collectar
-
పోస్టుమార్టంలో కళ్లు మాయం..కలెక్టర్ సంచలన నిర్ణయం
ముజరియా(యూపీ): హత్యకు గురైన ఓ యువతి శరీరం నుంచి కళ్లు దొంగిలించారని యువతి బంధువులు ఆరోపించారు. పోస్టుమార్టంలోనే ఇది జరిగిందని కుటుంబ సభ్యులు ఆరోపించారు. దీంతో జిల్లా కలెక్టర్ ఆ యువతి మృతదేహానికి రెండోసారి పోస్టుమార్టం చేయాలని ఆదేశించారు. ఈ దారుణ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని ముజారియా జిల్లా రసూలా గ్రామంలో జరిగింది. ‘వరకట్న కోసం పూజ(20)ను చంపారని ఆమె భర్తపై డౌరీ కేసు నమోదైంది. ఈ కేసులో పూజ మృతదేహానికి పోస్టుమార్టం చేశారు. మృతదేహాన్ని బంధువులకు అప్పగించినపుడు అసలు విషయం బయటపడింది. పూజ కళ్లు దొంగిలించారని కుటుంబ సభ్యులు తెలిపారు. మానవ అవయవాల అక్రమ రవాణా జరిగిందని పూజ బంధువులు ఫిర్యాదు చేశారు. దీంతో మృతదేహాన్ని మళ్లీ పోస్టుమార్టం కోసం పంపించాం. కళ్లు దొంగిలించడం నిజమే అయితే బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం’అని కలెక్టర్ మనోజ్‌కుమార్ తెలిపారు. ఇదీచదవండి.. మాజీ సీఎం ఒమర్ అబ్దుల్లా విడాకులపై కోర్టు కీలక తీర్పు -
ఎన్నికల విధులను నిర్లక్ష్యం చేస్తే కఠిన చర్యలు తప్పవు.. కలెక్టర్
వనపర్తి: ఎన్నికల నియమావళి అమలులోకి వచ్చిన నేపథ్యంలో ప్రభుత్వ అధికారులు నిష్పక్షపాతంగా విధులు నిర్వర్తించాలని కలెక్టర్ తేజస్ పవార్ ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో నోడల్ అధికారులు, ఫ్లయింగ్ స్క్వాడ్లు, సర్వేలెన్స్ అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించి ఎన్నికల విధులపై సూచనలు చేశారు. జిల్లాలో స్వేచ్ఛాయుత వాతావరణంలో ఎన్నికలు పూర్తి చేసేందుకు సహకరించాలని కోరారు. మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ నిబంధనలు, ఫ్లయింగ్ స్క్వాడ్స్, సర్వేలెన్స్ బృందాల బాధ్యతలను వివరించారు. ఎన్నికల ప్రవర్తన నియమావళి ప్రతి ఒక్కరికి సమానంగా వర్తిస్తుందన్నారు. జిల్లాలో 4 ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలు నిరంతరం పర్యవేక్షణ చేస్తుంటాయని, జిల్లా నలుమూలల చెక్‌పోస్టులు ఏర్పాటుచేసి నిఘా పెంచినట్లు తెలిపారు. అక్రమంగా డబ్బు, మద్యం సరఫరా చేస్తూ.. ఓటర్లను ప్రలోభాలకు గురిచేయడం, బహుమతులు ఇవ్వడం లాంటివి నియంత్రించాలని ఆదేశించారు. సి–విజిల్ యాప్‌తో గాని టోల్‌ఫీ నంబర్ 1950, కంట్రోల్ రూంకు ఫిర్యాదు చేస్తే 15 నిమిషాల్లో ఘటన స్థలానికి చేరుకునేందుకు సంబంధిత అధికారులు సిద్ధంగా ఉండాలన్నారు. ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున రాజకీయ పార్టీలు, అభ్యర్థులు చేసే ప్రతి ఖర్చును ఎప్పటికప్పుడు నమోదు చేయాలని.. స్టాటిస్టిక్ సర్వేలెన్స్ టీమ్ చురుగ్గా పని చేయాలని సూచించారు. రూ.50 వేల కన్నా అధికంగా పట్టుబడితే వెంటనే సీజ్ చేయాలన్నారు. రూ.10 లక్షల వరకు సరైన ఆధారాలు ఉంటే సీజ్ చేయబోమని.. ఇన్‌కం టాక్స్ వారికి సమాచారం ఇవ్వాల్సి ఉంటుందని తెలిపారు. ఎక్కువ విలువ గల వస్తువులు గుర్తిస్తే వీడియో కవరేజ్ చేస్తూ సీజ్ చేయాలని ఆదేశించారు. ఓటర్లను భయభ్రాంతులు, ప్రలోభాలకు గురి చేయడానికి ప్రయత్నిస్తే చట్టపరమైన చర్యలు తీసుకోవాలన్నారు. ఎన్నికల విధులను నిర్లక్ష్యం చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. సమావేశంలో డీఎస్పీ ఆనంద్‌రెడ్డి పాల్గొన్నారు. -
పార్వతీపురం కేంద్రంగా కొత్త జిల్లా?
సాక్షి, విజయనగరం గంటస్తంభం: జిల్లా విభజన వ్యవహారం ఒక కొలిక్కివచ్చినట్టుంది. ఇప్పటికే దీనికి సంబంధించి ఉన్నతాధికారులు అడిగిన సమాచారం కొంతవరకు జిల్లా అధికారులు పంపించారు. మరింత సమాచారం అప్లోడ్ చేసే పనిలో ఉన్నారు. ఈ నెలాఖరు నాటికి ఈ ప్రక్రియ పూర్తవుతుందని అధికారులు చెబుతున్నారు. ఇప్పటివరకు ఉన్న సమాచారం ప్రకారం పార్వతీపురాన్ని జిల్లా కేంద్రంగా భావిస్తున్నారు. అందుకు కీలకమైన కార్యాలయాలకు అవసరమైన భవనాలను గుర్తించి సమాచారం పంపించారు. ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్రెడ్డి ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు జిల్లాల విభజనకు చేపట్టిన కసరత్తు జిల్లాలోనూ కొనసాగుతోంది. దీనికోసం ఏర్పాటు చేసిన రాష్ట్రస్థాయి కమిటీ ఇప్పటికే కార్యాచరణ ప్రారంభించింది. వారి ఆదేశాల మేరకు జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎం.హరిజవహర్‌లాల్ జిల్లాలో ఏర్పాటు చేసిన సబ్ కమిటీలు జిల్లాలో భౌగోళిక పరిస్థితులు, భవనాలు, సిబ్బంది, ఇతర వివరాలు సేకరిస్తున్నాయి. కార్యాలయాలకు భవనాల గుర్తింపు రాష్ట్ర కమిటీలో ఒకరైన ముఖ్య కార్యదర్శి కృష్ణబాబు. పార్వతీపురం డివిజన్ కేంద్రంలో కీలకమైన కార్యాలయాలకు అవకాశం ఉన్నభవనాలు గుర్తించి ఇవ్వాలని సూచించారు. దీనిపై పార్వతీపురం సబ్ కలెక్టర్‌ను ప్రతిపాదనలు కోరారు. ఆయన కలెక్టరేట్, ఎస్పీ కార్యాలయం, జిల్లా కోర్టుకు సంబంధించి వివరాలు పంపించారు. కలెక్టరేట్‌కు ఐటీడీఏకోసం కొత్తగా నిర్మి స్తున్న భవనం, ఎస్పీ కార్యాలయానికి ప్రస్తుత డీఎస్పీ కా ర్యాలయం, ప్రత్యామ్నాయంగా యూత్ ట్రైనింగ్ సెంటర్(వైటీసీ), జిల్లా కోర్టుకు ప్రస్తుతం ఉన్న సీనియర్, జూనియర్ సివిల్ జడ్జి కోర్టును సూచించారు. వాటి విస్తీర్ణం, అందులో భవనాల విస్తీర్ణం, ఖాళీగా ఉన్న స్థలం విస్తీర్ణం వివరాలు మ్యాప్‌లతో సహా నివేదించగా వాటిని కలెక్టర్ ముఖ్య కార్య దర్శి కార్యాలయానికి పంపించారు. భౌగోళిక పరిస్థితులపై నివేదిక జిల్లాకు సంబంధించి బౌగోళిక పరిస్థితులు కూడా ఇక్కడి అధికారులు పంపించారు. ప్రస్తుతం ఉన్న జిల్లా విస్తీర్ణం 6539 చదరపు కిలోమీటర్లు కాగా ఇందులో ప్రస్తుతం ఉన్న మండలాల వారీగా జనాభా, కుటుంబాల వివరాలు పంపించారు. జిల్లాలో 2011 జనాభా లెక్కల ప్రకారం 6,85,585 కుటుంబాలుండగా 23,44,439 జనాభా ఉన్నట్టు తేల్చారు. మండలాల వారీగా ఉన్న ఈ సమాచారం పంపించారు. ప్రభుత్వం వద్ద ఏ మండలం ఏ నియోజకవర్గంలో ఉందో సమాచారం ఉన్నందున వీటి ఆధారంగా విభజన పక్రియ చేపడతారని అధికారులు చెబుతున్నారు. జిల్లాలోని భవనా ల వివరాలు కూడా అన్లైన్లో సంబంధిత సైట్లో అప్లోడ్ చేస్తున్నారు. జిల్లా, డివిజన్ కార్యాలయాల భవనాలతోపా టు మండలస్థాయిలో ఉన్న భవనాలు గుర్తించారు. జిల్లాలో మొత్తం 106 శాఖలున్నాయి. ఇందులో విజయనగరంలో 106శాఖలు ఉండగా పార్వతీపురంలో 37 శాఖలున్నాయి. ఈశాఖల పరిధిలో మొత్తం 387 భవనాలు ఉన్నట్లు గుర్తించారు. విజయనగరం డివిజన్లో 252, పార్వతీపురం డివిజన్లో 387 భవనాలు గుర్తించారు. ఆ వివరాలు అప్లోడ్ అవుతున్నాయి. జిల్లాలో శాఖల వారీగా అధికారులు, సిబ్బంది వివరాలు సిద్ధమవుతున్నాయి. శాఖల వారీగా పార్వతీపురం వెళ్లాల్సిన అధికారులు, సిబ్బంది జాబితాపై ఉన్నతాధికారుల సూచన మేరకు కసరత్తు చేస్తున్నారు. డేటా పంపిస్తున్నాం విభజన ప్రక్రియకు సంబంధించి నాలుగు కమిటీలను కలెక్టర్ ఏర్పాటు చేశారు. వారి ఆధ్వర్యంలో వివరాలు సిద్ధం చేసి ఎప్పటికప్పుడు సమాచారం అప్లోడ్ చేస్తున్నారు. పార్వతీపురంలో కలెక్టరేట్, ఎస్పీ కార్యాలయం, జిల్లా కోర్టుకు భవనాలు గుర్తించి సూచించాలని ఉన్నతాధికారులు కోరగా ఆ సమాచారం కలెక్టర్ పంపించారు. కార్యాలయాలు, సిబ్బంది తదితర వివరాలు విభజనకు సంబంధించి ఏర్పాటు చేసిన వెబ్సైట్లో అప్లోడ్ చేస్తున్నారు. – ఎం.గణపతిరావు, డీఆర్వో, విజయనగరం -
మెదక్‌లో బడికి బరోసా..
