sathyanarayana
-
రెండు వైపుల ఉన్న కత్తి తో నాపై దాడి
-
రజనీకాంత్‌కు గవర్నర్ పదవి? ఆయన సోదరుడు ఏమన్నారంటే?
రజనీకాంత్ ప్రధాన పాత్రలో నటించిన జైలర్ సినిమాకు ఏ రేంజ్లో స్పందన లభించిందో తెలిసిందే! ప్రపంచవ్యాప్తంగా రూ.600 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టిన ఈ చిత్రం రెండు, మూడు రోజుల్లో ఓటీటీలో ప్రత్యక్షం కానుంది. తలైవా సినిమాను మరోసారి ఓటీటీలో చూసేందుకు తెగ ఎదురుచూస్తున్నారు అభిమానులు. రజనీకి గవర్నర్ పదవి? ఇదిలా ఉంటే రజనీకాంత్ గవర్నర్ కాబోతున్నారంటూ కొంతకాలంగా తమిళనాట ప్రచారం ఊపందుకుంది. ఈ ప్రచారంపై రజనీకాంత్ సోదరుడు సత్యనారాయణ స్పందించాడు. రజనీకి గవర్నర్ పదవి భగవంతుడి చేతుల్లో ఉందన్నారు. ఆదివారం నాడు మధురైలో మీనాక్షి అమ్మవారిని దర్శించుకున్న అనంతరం సత్యానారాయణ మీడియాతో మాట్లాడారు. రాజకీయాల్లోకి రారు, కానీ.. రజనీకాంత్ రాజకీయాల్లో చేరబోరని స్పష్టం చేశారు. రాజకీయ రంగప్రవేశం గురించి తను ఆలోచించడం లేదన్నారు. తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వంతో రజనీ భేటీకి ఎటువంటి రాజకీయ ప్రాధాన్యం లేదని తెలిపారు. రజనీకి గవర్నర్ పోస్ట్ రాబోతుందా? అన్న ప్రశ్నకు అంతా దేవుడి చేతుల్లో ఉందని పేర్కొన్నారు. గవర్నర్ పదవి రావాలని ఎలాంటి ఆశలు పెట్టుకోలేదని, ఒకవేళ వస్తే మాత్రం సంతోషిస్తామన్నారు. గవర్నర్ పదవి ఆఫర్ చేస్తే రజనీ తప్పకుండా దాన్ని స్వీకరిస్తాడని తెలిపారు. రాజకీయ నేతలతో భేటీ కాగా ఇటీవల రజనీకాంత్ ఉత్తర భారతేదశంలో పర్యటించాడు. ఈ క్రమంలో ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్, ఝార్ఖండ్ గవర్నర్ సీపీ రాధాకృష్ణన్‌తో భేటీ అవడంతో ఈ గవర్నర్ అంశం తెరపైకి వచ్చింది. ఈ విషయంపై రజనీ సోదరుడు సత్యనారాయణ చేసిన తాజా వ్యాఖ్యలు ప్రచారానికి మరింత ఆజ్యం పోసేలా ఉన్నాయి. చదవండి: మీకు అంతకుమించి ఏమి ఇవ్వలేం: నవీన్ పోలిశెట్టి -
విశాఖ కిడ్నాప్ కేసు.. ఎంపీ ఎంవివి దగ్గర డబ్బు గుంజడానికి ప్లాన్ చేశారా?
-
ఆత్మ గలవాడి కథ.. ఆయన మరణం కూడా చడీ చప్పుడు లేకుండా..
కాళ్ల సత్యనారాయణ ప్రపంచాన్ని ఎన్నడూ లెక్క చెయ్యలేదు, ప్రపంచమూ అతణ్ణి అలాగే పట్టించుకోలేదు. అతని కవిత నిరూపం, ఆయన గానం ఏకాంతం, కుంచె ధరించిన ఆ చేయి నైరూప్యం, తను తొక్కిన రిక్షా పెడల్ పై జారిన చెమట చుక్క నిశ్శబ్దం. ఆయన మరణం కూడా పెద్దగా ఎటువంటీ చప్పుడు చెయ్యకుండా ప్రపంచాన్ని దాని మానన దాని రణగొణ ధ్వనుల్ని దానికే వదిలేసి మనకు సెలవన్నారు. చిత్రకారుడు, కవి, రిక్షా పుల్లర్, స్క్రీన్ ప్రింటర్. తన లోకపు నవ్వుల వేదాంతి కాళ్ళ సత్యనారాయణ నవంబరు 24 తెల్లవారు ఝామున ప్రపంచపు పోకడ నుండి నిష్క్రమించారు. దాన్ని మనం మరణం అనుకోవచ్చు. గత ఇరవై రోజుల నుంచి మృత్యుశయ్యపై మేను వాల్చి ఉన్న ఈ మనిషి అంతకు రెండు రోజుల ముందే తన బాల్య మిత్రులు కడుపు గంగాధర్ కోరిక మేరకు తన జీవితానికి అక్షర రూపం ఇవ్వడం మొదలు పెట్టారు. రెండు పేరాల రచన తరువాత ఈ పనిని మాత్రం ప్రపంచం ముందుకు ఎందుకు పరవాలి అనిపించిందో ఏమో! వ్యక్తిగతంగా ఒకరిద్దరు మిత్రులతో పంచుకున్న ఆయన, వారి గుడిసెలోని కిరసనాయలు దీపం ముందు పలికి మాటలు ఇవి. ఈ కాసిన్ని మాటల తరువాత నేను ఆయనతో ఆనాటి వాన చినుకులు అనే కథ ఒకటి వ్రాయించ ప్రయత్నించాను. నా మరో మిత్రులు వేమూరి సత్యనారాయణ గారి గత ముప్ఫయ్ ఏళ్లక్రితం నుంచి కంటున్న కల ఈ కథల పుస్తకం. బహుశా అంతా సవ్యంగా ఉండి ఉండుంటే ఆ పుస్తకంలో కాళ్ల గారి రిక్షావాడి కథ అందులో ఉండి ఉండేది. ‘ఓ జ్ఞాపకం. నేను రెండుమూడు తరగతుల్లో వున్నప్పుడే బొమ్మలెయ్యడం ఇష్టం. నాలుగైదు తరగతులకొచ్చేసరికి ఇష్టం పిచ్చిగా మారింది. ఆ వయసులో మా కుటుంబం బీదరికం కంటే దీనంగా వుండేది. రాత్రిపూట కోడిగుడ్డు చిమ్నీ కిరసనాయిల్ దీపం ముందు చదువుకుంటున్నట్టు నటించేవాణ్ని.అంతకుముందే మా అమ్మ హెచ్చరించేది ‘నాయనా కిరసనాయిల్ రేపటిక్కూడా అదే‘నని. ఆ దెబ్బకి ప్రాణం గిలగిల్లాడిపోయేది. రిక్షా తొక్కితొక్కీ మా నాన్నా, పాచి పనులు చేసి మా అమ్మా అలిసిపోయి, ఎప్పుడెప్పుడు నిద్రపోతారా అని చూసేవాణ్ని. అంతకు ముందే దీపాన్ని గోరంత చేశేవాణ్ని. వాళ్లు నిద్రపోయారన్న సంకేతాలు రాగానే...ఇక నా అస్త్రాలు (అంగుళన్నర పెన్సిల్ ముక్క, అరిగిపోయిన లబ్బరు, పొద్దున బడిలో పక్కోడి నోటు పుస్తకం లోంచి కొట్టేసిన తెల్లకాయితం)తీసేవాణ్ని ధైర్యంగా. కానీ నా ముందున్న ఆ గోరంత దీపాన్ని పెంచే ధైర్యం లేపోడంతో అది అలా మిణుకుతూనే వుండేది. ఐనా, ఎక్కళ్లేని ఉత్సాహంతో బొమ్మ మొదలెట్టేవాణ్ని. ఆ క్షణాల్లో, ఈ ప్రపంచంలో నేనొక్కణ్నే. ఎవరన్నా వుంటే... నాతరవాతే. అలాగ ఎంతసేపుండేవాడినో! నా పిచ్చి అమ్మా నాన్నలు ఒళ్లెరక్క నిద్రపోతుంటే అలివికానంత ఆనందంగా వుండేది. వాళ్లు హాయిగా నిద్రపోతున్నారని కాదు, ఇక ఆ సమయంలో నాకు యే అడ్డూ లేదని. ఎలాటి కాలసూచికలూ లేని ఆ యింట్లో, నా లోకంలో వున్నప్పుడు, ఏదో కవుఁరుకంపు యీలోకంలోకి లాగింది. ఏదో కాలుతుంటే వచ్చే దుర్వాసన అది. ఆవేళప్పుడు ఏదో తగలబడుతున్నట్టనిపించి భయవేఁసింది. తీరా చూస్తే కాలింది నాజుత్తే, దానివల్లే కవుఁరుకంపు. ఏమయిందంటే,నాముందున్నది గుడ్డి దీపంబుడ్డి, దాని వెలుగెంత! నేను వేసేబొమ్మ కోసం బాగా కిందకి వంగితే చిమ్నీలోంచి వచ్చే సెగకి నా జుత్తు కాలిందన్నమాట. కొత్తాపాతల మధ్య తేడాలెప్పుడూ వుండేవనకుంటా. నాకైతే నాలుగు తరాల మనుషులు తెలుసు. వీళ్ల మధ్య అప్పుడప్పుడూ వెటకారాలూ వెక్కిరింతలూ నడిచేవి. ‘ఏ పింగూ లేపోతే క్రాపింగు' , ‘పుటోవులు దిగితే ఆయుర్దాయం తగ్గిపో‘ద్దని, అప్పుడప్పుడే మొదలౌతున్న ఫొటోగ్రఫీ మీద అపనమ్మకమూ, అల్యూమినియం పాత్రల్లో వండుకునీ తింటే అనారోగ్యం పాలవుతామనీ.... ఇలా ఎన్నో తేడాలు. ఐనా వాళ్ల cultural space కాపాడుకునేవారు. అందుకే నిన్నామొన్నటి వరకూ తోలుబొమ్మలు, కీలుబొమ్మలు, హరికథలు, బుర్రకథలు, ఒగ్గుకథలు, గొల్లసుద్దుల్లాటి కళా రూపాలు బతికొచ్చాయి. ఇప్పుడు, ఏ మాత్రం పసలేని అభిరుచుల్ని తృప్తిపరచడానికి టీవీతల్లే దిక్కు. ఇప్పుడు పెరిగిన సాంకేతిక జ్ఞానంతో ఇప్పడున్నవాటితో పాటు, పాతరూపాల్ని ఆధునికం చేసే ఓపికా సమయమూ ఈ తరానికి లేపోడం విషాదం. -అన్వర్, ఆర్టిస్ట్, సాక్షి చదవండి: Sarah Baartman Life Story: విధివంచితురాలి యథార్థ గాధ: ఆమె శరీర భాగాలను ఆడా మగ, ముసలీ ముతక గొడుగు మొనలతో పొడిచి.. -
ప్రేమకు నిర్వచనం నా తమ్ముడు
‘‘నా తమ్ముడు మంచి మనిషి. ప్రేమకు నిర్వచనం’’ అన్నారు రజనీకాంత్ సోదరుడు సత్యనారాయణ. జనవరిలో కొత్త పార్టీ పెడతానని ప్రకటించిన రజనీకాంత్ ఈ సందర్భంగా తన అన్నయ్య సత్యనారాయణ ఆశీస్సులు తీసుకోవడానికి బెంగళూరు వెళ్లిన విషయం తెలిసిందే. శనివారం (డిసెంబర్, 12) రజనీ పుట్టినరోజు. చెన్నైలో ఆయన బర్త్‌డే వేడుకలు జరిగాయి. తమ్ముడికి ఏం బహుమతి ఇచ్చారు? అసలు పుట్టినరోజులకు ఏమైనా ఇచ్చి పుచ్చుకుంటారా? అని సత్యనారాయణను ‘సాక్షి’ అడిగితే – ‘‘అలాంటివి ఏమీ లేదు. మా తమ్ముడు చూపించే ప్రేమను నేను పెద్ద బహుమతిలా భావిస్తాను. నా ప్రేమను ఆయన అలానే అనుకుంటారు. కుటుంబ సభ్యులంటే ఆయనకు చాలా ప్రేమ. కుటుంబం అనే కాదు.. మనుషులందరినీ ప్రేమించే గుణం ఉన్న వ్యక్తి’’ అన్నారు. మీ తమ్ముడి రాజకీయ భవిష్యత్తు గురించి ఏమంటారు? అంటే, ‘‘ఇన్నేళ్లుగా సినిమా హీరోగా ఉన్నారు. ఆయనకు అన్ని విషయాలూ తెలుసు. బాగా రాణిస్తారు’’ అన్నారాయన. ‘‘నా ఆరోగ్యం బాగుంది. తమ్ముడి ఆరోగ్యం కూడా చాలా బాగుంది. తను ఎప్పుడూ ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాను. తమ్ముడు ఎంత బిజీగా ఉన్నా నా క్షేమసమాచారాలు తెలుసుకుంటారు’’ అన్నారు సత్యనారాయణ. ఇదిలా ఉంటే ఈ 15 నుంచి హైదరాబాద్‌లో జరగనున్న ‘అన్నాత్తే’ షూటింగ్లో పాల్గొననున్నారు రజనీకాంత్. అందరికీ ధన్యవాదాలు ‘‘పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల రాజకీయవేత్తలు, సినీ ప్రముఖులకు, ప్రపంచవ్యాప్తంగా నా పుట్టినరోజు వేడుకలు జరుపుతున్న అభిమాన దేవుళ్లకు ధన్యవాదాలు’’ అని ట్వీట్ చేశారు రజనీకాంత్. -
మేకా కొమ్ముకాస్తున్న అధికారులు ?
నరసాపురం: వేములదీవి మ్యాక్ సొసైటీ పరిధిలోని రైతులను 25 ఏళ్లుగా మోసం చేస్తూ ప్రభుత్వం సంక్షేమం రూపంలో ఇచ్చే సొమ్మును కాజేస్తూ కోట్ల కుంభకోణానికి పాల్పడిన అక్రమార్కులపై విచారణ కొనసాగుతోంది. తాజాగా సోమవారం గ్రామంలోని సొసైటీ కార్యాలయానికి విచారణ అధికారిగా ఉన్న తూర్పుగోదావరి జిల్లా సహకారశాఖ డీఆర్ (కాకినాడ) కె.కృష్ణశృతి, విచారణ అధికారుల బృందంలోని కృష్ణకాంత్, లక్ష్మీశ్రీలతలతో కలిసి విచారణ జరిపేందుకు వచ్చారు. మొత్తం 138 మంది రైతులకు నోటీసులు ఇచ్చి సెక్షన్ 29 ప్రకారం విచారణ చేపట్టారు. అయితే విచారణలోనూ సొసైటీ అధ్యక్షుడు మేకా సత్యనారాయణ మాయాజాలం కనిపిస్తోంది. (‘మేకా’ వన్నె పులి) కేవలం రైతులు మాత్రమే విచారణకు రావాల్సి ఉండగా, సొసైటీ అధ్యక్షుడు మేకా సత్యనారాయణ కూడా ఉదయమే కార్యాలయానికి వచ్చి కూర్చున్నారు. దీంతో రైతులు భయపడి విచారణకు హాజరుకాలేదు. విషయం తెలుసుకున్న మాజీ సర్పంచ్, ఫిర్యాదుదారుడు పెన్మెత్స సుబ్బరాజు విచారణ అధికారులను నిలదీశారు. విచారణ జరుగుతున్న సమయంలో అభియోగాలు ఎదుర్కొంటున్న సొసైటీ అధ్యక్షుడు ఎందుకు కూర్చున్నారని ప్రశ్నించారు. అయితే దీనికి అధికారులు సరైన సమాధానం చెప్పలేదని సుబ్బరాజు ఆరోపించారు. గొడవ పెద్దదవుతున్న విషయాన్ని గమనించి మేకా సత్యనారాయణ అక్కడి నుంచి కొంతసేపటి తరువాత జారుకున్నారు. మొత్తంగా విచారణకు రైతులు ఎవరూ హాజరుకాలేదు. మేకా కొమ్ముకాస్తున్న అధికారులు ? ధాన్యం కొనుగోళ్లలో అవకతవకలు, సొసైటీ ఉద్యోగికి మరణానంతరం జీతాలు చెల్లించినట్లు చూపించడం, హమాలీ చార్జీల రూపంలో డమ్మీ వ్యక్తికి రూ.20 లక్షలు చెల్లింపు, మరో ఉద్యోగి పెద్ద మొత్తంలో సొసైటీ నిధులు నిబంధనలకు విరుద్ధంగా చెల్లించనట్లు చేయడం, ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అందకుండా రైతులను నష్ట పోయేలా చేయడం, ఏటా లాభాలు ఆర్జిస్తున్నా సంఘ సభ్యులకు డివిడెండ్‌ను పంచకపోవడం తదితర ఆరోపణలతో కూడిన ఫిర్యాదును రైతులు ఎమ్మెల్యే, ముఖ్యమంత్రి, వ్యవసాయశాఖ మంత్రి దృష్టికి తీసుకెళ్లడంతో తాజాగా విచారణ జరుగుతోంది. గతంలో అనేక ఫిర్యాదులు చేసినా కూడా టీడీపీ పెద్దల సహకారంతో మేకా వాటిని బయటకు రానివ్వలేదు. ప్రస్తుతం జరుగుతున్న విచారణ కూడా మేకా తనకున్న పలుకుబడితో పక్కదారి పట్టిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. గోప్యంగా ఉంచాల్సిన విచారణ వివరాలను సహకారశాఖ అధికారులు మేకా సత్యనారాయణకు కొమ్ముకాస్తూ అతనికి సమాచారం ఇస్తున్నారని, అతను గతంలో మాదిరిగానే రైతులను బెదిరింపులకు గురిచేస్తున్నారని చెబుతున్నారు. ప్రస్తుతం రైతుల వద్దకు నేరుగా వెళ్లి విచారించాల్సిన అధికారులు సొసైటీ కార్యాలయానికి రైతులను పిలిచి, మళ్లీ అక్కడకు సొసైటీ అధ్యక్షుడు మేకా సత్యనారాయణ వచ్చి తిష్టవేసినా పట్టించుకోకపోవడంపై విమర్శలు వస్తున్నాయి. దీనిపై మళ్లీ ఎమ్మెల్యేకు ఫిర్యాదు చేస్తామని, అవసరమైతే ముఖ్యమంత్రిని కలుస్తామని మాజీ సర్పంచ్ సుబ్బరాజు చెప్పారు. దీనిపై విచారణ అధికారి కె.కృష్ణశృతి వివరణ ఇస్తూ సొసైటీ అధ్యక్షుడు ఉదయం వచ్చి తనను కలిసి వెళ్లారని అంతకు మించి ఏమీ లేదని పేర్కొన్నారు. విచారణ సవ్యంగానే సాగుతోందని, తుది దశలో ఉందని చెప్పారు. ప్రభుత్వం తీవ్రంగా పరిగణించి విచారణకు ఆదేశించిన ఈ వ్యవహారంలో అధికారుల తప్పులు బయటపడితే వారు చిక్కుల్లో పడే అవకాశం ఉంది. -
తండ్రి అధికారంతో అరాచకాలు సృష్టిస్తున్న కొడుకు
పెందుర్తి నియోజకవర్గంలో అరాచకశక్తిగా ఎదిగిన ‘సన్నాఫ్ సత్యమూర్తి’ ఈ ఐదేళ్లలో సాగించిన దురాగతాలకు ఈ ఘటనలు ఉదాహరణలు. ఇవే కాదు గత ఎన్నికల సమయంలో తండ్రి సత్యనారాయణమూర్తి ఇచ్చిన అబద్ధపు హామీలను కప్పిపుచ్చుతాడు.. పంచగ్రామాల భూ సమస్యను వంద రోజుల్లో పరిష్కరిస్తానని చెప్పి ఓట్లేయించుకున్న తండ్రిని ఎవరైనా నిలదీస్తే అక్రమంగా జైలుకు పంపుతాడు. ముదపాక భూముల వ్యవహారంపై తండ్రిని ప్రశ్నిస్తే చంపుతాను అని బెదిరిస్తాడు.. ఏదైనా సమస్యపై జనం అడిగితే మధ్యలో కలుగజేసుకుని ప్రజలను ఛీదరించుకుంటాడు.. ఇక తండ్రి అధికారాన్ని అడ్డంపెట్టుకుని సెటిల్మెంట్లు, మామూళ్ల వసూళ్లు, భూకబ్జాలకు పాల్పడుతుంటాడు. నియోజకవర్గంలో ‘తండ్రి శాంక్షన్–కొడుకు కలెక్షన్’ లాంటి గొప్ప ఘనతను సొంతం చేసుకున్న సన్నాఫ్ సత్యమూర్తి ఖాతాలో ఇలాంటి జాబితా చాంతాడంత ఉందని పెందుర్తిలో ఎవరిని అడిగినా చెబుతారు. ఓ సారి చిట్టాను పరిశీలిద్దాం.. విశాఖపట్నం, పెందుర్తి: పెందుర్తి నియోజకవర్గంలో అధికారం బండారు సత్యనారాయణమూర్తిదే.. కానీ ఏ పని జరగాలన్నా ఆయన పుత్రరత్నం అనుమతి, అనుగ్రహం తప్పనిసరి. ఎంతటి ఉన్నతాధికారి అయినా ‘నాయుడు బాబు’ చెప్పినట్లు తలవంచాలి. ఒక్కో సందర్భంలో 35 ఏళ్ల రాజకీయ అనుభవం ఉన్న బండారు సైతం ఉత్సవ విగ్రహం మాత్రమే. ఈ ఐదేళ్లలో ప్రతీ ప్రభుత్వ కార్యక్రమంలోనూ బండారు ఉంటే పక్క సీటు.. లేకపోతే ఎమ్మెల్యే సీటు అతడిదే. తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఉద్యోగాలు అమ్ముకోవడం.. అనుచరులతో కలిసి భూకబ్జాలు చేయడం నాయుడు బాబుకు వెన్నతో పెట్టిన విద్య. హిందుజా పవర్‌ప్లాంట్‌లో ఉద్యోగ స్థాయి బట్టి కనీసం రూ.లక్ష నుంచి 3 లక్షల వరకు వెనకేసుకున్నాడన్న ఆరోపణలు బహిరంగంగానే ఉన్నాయి. రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపిన ముదపాక భూముల వ్యవహారాన్ని అప్పలనాయుడే చూసుకున్నాడన్న ఆరోపణ ఉంది. టీడీపీ నాయకులకు ‘చిల్లర’ పడేసి రైతుల భూ పట్టాలు లాక్కున్నాడని అప్పట్లో బాధితులు ఆరోపించారు. దానిపై పోలీస్‌స్టేషన్‌లో కేసులు పెట్టగా తిరిగి బాధితులపైనే కేసులు పెట్టించిన ఘనత బండారు సుపుత్రుడిది. గుర్రమ్మపాలెంలో ఏపీఐసీసీ సేకరించిన భూమిలో బండారు బినామీలతో 25 ఎకరాలకు నష్టపరిహారం పొందినట్లు అప్పుడు ప్రచారం జరిగింది. ఇక్కడ ఎకరాకు రూ.23 లక్షలు ప్రభుత్వం పరిహారం ఇచ్చింది. ఆర్ఈసీఎస్లో ఉద్యోగాల పేరిట దాదాపు రూ.3 కోట్లపైనే చినబాబు వసూలు చేశాడట. కానీ వ్యవహారం కోర్టుకు వెళ్లడంతో నియామకాలు జరగలేదు. దీంతో నిరుద్యోగుల డబ్బు తిరిగి ఇవ్వకుండా అప్పలనాయుడు జల్సా చేశాడట. ఇంకాచదవండి... నియోజకవర్గ పరిధిలో ఎక్కడ పెద్ద భవనం నిర్మాణం జరిగిన ఇతడికి వాటా ఉండాల్సిందే. ముఖ్యంగా పెందుర్తి పట్టణ ప్రాంతంలో అపార్ట్మెంట్ నిర్మాణం బాబుకు గుడ్‌విల్ చెల్లించకుండా పూర్తికాదు. ఇలా ఈ ఐదేళ్లలో ఓ రూ.10 కోట్లు వెనకేసుకున్నాడట. నీరు–చెట్టు వాటాల్లో భాగంగా ఈ ఐదేళ్లలో ఆరేడు కోట్లు అతడి ఖాతాలో ఉన్నట్లు ఆ పార్టీ నాయకులే చెబుతారు. హిందుజా కంపెనీకి నిత్యం సగటున 300 లారీలు బొగ్గును తరలిస్తాయి. కనిష్టంగా రోజుకు ఆ లారీల నుంచి తండ్రీకొడుకులు రూ.లక్ష వసూలు చేస్తారట. పరవాడ, పెందుర్తి, సబ్బవరం ప్రాంతాల్లో జరుగుతున్న ఇసుక వ్యాపారంలో రోజూ వీరికి మామూళ్లు వెళ్లాల్సిందే. బండారు, అతని కొడుకు అండదండలతో వందలాది ఎకరాల భూమిని టీడీపీ నాయకులు సొంతం చేసుకున్నారు. ఇందులో ఎన్టీఆర్ హౌసింగ్ పేరుతో కొట్టేసిందే అధికం. ఇలా దాదాపు రూ.500కోట్లపైనే టీడీపీ నాయకులు పంచుకున్నారు. పినగాడి వద్ద ఓ ప్రయివేటు భూమిలో రికార్డులు తారుమారు చేసి సొంత పార్టీ నాయకులనే తన బృందంతో ఇబ్బంది పెట్టాడు. అప్పట్లో తహసీల్దార్ స్థాయి వ్యక్తి ఇరువురికి మధ్యవర్తిత్వం వహించినా..అప్పలనాయుడు తప్పుడు వ్యక్తులకే వత్తాసు పలికాడు. దీంతో అదే పార్టీకి చెందిన బాధితుడు ప్రస్తుతం కోర్టును ఆశ్రయించారు. తనకు వ్యతిరేకంగా ఉన్నవారి ఆస్తుల వ్యవహారాల్లో తలదూర్చడం అతడికి అలవాటు. అలా అనేక గొడవల్లో తన అనుచరులను మధ్యలో పెట్టి కుటుంబాలను విడదీసిన ఘనత చినబాబుది. సన్నాఫ్ సత్యమూర్తి సెటిల్మెంట్లకు, ‘పార్టీ’లకు సుజాతనగర్లో ఓ డెన్ ఏర్పాటు చేసుకున్నాడు. ఇందులోనే అన్ని ‘కార్యక్రమాలు’ ఐదేళ్ల పాటు నిరాటంకంగా సాగుతూ.... నే ఉన్నాయి. పెందుర్తి మండలం జెర్రిపోతులపాలెం.. 2017 డిసెంబర్ 19 వరకు ఈ ఊరు మండలంలో తప్ప ఎవరికీ పెద్దగా తెలీదు.. కానీ ఆ మరుసటి రోజు నుంచి దేశంలో ప్రతీ చోటా ఈ గ్రామం గురించే చర్చ.. కారణం ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి కొడుకు అప్పలనాయుడు ప్రోద్భలంతో టీడీపీ నాయకులు సభ్య సమాజం తలదించుకునేలా ప్రవర్తించిన తీరు. ఈ ఘటనను ఓ సారి పరికిస్తే.. గ్రామంలో నిరుపేదలైన దళితుల భూమిపై అధికార పక్షానికి చెందిన మోతుబారి నాయకుల కళ్లు పడ్డాయి. అంతే బండారు అండ.. కొడుకు ప్రత్యక్ష పర్యవేక్షణతో ఆ స్థలాన్ని కొట్టేసేందుకు ఎన్టీఆర్ హౌసింగ్ పేరుతో ఓ జాబితా సిద్ధం చేసేశారు. వారి చెప్పు చేతల్లో ఉన్న రెవెన్యూ అధికారులతో దాన్ని ఆమోదింపజేసుకున్నారు. అధికారమదంతో దళితులపై దండెత్తారు. అడ్డొచ్చిన దళిత మహిళను దారుణంగా కొట్టి వివస్త్రను చేసి దుశ్శాసనపర్వానికి తెరతీశారు. సబ్బవరం మండలం సాయినగర్‌కు చెందిన నాయుడు అనే 22 ఏళ్ల యువకుడికి అర్ధరాత్రి కడుపునొప్పి వచ్చింది. స్థానిక పీహెచ్‌సీలోని అంబులెన్స్ కదిలే పరిస్థితి లేకపోవడం, 108 వాహనం రాకపోవడంతో చికిత్స ఆలస్యమై మృతిచెందాడు. దీనిపై తీవ్ర కలత చెంది భవిష్యత్‌లో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుడదన్న తలంపుతో వైఎస్సార్ సీపీ నేత అన్నంరెడ్డి అదీప్‌రాజ్ తన సొంత నిధులతో పీహెచ్‌సీకి అంబులెన్స్ ఏర్పాటు చేశారు. ప్రతిపక్షనేత వైఎస్ జగన్మోహన్రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించారు. ఆ మరుసటి రోజే దాన్ని పీహెచ్‌సీకి అప్పగిస్తూ జీవితకాలం ఆ అంబులెన్స్ నిర్వహణ బాధ్యత తనదే అంటూ అదీప్ ప్రకటించారు. అయితే విషయం తెలుసుకున్న బండారు, అతని కొడుకు ఆ అంబులెన్స్ తీసుకుంటే మీ ఉద్యోగాలు ఉండవు అంటూ డాక్టర్లను తీవ్రంగా హెచ్చరించారు. దీంతో ఆ వాహనాన్ని తిరిగి పంపేశారు డాక్టర్లు. తండ్రీ కొడుకుల వక్రబుద్ధి కారణంగా నేటికీ సబ్బవరంలో అంబులెన్స్ సదుపాయం లేదు. -
సంపూర్ణ అవగాహన కలిగి ఉండాలి
సాక్షి,బిచ్కుంద (నిజామాబాద్): పోలింగ్ నిర్వహణపై అధికారులు సంపూర్ణ అవగాహన కలిగి ఉండి పోలింగ్ ప్రక్రియను సజావుగా నిర్వహించాలని కలెక్టర్ సత్యనారాయణ అన్నారు. బుధవారం బిచ్కుంద డిగ్రీ కళాశాలలో పోలింగ్ నిర్వహణ అధికారులకు అం దిస్తున్న శిక్షణ తరగతులను కలెక్టర్ సందర్శించారు. ఈ సందర్భంగా మాక్ పోలింగ్, వీవీ ప్యా ట్లు, బ్యాలెట్ యూనిట్లు సీల్ చేయడం , పోలింగ్ సమయ పాలన తదితర అంశాలపై సందేహాలను కలెక్టర్ నివృత్తి చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎన్నికల విధులు సమర్ధవంతంగా నిర్వహించాలి చిన్న చిన్న పొరపాట్లతో పెద్ద సమస్యలు ఏర్పడతాయి ఎలాంటి సమస్యలు ఉత్పన్నం కాకుండా ఎన్నికల సంఘం సూచించిన మార్గదర్శకాలు ప్రీసైడింగ్ అధికారులు పాటించాలని ఆదేశించారు. శిక్షణ తరగతులలో సూచించిన విధంగా వీవీ ప్యాడ్, ఈవీఎంలపై సంపూర్ణ అవగాహన పెంపొందించుకోవాలన్నారు. జిల్లాలో గత నెల రోజుల నుంచి మాక్ పోలింగ్‌తో ఈవీఎంలపై అవగాహన కల్పిస్తున్నామన్నారు. పోలింగ్ బూత్‌లలో అన్ని యంత్రాలను సక్రమంగా బిగించాలని, మొరాయిస్తున్నట్లు ఫిర్యాదులు రాకుండా చూడాలని సూచించారు. ఓటు వేయడానికి బూత్‌లలో వికలాంగులకు ర్యాంపులు, వీల్చేర్, వాహన సౌకర్యం కల్పిస్తున్నామన్నారు. కార్యక్రమంలో డీఆర్డీఏ పీడీ చంద్రమోహన్‌రెడ్డి, ఆయా శాఖల అధికారులు, ఆరు మండలాల అధికారులు పాల్గొన్నారు. తప్పులు దొర్లకుండా చూడాలి మద్నూర్(జుక్కల్): రిటర్నింగ్ అధికారి, అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులు, ఎన్నికల సిబ్బంది సమన్వయంతో పనిచేయాలని తప్పులు దొర్లకుండా చూసుకోవాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ సత్యనారాయణ సూచించారు. మండల కేంద్రంలోని తహసీల్ కార్యాలయంలో కొనసాగుతున్న నామినేషన్ పత్రాల స్వీకరణ, స్ట్రాంగ్ రూంను బుధవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల్లో పారదర్శకత కోసమే ఎన్నికల కమిషన్ వీవీప్యాట్ల విధానాన్ని అమలు చేస్తోందని తెలిపారు. జిల్లాలోని కామారెడ్డి, ఎల్లారెడ్డి, జుక్కల్ నియోజకవర్గాల్లో 740 పోలింగ్ స్టేషన్లకు 740 బీఎల్వోలు, 74 సూపర్వైజర్లను ఏర్పాటు చేశామన్నారు. జిల్లాలో ఎన్నికల కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని, ఎన్నికలకు అధికార యంత్రాంగం సిద్ధంగా ఉందని కలెక్టర్ తెలిపారు. ఆయన వెంట రిటర్నింగ్ అధికారి రాజేశ్వర్, తహసీల్దార్ రవీంధర్, అధికారులు ఉన్నారు. -
రజనీకాంత్ ఇంట్లో విషాదం
చెన్నై, పెరంబూరు: నటుడు రజనీకాంత్ అన్నయ్య సత్యనారాణన్ భార్య కళావతిబాయి (70) ఆదివారం రాత్రి 11 గంటల సమయంలో బెంగళూర్‌లో కన్నుమూశారు. ఆమె అంతిమ చూపు కోసం రజనీకాంత్ తన కుటుంబ సభ్యులతో సహా సోమవారం ఉదయం బెంగళూర్ వెళ్లారు. రజనీకాంత్ చిన్న వయసులోనే తల్లిదండ్రులను కోల్పోవడంతో అన్నయ్య సత్యనారాయణన్, వదిన కళావతి వద్దే పెరిగారు. రజనీకాంత్‌ను చెన్నైకి పంపి, నటుడయ్యే వరకూ ఆయన బాగోగులు అన్నయ్య వదినలే చూసుకున్నారు. ఇదిలాఉండగా రజనీకాంత్ వదిన కళావతిబాయి గత కొంత కాలంగా మూత్రపిండాల సమస్యతో బాధపడుతున్నారు. బెంగళూర్‌లోని ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆమె వైద్యం ఫలించక ఆదివారం రాత్రి తుది శ్వాస విడిచారు. కళావతిబాయి మరరణ వార్త విన్న రజనీకాంత్ సోమవారం ఉదయం కుటుంబ సభ్యులతో సహా విమానం ద్వారా బెంగళూర్ వెళ్లారు. కళావతిబాయికి సోమవారం సాయంత్రం బెంగళూర్‌లో అంత్యక్రియలు జరిగాయి. -
ఔను.. వాళ్లిద్దరూ ఇష్టపడ్డారు!
అతడికి పదహారు.. ఆమెకు ఇరవై ఎనిమిదేళ్లు. అయినా వాళ్లిద్దరూ ఇష్టపడ్డారు. కుటుంబాలను ఒప్పించారు. పెద్దల సమక్షంలోనే అంగరంగ వైభవంగా పెళ్లి కూడా చేసుకున్నారు. ఇక సమస్యేమీ లేదనుకున్న సమయంలో కథ అనుకోని మలుపు తిరిగింది. పెళ్లి ఫొటోలు వాట్సాప్‌లో చక్కర్లు కొట్టడంతో పాటు పత్రికల్లో రావడంతో అధికారులు రంగంలోకి దిగారు. బాల్య వివాహమంటూ వధూవరులను వేరు చేసి ఎవరిళ్లకు వారిని పంపించేశారు. కర్నూలు : కర్ణాటక రాష్ట్రం శిరుగుప్ప తాలూకా చాణికనూరు గ్రామానికి చెందిన మూకమ్మ, హనుమంతప్ప కుమార్తె అయ్యమ్మ(28), కౌతాళం మండ లం ఉప్పరహాలు గ్రామానికి చెందిన బాలుడు (16) సెంట్రింగ్ పనిచేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. వీరిద్దరూ అనంతపురంలో ఓ చోట పనిలో కలిశారు. వారికి ఎవరిలో ఏ అంశం నచ్చిందో ఏమో తెలియదు కానీ వయస్సును పక్కనబెట్టి ఒకరినొకరు ఇష్టపడ్డారు. అబ్బాయి కంటే అమ్మాయి వయస్సు దాదాపు 12 ఏళ్లు ఎక్కువ. కొన్నా ళ్లు ప్రేమించుకుని, పెద్దల అంగీకారంతో గత నెల 27న వరుడి స్వగృహంలో ఘనంగా వివాహం చేసుకున్నారు. పెళ్లి ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడం.. పత్రి కల్లోనూ ప్రచురితం కావడంతో అధికారులు స్పందించారు. గ్రామానికి వెళ్లి వారి కోసం ఆరా తీశారు. వారు ఊళ్లో లేకపోవడంతో కుటుంబ సభ్యులను పిలిచి కౌన్సెలింగ్ ఇచ్చారు. ఇక సోమవారం వధూవరులను, వారి తల్లిదండ్రులకు కలెక్టర్ ఎస్. సత్యనారాయణ, జేసీ–2 రామస్వామి కౌన్సెలింగ్ ఇచ్చారు. ఆరేళ్ల వరకు ఎవరింటి వద్ద వారు ఉండాలని ఆదేశాలు జారీ చేశారు. ప్రతి నెలా జరిగే రెవెన్యూ కోర్టులో తప్పనిసరిగా హాజరుకావాలని సూచించారు. కార్యక్రమంలో ఐసీడీఎస్ పీడీ జుబేదాబేగం, ఐసీపీఎస్ అధికారి శారద, ఐసీడీఎస్ ఏపీడీ విజయ హాజరయ్యారు. -
ఇలాగైతే ఇంటికి పంపుతా
ఆదోని: ఉపాధి హామీ పథకం అమలులో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ఇంటికి పంపుతానని జిల్లా కలెక్టర్ సత్యనారాయణ హెచ్చరించారు. బు«ధవారం పట్టణంలోని ఎంపీడీవో సమావేశం హాలులో ఆదోని, కౌతాళం, కోసిగి, పెద్దకడబూరు, మంత్రాలయం మండలాల ఎంపీడీఓలు, ఏపీఓలు, టెక్నికల్ అసిస్టెంట్లు, ఇంజినీరింగ్ కన్సల్టెంట్లతో సమావేశం నిర్వహించారు. నిర్దేశించిన లక్ష్యం మేరకు ప్రగతి లేక పోవడంతో కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పనులు కల్పించకపోవడంతో ఆదోని డివిజన్ పరిధిలోని మండలాల నుంచి ప్రజలు ఎక్కువగా వలసలు పోతున్నారన్నారు. పత్రికల్లో వార్తలు వస్తున్నా.. సిగ్గు అనిపించదా? బుద్ధి ఉన్నోళ్లు ఎవరైనా స్పందించకుండా ఉంటారా? అని మండి పడ్డారు. వలసల నివారణచకు చర్యలు తీసుకోకపోతే బాధ్యులను ఇంటికి పంపుతానని హెచ్చరించారు. ఐదు మండలాల్లో మార్చి చివరి లోగా 175 లక్షల పనిదినాలు కల్పించాల్సి ఉండగా 125 లక్షల పనిదినాలు మాత్రమే కల్పించారన్నారు. సీనియర్ మేట్లు, ఫీల్డ్ అసిస్టెంట్లు సక్రమంగా పనిచేయడం లేదని మంత్రాలయం, పెద్దకడుబూరు ఎంపీడీవోలు ఫిర్యాదు చేయగా.. పూర్తి వివరాలతో నివేదిక పంపితే చర్యలు తీసుకుంటానని కలెక్టరు చెప్పారు. ఎండలు మండుతున్నందున ఉదయం, సాయంత్రం మాత్రమే పనులు చేపట్టాలని సూచించారు. కూలీలు పని చేసే చోట తాగునీరు, ఓఆర్ఎస్ ప్యాకెట్లు, మజ్జిగ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. అనంతరం ఆదోని డివిజన్లో తాగు నీటి వనరులపై ఆర్డబ్ల్యూఎస్ ఈఈ రామస్వామితో చర్చించారు. వేసవిలో ఎక్కడా నీటి సమస్య తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సమావేశంలో డ్వామా పీడీ వెంకటసుబ్బయ్య, ఆర్డీఓ ఓబులేసు, అదనపు పీడీ నాగేశ్వరరావు, ఏపీడీ మల్లేశ్వరి, ఏపీవోలు మన్న, మద్దిలేటి పాల్గొన్నారు. -
రజనీకాంత్ వస్తాడు
‘నా దారి రహదారి’.. ‘నేను ఒకసారి చెబితే వందసార్లు చెప్పినట్లు’. తాను నటించిన సూపర్‌హిట్ సినిమాల్లో సూపర్‌స్టార్ రజనీకాంత్ చెప్పిన డైలాగులు ఇవి. అయితే ఈ డైలాగులు రీల్ లైఫ్‌కే పరిమితమా రియల్ లైఫ్‌లో కూడా రజనీకాంత్‌కు వర్తిస్తాయా అని ప్రజలు, అభిమానులు తర్జన భర్జన పడుతున్నారు. రజనీకాంత్, ఆయన సోదరుడు సత్యనారాయణల నుంచి రాజకీయ ప్రవేశంపై కేవలం రెండు వారాల వ్యవధిలో రెండు భిన్నమైన ప్రకటనలు వెలువడడమే ఇందుకు కారణం. సాక్షి ప్రతినిధి, చెన్నై: తమిళనాడులో రాజకీయంగా ఎదగాలని భావించేవారికి సినిమారంగం రాజబాట. వెండితెర వేలుపులుగా ఉన్నవారు రాజకీయ వేదికలపై మెరిసిపోయే అవకాశాన్ని అలవోకగా అందుకోవచ్చు. తమిళనాడు అలనాటి ముఖ్యమంత్రులు అన్నాదురై, కరుణానిధి, ఎంజీ రామచంద్రన్, జయలలిత ఇలా అందరూ కోలీవుడ్‌తో సంబంధ బాంధవ్యాలు ఉన్నవారే. తమిళనాడులోని ప్రముఖ హీరోల తుది టార్గెట్ సీఎం కుర్చీనే అంటే అతిశయోక్తికాదు. నిన్నటి తరం హీరోలు రజనీకాంత్, కమల్‌హాసన్, నేటి తరం హీరోలు అజిత్, విజయ్ ఇలా కొందరూ అవకాశం వచ్చినపుడల్లా ఎంతోకొంత రాజకీయ వాసనను ప్రదర్శిస్తుంటారు. హీరో విజయ్ తండ్రి ఎస్ఏ చంద్రశేఖర్ అయితే తన కుమారుడు రాజకీయాల్లోకి రావాల్సిన అవసరం ఉందని ప్రకటించి రంగం సిద్ధం చేశారు. ఇక అసలు విషయానికి వస్తే.. ప్రత్యక్ష రాజకీయాల్లోకి ఎవరు ముందు వస్తారా అని రజనీకాంత్, కమల్‌హాసన్ వైపు ప్రజలు ఆసక్తిగా చూస్తున్నారు. సుమారు రెండు దశాబ్దాల క్రితమే రజనీకాంత్ ప్రజలకు రాజకీయవాసన చూపించి వెనక్కుతగ్గారు. సుదీర్ఘ విరామం తరువాత ఈ ఏడాది మరలా ప్రజల్లో రాజకీయ ప్రవేశ ఆశలు