ఎలాంటి సహకారం అందలేదు. సురేశ్ భార్య వల్లి హైదరాబాద్‌కు Ðð ళ్ళి పోలీస్ ఉన్నతాధికారులను కలిసినా పోలీస్ అమరవీరులకు అందించే ప్రయోజనాలు కూడా వీరికి కల్పించలేదు. ఆనాడు సిట్ సమర్పించిన కేసులో ముద్దాయిలుగా ఉన్న పోలీస్ అధికారులకు కేసు పరిష్కారమయ్యే వరకు నాన్–పోకల్ పోస్టుల్లోనే ఉంచాలని ఆనాటి పోలీస్ ఉన్నతాధికారులు సూచించగా... ప్రభుత్వం మారడంతో నేడు అందరు అధికారులు పోకల్ పోస్టుల్లో కొనసాగుతున్నారు. – గడ్డం రాజిరెడ్డి, బ్యూరో ఇన్‌ఛార్జి, సాక్షి, కరీంనగర్ -
మిస్టరీ మరణాలు..
సాక్షి, హైదరాబాద్: తల్లిదండ్రులు లేని సమయంలో యువతి ఇంటికి వెళ్లాడో యువకుడు.. ఏం జరిగిందో ఏమో యువతితో పాటు ఆ యువకుడూ వేర్వేరుగా ఉరి వేసుకున్న స్థితిలో చనిపోయారు. అనుమానాస్పద స్థితిలో యువతీయువకులు మరణించిన ఈ ఘటన శుక్రవారం ఖైరతాబాద్‌లో చోటు చేసుకుంది. వీరిద్దరూ స్నేహితులని, ఇద్దరి మధ్యా తీవ్ర స్థాయిలో ఘర్షణ జరిగిందని స్థానికులు చెప్తున్నారు. అయితే యువకుడిది హత్యేనని అతడి కుటుంబీకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాగా, యువతి కొన ఊపిరితో ఉన్నట్టు ఘటనాస్థలికి వచ్చిన ‘108’ సిబ్బంది గుర్తించలేకపోయారు. దీంతో గంటన్నర పాటు మృత్యువుతో పోరాడిన ఆమె చివరికి తనువు చాలించింది. కుటుంబీకులు శుభకార్యానికి వెళ్లడంతో.. ఖైరతాబాద్ న్యూ సీఐబీ క్వార్టర్స్‌కు చెందిన ఆకుల శ్రీనివాస్ బీఎస్ఎన్ఎల్ ఉద్యోగి. తెల్లవారుజామున న్యూస్ పేపర్ హాకర్‌గా వ్యవహరిస్తుంటారు. ఈయన భార్య అనిత గృహిణి. వీరికి వెంకట సుమన్, వర్షశ్రీ(22) సంతానం. గురువారం నల్లకుంటలోని సమీప బంధువు ఇంట్లో పెళ్లి ఉండటంతో అంతా వెళ్లారు. శ్రీనివాస్ తల్లి శంకరమ్మ(80) ఇంట్లోనే ఉన్నారు. శుక్రవారం తెల్లవారుజామున 2 గంటల ప్రాంతంలో వర్షశ్రీ, శ్రీనివాస్ ఇంటికి వచ్చేశారు. ఉదయం 10:30కి శ్రీనివాస్ విధులకు వెళ్లగా.. వర్షశ్రీ, శంకరమ్మ ఇంట్లో ఉన్నారు. వర్షశ్రీకి పరిచయ స్తుడైన బడంగ్‌పేటకు చెందిన మహేశ్వర్‌రెడ్డి శుక్రవారం మధ్యాహ్నం 2:15కి ఆమె ఇంటికి వచ్చాడు. పనిమనిషని చెప్పిన వర్షశ్రీ.. మహేశ్వర్‌రెడ్డి స్వీట్ బాక్స్‌తో పాటు మద్యం బాటిల్ తీసుకువచ్చాడు. అతడు ఇంట్లోకి వస్తున్న సమయంలో ముందు గదిలో ఉన్న శంకరమ్మ అలికిడి గమనించింది. కంటి చూపు సరిగా లేక ఎవరు వచ్చారని వర్షను అడగ్గా.. పని మనిషి వచ్చిందని చెప్పింది. సుమారు 2:30కి మహేశ్వర్‌రెడ్డి, వర్షశ్రీ మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఈ గొడవ నేపథ్యంలో శంకరమ్మ మరోసారి ఎవరని ప్రశ్నించినా వర్షశ్రీ బదులివ్వలేదు. ఆ సమయంలో వారి మధ్య ఘర్షణ జరిగినట్లు పెద్ద శబ్దాలు వినిపించాయని స్థానికులు చెప్తున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు వర్షశ్రీ సోదరుడికి ఫోన్ చేసి ఏడుస్తూ అస్పష్టంగా మాట్లాడింది. సుమన్ హుటాహుటిన నల్లకుంట నుంచి ఇంటికి చేరుకున్నాడు. వేర్వేరు గదుల్లో ఉరి వేసుకున్నట్లు.. ఇంట్లోకి ప్రవేశించిన సుమన్ మొదటి బెడ్రూమ్లో ఫ్యాన్‌కు చీరతో ఉరి వేసుకుని వేలాడుతున్న మహేశ్వర్‌రెడ్డిని గమనించాడు. వర్షశ్రీ ఆచూకీ లేకపోవడం, మరో బెడ్రూమ్ లోపల నుంచి గడియ పెట్టి ఉండటంతో తలుపులను గట్టినా తన్నడంతో గడియ విరిగి అవి తెరుచుకున్నాయి. అక్కడ బెడ్‌పై వర్షశ్రీ పడి ఉండటాన్ని గమనించాడు. మంచం పక్కనే ఉన్న కిటికీ గ్రిల్స్‌కు చీర కట్టి... అది ఆమె మెడకు చుట్టి ఉంది. ముక్కులో నుంచి రక్తం కారడంతో పాటు నుదుటిపై కమిలిన గాయాలున్నాయి. ఇద్దరి మెడలకు ఉన్న చీరల్ని కట్ చేసిన సుమన్ ‘108’కి సమాచారం ఇచ్చాడు. 3.30 గంటల ప్రాంతంలో ఘటనాస్థలికి వచ్చిన అంబులెన్స్ సిబ్బంది మహేశ్వర్‌రెడ్డి, వర్షశ్రీలను పరిశీలించి ఇద్దరూ మృతి చెందినట్లు నిర్ధారించి వెళ్లిపోయారు. సాయంత్రం 5 గంటల ప్రాంతంలో మృతదేహాలను పోస్టుమార్టం పరీక్షలకు తరలించడానికి పోలీసులు సిద్ధమయ్యారు. వర్షశ్రీని ఓ దుప్పటిలో పెట్టి మొదటి అంతస్తు నుంచి కిందికి తీసుకువస్తుండగా.. ఆమెలో కదలికల్ని కుటుంబీకులు గుర్తించారు. అప్రమత్తమైన వారు సమీపంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకువెళ్లారు. దాదాపు గంటన్నర పాటు మృత్యువుతో పోరాడిన ఆమె ఆస్పత్రికి తరలించే లోగా కన్నుమూసింది. ఆచూకీ లభించని మద్యం బాటిల్.. మహేశ్వర్‌రెడ్డి, వర్షశ్రీ మధ్య కొంతకాలంగా స్నేహం ఉందని యువతి కుటుంబీకులు చెప్తున్నారు. ఇద్దరి మధ్యా వాగ్వాదం జరిగి ఉంటుందని, ఆవేశానికి లోనైన మహేశ్వర్‌రెడ్డి ఆత్మహత్య చేసుకుని ఉంటా డని పోలీసులు భావిస్తున్నారు. ఇది చూసి భయపడిన వర్షశ్రీ మరో గదిలోకి వెళ్లి గడియ పెట్టుకుని తలను గోడకు బాదుకోవడంతో పాటు సోదరుడికి ఫోన్ చేసి ఉంటుందని, ఆ తర్వాత కిటికీ గ్రిల్‌కు ఉరి వేసుకుని ఉంటుందని అంచనా వేస్తున్నారు. మహేశ్వర్‌రెడ్డి తీసుకువచ్చిన స్వీట్ బాక్స్ అతడి మృతదేహం వద్దే ఉన్నా.. మద్యం బాటిల్ ఆచూకీ లభించలేదు. మరోవైపు మహేశ్వర్‌రెడ్డి ఆత్మహత్య చేసుకునేప్పుడు వర్షశ్రీ ఏం చేస్తోంది? ఆపే ప్రయత్నం ఎందుకు చేయలేదు? అనేది అంతుచిక్కట్లేదు. వర్షశ్రీపై మహేశ్వర్‌రెడ్డి చేయి చేసుకున్నాడా? ఈ కారణంగానే ఆమె ఉన్న గదిలోంచి బయటకు వచ్చి మరో గదిలో ఆత్మహత్య చేసుకున్నాడా? అనే సందేహాలను పోలీసులు వెలిబుచ్చుతున్నారు. హత్యే అంటున్న యువకుడి కుటుంబీకులు.. మహేశ్వర్‌రెడ్డి మృతిపై సమాచారం అందుకున్న అతడి కుటుంబీకులు వర్షశ్రీ ఇంటికి చేరుకున్నారు. అప్పటికే ఆమె కుటుంబీకులంతా వచ్చేశారు. ఈ సమయంలో రెండు కుటుంబాల మధ్యా ఘర్షణ జరగడంతో ఓ దశలో యువకుడి కుటుంబీకులపై యువతి కుటుంబ సభ్యులు దాడికి ప్రయత్నించారు. దీన్ని అడ్డుకున్న పోలీసులు వారిని ఠాణాకు తరలించారు. ఘటనాస్థలికి చేరుకున్న సైఫాబాద్ ఏసీపీ వేణుగోపాల్‌రెడ్డి, ఇన్స్పెక్టర్ వెంకట్‌రెడ్డి పరిస్థితిని పర్యవేక్షించారు. పోస్టుమార్టం పరీక్షల నిమిత్తం మహేశ్వర్‌రెడ్డి మృతదేహాన్ని ఉస్మానియా, వర్షశ్రీ మృతదేహాన్ని గాంధీ ఆస్పత్రి మార్చురీలకు తరలించారు. మహేశ్వర్‌రెడ్డిది ముమ్మాటికీ హత్యేనంటూ అతడి కుటుంబీకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మహేశ్వర్‌రెడ్డి తీసుకొచ్చిన స్వీట్స్‌లో ఏమైనా కలిపాడా? అనే అనుమానంతో వాటిని ఫోరెన్సిక్ పరీక్షలకు పంపారు. పోస్టుమార్టం నివేదికలు వచ్చిన తర్వాతే ఈ ఉదంతంపై స్పష్టత వస్తుందని అధికారులు చెపుతున్నారు. -
శ్రీదేవి పోస్టుమార్టం పూర్తి
-
శ్రీదేవి పోస్టుమార్టం పూర్తి
సాక్షి, ముంబై: ప్రముఖ నటి శ్రీదేవి మరణవార్తతో భారతీయ చిత్రసీమ శోకసంద్రంలో మునిగిపోయింది. శ్రీదేవి నిన్న రాత్రి దుబాయిలో గుండెపోటుతో మృతిచెందారు. దుబాయ్‌లోని రషీద్ ఆసుపత్రిలో ఇప్పటికే శ్రీదేవి పోస్టుమార్టం పూర్తయింది. ఇంకా దానికి సంబంధించిన నివేధిక రావాల్సి ఉంది. డెత్ సర్టిఫికేట్ ఆలస్యంగా విడుదల చేయనున్నారు. దౌత్య వ్యవహారాల కారణంగా భౌతికాయం తరలింపు ఆలస్యమవుతోంది. శ్రీదేవి భౌతికాయం తెల్లవారుజామున ముంబై చేరుకునే అవకాశం ఉంది. శ్రీదేవి భౌతికాయం కోసం బంధువులు, అభిమానులు ముంబైలో ఎదురుచూస్తున్నారు. రేపు శ్రీదేవి ఇంటి నుంచి మెహబూబా స్టూటియోకు పార్థివదేహాన్ని తరలిస్తారు. జుహూలోని శాంతా క్రజ్ శ్మశాన వాటికలో అంత్యక్రియలు జరగనున్నాయి. ఈ రోజు ఉదయం నుంచి తమ అభిమాన తారను చివరిసారిగా చూడాలన్న ఆత్రుతతో శ్రీదేవి ఇంటి ముందు అభిమానులు పోటెత్తారు. ముంబైలోని చార్‌బంగ్లా పరిసరాల్లో భారీ భద్రత ఏర్పాట్లు చేశారు. -
శవ నిరీక్షణ!
కరీంనగర్ ప్రధాన ఆసుపత్రిలో పోస్టుమార్టం కోసం బంధువులకు ఎదురుచూపులు తప్పడంలేదు. అయినవారిని కోల్పోయి కడసారి చూపుకోసం ఆసుపత్రికి వస్తున్నవారు శవపరీక్ష కోసం గంటల తరబడి పోస్టుమార్టం గది వద్ద నిరీక్షించాల్సి వస్తోంది. ప్రమాదాలబారిన పడి ఆకస్మిక మరణాలు సంభవించి.. ఆసుపత్రికి తీసుకొస్తున్న శవాలకు పోస్టుమార్టం చేయడంలో డ్యూటీ డాక్టర్లు తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ఒకవ్యక్తి ఆకస్మికంగా మృతిచెందితే.. కన్నబిడ్డల మొదలు.. కనిపెంచిన తల్లిదండ్రులు.. కట్టుకున్న భార్య వరకు కుటుంబమంతా ఎంత విషాదంలో ఉంటుందో తెలియంది కాదు. అలాంటి వారికి ధైర్యం చెప్పాల్సిన సమయంలో వైద్యులు పోస్టుమార్టం ఆలస్యం చేస్తూ మరింత తీవ్ర మానోవేదనకు గురిచేస్తున్నారు. దీనికి వారంక్రితం జరిగిన ఓ రోడ్డు ప్రమాద సంఘటనే ఉదాహరణగా నిలుస్తోంది. వారంక్రితం తిమ్మాపూర్ సమీపంలో రాజీవ్‌రహదారిపై ప్రమాదం జరిగింది. అర్ధరాత్రి ఒంటిగంట కావడంతో పోలీసులు వైద్యచికిత్సకోసం జిల్లాప్రభుత్వ ఆస్పత్రికి అంబులెన్స్‌లో పంపించారు. ఆసుపత్రిలో విధుల్లో ఉన్న వైద్యుడు పరీక్షించి.. అప్పటికే చనిపోయినట్లు ధ్రువీకరించారు. శవాన్ని బంధువులకు అప్పగించేముందు పోస్టుమార్టం నిర్వహించాల్సి ఉన్నందున అదేరాత్రి మార్చురీ గదికి తరలించారు. అప్పటికి సమయం అర్ధరాత్రి రెండుగంటలే అవుతోంది. ప్రమాద విషయం తెల్సిన బంధువులు ఆసుపత్రికి చేరుకుని బోరున విలపించారు. కడసారి చూపుకోసం ఎవరిని ప్రాధేయపడినా.. గది కి వేసిన తాళాన్ని తీసేవారు లేరు. మరుసటిరోజు పోస్టమార్టం నిర్వహిస్తేగానీ.. చివరిచూపునకు నోచుకునే పరిస్థితి లేదు. శవపరీక్ష నిర్వహించాలని ఉదయం ఏడు గంటలకే మృతుడి బంధుమిత్రులు ఆర్‌ఎంవోను కోరారు. డ్యూటీడాక్టర్ రాగానే.. ఉదయం 9గంటల వరకే జరిపిస్తామని తెలి పారు. ఆయన చెప్పిన సమయానికి అరగంట ఆలస్యంగా శవపరీక్ష డ్యూటీ డాక్టర్ రాజశ్రీ వచ్చారు. ‘మీకోసమే ఎదురుచూస్తున్నాం మేడం..’ అనేలోపే.. ‘ఇప్పుడేకదా వస్తున్నాం.. ఫార్మాల్టీస్ పూర్తిచేయండి.. కాగానే వచ్చి చేస్తా..’ అన్నారు. పంచనా మాకు సంబంధించినవన్నీ రాశారని ఇనీషియల్ రిపోర్టు అందించగా.. ఇది సరిపోదు.. పూర్తిగా రాయండంటూ వెళ్లిపోయారు. రిపోర్టులన్నీ పూర్తయ్యాయని సమాచారం అందించినా.. గంటవరకు కూడా రాలేదు. ప్రశ్నిస్తే.. ఆపరేషన్ థియేటర్లో ఉన్నానని, మత్తుమందు ఇచ్చిన వ్యక్తికి చికిత్స జరుగుతోందని, అది పూర్తయ్యాకే వస్తా.. అంటూ బదులిచ్చారు. పోలీస్ సబ్బంది వెళ్లినా ఆమె నిరాకరించారు. అప్పటికే ఉదయం పదిన్నర దాటిపోయింది. అర్ధరాత్రి నుంచి బాధిత కుటుంబసభ్యులు ఏడుస్తున్నారని, పోస్టుమార్టం త్వరగా చేయాలని కోరగా.. ఆ బాధ అర్థం చేసుకున్న మరోడాక్టర్ వచ్చి శవపరీక్ష పూర్తిచేశారు. సదరు డాక్టర్ బయటకు వస్తుండగా రాజశ్రీ వచ్చి అలా చూసి ఇలా వెళ్లిపోయారు. కరీంనగర్ హెల్త్: దేవుడితో సమానంగా కొలువబడుతున్న వైద్యుల్లో మానవత్వం కొరవడుతోందని బాధిత ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. శవపరీక్ష కోసం మృతుల బంధువులు పడుతున్న కష్టాలు నిత్యకృత్యం అవుతున్నాయి. సాయంత్రమో, అర్ధరాత్రో మరణిస్తే వారి శవపరీక్షలకు దాదాపు 24గంటలపాటు వేచి ఉండే పరిస్థితులు ఉన్నాయి. మృతుల కుటుంబాల బాధను అర్థంచేసుకుని వెంటనే పరీక్షలు నిర్వహించి పంపించాలని ప్రతి సమావేశంలో ప్రజాప్రతినిధులు సూచిస్తున్నా.. వైద్యులుమాత్రం పట్టించుకోవడం లేదు. పంచనామా పేరుతో ఆలస్యం శవపరీక్షకు మందుగా పంచనామా చేయాలని చెబుతూ వైద్యులు కాలయాపన చేస్తున్నట్లు ప్రజలు ఆరోపిస్తున్నారు. శవపంచనామాకు ప్రమాదం జరిగిన ప్రాంత పోలీస్ అధికారులు నివేదిక తయారు చేయాల్సి ఉంటుంది. ఆ నివేదిక పూర్తి చేయడానికి పోలీస్ సిబ్బంది ఆలస్యం చేస్తున్నారని, తమ తప్పేమీ లేదంటూ తప్పించుకుంటున్నారు. ఈ నివేదికలు తయారు అయ్యాయని సదరు పరీక్ష చేసే డ్యూటీ డాక్టర్ తనకు వేరే పని ఉందని, ఆపరేషన్లు ఉన్నాయని, కోర్టులో హాజరు కావాల్సి ఉందని, సమయం అయిపోయందంటూ ఇలా రకరకాల మాట లతో బాధితులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారు. ఇలా ఈ తతంగమంతా పూర్తయ్యేలోపు ఒక్కోసారి బాధితులు తీవ్ర అనారోగ్యానికి గురై చివరికి ఆస్పత్రిలో చేరుతున్నారు. ఆలస్యం చేయడం లేదు– ప్రభుత్వ ఆస్పత్రి ఆర్ఎంవో డాక్టర్ శ్రీధర్ పోస్టుమార్టం నిర్వహించడంలో ఆలస్యం చేయడం లేదు. డ్యూటీలో ఉన్న డాక్టర్ నిబంధనలకు అనుగుణంగా అన్ని పూర్తికాగా నే చేస్తున్నారు. పంచనామా చేయడం, దానికి సంబంధించిన నివేదిక వివరాలు రాయ డం కొంత ఆలస్యం కావడంతో పోస్టుమార్టం కూడా ఆలస్యం అవుతోంది. రోజుకొకరు చొప్పున డ్యూటీ డాక్టర్లు పోస్టుమార్టం నిర్వహిస్తున్నారు. -
సమాధి తవ్వి.. పోస్టుమార్టం
అశ్వారావుపేట : మృతురాలి బంధువుల ఏమరుపాటు పోలీసులకు పెద్ద పనే పెట్టింది. అశ్వారావుపేట బీసీ కాలనీలోని జంగాల బజారుకు చెందిన కళ్యాణపు నాగమ్మ(75), జనవరి 31న చలి కాగుతుండగా ఫిట్స్ రావడంతో చలి మంటలో పడి తీవ్రంగా గాయాలపాలైంది. ఆమెను స్థానిక ప్రభుత్వాసుపత్రిలో మనుమడు సిరిగిరి తిరుపతిరావు చేర్పించి, స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. నాగమ్మ పరిస్థితి విషమంగా ఉండటంతో అశ్వారావుపేట నుంచి సత్తుపల్లి, ఖమ్మం ఆస్పత్రులకు కుటుంబీకులు తీసుకెళ్లారు. మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ తీసుకెళుతుండగా మార్గమధ్యలో మృతిచెందింది. నాగమ్మ మృతిచెందిన విషయాన్ని పోలీసులకు తెలపకుండా ఖననం చేశారు. పెండింగులోగల ఈ కేసు వివరాలు తెలుసుకోవాలని సిబ్బందిని సీఐ ఎం.అబ్బయ్య ఆదేశించారు. దీంతో అసలు విషయం బయటపడింది. సీఐ దగ్గరుండి ఆ సమాధిని తవ్వించారు. ప్రభుత్వాసుపత్రి వైద్యులు ప్రత్యూష, మంగీలాల్ పోస్టుమార్టం నిర్వహించారు. -
మృతదేహాలకు ముగిసిన పోస్టుమార్టం
సాక్షి, కడప : వైఎస్ఆర్ జిల్లా ఒంటిమిట్ట చెరువులో కలకలం సృష్టించిన మృతదేహాల ఆచూకీని పోలీసులు గుర్తించారు. మొత్తం ఐదు మృతదేహాలు లభించగా నలుగురు తమిళనాడులోని సేలం జిల్లా, కడు మదురైకి చెందిన మురుగేశణ్, కరియణ్ణన్, జయరాం, మురుగేశణ్‌గా గుర్తించారు. పూర్తి వివరాలు త్వరలోనే వెల్లడిస్తామని పోలీసు వర్గాలు తెలిపాయి. ఐదు మృతదేహాలకు సోమవారం రిమ్స్ ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించారు. తమిళనాడు నుంచి స్పెషల్ బ్రాంచ్ పోలీసులు, మీడియా కూడా రిమ్స్‌కు చేరుకున్నారు. అయితే ఈ మరణాలపై ప్రజాస్వామ్య హక్కుల పరిరక్షణ రక్షణ సంస్థ ఆందోళన వ్యక్తం చేసింది. ఇవి ముమ్మాటికి హత్యలేనని ఆరోపించింది. సిట్టింగ్ జడ్జితో విచారణ చేయించాలని డిమాండ్ చేసింది. -
శిశువు మృతదేహాన్నికొరికిన ఎలుకలు
నర్సాపూర్: పోస్టుమార్టం గదిలో ఉన్న మూడు నెలల శిశువు మృతదేహాన్ని ఎలుకలు కొరికాయి. ఈ హృదయ విదారక ఘటన మెదక్ జిల్లా నర్సాపూర్‌లో చోటుచేసుకుంది. కౌడిపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని బతుకమ్మ తండాకు చెందిన సురేఖ, కిషన్ దంపతుల కూతురు పుట్టిన కొన్ని రోజులæ నుంచి అనారోగ్యంతో ఉంది. గురువారం ఉదయం మరోసారి అస్వస్థతకు గురవడంతో వైద్యం చేయించేందుకు సురేఖ మెదక్‌కు వెళుతుండగా పాప మార్గమధ్యంలో మృతి చెందింది. శిశువు తండ్రి కిషన్‌తోపాటు అతడి తరఫువారు గురువారం సాయంత్రం వరకు రానందున మృతదేహాన్ని నర్సాపూర్ ప్రభుత్వ ఆస్పత్రిలోని పోస్టుమార్టం గదిలో పెట్టి తాళం వేశారు. శుక్రవారం ఉదయం మృతదేహానికి పోస్టుమార్టం చేసేందుకు వైద్య సిబ్బంది వెళ్లి చూసేసరికి శిశువు మృతదేహంపై పలు చోట్ల గాయాలు కనిపించాయి. ఎలుకలు కొరికిన విషయాన్ని శిశువు కుటుంబీకులకు చెప్పకుండా పోస్టుమార్టం పూర్తి చేసి మృతదేహాన్ని వారికి అప్పచెప్పారు. అయితే శిశువు మృతదేహంపై కుడి వైపు పెదవిని, చెంపతోపాటు ఎడమ చేయి వేలును కొరికాయి. అంతేగాక కుడికాలు తొడపై సైతం గాయమైంది. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని కౌడిపల్లి ఎస్ఐ శ్రీనివాస్ చెప్పారు. -
మహిళ మృతదేహం వెలికితీత
