give
-
కోదాడ టికెట్ శశిధర్‌రెడ్డికి ఇవ్వాలి
అనంతగిరి: కోదాడ బీఆర్ఎస్ టికెట్ కన్మంతరెడ్డి శశిధర్‌రెడ్డికి ఇవ్వాలని, లేకపోతే తాము సహకరించమని బీఆర్ఎస్ అసమ్మతివర్గం స్పష్టం చేసింది. ఆదివారం సూర్యాపేటజిల్లా అనంతగిరి మండలం శాంతినగర్ శివారులోని వ్యవసాయక్షేత్రంలో శశిధర్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన అసమ్మతి నేతల ఆత్మీయ సమ్మేళనంలో కోదాడ మాజీ ఎమ్మెల్యే వేనేపల్లి చందర్రావుతోపాటు పలువురు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 2018 ఎన్నికల్లో కోదాడ నుంచి తమ సహకారంతోనే మల్లయ్యయాదవ్ ఎమ్మెల్యేగా గెలిచారని, ఈసారి తమ సహకారం లేకుండా గెలుపు అసాధ్యమన్నారు. ఒకవేళ శశిధర్‌రెడ్డికి టికెట్ ఇవ్వకపోతే, పార్టీ రెబల్ అభ్యర్థిగా నామినేషన్ వేసేందుకు సిద్ధమని స్పష్టం చేశారు. ఈ సమ్మేళనంలో బీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి ఎర్నేని వెంకటరత్నంబాబు, బీఆర్ఎస్ మైనార్టీ నేత మహబూబ్ జాని, నల్లగొండ డీసీసీబీ మాజీ చైర్మన్ ఎం. పాండురంగారావు, కోదాడ మున్సిపల్ చైర్పర్సన్ వనపర్తి శిరీషాలక్ష్మీనారాయణ, జెడ్పీటీసీలు బొలిశెట్టి నాగేంద్రబాబు, కొణతం ఉమాశ్రీనివాసరెడ్డి, పందిళ్లపల్లి పుల్లారావు, మోతె ఎంపీపీ ముప్పాళ్ల ఆశాశ్రీకాంత్రెడ్డి, చిలుకూరు ఎంపీపీ బండ్ల ప్రశాంతి, బడేటి వెంకటేశ్వర్లు, సామినేని ప్రమీలారమేశ్, తిపిరిశెట్టి సుశీలారాజు, కాసాని వెంకటేశ్వర్లు, రామయ్య, గురవారెడ్డి, రాయపూడి వెంకటనారాయణ తదితరులు పాల్గొన్నారు. -
జమ్ములో ఎన్నికల నిర్వహణకు సిద్ధం: కేంద్రం
ఢిల్లీ: జమ్ము కశ్మీర్ స్వయంప్రతిపత్తికి సంబంధించిన ఆర్టికల్ 370 రద్దుకు వ్యతిరేకంగా దాఖలైన పలు పిటిషన్లపై గురువారం సుప్రీంకోర్టులో విచారణ జరుగుతోంది. జమ్ముకు రాష్ట్ర హోదా ఎప్పుడు పునరుద్దరిస్తుందనే అంశంపై ఇవాళ సుప్రీంకు కేంద్రం ఒక స్పష్టత ఇవ్వాల్సి ఉంది. ఈ క్రమంలో వాదనలు వినిస్తున కేంద్రం.. అక్కడ ఎన్నికల నిర్వహణకు సిద్ధమని కేంద్రం స్పష్టం చేసింది. జమ్మూకశ్మీర్‌లో ఎన్నికల నిర్వహణ పూర్తిగా ఎన్నికల సంఘం, రాష్ట్ర ఎన్నికల సంఘం చేతుల్లో ఉందని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా చెప్పారు. మొత్తం మూడు దశల్లో ఎన్నికలు జరగాల్సి ఉందని ధర్మాసనానికి తెలిపారు. పంచాయతీ, మున్సిపల్, అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరగాలని చెప్పారు. అలాగే.. జమ్మూ కశ్మీర్‌కు రాష్ట్ర హోదా కల్పించే అంశానికి కాల వ్యవధిని నిర్ణయించలేమని తుషార్ మెహతా సుప్రీంకోర్టు ధర్మాసనానికి స్పష్టం చేస్తూనే.. కేంద్ర పాలిత ప్రాంతంగా తాత్కాలికమేనని పేర్కొన్నారు. పూర్తి రాష్ట్రంగా మార్చడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు చెప్పారు. జమ్మూ కశ్మీర్‌ని గణనీయమైన స్థాయిలో అభివృద్ధి చేసినట్లు సుప్రీంకోర్టుకు సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా తెలిపారు. కొత్త ప్రాజెక్టులు భారీ స్థాయిలో వస్తున్నాయని చెప్పారు. ఉగ్రవాద చర్యలు 42.5 తగ్గాయని వెల్లడించారు. చొరబాటు ఘటనలు 90.20 శాతం తగ్గాయని తెలిపారు. 2023లోనే ఏకంగా కోటి మంది పర్యటకులు కశ్మీర్ లోయను సందర్శించారని పేర్కొన్నారు. Petitions challenging the abrogation of Article 370 in SC | Solicitor General Tushar Mehta, appearing for Centre, tells Supreme Court that it is ready for elections in Jammu and Kashmir at any time now. pic.twitter.com/mhiqqWPBbf — ANI (@ANI) August 31, 2023 జమ్మూకశ్మీర్‌కు రాష్ట్ర హోదా కల్పించే అంశంలో కేంద్రం నేడు కీలక ప్రకటన చేయనుంది. నాలుగేళ్లుగా కేంద్ర పాలిత ప్రాంతంగా ఉన్న జమ్మూకశ్మీర్‌కు ఎప్పుడు రాష్ట్ర హోదా కల్పించనున్నారనే సమాచారాన్ని నేడు సుప్రీంకోర్టుకు నివేదించనుంది. ఆర్టికల్ 370 రద్దును సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు విచారణ జరుపుతున్న విషయం తెలిసిందే. మంగళవారం పిటీషనర్ల వాదనలు విన్న తర్వాత సీజేఐ చంద్రచూడ్.. జమ్మూ కశ్మీర్లో ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించాలని కేంద్రాన్ని కోరారు. ఈ మేరకు ఎప్పటివరకు ఈ ప్రక్రియను పూర్తి చేస్తారో కూడా తెలపాలని ప్రశ్నించారు. #BREAKING Supreme Court asks when the Statehood of Jammu and Kashmir will be restored. Asks when elections will be allowed. Asks SG to get instructions on a definition timeline.#JammuKashmir #Article370 https://t.co/SK9wl5B5Ia — Live Law (@LiveLawIndia) August 29, 2023 ఈ క్రమంలో వాదనలు వినిపించిన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా.. జమ్మూ కశ్మీర్‌కు రాష్ట్ర హోదాపై సానుకూల అంశాన్ని గురువారం తెలుపుతామని ధర్మాసనానికి విన్నవించారు. జమ్మూ కశ్మీర్‌ను కేంద్ర పాలిత ప్రాంతంగా తాత్కాలికంగానే ఉంచనున్నామని, లఢక్ మాత్రం యూనియన్ టెరిటరీగానే ఉంటుందని కోర్టుకు ఆయన స్పష్టం చేశారు. Justice Kaul: suppose you carve out portion of assam into a union territory and also make assam into a UT.. SG: Too extreme an example..... but one state cannot be declared a UT under article 3... but there needs to be separation... CJI: creation of UTs post independence..… — Bar & Bench (@barandbench) August 29, 2023 జమ్మూ కశ్మీర్‌కు ప్రత్యేక రాష్ట్ర హోదాను కల్పిస్తున్న ఆర్టికల్ 370ని రద్దు చేస్తూ 2019లో కేంద్రం నిర్ణయం తీసుకుంది. ప్రతిపక్ష నాయకులు విమర్శలను పక్కకు పెట్టి ఆ రాష్ట్రాన్ని లఢక్, జమ్మూ కశ్మీర్ రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజించింది. ప్రతిపక్షాల ప్రశ్నలకు సమాధానమిస్తూ.. అక్కడ పరిస్థితులు సాధారణ స్థితికి వచ్చాక మళ్లీ రాష్ట్ర హోదా కల్పిస్తామని అప్పట్లో ప్రభుత్వం తెలిపింది. ఇదీ చదవండి: రక్షా బంధన్ రోజున ఇలాంటి తీర్పు ఇస్తాననుకోలేదు -
ఇచ్చేగుణం
ఇచ్చేవాళ్లు ఉన్నారు. ఇచ్చే టైమే లేదు! ఈ ‘లేకపోవడం’ ఎలాంటిదంటే.. చేతికి వాచీ ఉన్నా, టైమ్ చూసుకునే టైమ్ లేకపోవడం లాంటిది! స్ట్రేంజ్ కదా. ప్రాణులేనా, కొన్ని మాటలూ ‘ఎండేంజర్డ్’ లిస్ట్‌లో చేరిపోతున్నాయి. అంతరించిపోవడం! ‘టైమ్ ఎంత?’ అనే మాట ఇప్పుడెక్కడైనా వినిపిస్తోందా! పూర్వం అడిగేవాళ్లు.. చేతికి వాచీ ఉన్నవాళ్లను చూసుకుని. హక్కుగా ఫీలై.. ‘టైమెంత?’ అని అడిగేవాళ్లు. ధర్మంగా ఫీలై టైమెంతో చెప్పేవాళ్లు. ఇప్పుడు ఆ అవసరం తగ్గిపోయింది. అడిగే అవసరం, చెప్పే అవసరం. చేతిలోకి సెల్‌ఫోన్ వచ్చాక, చేతికి వాచీ అవసరం లేకపోయింది. ఎక్కడో కొందరికి వాచీ లేకపోతే పల్స్ పడిపోయినట్లుంటుంది. వాళ్లు మాత్రం వాచీతో కనిపిస్తారు. వాచీ ఉంది కదా, ఓసారి టైమ్ అడిగితే ఏం పోతుందని ఎవరూ అడగరు వాళ్లను. ఖరీదైన వాచీగా అనిపిస్తే మాత్రం ధర ఎంతని ఎవరైనా అడగొచ్చు. వాచీలో టైమ్ ఎంతని, వాచీ ధర ఎంతని అడిగితే చెప్పడంలో చేతికున్న వాచీ పోయేదేమీ ఉండదు. బాగా బిజీగా ఉండే మనిషైతే కొన్ని సెకన్ల టైమ్ మాత్రం పోతుంది సమాధానం చెప్పడానికి. కానీ టైమ్‌కి ఇచ్చినంత టైమ్ మనిషికి ఇవ్వడం లేదు మనిషి. అంత టైమ్ లేనివాళ్లు ‘పోయింది’ అని కాకుండా, ‘ఇచ్చాను’ అనుకుంటే.. పోయినదాని గురించి బాధ ఉండదు. ఇవ్వడంలోని ఫీల్‌గుడ్ ఫ్యాక్టర్ అది. మానవులలో పుట్టుకతో ఉండే జన్యువు.. ‘ఇచ్చేగుణం’! మరైతే లోకంలో ఎందుకింత పేదరికం? లోకం ఎందుకింత ప్రేమ రహితం? ఇచ్చేవాళ్లు ఉన్నారు.ఇచ్చే టైమే లేదు! ఈ లేకపోవడం ఎలాంటిదంటే, చేతికి వాచీ ఉన్నా, టైమ్ చూసుకునే టైమ్ లేకపోవడం లాంటిది! మనుషులిప్పుడు ఇలాగే ఉన్నారు. పర్సు నిండుగా ఉంటుంది. ఇవ్వాలన్న నిండైన మనసు ఉంటుంది. ఇచ్చే టైమే ఉండదు. ఇవ్వలేదన్న ఫీలింగ్ అలా ఉండిపోతుంది. వంట రుచిగా చేసి పెట్టినందుకో, టైమ్‌కి చేసి పెట్టినందుకో కాంప్లిమెంట్ ఇవ్వాలని ఉంటుంది. ఇచ్చే టైమే ఉండదు. ఇవ్వలేదన్న ఫీలింగ్ అలా ఉండిపోతుంది. ఫీలింగును మనసులోనే ఉండనివ్వకూడదు. డబ్బో, కాంప్లిమెంటో ఇవ్వాలనుకున్నది ఇచ్చేసుకుని, ఫీలింగుని బయటికి తెచ్చేసుకోవాలి. ఫ్రెష్ అయిపోతాం. ఉంచుకోమని సర్ప్రైజింగ్గా కొంత అమౌంట్ చేతికివ్వడం, ఊహించని విధంగా కానుకను తెచ్చి ‘ఇది నీకే’ అని ఇవ్వడం, బర్త్‌డేకి పూలగుత్తి ఇవ్వడం, ఎదురుపడితే చిరునవ్వును ఇవ్వడం, ప్రయత్నానికో ప్రశంసను ఇవ్వడం.. ఎంత సంతోషం! తీసుకున్నవాళ్ల సంతోషాన్ని వదిలేయండి. ఇచ్చిన సంతోషం మనల్ని వదిలిపెట్టదు. అంటుకున్న పరిమళంలా వెంటే వచ్చేస్తుంది! ఇచ్చేయడం, ఇవ్వడం ఒకటి కాదు. ఇచ్చేయడం అంటే తీసుకున్నందుకు తిరిగి ఇచ్చేయడం. అది కృతజ్ఞత. బాకీ చెల్లించడం. కానీ ఇవ్వడం వేరు. ఇచ్చేది తీసుకునేవాళ్లు కదా చెయ్యి చాస్తారు.. కానీ తీసుకోమని చెయ్యిచాచడం.. ఇవ్వడం! ఇచ్చే చెయ్యి కింద ఉండి, తీసుకునే చెయ్యి పైన ఉండడం.. ఇవ్వడం! ‘దయచేసి తీసుకోండి’ అని దోసిలి పట్టడం.. ఇవ్వడం! పాత చైనా మాట ఒకటి ఉంది. ‘ఒక గంట సంతోషంగా ఉండాలంటే చిన్న కునుకు తియ్యి. ఒక రోజంతా సంతోషంగా ఉండాలంటే చేపల వేటకు వెళ్లు. ఒక ఏడాది సంతోషంగా ఉండాలంటే వారసత్వపు ఆస్తి ఏదైనా పొందు. జీవితమంతా సంతోషంగా ఉండాలంటే మాత్రం ఎవరికైనా ఏదైనా ఇవ్వు’ అని. అయితే అదంతా మన సంతోషం కోసం. అవతల వాళ్ల సంతోషం కోసమైతే మనం ఇవ్వలసింది వేరే ఉంది. టైమ్! కష్టం సుఖం వినేందుకు టైమ్. మంచీ చెడూ చెప్పేందుకు టైమ్. ‘అవునా!’ అనేందుకు ఎంత టైమ్ పడుతుంది? ‘నేనున్నా’ అనేందుకు ఎంత టైమ్ పడుతుంది?! (నేడు వరల్డ్ గివ్ డే) మాధవ్ శింగరాజు భర్త నుంచి భార్య కోరుకునే ప్రేమకు ఇంకో పేరు ‘టైమ్’! ఆ టైమ్‌ను భర్త ఆమెకు ఇవ్వగలిగితే ప్రేమను ఇచ్చినట్లే. -
నల్లకుబేరుల జాబితా ఇస్తే బంపర్ ఆఫర్
-
నాలుగు వారాల్లో నివేదిక ఇవ్వాలి
భీంబాయి మరణంపై స్పందించిన మహిళా కమిషన్ జిల్లా పాలనాధికారికి నోటీసు జారీ కదిలించిన ‘సాక్షి’ కథనం కెరమెరి : మండలంలోని శివగూడ గ్రామానికి చెందిన టేకం భీంబాయి రక్తహీనత కారణంగా ప్రసవంలోనే బిడ్డతో సహా మరణించిన ఘటనపై మహిళా కమిషన్ స్పందించింది. దీనిపై నాలుగు వారాల్లో నివేదిక సమర్పించాలని జిల్లా పాలనాధికారికి శుక్రవారం నోటీసు జారీ చేసింది. ఇదే విషయంలో ఈ నెల 10న లీగల్ సర్వీసెస్ వెల్ఫేర్ సొసైటీ నాయకులు శివగూడ గ్రామాన్ని సందర్శించారు. భీంబాయి మతికి గల కారణాలను కుటుంభ సభ్యుల ద్వారా అడిగి తెలుసుకున్నారు. అనంతరం 13న లీగల్ సర్వీసెస్ వెల్ఫేర్ సొసైటీ నాయకులు ‘సాక్షి’ ప్రచురించిన ‘పురిట్లో విషాదం’ కథనాన్ని జోడించి మహిళా కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. ఆదివాసీ యువతుల్లో తల్లి కావాలంటే భయపడే దుస్థితి నెలకొందని అందులో పేర్కొన్నారు. ఏజెన్సీలో జరుగుతున్న గిరిజన బాలింతల చావుకేకలను ఆపాలని కమిషన్‌ను కోరారు. దీంతో కమిషన్ తీవ్రంగా స్పందించింది. ఇప్పటి వరకు ఏం చర్యలు తీసుకున్నారో.. నాలుగు వారాల్లో పూర్తి నివేదిక సమర్పించాలని కలెక్టర్‌ను కోరింది. ఈ విషయాన్ని లీగల్ సర్వీసెస్ వెల్ఫేర్ సొసైటీ వ్యవస్థాపకుడు మాదాసు మధుకర్ శుక్రవారం ‘సాక్షి’కి తెలిపారు. సాధారణంగా మహిళలు ఫిర్యాదు చేస్తేనే మహిళా కమిషన్ స్పందిస్తుంది. కానీ ఇది ఆదివాసీ మహిళలకు సంబంధించిన విషయం కావడం, ‘సాక్షి’లో ప్రచురించిన కథనం హదయాలను కదిలించేదిగా ఉండడంతో మహిళా కమిషన్ తక్షణమే స్పందించిందని మధుకర్ తెలిపారు. -
హ్యాకర్లకు గూగుల్ బంపర్ ఆఫర్
మొబైల్ మార్కెట్ రంగంలో యాపిల్ తో పోటీ పడుతున్న గూగుల్ మొబైల్ హ్యాకర్లకోసం ఓ షాకింగ్ ఆఫర్ ప్రకటించింది. అదిరిపోయే ఫీచర్లతో ఇటీవల లాంచ్ చేసిన తన ప్రఖ్యాత నెక్సస్ 5ఎక్స్, నెక్సస్ 6పి స్మార్ట్ ఫోన్లను హ్యాక్ చేసిన వారికి భారీ బహుమతిని ప్రకటించింది. ఓ ప్రత్యేక మైన హ్యాంకింగ్ ద్వారా తన స్మార్ట్ ఫోన్లలోని లోపాన్ని గానీ, ఏదైనా బగ్ ను గానీ కనుగొన్న హ్యాకర్లు ప్రథమ బహుమతి 200,000 డాలర్లు (రూ 1.3 కోట్లు) సంపాదించే అవకాశం కల్పిస్తోంది. గూగుల్ 'ప్రాజెక్ట్ జీరో ప్రైజ్' పథకంగా ముగ్గురికి ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులను ఇవ్వనుంది. రెండవ బహుమతిగా సుమారు 67 లక్షలు(100,000 డాలర్లు) మూడవ బహుమతిగా సుమారు 38 లక్షలు (50,000 డాలర్లు) అందిస్తామని తెలిపింది. ఈ ఏడాది సెప్టెంబర్ 13నుంచి మొదలైన ఈ పోటీ వచ్చే ఏడాది 2017 మార్చి 13 న ముగియనుందని గూగుల్ వెల్లడించింది. అలాగే మరికొంతమంది ఎంపిక చేసినవారికి టెక్నికల్ రిపోర్ట్ రాయాల్సిందిగా ఆహ్వానిస్తుంది. దీన్ని ప్రాజెక్ట్ జీరో బ్లాగ్ లో ప్రచురిస్తుంది.కాగా మొబైల్ ఫోన్లలో నెక్సస్ సిరీస్ ను ఐదేళ్ల కిందట ప్రారంభించిన గూగుల్.. ఆపరేటింగ్ సిస్టమ్ ఆండ్రాయిడ్ మార్షమల్లోతో నెక్సస్ 5 ఎక్స్, 6 పీలను ఇటీవల లాంచ్ చేసిన సంగతి తెలిసిందే. -
పర్రిశమల కోసం భూములిచ్చేది లేదు
10 కిలోమీటర్ల మేర రైతుల పాదయాత్ర మద్దతుగా పాల్గొన్న కాంగ్రెస్, వామపక్ష పార్టీల నాయకులు గీసుకొండ / సంగెం : పరిశ్రమల స్థాపన కోసం పంటలు పండే విలువైన తమ భూములను ఇవ్వబోమంటూ రైతులు ఆదివారం మహాపాదయాత్రను నిర్వహించారు. భూ సంరక్షణ కమిటీ ఆధ్వర్యంలో ఉదయం 10 గంటలకు మండలంలోని శాయంపేట హవేలి నుంచి ప్రారంభమైన పాదయాత్ర స్టేషన్ చింతలపెల్లి, కృష్ణానగర్, ఊకల్, మరియపురం మీదుగా ఊకల్ క్రాస్‌రోడ్డు వరకు 10 కిలోమీటర్ల మేర సాగింది. పంట భూములను లాక్కోవద్దంటూ రైతులు, రైతు సంఘాల ప్రతినిధులు నినాదాలు చేశారు. సాయంత్రం 4 గంటలకు పాదయాత్ర ఊకల్ క్రాస్‌రోడ్డుకు చేరుకోగా 12 రోజులుగా కొనసాగుతున్న దీక్షల శిబిరాన్ని పలు పార్టీల నాయకులు సందర్శించారు. 2013 చట్టం ప్రకారం భూసేకరణ చేపట్టాలి ప్రభుత్వం 2013 భూ సేకరణ చట్టం ప్రకారం భూ సేకరణ చేపట్టాలే గానీ రైతుల నుంచి బలవంతంగా భూములను లాక్కోవాలని చూస్తే ప్రతిఘటిస్తామని సీపీఎం మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి అన్నారు. రైతుల పాదయాత్రలో పాల్గొన్న సందర్భంగా ఆయన మాట్లాడుతూ పరిశ్రమల కోసం గీసుకొండ, సంగెం మండలాల్లోని గ్రామాల్లో 3 వేల ఎకరాలను సేకరించాలని చూస్తున్నారన్నారు. పరిశ్రమలకు అవసరమైన భూములు జిల్లాలో చాలా ఉన్నాయన్నారు. కాంగ్రెస్ పరకాల నియోజకవర్గ ఇన్చార్జి ఇనుగాల వెంకట్రాంరెడ్డి మాట్లాడుతూ పరిశ్రమలకు భూములను ఇవ్వబోమంటూ 15 రోజులుగా ఆందోళన చేస్తున్న రైతులకు తాము అండగా ఉంటామన్నారు. ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అనుచరులు ఈ ప్రాంతంలో రియల్ ఎస్టేట్ భూ దందాలు చేయాలని చూస్తున్నారని విమర్శించారు. కార్యక్రమంలో ఆత్మకూరు జెడ్పీటీసీ లేతాకుల సంజీవరెడ్డి, భూ నిర్వాసితుల సంఘం రాష్ట్ర, జిల్లా కన్వీనర్లు పి.వెంకట్, రంగయ్య, సీపీఎం జిల్లా కార్యదర్శి సారంపెల్లి వాసుదేవరెడ్డి, రైతు జేఏసీ రాష్ట్ర కన్వీనర్ మోర్తాల చందర్రావు, జిల్లా అధ్యక్షుడు సోమిడి శ్రీనివాస్, పెద్దారపు రమేశ్, బేతినేని నర్సింగరావు, తీగల రవీందర్, కొండేటి కొమురారెడ్డి, కుందారపు యాదగిరి, డోలె చిన్ని, బండారి కట్టయ్య, నాయిని భరత్, ఆబయ్య బుచ్చిబాబు, మునుకుంట్ల కోటేశ్వర్, సురేందర్, లక్ష్మారెడ్డి పాల్గొన్నారు. -
ఆస్తి ఇవ్వాల్సి వస్తుందని..
–కూతురిని కాదన్న తండ్రి –– ఇంటి ఎదుట బైఠాయించిన కూతురు –––న్యాయం చేయాలని అధికారులకు వినతి బుగ్గబాయిగూడెం (వేములపల్లి) : ఆస్తి పంచాల్సి వస్తుందని సొంత కూతురినే కాదంటున్న తండ్రి వైనం మండలంలోని బుగ్గబాయిగూడెంలో వెలుగుచూసింది. వివరాల్లోకి వెళితే.. గ్రామానికి చెందిన రేఖ వెంకయ్య, మహబూబమ్మ అనే దంపతులకు 30 ఏళ్ల క్రితం వివాహమైంది. అయితే వారికి ఓ కుమార్తె (చక్రపాణి) పుట్టిన అనంతరం విడిపోయారు. ఈ క్రమంలో చిన్నారి చక్రపాణిని మిర్యాలగూడ మండలం ఉట్లపల్లిలో ఉన్న అమ్మమ్మ బొల్లమ్మ వద్ద వదిలిపెట్టి తల్లి మహబూబమ్మ వేరే వివాహం చేసుకుని వెళ్లిపోయింది. అప్పటి నుంచి ఆమె అలనాపాలనా పూర్తిగా అమ్మమ్మే చూసుకుంది. చక్రపాణి పెద్దయ్యాక బొల్లం సైదులు అనే వ్యక్తితో వివాహం కూడా చేసింది. ఇప్పుడు ఆమెకు ఇద్దరు పిల్లలు. అయితే చిన్ననాటి తల్లిదండ్రులు తనను కాదనుకున్నా చక్రపాణి మాత్రం ఎప్పుడూ వద్దనుకోలేదు. చిన్నతనం నుంచి తండ్రి వెంకయ్య ఇంటికి తరుచూ వెళ్లేది. వారు ఇంట్లోకి రానియ్యకుండా వెళ్లగొట్టేవాడని ఆమె ఆవేదనతో పేర్కొంది. అయితే ఇటీవల తన తండ్రి పేరు మీద ఉన్న ఆస్తిని వెంకయ్య తమ్ముడైన కృష్ణ కుమార్తె నిర్మలకు రాసి ఇచ్చారని తెలిపారు. తనకు దక్కాల్సిన ఆస్తిని తన తండ్రికి మాయమాటలు చెప్పి కాజేరంటూ ఆమె ఆరోపిస్తోంది. అనేక పర్యాయాలు పెద్ద మనుషుల సమక్షంలో పంచాయితీ పెట్టినప్పటికీ దాన్ని తెగకుండా వాయిదాలు వేస్తూ రావడంతో గత్యంతరం లేని పరిస్థితుల్లో తాను దీక్ష చేపట్టినట్టు పేర్కొంది. తాను కూతురు కాదంటున్న తండ్రికి డీఎన్ఏ పరీక్ష నిర్వహిస్తే నిజనజాలు బయటపడతాయని తెలిపింది. ‘మీ అమ్మ పోయిన నాడే నువ్వు కూడా పోయావు’ నాకు సంబంధం లేదంటూ తండ్రి చెప్పడం బాధాకరంగా ఉందని ఆవేదన వ్యక్తం చేసింది. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి తన న్యాయం చేయాలని ఆమె కోరుతున్నారు. -
పరిశ్రమలకు భూములు ఇవ్వం
పురుగుమందు డబ్బాలతో ఎలుకుర్తి రైతుల నిరసన ధర్మసాగర్ : పరిశ్రమల స్థాపనకు తమ భూములు ఇచ్చేది లేదని వరంగల్ జిల్లా ధర్మసాగర్ మండలం ఎలుకుర్తి గ్రామ రైతులు స్పష్టం చేశారు. ప్రభుత్వం బలవంతంగా లాక్కోవాలని చూస్తే ఉద్య మం తప్పదని హెచ్చరించారు. పరిశ్రమల స్థాపన కోసం ప్రభుత్వం గుర్తించిన భూ యజమానులు మంగళవారం విలేకరులతో మాట్లాడుతూ.. గ్రామంలోని సర్వే నంబర్ 160లోని 216 ఎకరాల భూమిని 40 సంవత్సరాల క్రితం ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు చెందిన 250 మంది పేదలకు ప్రభుత్వం పంపిణీ చేసి పట్టాలు ఇచ్చిందని, ఇప్పటి ప్రభుత్వం వాటిని లాక్కోవాలని చూస్తోందని ఆరోపిం చారు. భూములు కోల్పోతే తమకు జీవనాధారం ఉండదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం బలవంతంగా లాక్కుంటే తమకు ఆత్మహత్యే శరణ్యమన్నారు. భూములు తీసుకుంటామంటూ తమ కు ఇటీవలే నోటీసులుఇచ్చారని తెలిపారు. తాము అధికారంలోకి వస్తే దళితులకు మూడెకరాలు పం పిణీ చేస్తామని చెప్పిన కేసీఆర్.. అవి ఇవ్వకపోగా తమ భూములు లాక్కోవడం ఏంటని ప్రశ్నించా రు. అనంతరం భూములను లాక్కోవద్దని కోరుతూ రైతులు క్రిమిసంహారక మందు డబ్బాలు చేతి లో పట్టుకుని నిరసన తెలుపుతూ స్థానిక సర్పంచ్ గుం డవరపు రాంచందర్‌రావు, ఎంపీటీసీ సభ్యు డు జోగు శేఖర్‌లకు వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా సర్పంచ్, ఎంపీటీసీ సభ్యుడు మాట్లాడుతూ గ్రామంలోరైతులపక్షాన నిలుస్తామని, ఎట్టి పరిస్థితుల్లోను భూములుప్రభుత్వంతీసుకోకుండా చూస్తామని తెలిపారు.రైతులు కొలిపాక జార్జ్, కన కం ఇజ్రాయిల్, పిట్టల వెంకటయ్య, కేతిరి వెంకటయ్య,రాజయ్య, ఎం. సమ్మయ్య పాల్గొన్నారు. -
ఆటలపై ఆసక్తి పెంచుకోవాలి
ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఏన్కూరు: విద్యార్థులు చదువుతో పాటు క్రీడలపైన ఆసక్తి చూపాలని ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి కోరారు. స్థానిక గురుకుల విద్యాలయంలో ఐదు జిల్లాలస్థాయి గురుకుల విద్యాలయాల జోనల్ క్రీడా పోటీలు ఆదివారం ముగిశాయి. విజేతలకు ఆయన బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా ఎంపీ పొంగులేటి మాట్లాడుతూ..రాష్ట్ర ప్రభుత్వం గురుకుల విద్యాలయాల అభివృద్ధికి నిధులు కేటాయిస్తోందని, కాంట్రాక్ట్ టీచర్ల ఉద్యోగాలు భర్తీ కోసం ముఖ్యమంత్రితో చర్చిస్తానని తెలిపారు. విద్యార్థులు కూడా చదువుతో పాటు క్రీడల్లో రాణించాలని కోరారు. ఎన్సెస్పీ భూములు గురుకుల విద్యాలయానికి కేటాయించాలని, గురుకుల విద్యాలయం ప్రహరీ సమస్య పరిష్కరించాలని గురుకుల విద్యాలయం ప్రిన్సిపాల్ జితేంద్రప్రసాద్ ఎంపీని కోరారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ పూల రవీందర్, గురకుల విద్యాలయం జాయిట్ సెక్రటరీ వెంకటనర్సయ్య, ఏజీఏ వసంతరావు, ఎంపీపీ బాణోతు మాధవి, తహసీల్దార్ చప్పిడి నాగరాజు, ఎంపీడీఓ కె.పాపారాణి, చైర్మ¯ŒS రాంబాబు, ఎంపీటీసీ మేడ ధర్మారావు పాల్గొన్నారు. విజేతలు వీరే మూడు రోజులుగా కొనసాగిన ఐదు జిల్లాల గురుకుల విద్యాలయాల కబడ్డీ, వాలీబాల్, ఖోఖో జోనల్ క్రీడా పోటీలు ఆదివారం ముగిశాయి. కబడ్డీలో ప్రథమ బహుమతిని నందిమేడారం(కరీంనగర్), ద్వితీయ బహుమతిని వేలేరు( వరంగల్), ఖోఖో ప్రథమ బహుమతిని మడ్నూర్(నిజామాబాద్), ద్వితీయ నందిమేడారం(కరీంనగర్), వాలీబాల్‌లో ప్రథమ బండారుపల్లి(వరంగల్), ద్వితీయ వేలేరు (వరంగల్), టెన్నికాయిట్‌లో ప్రథమ వేలేరు( వరంగల్), ద్వితీయ ఏన్కూరు(ఖమ్మం), బ్యాడ్మింట¯ŒS ప్రథమ ఏన్కూరు(ఖమ్మం), ద్వితీయ వేలేర్ (వరంగల్) విద్యార్థులు సాధించారు. -
పరిశ్రమలకు పంట భూములు ఇవ్వం
జీవనాధారమైన పొలాలు లాక్కోవద్దు.. విచారణ కోసం వచ్చిన రెవెన్యూ సిబ్బందిని అడ్డుకున్న రైతులు పలు ప్రాంతాల్లో రాస్తారోకో, ధర్నా సంగెం / గీసుకొండ : పరిశ్రమల పేరుతో తా ము తరతరాలుగా సాగుచేస్తున్న భూములను లాక్కోవద్దని సంగెం మండలంలోని పలు గ్రా మాల రైతులు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు టెక్స్టైల్ ఏర్పాటుకు భూములు పరిశీలించేందుకు గురువారం వచ్చిన రెవెన్యూ సిబ్బందిని అడ్డుకున్నారు. గీసుకొండ, సంగెం మండలాల్లో పలు గ్రామాల్లో ఉన్న ప్రభుత్వ భూమి, అసైన్డ్ భూ ములను గతంలో టెక్స్టైల్ పార్కు కోసం రెవె న్యూ అధికారులు సర్వే చేశారు. ఇక్కడ 300 ఎకరాల వరకు ప్రభుత్వ భూమి ఉందని గుర్తించి నా.. చివరకు ధర్మసాగర్ మండలం దేవునూరి గుట్టల ప్రాంతంలో టెక్స్టైల్ పార్కు ఏర్పాటు కు ప్రభుత్వం నిర్ణయించింది. అయితే, తొలుత గుర్తించిన ప్రభుత్వ భూమితో పాటు రైతుల నుంచి మరో వెయ్యి ఎకరాల భూమి సేకరించి ఇక్కడ టీఎస్–ఐపాస్‌లో భాగంగా తెలంగాణ ప్రభుత్వం ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్(టీఎస్ఐఐసీ) ద్వారా ఇండస్ట్రియల్ పా ర్క్ ఏర్పాటు చేసే ఆలోచనలో ఉంది. సమీపంలోనే రైల్వేస్టేçÙన్(స్టేçÙన్ చింతల్‌పల్లి) ఉండటం వల్ల రవాణాకు అనుకూలంగా ఉంటుందని ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇందులో భాగంగా రై తుల భూములను పరిశీలించేందుకు రెవెన్యూ ఉద్యోగులు రాగా రైతులు అడ్డుకున్నారు. ఈ మే రకు మండల రెవెన్యూ ఇన్స్పెక్టర్లు హరతి, వేణు విఆర్వోలు కృష్ణమూర్తి, సత్యనారాయణ, శ్రీనివాస్, సదయ్య, దేవేందర్‌తో పాటు ముగ్గురు వీఆర్ఏలు కృష్ణానగర్, చింతలపల్లి గ్రామాల్లోని భూముల పరిశీలనకు వెళ్లగా రైతు లు కృష్ణానగర్ క్రాస్‌రోడ్ వద్ద, సంగెం–వరంగల్ రహదారిపై రాస్తారోకో నిర్వహించి ఉద్యోగులకు వెనక్కి పంపారు. ఆ తర్వాత ఉద్యోగు లు చింతలపల్లికి రాగా ఇక్కడి రైతులు కూడా సారవంతమైన భూములను పరిశ్రమల కోసం సేకరించడం సరికాదని అభ్యంతరం తెలిపారు. చింతలపల్లి ఎంపీటీసీ మాజీ సభ్యుడు తీగల రవీందర్, దుడ్డె దామోదర్‌తో పాటుగా రైతులు పి.రాజన్న, దుడ్డె వెంకన్న, సాయిలు, నర్సింగరావు, రాజేశ్, శ్రీను, రఘు, బిక్షపతి, వెంకటేశ్వర్లు పాటు వందలాది మంది పాల్గొన్నారు. ఊకల్–సంగెం రోడ్డుపై.. పరిశ్రమల స్థాపనకు అవసరమైన భూమి కోసం ఉద్యోగులు చేస్తున్న పరిశీలనను రైతులు అడ్డుకున్నారు. మండలంలోని ఊకల్ హవేలీకి ఉద్యోగులు రాగా రైతులు అడ్డుకుని ఊకల్–సంగెం రోడ్డుపై రాస్తారోకో చేశారు. ఎంఆర్ఐ భవానీ, వీఆర్వోలు గట్టికొప్పుల రాంబాబు, నాగరాజు, సమ్మయ్యలు ఊకల్ రైతుల వద వివరాలు ఆరా తీయడంతో పాటు భూములు ఇచ్చేందుకు ముందుకొచ్చే రైతులు ఫారం–1 పూర్తి చేసి ఇవ్వాలని కోరారు. దీంతో రైతులు ససేమిరా అనడంతో పాటు ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి, గీసుకొండ తహసీల్దార్ రావాలంటూ నినాదాలు చేశారు. విషయం తెలుసుకున్న గీసుకొండ పోలీసులు రైతులను శాంతింపజేశారు. ఈ విషయమై గీసుకొండ తహసీల్దార్ శ్రీనివాస్‌ను వివరణ కోరగా పరిశ్రమ స్థాపన కోసమే రైతులను భూములు అడగడానికి రెవెన్యూ సిబ్బందిని పంపించామని తెలిపారు. అయితే, భూములు ఇవ్వడానికి నిరాకరిస్తే బలవంతంగా సేకరించడం ఉండదని స్పష్టం చేశారు. -
ధ్యాన్‌చంద్‌కు భారతరత్న ఇవ్వాలి
కరీంనగర్ స్పోర్ట్స్ : ఒలంపిక్స్‌లో దేశ ఖ్యాతిని ఇనుమడింపజేసిన హాకి లెజెండ్ ధ్యాన్‌చంద్‌కు భారతరత్న ఇవ్వాలని ప్రజాప్రయోజనాల పరిరక్షణ సమితి నాయకులు కోరారు. తెలంగాణచౌక్‌లో సోమవారం ఈమేరకు ప్రదర్శన నిర్వహించారు. క్రీడాకారుడిగా మూడు, కోచ్‌గా మూడు బంగారు పతకాలు సాధించిన ఘనత ధ్యాన్‌చంద్‌కు మాత్రమే దక్కిందన్నారు. జిల్లా కేంద్రంలో ధ్యాన్‌చంద్ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామన్న హామీని మేయర్ నిలబెట్టుకోవాలని కోరారు. జిల్లా అధ్యక్షుడు మహ్మద్ అమర్, రాజేశ్, ఆనంద్, నాగరాజు, అరుణ్, కిరణ్‌కుమార్, మహేశ్, అరవింద్ తదితరులు పాల్గొన్నారు. -