సాక్షి, మెదక్: ‘మన పల్లె బడి.. మన ధర్మ నిధి’ లక్ష్యం నెరవేరేలా కలెక్టర్ పటిష్ట ప్రణాళికతో ముందుకు సాగుతున్నారు. ట్రస్ట్‌కు విరాళాల సేకరణ.. పాఠశాలల్లో సమస్యల గుర్తింపు, పరిష్కారానికి సంబంధించి గ్రామ, మండల, జిల్లా స్థాయి కమిటీతోపాటు జిల్లా స్థాయి నిర్వహణ ఏజెన్సీకి రూపకల్పన చేశారు. జిల్లా కమిటీకి చైర్మన్‌గా కలెక్టర్, వైస్ చైర్మన్లుగా జేసీ, ఎస్పీ వ్యవహరించనున్నారు. మండల కమిటీలకు ఎంఈఓ చైర్మన్‌గా, ముగ్గురు ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ముగ్గురు ఉపాధ్యాయులు, విద్యావేత్తలు లేదా ధర్మదాతల సభ్యులుగా.. గ్రామ కమిటీల్లో ప్రధానోపాధ్యాయుడు, వీఆర్వో, వీఆర్ఏ, ఉపాధ్యాయుడు కమిటీల్లో సభ్యులుగా ఉండనున్నారు. ఈ కమిటీల బాధ్యతలు ఏమిటి.. ఏం చేయాలి.. ఎవరు ఎన్నారైల వివరాలు సేకరించాలి.. ఎవరు మాట్లాడాలి.. వంటి అంశాలపై కూడా సంస్థ విధివిధానాల్లో పొందుపరిచారు. జిల్లా స్థాయి నిర్వహణ ఏజెన్సీ జిల్లా కమిటీ చైర్మన్ అయిన కలెక్టర్ ఆదేశా మేరకు నడవాల్సి ఉంటుంది. పక్కాగా బైలా.. రిజిస్ట్రేషన్ ట్రస్ట్‌కు సంబంధించి అవకతవకలకు చోటు లేకుండా పక్కాగా బైలా రూపొందించారు. ఇందుకు సంబంధించి కలెక్టర్ ధర్మారెడ్డి, డీఈఓ రవికాంతరావు, నోడల్ ఆఫీసర్ సూర్యప్రకాష్, మరో ఇద్దరు ఉపాధ్యాయులు సాయికుమార్, రమేష్ చౌదరి కలిసి దాదాపు 15 రోజులు శ్రమించి ట్రస్టుకు సంబంధించి విధివిధానాలు రూపొందించారు. ఎవరైతే కలెక్టర్‌గా ఉంటారో వారే ఈ ట్రస్టుకు బాధ్యత వహిస్తారు. సంస్థ చిరునామాగా సమీకృత కలెక్టరేట్ సముదాయం, కలెక్టరేట్ కార్యాలయం, మెదక్ – 502110గా పేర్కొన్నారు. విరాళాలు అందించే వారితోపాటు విరాళాల మొత్తం, ఖర్చు వివరాలను వెబ్సైట్లో ప్రజలకు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకున్నారు. సమస్యల గుర్తింపు.. దశల వారీగా పరిష్కారం గ్రామ, మండల కమిటీలు ముందుగా ప్రభుత్వ పాఠశాలల్లో సమస్యలు గుర్తించి జిల్లా కమిటీకి పంపాలి. ప్రాధాన్యతా క్రమంలో ఆ సమస్యలను పరిష్కరించేందుకు జిల్లా కమిటీ చర్యలు తీసుకుంటుంది. మొత్తం ఐదు దశల్లో సమస్యలను పూర్తి స్థాయిలో పరిష్కరించేలా అధికారులు ప్లాన్ రూపొందించారు. మొదటి దశలో పాఠశాలల్లో చిన్న చిన్న మరమ్మతులతోపాటు భవనాలకు పాఠ్యాంశ చిత్రపటాలతో ఆకర్షణీయమైన రంగులు వేయనున్నారు. రెండో దశలో అన్ని పాఠశాలల్లో తాగు నీటి ఫిల్టర్ ప్లాంట్‌ను ఏర్పాటు చేయనున్నారు. మూడో దశలో మండల స్థాయి నివేదికలకు పరిష్కారం చూపనున్నారు. నాలుగో దశలో గ్రంథాలయాలు, సైన్స్ ల్యాబ్ నరికరాలు ఏర్పాటు చేయనున్నారు. ఐదో దశలో డిజిటల్ బోధన పరికరాలు, ఈ–లెర్నింగ్, ఆట వస్తువులు సమకూర్చడంతోపాటు బాలికల ఆత్మ రక్షణకు కరాటే శిక్షణ తరగతులు నిర్వహించనున్నారు. ఇప్పటివరకు రూ.కోటి.. గత నెల 25న మెదక్ కలెక్టరేట్లో జరిగిన జిల్లాపరిషత్ సర్వసభ్య సమావేశంలో విద్యా శాఖలో నెలకొన్న సమస్యలు చర్చకు వచ్చాయి. రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు హాజరైన ఈ సమావేశంలో కలెక్టర్ ధర్మారెడ్డి ‘మన పల్లె బడి.. మన ధర్మ నిధి’ లక్ష్యం వివరాలు వెల్లడించారు. తనవంతు వాటాగా రూ.25 వేలు ఇస్తున్నట్లు ప్రకటించారు. మంత్రి హరీశ్‌రావు తన వేతనంలో నుంచి రూ.లక్ష ఇస్తామని చెప్పారు. ఈ క్రమంలో ఇతర ప్రజాప్రతినిధులు పోటీపడ్డారు. జిల్లాలో ప్రభుత్వ ఉపాధ్యాయులు సుమారు 4 వేల వరకు ఉండగా.. వారు ఒక రోజు వేతనాన్ని అందజేయనున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు దాదాపు రూ.65 లక్షలు ట్రస్ట్ ఖాతాలో త్వరలో జమకానున్నాయి. మొత్తానికి ఇప్పటివరకు సుమారు రూ.కోటి సేకరించినట్లు సమాచారం. -
రెఫర్ చేయడం తగ్గించండి
పాలమూరు: ‘ఇక్కడ ఎందుకు చేయలేకపోతున్నారు.. హైదరాబాద్ ఆస్పత్రుల్లో ఉండే వసతులు ఏంటీ? మన దగ్గర లేనివేంటీ.. అత్యవసర పరిస్థితుల్లో వచ్చే కేసులన్నింటినీ పదేపదే ఇక్కడ చేయకుండా హైదరాబాద్‌కు ఎందుకు రెఫర్ చేస్తున్నారు? అని వైద్యులు, వైద్యశాఖ అధికారులపై కలెక్టర్ ఫైర్ అయ్యారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ రెవెన్యూ సమావేశ మందిరంలో మంగళవారం జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారులు, జనరల్ ఆస్పత్రి అధికారులతో మలేరియా, మాతా శిశుమరణాలపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రతినెల అధిక సంఖ్యలో కేసులను రెఫర్ చేయడం వల్ల పేద రోగుల ఖర్చు పెట్టుకొని వెళ్తే వారు ఆర్థికంగా ఎంత ఇబ్బంది పడుతారో ఆలోచన చేయాలన్నారు. ఏదైనా సౌకర్యాలు, వసతులు కావాలంటే అడగాలి తప్ప పేద రోగులను ఇబ్బంది పెట్టొద్దన్నారు. మాతా శిశుమరణాలు తగ్గే విధంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సమీక్షలో డీఎంహెచ్‌వో రజిని, సూపరింటెండెంట్ డాక్టర్ రామకిషన్, మలేరియా అధికారి విజయ్‌కుమార్, మాస్‌మీడియా అధికారి వేణుగోపాల్‌రెడ్డి, ఉమాదేవి, రాజాగోపాలచారి తదితరులు పాల్గొన్నారు. -
భర్తీ ప్రక్రియ షురూ..