- తహసీల్దార్ సమక్షంలో పోస్టుమార్టం - వై.ఖానాపురం, కంబదహాలు గ్రామస్తుల మధ్య ఘర్షణ - నలుగురికి గాయాలు గూడూరు రూరల్: మండల పరిధిలోని వై.ఖానాపురంలో నాలుగు రోజుల క్రితం పూడ్చిపెట్టిన మహిళ మృతదేహాన్ని మంగళవారం పోలీసులు వెలిసితీసి వైద్యలతో పోస్టుమార్టం నిర్వహించారు. తన కూతురు కల్యాణిది ఆత్మహత్య కాదని, భర్త వీరేష్, అత్త లక్ష్మిదేవి, మామ నరసింహులు కొట్టి చంపారని తండ్రి ఉప్పరి మల్లికార్జున గూడూరు పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో పోలీసులు ఈ మేరకు చర్యలు తీసుకున్నారు. తహసీల్దార్ శివశంకర్‌నాయక్, కోడుమూరు సీఐ శ్రీనివాస్ ఆధ్వర్యంలో వెలికి తీసిన మృతదేహానికి కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రి నుంచి వచ్చిన వైద్యులు పోస్టుమార్టం నిర్వహించారు. సి.బెళగల్ మండలం కంబదహాలుకు చెందిన కల్యాణిని వై.ఖానాపురానికి చెందిన అత్తారింటి వారు వేధింపులు గురిచేయడంతో ఈ నెల 7న రాత్రి ఆత్మహత్య చేసుకుంది. అయితే ఆమెను హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించారని మరుసటిరోజు పుట్టినింటి వారు గొడవకు దిగారు. మృతురాలి కుమారుడి పేరిట ఆస్తి రాసిచ్చేందుకు గ్రామపెద్దలు ఒప్పించడంతో అంత్యక్రియలు నిర్వహించారు. అయితే తర్వాత అత్తారింటివారు అడ్డం తిరగడంతో సోమవారం రాత్రి మృతురాలి తండ్రి మల్లికార్జున పోలీసులను ఆశ్రయించాడు. పోస్టుమార్టం నివేదిక వచ్చిన తదుపరి చర్యలు తీసుకుంటామని సీఐ శ్రీనివాస్ తెలిపారు. ఇరు వర్గాల ఘర్షణ.. కల్యాణి మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహిస్తున్న విషయాన్ని తెలుసుకున్న బంధువులు, కుటుంబ సభ్యులు కంబదహాలు నుంచి దాదాపు 200 మంది వై.ఖానాపురం తరలివచ్చారు. ఇదే సమయంలో స్థానిక పెద్దలు రంగయ్య, నాగేంద్ర, బడేసావ్ రెచ్చగొట్టే విధంగా మాట్లాడడంతో ఆగ్రహించిన మృతురాలి బంధువులు గొడవకు దిగారు. ఇరు వర్గాల మధ్య మాటమాట పెరిగి ఘర్షణకు దారితీసింది. వై.ఖానాపురంకు చెందిన రంగయ్య, నాగేంద్ర తీవ్రంగా బడేసావు, రంగస్వామి స్వల్పంగా గాయపడ్డారు. పోలీసులు రంగప్రవేశం చేసి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. గాయపడిన వారిని కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. -
పూడ్చిన మృతదేహానికి పోస్టుమార్టం
తర్తూరు (జూపాడుబంగ్లా): పూడ్చిన మృతదేహాన్ని 15 రోజుల తర్వాత వెలికితీసి పోస్టుమార్టం నిర్వహించిన సంఘటన తర్తూరు గ్రామంలో చోటు చేసుకొంది. గ్రామానికి చెందిన బీసన్న (48) నందికొట్కూరు ఆర్టీసి డిపోలో డ్రైవర్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. గత నెల 18వ తేదీన ఓర్వకల్లు మండలం శకునాల గ్రామంలో ఉన్న తన పొలాన్ని చూసుకుని బైక్‌పై వస్తుండగా మిడ్తూరు సమీపంలో అదుపు తప్పి కింద పడటంతో తీవ్రంగా గాయపడ్డాడు. చికిత్స నిమిత్తం కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అదే నెల 25 తేదీన అతని పరిస్థితి విషమంగా ఉండటంతో హడావుడిగా ఓ ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ కోలుకోలేక అదేరోజు మృతి చెందాడు. అదే రోజు గ్రామంలో ఖననం చేశారు. కర్మఖాండల అనంతరం ప్రభుత్వం నుంచి తమ కుటుంబానికి రావాల్సిన డబ్బుతో పాటు ఉద్యోగం పొందేందుకు బీసన్న కుమారుడు సంపత్‌కుమార్ ఇటీవల నందికొట్కూరు డిపో మేనేజర్‌కు లిఖిత పూర్వకంగా కోరాడు. కాగా బీసన్న రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో పోస్టుమార్టం రిపోర్టు, ఎఫ్ఐఆర్ కాపీలను ఇవ్వాలని డిపో మేనేజర్ సూచించడంతో సంపత్‌కుమార్ ఆదివారం మిడుతూరు ఎస్ఐ సుబ్రమణ్యంకు సమస్యను వివరించాడు. ఈ మేరకు ఎస్ఐ కేసు నమోదు చేసుకొని సోమవారం డిప్యూటీ తహసీల్దారు గౌరీశంకరశర్మ, నందికొట్కూరు వైద్యాధికారి ప్రసాద్‌నాయక్ ఆధ్వర్యంలో బీసన్న మృతదేహాన్ని వెలికితీసి పోస్టుమార్టం నిర్వహించారు. కార్యక్రమంలో ఏఎస్ఐ కేశవరెడ్డి, తహసీల్దారు కార్యాలయ సీనియర్ అసిస్టెంటు మీనాకుమార్, వీఆర్వో స్వామన్న తదితరులు పాల్గొన్నారు. -
ఆర్తనాదాలతో దద్దరిల్లిన రుయా
⇒ఏర్పేడు రోడ్డు ప్రమాద మృతులకు రుయాలో పోస్టుమార్టం ⇒రైతుల మృతికి పోలీసులు, రెవెన్యూ అధికారులు, బొజ్జల అనుచరులే కారణం ⇒మార్చురీ వద్ద ఆందోళనకు దిగిన వైఎస్ఆర్ కాంగ్రెస్, సీపీఎం, సీపీఐ, కాంగ్రెస్ తిరుపతి మెడికల్, అలిపిరి : ఏర్పేడు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతుల కుటుంబ సభ్యుల రోదనలు, క్షతగాత్రుల ఆర్తనాదాలతో తిరుపతి రుయా ఆస్పత్రి దద్ధరిల్లింది. మృతులను చూసి వారి కుటుంబ సభ్యులు గుండెలవిసేలా రోదించిన తీరు పలువురిని కంటతడి పెట్టించింది. ముసిలిపేడుకు చెందిన దేవతమ్మ కొడుకు ఎం.హరిబాబు(45), తమ్ముడు ఎం.బాబు (47) మృతి చెందడం, హరిబాబు కొడుకు సాయి గాయాల పాలవడంతో ఆ ఇంట్లో విషాదం నెలకొంది. తమ గ్రామ సరిహద్దులో మాజీ మంత్రి బొజ్జల అనుచరుడు ధనంజయులునాయుడు, చిరంజీవి నాయుడు ఇసుక అక్రమ రవాణాకు పాల్పడుతున్నారని, దీన్ని అడ్డుకున్నందుకు కక్ష గట్టి తమను లారీ రూపంలో చంపించారని గ్రామస్తులు ఆరోపిస్తూ ఆందోళనకు దిగారు. వారికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రీకాళహస్తి నియోజకవర్గ ఇన్చార్జ్ బియ్యపు మధుసూదన్‌రెడ్డి, కాంగ్రెస్ నుంచి శ్రీదేవి, సీపీఎం నాయకులు కందారపు మురళి, రైతు సంఘం నుంచి నాగరాజు, జయచంద్ర, సీపీఐ నుంచి వెంకయ్య, చిన్నం పెంచలయ్య, రామానాయుడు, ఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు నీరుగట్టు నగేష్, కన్వీనర్ విజయభాస్కర్ మద్దతుగా నిలిచారు. ప్రమాదానికి కారకులైన వారిని శిక్షించాలని డిమాండ్ చేశారు. రూ.25లక్షలు పరిహారం చెల్లించాలి.. ప్రమాదంలో మరణించిన వారికి రూ.25లక్షలు, గాయపడ్డ వారికి రూ.15లక్షల చొప్పున నష్టపరిహారం చెల్లించాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే నారాయణ స్వామి, ఎమ్మెల్సీ యండపల్లి శ్రీనివాసులురెడ్డి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రీకాళహస్తి నియోజకవర్గ ఇన్చార్జ్ బియ్యపు మధుసూదన్‌రెడ్డి డిమాండ్ చేశారు. వారు మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇసుక మాఫియాను పెంచి పోషిస్తున్నాడని తెలిపారు. ఇసుకను తరలిస్తూ దొరికిపోయిన వారిపై ఎలాంటి కేసూ నమోదు చేయడం లేదన్నారు. ఇందులో పోలీసులకు, రెవెన్యూ అధికారులకు రోజువారీ మామూళ్లు వెళుతున్నాయని ఆరోపించారు. దీన్ని రైతులు అడ్డుకుంటే వారిపై ఎర్రచందనం స్మగ్లింగ్ కేసు పెడతానంటూ సీఐ బెదిరించడం దారుణమన్నారు. ఇసుక మాఫియా కారణం కాదు ఏర్పేడు రోడ్డు ప్రమాదంలో రైతులు మృతి చెందిన ఘటనకు, అక్కడ జరుగుతున్న ఇసుక మాఫియాకు ఎలాంటి సంబంధమూ లేదని సత్యవేడు ఎమ్మెల్యే తలారి ఆదిత్య తెలిపారు. రుయా మార్చురీ వద్ద మీడియాతో మాట్లాడుతూ లారీ డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే ప్రమాదం జరిగిందని, దీన్ని ఇసుక మాఫియా కింద చూడకూడదని అన్నారు. విచారిస్తున్నాం.. ఏర్పేడు ఘటన పూర్తిగా రోడ్డు ప్రమాదమని తిరుపతి అర్బన్ ఎస్పీ జయలక్ష్మి తెలిపారు. దీన్ని ఇసుక మాఫియాతో పోల్చకుండా ప్రత్యేకంగా విచారించాలన్నారు. ఈ ఘటనలో రైతులతోపాటు పోలీసులు కూడా గాయపడ్డారని, ప్రాథమిక విచారణలో లారీ డ్రైవర్ తాగి డ్రైవింగ్ చేయడం వల్లే జరిగినట్టు తేలిందని అన్నారు. పూర్తి స్థాయిలో విచారణ చేస్తున్నట్టు చెప్పారు. -
'మధుకర్‌కు ఎలాంటి సమస్యలు లేవు'
కాలిఫోర్నియా: అమెరికాలో ఈ నెల 4న ఆత్మహత్య చేసుకున్న సాఫ్ట్వేర్ ఇంజనీర్ గూడూరు మధుకర్‌రెడ్డికి ఎలాంటి మానసిక సమస్యలు లేవని అతని స్నేహితులు తెలిపారు. కొందరు ప్రచారం చేస్తున్నట్లుగా అతనికి ఎలాంటి డిప్రెషన్ లేదని పేరు వెల్లడించడానికి ఇష్టపడని ఓ మిత్రుడు అమెరికాలో మీడియాతో మాట్లాడారు. మధుకర్ చిన్ననాటి నుంచి మెరిట్ స్టూడెంట్ అని, పనిలోనూ ఎంతో నైపుణ్యం ప్రదర్శించారని, అందుకే అతని కాంట్రాక్ట్ పదేళ్ల నుంచి కొనసాగుతోందని చెప్పారు. అందరికి ఆప్తమిత్రుడిలా ఉండే మధుకర్‌కు సైలెంట్ అనే నిక్‌నేమ్ ఉందని.. అయితే నిశబ్దంగా అందరిని విడిచి వెళ్లిపోతాడనుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. సాయం చేయడంలో ముందుండే మధుకర్‌కు సమస్యలున్నాయంటేనే ఆశ్చర్యం కలుగుతోందని అన్నారు. మధుకర్‌తో తనకు 20 ఏళ్ల అనుబంధం ఉందని తెలిపారు. మరోవైపు భర్త మధుకర్‌రెడ్డి ఆత్మహత్యకు తానే కారణమంటూ ఆరోపణలతో మనస్తాపం చెందిన అతడి భార్య స్వాతి ఆత్మహత్యాయత్నం చేసింది. ప్రస్తుతం ఆమె ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. -
మానసిక స్థితి బాగోలేకే నా భర్త ఆత్మహత్య
♦ ఎన్ఆర్ఐ మధుకర్‌రెడ్డి భార్య స్వాతిరెడ్డి వెల్లడి ♦ కడసారి చూడనీయకుండా అంత్యక్రియల్లో దాడి చేశారు ♦ ఆస్తి కోసమే మాపై అసత్య ఆరోపణలు చేస్తున్నారు ♦ ‘పోస్ట్‌మార్టం’ఆధారంగా చట్టప్రకారం ముందుకెళతాం ♦ మాకు ప్రాణహాని ఉంది.. ప్రభుత్వం రక్షణ కల్పించాలి హైదరాబాద్: మానసిక స్థితి సరిగా లేక, ఉద్యోగం పోతుందనే భయంతోనే తన భర్త ఆత్మహత్యకు పాల్పడ్డా డని యాదాద్రి (భువనగిరి) జిల్లా యాదగిరిగుట్ట మండ లం రాళ్ల జనగాంకు చెందిన ఎన్ఆర్ఐ గూడూరు మధుకర్‌రెడ్డి భార్య స్వాతిరెడ్డి చెప్పారు. బుధ వారం ఆర్కేపురం సౌభాగ్యనగర్‌లో తండ్రి నర్సింహారెడ్డితో కలసి ఆమె మీడియాతో మాట్లాడారు. ఏడేళ్ల క్రితం మధుకర్‌తో తనకు వివాహమైందని, అమెరికాలోని సియోటెల్ నగరంలో ఉంటూ ఇద్దరం ఉద్యోగం చేసేవారమని, తమకు ఐదేళ్ల పాప ఉం దని స్వాతిరెడ్డి చెప్పారు. సంసారంలో చిన్నచిన్న విషయాలు తప్ప, అంతా సవ్యంగానే ఉండేదని, ఇద్దరం సర్దుకుని పోయే వారమన్నారు. ఈ మధ్యకాలంలోనే ఇల్లు కూడా కొన్నామని చెప్పారు. ఏడాది నుంచి తన భర్త మానసిక పరిస్థితి బాగోలేదని, పనిచేస్తున్న కంపెనీలో ఈ ఏడాది జూన్‌తో గడువు పూర్తవుతుందని, హెచ్1బి వీసా నిబంధనలు కఠినతరం కావడంతో తనకు తిరిగి ఉద్యోగం వస్తుందో రాదోననే భయం తో మానసిక ఆందోళనకు గురయ్యేవాడని ఆమె పేర్కొంది. మధుకర్ అక్క, బాబాయి కుమారుడు రవీందర్‌రెడ్డి తరచుగా ఫోన్లో ఆస్తి గురించి మాట్లాడుకునేవారని, ఈ వ్యవహారంలో కూడా ఆయన తీవ్ర మనో వేదనకు గురయ్యాడని తెలిపింది. మనో వేదనకు సంబంధించి కొంతకాలంగా మెడి సిన్ వాడుతూ వైద్యుల సలహాలు పాటిస్తు న్నాడన్నారు. ఈ విషయాన్ని తన అత్తమామ లకు చెప్పినా వారు స్పందించలేదన్నారు. కొంత కాలంగా తనను కొడుతూ అప్పుడ ప్పుడూ ప్రేమగా చూసేవాడని చెప్పారు. ఈ నెల 4న తాను ఆఫీస్‌కు వెళ్లి వచ్చేసరికి మధుకర్ ఇంట్లో ఆత్మహత్య చేసుకున్నాడని, దీంతో తాను షాక్‌కు గురయ్యానని స్వాతిరెడ్డి వివరించారు. ఆస్తి కోసమే నిందారోపణలు.. సొంతూరులో తన భర్త అంత్యక్రియలు చేసేందుకు తీసుకువస్తే తనపై అత్తింటివారు అసత్య ఆరోపణలు చేసి.. మధుకర్‌ను కడసారి చూడనీయకుండా తనను, తన కుమార్తెను కట్టడి చేశారని ఆరోపించారు. తమపై దాడి చేయటం ఎంత వరకు సమంజసమని ప్రశ్నిం చారు. తాను తప్పు చేసి ఉంటే మధుకర్ మృతదేహాన్ని ఇక్కడకు ఎందుకు తీసుకువస్తానని, అమెరికా ప్రభుత్వం తనను వదిలిపెట్టేది కాదని చెప్పారు. తనకు ఆస్తిలో వాటా ఇవ్వాల్సి వస్తుందనే ముందస్తు పథకం ప్రకారం తనపై నిందారోపణలు చేస్తున్నారని, వాటిని తాము ఖండిస్తున్నామని చెప్పారు. పోస్ట్‌మార్టం నివేదిక ఆధారంగా చట్టప్రకారం తాము ముం దుకు వెళతామని, తమపై దాడికి పాల్పడిన వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకోవటంతో పాటు, ప్రాణహాని ఉన్నందున తనకు రక్షణ కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. -
ఎస్ఐ దంపతుల మృతదేహాలకు పోస్ట్‌మార్టం
మెదక్ : తన సర్వీస్ రివాల్వర్‌తో భార్యను కాల్చి అనంతరం తాను కాల్చుకుని మృతి చెందిన దుబ్బాక చిట్టిబాబు దంపతుల మృతదేహాలకు పోస్ట్‌మార్టం పూర్తయింది. పోస్ట్‌మార్టం చేసిన డాక్టర్ చందర్ ఈ సందర్భంగా మాట్లాడుతూ.... భార్య సరోజను కాల్చిన తర్వాత ఎస్ఐ తాను కాల్చుకున్నారన్నారు. తమ పోస్ట్‌మార్టం ప్రకారం ఎస్ఐ చిట్టిబాబు ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోందన్నారు. ఘటనపై ఎలాంటి అనుమానాలు లేవని తెలిపారు. మరింత లోతుగా తెలుసుకునేందుకు చిట్టిబాబు దంపతుల కొన్ని శరీరా భాగాలను ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపిస్తామన్నారు. కాగా ఉన్నతాధికారుల వేధింపులు భరించలేక, తాను చేయని తప్పును తనపై వేసుకోలేక సిద్దిపేట జిల్లా దుబ్బాక ఎస్సై చిట్టిబాబు (54) శుక్రవారం ఆత్మహత్యకు పాల్పడిన విషయం తెలిసిందే. సర్వీసు రివాల్వర్‌తో తన భార్యను కాల్చి తానూ కాల్చుకుని బలవన్మరణానికి పాల్పడ్డారు. గత తొమ్మిది నెలల్లో ఒకే పోలీసు డివిజన్ పరిధిలో ఆత్మహత్య చేసుకున్న రెండో ఎస్సై చిట్టిబాబు కావడం గమనార్హం. -
శవాలతో సావాసం మాకొద్దు..!
ఫోరెన్సిక్ మెడిసిన్‌పై అభ్యర్థుల్లో తగ్గుతున్న ఆసక్తి సగం పీజీ సీట్లు కూడా భర్తీకాని వైనం ప్రభుత్వాస్పత్రుల్లో శవ పరీక్షకు వైద్యుల కరువు పంచనామా చేసిన వైద్యులే మళ్లీ పాఠాలూ చెప్పాలి ప్రైవేటులో అవకాశాలు లేకనే రావడం లేదంటున్న అధికారులు సాక్షి, హైదరాబాద్: ఫోరెన్సిక్ మెడిసిన్‌కు సినిమాల్లో తప్ప వాస్తవంలో ఏమాత్రం ప్రాధాన్యత ఉండడంలేదు. పీజీ చెయ్యక పోయినా ఫర్వాలేదుగానీ, నాన్క్లినికల్ గ్రూప్‌లో భాగంగా ఉన్న ఈ కోర్సులో సీటు తీసుకోకూడదనే ఆలోచనలో అభ్యర్థులున్నారు. దీంతో ప్రభుత్వ వైద్య కళాశాలల్లో కనీసం సగం పీజీ వైద్య సీట్లు కూడా భర్తీ కావడం లేదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎండీ ఫోరెన్సిక్ మెడిసన్ సీట్లు 12 ఉండగా ఈ ఏడాది కేవలం 3 మాత్రమే భర్తీ కావడం గమనార్హం. ఫోరెన్సిక్ మెడిసిన్‌లో పీజీ చేసినా మార్చురీలో పనిచేయడం మినహా ఎక్కడా ప్రాధాన్యత లేదని ప్రస్తుతం ఫోరెన్సిక్ పూర్తిచేసిన వైద్య అభ్యర్థులు వాపోతున్నారు. పైగా ప్రభుత్వ వైద్య కళాశాలల్లోనూ గత కొన్నేళ్లుగా రెగ్యులర్ పోస్టులకు నియామకాలు లేవు. ఇక ప్రైవేటు ఆస్పత్రుల్లో ఫోరెన్సిక్ మెడిసిన్ అభ్యర్థులకు ఎలాంటి అవకాశాలూ లేకపోవడం దీనిపై ఆసక్తి లేకపోవడానికి మరో కారణం. ప్రమాద కేసులు, ఆత్మహత్య కేసులు, మెడికో లీగల్ కేసులకు ప్రభుత్వాస్పత్రుల్లోనే శవ పంచనామా జరగాలి. కానీ అక్కడ ఫోరెన్సిక్ వైద్యుల కొరత వేధిస్తుండటంతో తీవ్ర ఇబ్బందులు నెలకొన్నాయి. మొత్తం 11 బోధనాస్పత్రులు, 8 జిల్లా ఆస్పత్రులు ఉంటే అందులో శవ పరీక్షలు నిర్వహించే దిక్కులేక అవస్థలు పడాల్సిన పరిస్థితి ఎదురవుతోంది. ప్రమాద కేసులో మృతిచెందితే నిరీక్షణే ఏటికేటికీ రాష్ట్రంలో రోడ్డు ప్రమాద మృతులు తీవ్రంగా పెరుగుతున్నాయి. ఆ ప్రమాదం జరిగిన ప్రాంతాన్ని బట్టి పోలీస్ స్టేషన్ పరిధిని బట్టి ఆయా జిల్లా ఆస్పత్రి లేదా బోధనాస్పత్రికి తీసుకెళతారు. కానీ బోధనాస్పత్రుల్లో 8 మంది ఫోరెన్సిక్ మెడిసిన్ వైద్యులుండాల్సి ఉంటే కనీసం ఇద్దరు కూడా లేని పరిస్థితి. ఒక్కో బోధనాస్పత్రికి సగటున రోజుకు ప్రమాద లేదా ఆత్మహత్య మృతుల కేసులు 10 నుంచి 15 వరకూ వస్తుంటాయి. అంటే రోజూ రాష్ట్రవ్యాప్తంగా 150 నుంచి 200 వరకూ మృతులకు పంచనామా చేయాల్సి ఉంటుంది. కానీ ఫోరెన్సిక్ మెడిసిన్ వైద్యులు లేక చివరకు అటెండర్లు, వార్డు బాయ్లే శవ పంచనామా చేసి తూతూమంత్రంగా రిపోర్టు రాసే పరిస్థితి వచ్చింది. ఉదాహరణకు కడప రిమ్స్‌లో ఆరుగురు ఫోరెన్సిక్ మెడిసిన్ వైద్యులు ఉండాలి. కానీ ఇద్దరే ఉన్నారు. ఈ పరిస్థితుల్లో శవాలు ఎక్కువగా వస్తే పంచనామా జాప్యమవుతోంది. పోనీ శవాలకు సరిపడా ఫ్రీజర్లు(శీతల పెట్టెలు) ఉన్నాయా అంటే అదీ లేదు. దీంతో చాలా ఆస్పత్రుల్లో ఉన్న వైద్యులకు ఎంతోకొంత లంచమిచ్చి త్వరగా పంచనామా చేయించుకుంటున్నారు. కర్నూలు, గుంటూరు, విశాఖపట్నం, కాకినాడ వంటి పెద్దాస్పత్రుల్లో విపరీతంగా ప్రమాద మృతుల కేసులు పంచనామాకు వస్తుంటాయి. అలాంటి చోటే వైద్యులు లేరు. ఉన్న వైద్యులు పంచనామా చేయడంతోపాటు ఎంబీబీఎస్ విద్యార్థులకు పాఠాలు కూడా చెప్పాల్సిన పరిస్థితి. ప్రైవేటులో అవకాశాలు లేకనే.. ప్రభుత్వాస్పత్రుల్లోనే శవపంచనామా చేయాల్సి ఉంది. ప్రైవేటు ఆస్పత్రుల్లో అభ్యర్థులకు అవకాశాలు లేవు. దీంతో కొంతమంది అనాసక్తి చూపిస్తున్న మాట వాస్తవమే. ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఫోరెన్సిక్ మెడిసిన్ వైద్యుల కొరత లేదు. త్వరలోనే పదోన్నతులు చేపడుతున్నాం. ఆ తర్వాత ఫోరెన్సిక్లో ఎండీ చేసిన వారిని అసిస్టెంట్ ప్రొఫెసర్లుగా తీసుకుంటాం. – డా.కె.బాబ్జీ, వైద్యవిద్యా సంచాలకులు (అకడెమిక్) -
పోలీసు మెడకు రామ్‌కుమార్ ఉచ్చు
సాక్షి ప్రతినిధి, చెన్నై: జూన్ 24వ తేదీన నుంగంబాక్కం రైల్వే స్టేషన్లో స్వాతి దారుణహత్య, తిరునెల్వేలీలో నిందితుడు రామ్‌కుమార్ అరెస్ట్, అతను అసలైన నిందితుడు కాదనే వాదనలు ఇలా ఈ కేసులో ప్రతి అడుగు రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారింది. క్రైం సినిమాను తలపించే రీతిలో మూడు నెలలుగా సాగుతున్న ఈ కేసు నిందితుడు రామ్‌కుమార్ ఆత్మహత్యతో సరికొత్త మలుపు తిరిగింది. జైలులోని కరెంటు వైరును నోటితో కొరికి బలవన్మరణానికి పాల్పడ్డాడని పోలీసు వర్గాల కథనం. వేలాది మంది ఖైదీలు, వందలాది మంది జైలు సిబ్బంది గస్తీ బాధ్యతలు నిర్వర్తిస్తున్న సమయంలో ఒక ఖైదీ అంత సులువుగా కరెంటువైరు కొరికి ఉంటాడని, ఒక ఖైదీ ఇంత దారుణానికి పాల్పడుతుంటే సిబ్బంది ఏమి చేస్తున్నట్లు అనే అనుమానాలు తలెత్తాయి. రామ్‌కుమార్‌ది ఆత్మహత్య కాదు, హత్య అని అతని తండ్రి పరమశివం తదితరులు ఆరోపిస్తున్నారు. తన కుమారుడిని పథకం ప్రకారం హతమార్చారని పరమశివం ఆరోపిస్తున్నారు. రామ్‌కుమార్ మరణంపై సీబీఐ విచారణకు ఆదేశించాలని, అప్పటి వరకు మృతదేహాన్ని తీసుకునేది లేదని ఆయన అన్నారు. రామ్‌కుమార్ నిందితుడే కాదని మరో ప్రచారం సాగుతున్న తరుణంలో అనుమానాస్పద స్థితిలో అతను అంతం కావడంతో స్వాతి హత్య కేసు మరోసారి తెరపైకి వచ్చింది. రామ్‌కుమార్ మరణంపై ప్రభుత్వం న్యాయవిచారణకు ఆదేశించడంతో పోలీసు శాఖ సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. పోస్టుమార్టంపై హైకోర్టు స్టే రామ్‌కుమార్ మృతదేహానికి పోస్టుమార్టంపై హైకోర్టు సోమవారం స్టే విధించింది. రామ్‌కుమార్ మృతదేహాన్ని రాయపేట ప్రభుత్వ ఆసుపత్రికి ఆదివారం సాయంత్రమే చేర్చినా హై కోర్టు ఆదేశాలతో నిలిచిపోయింది. రాయపేట ఆసుపత్రి చుట్టూ పెద్ద ఎత్తున ఆదివారం అర్ధరాత్రి వరకు రామ్‌కుమార్ బంధువులు, సానుభూతిపరులు చుట్టుముట్టి ఉండడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో పోలీసు బందోబస్తు పెట్టారు. రామ్‌కుమార్ మృతదేహానికి పోస్టుమార్టం చేసేందుకు ప్రత్యేకంగా వైద్యబృందాన్ని నియమించారు. ఈ బృందం సోమవారం ఉదయం పోస్టుమార్టం చేయాల్సి ఉండగా రామ్‌కుమార్ న్యాయవాదులు రామ్రాజ్, విజయేంద్రన్ హైకోర్టును ఆశ్రయించారు. రామ్‌కుమార్ మృతిపై అనుమానాలు ఉన్నందున పోస్టుమార్టంపై నిషేధం విధించాలని, ఈ కేసును అత్యవసర కేసుగా స్వీకరించాలని కోరారు. అయితే అత్యవసర కేసుగా తీసుకోవడం కుదరదని న్యాయమూర్తులు నిరాకరించారు. వీరు దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ పూర్తయ్యేవరకు పోస్టుమార్టంను నిలిపివేస్తున్నట్టు ప్రభుత్వ న్యాయవాది హామీ ఇవ్వడంతో ఇందుకు అంగీకరించిన న్యాయమూర్తులు... రామ్‌కుమార్ న్యాయవాదులు దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ ముగిసేవరకు పోస్టుమార్టంపై స్టే విధిస్తున్నట్లు ప్రకటించారు. ప్రతిపక్షాల భగ్గు స్వాతి హత్యకేసులో నిందితుడు రామ్‌కుమార్ ఆత్మహత్యకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని డీఎంకే అధ్యక్షుడు కరుణానిధి సోమవారం డిమాండ్ చేశారు. ఎండీఎంకే అధినేత వైగో, పీఎంకే అధ్యక్షుడు రాందాస్, వీసీకే అధ్యక్షుడు తిరుమావళవన్, డీఎండీకే మహిళా విభాగం కార్యదర్శి ప్రేమలత తదితరులు ఈ అంశంపై గళమెత్తారు. రామ్‌కుమార్ మరణం వెనుక ఉన్న వాస్తవాలు వెలుగులోకి రావాలని వారు డిమాండ్ చేశారు. పుళల్ జైలు వద్ద సోమవారం విపక్ష పార్టీలు ఆందోళన, ముట్టడి కార్యక్రమాలు నిర్వహించి నిరసన ప్రకటించాయి. అలాగే రామ్‌కుమార్ సొంతూరు సెంగోట్టై సమీపం మీనాక్షిపురంలో అతని బంధుమిత్రులు సోమవారం ఆందోళన జరిపారు. ఈ సందర్భంగా మూడు ప్రభుత్వ బస్సులు పాక్షికంగా ధ్వంసం అయ్యాయి. న్యాయవిచారణ ప్రారంభం రామ్‌కుమార్‌ది సహజమరణం కాకపోవడంతో రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేగింది. ఈ కారణంగా ప్రభుత్వం న్యాయవిచారణకు ఆదేశించింది. తిరువళ్లూరు కోర్టు న్యాయమూర్తి తమిళ్‌సెల్వి సోమవారం ఉదయం 9.20 గంటలకు రాయపేట ఆసుపత్రికి వచ్చారు. రామ్‌కుమార్ మృతదేహాన్ని పరిశీలించారు. అతని శరీరంపై ఉన్న గాయాల గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. చికిత్స చేసిన డాక్టర్లను విచారించి అక్కడి నుంచి పుళల్ జైలుకు చేరుకున్నారు. రామ్‌కుమార్ ఉన్న గది, కరెంటువైరు కొరికిన ప్రాంతాన్ని పరిశీలించి జైలు అధికారులను విచారించారు. -
సబ్ కలెక్టర్ అడ్డుకున్న స్థానికులు
-
నయీమ్ మృత దేహానికి పంచనామా
-
ఇబ్రహీంపూర్ దాడి: శ్రీహరికి పోస్టుమార్టం పూర్తి
-
ఇబ్రహీంపూర్ దాడి: శ్రీహరికి పోస్టుమార్టం పూర్తి
మెదక్ : మెదక్ జిల్లా ఇబ్రహీంపూర్ దాడి ఘటనలో మృతి చెందిన బీడీ కంపెనీ యజమాని శ్రీహరి మృతదేహానికి పోస్టుమార్టం పూర్తయింది. అనంతరం అతడి మృతదేహాన్ని సిరిసిల్ల మండలం జిల్లెల్లకు పోలీసులు తరలించారు. అయితే స్థానికంగా ఉద్రిక్త వాతావరణం నెలకొన్న నేపథ్యంలో జిల్లెల్ల - ఇబ్రహీంపూర్లో పోలీస్ పికెటింగ్ కొనసాగుతుంది. అలాగే ఇబ్రహీంపూర్ సర్పంచ్ ఇంటిపై దాడి కేసులో ఇప్పటి వరకు చెర్లుమద్ది సర్పంచ్ సహా 30 మంది యువకులను సిద్ధిపేట పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వారిని కోర్టులో హాజరుపరచనున్నారు. అయితే జిల్లెల్లలో శ్రీహరి అంత్యక్రియలు నిర్వహించనున్నారు. అందుకోసం ఏర్పాట్లు చేస్తున్నారు. ఐజీ నవీన్ చంద్ మాత్రం శుక్రవారం ఇరుగ్రామాలను సందర్శించి... పరిస్థితిని ఉన్నతాధికారులతో సమీక్షించారు. -
సారిక, పిల్లల మృతదేహాలకు పోస్టుమార్టం
-
మళ్లీ శవ పరీక్ష ఒక్కరికే
‘శేషాచలం’ ఎన్‌కౌంటర్‌పై హైకోర్టు ఉత్తర్వులు జారీ శశికుమార్ మృతదేహానికి మాత్రమే రీ పోస్టుమార్టం సాక్షి, హైదరాబాద్: శేషాచలం అడవుల్లో ఎన్‌కౌంటర్‌కు సంబంధించి ఇంకా మార్చురీలోనే ఉన్న ఐదుగురి కూలీల మృతదేహాలకు రీ పోస్టుమార్టం నిర్వహించేలా ఆదేశాలిచ్చేందుకు ఉమ్మడి హైకోర్టు నిరాకరించింది. దీనిపై మునియమ్మాళ్ అనే మహిళ ఒక్కరు మాత్రమే హైకోర్టును ఆశ్రయించినందున కేవలం ఆమె భర్త శశికుమార్ మృతదేహానికి మాత్రమే రీ పోస్టుమార్టం చేసేలా గురువారం ఆదేశాలు జారీ చేసింది. ఇందుకోసం తక్షణమే నిపుణులైన డాక్టర్లతో ఓ బృందాన్ని ఏర్పాటు చేయాలని హైదరాబాద్‌లోని నిమ్స్ ఆస్పత్రి డెరైక్టర్‌ను ఆదేశించింది. వైద్య బృందాన్ని సొంత ఖర్చులతో మృతదేహాలున్న తిరువన్నామలై జిల్లాలోని ఆసుపత్రికి తీసుకెళ్లాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. వైద్య బృందం భద్రత కోసం అన్ని చర్యలు తీసుకోవాలని తమిళనాడు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఆదేశించింది. రీ పోస్టుమార్టం జరిగే ఆసుపత్రి చుట్టుపక్కల ఆందోళనలు, నిరసనలు, ధర్నాలు జరగకుండా చూడాలని హైకోర్టు స్పష్టం చేసింది. డాక్టర్లు మినహా మరే వ్యక్తిని ఆసుపత్రి ప్రాంగణంలోకి సైతం అనుమతించరాదని తేల్చి చెప్పింది. వైద్య బృందం నివేదికను ఒక కాపీగా రూపొందించి సీల్డ్ కవర్లో తమకు సమర్పించాలని అదనపు అడ్వొకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్‌కు స్పష్టం చేసింది. నివేదికను దర్యాప్తు అధికారితో సహా ఏ ఒక్కరూ చూడరాదని పేర్కొంది. ఎన్కౌంటర్లో మృతి చెందిన 20 మంది కూలీలకు నిర్వహించిన పోస్టుమార్టం నివేదికను సమర్పించాలని అదనపు ఏజీని ఆదేశిస్తూ తదుపరి విచారణను సోమవారానికి వాయిదా వేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కళ్యాణ్‌జ్యోతి సేన్‌గుప్తా, న్యాయమూర్తి జస్టిస్ పి.వి.సంజయ్‌కుమార్‌లతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. కూలీలను పోలీసులు అతి సమీపం నుంచి కాల్చి చంపి ఎర్రచందనం కూలీలుగా, స్మగ్లర్లుగా చిత్రీకరిస్తున్నారని, దీనిపై సీబీఐ దర్యాప్తునకు ఆదేశించాలంటూ పౌర హక్కుల సంఘం నేత చిల్కా చంద్రశేఖర్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయటం తెలిసిందే. శశికుమార్ భార్య మునియమ్మాళ్‌ను రెండో పిటిషనర్‌గా చేరుస్తూ కోర్టు ఉత్తర్వులిచ్చిన విషయం విదితమే. ఈ వ్యాజ్యాన్ని ఇప్పటికే పలుమార్లు విచారించిన ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం దాన్ని గురువారం మరోసారి విచారించింది. ఇంత ఆలస్యమెందుకు...? విచారణ ప్రారంభం కాగానే అదనపు ఏజీ డి.శ్రీనివాస్‌ను పోస్టుమార్టం, ఇంక్వెస్ట్ నివేదికలపై ధర్మాసనం ఆరా తీసింది. ఇంక్వెస్ట్ నివేదిక సిద్ధమని, 20వ తేదీ కల్లా పోస్టుమార్టం నివేదిక తయారవుతుందని ఏజీ నివేదించారు. దీనిపై పిటిషనర్ తరఫు న్యాయవాది వి.రఘనాథ్ ప్రస్తావించిన అంశాలతో కోర్టు ఏకీభవిస్తూ కాల్పుల కేసులో పోస్టుమార్టం ఆలస్యం తగదని వ్యాఖ్యానించింది. -
ఎన్కౌంటర్ మృతులకు పోస్టుమార్టం పూర్తి
-
రుయా ఆస్పత్రిలో ప్రారంభమైన పోస్ట్‌మార్టం
-
MGM వద్ద గట్టి బందోబస్తు ఏర్పాట్లు
-
వికారుద్దీన్ గ్యాంగ్ బాడీలకు నేడు పోస్టుమార్టం
-
గుర్తుతెలియని వ్యక్తి దారుణ హత్య
రంగారెడ్డి (హయత్‌నగర్): హయత్‌నగర్ మండలంలోని కోహెడ గ్రామ శివారులో మంగళవారం రాత్రి గుర్తుతెలియని ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. తాడుతో మెడకు ఉరిబిగించి చంపినట్లు అనుమానిస్తున్నారు. చంపిన తర్వాత చెట్లపొదల్లో మృతదేహాన్ని పడవేశారు. ఘటన జరిగిన ప్రాంతంలో మద్యం సీసాలు ఉన్నాయి. స్థానికులు మృతదేహాన్ని చూసి పోలీసులుకి సమాచారం ఇవ్వడంతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. -
రిజర్వాయర్‌లో గుర్తుతెలియని శవం
విశాఖపట్నం(సీలేరు): విశాఖపట్నం జిల్లా సీలేరు రిజర్వాయర్‌లో గుర్తుతెలియని వ్యక్తి శవం ఆదివారం ఉదయం బయటపడింది. స్థానికుల సమాచారంతో పోలీసులు సంఘటనా ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఆ వ్యక్తిని ఎవరో కొట్టి చంపి రిజర్వాయర్‌లో పడేసుంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. ఏడు లేదా ఎనిమిది రోజుల క్రితం హత్య జరిగి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. అతడు మృతిచెంది వారం రోజులు అవడంతో మృతదేహం కుళ్లిపోయి చెడువాసన వస్తుంది. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. -
సమస్యల వలయంలో రాజావాడి ఆస్పత్రి
సాక్షి, ముంబై: నగరంలో శవాలను భద్రపరిచే రాజావాడి ఆస్పత్రి అనేక సమస్యలతో కొట్టుమిట్టాడుతోంది. 27 ఏళ్ల కిందట నిర్మించిన ఈ కేంద్రం పట్టించుకునే నాథుడు లేక శిథిలావస్థకు చేరుకుంది. రోజురోజుకు శవాల సంఖ్య పెరుగుతున్నా ఆస్పత్రి సామర్థ్యం మాత్రం పెరగలేదు. గతంలో కొలాబా, బాంద్రా, వడాల ప్రాంతంలోని మృత దేహాలను పోస్టుమార్టం కోసం జే.జే.ఆస్పత్రిలోని కెరోనరీ కోర్టుకి తీసుకొచ్చేవారు. బాంద్రా, దహిసర్ ప్రాంత మృతదేహాలను కూపర్ ఆస్పత్రికి, వడాల, ములుండ్ ప్రాంత మృత దేహాలను రాజావాడికి ఆస్పత్రికి తీసుకొచ్చేవారు. కాగా 1999 జూలై 26న కెరోనరీ కోర్టును మూసివేసి పోలీసు శాఖకు అప్పగించారు. దీంతో ప్రస్తుతం రాజావాడి ఆస్పత్రిలోనే పోస్టుమార్టం నిర్వహిస్తున్నారు. పాడవుతున్న ర్యాక్‌లు...సిబ్బందికి ఇబ్బంది 1988లో నిర్మించిన ఈ కేంద్రంలో 45 మృతదేహాలను భద్రపరిచే సామర్థ్యం ఉంది. 21 పోలీసు స్టేషన్ల పరిధి నుంచి మృత దేహాలు ఇక్కడికి తీసుకొస్తారు. శవాలను భద్రపరిచేందుకు ర్యాక్‌లు ఖాళీ లేకపోవడంతో అత్యవసర సమయంలో నేల పైనే ఉంచాల్సివస్తోంది. దీంతో సిబ్బందికి ఇబ్బందులు పడుతున్నారు. అనాథ శవాలను ఎక్కువరోజులు భద్రపరచాల్సి వస్తోందని, దీంతో ర్యాక్‌లు పాడైపోతున్నాయని డాక్టర్లు అంటున్నారు. ఆస్పత్రిలోని ఏసీ యంత్రాలు కూడా పాతకాలం నాటివి కావడంతో తరుచూ మరమ్మతులు చేయాల్సి వస్తోంది. మహానగర పాలక సంస్థ (బీఎంసీ)కి చెందిన ఈ కేంద్ర స్థలం అద్దె విషయంపై బీఎంసీ, హోం శాఖ మధ్య వాగ్వాదం మరింత ముదురుతోంది. ఇప్పటికైనా ఆస్పత్రి అభివృద్ధికి అధికారులు చర్యలు తీసుకోవాలని ఆస్పత్రివర్గాలు కోరుతున్నాయి. -
వేధింపులు తాళలేక..వివాహిత ఆత్మహత్య
సంగారెడ్డి మండలం కర్దనూరు గ్రామానికి చెందిన జుట్టు సునీత (25)కు నాలుగేళ్ల క్రితం జిన్నారం మండలం దోమడుగుకు చెందిన పాండుతో వివాహం జరిగింది. వీరికి మూడేళ్ల బాబు ఉన్నాడు. అయితే ఏడాదిగా పాండు అదనపు కట్నం కోసం సునీతను వేధిస్తున్నాడు. అంతే కాకుండా గుమ్మడిదలకు చెందిన ఓ మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. ఈ విషయమై సునీత తరచూ పాండును అడ్డుకునే ప్రయత్నాలు చేసింది. అయినా అతను వినలేదు. పాండు వివాహేతర సంబంధం విషయం సునీతకు తెలియడంతో అదనపు కట్నం తీసుకురావాలని వేధించసాగాడు. దీనిపై శనివారం రాత్రి ఇద్దరి మధ్య గొడవ జరిగింది. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన సునీత ఆదివారం తెల్లవారుజామున ఇంట్లోని కిరోసిన్‌ను ఒంటిపై పోసుకుని నిప్పంటించుకుంది. సునీతను కాపాడేందుకు భర్త, చుట్టు పక్కల వారు చేసిన ప్రయత్నాలేవీ ఫలించలేదు. కాలిన గాయాలతో సునీత అక్కడికక్కడే మృతి చెందింది. ఈ విషం తెలుసుకున్న మృతురాలి బంధువులు గ్రామానికి చేరుకున్నారు. సునీత మృతికి కారణమైన పండుపై స్థానికులు మండిపడ్డారు. సంఘటనకు కారణమైన వారిని కఠినంగా శిక్షిస్తామని ఎస్ఐ హామీ ఇవ్వడంతో ఆందోళనకారులు శాంతించారు. మృతురాలి తమ్ముడు ఎల్లయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నామని ఎస్ఐ లాలూనాయక్ తెలిపారు. అదనపు కట్నం కోసం వేధిస్తున్న పాండుతో పాటు అతని తమ్ముడు కూడా పోలీసులు అదుపులో ఉన్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నర్సాపూర్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ సంఘటన దోమడుగులో సంచలనం రేపింది. మృతురాలి బంధువులు, తల్లిదండ్రుల రోదనలతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. -
పాతిపెట్టిన మృతదేహానికి 22 రోజుల తర్వాత పోస్టుమార్టం
కోహీర్ : పాతిపెట్టిన మృతదేహానికి 22 రోజుల తర్వాత పోస్టుమార్టం నిర్వహించిన సంఘటన మండలంలోని దిగ్వాల్ గ్రామంలో బుధవారం చోటు చేసుకుంది. ఎస్ఐ చంద్రశేఖర్ కథనం మేరకు.. గ్రామానికి చెందిన బోయిని నరసింహులు భార్య కమలమ్మ (48) ఈ నెల 2న మృతి చెందింది. దీంతో ఆమెను సంప్రదాయం ప్రకారం ఖననం చేశారు. కాగా జగద్గిరిగుట్టలో ఉంటున్న తల్లి సులోచనమ్మ తన కుమార్తెది సహజ మరణం కాదని అల్లుడు నరసింహులు, ఆయన కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేస్తూ కోహీర్ పోలీసులకు ఫిర్యాదు చే సింది. దీంతో తహశీల్దార్ ఫర్హిన్షేక్ సమక్షంలో సికింద్రాబాద్‌లోని గాంధీ ఆస్పత్రి ప్రొఫెసర్ విజయ్ సాగర్ సమక్షంలో మృతదేహాన్ని వెలికితీసి పోస్టుమార్టం నిర్వహించారు. నివేదిక ఆధారంగా చర్యలు తీసుకుంటామని ఎస్ఐ చంద్రశేఖర్ వివరించారు. -
పల్లవిపై విషప్రయోగం..?
- పోస్టుమార్టం వివరాలు ఫోరెన్సిక్ ల్యాబ్‌కు రెండ్రోజుల్లో తేలనున్న నిజం హుజూరాబాద్ :పట్టణంలోని విద్యానగర్‌లో శనివారం రాత్రి అనుమానాస్పద స్థితిలో మృతిచెందిన నామని పల్లవిపై విషప్రయోగం చేసినట్లు ప్రచారం జరుగుతోంది. కాగా ఫ్యాన్ రెక్కకు ఉరి వేసుకుని మృతిచెందిందని ఆమె భర్త రాజు పోలీసులకు తెలిపిన విషయం తెలిసిందే. పల్లవి ఆత్మహత్య చేసుకోలేదని, ఆమెను హత్యచేసి ఫ్యాన్‌కు ఉరివేసుకున్నట్లు చిత్రీకరించారని మృతురాలి తండ్రి నర్సింహులు, బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పల్లవి శరీరంపై గాయాలు ఉండటం, ఈ సంఘటనపై అనుమానాలు తలెత్తడంతో మృతురాలి బంధువులు రాజు ఇంటిపై దాడిచేశారు. ఆదివారం పల్లవి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం వరంగల్ ఎంజీఎంకు తరలించారు. సాయంత్రం 6గంటల నుంచి అర్ధరాత్రి 12 గంటల వరకు మృతదేహాన్ని పరిశీలన చేసి ఆ తర్వాత వైద్యబృందం పోస్టుమార్టం చేశారు. పల్లవి నోరు, ముక్కు నుంచి తెల్లని నురుగలు రావడం, ఆమె శరీరంలోని కొన్ని భాగాలు నల్లగా మారడంతో వైద్యులు మరింత దృష్టి సారించినట్లు తెలిసింది. తలపై వెంట్రుకలు తొలగించి అణువణువు పరీక్షించినట్లు సమాచారం. అయితే నురగలు కక్కడంతో పల్లవిపై విషప్రయోగం జరిగిందని ఆమె తరపు వ్యక్తులు ఆరోపిస్తున్నారు. వైద్యులు పోస్టుమార్టం వివరాలను ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపినట్లు తెలిసింది. మరో రెండు రోజులు వాస్తవాలు బయటకు వచ్చే అవకాశం ఉంది. దాడి చేసిన వారిపై కేసు నమోదు... పల్లవిని చంపారని ఆరోపిస్తూ రాజు ఇంటిపై దాడిచేసి, వస్తువులను ధ్వంసం చేశారు. ఈ సంఘటనలో పలువురిపై కేసు నమోదు చేసినట్లు సీఐ శ్రీనివాస్ తెలిపారు. నామని రాజు బావ పేరాల శ్రీనివాస్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కందికట్ల మదుసుధన్, బచ్చు శివశంకర్, దీకొండ కృష్ణ, దీకొండ రాజేందర్, శ్రీనివాస్, తిరుపతి, నర్సమ్మ మరికొందరు మహిళలపై కేసు నమోదు చేశామని పేర్కొన్నారు. -
పేరుకే ప్రభుత్వాసుపత్రి.. పంచనామాకీ డబ్బులే!