రేకెత్తించారు. రాజకీయ వ్యవస్థ చెడిపోయిందని విమర్శించారు, ఈ వ్యవస్థను నేనే మారిస్తే తప్పేంటి అన్నారు. అభిమానులను అక్కున చేర్చుకున్నా, అభిప్రాయాలను సేకరించారు. యుద్ధం వస్తుంది అపుడు రండని సమాయత్తం చేసి పంపివేశారు. అయితే ఆ మాటల తరువాత రాజకీయాలపై నోరెత్తలేదు. రజనీకాంత్ తన జన్మదినమైన డిసెంబర్ 12వ తేదీన రాజకీయ ప్రకటన ఖాయమని ఇటీవల ఒక అభిమాని తెలిపాడు. అభిమాని కాబట్టి అందరూ నమ్మారు. అయితే వారం రోజుల క్రితం విమానాశ్రయంలో ‘రాజకీయాల్లోకి ఇప్పట్లో రావాల్సిన అవసరం లేదు’ అంటూ రజనీకాంత్ మీడియా వద్ద వ్యాఖ్యానించారు. ఆయన మాటలతో అభిమానులు నిరుత్సాహపడిపోయారు. జనవరిలో తమ్ముడు అన్న సత్యనారాయణతో రజనీకాంత్ వస్తాడు : సత్యనారాయణ తమ్ముడు రజనీకాంత్ తన నిర్ణయాన్ని ప్రకటించి వారం రోజులు కూడా కాలేదు.. ఆయన అన్న సత్యనారాయణ అభిమానుల్లో ఆశలు చిగురింపజేశాడు. కొత్త ఏడాది జనవరి తరువాత నటుడు రజనీకాంత్ రాజకీయ అరగేట్రం ఖాయమని ఆయన బుధవారం మీడియాకు తెలిపారు. ధర్మపురి జిల్లా రజనీకాంత్ అభిమాన సంఘం అధ్యక్షులు గాం«ధీ ఇంటిలో జరిగే వివాహ వేడుకలో పాల్గొనేందుకు ఆయన ధర్మపురికి వచ్చారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ, వచ్చేనెల 12వ తేదీన రజనీకాంత్ జన్మదినం రోజున ఆయన ఎటువంటి ప్రకటన ఆయన చేసే అవకాశం లేదని తెలిపారు. జనవరిలో రెండోదశగా అభిమానులను ఆయన కలుసుకుంటారని చెప్పారు. ఆ తరువాత రాజకీయరంగ ప్రవేశం ఉంటుందని వివరించారు. అన్న మాటలు నమ్మాలా.. తమ్ముడి ప్రకటనను పరిగణనలోకి తీసుకోవాలా.. ఏది నిజం. ‘నా దారి రహదారి’ అంటూ ప్రజలను సంభ్రమాశ్చర్యాలకు గురిచేస్తూ అకస్మాత్తుగా రాజకీయాల్లో అడుగుపెడతారా లేక ‘నేను ఒకసారి చెబితే వందసార్లు చెప్పినట్లు’ ఇప్పట్లో రాజకీయాల్లోకి రావాల్సిన అవసరం లేదనే మాటకు నిలబడతారా వేచి చూడాల్సిందే. -
వాయుగుండంపై అప్రమత్తం!
అరసవల్లి: నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం బలపడటంతో జిల్లా అధికారులను రాష్ట్ర ఉన్నతాధికారులు అప్రమత్తం చేస్తున్నారు. బుధవారం నుంచి వరుసగా మూడు రోజుల పాటు ఈ ప్రభావం తీవ్రంగా ఉంటుందని హెచ్చరిస్తుండటంతో తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ సీఎండీ హెచ్.వై.దొర.. జిల్లా విద్యుత్ శాఖాధికారులతో మంగళవారం టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఇందులో ఎస్ఈ దత్తి సత్యనారాయణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లాలో వాయుగుండం, తీవ్ర గాలుల వల్ల విద్యుత్ పరంగా అధికంగా దెబ్బతినే ప్రాంతాలు, ముంస్తుచర్యలపై ఆరా తీశారు. ఒడిశా సరిహద్దు ప్రాంతం, సోంపేట, ఇచ్ఛాపురం, పలాస, కవిటి మండలాల్లో ప్రభావం చూపే అవకాశాలున్నాయని సీఎండీ తెలిపారు. ఆ ప్రాంతాలకు అదనంగా విద్యుత్ స్తంభాలను పంపించేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. సుమారు 100 నుంచి 150 కిలోమీటర్ల వేగంతో బలంగా గాలులు వీస్తాయని సంకేతాలు వస్తున్నాయని ఈ తరుణంలో స్తంభాలు పడిపోయే ప్రమాదాలున్నాయని వివరించారు. విద్యుత్ వైర్లపై చెట్లు విరిగిపడే అవకాశాలున్నాయని, ఎక్కడికక్కడ అదనంగా సిబ్బందిని నియమించి, పర్యవేక్షించాలని సూచించారు. బుధవారం నుంచి విద్యుత్ సిబ్బందికి కచ్చితంగా సెలవులన్నీ రద్దుచేయాలని స్పష్టంచేశారు. సరిహద్దు తీరప్రాంతాలపై దృష్టి అనంతరం ఎస్ఈ దత్తి సత్యనారాయణ ‘సాక్షి’తో మాట్లాడుతూ.. జిల్లాలో వాయుగుండం ప్రభా వంపై సీఎండీ దొరతో పాటు విద్యుత్ శాఖ మంత్రి క్యాం పు కార్యాలయం, కలెక్టర్ ధనుంజయరెడ్డి తదితరులు సూచనలిచ్చారని తెలిపారు. ఈ నేపథ్యంలో ఈనెల 18 అర్ధరాత్రి నుంచి 19 అర్ధరాత్రి వరకు గాలుల తీవ్రత అధికంగా ఉంటుందన్నారు. అందుకే టెక్కలి డివిజన్లో ఒడిశా సరిహద్దు ప్రాంతం, తీరప్రాంతాలపై ప్రత్యేక దృష్టి పెట్టామని వివరించారు. ఇందులో భాగంగా సోంపేట, పలాస సరిహద్దు ప్రాంతాలకు 200 విద్యుత్ స్తంభాలను పంపించామని వెల్లడించారు. తీవ్ర గాలులతో విద్యుత్ నష్టం జరిగిన వెంటనే సిబ్బంది యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టేందుకు ఏర్పాట్లు చేశామని వివరించారు. విద్యుత్ సిబ్బందికి సెలవులు రద్దు చేస్తున్నట్లు ఆదేశించామన్నారు. జిల్లాలో టెక్కలి, శ్రీకాకుళం డీఈలు, ఏఈలు, తదితర సిబ్బందితో చర్చించి, ప్రణాళికలు తెలియజేసినట్లు వివరించారు.సిబ్బంది నిర్లక్ష్యంగా పనిచేసినా కఠినచర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రజల్లో అవగాహన కల్పించాలి: కలెక్టర్ శ్రీకాకుళం పాతబస్టాండ్: బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావం వల్ల జిల్లాలో వర్షాలు, గాలులు వచ్చే ప్రమాదం ఉందని జిల్లా యంత్రాంగం, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ ఆదేశించారు. మంగళవారం ఆయన జిల్లాలోని అన్ని శాఖల అధికారులతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. వాయుగుండం ప్రభావం 18వ తేదీ రాత్రి, 19న (బుధ, గురువారాల్లో) ఎక్కువగా ఉంటుందన్నారు. దక్షిణ ఒడిశా, శ్రీకాకుళం మధ్య తీరం దాటుతుందని వాతావరణశాఖ అంచనా వేస్తోందన్నారు. ముందస్తుగా అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. గ్రామాల్లో ప్రజలను అప్రమత్తం చేయాలని అధికారులను ఆదేశించారు. తీరప్రాంతాల మండలాల్లో మరింత జాగ్రత్తగా వ్యవహరించాలని సూచించారు. ఒడిశాలో వర్షాల వల్ల వంశధార, నాగావళి నదులకు వరదలు వచ్చే అవకాశం ఉందన్నారు. వర్షాలు ప్రారంభం అయినప్పటి నుంచి ఈ రెండు నదులు ఇన్‌ఫ్లో, ఔట్‌ఫ్లోలు ఎప్పటికప్పుడు పరిశీలించాలన్నారు. మత్య్సకారులు చేపల వేటకు వెళ్లకుండా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రాజెక్టుల వద్ద ఎటువంటి ప్రమాదకర పరిస్థితులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు.వరదలు వచ్చినా తట్టుకునేలా ముందస్తు జాగ్రత్తగా ఆహార సామగ్రి సిద్ధం చేసుకోవాలని సూచించారు. -
