Married woamn
-
భర్త, పిల్లల దగ్గరికి రాకుండా... లావణ్య ఎక్కడ వెళ్ళింది
హైదరాబాద్: భర్త, పిల్లల దగ్గరకు వెళ్లేందుకు ఇంటి నుంచి బయలుదేరిన ఓ గృహిణి తిరిగిరాని సంఘటన బాలానగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో మంగళవారం చోటు చేసుకుంది. బాలానగర్ సీఐ కె. భాస్కర్ తెలిసిన వివరాల ప్రకారం... రాజకుమార్ లావణ్య దంపతులు ఫిరోజ్‌గూడలో తమ కుటుంబసభ్యులతో కలిసి నివాసం ఉంటోంది. భర్త, పిల్లలు ఊరికి వెళ్లటంతో వారిని కలిసేందుకు సోమవారం సాయంత్రం ఇంటి నుంచి బయలుదేరి వెళ్లింది. అయితే ఆమె భర్త, పిల్లలను కలవలేదు. ఆమె ఆచూకీ లభించకపోవటంతో పలు చోట్ల గాలించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లుగా పోలీసులు తెలిపారు. -
పోస్టుమార్టంలో కళ్లు మాయం..కలెక్టర్ సంచలన నిర్ణయం
ముజరియా(యూపీ): హత్యకు గురైన ఓ యువతి శరీరం నుంచి కళ్లు దొంగిలించారని యువతి బంధువులు ఆరోపించారు. పోస్టుమార్టంలోనే ఇది జరిగిందని కుటుంబ సభ్యులు ఆరోపించారు. దీంతో జిల్లా కలెక్టర్ ఆ యువతి మృతదేహానికి రెండోసారి పోస్టుమార్టం చేయాలని ఆదేశించారు. ఈ దారుణ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని ముజారియా జిల్లా రసూలా గ్రామంలో జరిగింది. ‘వరకట్న కోసం పూజ(20)ను చంపారని ఆమె భర్తపై డౌరీ కేసు నమోదైంది. ఈ కేసులో పూజ మృతదేహానికి పోస్టుమార్టం చేశారు. మృతదేహాన్ని బంధువులకు అప్పగించినపుడు అసలు విషయం బయటపడింది. పూజ కళ్లు దొంగిలించారని కుటుంబ సభ్యులు తెలిపారు. మానవ అవయవాల అక్రమ రవాణా జరిగిందని పూజ బంధువులు ఫిర్యాదు చేశారు. దీంతో మృతదేహాన్ని మళ్లీ పోస్టుమార్టం కోసం పంపించాం. కళ్లు దొంగిలించడం నిజమే అయితే బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం’అని కలెక్టర్ మనోజ్‌కుమార్ తెలిపారు. ఇదీచదవండి.. మాజీ సీఎం ఒమర్ అబ్దుల్లా విడాకులపై కోర్టు కీలక తీర్పు -
క్షణికావేశంలో వివాహిత తీవ్ర నిర్ణయం!
సాక్షి, ఆదిలాబాద్: క్షణికావేశంలో పురుగుల మందు తాగి వివాహిత ఆత్మహత్య చేసుకున్న సంఘటన మండలంలోని ముత్నూర్‌లో చోటు చేసుకుంది. మృతురాలి కుటుంబ సభ్యులు, ఎస్సై దు బ్బాక సునీల్ తెలిపిన వివరాల ప్రకారం బోథ్ మండలంలోని వజ్జర గ్రామానికి చెందిన కవిత (26)కు ఇంద్రవెల్లి మండలంలోని ముత్నూర్ గ్రామానికి చెందిన గేడం జ్యోతిరాంతో 2021 లో వివాహమైంది. గురువారం ఉదయం జ్యోతిరాం మద్యం సేవించి ఇంటికి వచ్చి భార్యతో గొడవపడ్డాడు. క్షణికావేశంలో కవిత ఇంట్లో ఉన్న గుర్తు తెలియని పురుగుల మందు తాగింది. గమనించిన కుటుంబ సభ్యులు ఆస్పత్రికి త రలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందింది. మృతురాలు తండ్రి సిడాం లక్ష్మణ్ ఇ చ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. ముఖ్య గమనిక: ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001 మెయిల్: roshnihelp@gmail.com -
వివాహిత 26 వారాల గర్భవిచ్చిత్తి కేసులో... సుప్రీం భిన్న తీర్పులు
న్యూఢిల్లీ: గర్భ విచ్చిత్తికి సంబంధించిన ఒక కేసులో అత్యున్నత న్యాయస్థానం ఏకాభిప్రాయానికి రాలేకపోయింది. సుప్రీం కోర్టులో ద్విసభ్య బెంచ్ బుధవారం భిన్న తీర్పుల్ని వెలువరించింది ఒక వివాహిత గర్భం దాలి్చన 26 వారాలకు గర్భవిచ్చిత్తి కోరుతూ కోర్టును ఆశ్రయించింది. దీనిపై ఎయిమ్స్ ఇచి్చన నివేదికను పరిశీలించిన సుప్రీంకోర్టు బెంచ్‌లోని న్యాయమూర్తి జస్టిస్ హిమ కొహ్లి పిండం గుండె ఆపేయాలని ఏ కోర్టు అయినా ఎందుకు చెబుతుందని ప్రశి్నస్తూ గర్భవిచ్ఛిత్తికి నిరాకరించారు. సుప్రీం బెంచ్‌లో మరో న్యాయమూర్తి జస్టిస్ బి.వి. నాగరత్న దాంతో విభేదించారు. మహిళ నిర్ణయాన్ని తప్పనిసరిగా గౌరవించాలని అన్నారు. వివరాల్లోకి వెళితే........ ఇద్దరు పిల్లలున్న ఒక వివాహిత మూడోసారి గర్భం దాల్చింది. అప్పటికే కుంగుబాటు సమస్యతో బాధపడుతున్న ఆమె మానసికంగా, ఆర్థికంగా తాను మరో పిల్లని పెంచడానికి సంసిద్ధంగా లేనని, అందుకే గర్భవిచ్చిత్తికి అనుమతినివ్వాలని సుప్రీంకోర్టుని ఆశ్రయించింది. గర్భం దాల్చి 26 వారాల కావడంతో ఎయిమ్స్‌లో వైద్యులు ఆమెని పరీక్షించి అబార్షన్ వల్ల ఎలాంటి ప్రమాదం లేదని అక్టోబర్ 6న నివేదిక కూడా ఇచ్చారు. ఈ పిటిషన్‌ను విచారించిన సుప్రీంకోర్టు గర్భవిచ్చిత్తికి అనుమతినిస్తూ అక్టోబర్ 9న తీర్పు చెప్పింది.