-
పోస్టుమార్టం అడ్డుకున్న దళిత సంఘాలు
చీమకుర్తి : రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన మహిళ కుటుంబానికి న్యాయం చేసే వరకూ పోస్టుమార్టం చేసేందుకు వీల్లేదని దళిత సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. బుధవారం రాత్రి గోనుగుంట సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో స్థానిక ఎస్సీ కాలనీకి చెందిన పులిపాటి యోగమ్మ మృతి చెందిన విషయం తెలిసిందే. ఆమె మృతదేహానికి రిమ్స్‌లో పోస్టుమార్టం చేసేందుకు వైద్యులు గురువారం సిద్ధమవుతుండగా దళిత సంఘాల నేతలు వచ్చి అడ్డుకున్నారు. కుల నిర్మూలన పోరాట సమితి (కేఎన్పీఎస్) రాష్ట్ర ఉపాధ్యక్షుడు దుడ్డు వెంకట్రావు మాట్లాడుతూ పొట్టచేతబట్టుకొని కూలి పనులకు వెళ్లిన మహిళల్లో ఒకరు మరణించగా మరో ఇద్దరు ప్రాణాపాయస్థితిలో ఉన్నారని చె ప్పారు. మృతురాలి కుటుంబానికి రూ. 5 లక్షల ఎక్స్‌గ్రేషియా, తీవ్రంగా గాయపడ్డ వారి కుటుంబానికి రూ. 50 వేల పరిహారం చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన పులిపాటి శ్రీదేవి పరిస్థితి విషమంగా ఉంది. ఆమెకు రెండు చేతులూ తెగి పడ్డాయి. అల్లడి ఆదెమ్మ, బత్తుల ఈశ్వరమ్మ, బత్తుల కోటేశ్వరి, భూతం లక్ష్మిలు రిమ్స్‌లో చికిత్స పొందుతున్నారు. -
హత్యకు గురైంది మేకప్‌మన్ దర్శన్
బెంగళూరు : రాజగోపాలనగరలోని లక్ష్మిదేవి నగరంలో సోమవారం రాత్రి హత్యకు గురైన యువకుడి పేరు, వివరాలను పోలీసులు సేకరించారు. మృతుడిని హాసన్ జిల్లా అరసికెరెకు చెందిన దర్శన్‌గా గుర్తించామని పోలీసులు గురువారం చెప్పారు. ఇతను కన్నడ టివీ సీరియల్స్‌లో నటించే నటీ నటులకు మేకప్‌మన్‌గా పనిచేస్తున్నాడు. నెల క్రితం బెంగళూరు చేరుకుని ఇక్కడి నందిని లేఔట్‌లోని బంధువుల ఇంటిలో నివాసముంటున్నాడు. ఒక్కసారి ఉద్యోగానికి వెళితే రెండు, మూడు రోజుల తరువాత ఇంటికి వచ్చేవాడు. దీంతో అతను ఇంటికి రాకపోయినా దర్శన్ బంధువులు పెద్దగా పట్టించుకొలేదు. సోమవారం రాత్రి దర్శన్‌ను మారణాయుధాలతో దారుణంగా నరికి హత్య చేశారు. బుధవారం రాజగోపాల నగరలోని లక్ష్మిదేవీ నగరలో యువకుడిని దారుణంగా హత్య చేశారని స్థానికులు పదేపదే మాట్లాడుకుంటున్న విషయం దర్శన్ బంధువులకు తె లిసింది. అనుమానం వచ్చి విక్టోరియా ఆస్పత్రిలో మృతదేహాన్ని చూశారు. హత్యకు గురైంది దర్శన్నేనని గుర్తించారు. హత్యకు కారణాలు తెలియడం లేదని, మృతదేహానికి పోస్టుమార్టుం నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించామని, కేసు దర్యాప్తులో ఉందని పోలీసులు గురువారం తెలిపారు. -
ఎస్సై మృతదేహానికి పోస్టుమార్టం
ఒంగోలు సెంట్రల్ : తుపాకీ మిస్‌ఫైరై మరణించిన జె.పంగులూరు మండలం రేణంగివరం ఎస్సై కె.విష్ణుగోపాల్(28) మృతదేహానికి ఒంగోలు రిమ్స్‌లో శనివారం పోస్టుమార్టం నిర్వహించారు. ఫోరెన్సిక్ ప్రొఫెసర్ రాజ్‌కుమార్ ఆధ్వర్యంలోని వైద్యుల బృందం మధ్యాహ్నానికల్లా పోస్టుమార్టం పూర్తి చేసింది. ఒంగోలు డీఎస్పీ జాషువా, ఇతర పోలీసు అధికారులు రిమ్స్‌లోనే ఉండి ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఎస్పీ చిరువోలు శ్రీకాంత్ మధ్యాహ్నం 3 గంటల సమయంలో రిమ్స్‌కు చేరుకుని ఎస్సై మృతదేహాన్ని పరిశీలించి ఘన నివాళులర్పించారు. మృతుని కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ సందర్భంగా మృతుని తండ్రి రామకృష్ణ, తమ్ముడు ప్రవీణ్‌కుమార్‌లు మాట్లాడుతూ తమ కుటుంబానికి ఎస్సై విష్ణుగోపాలే పెద్ద దిక్కని, అంతా ఆయనపైనే ఆధారపడి జీవిస్తున్నామని, తమకు న్యాయం చేయాలని ఎస్పీని కోరారు. అనంతరం మృతదేహాన్ని ఐస్ బాక్సులో ఉంచి మార్చూరీ నుంచి బయటకు తీసుకువచ్చి తాత్కాలికంగా ఏర్పాటు చేసిన టెంట్లో ఉంచారు. ఈ సందర్భంలో మృతుని తల్లి భోరున విలపించింది. అనంతరం ఎస్సై మృతదేహాన్ని స్వగ్రామం నెల్లూరు జిల్లా బోగోలు బిట్రగుంట తీసుకెళ్లారు. అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్, మాజీ ఎంపీ కరణం బలరామకృష్ణమూర్తిలు నివాళులర్పించారు. మృతుని తల్లిదండ్రులకు సంతాపం ప్రకటించారు. మృతుని కుటుంబ సభ్యులకు ఏఎస్పీ రాములు నాయక్, ఎస్బీ సీఐ తిరుమలరావు, వన్‌టౌన్ సీఐ కె.వెంకటేశ్వరరావు, ట్రాఫిక్ సీఐ రవిచంద్ర, పలువురు ఎస్సైలు, కానిస్టేబుళ్లు ఓదార్చారు. -
శవాలు కుళ్లిపోతున్నాయి..!
- మాలిన్‌లో వ్యాపిస్తున్న దుర్గంధం - ప్రజల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం - శవపరీక్షలు జరపకుండానే అంత్యక్రియలు జరిపేందుకు యోచన సాక్షి, ముంబై : పుణే జిల్లా అంబేగావ్ తాలూకా మాలిన్ గ్రామ పరిసర ప్రాంతవాసులకు తీవ్ర ఆరోగ్య సమస్యలు ఎదురవుతున్నాయి. సహాయక చర్యలు కొనసాగుతున్నా కొండచరియలు విరిగిపడి నాలుగు రోజులు పూర్తికావడంతో శిథిలాల కింద ఇరుకున్నవారు ప్రాణాలతో ఉండే అవకాశాలు దాదాపు లేనట్టేనని భావిస్తున్నారు. దీంతో మతుల సంఖ్య మరింత పెరిగే అవకాశాలున్నాయి. నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాలు, బురద కారణంగా మృతదేహాలను బయటకు తీయడంతోపాటు శవపరీక్షలు జరిపి వారిని గుర్తించడం, అనంతరం అంత్యక్రియలు నిర్వహించడం తదితర ప్రక్రియలకు అవాంతరాలు ఏర్పడుతున్నాయి. దీంతో మాలిన్ గ్రామం పరిసరాల్లో మట్టిలో కూరుకుపోయిన మృతదేహాలు కుళ్లిపోయి అక్కడ తీవ్ర దుర్గంధం వ్యాపిస్తోంది. ఈ దుర్గంధం కారణంగా చుట్టుపక్కల ప్రజల ఆరోగ్యంపై కూడా ప్రభావం పడుతోంది. శిథిలాలను తొలగించే పనులు మరో రెండు మూడురోజులపాటు కొనసాగే అవకాశాలు కన్పిస్తున్నాయి. ఈ నేపథ్యంలో కుళ్లిన మృతదేహాల నుంచి వస్తున్న దుర్గంధం కారణంగా స్థానికులు రోగాల బారిన పడకుండా ఉండేందుకు శవపరీక్షలు చేయకుండానే అంత్యక్రియలు నిర్వహించాలని యోచిస్తున్నారు. ప్రస్తుతం శవపరీక్షల కోసం మాలిన్ గ్రామానికి సుమారు మూడు కిలోమీటర్ల దూరంలోని అడివరె గ్రామానికి తరలిస్తున్నారు. అయితే అక్కడ కూడా శవాలను ఉంచేందుకు సరైన స్థలంలేదు. మరోవైపు శవపరీక్షలు పూర్తిచేసి వారిని గుర్తుపట్టే ప్రక్రియ చాలా జాప్యమవుతోంది. దీంతో శవాలు మరింత కుళ్లి విపరీతమైన దుర్గంధం వ్యాపిస్తోంది. ఈ నేపథ్యంలో శవపరీక్షలు చేయకుండా మృతులను గుర్తించేందుకు ఫొటోలు, డీఎన్ఎ నమూనాలు సేకరించాలని డాక్టర్లు భావిస్తున్నారు. మరోవైపు ప్రస్తుతం శవపరీక్షల అనంతరం గుర్తించిన వారికి సామూహికంగానే అంత్యక్రియలు నిర్వహిస్తున్నారు. ఉపగ్రహ చిత్రంలో గల్లంతైన మాలిన్ ... పుణేకు సుమారు 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న మాలిన్ గ్రామంపై కొండచరియలు విరిగిపడిన అనంతరం అక్కడి పరిస్థితులను తెలుసుకునేందుకు ఉపగ్రహం ద్వారా ఫొటోలను తీశారు. ఈ ఫొటోల్లో మాలిన్ గ్రామం కన్పించకుండాపోయింది. మాలిన్ గ్రామం ఉండే స్థానంలో కేవలం బురదతోపాటు ఒకటిరెండు ఇళ్లు కన్పిస్తున్నాయి. 82కు పెరిగిన మృతుల సంఖ్య పుణే: కొండ చరియలు విరిగిపడిన ఘటనలో మాలిన్ గ్రామంలో మృతుల సంఖ్య శనివారానికి 82కు పెరిగింది. ఇంకా సహాయక చర్యలను కొనసాగిస్తున్నట్లు అదనపు జిల్లా కలెక్టర్ గణేశ్ పాటిల్ తెలిపారు. ఇప్పటివరకు ఎన్డీఆర్ఆఫ్ దళాలు 23 మందిని కాపాడాయని ఆయన చెప్పారు. మట్టిలో సుమారు 200 మంది గ్రామస్తులు, వందలాది పశువులు కూరుకుపోయినట్లు అనుమానిస్తున్నామన్నారు. కాగా, మృతుల్లో 42 మంది మహిళలు, 30 మంది పురుషులు, 10 మంది బాలలు ఉన్నట్లు ఆయన వివరించారు. -
ఓటమిపై ‘పోల్’మార్టం
- పరాజయాన్ని జీర్ణించుకోలేకపోతున్న నేతలు - తప్పిన లెక్కలపై బేరీజు - నష్టమెక్కడో వెతుకులాట వరంగల్, న్యూస్‌లైన్ : సార్వత్రిక ఎన్నికల ఓటమిపై ప్రధాన పార్టీల అభ్యర్థుల పోస్ట్‌మార్టం మొదలైంది. గెలుపుపై పూర్తి విశ్వాసంతో ఉన్న నేతలైతే ఓటమిని జీర్ణించుకోలేకపోతున్నారు. ఎందుకిలా జరిగిందని మథన పడుతున్నారు. ఫలితాలు వెల్లడై ఎక్కడెక్కడ ఎన్ని ఓట్లు వచ్చాయో తేలిడంతో లోటుపాట్లపై బేరీజు వేసుకుంటున్నారు. నమ్మకమైన పార్టీ నాయకులు, అనుచరులతో జరిగిన నష్టంపై చర్చల్లో నిమగ్నమయ్యారు. ఓడిపోయిన నేతల ఇళ్ల వద్ద ఓదార్పులు, ఇలా చేసుంటే బాగుండేదనే నిట్టూర్పులు వినిపిస్తున్నాయి. కాంగ్రెస్, టీడీపీ నేతల్లో ఈ ఆందోళన స్పష్టంగా కనిపిస్తుండగా గులాబీ గాలివీచినా గెలవకపోవడంపై టీఆర్ఎస్ నాయకుల్లో నిరాశ వ్యక్తమవుతోంది. ఇక మోడీ ప్రభంజనంలోనూ ఓటమి మూటగట్టుకోవడంపై బీజేపీ నేతల్లో ఆవేదన వ్యక్తమవుతోంది. కాంగ్రెస్‌లో నిర్వేదం ఓటమిపాలైన కాంగ్రెస్ నేతల్లో నిర్వేదం కనిపిస్తోంది. టీపీసీసీ అధ్యక్షుడు పొన్నాల ప్రాతినిధ్యం వహిస్తున్న జనగామలో ఆయన అనుచరులు, పార్టీ శ్రేణులు ఒక్కసారిగా నీరుగారిపోయారు. టీపీసీసీ అధ్యక్షుడిగా గెలిస్తే తెలంగాణ సీఎం అయ్యే అవకాశాలున్నాయనే ప్రచారం జరిగినా పొన్నాల ఓటమి చెందడంతో అందరూ షాక్‌కు గురయ్యారు. వరంగల్ తూర్పులో బలమైన నేతగా ఉన్న సారయ్య భారీ మెజార్టీతో ఓటమిపాలవడం తట్టుకోలేకపోతున్నారు. ఎన్నికలను ఎదుర్కొవడంలో ఎంతో అనుభవం ఉన్న ఆయన వ్యవహరించిన తీరు అతివిశ్వాసమా? అనే చర్చ పార్టీ వర్గాల్లో సాగుతోంది. నిన్నటి వరకు కాంగ్రెస్‌కు బలమైన ప్రాంతాలుగా ఉన్న చోట్ల కూడా టీఆర్ఎస్కు అనుకూలంగా ఓటింగ్ జరగడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. భూపాలపల్లిలో మాజీ చీఫ్‌విప్ గండ్రను తెలంగాణవాదం కొంపముంచింది. ఆయన సర్వశక్తులొడ్డినప్పటికీ కోల్‌బెల్ట్‌లో నష్టం జరిగింది. దీనికి స్థానిక నాయకుల అతివిశ్వాసమే కారణమంటున్నారు. ప్రభుత్వ వ్యతిరేకత ఎదురైనప్పటికీ సకాలంలో సరిదిద్దుకోలేక పోవడంతో పరిస్థితి చేయిదాటిపోయిందనే చర్చ పార్టీ వర్గాల్లోసాగుతోంది. హోరాహోరీ పోరులో పాలకుర్తిలో కాంగ్రెస్ అభ్యర్థి దుగ్యాల ఓటమిచెందడంతో కార్యకర్తల్లో తీవ్ర నిరాశ వ్యక్తమవుతోంది. తెలంగాణ అనుకూల వాతావరణంలో టీడీపీ చేతిలో ఓడిపోవడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. మహబూబాబాద్‌లో కవిత తీవ్ర ప్రయత్నం చేసినప్పటికీ పార్టీలో అంతర్గతంగా ఉన్న గ్రూపులు, వర్ధన్నపేటలో శ్రీధర్‌కు, ములుగులో వీరయ్యకు ప్రభుత్వ వ్యతిరేకత దెబ్బతీసినట్లు భావిస్తున్నారు. స్టేషన్‌ఘన్‌పూర్‌లో విజయరామారావు, వరంగల్ పశ్చిమలో స్వర్ణ, పరకాలలో వెంకట్రాంరెడ్డి, నర్సంపేటలో వెంకటస్వామిప్రజాభిమానాన్ని పొందలేక పోయారంటున్నారు. గులాబీల్లో ఆవేదన గులాబీ పవనాలు వీచినప్పటికీ విజయం సాధించకపోవడంతో నర్సంపేట టీఆర్ఎస్ శ్రేణుల్లో నిర్వేదం వ్యక్తమవుతోంది. ఉద్యమంలో కీలక పాత్ర వహించిన పెద్ది సుదర్శన్‌రెడ్డికి ఇక్కడ ప్రజల్లో పట్టున్నప్పటికీ ఓటమిపాలు కావడం మింగుడుపడడంలేదు. కాంగ్రెస్‌పై వ్యతిరేకత స్థానంలో సానుభూతి పవనాలు వీయడంతో ఓటమితప్పలేదు. అనుభవరాహిత్యం ఇక్కడ నష్టం చేసిందంటున్నారు. పాలకుర్తిలో సుధాకర్‌రావు సానుకూల వాతావరణానికి తగిన విధంగా ఎత్తులు వేయకపోవడం, ప్రత్యర్థులను దీటుగా ఎదుర్కొలేకపోవడం వల్లే కారు పరుగులు తీసిందంటున్నారు. పరకాలలో సహోదర్‌రెడ్డికి పట్టులేక పోవడంతో నష్టం వాటిల్లింది. పార్టీలో గ్రూపులు కొంత నష్టం చేశాయి. పరకాల పట్టణంలో పట్టుకోల్పోవడం టీఆర్ఎస్ను దెబ్బతీసిందని భావిస్తున్నారు. డోర్నకల్‌లో పార్టీ మారినప్పటికీ ఇక్కడ గులాబీ బలంగా లేకపోవడంతో నష్టం వాటిల్లింది. ఓటుమార్పులో లోటుపాట్లతో సత్యవతి ఓటమితప్పలేదంటున్నారు. టీడీపీ విఫలం నర్సంపేటలో సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న రేవూరి తెలంగాణ ఉద్యమ సమయంలో చంద్రబాబు అనుసరించిన తీరుకు తగిన విధంగా స్పందించకపోవడంతో జరగాల్సిన నష్టం జరిగిందనే వాదన వినిపిస్తోంది. కాంగ్రెస్, టీఆర్ఎస్ రాజకీయ దాడితో కేడర్‌లో ఆత్మవిశ్వాసం నింపలేక చతికిలపడ్డామనే అంచనాకు వచ్చారు. ములుగులో పార్టీపై వ్యతిరేకత సీతక్క ఓటమికి కారణమైంది. అయితే పార్టీని తిరిగి పట్టాలెక్కించే సత్తా తనకుందనే ధీమా వ్యక్తం చేస్తున్నారు. కేడర్‌లో విశ్వాసం పెంచేయత్నం చేస్తున్నారు. మహబూబాబాద్, డోర్నకల్‌లలో టీడీపీ అభ్యర్థులు బాలుచౌహాన్, రామచంద్రునాయక్‌ల ప్రయోగం ఫలించలేదు. పార్టీ కేడర్‌లో ఆత్మవిశ్వాసం పెంచలేకపోయారు. బీజేపీకి కలిసిరాని పొత్తు టీడీపీతో పొత్తు జిల్లాలో కలిసిరాలేదనే అభిప్రాయం బీజేపీ అభ్యర్థులో ఉంది. తూర్పు, పశ్చిమ, జనగామ, భూపాల్పల్లి నుంచి బరిలో నిలిచిన రావు పద్మ, ధర్మారావు, ప్రతాపరెడ్డి, సత్యనారాయణరావుల్లో ఆవేదన నెలకొంది. ఓట్ల మార్పు సాధ్యం కాలేదంటున్నారు. ఇక టీడీపీ ఏ మేరకు సహకరించిందో పోస్ట్‌మార్టమ్ చేస్తున్నారు. టీడీపీపై వ్యతిరేకత తమకు నష్టం చేసిందనే అంచనాకొచ్చారు. -
పోస్టుమార్టం: బెజవాడ బ్యాంకు ఉద్యోగి భార్య హత్య
-
పోస్ట్‌మార్టమ్
-
సునందా పుష్కర్ది ఆత్మహత్య కాదా?
-
సునందా పుష్కర్ది ఆత్మహత్య కాదా?
సునంద పుష్కర్ మృతి కేసులో కొత్త ట్విస్ట్ బయటపడింది. కేంద్ర మంత్రి శశిథరూర్ మూడో భార్య సునందా పుష్కర్ది ఆత్మహత్య కాదా? ఆమె ఏ కారణం వల్ల మరణించారు? పోస్టుమార్టం చేసిన వైద్యులు చెప్పే విషయాలను చూస్తే ఈ విషయంలో అనేక అనుమానాలు తలెత్తుతున్నాయి. శుక్రవారం రాత్రి అనుమానాస్పద స్థితిలో మరణించిన సునందా పుష్కర్ మృతదేహానికి ఆలిండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్)లో శనివారం మధ్యాహ్నం పోస్టుమార్టం పూర్తయింది. ఆమె విషం తీసుకోలేదని పోస్టుమార్టం చేసిన వైద్య నిపుణులు నిర్ధారించారు. అలాగే, ఆమె శరీరంపై ఉన్న గాయాల కారణంగానే మరణించారని కూడా చెప్పలేమని అన్నారు. రెండు మూడు రోజుల తర్వాత మాత్రమే ఆమె మృతికి గల కారణాలపై ఓ అంచనాకు రాగలమని తెలిపారు. పోస్టుమార్టం ప్రక్రియ మొత్తాన్ని పారదర్శకత కోసం వీడియో తీశారు. కాగా సునదా పుష్కర్ శరీరంపై కొన్ని గాయాలున్నాయని, అవి కొంత అనుమానాన్ని కలిగిస్తున్నాయని ఎయిమ్స్ ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ హెడ్ సుధీర్ గుప్తా తెలిపారు. పూర్తి స్థాయిలో విశ్లేషించిన తర్వాతే అన్ని వివరాలు వెల్లడిస్తామని ఆయన చెప్పారు. -
అందరూ ఉన్నా అనాధగా.. !
-
నిమ్స్ మార్చరీకి ఉదయ్ కిరణ్ మృతదేహం
హైదరాబాద్ : సినీనటుడు ఉదయ్ కిరణ్ మృతదేహానికి పోస్ట్‌మార్టం పూర్తయింది. ఉస్మానియా వైద్యులు పోస్ట్‌మార్టం పూర్తి చేశారు. అనంతరం మృతదేహాన్ని నిమ్స్ మార్చరీకి తరలించారు. అయితే మార్చరీకి తాళం వేసి ఉండటంతో సుమారు 20 నిమిషాల పాటు మృతదేహాన్ని బయటే ఉంచారు. కాగా ఉదయ్ కిరణ్ అంత్యక్రియలు మంగళవారం పంజాగుట్ట స్మశాన గుట్టలో జరగనున్నట్లు తెలుస్తోంది. కాగా అతని సోదరి మస్కట్ నుంచి ఈరోజు సాయంత్రానికి హైదరాబాద్ చేరుకోనున్నారు. అనంతరం అంత్యక్రియలపై ఓ స్పష్టత రానుంది. ఉదయ్ కిరణ్ రాత్రి 12:15 నిమిషాలకు ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. మరోవైపు ఉదయ్ కిరణ్ మృతిపై ఉన్న అనుమానాలను నివృత్తి చేయాలని మానవ హక్కుల కమిషన్‌లో ఓ న్యాయవాది ఫిర్యాదు చేశారు. ఇక ఉదయ్ కిరణ్ అంత్యక్రియలపై సందిగ్దత నెలకొంది. అతని కుటుంబ సభ్యులు కూడా పట్టించుకోకపోవటంపై అభిమానులు ఆవేదన చెందుతున్నారు. ఉదయ్ కిరణ్ తండ్రికాని, భార్య విషిత కుటుంబ సభ్యులు కానీ, మృతదేహాన్ని తీసుకు వెళ్లేందుకు రాకపోవటంపై వారు అసంతృప్తి వ్యక్తం చేశారు. తమ అభిమాన హీరోకి ఇలాంటి దుస్థితి రావటం బాధాకరమన్నారు. -
లారీ, ఆటో ఢీ: ఇద్దరు వ్యక్తులు మృతి
గోనెగన్ల సమీపంలో శుక్రవారం తెల్లవారుజామున లారీ, ఆటో ఢీ కొన్న ఘటనలో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఎనిమిది మంది తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు వెంటనే స్పందించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకుని క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. కాగా వారిలో ఇద్దరు పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. ఆ ప్రమాదంలో మరణించిన రెండు మృతదేహలను పోలీసులు స్వాధీనం చేసుకుని పోస్ట్‌మార్టం నిమిత్తం కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. అలాగే నల్లొండ జిల్లా మిర్యాలగూడ మండలం నందిపాడు బైపాస్ వద్ద బైక్ ఢీకొని ఇద్దరు మృతి చెందారు. పోలీసులు ఆ రెండు మృతదేహలను నల్లొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు -
స్కార్పియోను ఢీ కొన్న లారీ: ఇద్దరు మృతి
రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం సిద్దాంతి వద్ద బుధవారం ఉదయం స్కార్పియో వాహనాన్ని లారీ ఢీ కొట్టింది. ఆ ఘటనలో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మరణించారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. అదే రహదారిపై వెళ్తున్న వాహనదారులు వెంటనే స్పందించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకుని క్షతగాత్రులను హైదరాబాద్ నగరంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అనంతరం మృతదేహలను స్వాధీనం చేసుకుని పోస్ట్‌మార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి పంపారు. అయితే క్షతగాత్రుల పరిస్థితి ఆందోళనకరంగా ఉందని వైద్యులు తెలిపారు. అలాగే విశాఖపట్నం జిల్లాలోని అనంతగిరి ఘాట్ రోడ్డులో ఈ రోజు ఉదయం ఓ వ్యాన్ బోల్తా పడింది. ఆ ఘటనలో ఇద్దరు వ్యక్తులు మరణించారు. పోలీసులు మృతదేహలను స్వాధీనం చేసుకుని విశాఖపట్నంలోని కింగ్‌జార్జ్ ఆసుపత్రికి తరలించారు. మృతులిద్దరి స్వస్థలం కొత్తూరు, జామీ వాసులగా గుర్తించినట్లు పోలీసులు వెల్లడించారు. మృతుల కుటుంబసభ్యులకు సమాచారం అందించినట్లు అనంతగిరి పోలీసులు వెల్లడించారు.