సీఐ, ఎస్సై, ఏఎస్సై సస్పెండ్
కరీంనగర్: అదిలాబాద్ వన్‌టౌన్‌లో విధులు నిర్వర్తిస్తున్న సీఐ, ఎస్సై, ఏఎస్సైలను సస్పెండ్ చేస్తూ.. కరీంనగర్ రేంజ్ డీఐజీ ఉత్తర్వులు జారీ చేశారు. సివిల్ తగాదాలో తలదూర్చారనే సమాచారంతో విచారణ చేపట్టిన ఉన్నతాధికారులు జిల్లా ఎస్పీ ఎం. శ్రీనివాస్ నివేదిక ఆధారంగా సీఐ సత్యనారాయణ, ఎస్సై బి. అనిల్, ఏఎస్సై జి. అప్పారావులను సస్పెండ్ చేశారు. ఈ మేరకు మంగళవారం కరీంనగర్ రేంజ్ డీఐజీ సి. రవివర్మ ఆదేశాలు జారీచేశారు. -
నేడు స్టాడింగ్ కమిటీ సమావేశం
అనంతపురం న్యూసిటీ : నగర పాలక సంస్థలో స్టాడింగ్ కమిటీ సమావేశం గురువారం నిర్వహించనున్నట్లు కమిషనర్ సత్యనారాయణ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. స్టాడింగ్ కమిటీ సమావేశంలో ఈ ఏడాది బడ్జెట్‌ను ఆమోదిస్తునట్లు తెలిపారు. ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున బడ్జెట్ అజెండా అంశాలపై జిల్లా ఎన్నికల అధికారి (కలెక్టర్) అనుమతి కోరామన్నారు. ఆయన సమావేశాన్ని చిత్రీకరించాలని ఆదేశించడంతో సమావేశాన్ని గురువారం నిర్వహిస్తున్నామన్నారు. -
తిరుమలలో భక్తుల అదృశ్యం
సాక్షి, తిరుమల : తిరుమలలో వేర్వేరు ఘటనలో ఇద్దరు భక్తులు అదృశ్యమయ్యారు. ఈ నెల 9వ తేదీన శ్రీవారి ఆలయం ఎదురుగా అఖిలాండం వద్ద మహారాష్ట్రకు చెందిన గోపాల్రావ్ (65) తప్పిపోయాడు. అలాగే, ఈ నెల 13న మాధవ నిలయం వద్ద అనంతపురం జిల్లా తనకల్లు మండలం కదిరి సమీపంలోని రెడ్డివారిపల్లికి చెందిన బి.సత్యనారాయణ (51) తప్పిపోయాడు. వారి ఆచూకీ లభించలేదు. స్థానిక పోలీసులు కేసు నమోదు చేశారు. -
'రజనీ రాజకీయాల్లోకి రారు'
చెన్నై: ఎట్టి పరిస్థితుల్లోనూ రజనీకాంత్ రాజకీయాల్లోకి రారని ఆయన సోదరుడు సత్యనారాయణ స్పష్టం చేశారు. రామేశ్వరంలోని రామనాథస్వామిని సోమవారం కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్న అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. రజనీ రాజకీయాల్లోకి రావడం తనకు, తన కుటుంబ సభ్యులకు ఇష్టం లేదని అన్నారు. రజనీ సినిమా జీవితాన్నే కొనసాగిస్తారని, ప్రస్తుతం యంతిరన్ -2 (రోబో-2) షూటింగ్లో రజనీ బిజీగా ఉన్నారని తెలిపారు. -
దేశాభివృద్ధిలో సైన్స్ పాత్ర కీలకం
– తిరుపతి ఐఐటీ ఇన్చార్జి సత్యనారాయణ యూనివర్సిటీక్యాంపస్: దేశాభివృద్ధిలో సైన్స్ పాత్ర కీలకమని తిరుపతి ఐఐటీ ఇన్చార్జి సత్యనారాయణ పేర్కొన్నారు. ఎస్వీ యూనివర్సిటీలో శుక్రవారం ఇన్స్పైర్ సైన్స్‌క్యాంప్‌ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారత్, చైనాలు అతి పెద్ద జనాభా కలిగివుండడంతో పాటు శాస్త్రీయ నైపుణ్యాన్ని అందిపుచ్చుకుంటున్నాయన్నారు. భారతదేశానికి సవాల్‌గా మారిన జనాభా పెరుగుదల నేడు వరంగా మారిందని చెప్పారు. మనదేశంలో అత్యధికంగా యువత వుందని, ఈ మానవ వనరులకు సరైన నైపుణ్యాలు కల్పిస్తే దేశాభివృద్ధి సాధ్యమవుతుందని చెప్పారు. పరిశోధన రంగంలో విప్లవాత్మక మార్పులు రావాలంటే సైన్స్పరిశోధన పట్ల ఆసక్తి ప్రదర్శించాలని చెప్పారు. నెల్లూరులోని విక్రమసింహపురి యూనివర్సిటీ వీసీ వీరయ్య మాట్లాడుతూ ఇంటర్ తర్వాత విద్యార్థులు మెడిసిన్, ఇంజనీరింగ్, లా, ఎంబీఏ, ఎంసీఏ కోర్సులపై దృష్టి పెడుతున్నారన్నారు. ఇన్స్పైర్ క్యాంప్ ద్వారా యువతకు పరిశోధనలపై ఆసక్తి పెరుగుతుందని చెప్పారు. చాలా మంది శాస్త్రవేత్తలు 19–22 ఏళ్ల మధ్య అనేక ఆవిష్కరణలు చేశారని చెప్పారు. ఎస్వీయూ రెక్టార్ ఎం.భాస్కర్ మాట్లాడుతూ దేశవ్యాప్తంగా డీఎస్టీ ద్వారా 5 వేల మంది విద్యార్థులు పరిశోధనలు చేస్తున్నారన్నారు. సైన్స్ అభివృద్ధితోనే ఏదేశమైనా సంస్థ అయినా అభివృద్ధి సాధిస్తుందన్నారు. కార్యక్రమంలో రిజిస్ట్రార్ దేవరాజులు, ఇన్స్పైర్ క్యాంప్ కోఆర్డినేటర్ దేవప్రసాద్‌రాజు, సైన్స్ కళాశాల ప్రిన్సిపాల్ ఆర్.అబ్బయ్య పాల్గొన్నారు. -
రజనీ సోదరుడిపై అభిమానుల ఆరోపణలు
చెన్నై: సూపర్‌స్టార్ రజనీకాంత్ సోదరుడు సత్యనారాయణపై మదురైలోని రజనీకాంత్ అభిమానులు ఆరోపణలు గుప్పిస్తున్నారు. జిల్లాలో పోస్టర్లు అంటించి కలకలానికి తెరలేపారు. మదురై జిల్లా రజనీకాంత్ అభిమాన సంఘం సభ్యుడు జిల్లా శేఖర్ రజనీకాంత్ సోదరుడు సత్యనారాయణపై ఆరోపణలు గుప్పిస్తూ పోస్టర్ల ద్వారా ప్రచారం చేస్తున్నారు. ఆ పోస్టర్లలో రజనీకాంత్ నటించిన కోచ్చడైయాన్, లింగా చిత్రాల అపజయాలకు, ఆయన అనారోగ్యానికి గురై ఆస్పత్రి పాలవడానికి కారణం సత్యనారాయణేనని పేర్కొన్నాడు. అంతే కాకుండా 2015 ఏప్రిల్ 23న చెన్నైలోని రాఘవేంద్ర కల్యాణ మండపంలో తాను చెప్పిన విషయాన్ని సత్యనారాయణ రజనీ కుటుంబ సభ్యుల దృష్టికి తీసుకెళ్లలేదని అందుకు తాను ఆదివారం మదురై మీనాక్షి దేవాలయంలో పరిహారం చెల్లించనున్నట్లు పేర్కొన్నారు. ఈ వ్యవహారంపై మదురై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
మిల్లు గల్లా ఎక్కి... ఆత్మహత్యాయత్నం
దొంగ ట్రిప్షీట్లు ఇచ్చి మోసం చేసిన మిల్లు యజమాని ధాన్యం డబ్బులు పోతాయన్న భయంతో ఆత్మహ త్య చేసుకోవడానికి గల్లా ఎక్కిన అన్నదాత ఎట్టకేలకు కిందికి దించిన పోలీసులు జరిగిన అక్రమాలపై తహశీల్దార్ విచారణ రూ.50 లక్షల వరకూ వెలుగుచూసిన వైనం ఇంటిల్లిపాదీ రాత్రీ పగలు కష్టపడితే చేతికి అందిన పంట అది. రక్తాన్ని చెమటగా మార్చి ఒళ్లు హూనమయ్యేలా శ్రమిస్తే ఇంటికి చేరిన ధాన్యలక్ష్మి అది. ఆరుగాలం కష్టపడి పంట పండిస్తే, దాన్ని దొంగదారిలో దోచుకోవడానికి ప్రయత్నించాడు ఆ పెద్ద మనిషి. దీంతో తీవ్ర ఆందోళనకు గురైన ఓ రైతు మిల్లు గల్లా ఎక్కాడు. ఎంతమంది ప్రాధేయపడినా కిందకు రాలేదు. తన డబ్బు ఎవరిస్తారని ప్రశ్నించాడు. తన కష్టాన్ని తనకివ్వకుంటే చనిపోతానని బెదిరించాడు. ఈ లోగా మరికొంత మంది రైతులు అక్కడకు చేరుకుని తమ పరిస్థితి ఏంటని రోదించారు. అధికారులు, పోలీ సులు కలిసి నచ్చజెప్పడంతో గల్లామీద నుంచి రైతు కిందికి దిగాడు. గంట్యాడ మండలం కోటారుబిల్లిలో బుధవారం ఈ సంఘటన జరిగింది. గంట్యాడ: నమ్మకంతో ధాన్యం వేస్తే దానికి దొంగ బిల్లులు ఇచ్చి మిల్లు యజమాని మోసం చేయడంతో తీవ్ర ఆందోళనకు గురైన నీలావతి గ్రామానికి చెందిన వర్రి సత్యనారాయణ అనే రైతు బుధవారం కొటారుబిల్లిలోని సాయివరలక్ష్మి ఆగ్రో ఫుడ్స మిల్లు గల్లాపైకి ఎక్కి ఆత్యహత్య చేసుకోవడానికి ప్రయత్నించాడు. అదే సమయంలో ఇలా మోసపోయిన మరికొంత మంది రైతులు అక్కడకు చేరుకుని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఇంటిల్లిపాదీ కష్టపడి పండించిన పంటను నమ్మకంతో సాయివరల క్ష్మి ఆగ్రోఫుడ్స్కు వేయగా, మిల్లు యజమాని దొంగబిల్లు ఇచ్చారని రైతులు వాపోయారు. సత్యనారాయణ అనే రైతు మిల్లు గల్లా ఎక్కాడని తెలుసుకున్న తహశీల్దార్ బాపిరాజు, గంట్యాడ ఎస్ఐ షేక్‌షరీఫ్ అక్కడకు చేరుకుని రైతుతో మాట్లాడారు. న్యాయం చేస్తామని వారు హామీ ఇవ్వడంతో మిల్లుపై నుంచి ఆయన కిందకు దిగాడు. అనంతరం సాయివరలక్ష్మి ఆగ్రో ఫుడ్ యజమాని బద్రీనారాయణ చేసిన అక్రమాలపై రెవెన్యూ అధికారులు విచారణ మొదలుపెట్టారు. కొటారుబిల్లి సాయివరలక్ష్మి ఆగ్రో ఫుడ్స్ రైస్‌మిల్లుకు రైతులు ధాన్యం వేయగా తన రైస్‌మిల్ స్టాంపునకు బదులు వేరే మిల్లుల స్టాంపులు వేసి అక్రమాలకు పాల్పడ్డాడని తెలిసింది. చంద్రంపేట అయ్యప్ప ట్రేడర్స్ యజమాని పూసర్ల కృష్ణారావు ఇదివరకు జేసీకి ఇచ్చిన ఫిర్యాదు మేరకు తహశీల్దార్ బాపిరాజు విచారణ చేపట్టారు. బుధవారం సాయంత్రం వరకు చేపట్టిన విచారణలో నీలావతికి చెందిన రైతులు వర్రి సతీష్ 340 బస్తాలు, గులిపల్లి శ్రీను 442, అల్లు పైడితల్లి 340, పంచాది సూర్యనారాయణ 370, వేమలి ఆదినారాయణ 325, పెంట లక్ష్మి 310, వర్రి అప్పారావు 126, సిరికి వెంకటరావు 585 బస్తాల ధాన్యానికి సాయివరలక్ష్మి ఆగ్రో ఫుడ్ స్టాంపునకు బదులు అయ్యప్ప ట్రేడర్స స్టాంపులు వేసినట్లు తెలిసింది. అలాగే అల్లు శ్రీను 580, వర్రి సత్యనారాయణ 390, అల్లు ఆదినారాయన 155, సిరికి వెంకటరావు 510 బస్తాల ధాన్యానికి గంట్యాడ శ్రీస్వామి అయ్యప్ప బోయిల్డ్ ఎండ్ రైస్‌మిల్లు స్టాంపులు వేసిన ట్లు గుర్తించారు. మరికొంతమంది రైతులకు స్టాంపులు లేకుండా, తేదీ వేయకుండా మోసం చేశారని తెలిసింది. ఇప్పటికి రూ.50 లక్షల మేర అక్రమాలు జరిగినట్టు గుర్తించారు. కొనుగోలు కోంద్రంలోని సిబ్బంది సంతకాల్లో వ్యత్యాసం రావడాన్ని గమనించడంతో ఈ వ్యవహారం వెలుగు చూసింది. బుధవారం చేపట్టిన విచారణలో *50లక్షలకు పైగా అక్రమాలు జరిగాయని తేలిందని తహశీల్దార్ బాపిరాజు తెలిపారు. పూర్తిస్థాయిలో విచారణ చేపట్టాల్సి ఉందని ఆయన తెలిపారు. పరారీలో మిల్లు యజమాని రైస్‌మిల్‌లో నిల్వలు పరిశీలించడానికి ఆర్ఐ రంగారావు, డీఎం సివిల్ సప్లై టెక్నికల్ మేనేజర్ వి.వలసయ్య, వీఆర్ఓ రవిలు వెళ్లగా మిల్లు యజమాని బద్రీనారాయణ అందుబాటులో లేరని, ఉన్న నిల్వలను పరిశీలించి రికార్డు చేశామని అధికారులు తెలిపారు. మిల్లు యజమాని అందుబాటులో లేకపోవడంతో తహశీల్దార్ ఆదేశాల మేరకు రాత్రి సిబ్బంది కాపలా ఉంచామన్నారు. అయితే వెలుగు ఆధ్వర్యంలో ఇవ్వాల్సిన ట్రక్షీట్లు మిల్లు యజమానికి ఎలా వెళ్లాయనేది చర్చనీయాంశమైంది. అధికారులు స్పందించి నష్టపోయిన రైతులకు న్యాయం చేయాలని కోరుతున్నారు. జిల్లా వ్యాప్తంగా అక్రమాలు? బద్రీనారాయణ గతంలో జిల్లా మిల్లర్ల అసోసియేషన్ ఉపాధ్యక్షునిగా పనిచేయడంతో ఆయనకు జిల్లా వ్యాప్తంగా ఉన్న పరిచయాల కారణంగా మిగతా మండలాల్లో కూడా అక్రమాలకు పాల్పడి ఉండవచ్చని ఆందోళన చెందుతున్నారు. -
నీ వెంటే నేను..!
భర్త మరణం తట్టుకోలేక భార్య మృతి కోదాడ, వారి బంధం మరణంలో కూడా వీడలేదు. ఏడడుగులు భర్తతో కలసి నడిచిన ఆమె మరణంలో కూడా తోడు వెళ్లింది. ఈ ఘటన నల్లగొండ జిల్లా కోదాడ మండలం కూచిపూడిలో మంగళవారం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన సత్యనారాయణ (55) ఓ ట్రాన్స్‌పోర్ట్‌లో స్వీపర్‌గా, ఆయన భార్య అనసూర్యమ్మ (48) వ్యవసాయ కూలీగా పనిచేసుకుంటూ జీవిస్తున్నారు. సోమవారంరాత్రి సత్యనారాయణ గుండెపోటుతో మరణించారు. భర్త కళ్లముందే మృతి చెందడాన్ని తట్టుకోలేని ఆమె గుండెలవిసేలా రోదిస్తూ తెల్లవారుజామున సొమ్మసిల్లి పడిపోయింది. బంధువులు చికిత్స నిమిత్తం కోదాడ ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో ప్రాణాలొదిలింది. వీరి మృతదేహాలను పక్కపక్కనే ఉంచడంతో చూసిన గ్రామస్తులు కంటతడిపెట్టారు.