మరో విషాదం: ప్రముఖ టీవీ నటుడు ఆత్మహత్య | Popular Kerala TV actor Ramesh Valiyasala Commits Suicide At 54 | Sakshi
Sakshi News home page

TV Actor Ramesh Valiyasala:విషాదం.. ప్రముఖ కేరళ టీవీ నటుడు ఆత్మహత్య

Published Sat, Sep 11 2021 3:56 PM | Last Updated on Sat, Sep 11 2021 5:19 PM

Popular Kerala TV actor Ramesh Valiyasala Commits Suicide At 54 - Sakshi

TV Actor Ramesh Valiyasala Death: సినీ పరిశ్రమలో మరో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ మలయాళ సినీ, టీవీ నటుడు రమేశ్‌ వలీయశాల (54) ఆత్మహత్య చేసుకున్నారు. ఇటీవల బాలీవుడ్‌ నటుడు సిద్ధార్థ్‌ శుక్లా  అకాల మరణం మరవక ముందే మరో నటుడి మృతి సినీ పరిశ్రమలో కలకలం రేపుతోంది. 22 ఏళ్లకు పైగా అనుభవం ఉన్న ఈ సీనియర్ నటుడు శ‌నివారం (సెప్టెంబర్ 11) ఉదయం తిరువనంతపురంలోని తన నివాసంలో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు సమాచారం. ఆయన మరణ వార్తతో మాలీవుడ్‌  చిత్ర పరిశ్రమ విషాద ఛాయలు అలుముకున్నాయి. 

చదవండి: Sai Dharam Tej: దాని వల్లే తేజ్‌కు ప్రాణాపాయం తప్పింది

సోషల్‌ మీడియా వేదికగా నటీనటులు, దర్శక-నిర్మాతలు ఆయన కుటుంబానికి సంతాపం తెలుపుతూ రమేశ్‌ మృతికి నివాళులు ఆర్పిస్తున్నారు. కేరళ పరిశ్రమలో వరుసగా సీరియల్స్‌, సినిమాలు చేస్తూ నటుడిగా ఫుల్‌ బిజీగా ఉండే ఆయన ఆత్మహత్య చేసుకోవడంపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. దీంతో పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కాగా రెండు రోజుల క్రితం రమేశ్‌ వలీయశాల షూటింగ్‌ నుంచి తిరిగి ఇంటికి వచ్చారని, ఇలా ఈ రోజు జీవిచ్చవంలా కనిపించడంతో అతడి సహ నటీనటులు జీర్ణించుకోలేకపోతున్నారు.

చదవండి: కన్‌స్ట్రక్షన్‌ కంపెనీ, మున్సిపాలిటీపై కూడా కేసు పెట్టాలి: ఆర్పీ

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement