
మాట్లాడుతున్న మాజీ ఎమ్మెల్యే వేనేపల్లి చందర్‌రావు
అనంతగిరి: కోదాడ బీఆర్‌ఎస్ టికెట్ కన్మంతరెడ్డి శశిధర్‌రెడ్డికి ఇవ్వాలని, లేకపోతే తాము సహకరించమని బీఆర్‌ఎస్ అసమ్మతివర్గం స్పష్టం చేసింది. ఆదివారం సూర్యాపేటజిల్లా అనంతగిరి మండలం శాంతినగర్ శివారులోని వ్యవసాయక్షేత్రంలో శశిధర్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన అసమ్మతి నేతల ఆత్మీయ సమ్మేళనంలో కోదాడ మాజీ ఎమ్మెల్యే వేనేపల్లి చందర్‌రావుతోపాటు పలువురు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 2018 ఎన్నికల్లో కోదాడ నుంచి తమ సహకారంతోనే మల్లయ్యయాదవ్ ఎమ్మెల్యేగా గెలిచారని, ఈసారి తమ సహకారం లేకుండా గెలుపు అసాధ్యమన్నారు. ఒకవేళ శశిధర్‌రెడ్డికి టికెట్ ఇవ్వకపోతే, పార్టీ రెబల్ అభ్యర్థిగా నామినేషన్ వేసేందుకు సిద్ధమని స్పష్టం చేశారు.
ఈ సమ్మేళనంలో బీఆర్‌ఎస్ రాష్ట్ర కార్యదర్శి ఎర్నేని వెంకటరత్నంబాబు, బీఆర్‌ఎస్ మైనార్టీ నేత మహబూబ్ జాని, నల్లగొండ డీసీసీబీ మాజీ చైర్మన్ ఎం. పాండురంగారావు, కోదాడ మున్సిపల్ చైర్‌పర్సన్ వనపర్తి శిరీషాలక్ష్మీనారాయణ, జెడ్పీటీసీలు బొలిశెట్టి నాగేంద్రబాబు, కొణతం ఉమాశ్రీనివాసరెడ్డి, పందిళ్లపల్లి పుల్లారావు, మోతె ఎంపీపీ ముప్పాళ్ల ఆశాశ్రీకాంత్‌రెడ్డి, చిలుకూరు ఎంపీపీ బండ్ల ప్రశాంతి, బడేటి వెంకటేశ్వర్లు, సామినేని ప్రమీలారమేశ్, తిపిరిశెట్టి సుశీలారాజు, కాసాని వెంకటేశ్వర్లు, రామయ్య, గురవారెడ్డి, రాయపూడి వెంకటనారాయణ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment