![Eyes Stolen While Post Mortem Of Deceased Woman - Sakshi](/styles/webp/s3/article_images/2023/12/12/post%20mortem.jpg.webp?itok=JrpetPHa)
ముజరియా(యూపీ): హత్యకు గురైన ఓ యువతి శరీరం నుంచి కళ్లు దొంగిలించారని యువతి బంధువులు ఆరోపించారు. పోస్టుమార్టంలోనే ఇది జరిగిందని కుటుంబ సభ్యులు ఆరోపించారు. దీంతో జిల్లా కలెక్టర్ ఆ యువతి మృతదేహానికి రెండోసారి పోస్టుమార్టం చేయాలని ఆదేశించారు. ఈ దారుణ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని ముజారియా జిల్లా రసూలా గ్రామంలో జరిగింది.
‘వరకట్న కోసం పూజ(20)ను చంపారని ఆమె భర్తపై డౌరీ కేసు నమోదైంది. ఈ కేసులో పూజ మృతదేహానికి పోస్టుమార్టం చేశారు. మృతదేహాన్ని బంధువులకు అప్పగించినపుడు అసలు విషయం బయటపడింది. పూజ కళ్లు దొంగిలించారని కుటుంబ సభ్యులు తెలిపారు.
మానవ అవయవాల అక్రమ రవాణా జరిగిందని పూజ బంధువులు ఫిర్యాదు చేశారు. దీంతో మృతదేహాన్ని మళ్లీ పోస్టుమార్టం కోసం పంపించాం. కళ్లు దొంగిలించడం నిజమే అయితే బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం’అని కలెక్టర్ మనోజ్‌కుమార్ తెలిపారు.
ఇదీచదవండి.. మాజీ సీఎం ఒమర్ అబ్దుల్లా విడాకులపై కోర్టు కీలక తీర్పు
Comments
Please login to add a commentAdd a comment