
కేరళ: వివాహం జరిగిన పది నెల్లకు అత్తవారింట్లో ఓ మహిళ ఆత్మహత్య చేసుకున్న ఉదంతం స్థానికంగా కలకలం రేపుతోంది. మృతురాలి తల్లి, సోదరుడు ఆదివారం మీడియాకు తెలిపిన వివరాల ప్రకారం.. వివాహం జరిగి ఇన్ని నెల్లవుతున్నా ఇంకా గర్భందాల్చలేదని తమ కూతురిని తరచూ భర్త, అత్తమామలు దుర్భాషలాడేవారని, లావుగా ఉందని వేధించేవారని మృతురాలి తల్లి ఆరోపించారు.
బాడీ షేమింగ్ కారణంగానే తన సోదరి మృతి చెందిందని ఆమె సోదరుడు మీడియాకు తెలిపారు. మృతదేహాన్ని అంబులెన్స్‌లో తమ వద్దకు పంపించారని, ఆమెతోపాటు భర్తతో సహా అత్తింటివారెవ్వరూ రాలేదని బాధితురాలి తల్లి కన్నీరుమున్నీరుగా విలపించారు. నవంబర్ 25 రాత్రి జరిగిన ఈ ఆత్మహత్యకు గల కారణాలపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు స్థానిక పోలీసులు తెలిపారు. మరోవైపు మృతురాలి భర్త, అత్తమామలపై వచ్చిన ఆరోపణలను ఖండించారని కూడా ఒక అధికారి తెలిపారు.
చదవండి: డిసెంబర్ 12న మిస్ యూనివర్స్ పోటీలను నిర్వహిస్తాం..! రద్దు చేయలేం..
Comments
Please login to add a commentAdd a comment