ఫిరాయింపులపై చర్యల అధికారం ఈసీకే ఇవ్వాలి
►ఆ విధంగా తక్షణమే రాజ్యాంగ సవరణ చేయాలి ►న్యాయ నిపుణులు, రాజకీయ, సామాజికవేత్తల సూచన ►ఫిరాయించిన వారిని స్పీకర్లు కాపాడుతున్నారు ►పార్టీల ఫిరాయింపులు-స్పీకర్ పాత్ర అనే అంశంపై చర్చ హైదరాబాద్: పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలు, ఎంపీలపై అనర్హత వేటు వేసే అధికారాన్ని కేంద్ర ఎన్నికల కమిషన్‌కు అప్పగించాలని న్యాయ నిపుణులు, రాజకీయ, సామాజికవేత్తలు ముక్తకంఠంతో కోరారు. దేశ రాజకీయాల్లో పెట్రేగిపోతున్న పార్టీ ఫిరాయింపులు అత్యంత ఆందోళన కలిగిస్తున్నాయని, ప్రజాస్వామ్య స్ఫూర్తిని మంటగలుపుతున్నాయన్నారు. అధికారంలోని పార్టీలు విపక్ష పార్టీల సభ్యులను గంపగుత్తగా కొనుగోలు చేస్తున్నాయని ..విపక్షాలు లేని చట్ట సభ ఫాసిస్టు వ్యవస్థతో సమానమని అభిప్రాయపడ్డారు. ఏ రాజకీయపార్టీతో సంబంధం లేకుండా స్వతంత్ర వ్యక్తులుగా ఉండాల్సిన స్పీకర్లు అధికార పార్టీలకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారని, ప్రతిపక్షాల నుంచి అధికార పార్టీలోకి ఫిరాయించిన ఎమ్మెల్యేలు, ఎంపీలపై అనర్హత వేటు వేయకుండా కాపాడుతున్నారన్నారు. ‘పార్టీల ఫిరాయింపులు-స్పీకర్ పాత్ర’ అనే అంశంపై ఆదివారం హైదరాబాద్ సుందరయ్య విజ్ఞానభవన్‌లో నిర్వహించిన సదస్సులో సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తులు జస్టిస్ బీపీ జీవన్‌రెడ్డి, జస్టిస్ బి.సుదర్శన్‌రెడ్డి, హైకోర్టు మాజీ న్యాయమూర్తులు జస్టిస్ పి.లక్ష్మణరెడ్డి, జస్టిస్ బి.శేషశయనా రెడ్డి, కేంద్ర మాజీ మంత్రి ఎస్ జైపాల్‌రెడ్డి, లోక్‌సత్తా వ్యవస్థాపకుడు డాక్టర్ జయప్రకాశ్ నారాయణ, సాక్షి ఎడిటోరియల్ డెరైక్టర్ కె.రామచంద్రమూర్తి మాట్లాడారు. ఫిరాయిస్తేనే అనర్హులు కావాలి ఓ పార్టీ తరఫున గెలిచి మరో పార్టీలోకి ఫిరాయిస్తే ఎమ్మెల్యేలు, ఎంపీలు ఆటోమెటిక్‌గా అనర్హులు కావాలి. ఆ మేరకు రాజ్యాంగ సవరణచేపట్టాలి. - జస్టిస్ బి.శేషశయనారెడ్డి స్పీకర్‌కు అసాధారణ అధికారాలతో సమస్యలు అసాధారణ నిర్ణయాధికారాలను స్పీకర్‌కు కట్టబెట్టడం వల్ల వారి నిర్ణయాలు రాజకీయ సంక్షోభాలు, వివాదాలను రేకెత్తిస్తున్నాయి. భవిష్యత్తులో 300 మంది స్వతంత్ర సభ్యులు లోక్‌సభకు ఎన్నికైతే పరిస్థితి ఏమిటి? ఒక వేళ 10 కన్నా తక్కువ సీట్లను 50 పార్టీలు గెలుచుకుంటే దేశంలో చెలరేగే అల్లకల్లోలం గురించి ఆలోచించాలి. ఇలాంటి సందర్భాల్లో స్పీకర్లు తీసుకునే నిర్ణయాలు సమస్యను మరింత జఠిలం చేస్తాయి. స్పీకర్లు పక్షపాతంతో నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఎన్నికల కమిషన్ సిఫారసుతో ఫిరాయించిన సభ్యులపై అనర్హత వేటు వేసే అధికారాన్ని రాష్ట్రపతి, గవర్నర్లకు కల్పించడమే పరిష్కార మార్గం. - జస్టిస్ జీవన్ రెడ్డి ఫిరాయింపుల భూతం పట్టుకుంది ప్రజాస్వామ్యానికి పార్టీ ఫిరాయింపుల భూతం పట్టుకుంది. ఫిరాయింపులతో ప్రజాస్వామ్య పునాదులు బలహీనంగా మారుతున్నాయి. ఈ గందరగోళానికి రాజ్యాంగ పరిధిలోనే పరిష్కారాన్ని కనుగొనాలి. ఎన్నికల కమిషన్ సిఫారసు మేరకు పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు, ఎంపీలపై అనర్హత వేటు వేసే అధికారం రాష్ట్రపతి, గవర్నర్లకు కట్టబెట్టే విధంగా రాజ్యాంగ సవరణ జరపాలి. స్పీకర్లు అధికార పార్టీలకు అనుకూలంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఫిరాయింపు ఎమ్మెల్యేలపై నిర్ణీత గడువులోగా చర్యలు తీసుకోవాలని, లేకుంటే తామే నిర్ణయం తీసుకుంటామని కోర్టులు ఆదేశించే విధంగా చట్ట సవరణ జరగాలి. - జస్టిస్ సుదర్శన్‌రెడ్డి రాజీనామాలు ఆమోదించడం లేదు ఈ మధ్య కాలంలో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై ఎక్కడా స్పీకర్లు అనర్హత వేటు వేసిన దాఖలాలు లేవు. ఒక వేళ ఫిరాయింపుదారులు రాజీనామా చేసినా స్పీకర్లు ఆమోదించడం లేదు. ఫిరాయింపుదాలరుపై అనర్హత వేటు వేసే అధికారం ఎన్నికల సంఘానికి ఇవ్వాలి. అవిశ్వాస, విశ్వాస తీర్మానాలు, బడ్జెట్ ఆమోదం సమయంలోనే విప్‌ను పరిమితం చేయాలి. సీఎంలను ప్రత్యక్ష పద్ధతిలో ఎన్నుకోవాలి. అప్పుడే రాజకీయాల్లో కొత్త ఒరవడి వస్తుంది. -జేపీ చర్యలెవరు తీసుకోవాలి? టీడీపీ నుంచి గెలిచిన తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ను సీఎం కేసీఆర్ రాజ్‌భవన్‌కు తీసుకెళితే.. మంత్రిగా తలసానితో గవర్నర్ ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ విషయంలో తప్పు సీఎందా? గవర్నర్‌దా?. తలసాని ఈ రోజు కూడా టీడీపీ ఎమ్మెల్యేనే. ఈ విషయంలో ఎవరిపై ఎవరు చర్యలు తీసుకోవాలి? - కె.రామచంద్రమూర్తి లా కమిషన్ సిఫారసులు అమలు చేయాలి ఈసీ సిఫారసు మేరకు పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు, ఎంపీలపై అనర్హత వేటు వేసే అధికారాన్ని రాష్ట్రపతి, గవర్నర్‌కు అప్పగించాలని లా కమిషన్ చేసిన సిఫారసులను అమలు చేయాలి. ఇందుకు రాజ్యాంగంలోని ఆర్టికల్ 102(3) సైతం అనుకూలంగా ఉంది. - జస్టిస్ పి.లక్ష్మణ రెడ్డి అప్పట్లోనే వ్యతిరేకించాను పార్టీ ఫిరాయింపుల వ్యతిరేక చట్టాన్ని 1985 లో మురార్జీ దేశాయ్ ప్రభుత్వం తీసుకొస్తే ప్రతిపక్షంలో ఉండి కూడా నేను సమర్థించాను. అనర్హత వేటు వేసే అధికారాన్ని స్పీకర్‌కు కట్టబెట్టడం పెద్ద లొసుగుగా మారుతుందని అప్పట్లోనే నేను వ్యతిరేకించాను. - జైపాల్‌రెడ్డి -
అందరికీ ‘సకల’ వేతనం ఇవ్వాలి
ౖయెటింక్లయిన్‌కాలనీ : ఎలాంటి కొర్రీలు పెట్టకుండా సకలజనుల సమ్మె వేతనాలు అత్యవసర సిబ్బందితో సహా అందరికీ ఇవ్వాలని హెచ్ఎంఎస్ ఆర్జీ–2 ఉపాధ్యక్షుడు నాచగోని దశరథంగౌడ్ డిమాండ్ చేశారు. స్థానిక ప్రెస్‌భవన్‌లో ఆదివారం మాట్లాడారు. సకలజనుల సమ్మె వేతనాల్లో సకల కొర్రీలు పెట్టి ఇచ్చేందుకు యాజమాన్యం కుట్రపన్నుతోందని దీన్ని అడ్డుకోవాల్సిన బాధ్యత గుర్తింపు యూనియన్‌పై ఉందన్నారు. తామే ఇప్పిచ్చామని పేర్కొంటున్న గుర్తింపు సంఘం నాయకులు కొర్రీలకు వారే బాధ్యత వహిస్తారా అని ప్రశ్నించారు. ఇప్పటికై గుర్తింపు సంఘం బాధ్యతాయుతంగా ముందుకు సాగి సకలజనుల సమ్మె వేతనాలు అందరికీ వర్తింపజేసేలా చూడాలని కోరారు. లేని పక్షంలో ప్రాతినిధ్య సంఘాలను కలుపుకుని ముందుకు వెళ్లి అందరికీ న్యాయం జరిగేలా చూడాలన్నారు. ఏదిఏమైనా ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో కీలకపాత్ర వహించిన సింగరేణి కార్మికులకు సకలజనుల సమ్మెవేతనాలు చెల్లించడం సంతోషకరమన్నారు. కొంత ఆలస్యమైనా ముఖ్యమంత్రి ఇచ్చిన మాట నిలబెట్టుకున్నందుకు కృతజ్ఞతలు తెలిపారు. సమావేశంలో జమీల్, ప్రతాప్రావు, వీరస్వామి, సోమయాజులు తదితరులు పాల్గొన్నారు. -
ఎక్స్‌గ్రేషియా చెల్లించాలి
గోపాల్పేట: హైదరాబాద్ ఫిలింనగర్లో అక్రమంగా నిర్మిస్తున్న కల్చరర్ క్లబ్ కూలి మతిచెందిన కూలీల కుటుంబాలకు రూ.20 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి మద్దిరాల విష్ణువర్ధన్‌రెడ్డి ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. ఫిలింనగర్ కల్చరర్ కమిటీ నిర్లక్ష్యం వల్ల ఈ ప్రమాదం చోటుచేసుకుందని, శిథిలాల కింద కూరుకుపోయిన క్షతగాత్రులకు మెరుగైన వైద్యం సేవలు అందించాలని కోరారు. హైదరాబాద్‌లో ఎవరి ఇష్టానుసారంగా వారు అక్రమ నిర్మాణాలు చేపడుతున్నా ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో ఈ సంఘటన చోటు చేసుకుందని తెలిపారు. ఫిలింనగర్ కమిటీపై నాన్‌బెయిలబుల్ కేసు పెట్టాలని ప్రభుత్వాన్ని -
పరిహారం మాత్రమే చెల్లిస్తాం
పునరావాస ప్యాకేజీ మా పరిధిలో లేదు సింగరేణి డైరెక్టర్ అంటోనిరాజా లింగాపూర్ (రామగుండం) : మేడిపల్లి ఓపెన్‌కాస్టు బాధిత గ్రామమైన లింగాపూర్ ఎస్సీ కాలనీని సురక్షిత ప్రాంతానికి తరలించాలనే డిమాండ్‌పై సింగరేణి యాజమాన్యం గోదావరిఖని జీఎం కార్యాలయంలో కాలనీవాసులతో శనివారం సంప్రదింపులు జరిపింది. అంతకు ఒక రోజు ముందే సింగరేణి ఉన్నతాధికారులు ఎవ్వరికీ సమాచారమివ్వకుండా ఎస్సీ కాలనీ స్థితిగతులను పరిశీలించినట్లు విశ్వసనీయ సమాచారం. తర్వాతే కాలనీవాసులతో సంప్రదింపులకు అవకాశమిచ్చారు. రాబోయే రెండేళ్లలో మేడిపల్లి ఓపెన్‌కాస్టు ప్రాజెక్టు కాలపరిమితి ముగియనుందని, ఎస్సీ కాలనీవాసులకు పునరావాస ప్యాకేజీ వర్తింపజేయడం సాధ్యం కాదని తేల్చేశారు. మూడు నెలల క్రితం స్థానిక తహసీల్దార్ శ్రీనివాస్‌రావు ఆదేశాల మేరకు కాలనీని సర్వేయర్ల బృందంతో పరిశీలించి సురక్షిత ప్రాంతానికి తరలించేందుకు కసరత్తు చేస్తున్నట్లు ప్రకటించడంతో తమకు న్యాయం జరుగనుందని సంతోషపడ్డామని కాలనీవాసులు పేర్కొంటున్నారు. వివిధ రకాల ప్రక్రియలు పూర్తి చేస్తున్నప్పటికీ ఎస్సీ కాలనీవాసులకు పరిహారాలు మాత్రం అందడం లేదని వాపోతున్నారు. ఏదేమైనా తాము శిథిలావస్థకు చేరిన గృహాలకు మాత్రమే పరిహారం చెల్లించనున్నామని, అంతకు మించి ఇతర అంశాలు తమ పరిధిలో లేవని, దీనికి కాలనీవాసులు సమష్టిగా నిర్ణయించుకుంటే చెల్లింపుల ప్రక్రియ ప్రారంభిస్తామని, లేదంటే మీ నిర్ణయం మీదే అంటూ సమావేశాన్ని ముగించినట్లు ఎంపీటీసీ ఇరికిళ్ల పద్మ తెలిపారు. సమావేశంలో సింగరేణి డైరెక్టర్(పా) అంటోనిరాజా, సీజీఎం వెంకటేశ్వర్రావు, ఎమ్మార్పీఎస్ నాయకులు ఉప్పులేటి పర్వతాలు, కన్నూరి సతీశ్‌కుమార్, ఇరికిళ్ల నర్సయ్య, కాసర్ల మల్లేశ్ తదితరులు పాల్గొన్నారు. -
ఫేస్బుక్ సర్వాధికారాలు ఆయనకే..