సాక్షి, మహబూబ్‌నగర్: ఎంతో కాలంగా టీఆర్టీ అభ్యర్థులు ఎదురుచూసిన ఘడియ రానేవచ్చింది. అభ్యర్థుల ఎంపిక ప్రక్రియలో మొదటి ఘట్టం గురువారం ప్రారంభమైంది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా వివిధ ప్రభుత్వ పాఠశాలల్లో ఖాళీలను ప్రభుత్వం ఉమ్మడి జిల్లా ప్రతిపాధికన భర్తీ చేస్తున్న విషయం తెలిసిందే. జిల్లా కేంద్రంలోని ఆర్వీఎం సమావేశ మందిరంతో పాటు, డైట్ కళాశాలలో వివిధ సబ్జెక్టుల వారీగా స్కూల్ అసిస్టెంట్, లాంగ్వేజ్ పండిట్ అభ్యర్థులకు సర్టిఫికెట్ వెరిఫికేషన్ నిర్వహించారు. ప్రస్తుతం కేవలం స్కూల్ అసిస్టెంట్ అభ్యర్థులకు మాత్రమే పిలుపువచ్చింది. తదుపరి ప్రభుత్వం ప్రకటించే షెడ్యూల్ ప్రకారం ఎస్టీటీలకు నిర్వహించనున్నారు. 374 పోస్టులకు కసరత్తు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో 1,979 ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉండగా, ఇందులో భాగంగా మొదట 374 స్కూల్ అసిస్టెంట్ పోస్టులను భర్తీకి ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. టీఆర్టీ పరీక్షలో మొత్తం 50వేలకు పైగా అభ్యర్థులు పరీక్ష రాయగా అందులో కేవలం కొంతమంది మాత్రమే అర్హత సాధించారు. వారికి మాత్రమే వెరిఫికేషన్ నిర్వహిస్తున్నారు. గురువారం జరిగిన వెరిఫికేషన్‌కు 8 మంది అభ్యర్థులు గైర్హాజరయ్యారు. సబ్జక్టుల వారీగా.. స్కూల్ అసిస్టెంట్, లాంగ్వేజ్ పండిట్ పోస్టుల వెరిఫికేషన్ జరిగిన క్రమంలో 374 పోస్టుల్లో వివిధ సబ్జెక్టుల వారీగా ప్రక్రియ ప్రారంభమైంది. వీటిలో పోస్టులు, తెలుగు పండిట్ 67 పోస్టులు, లాంగ్వేజ్ పండిట్ ఉర్దూలో 4 పోస్టులు ఉన్నాయి. వీటితో పాటు స్కూల్ అసిస్టెంట్ పోస్టుల్లో గణితం 36, సోషల్ 139 పోస్టులు, ఉర్దూ పోస్టులు 6, ఇంగ్లీష్ 17, ఫిజికల్ సైన్స్ 23, స్కూల్ అసిస్టెంట్ తెలుగు 44, జీవశాస్త్రం 41 పోస్టులు ఉన్నాయి. వీరి వెరిఫికేషన్ అనంతరం 15లోగా వివిధ స్థానాల్లో భర్తీ చేసేందుకు జిల్లా విద్యాశాఖ అధికారులు కృషి చేస్తున్నారు. 13న ఖాళీల వివరాల ప్రదర్శన ఉపాధ్యాయ పోస్టుల భర్తీ కోసం జిల్లా అధికారులు ప్రభుత్వం సూచించిన షెడ్యూల్ ప్రకారం ప్రక్రియను పూర్తి చేస్తున్నారు. అయితే సర్టిఫికెట్ వెరిఫికేషన్ అభ్యర్థులకు 1.3 రెషియో ప్రకారం గతంలో ఒకమారు నిర్వహించిన వారిలో పూర్తిస్థాయి అర్హత సాధించిన వారికి గురువారం ఒకమారు నిర్వహించారు. అనంతరం వివిధ పోస్టుల్లో ఎంపికైన అభ్యర్థులకు ఏయే పాఠశాలల్లో ఖాళీగా ఉన్నాయన్న అంశంపై గురువారం సాయంత్రంలోగా, శుక్రవారం ఉదయం లోగా జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో ఖాళీల వివరాలను ప్రదర్శించాల్సి ఉంది. అభ్యర్థులకు ఖాళీలను ఎంపిక అనంతరం ఈనెల 13న కౌన్సిలింగ్ నిర్వహిస్తారు. తర్వాత ఈనెల 15న కలెక్టర్ ఆధ్వర్యంలో వారికి భర్తీకి సంబంధించిన ఉత్తర్వులు అందజేయనున్నట్లు అధికారులు పేర్కొంటున్నారు. -
నాన్న కల నెరవేర్చా
మాది వ్యవసాయ, చిన్నపాటి వ్యాపార కుటుంబం. మా తాత వెంకటస్వామి కాలం నుంచి మాకు 30 ఎకరాల భూమి ఉంది. మా తల్లిదండ్రులు సరోజిని, కామరాజు ఎంతో కష్టపడి నన్ను చదివించారు. చదువుకుంటూనే రోజూ ఉదయం సాయంత్రం వేళ.. సెలవుల్లో సేద్యం చేసేందుకు పొలానికి వెళ్లేవాడిని. నేను డిగ్రీలో ఉన్నప్పుడే నాన్న మరణించారు. మా పెద్దనాన్న అప్పలరాజు నాన్నలేని లోటును తీర్చారు. అప్పటి నుంచి నా బాగోగులు ఆయనే చూశారు. మా అన్న చదవాలని తమ్ముళ్లు రాము, హరి ఎంతో ప్రోత్సహించారు. వారు ఇప్పుడు వ్యవసాయం, కుటుంబ వ్యాపారాన్ని చూసుకుంటున్నారు. 1989లో డిప్యూటీ తహసీల్దార్‌గా ఉద్యోగం వచ్చింది. మేనకోడలు రాజేశ్వరితో 1992లో వివాహమైంది. నా బలమంతా మా ఆవిడే. పిల్లల బాగోలు చూసుకుంటోంది. ఉద్యోగ విధుల్లో ఎంత ఆలస్యంగా ఇంటికి వచ్చినా.. ఏ అర్ధరాత్రి పనిపై బయటికి వెళ్లినా ఎంతో సంతోషంతో నన్ను పంపిస్తుందని అని అన్నారు. తన జీవిత విషయాలను నారాయణపేట కలెక్టర్ ఎస్.వెంకట్రావుతో ‘సాక్షి’ పర్సనల్ టైం. సాక్షి, నారాయణపేట: నా బాల్యం అంత మా స్వగ్రామైన సాలూరులోనే కొనసాగింది. అప్పటికే అది నారాయణపేటలాగా మున్సిపాలిటియే. పట్టణమైనా గ్రామీణప్రాంతాన్ని తలపించేది. ఒకటి నుంచి పదో తరగతి వరకు వేద సమాజం సంస్కృత ఉన్నత పాఠశాలలో చదివాను. ఆ తర్వాత ఇంటర్మీడియెట్ ఎంపీసీని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చదివి డిగ్రీ (బీకాం) ని బొబ్బిలిలోని ఆర్ఎ స్ఆర్కే కళాశాలలో చదివా. కేరళలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ బిజినెస్ మేనేజమ్‌ంట్ కళాశాలలో ఎంబీఏ పూర్తి చేశా.నాన్న కలను నెరవేర్చాలనే తపనతో గ్రూప్స్‌కు ప్రిపరేషన్ మొదలు పెట్టా. ఉద్యోగ ప్రస్థానం 1985 గ్రూప్–2 రాస్తే ఫలితాలు 1989లో వచ్చాయి. డిప్యూటీ తహసీల్దార్‌గా ఉద్యోగం వచ్చింది. మొదటిసారిగా సొంత జిల్లాలోని మక్కావ మండలం డీటీగా విధులో చేరి పదోన్నతిలో అక్కడే తహసీల్దార్‌గా విధులు నిర్వహించా. 2002లో డిప్యూటీ కలెక్టర్‌గా విశాఖపట్నం, 2003లో టెక్కలి ఆర్డీఓగా, 2004లో నూజివీడు ఆర్డీఓగా, 2007లో గూంటూరు ఆర్డీఓగా పనిచేస్తూ 2009లో అప్పటి విద్యశాఖ మంత్రి పార్థసారథికి పర్సనల్ సెక్రటరీగా విధులు నిర్వహించా. ఆ తర్వాత 2010లో కాకినాడ డీఆర్వోగా, 2010–11లో విజయవాడలో సబ్ కలెక్టర్‌గా, 2013లో గూంటూరు అడిషనల్ జాయింట్ కలెక్టర్‌గా, 2014లో నల్లగొండ జిల్లా జెడ్పీ సీఈఓ, 2016లో అడిషనల్ జాయింట్ కలెక్టర్‌గా, 2016–17లో యదాద్రి డీఆర్డీఓగా, 2018లో మహబూబ్‌నగర్ జేసీగా, 2019 మార్చి 1న నారాయణపేట జిల్లా తొలి కలెక్టర్‌గా ఉద్యోగ బాధ్యతలు చేపట్టా. అభి‘రుచులు’ చిన్నప్పటి నుంచి స్వీట్లు తినడం అంటే చాలా ఇష్టం. మా అమ్మ తిపి వంటలు బాగా చేసేది. మా సతీమణి నారుచులకు అనుగుణంగా వంటలను చేసిపెడుతుంది. తీరిక ఉంటే వారంలో ఒకసారి సెకండ్ షో సినిమాలకు ఫ్యామిలీతో కలిసి వెళ్తా. నాటి సినిమాల్లో దానవీరశూరకర్ణ, నేటి సినిమాల్లో శ్రీమంతుడు చాలా నచ్చాయి. మహాత్మాగాంధీ, జవహర్‌లాల్‌నెహ్రూ, సుభాష్‌చంద్రబోస్ వంటి జాతీయ నేతలను ఆదర్శంగా తీసుకున్నాను. అల్లూరి సీతారామరాజు వేషధారణతో పాఠశాల, కళాశాల స్థాయిలో ప్రదర్శనలు, నాటకాలు చేశా. పుస్తకాలు, పత్రికలు చదవడంతో ఎంతో విజ్ఞానాన్ని పొందగలిగా. అవే నా సర్వీసులో ఎంతో ఉపయోగపడ్డాయి. నాన్న మృతే చీకటి రోజు మా నాన్న కామరాజు గుండెపోటుతో నా కళ్ల ముందే ఒల్లో పడుకుని కన్నుమూశారు. ఆయనకు గుండెపోటు వచ్చిన విషయం మాకు తెలియదు. ఊర్లో ఉన్న దవాఖానాకు తీసుకెళ్లాం. అక్కడ చూసిన జూనియర్ డాక్టర్ గుండెపోటు వచ్చిందని తెలిసి ట్రీట్మెంట్ కోసం పుస్తకం తీసి పేజీలు తిప్పడం మొదలుపెట్టారు. ఇక్కడ మించుకుపోతుంది సారూ అంటున్న క్షణంలోనే వైద్యం అందక మరణించారు. నాన్న మృతి కళ్లారా చూసి గుండె పగిలిపోయినట్లయింది. నా జీవితంలో విషాద సంఘటన ఇదే. ఉద్యోగం వచ్చిన రోజున ఆనందపడ్డా 1989లో గ్రూప్–2 ఫలితాలు వెలువడ్డాయి. ఉదయాన్నే పది గంటలకు అమ్మ పాదాలకు నమస్కరించి ఇలా బయటికి వచ్చా. అప్పుడే పోస్ట్‌మెన్ లెటర్ తెచ్చారు. ఆ లెటర్లో డిప్యూటీ తహసీల్దార్‌గా ఉద్యోగం వచ్చినట్లు అపాయింట్మెంట్ ఉంది. అదే ఏడాది జూలైలో డీటీగా ఉద్యోగం రావడంతో ఎంతో ఆనందపడ్డా. మా అమ్మ చాలా సంతోషిస్తూ మీ నాన్న ఉండి ఉంటే చాలా సంబరపడేవారు అంటూ అక్కున చేర్చుకుంది. స్ఫూర్తి ప్రదాత రొనాల్డ్‌రోస్ మహబూబ్‌నగర్ జిల్లా కలెక్టర్ రొనాల్డ్‌రోస్ నాకు స్ఫూర్తి