బిచ్కుందలో అవగాహన కల్పిస్తున్న కలెక్టర్ సత్యనారాయణ
సాక్షి,బిచ్కుంద (నిజామాబాద్): పోలింగ్ నిర్వహణపై అధికారులు సంపూర్ణ అవగాహన కలిగి ఉండి పోలింగ్ ప్రక్రియను సజావుగా నిర్వహించాలని కలెక్టర్ సత్యనారాయణ అన్నారు. బుధవారం బిచ్కుంద డిగ్రీ కళాశాలలో పోలింగ్ నిర్వహణ అధికారులకు అం దిస్తున్న శిక్షణ తరగతులను కలెక్టర్ సందర్శించారు. ఈ సందర్భంగా మాక్ పోలింగ్, వీవీ ప్యా ట్లు, బ్యాలెట్ యూనిట్లు సీల్ చేయడం , పోలింగ్ సమయ పాలన తదితర అంశాలపై సందేహాలను కలెక్టర్ నివృత్తి చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎన్నికల విధులు సమర్ధవంతంగా నిర్వహించాలి చిన్న చిన్న పొరపాట్లతో పెద్ద సమస్యలు ఏర్పడతాయి ఎలాంటి సమస్యలు ఉత్పన్నం కాకుండా ఎన్నికల సంఘం సూచించిన మార్గదర్శకాలు ప్రీసైడింగ్ అధికారులు పాటించాలని ఆదేశించారు.
శిక్షణ తరగతులలో సూచించిన విధంగా వీవీ ప్యాడ్, ఈవీఎంలపై సంపూర్ణ అవగాహన పెంపొందించుకోవాలన్నారు. జిల్లాలో గత నెల రోజుల నుంచి మాక్ పోలింగ్‌తో ఈవీఎంలపై అవగాహన కల్పిస్తున్నామన్నారు. పోలింగ్ బూత్‌లలో అన్ని యంత్రాలను సక్రమంగా బిగించాలని, మొరాయిస్తున్నట్లు ఫిర్యాదులు రాకుండా చూడాలని సూచించారు. ఓటు వేయడానికి బూత్‌లలో వికలాంగులకు ర్యాంపులు, వీల్‌చేర్, వాహన సౌకర్యం కల్పిస్తున్నామన్నారు. కార్యక్రమంలో డీఆర్‌డీఏ పీడీ చంద్రమోహన్‌రెడ్డి, ఆయా శాఖల అధికారులు, ఆరు మండలాల అధికారులు పాల్గొన్నారు.
తప్పులు దొర్లకుండా చూడాలి
మద్నూర్(జుక్కల్): రిటర్నింగ్ అధికారి, అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులు, ఎన్నికల సిబ్బంది సమన్వయంతో పనిచేయాలని తప్పులు దొర్లకుండా చూసుకోవాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ సత్యనారాయణ సూచించారు. మండల కేంద్రంలోని తహసీల్ కార్యాలయంలో కొనసాగుతున్న నామినేషన్ పత్రాల స్వీకరణ, స్ట్రాంగ్ రూంను బుధవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల్లో పారదర్శకత కోసమే ఎన్నికల కమిషన్ వీవీప్యాట్‌ల విధానాన్ని అమలు చేస్తోందని తెలిపారు. జిల్లాలోని కామారెడ్డి, ఎల్లారెడ్డి, జుక్కల్ నియోజకవర్గాల్లో 740 పోలింగ్ స్టేషన్‌లకు 740 బీఎల్‌వోలు, 74 సూపర్‌వైజర్లను ఏర్పాటు చేశామన్నారు. జిల్లాలో ఎన్నికల కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని, ఎన్నికలకు అధికార యంత్రాంగం సిద్ధంగా ఉందని కలెక్టర్ తెలిపారు. ఆయన వెంట రిటర్నింగ్ అధికారి రాజేశ్వర్, తహసీల్దార్ రవీంధర్, అధికారులు ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment