
నీ వెంటే నేను..!
వారి బంధం మరణంలో కూడా వీడలేదు. ఏడడుగులు భర్తతో కలసి నడిచిన ఆమె మరణంలో కూడా తోడు వెళ్లింది. ఈ ఘటన నల్లగొండ జిల్లా కోదాడ మండలం కూచిపూడిలో మంగళవారం చోటుచేసుకుంది.
భర్త మరణం తట్టుకోలేక భార్య మృతి
కోదాడ, వారి బంధం మరణంలో కూడా వీడలేదు. ఏడడుగులు భర్తతో కలసి నడిచిన ఆమె మరణంలో కూడా తోడు వెళ్లింది. ఈ ఘటన నల్లగొండ జిల్లా కోదాడ మండలం కూచిపూడిలో మంగళవారం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన సత్యనారాయణ (55) ఓ ట్రాన్స్‌పోర్ట్‌లో స్వీపర్‌గా, ఆయన భార్య అనసూర్యమ్మ (48) వ్యవసాయ కూలీగా పనిచేసుకుంటూ జీవిస్తున్నారు. సోమవారంరాత్రి సత్యనారాయణ గుండెపోటుతో మరణించారు.
భర్త కళ్లముందే మృతి చెందడాన్ని తట్టుకోలేని ఆమె గుండెలవిసేలా రోదిస్తూ తెల్లవారుజామున సొమ్మసిల్లి పడిపోయింది. బంధువులు చికిత్స నిమిత్తం కోదాడ ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో ప్రాణాలొదిలింది. వీరి మృతదేహాలను పక్కపక్కనే ఉంచడంతో చూసిన గ్రామస్తులు కంటతడిపెట్టారు.