ప్రధాత. ఆయన కాకినాడలో ఐఏఎస్ క్యాడర్లో ఉన్న సమయంలో నేను డీఆర్ఓగా ఉన్నాను. అప్పటి నుంచి నా ఉద్యోగ నిర్వహణలో చూపిస్తున్న సేవలను గుర్తిస్తూ ముందుకు తట్టి వస్తున్నారు. యాదాద్రిలో డీఆర్డీఓగా పనిచేస్తుంటే అక్కడి నుంచి మహబూబ్‌నగర్ జిల్లా జేసీగా తీసుకొచ్చారు. ఆ తర్వాత నారాయణపేట కొత్త జిల్లాకు కలెక్టర్‌గా కావడం ఎంతో సంతోషంగా ఉంది. రొనాల్డ్‌రోస్ తీసుకొస్తున్న నూతన విధానాల మార్పులతో పాలన సౌలభ్యంగా సాగుతుంది. ఆయనను స్ఫూర్తిగా తీసుకుంటూ నేడు కలెక్టర్ హోదాలో నారాయణపేట జిల్లాలో పరిపాలనను ఎంతో సులభంగా ప్రశాంతంగా నిర్వహిస్తున్నా. పుట్టింది ఆంధ్రప్రదేశ్‌లో.. నేను పుట్టింది మొదలు.. నా ఉద్యోగ జీవితం దాదాపు ఆంధ్రప్రదేశ్ అక్కడే కొనసాగింది. అక్కడ సాగునీటికి పెద్ద కొరత లేదు. తొలిసారిగా తెలంగాణలోని నల్ల గొండ జిల్లాలో 2014లో జెడ్పీ సీఈఓగా బాధ్యతలు చేపట్టా. ఆ ప్రాంతంలో సాగునీరు, తాగునీటికి చాలా ఇబ్బందులు.. ఆ తర్వాత పాలమూరు జిల్లాకు 2018లో జేసీగా వచ్చా. ఎక్కడ చూసినా బీడు భూములు కనిపించడంతో కన్నీళ్లు వచ్చాయి. అందులో నారాయణపేట ప్రాంతమైతే మరి సాగునీరు లేక రైతాంగం కష్టాల్లో ఉన్నట్లు కనిపించింది. త్వరలోనే పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టు పూర్తయి జిల్లా అంతా పచ్చబడితే చూడాలని ఉంది. ‘పేట’ జిల్లా అభివృద్ధే ధ్యేయం వెనుకబడిన నారాయణపేట కొత్త జిల్లాకు కలెక్టర్‌గా రావడం నాకు చాలా ఆనందంగా ఉంది. విద్య, వైద్యంతో పాటు వ్యవసాయ రంగానికి సాగునీరు అందించి అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నాను. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ పథకాలను ప్రజలకు చేరువేస్తూ ఉత్తమ పాలనను అందించాలనే దృఢ సంకల్పంతో పనిచేస్తున్నా. ఈ ప్రాంత ఎమ్మెల్యేలు రాంమోహన్‌రెడ్డి, రాజేందర్‌రెడ్డి, పట్నం నరేందర్‌రెడ్డి తదితరులు సాగునీరు సాధించాలనే లక్ష్యంతో ఉన్నారు. వారికి నా వంతు తోడ్పాటునందిస్తా. నా గురువు సత్యం మాస్టారు.. తల్లిదండ్రుల తర్వాత గురువే దైవం. ఆ గురువే మా సత్యం మాస్టారు. సాలూరు వేద సమాజం సంస్కృత ఉన్నత పాఠశాలలో పదో తరగతి వరకు చదివాను. అక్కడ నన్ను చాలా ప్రోత్సహించేవారు. తప్పుచేస్తే కోప్పడేవారు. నాలో ఉన్న ప్రతిభను గుర్తించి జిల్లా, రాష్ట్ర స్థాయిలో ఏ పోటీలు ఉన్నా నన్ను ఎంపిక చేసి పంపేవారు. ‘చదువులో రాణిస్తూ ఉన్నత శిఖరానికి ఎదిగే గొప్ప లక్ష్యం ఉన్న వాడివి నువ్వు..’ అంటూ ఆశీర్వదించేవారు. ఆయన చెప్పిన చదువుతో నేడు కలెక్టర్‌నయ్యాను. మాతాత పేరే నాకు పెట్టారు మా తాత పేరు వెంకటస్వామి. ఆయనపేరే మానాన్న నాకు పెట్టారు. మొదట్లో ఐదో తరగతి వరకు నా పేరు వెంకటస్వామిగానే పిలిచేవారు. వెంకటస్వామి ఈజ్ ఓల్డ్ నేమ్ మ్యాన్.. వెంకట్రావు ఈజ్ న్యూ నేమ్ దిస్ టైమ్ట్రెండ్.. అంటూ అప్పట్లో చదువు చేప్పే గురువులు వెంకటస్వామిని కాస్తా వెంకట్రావుగా పేరు మారుస్తూ పాఠశాలలో పేరు మార్చేశారు. ఇక మా నాన్న డిగ్రీలో ఉన్నప్పుడే గుండెపోటుతో మృతిచెందారు. అప్పటి నుంచి పెద్దనాన్న అప్పలరాజు నన్ను అన్ని విధాలా ప్రోత్సహించారు. నేను కలెక్టర్ కావాలనేది నాన్న కల. మాపెద్దనాన్న సైతం ఉన్నత స్థాయిలో ఉంటావంటూ ఆశీర్వదించేవారు. వారి కల నేరవేరింది. ఇంట్లో నేనే పెద్దోడిని. అప్పటికే నేను డిగ్రీ చదువుతున్నా. మధ్యలో ఆపెయ్యొద్దంటూ మా తమ్ముళ్లు రాము, హరి ఎంతో ప్రోత్సహించారు. నాన్న చేసే వ్యవసాయం.. చిన్నపాటి వ్యాపారాలను వారే చూసుకుంటున్నారు. ఫేస్బుక్లో ఫ్రెండ్స్‌తో టచ్ చిన్ననాటి బాలస్నేహితులు లక్ష్మణ్‌రావు, రమేశ్, వాసు, వెంకటరాజు, శ్రీనివాస్, సత్యనారాయణ ఉన్నారు. ప్రస్తుతం వారు వివిధ రంగాల్లోని ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగాల్లో పనిచేస్తున్నారు. వారితోపాటు బాల్యదశ నుంచి ఎంబీఏ వరకు చదివిన తోటి ఫ్రెండ్స్ అంతా ఫేస్బుక్లో టచ్‌లో ఉన్నారు. నేను కలెక్టర్‌ను అయ్యానని తెలిసి ఫ్రెండ్స్ నా ఫొటోను అందులో పెడుతూ అభినందించారు. ప్రజాసేవకు జీవితం అంకితం ఉద్యోగంలో ఉన్నా...పదవీ విరమణ పొందిన నా జీవితమంతా ప్రజాసేవకే అంకితం. 1989లో ఉద్యోగ బాధ్యతలు చేపట్టి.. నేడు కలెక్టర్‌గా కొనసాగుతూ భవిష్యతులో మరో అడుగువేస్తే అడిషనల్ సెక్రటరీ వరకు వెళ్లొచ్చు. 2025లో పదవీ విరమణ ఉంది. అందరితో కలిసిమెలిసి ఉండాలంటే నాకెంతో ఇష్టం. ఐఏఎస్‌ను అయ్యాననే భావన నాలో లేదు. కిందిస్థాయి నుంచి వచ్చాను. నాకు ప్రజలతో అనుబంధం ఎక్కువ. వారికి కష్టం వచ్చినప్పుడు అండగా నిలవడం ఆయా సమస్యలకు పరిష్కార మార్గం చూపడంలోనే సంతృప్తినిస్తుంది. జీవితంలో ఆత్మతృప్తిని మించింది మరొకటి ఏముంటుంది. ‘ఆయన’ మా మేనమామ మా ఆయన నాకు వరుసకు మేనమామ. చిన్నప్పు డు ఆయన చదివిన స్కూళ్లోనే నేను చదివా. మా ఇద్దరిదీ ఒకటే ఊరు. మా చిన్న తాత పెద్దకొడుకు. వ్యక్తిగత జీవితం కంటే ఉద్యోగ నిర్వహణలో ప్రజాజీవితమే ముఖ్యం. చిన్నప్పటి నుంచి మామ మనస్సు నాకు తెలుసు. డీటీ నుంచి కలెక్టర్‌గా అయ్యారంటే చాలా ఆనందంగా ఉంది. 30ఏళ్లుగా ఉద్యోగిగా ఆయన గృహిణిగా నేను పిల్లలతో కలిసి చాలా సంతోషంగా ఉన్నాం. కాస్తా సమయం దొరికిందంటే చాలు మాతో చాలా ఆనందంగా కాలన్ని గడుపుతారు. ఎంత పని ఉన్నా తమను సినిమాలకు తీసుకెళ్లి ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ చేస్తారు. మొక్కలు పెంచడమంటే చాలా ఇష్టం. ఇంటి ఆవరణలో సైతం మొక్కలు నాటి పెంచుతుంటాను. పూల మొక్కలనే ఎక్కువగా పెంచాను. – రాజేశ్వరి, కలెక్టర్ సతీమణి -
కొత్త పట్టా పుస్తకాలెప్పుడో!
సాక్షి, ఆదిలాబాద్: భూరికార్డుల ప్రక్షాళన జరిగి దాదాపు మూడేళ్లు గడుస్తుంది. అయినా ఇంత వరకు వివాదాస్పదంగా ఉన్న భూ సమస్యలను పరిష్కరించడంతో అధికారులు శ్రద్ధ చూపడం లేదు. సర్వే సమయంలో ఎలాంటి సమస్యలు లేని భూములను పార్ట్–ఏలో చేర్చి కొత్త పట్టాపాసు పుస్తకాలు అందించారు. వివాదాలు ఉన్న భూములను పార్ట్–బిలో చేర్చి ఇంత వరకు కొత్త పట్టా పాసుపుస్తకాలు అందజేయలేదు. దీంతో గత రెండున్నరేళ్లుగా రైతులు కార్యాలయాల చుట్టూ తిరిగినా ఫలితం లేదు. తహసీల్దార్ కార్యాలయం, కలెక్టర్ కార్యాలయం చుట్టూ తిరిగినా.. ఫలితం మాత్రం కనిపించడం లేదు. మూడు ఎకరాలకుపైనే.. భూ రికార్డుల ప్రక్షాళన కార్యక్రమంలో భాగంగా భూ వివరాలను పరిశీలించిన అధికారులు సర్వే లో వివాదాలు ఉన్న భూములను పార్ట్–బీలో చే ర్చారు. రెవెన్యూ రికార్డుల శుద్ధీకరణ జరిగి ఇరవై నెలలు గడుస్తున్నా..పార్ట్–బీ భూములకు ఇంత వరకు పూర్తిస్థాయి పరిష్కారం లభించడం లేదు. దీంతో ఆ భూములు కలిగిన పట్టాదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నియోజకవర్గంలో 5400 ఎకరాలపైగా భూములను పార్ట్–బీలో చేర్చగా, గతేడాది నుంచి ఇప్పటి వరకు 2 వేల ఎకరాల భూములకు మాత్రమే పరిష్కర మార్గం చూ పారు. మిగతా 3,400 ఎకరాలకు మోక్షం కలగలేదు. పార్ట్–బీలోని భూములన్నింటీకి పరిష్కారం లభిస్తుందని రైతులు ఆశించినా ప్రభుత్వం వివిధ కారణాలతో పక్కన పెడుతూ వస్తోంది. గత ఎనిమిది నెలలుగా వరుస ఎన్నికల నేపథ్యం లో పార్ట్–బీ భూ సమస్యల జోలికి అధికారులు వెళ్లలేదు. మోక్షం లభించేనా? నియోజకవర్గంలో జైనథ్, బేల, ఆదిలాబాద్ రూరల్, అర్బన్, మావల మండలాలున్నాయి. ఈ మండలాల పరిధిలోని సుమారు 3400 ఎకరాలకుపైగా భూములు పార్ట్–బీలో పెండింగ్‌లో ఉం ది. వీటకి పూర్తిస్థాయి పరిష్కరం లభించే అవకాశం కనిపించడం లేదు. కోర్టుకేసులు, కుటుంబ వివాదాలు ఉన్న భూములను అధికారులు పక్కనపెట్టగా, చిన్న చిన్న సమస్యలున్న భూములను మాత్రమే పరిశీలన చేసి పరిష్కరిస్తున్నారు. దీంతో అసలు సమస్య ఉన్న భూములు పెండింగ్‌లో నే ఉన్నాయి. అయితే కొన్ని భూములకు చిన్న స మస్యలు ఉన్నప్పటికీ అధికారులు పట్టించుకోవ డం లేదని, కలెక్టర్ ఆదేశాలను సైతం బేఖాతరు చేయడం లేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి. రెవెన్యూ అధికారులు ఓసారి దృష్టి సారిస్తే.. భూ సమస్యలు పరిష్కారం అవుతాయని లబ్ధిదారులు పేర్కొంటున్నారు. పార్ట్–బీలోని కొన్ని భూములపై రెవెన్యూ, సివిల్ కోర్టు కేసులు, సరిహద్దు గుర్తింపు సమస్యలున్నాయి. పాసు పుస్తకం ఇవ్వాలి నా పేరు మీద వ్యవసాయ భూమి ఉంది. పాత పట్టా పాస్‌బుక్‌లు ఉన్నాయి. కానీ కొత్త పట్టా పాసు పుస్తకాలు ఇంత వరకు ఇవ్వలేదు. చాలాసార్లు అధికారులను అడిగినా.. ఇంత వరకు జారీ చేయలేదు. దీంతో రైతుబంధు, ప్రభుత్వ రాయితీలకు దూరమవుతున్నాం – ప్రసాద్, ఖానాపూర్, ఆదిలాబాద్ -
పనిచేయకపోతే ఇంట్లో కూర్చోండి
సాక్షి,ధన్వాడ(నారాయణపేట): స్వచ్ఛ భరత్ మిషన్ పనుల ఆలస్యంపై కలెక్టర్ వెంకట్రావు అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివారం మండల పరిషత్ కార్యాలయంలో ధన్వాడ, మరికల్, నర్వ మండలాల ఏపీఓ, ఎంపీడీఓ, ఏపీం, ఈఓపీఆర్డీ, సీసీలతో సమీక్ష సమావేశం నిర్వమించారు. ఇప్పటి ఎరకు 20శాతం పనులు కూడా పూర్తికాలేదెందుకని అధికారులను ప్రశ్నించారు. గ్రామాల్లో మరుగుదొడ్ల నిర్మాణ పనులు కొనసాగుతున్నాయని అంటున్నారే తప్ప పూర్తిఅవ్వడంలేదని ఫొటో క్యాప్చర్కూడా చేయడంలేదని అన్నారు. నర్వ మండలంలో కేవలం 9శాతమే పనులు కూడా పూర్తి చేయకలేకపోయరని ఏపీఎం, ఎంపీడీఓపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రూ.16కోట్ల నిధులు పెండింగ్‌లోనే.. నారాయణపేట జిల్లాలకు స్వచ్ఛభరత్ మిషన్ నిధులు విడుదల చేయాలని అధికారులను కోరితే ప్రస్తుతం కొన్ని మండాలలో రూ. 16 కోట్లు పెండింగ్‌లో ఉన్నా యని వాటికి సంబంధించిన పనులు పూర్తిచేస్తేనే కొత్త నిధులు విడుదల చేస్తామని చెప్పారన్నారు. కొన్ని మండలాల వల్ల పనులు పూర్తిచేసుకున్నవారికీ నిధులు ఇవ్వలేకపోతున్నామన్నారు. ఈనెల 14న అంబేద్కర్ జయంతి లోపు అన్ని మండలలోని గ్రామాలలో ఓడిఎఫ్ చేయాలని లేదంటే సస్పెన్షన్ వేటు పడుతుందని హెచ్చరించారు. మూడురోజుల్లో ఎన్నికలు ఉన్నాయని కేంద్రాలలో సౌకర్యాలు కల్పించాలన్నారు. ట్రైసీకిల్స్ను ఏర్పటు చేయాలని కార్యదర్శులకు సుచించారు. వికలంగులకు ప్రత్యేకంగా దూరని బట్టి ఆటోవులను ఏర్పటు చేయాలు అధికారులకు సుచించారు. మక్తల్ మండలంలో నిర్వహించిన సమీక్షకు గైర్హాజరైన అంగన్వాడీ సూపర్వైజర్లను 12న స్పెండ్ చేస్తున్నట్లు కలెక్టర్ వెంకట్రావు తెలిపారు. స్వచ్ఛత పనులు పూర్తిచేయాలి మక్తల్: వందశాతం ఓడీఎఫ్ గ్రామాలుగా తీర్చిదిద్దాలని కలెక్టర్ వెంకట్రావు అన్నారు. ఆదివారం మక్తల్‌లో ఎంపీడీఓ కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. ఈ విషయంపై అధికారులు నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. మండలంలో రూ.1.50కోట్లు నిల్వ ఉంచారెందుకని ప్రశ్నించారు. పీడీ శంకరాచారీ, ఎంపీడీఓ విజయనిర్మల, ఏపీఓ చిట్టెం మాధవరెడ్డి, ఏపీఎం నారాయణ, అధికారులు తదితరులు పాల్గొన్నారు. -
వైఎస్సార్ కడప: ఓటరు లిస్ట్‌లో పేరుందా..? మీరు చెక్ చేసుకోండి..
సాక్షి, వైఎస్సార్ కడప : నేషనల్ ఓటర్ సర్వీస్ పోర్టల్ (www.nvsp.in) ఓపెన్ చేసి అందులో పేరు కానీ, ఓటర్ ఐడీ కార్డు ఎపిక్ నంబర్ కానీ నమోదు చేస్తే.. ఓటుందో లేదో తెలుస్తుంది. ఓటు లేకుంటే అందులోనే నమోదు చేసుకోవచ్చు. 1950 టోల్‌ఫ్రీ నంబర్‌కు ఫోన్ చేసి కూడా వివరాలు తెలుసుకోవచ్చు. www.ceoandhra.nic.in వెబ్సైట్ ఓపెన్ చేస్తే search your name పేరుతో ఆప్షన్ కనిపిస్తుంది. అందులో మీ నియోజకవర్గంలో మీ ఓటుందో లేదో మీ పేరు ఆధారంగా చెక్ చేసుకునే వెసులుబాటు ఉంది. కాల్ సెంటర్ ఇన్చార్జి రామునాయక్ (స్టెప్ సీఈఓ) సెల్ నంబర్: 98499 09064 జిల్లా కలెక్టరేట్లోని ఎన్నికల ప్రత్యేక సెల్లో ఓటరు కార్డు ఎపిక్ నంబర్ వివరాలు అందిస్తే ఓటు ఉందో లేదో చెబుతారు. ఫారం–6 నింపి అక్కడే ఓటు నమోదు చేసుకోవచ్చు. మీ–సేవ కేంద్రాల్లో నిర్ణీత మొత్తం తీసుకుని ఓటరు జాబితాలో పేరుందా? లేదా? అనే వివరాలు చెక్ చేసి చెబుతారు. అక్కడే ఓటు నమోదు కూడా చేసుకోవచ్చు. సాధారణంగా ఎన్నికల నామినేషన్‌కు వారం ముందు వరకు ఓటు నమోదుకు అవకాశం ఉంటుంది. అధికారులను సంప్రదించి తెలుసుకోవచ్చు. ప్రజల్లో చైతన్యం కోసం సాక్షి ప్రయత్నం -
ఓటర్లలో రికార్డు చైతన్యం..!
సాక్షి, వనపర్తి : వచ్చే ఎన్నికల్లో ఓటింగ్ శాతం పెంచాలన్న లక్ష్యంతో పలు కార్యక్రమాలు చేపడుతున్న అధికారులు.. వనపర్తిలో మరో ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు. జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ శ్వేతామహంతి సారథ్యంలో జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల క్రీడామైదానంలో శనివారం ఓటరు చైతన్యం కోసం ఏకకాలంలో 6,300 మంది విద్యార్థులు, స్థానికులతో ప్రతిజ్ఞ చేయించారు. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల, కళాశాలల విద్యార్థులు, స్థానికులతో పాటు కలెక్టర్ శ్వేతామహంతి, ఎస్పీ కె.అపూర్వారావు, అధికారులు ఓటర్లను చైతన్యం చేస్తామంటూ ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమానికి వండర్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు ప్రతినిధులు హాజరై రికార్డు ధవీకరణ పత్రంతో పాటు బంగారు పతకం అందజేశారు. ఓటింగ్ శాతం పెంచేందుకు జిల్లా ఎన్నికల అ«ధికారి సూచన మేరకు నెల రోజులుగా వినూత్నమైన కార్యక్రమాలు చేపడుతున్న అధికారులు ఇప్పుడు జిల్లా విద్యాశాఖ సహకారంతో డీపీఆర్ఓ వెంకటేశ్వర్లు ఆధ్వర్యాన ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. వండర్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు పత్రాన్ని జిల్లా విద్యాశాఖ అధికారి సుశీందర్‌రావు పేరున ప్రకటించారు. ఈవీఎంలపనితీరు ఇలా... కల్వకుర్తి టౌన్ : సాధారణ ఎన్నికల సందర్భంగా ఎన్నికల కమిషన్ ఈవీఎంలను వినియోగిస్తోంది. ఈవీఎంకు రెండు యంత్రాలు అనుసంధానంగా ఉంటాయి. ఇవే సీయూ(కంట్రోల్ యూనిట్), బీయూ (బ్యాలెట్ యూనిట్). పోలింగ్ స్టేషన్‌లోని అధికారుల వద్ద సీయూ ఉంటుంది. ఓటర్లు బీయూలో ఓటు వేయాల్సి ఉంటుంది. ఓటరు ఓటు వేయడానికి వెళ్లినప్పుడు అధికారి సీయూలోని బ్యాలెట్ బటన్‌ను నొక్కితేనే ఓటు వేసేందుకు అనుమతి లభిస్తుంది. బీయూలో 16 గుర్తుల వరకు ఉంటాయి. ఒకవేళ అంతకంటే ఎక్కువ అభ్యర్థులు ఉండి గుర్తులు కేటాయించాల్సి వస్తే మరో యంత్రాన్ని వినియోగిస్తారు. అభ్యర్ధులు పది మంది కంటే తక్కువగా ఉంటే ఎందరు అభ్యర్ధులు పోటీలో ఉంటే అన్ని గుర్తులు మాత్రమే ఉండేలా ఏర్పాట్లు చేస్తారు. ఎన్నికల అధికారి సీయూలో బ్యాలెట్ బటన్ నొక్కగానే ఓటు వేసేందుకు వెళ్లిన ఓటరు వద్ద ఉన్న బీయూలోని బల్బు వెలుగుతుంది. అప్పడు బీయూలోని అభ్యర్ధుల గుర్తుల్లో తమకు నచ్చిన అభ్యర్ధి గుర్తుకు ఎదురుగా ఉన్న బటన్‌ను నొక్కితే ఓటింగ్ పూర్తయినట్లు, ఈ ప్రక్రియ పూర్తికాగానే బల్బు ఆగిపోతుంది. అప్పుడు మరో ఓటరును పంపిస్తారు. బీయూలో అభ్యర్ధులందరీ గుర్తుల తర్వాత నోటా గుర్తు ఉంటుంది. అభ్యర్థులెవరూ నచ్చని పక్షంలో నోటాను ఎంచుకోవచ్చు. -
వాళ్లను ఒత్తిడి చేయకండి..
