ఉత్తరప్రదేశ్‌లోని మిర్జాపూర్‌లో సంచలన ఉదంతం చోటుచేసుకుంది. ఈ ప్రాంతంలో ఒక యువతి చెరువులో తేలుతూ పోలీసులకు కనిపించింది. దీంతో పోలీసులు ఆ యవతి దేహాన్ని పోస్టుమార్టం కోసం ఆసుపత్రికి తరలించేందుకు ఏర్పాట్లు చేశారు. అయితే ఇంతలో ఆ యువతి కుటుంబ సభ్యులు తమ కుమార్తెను ఒకసారి వైద్యులకు చూపించాలని కోరారు. వెంటనే పోలీసులు వారి కోరిక మేరకు ఆ యువతిని వైద్యుల దగ్గరకు తీసుకువెళ్లారు. పోలీసుల వైద్య పరీక్షల్లో ఆ యువతి గుండె కొట్టుకుంటున్నట్లు గమనించారు.
ఈ ఘటన మిర్జాపూర్ పరిధిలోని సంత్‌నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని రాహ్ కలాం హవూదవా గ్రామంలో చోటుచేసుకుంది. ఆదివారం సాయంత్రం సిర్సీకి చెందిన ఒక యువతి చెరువులో తేలుతూ కనిపించింది.స్థానికులు ఈ విషయాన్ని పంచాయతీ సభ్యులకు తెలియజేశారు. వారు ఈ సమాచారాన్ని పోలీసులకు అందించారు.
పోస్టుమార్టం కోసం సిద్ధమైన పోలీసులు..
సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఆ యువతి దేహాన్ని బయటకు తీశారు. ఆమె ఎవరనేది గుర్తించి, కుటుంబ సభ్యులకు తెలియజేశారు. ఆ యువతి మృతిచెందిందని భావించిన పోలీసులు పోస్టుమార్టంనకు తరలించేందుకు ఏర్పాట్లు చేశారు.
యువతి ఇంటిలో ఆనందోత్సాహాలు
అయితే ఆ యువతి కుటుంబ సభ్యులు తమ కుమార్తెను ఒకసారి వైద్యుల దగ్గరకు తీసుకువెళ్లాలని కోరారు. దీంతో పోలీసులు ఆ యువతిని పటెహరా ఆరోగ్య కేంద్రానికి తీసుకెళ్లారు. అక్కడి వైద్యులు ఆమెను పరిశీలించి, గుండె కొట్టుకుంటున్న విషయాన్ని గమనించారు. వెంటనే వైద్యులు ఆమెకు చికిత్స ప్రారంభించారు. తమ కుమార్తె బతికేవుందని తెలియడంతో ఆమె కుటుంబ సభ్యుల ఆనందానికి హద్దులు లేకుండా పోయాయి.
యువతి తల్లి ఏమన్నదంటే..
ఆ యువతి తల్లి రత్నాదేవి మీడియాతో మాట్లాడుతూ తమ కుమార్తె మానసిక పరిస్థితి సవ్యంగా లేదన్నారు.అప్పుడప్పుడు ఇంటి నుంచి బయటకు ఎక్కడికో వెళ్లిపోతుందని తెలిపారు. ఈ సందర్భంగా ఆ యువతికి చికిత్సనందించిన వైద్యులు డాక్టర్ గణేశ్ శంకర్ త్రిపాఠి మాట్లాడుతూ పోలీసులు ఆ యువతిని చెకప్ కోసం తీసుకువచ్చారని, వైద్య పరీక్షలు చేసి, చికిత్సనందించామని, ప్రస్తుతం ఆ యువతి పూర్తి ఆరోగ్యంగానే ఉన్నదని తెలిపారు.
ఇది కూడా చదవండి: రైలు రిజర్వేషన్‌లో సరిదిద్దలేని పొరపాట్లివే..
Comments
Please login to add a commentAdd a comment