ఆ మహిళకు అబార్షన్ చేయాలని ఎయిమ్స్ వైద్యాధికారుల్ని ఆదేశించింది. అబార్షన్‌కు ముందు ఎయిమ్స్ డాక్టర్లు ఆమెని పరీక్షించి గర్భవిచ్చిన్నం చేసినా శిశువు సజీవంగానే ఉంటుందని అభిప్రాయపడ్డారు. ఇదే విషయాన్ని స్పష్టంగా చెబుతూ మరో నివేదిక ఇచ్చారు. దీంతో కేంద్ర ప్రభుత్వం గర్భవిచ్చిత్తి నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాల్సిందిగా అక్టోబర్ 10న మరో పిటిషన్ దాఖలు చేసింది. అత్యవసరంగా బుధవారం ఆ పిటిషన్‌ను విచారించిన సుప్రీం బెంచ్ తొలుత ఎయిమ్స్‌లో మరో వైద్య బృందం గర్భవిచ్చిత్తి వల్ల వచ్చే ప్రమాదేమేమీ లేదని ఇచ్చిన నివేదికను ప్రస్తావించింది. అక్టోబర్ 6 న అబార్షన్‌కు ప్రమాదం లేదని వైద్యులు ఎందుకు నివేదిక ఇచ్చారు ? ఎందుకు ఆ దాపరికం ? నాలుగు రోజుల్లోనే ఎలా పరిస్థితి మారింది ? అని ప్రభుత్వం తరఫున హాజరైన అదనపు సొలిసిటర్ జనరల్ ఐశ్వర్య భాటిపై న్యాయమూర్తులు ప్రశ్నల వర్షం కురిపించారు. గర్భ విచ్చిన్నం చేసినా శిశువు బతికే ఉంటుందని అంటే ఏ కోర్టు అయినా పిండం గుండె ఆపేయమని ఎందుకు చెబుతుంది ? అంటూ జస్టిస్ హిమాకొహ్లీ ప్రశ్నించారు. నా వరకు నేనైతే అలాంటి పని చేయలేనన్న జస్టిస్ హిమ గర్భవిచ్చిత్తికి నిరాకరించారు. మరో న్యాయమూర్తి జస్టిస్ నాగరత్న అక్టోబర్ 9న సుప్రీంకోర్టు ఇచి్చన తీర్పుని ప్రస్తావించారు. ఇప్పటికీ ఆ మహిళ గర్భం తీసివేయడం పట్ల సుముఖంగా ఉన్నందున ఆమె నిర్ణయాన్ని గౌరవించాలంటూ గర్భవిచ్చిత్తికి అనుమతినిస్తూ తీర్పు చెప్పారు. ఆ మహిళ సామాజిక ఆర్థిక పరిస్థితులతో పాటు ఆమె శారీరక, మానసిక పరిస్థితుల దృష్ట్యా గర్భవిచ్చిత్తి చేయడమే సరైనదన్నారు. ఇద్దరు న్యాయమూర్తులు ఏకాభిప్రాయానికి రాలేకపోవడంతో ఈ కేసుని సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ చంద్రచూడ్‌కు పరిశీలనకు సిఫారసు చేశారు. -
వివాహితతో చనువుగా... యువకుడు మృతి
నరసన్నపేట: మడపాం పంచాయతీ కొత్తపేట గ్రామానికి చెందిన తోట కృష్ణ (35) అనుమానాస్పదంగా మృతి చెందారు. ఈయన మృతదేహం మేజరు పంచాయతీ నరసన్నపేట మారుతీనగర్–1లోని సాయి మందిరం వద్ద పోలీసులు గుర్తించారు. కృష్ణ మృతికి స్పష్టమైన కారణాల కోసం పోలీసులు ఆరా తీస్తున్నారు. ఇతని కుటుంబ సభ్యులు మాత్రం ఇది హత్యేనని ఆరోపిస్తున్నారు. వివరాల్లోకి వెళితే.. ఎవరో మృతి చెంది ఉన్నట్లు పోలీసులకు శనివారం ఉదయం సమాచారం వచ్చింది. వెంటనే ఎస్ఐ వై.సింహాచలం సంఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు. ఫోను లభించచడంతో దాని ద్వారా మృతుని ఆచూకీ తెలుసుకున్నారు. కొత్తపేటకు చెందిన తోట కృష్ణగా గుర్తించి కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. దీంతో తండ్రి లక్ష్మీనారాయణ, తల్లి సాయమ్మలు సంఘటనా స్థలానికి వచ్చి మృతదేహాన్ని గుర్తు పట్టారు. కొడుకు మృతదేహాన్ని చూసి గుండెలవిసేలా రోదించారు. మహిళపై అనుమానం వ్యక్తం చేస్తూ ఆమెనే తమ కుమారుడు కృష్ణను హత్య చేసి ఉంటుందని పోలీసులకు సమాచారం ఇచ్చారు. కొంతకాలంగా కృష్ణ నరసన్నపేట మారుతీనగర్ ప్రాంతానికి చెందిన వివాహితతో చనువుగా ఉంటున్నారు. వీరిద్దరి మధ్య ఆర్థిక లావాదేవీలు కూడా ఉన్నట్లు సమాచారం. ఇదే ఆయన మృతికి కారణమై ఉంటుందని భావిస్తున్నారు. కృష్ణ శుక్రవారం సాయంత్రం పని ఉందని చెప్పి ఇంట్లో నుంచి బయటకు వెళ్లాడని.. రాత్రికి రాలేదని, ఉదయానికే పోలీసులు ఫోను చేస్తే తెలిసిందని మృతుని తండ్రి లక్ష్మీనారాయణ విలేకరులకు తెలిపారు. కృష్ణ గతంలో ఆటో నడిపే వాడ ని.. ప్రస్తుతం టోల్గేట్లో పని చేస్తున్నట్లు చెప్పారు. 2017లో ఈదులవలసకు చెందిన హారికతో కృష్ణకు వివాహమైంది. ప్రస్తుతం ఎనిమిది నెలల గర్భిణి. వారం క్రితమే సీమంతం చేశారు. కాగా వివాహిత ఇంటి వెనుక భాగంలో మృతదేహం లభించడంతో పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. మేడ పైనుంచి దూకడం వల్ల మృతి చెందాడా.. లేదా వివాహిత ఇంట్లో వాళ్లు ఏదో చేసి కిందకు పడేశారా అనే అనుమానాన్ని స్థానికులు వ్యక్తం చేస్తున్నారు. సంఘటనా స్థలాన్ని డీఎస్పీ బాలచంద్రరెడ్డి, సీఐ డి.రాములు పరిశీలించారు. క్లూస్ టీమ్ వేలిముద్రలు సేకరించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ఇంత లావుగా ఉన్నావ్ పిల్లల్నెప్పుడు కంటావ్! ఈ లోకంలో ఉండలేను..
కేరళ: వివాహం జరిగిన పది నెల్లకు అత్తవారింట్లో ఓ మహిళ ఆత్మహత్య చేసుకున్న ఉదంతం స్థానికంగా కలకలం రేపుతోంది. మృతురాలి తల్లి, సోదరుడు ఆదివారం మీడియాకు తెలిపిన వివరాల ప్రకారం.. వివాహం జరిగి ఇన్ని నెల్లవుతున్నా ఇంకా గర్భందాల్చలేదని తమ కూతురిని తరచూ భర్త, అత్తమామలు దుర్భాషలాడేవారని, లావుగా ఉందని వేధించేవారని మృతురాలి తల్లి ఆరోపించారు. బాడీ షేమింగ్ కారణంగానే తన సోదరి మృతి చెందిందని ఆమె సోదరుడు మీడియాకు తెలిపారు. మృతదేహాన్ని అంబులెన్స్‌లో తమ వద్దకు పంపించారని, ఆమెతోపాటు భర్తతో సహా అత్తింటివారెవ్వరూ రాలేదని బాధితురాలి తల్లి కన్నీరుమున్నీరుగా విలపించారు. నవంబర్ 25 రాత్రి జరిగిన ఈ ఆత్మహత్యకు గల కారణాలపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు స్థానిక పోలీసులు తెలిపారు. మరోవైపు మృతురాలి భర్త, అత్తమామలపై వచ్చిన ఆరోపణలను ఖండించారని కూడా ఒక అధికారి తెలిపారు. చదవండి: డిసెంబర్ 12న మిస్ యూనివర్స్ పోటీలను నిర్వహిస్తాం..! రద్దు చేయలేం.. -