శాన్ఫ్రాన్సిస్కో: సామాజిక మీడియా దిగ్గజం ఫేస్బుక్ యాజమాన్య బాధ్యతలు తిరిగి చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, జుకర్ బర్గ్ కు అప్పజెబుతూ సంస్థ వార్షిక సమావేశం తీర్మానించింది. ఈ మేరకు సోమవారం జరిగిన వార్షిక వాటాదారుల సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. 5.7 బిలియన్ల క్లాస్ సి షేర్ల ను కేటాయిస్తూ షేర్ హోల్డర్ల ఓటింగ్ ద్వారా నిర్ణయించారు. ఈ వోటింగ్ ద్వారా ఫేస్బుక్ వ్యవస్థాపకుని ఆధ్వర్యంలోని కంపెనీగా ఫేస్బుక్ అవతరించింది. సంస్థ పై జకర్బర్గ్ కు పూర్తి నియంత్రణను కల్పించింది. ఫేస్బుక్ అధిపతిగా జుకర్ బర్గ్ ను ఎన్నిక చేస్తూ సమావేశం తీర్మానించింది. దీంతోపాటు అతని భార్య డాక్టర్ ప్రిసిల్లా చాన్ కు కూడా దాతృత్వ ఓటింగ్ నియంత్రణా అధికారాన్ని కల్పించారు. మార్క్ అండర్సెన్ , పీటర్ థీల్ సహా మిగతా కంపెనీ బోర్డు డైరెక్టర్లు, పెట్టుబడిదారులు తిరిగి ఎన్నికున్నారు మరోవైపు ఫార్చూన్ నివేదిక ప్రకారం 3 :1 స్టాక్ స్ప్లిట్ కానుంది. దీని ప్రకారం ప్రస్తుత వాటాదారులు కలిగివున్న క్లాస్ ఎ,బి షేర్లకు గాను రెండు సీక్లాస్ షేర్లను వన్ టైం డివిడెండ్ గా అందిస్తారని తెలిపింది . మరోవైపు సుదీర్ఘ కాలం కంపెనీని నడిపించాలని ఆకాంక్షిస్తున్నట్టు జుకర్ బర్గ్ సమావేశంలో ప్రశ్నోత్తరాల కార్యక్రమంలో వెల్లడించారు. ప్రస్తుతం నాలుగు మిలియన్ల ఎ క్లాస్ షేర్లు, 419 మిలియన్ బి క్లాస్ షేర్లు జుకర్ బర్గ్ సొంతం. ఒక్కో క్లాస్ బి షేర్ విలువ 10 ఓట్లకు సమానం. దీంతో వ్యూహాత్మక నిర్ణయాలలో మెజారిటీ ఓటింగ్ పవర్ ను సొంతం చేసుకున్నట్టయింది. ఫేస్బుక్ ప్రస్తుతం 1.6 బిలియన్ పైగా నెలవారీ యాక్టివ్ యూజర్లను కలిగిఉంది. కాగా ఫేస్ బుక్ వ్యవస్థాపకుడు భవిష్యత్తులో ఏదో ఒక సమయంలో ఆయన బాధ్యతల నుంచి నిష్క్రమిస్తే.. అనే అంచనాల నేపథ్యంలో అమెరికా సెక్యూరిటీ అండ్ ఎక్సేంజ్ దగ్గర ఒక ప్రాక్సీని (ఓటింగ్ ద్వారా ఎన్నుకనే ప్రత్యామ్నాయ ప్రతినిధి) ఫైల్ చేసింది. దీనిపై వాటాదారుల అభిప్రాయాలను వోటింగ్ ద్వారా సేకరించనున్నట్టు తెలిపింది. ఒకవేళ జుకర్‌బర్గ్ ఫేస్బుక్ నుంచి తప్పుకుంటే భవిష్యత్తులో ఫేస్‌బుక్‌కు చీఫ్ అయ్యే వ్యక్తికి ఉండే మేనేజ్మెంట్ అధికారాలు పరిమితం అయిపోకుండా జాగ్రత్త తీసుకోవడం కోసమేనని ఫేస్బుక్ బోర్డు తెలిపిన సంగతి తెలిసిందే. -
బిహార్‌లో మరో హైటెక్ కాపీయింగ్
పాట్నాః జనతాదళ్ పాలిస్తున్న బిహార్ రాష్ట్రంలో విద్యారంగం అవినీతిలో కూరుకుపోయింది. అందుకు తాజాగా మరో ఉదంతం వెలుగులోకి వచ్చింది. స్థానిక రోటాస్ కళాశాల విద్యార్థులు గుంపులు గుంపులుగా నేలపై కూర్చొని, మొబైల్ లైట్లతో పరీక్షలు రాయడం మళ్ళీ కలకలం రేపింది. బిహార్ రోటాస్ కాలేజీ విద్యార్థులు పరీక్షలు రాసిన తీరు చూస్తే... యాజమాన్య అలసత్వం, విద్యారంగంలో డొల్లతనం మరోసారి బయటపడింది. స్నేహంలోనే కాదు పరీక్షలు రాయడంలోనూ విద్యార్థులు ఐకమత్యాన్ని ప్రదర్శించారు. ఇటీవల బిహార్ లో 12వ తరగతి విద్యార్థుల పరీక్షల టాపర్స్ స్కాం వెలుగులోకి వచ్చి, విచారణలో నిజాలు బహిర్గతమైనా అక్కడి పరిస్థితి మాత్రం మారలేదు. తాజాగా రోటాస్ కాలేజీ విద్యార్థులు నేలమీద గుంపుగా కూర్చుని, మొబైల్ లైట్ల వెలుగులో హాయిగా కలసి మెలసి పరీక్షలు రాస్తున్నట్లుగా బయటపడ్డ ఫొటోలు ఇప్పుడు అక్కడి విద్యారంగాన్నే ప్రశ్నిస్తున్నాయి. రోటాస్ కాలేజీలో కనీస సౌకర్యాలు కూడ లేవన్నదానికి ప్రస్తుతం బయటపడ్డ ఫొటోలు ప్రత్యక్ష సాక్ష్యాలుగా కూడ మారాయి.