అరసవల్లి: ‘ఇరవై మొక్కలు పోతే అరవై మొక్కలని రాయండి. ఒక ఎకరా పంట పోతే ఐదెకరాలుగా నష్టాల్లో రాసేయండని చాలా చోట్ల అధికారులపై తీవ్ర ఒత్తిడి తెస్తున్నారు. ఇలా అయితే ఎలా? కొ న్ని చోట్ల చెప్పినట్లు నష్ట పరిహారాలివ్వకపోతే అధికారులపై బెదిరింపులకు దిగుతున్నారు. మరికొన్ని చోట్ల వెంటపడుతున్నారు. ఎక్కడ ఏం జరిగిందో నాకు తెలుసు. మీకూ తెలుసూ..(ఎమ్మెల్యే శివాజీ వైపు చూస్తూ) ఇంకా ఇక్కడ చెబితే బాగోదు ఇప్పుడు. తిత్లీ పరిహారాల పంపిణీ విషయంలో ప్రజాప్రతిని«ధులంతా సహకరించాలి. అధికారులపై ఎలాంటి ఒత్తిళ్లు తేవొద్దు. అందరూ సహకరిస్తేనే బాధితులందరికీ న్యాయం చేయగలం’ అంటూ కలెక్టర్ కె.ధనంజయరెడ్డి స్పష్టంగా, సంచలనాత్మకంగా మాట్లాడారు. జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం వేదికగా శనివారం ఆయన ప్రజా ప్రతినిధులపై ఉన్నది ఉన్నట్లు మాట్లాడేశారు. ఉపాధ్యాయుల డిప్యుటేషన్ల విషయంలో ప్రజాప్రతినిధులెవ్వరూ జోక్యం వద్దంటూ సభాముఖంగా గత జెడ్పీ సమావేశంలో స్పష్టం చేసిన కలెక్టర్ ధనంజయరెడ్డి, ఈసారి తిత్లీ తుఫాన్ పరిహారాల పంపిణీలోనూ అదే వైఖరి కొనసాగించారు. జెడ్పీ సమావేశ మందిరంలో శనివారం జరి గిన సర్వసభ్య సమావేశంలో ముందుగా తిత్లీ తు ఫాన్ పరిహారాల్లో అక్రమాలున్నాయంటూ ఆధారాలను నివేదిస్తూ వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు వి శ్వాసరాయి కళావతి, కంబాల జోగులుతో పాటు పలువురు వైఎస్సార్సీపీ జెడ్పీటిసీలు, ఎంపీపీలు ధ్వజమెత్తారు. అనంతరం పలాస ఎమ్మెల్యే శివాజీ మాట్లాడుతూ తిత్లీ తుఫాన్ నష్ట పరిహారాల లెక్కల్లో అధికారులు అన్యాయంగా ప్రవర్తిస్తున్నారని, అక్రమాలకు తెగబడుతున్నారంటూ ధ్వజమెత్తారు. దీంతో కలెక్టర్ ధనంజయరెడ్డి ఎమ్మెల్యేకు ధీటుగా బదులిచ్చారు. ఇష్టానుసారంగా పరిహారాలను పంపిణీ చేసిన అధికారులపై కఠిన చర్యలతో పాటు రికవరీ అస్త్రాన్ని ప్రయోగిస్తానని కలెక్టర్ «హెచ్చరించారు. రికార్డు స్థాయిలో కేవలం 25 రోజుల్లోనే నష్ట పరిహారాలను లెక్కించి మొత్తం 3.72 లక్షల రికార్డులను నమోదు చేసి రూ.392 కోట్లు నష్ట పరిహారంగా చెక్కులను పంపిణీ చేశామని, అయితే అక్కడక్కడ పొరపాట్లు ఉన్నాయని, అందుకే మళ్లీ బాధితుల నుంచి దరఖాస్తులను ఆహ్వానించామన్నారు. దీంతో వేల సంఖ్య లో దరఖాస్తులు వచ్చాయని, ఇందులో అర్హులను అనర్హులను గుర్తించి ఆరువేల రికార్డులు పెండింగ్‌లో ఉంచామని తెలిపారు. జిల్లాలో పశువుల శాలలు కూలిపోయినట్లు 43 వేల మంది దరఖాస్తులు చేసుకున్నారని, కొన్ని చోట్ల పశువులు చనిపోయినట్లు రాయించారని తెలియజేశారు. అలాగే వ్యవసాయ పంట నష్టం విషయంలో కూడా 10827 నివేదికలను విచారించి ఆమోదించి అప్లోడ్ చేశామని వివరించారు. స్థానిక నాయకులు కూడా ఇలాంటి విషయాల్లో వాస్తవాలకు అనుగుణంగా బాధితుల నష్టాలను రిఫర్ చేయాలని సూచించారు. ‘సెంటు భూమి లేని వాళ్లకి, పశువులు లేని వారికి పరిహారాన్ని ఇచ్చేశారు. మా వాళ్ల్లకు ఎందు కు రాదు.’ అంటూ ప్రోత్సహించవద్దని హితవు పలికారు. ఎక్కడైనా అదనంగా పరిహారాన్ని ఇచ్చిన అధికారులపై చర్యలు తీసుకుంటామని, అలాగే అదనంగా లబ్ధి పొందిన వారి నుంచి రికవరీ చేస్తామని స్పష్టం చేశారు. సర్వేపైనే మాటలన్నీ.. తిత్లీ నష్టం దారుణంగా ప్రభావం చూపిందని, అయితే నష్ట పరిహారాల చెల్లింపుల్లో పలు పొరపాట్లు చోటుచేసుకున్నాయని, దీనిపై అవసరమైతే మరోసారి సర్వే చేయించి, నిజమైన బాధితులకు న్యాయం చేయాలని నరసన్నపేట ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి కోరారు. తన నియోజకవర్గంలోని సారవకోటలో సర్వే ఆలస్యం కావడంతో 2900 మంది బాధితుల వివరాలు ఆన్లైన్లో లేవని, దీనిపై తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. నందిగాం మండలంలో కల్లాడలో కనీసం భూ మిలేని వారికి, అలాగే పశువుల శాలలు లేనివారికి కూడా ఇష్టానుసారంగా నష్టాలను లెక్కించి పరిహారాలను ఇచ్చేశారని జెడ్పీటీసీ కురమాన బాలకృష్ణ ఆధారాలను చూపిస్తూ ప్రశ్నించారు. పరిహారాల పేరిట అక్రమాలను చేశారని ఆరోపిస్తూ ఆధార పత్రాలను జిల్లా కలెక్టర్‌కు అందజేశారు. ఆయన వెంటే కంచిలి జెడ్పీటీసీ జామి జయ కూడా స్పందిస్తూ తమ పరిధిలో కూడా పరిహారాల పంపిణీలో బాధితులకు అన్యాయం జరిగిందని, సెంటు లేని వాడికి లక్ష వరకు పరిహారాలను వేసే శారని ఆధారాలను కలెక్టర్‌కు అందజేశారు. వంగర మండలంలో ఎంఎల్ఎస్ పాయింట్ ఎత్తివేయడంతో కూలీలతో డీలర్లకు ఇబ్బందులు ఉన్నాయని, ప్రభుత్వం పునరాలోచించాలని జెడ్పీటీసీ బొత్స వాసుదేవనాయుడు కోరారు. అలాగే బీసీ రుణాల విషయంలో పొరుగు రాష్ట్రాల నుంచి పశువులను తెప్పించి ఇచ్చే విధానంతో ఇబ్బందులున్నాయని వివరించారు. దీనిపై కలెక్టర్ స్పం దిస్తూ తమిళనాడు నుంచే పశువుల కొనుగోలు చేయాలనే నిబంధన ఉందని గుర్తుచేశారు. తిత్లీ నష్టాలను సరిగ్గా లెక్కించలేదని ఇచ్ఛాపు రం జెడ్పీటీసీ అంబటి లింగరాజు సున్నిత అంశాన్ని లేవనెత్తారు. దీనిపై జిల్లా కలెక్టర్ స్పందిస్తూ..ఇలాంటి తప్పులను ప్రోత్సహించవద్దని, అ లాంటి ఘటనలపై రికవరీ చర్యలు చేపడతామని కలెక్టర్ హెచ్చరించారు. తిత్లీ నష్టాల్లో బాధితుల ఆధార్ కార్డులు ఇతర రాష్ట్రాల్లో ఉండడంతో సమస్యలు వస్తున్నాయని జెడ్పీటీసీ చంద్రమోహన్ అంశాన్ని లేవనెత్తారు. అలాగే వందలాది మంది రైతులు కొబ్బరి, జీడి తదితర పంటలు నష్టపోయారని, అయితే ఇందులో ఒక్క పంట పేరునే సిస్టమ్ అంగీకరించడంపై కూడా దృష్టి సారించాలని కోరారు. దీన్ని ప్రత్యేకంగా తీసుకుని న్యాయం చేస్తామని కలెక్టర్ భరోసా ఇచ్చారు. తన మండలంలో కొబ్బరి రైతులు తీవ్రంగా నష్టపోయారని, అయితే వీరికి నష్ట పరి హార చెక్కులు ఇచ్చినా, నగదు జమ కాలేదని కంచిలి ఎంపీపీ ఇప్పిలి లోలాక్షి తెలిపారు. దీనిపై కలెక్టర్ స్పందిస్తూ చిన్న చిన్న సర్దుబాట్లు చేయాలని, అందుకే పలు చెక్కులు పెండింగ్‌లో ఉంచామని, త్వరలోనే అంతా సర్దుకుంటుందని తెలిపారు. సమావేశంలో జిల్లా పరిషత్ చైర్పర్సన్ చౌదరి ధనలక్ష్మి, జాయింట్ కలెక్టర్ కేవీఎన్ చక్రధరబా బు, జెడ్పీ సీఈఓ బి.నగేష్, డిప్యూటీ సీఈఓ ప్ర భావతి, ఏఓ హేమసుందర్, విద్యుత్ శాఖ ఎస్ఈ బి.దేవవరప్రసాద్, డీఈలు చలపతిరావు, సాంబ శివరావు, గిరీశ్వరరావు, జిఎన్.ప్రసాద్, ఆర్అం డ్బీ ఎస్ఈ కాంతిమతి, ఈఈ అబ్దుల్ ఖాదిర్, ఎస్ఎస్ఎ పీఓ త్రినాథరావు, ఈఈ ఆర్.సుగుణాకరరావు, మత్స్యశాఖ జెడి కృష్ణమూర్తి పాల్గొన్నారు. -
సంపూర్ణ అవగాహన కలిగి ఉండాలి