‘జైలు నుంచి వచ్చాక ఆ ముగ్గురిని చంపుతాను’
జైపూర్: వివాహం అయిన ఓ మహిళ ప్రియుడితో కలిసి అత్తవారి ఇంటి నుంచి పారిపోయింది. ఈ విషయం తెలిసిన వివాహిత తండ్రి ఆగ్రహంతో సొంత ఊరి నుంచి వచ్చి కుమార్తె వెళ్లిపోయిన వ్యక్తి కుటుంబంలోని ఇద్దరిని దారుణంగా హత్య చేశాడు. రాజస్తాన్‌లోని జున్జును జిల్లాలో సోమవారం రాత్రి ఈ ఘటన జరిగింది. వివరాలు.. హర్యానాకు చెందిన అనిల్ జాట్ కుమార్తెకు రాజస్తాన్‌కు చెందిన ఓ వ్యక్తితో వివాహమైంది. కాగా ఆమె స్థానికంగా ఉన్న మరో వ్యక్తితో కలిసి అత్తవారి ఇంటి నుంచి వెళ్లి పోయింది. తమ కోడలు కనిపించడం లేదని అత్త ఇంటి వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ విషయం తెలిసిన ఆ మహిళ తండ్రి అనిల్ జాట్, హర్యానా నుంచి బైక్‌పై రాజస్తాన్‌లోని ఈ గ్రామానికి వచ్చాడు. ఆగ్రహంతో తన కుమార్తెను తీసుకెళ్లిన వ్యక్తి ఇంటికెళ్లి డాబాపైన నిద్రిస్తున్న అతడి సోదరుడు దీపక్, స్నేహితుడు నరేశ్‌ను గొడ్డలితో నరికి హత్య చేశాడు. తెల్లారిన తర్వాత ఈ విషయాన్ని గ్రహించిన దీపక్ తండ్రి రాజ్వీర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దాంతో డాగ్ స్క్వాడ్‌ను రప్పించడంతోపాటు సీసీటీవీ ఫుటేజ్ ద్వారా నిందితుడు అనిల్‌ను గుర్తించి అరెస్ట్ చేశారు పోలీసులు. కాగా తన పరువు తీసిన కుమార్తెతో పాటు ఆమెను తీసుకెళ్లిన వ్యక్తిని, అతడి తండ్రిని జైలు నుంచి తిరిగొచ్చిన తర్వాత హత్య చేస్తానని అనిల్ పేర్కొన్నట్లు పోలీసులు తెలిపారు. -
గ్రీవెన్స్‌సెల్‌కు వచ్చిన వివాహిత ఆత్మహత్యాయత్నం
శ్రీకాకుళం సిటీ: జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన గ్రీవెన్స్‌సెల్‌కు ఫిర్యాదును అందజేసేందుకు వచ్చిన వివాహిత ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఎచ్చెర్ల మండలం చిలకపాలెంకు చెందిన వాసుపల్లి సునీత అదే గ్రామానికి చెందిన ఓ వ్యక్తి నుంచి 2013 సంవత్సరంలో రూ.లక్షా 50వేలు అప్పు తీసుకుంది. నూటికి రూ.10 చొప్పున నెలకు రూ.15 వేలు చొప్పున వడ్డీ చెల్లించేది. గతేడాది సెప్టెంబర్ వరకు వడ్డీ చెల్లించింది. ఆమెకు ఆరోగ్యం బాగులేకపోవడంతో మూడు నెలలుగా వడ్డీ డబ్బులు చెల్లించలేదు. దీంతో అప్పు ఇచ్చిన వ్యక్తి ఆమె ఇంటికి వెళ్లి బెదిరిం చాడు. ఇంటి డాక్యుమెంట్లు ఇటీవల తీసుకుపోయాడు. ఈ విషయంపై ఎచ్చెర్ల పోలీస్‌స్టేషన్‌లో ఈనెల 5న ఆమె ఫిర్యాదు చేసింది. ఇదే విషయంపై ఫిర్యాదు చేసేందుకు ఎస్పీ కార్యాలయానికి వెళ్లింది. సివిల్ కేసని, కోర్టును ఆశ్రయించాలని పోలీసు అధికారులు తెలపడంతో ఎస్పీ ఆఫీసు ముందు నిద్రమాత్రలు, పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిందని ఆమె భర్త శ్రీను తెలిపారు. ఆమెకు శ్రీకాకుళం రిమ్స్‌లో వైద్యసేవలు అందిస్తున్నారు. ఎస్పీ కార్యాలయంలో ఓఎస్డీ కె.తిరుమలరావు ఆధ్వర్యంలో నిర్వహించిన ఫ్యామిలీ కౌన్సెలింగ్‌కు ఎనిమిది ఫిర్యాదులు వచ్చాయి. వచ్చిన వినతుల్లో నాలుగు పరిష్కరించగా, మిగిలినవి వాయిదా వేశారు. కార్యక్రమంలో మహిళా పీసీ డీఎస్పీ వి.సుబ్రహ్మణ్యం, విశ్రాంత ఎస్ఐ పి. రాజేశ్వరరావు, న్యాయవాది టి.వరప్రసాదరావు, జ్యోతి, సిటిజన్ ఫొరం ప్రతినిధి బరాటం కామేశ్వరరావులు పాల్గొన్నారు. గ్రీవెన్స్‌సెల్‌కు తగ్గిన వినతులు శ్రీకాకుళం పాతబస్టాండ్: కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన గ్రీవెన్స్‌సెల్‌కు వినతులు, ఫిర్యాదులు తగ్గాయి. గతవారం గ్రీవెన్సుసెల్‌ను రద్దు చేయడంతో ఈ వారం కూడా గ్రీవెన్స్‌సెల్ ఉండదని ఫిర్యాదుదారులు హాజరుకాలేదు. వినతులు, ఫిర్యాదులను జేసీ–2 పి.రజనీకాంతారావు స్వీకరించారు. వినతుల్లో కొన్ని.. ఏ అర్బన్ హెల్త్ సెంటర్లలో పనిచేస్తున్న మహిళా ఉద్యోగులపై వేధింపులకు పాల్పడుతున్న వారిపై చర్యలు తీసుకోవాలంటూ లోక్ జనశక్తి పార్టీ జిల్లా అధ్యక్షుడు ఎం.ఆదినారాయణ జేసీ–2కు విన్నవించారు. హెల్త్సెంటర్లను ప్రభుత్వం ఆధ్వర్యంలోనే నిర్వహించాలని కోరారు. ఈ కేంద్రాల్లో పనిచేస్తున్న వారికి ఉద్యోగభద్రత కల్పించాలన్నారు. ఏ ప్రభుత్వం ఇచ్చిన భూములను అధికార పార్టీ నేతలు ఆక్రమించుకుని చేపలు చెరువులు తవ్వారని, దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడంలేదంటూ ఎచ్చెర్ల మండలం కుప్పిలి గ్రామానికి చెందిన అలుపాన శంకర్, ఆయన భార్య సూరమ్మ తదితరులు జేసీకి గోడు వినిపించారు. తమ భూములను తమకు అప్పగించాలంటూ తమ వద్ద ఉన్న పట్టాలను చూపించారు. ఏ ఇల్లు నిర్మించి అప్పగించాలంటూ మెళియాపుట్టిలోని కుమ్మర వీధికి చెందిన కళావతి పట్నాయక్ విన్నవించింది. అలాగే, భామిని మండలంలోని సింగిడి గ్రామ ఎస్సీ కాలనీ వంశధార బ్యాలెన్సింగ్ రిజర్వాయర్‌కు సమీపంలో ఉందని, దీనిని నిర్వాసిత గ్రామంగా గుర్తించాలంటూ ఆ కాలనీకి చెందిన ఎస్సీ కుటుంబాలు జేసీ–2కు విజ్ఞప్తి చేశాయి. 78 కుంటుంబాలను ఆదుకోవాలంటూ సీపీఎం సీనియర్ నేత చౌదరి తేజేశ్వరరావు, పి.జయకృష్ణ, కాంతారావు, కృష్ణారావు, ఎస్.ఝాన్సీరాణిలు కోరారు.