
సింగపూర్‌లో విషాదం చోటు చేసుకుంది. కోదాడ పట్టణానికి చెందిన చౌడవరపు పవన్ సింగపూర్ ప్రమాద వశాత్తు ప్రాణాలు కోల్పోయాడు. శుక్రవారంసాయంత్రం స్నేహితులతో కలిసి బీచ్ కు వెళ్లిన పవన్ అలల ఉధృతికి కొట్టుకుపోయి మృతిచెందాడు. గత కొద్దిరోజులుగా సింగపూర్‌లో తాత్కాలిక ప్రాతిపదికన ఉద్యోగం చేస్తున్న పవన్ అకాలం మరణంతో కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. దీనిపై మరింత సమాచారం అందాల్సి ఉంది.