సాక్షి,బిచ్కుంద (నిజామాబాద్): పోలింగ్ నిర్వహణపై అధికారులు సంపూర్ణ అవగాహన కలిగి ఉండి పోలింగ్ ప్రక్రియను సజావుగా నిర్వహించాలని కలెక్టర్ సత్యనారాయణ అన్నారు. బుధవారం బిచ్కుంద డిగ్రీ కళాశాలలో పోలింగ్ నిర్వహణ అధికారులకు అం దిస్తున్న శిక్షణ తరగతులను కలెక్టర్ సందర్శించారు. ఈ సందర్భంగా మాక్ పోలింగ్, వీవీ ప్యా ట్లు, బ్యాలెట్ యూనిట్లు సీల్ చేయడం , పోలింగ్ సమయ పాలన తదితర అంశాలపై సందేహాలను కలెక్టర్ నివృత్తి చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎన్నికల విధులు సమర్ధవంతంగా నిర్వహించాలి చిన్న చిన్న పొరపాట్లతో పెద్ద సమస్యలు ఏర్పడతాయి ఎలాంటి సమస్యలు ఉత్పన్నం కాకుండా ఎన్నికల సంఘం సూచించిన మార్గదర్శకాలు ప్రీసైడింగ్ అధికారులు పాటించాలని ఆదేశించారు. శిక్షణ తరగతులలో సూచించిన విధంగా వీవీ ప్యాడ్, ఈవీఎంలపై సంపూర్ణ అవగాహన పెంపొందించుకోవాలన్నారు. జిల్లాలో గత నెల రోజుల నుంచి మాక్ పోలింగ్‌తో ఈవీఎంలపై అవగాహన కల్పిస్తున్నామన్నారు. పోలింగ్ బూత్‌లలో అన్ని యంత్రాలను సక్రమంగా బిగించాలని, మొరాయిస్తున్నట్లు ఫిర్యాదులు రాకుండా చూడాలని సూచించారు. ఓటు వేయడానికి బూత్‌లలో వికలాంగులకు ర్యాంపులు, వీల్చేర్, వాహన సౌకర్యం కల్పిస్తున్నామన్నారు. కార్యక్రమంలో డీఆర్డీఏ పీడీ చంద్రమోహన్‌రెడ్డి, ఆయా శాఖల అధికారులు, ఆరు మండలాల అధికారులు పాల్గొన్నారు. తప్పులు దొర్లకుండా చూడాలి మద్నూర్(జుక్కల్): రిటర్నింగ్ అధికారి, అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులు, ఎన్నికల సిబ్బంది సమన్వయంతో పనిచేయాలని తప్పులు దొర్లకుండా చూసుకోవాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ సత్యనారాయణ సూచించారు. మండల కేంద్రంలోని తహసీల్ కార్యాలయంలో కొనసాగుతున్న నామినేషన్ పత్రాల స్వీకరణ, స్ట్రాంగ్ రూంను బుధవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల్లో పారదర్శకత కోసమే ఎన్నికల కమిషన్ వీవీప్యాట్ల విధానాన్ని అమలు చేస్తోందని తెలిపారు. జిల్లాలోని కామారెడ్డి, ఎల్లారెడ్డి, జుక్కల్ నియోజకవర్గాల్లో 740 పోలింగ్ స్టేషన్లకు 740 బీఎల్వోలు, 74 సూపర్వైజర్లను ఏర్పాటు చేశామన్నారు. జిల్లాలో ఎన్నికల కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని, ఎన్నికలకు అధికార యంత్రాంగం సిద్ధంగా ఉందని కలెక్టర్ తెలిపారు. ఆయన వెంట రిటర్నింగ్ అధికారి రాజేశ్వర్, తహసీల్దార్ రవీంధర్, అధికారులు ఉన్నారు. -
మీ పని మీరు చేసుకోండి
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: మంత్రి గంటా శ్రీనివాసరావు ఆనందపురం తహసీల్దార్ ఈశ్వరరావును ఇంటికి పిలిపించుకుని తిట్టిన వ్యవహారంలో జిల్లా ఉన్నతాధికారులు, రెవెన్యూ సంఘాల నేతలు తహసీల్దార్‌కు బాసటగా నిలిచారు. అదే సందర్భంలో అసలేం జరిగిందో తెలుసుకుని అప్పుడే మంత్రిపై స్పందిస్తామని వ్యాఖ్యానించారు. తనకు మాటమాత్రం చెప్పకుండా మండలంలోని 18 ఎకరాల భూములను టిట్కోకు కట్టబెట్టిన విషయమై మంత్రి గంటా తహసీల్దార్‌ను దూషించిన వైనంపై ‘ఏం వేషాలేస్తున్నావా’ అనే శీర్షికన బుధవారం సాక్షిలో వచ్చిన కథనం రెవెన్యూ వర్గాల్లో మనోస్థైరాన్ని నింపింది. జిల్లావ్యాప్తంగా అధికారవర్గాలతో పాటు కలెక్టరేట్ వర్గాల్లో కలకలం రేపిన ఈ కథనంపై జిల్లా కలెక్టర్ ప్రవీణ్‌కుమార్, జాయింట్ కలెక్టర్ సృజనలు స్పందించారు. తమను బుధవారం ఉదయం కలిసిన తహసీల్దార్ ఈశ్వరరావుతో మాట్లాడుతూ ‘మీ పని మీరు చూసుకోండి.. సెలవుపై వెళ్లొద్దు’.. అని భరోసా ఇచ్చారు. ఒకవేళ మీకు ఇబ్బందిగా, ఒత్తిడిగా అనిపిస్తే ఒకటి, రెండు రోజులు క్యాజువల్ లీవ్ తీసుకోవాలని సూచించారు. అయితే రెవెన్యూ సంఘాల నేతలు మాత్రం లీవుపై వెళ్తే వేరే సంకేతాలు వస్తాయి.. అందువల్ల యధావిధిగా ఉద్యోగం చేసుకోనివ్వండి .. అని సూచించడంతో ఈశ్వరరావు బుధవారం మధ్యాహ్నం నుంచి యధావిధిగా ఆనందపురం వెళ్లి ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తించారు. సహజంగా గంటా అలా అనరు: జిల్లా కలెక్టర్ తహసీల్దార్‌కు నైతిక మద్దతు ఇచ్చిన అధికారులు, రెవెన్యూ సంఘాల నేతలు.. అదే సందర్భంలో మంత్రి గంటా శ్రీనివాసరావును మాత్రం పల్లెత్తు మాట అనేందుకు సాహసించలేదు. సహజంగా మంత్రి అలా అనరు.. మరి ఈశ్వరరావును ఏ సందర్భంలో ఎందుకన్నారోనని జిల్లా కలెక్టర్ వ్యాఖ్యానించారు. ఇక ఏపీ జేఏసీ అమరావతి జిల్లా చైర్మన్ నాగేశ్వరరెడ్డి కూడా తహసీల్దార్‌కు నైతిక మద్దతు ఇస్తూనే మంత్రి గంటాను వెనకేసుకొచ్చారు. ఇంతవరకూ ఆయన అధికారులను తిట్టిన దాఖలాల్లేవు.. ఇది ఎందుకు జరిగిందో తెలియదు.. అందుకే బుధవారం అత్యవసర సమావేశం నిర్వహించాం.. ఉద్యోగ సంఘాల నేతలందరూ వచ్చారు. సీరియస్‌గా చర్చించాం... మంత్రి గంటాతో, జిల్లా కలెక్టర్‌తో ముఖాముఖి చర్చలు జరిపాక నిర్ణయం తీసుకుంటామని నాగేశ్వరరెడ్డి బుధవారం సాక్షి ప్రతినిధితో మాట్లాడుతూ చెప్పారు. ఏపీ ఎన్జీవో అసోసియేషన్ జిల్లా అ«ధ్యక్షుడు ఈశ్వరరావు ఇదే విషయమై స్పందిస్తూ.. వాస్తవానికి గంటా అలా అనరు.. అలా అంటే ఖండిస్తాం... అని వ్యాఖ్యానించారు. -
డీఎన్ఏ కలిపింది ఇద్దరినీ..
జగిత్యాల: జగిత్యాల జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రిలో గతనెల 21న శిశువుల మార్పిడి జరిగిందనే అనుమానాలు నిజమయ్యాయి. 15 రోజుల అనంతరం డీఎన్ఏ రిపోర్ట్లు రావడంతో బుధవారం ఎవరి శిశువులను వారికి అప్పగించారు. ఈ ఘటనపై జాయింట్ కలెక్టర్ రాజేశం, ఆర్డీవో నరేందర్ విచారణ చేపట్టారు. బాధ్యులైన నలుగురిపై సస్పెన్షన్‌కు ఆదేశించారు. బుగ్గారం మండలం మద్దునూర్‌కు చెందిన బొంగురాల చామంతి గతనెల 19న జగిత్యాల ఆస్పత్రిలో మగబిడ్డకు జన్మనిచ్చింది. అదే సమయంలో మేడిపల్లి మండలం కొండాపూర్‌కు చెందిన ఎర్ర రజిత సైతం మగబిడ్డకు జన్మనిచ్చింది. అయితే.. సిబ్బంది నిర్లక్ష్యంతో కవల పిల్లలంటూ ఇద్దరు శిశువులను రజిత కుటుంబసభ్యులకు అప్పగించారు. చామంతి కుటుంబ సభ్యులు తమ బిడ్డ ఏడని నిలదీయడంతో పొరపాటును గుర్తించిన సిబ్బంది.. వెంటనే రజిత వద్దనున్న రెండో బిడ్డను తీసుకొచ్చి వీరికి అందజేశారు. ఈ శిశువు తమ బిడ్డ కాదంటూ చామంతి కుటుంబ సభ్యులు సిబ్బందితో వాగ్వాదానికి దిగారు. దీంతో వైద్యసిబ్బంది డీఎన్ఏ రిపోర్ట్ తీసుకుంటే ఎవరి బిడ్డ అనేది తెలుస్తుందని తేల్చారు. ఈ క్రమంలో జూన్ 2న రిపోర్ట్లు వచ్చాయి. సదరు ఆస్పత్రి సిబ్బంది మళ్లీ తప్పు చేశారు. శిశువుల మార్పిడి జరగలేదని పేర్కొన్నారు. అయితే.. చామంతి, మహేందర్ దంపతులకు మొదటి నుంచీ అనుమానాలు ఉండటంతో వారు కలెక్టర్ శరత్‌ను కలసి మొర పెట్టుకున్నారు. దీంతో ఆయన సమస్య పరిష్కరించాలని జాయింట్ కలెక్టర్‌ను విచారణ అధికారిగా నియమించారు. జేసీ సమక్షంలో మళ్లీ శాంపిల్స్ తీసుకుని పంపించడంతో మంగళవారం రిపోర్ట్లు వచ్చాయి. శిశు మార్పిడి జరిగింది వాస్తవమేనని తేలింది. ఇరువురు దంపతులను ఆసుపత్రికి పిలిపించి.. ఎవరి బిడ్డలను వారికి అందించారు. కాగా, నిర్లక్ష్యంగా వ్యవహరించిన వార్డుబాయి, ఆయాతోపాటు నర్సు, సూపరింటెండెంట్లపై చర్యలు తీసుకోవాలని జాయింట్ కలెక్టర్ ఆదేశించారు. తల్లిదండ్రుల్లో ఆనందం మద్దునూర్‌కు చెందిన బొంగురాల మహేందర్, చామంతి దంపతులు మాట్లాడుతూ మొదటి నుంచీ శిశుమార్పిడి జరిగిందని చెబుతున్నామని, డాక్టర్లు పట్టించుకోవడం లేదని పేర్కొన్నారు. 15 రోజుల పాటు ఇంటికి వెళ్లకుండా ఆస్పత్రిలోనే ఉన్నామని, ఉన్న పొలాన్ని కుదవపెట్టి డీఎన్ఏ రిపోర్ట్ కోసం రూ.21 వేలు ఖర్చు చేశామని పేర్కొన్నారు. మరో రూ.9 వేల వరకు శిశువు చికిత్స కోసం వెచ్చించామని తెలిపారు. డీఎన్ఏ రిపోర్ట్ కోసం ఇచ్చిన డబ్బులను ఇవ్వాలని చామంతి కుటుంబ సభ్యులు ఆస్పత్రి ఎదుట ఆందోళనకు దిగారు. రెండు, మూడు రోజుల్లోగా ఖర్చులు ఇచ్చేలా చూస్తామని సూపరింటెండెంట్ హామీ ఇవ్వడంతో వారు శాంతించారు. సూపరింటెండెంట్ సమక్షంలో శిశువులను మార్చుకుంటున్న తల్లిదండ్రులు -
పంచాయతీ ఎన్నికలకు సిద్ధంగా ఉండాలి
సూర్యాపేట : వచ్చే నెలలో గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉన్నందున అందుకు అనుగుణంగా అధికారులు ఏర్పాట్లను ముమ్మరం చేయాలని కలెక్టర్ సురేంద్రమోహన్ ఎంపీడీఓలను ఆదేశించారు. శుక్రవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణకు సంబంధించిన ఏర్పాట్లు, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై పంచాయతీ అధికారులు, మండల అభివృద్ధి అధికారులతో సమీక్ష సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గ్రామ పంచాయతీ ఎన్నికలు దగ్గర పడుతున్నందున మార్చి 24న రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించిన శాసనసభ ఎన్నికల జాబితాను తీసుకొని దాని ప్రకారం అసెంబ్లీ పరిధిలోని గ్రామ పంచాయతీలు వాటి వార్డుల వారీగా క్రమ సంఖ్య ప్రకారం ఎలాంటి పొరపాట్లు దొర్లకుండా గ్రామ పంచాయతీ ఓటర్ల జాబితాను ఏ పార్ట్‌లలో, ఏ సీరియల్ నెంబర్ ఉన్నది, ఏ పోలింగ్ స్టేషన్ పరిధిలో ఉన్నది అనే విషయాలను మాన్యువల్‌గా తయారు చేసుకొని అందుబాటులో ఉంచాలని సూచించారు. ముఖ్యంగా ఎన్నికల నిర్వహణకు లెవల్1, లెవల్2 రూట్ అధికారులు, జోనల్ అధికారులు, ఎన్నికల అధికారులు ఉంటారని పేర్కొన్నారు. అదే విధంగా సంయుక్త కలెక్టర్, డీఆర్ఓ లెవల్1, డివిజనల్ అధికారులు లెవెల్2 అధికారులుగా వ్యవహరిస్తారని తెలిపారు. రిజర్వేషన్లు గుర్తించే బాధ్యత ఆర్డీఓలదే.. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో రిజర్వేషన్లు గుర్తించే బాధ్యత ఆర్డీఓలపై ఉంటుందని పేర్కొన్నారు. జాబితాను ఒకటికి రెండు సార్లు పరిశీలించిన తదుపరి మాత్రమే రిజర్వేషన్ ధ్రువీకరించి ప్రకటించాలని సూచించారు. ప్రస్తుతం నిర్వహించే ఎన్నికలు పూర్తిగా రాష్ట్ర ఎన్నికల సంఘం పరిధిలో ఉన్నందున అధికారులు అప్రమత్తంగా ఉండాలన్నారు. ఎలాంటి పొరపాటు జరిగినా ఎన్నికల సంఘం తీసుకునే చర్యలకు బాధ్యత వహించాల్సి ఉంటుందని, తగు జాగ్రత్తతో వ్యవహరించాలని పేర్కొన్నారు. ముఖ్యంగా కొత్త గ్రామ పంచాయతీల గుర్తింపు, పాత పంచాయతీల వివరాలతో జిల్లా నుంచి పంపిన ప్రతిపాదనలు ఎలాంటి మార్పులు లేకుండా ప్రభుత్వం ఆమోదించిందని, ఒకటి రెండు రోజుల్లో అధికారిక సమాచారం అందుతుందని అన్నారు. ముఖ్యంగా ఓటర్లు ఏ వార్డుకు సంబంధించిన వారు అదే వార్డుల్లో ఉండే విధంగా చూడాలని తెలిపారు. పంచాయతీ సెక్రటరీలు తయారు చేసిన జాబితాను ఎంపీడీఓలు పూర్తిగా పరిశీలించాలని పేర్కొన్నారు. ఈ సమావేశంలో సంయుక్త కలెక్టర్ సంజీవరెడ్డి, డీఆర్ఓ యాదిరెడ్డి, సూర్యాపేట, కోదాడ ఆర్డీఓలు మోహన్‌రావు, భిక్షునాయక్, డీపీఓ రామ్మోహన్‌రాజు, డీఆర్డీఏ పీడీ కిరణ్‌కుమార్, డీఎండబ్ల్యూఓ శ్రీనివాస్, ఎంపీడీఓలు, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు. -
‘అమృతబిందు’ సహకారం అభినందనీయం
కలెక్టర్ వాకాటి కరుణ ఎంజీఎం : రాష్ట్రీయ బాలస్వస్త్ కార్యక్రమంలో భాగంగా విద్యార్థులలో రక్తహీనత పరీక్షించేందుకు హిమోగ్లోబిన్ అందిస్తున్న అమృతబిందు చారిటబుల్ ట్రస్టు వారి సహకారం అభిందనీయమని కలెక్టర్ వాకాటి కరుణ అన్నారు. జిల్లాలోని 16 ఆర్బీఎస్కే విభాగాలకు 16 హిమోగ్లోబిన్ మీటర్లను శుక్రవారం కలెక్టర్ కార్యాలయంలో అమృత బిందు ట్రస్ట్ బాధ్యులు సురేశ్ కలెక్టర్ చేతుల మీదుగా డీఎంహెచ్ఓ సాంబశివరావుకు అందించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఇలాంటి సేవా కార్యక్రమాలు చేపట్టడం హర్షణీయమన్నారు. డీఎంహెచ్ఓ మాట్లాడుతూ 19 సంవత్సరాలలోపు పిల్లలకు అంగన్వాడీ కేంద్రాలు, పాఠశాలల్లో నిర్వహించే పరీక్షలతో పాటు హిమోగ్లోబిన్ మీటర్ల సహాయంతో రక్తహీనత గల పిల్లలను గుర్తించవచ్చని అన్నారు. అలాంటి వారికి ఐరన్ ఫోలిక్ యాసిడ్ మాత్రలను పంపిణీ చేస్తామన్నారు. కార్యక్రమంలో సంస్థ నిర్వాహకులు సమీర్‌కుమార్, దేవి, అశోక్‌రెడ్డి, అనిల్, సంతోష్ పాల్గొన్నారు. -
కలెక్టర్‌కు కళాత్మక స్వాగతం
నెల్లూరు(వేదాయపాళెం) : జిల్లా కలెక్టర్‌గా సోమవారం బాధ్యతలు చేపట్టనున్న ముత్యాలరాజుకు నెల్లూరుకు చెందిన సూక్ష్మ కళాకారుడు షేక్.ముసవీర్ కళాత్మక స్వాగతం పలుకుతున్నాడు. 200 మిల్లీ గ్రాముల బంగారుతో స్వాగత కళా రూపాన్ని తీర్చిదిద్దాడు. కంట్లో ఇమిడి పోయే ఈ సూక్ష్మనమూనాలో కలెక్టర్, ముత్యాలరాజు అనే అక్షరాలు, ఇరువైపులా సూక్ష్మరూప జాతీయ జెండాలు ప్రత్యేక ఆకర్షనగా నిలుస్తున్నాయి. 1 సెంటీ మీటర్ ఎత్తు, 1/2 సెం.మీ ఎత్తు ఉన్న నమూనా తయారీకి ఒక రోజు పట్టిందని ముసవీర్ తెలిపారు. -
బీసీ హాస్టళ్లకు విలీనం ముప్పు
తక్కువుంటే తరలించడమే..! నాలుగు హాస్టళ్ల తరలింపునకు ఆదేశాలు విద్యార్థుల కొరతతోనే ఉత్తర్వులు భీమదేవరపల్లి : సంక్షేమ హాస్టళ్లను విద్యార్థుల కొరత వెంటాడుతోంది. సరిపడా సంఖ్యలో విద్యార్థులు లేని హాస్టల్‌ను పొరుగునే ఉన్న మరో హాస్టల్లో విలీనం చేసేందుకు రంగం సిద్ధమైంది. ఈ మేరకు జిల్లాలోని నాలుగు హాస్టళ్లను ఆగస్టు ఒకటి లోపు తరలించేందుకు జిల్లా కలెక్టర్ నుంచి ఉత్తర్వులు వెలువడ్డాయి. గతంలో హాస్టల్లో ప్రవేశాలు కావాలంటే పైరవీలు నడిచేవి. ప్రస్తుతం ప్రతి మండలంలో కస్తూరిబా, మోడల్ స్కూల్స్ ఏర్పాటు కావడం.. అక్కడే హాస్టళ్లు నిర్మించడంతో వాటి ప్రభావం వసతి గృహాలపై పడుతోంది. జిల్లాలోని ఎలిగేడు బీసీ హాస్టల్లో 100 మంది విద్యార్థులకు కేవలం 25 మంది, కాటారం మండలం దామెరకుంట బీసీ హాస్టల్లో 15 మంది, భీమదేవరపల్లి మండలం ముల్కనూర్ బీసీ హాస్టల్లో 17మంది, చిగురుమామిడి మండలం బొమ్మనపల్లిలో 22మంది విద్యార్థులు మాత్రమే ఉన్నారు. ఈ హాస్టళ్లలో 100 మంది విద్యార్థులకు ప్రవేశాలు కల్పించాల్సి ఉంది. కనీసం 50 మంది విద్యార్థులు లేని పక్షంలో అట్టి హాస్టళ్లను విలీనం చేస్తామని గతేడాది జిల్లా అధికారుల నుంచి ఆయా వసతి గృహాల వార్డెన్లకు ఆదేశాలు అందాయి. విలీనం భయంతో కొన్నిచోట్ల వార్డెన్లు నానా తంటాలు పడి విద్యార్థులను వసతిగృహాల్లో చేర్పించారు. కానీ.. ఎలిగేడు, దామెరకుంట, ముల్కనూర్, బొమ్మనపల్లి బీసీ వసతి గృహాలకు మాత్రం విద్యార్థులు రాలేకపోయారు. ఈ క్రమంలో వీటిని సమీప వసతి గృహాల్లో విలీనం చేసేందుకు నిర్ణయం తీసుకున్నారు. ఎలిగేడు వసతి గృహాన్ని సుల్తానాబాద్‌కు, దామెరకుంట హాస్టల్‌ను అదే గ్రామంలోని ఎస్టీ ఆశ్రమ హాస్టల్‌కు, ముల్కనూర్ హాస్టల్‌ను అదే గ్రామంలోని ఎస్సీ వసతి గృహానికి, బొమ్మనపల్లి హాస్టల్‌ను అదే గ్రామంలోని ఎస్సీ బాలుర హాస్టల్లో విలీనం చేశారు. వీరందరినీ ఆగస్టు ఒకటి లోపు తరలించాలని సిరిసిల్ల ఏబీసీడబ్ల్యూవో రాజమనోహర్ వెల్లడించారు.