రజనీ సోదరుడిపై అభిమానుల ఆరోపణలు | rajinikanth fans takes on rajinikanth brother sathyanarayana | Sakshi
Sakshi News home page

రజనీ సోదరుడిపై అభిమానుల ఆరోపణలు

Published Sun, Jun 26 2016 12:14 PM | Last Updated on Thu, Sep 12 2019 10:40 AM

రజనీ సోదరుడిపై అభిమానుల ఆరోపణలు - Sakshi

రజనీ సోదరుడిపై అభిమానుల ఆరోపణలు

చెన్నై: సూపర్‌స్టార్ రజనీకాంత్ సోదరుడు సత్యనారాయణపై మదురైలోని రజనీకాంత్ అభిమానులు ఆరోపణలు గుప్పిస్తున్నారు. జిల్లాలో పోస్టర్లు అంటించి కలకలానికి తెరలేపారు. మదురై జిల్లా రజనీకాంత్ అభిమాన సంఘం సభ్యుడు జిల్లా శేఖర్ రజనీకాంత్ సోదరుడు సత్యనారాయణపై ఆరోపణలు గుప్పిస్తూ పోస్టర్ల ద్వారా ప్రచారం చేస్తున్నారు.

ఆ పోస్టర్లలో రజనీకాంత్ నటించిన కోచ్చడైయాన్, లింగా చిత్రాల అపజయాలకు, ఆయన అనారోగ్యానికి గురై ఆస్పత్రి పాలవడానికి కారణం సత్యనారాయణేనని పేర్కొన్నాడు. అంతే కాకుండా 2015 ఏప్రిల్ 23న చెన్నైలోని రాఘవేంద్ర కల్యాణ మండపంలో తాను చెప్పిన విషయాన్ని సత్యనారాయణ రజనీ కుటుంబ సభ్యుల దృష్టికి తీసుకెళ్లలేదని అందుకు తాను ఆదివారం మదురై మీనాక్షి దేవాలయంలో పరిహారం చెల్లించనున్నట్లు పేర్కొన్నారు. ఈ వ్యవహారంపై మదురై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement