శాన్ఫ్రాన్సిస్కో: సామాజిక మీడియా దిగ్గజం ఫేస్‌బుక్ యాజమాన్య బాధ్యతలు తిరిగి చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, జుకర్ బర్గ్ కు అప్పజెబుతూ సంస్థ వార్షిక సమావేశం తీర్మానించింది. ఈ మేరకు సోమవారం జరిగిన వార్షిక వాటాదారుల సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. 5.7 బిలియన్ల క్లాస్ సి షేర్ల ను కేటాయిస్తూ షేర్ హోల్డర్ల ఓటింగ్ ద్వారా నిర్ణయించారు. ఈ వోటింగ్ ద్వారా ఫేస్బుక్ వ్యవస్థాపకుని ఆధ్వర్యంలోని కంపెనీగా ఫేస్బుక్ అవతరించింది. సంస్థ పై జకర్బర్గ్ కు పూర్తి నియంత్రణను కల్పించింది.
ఫేస్బుక్ అధిపతిగా జుకర్ బర్గ్ ను ఎన్నిక చేస్తూ సమావేశం తీర్మానించింది. దీంతోపాటు అతని భార్య డాక్టర్ ప్రిసిల్లా చాన్ కు కూడా దాతృత్వ ఓటింగ్ నియంత్రణా అధికారాన్ని కల్పించారు. మార్క్ అండర్సెన్ , పీటర్ థీల్ సహా మిగతా కంపెనీ బోర్డు డైరెక్టర్లు, పెట్టుబడిదారులు తిరిగి ఎన్నికున్నారు మరోవైపు ఫార్చూన్ నివేదిక ప్రకారం 3 :1 స్టాక్ స్ప్లిట్ కానుంది. దీని ప్రకారం ప్రస్తుత వాటాదారులు కలిగివున్న క్లాస్ ఎ,బి షేర్లకు గాను రెండు సీక్లాస్ షేర్లను వన్ టైం డివిడెండ్ గా అందిస్తారని తెలిపింది . మరోవైపు సుదీర్ఘ కాలం కంపెనీని నడిపించాలని ఆకాంక్షిస్తున్నట్టు జుకర్ బర్గ్ సమావేశంలో ప్రశ్నోత్తరాల కార్యక్రమంలో వెల్లడించారు.
ప్రస్తుతం నాలుగు మిలియన్ల ఎ క్లాస్ షేర్లు, 419 మిలియన్ బి క్లాస్ షేర్లు జుకర్ బర్గ్ సొంతం. ఒక్కో క్లాస్ బి షేర్ విలువ 10 ఓట్లకు సమానం. దీంతో వ్యూహాత్మక నిర్ణయాలలో మెజారిటీ ఓటింగ్ పవర్ ను సొంతం చేసుకున్నట్టయింది. ఫేస్బుక్ ప్రస్తుతం 1.6 బిలియన్ పైగా నెలవారీ యాక్టివ్ యూజర్లను కలిగిఉంది.
కాగా ఫేస్ బుక్ వ్యవస్థాపకుడు భవిష్యత్తులో ఏదో ఒక సమయంలో ఆయన బాధ్యతల నుంచి నిష్క్రమిస్తే.. అనే అంచనాల నేపథ్యంలో అమెరికా సెక్యూరిటీ అండ్ ఎక్సేంజ్ దగ్గర ఒక ప్రాక్సీని (ఓటింగ్ ద్వారా ఎన్నుకనే ప్రత్యామ్నాయ ప్రతినిధి) ఫైల్ చేసింది. దీనిపై వాటాదారుల అభిప్రాయాలను వోటింగ్ ద్వారా సేకరించనున్నట్టు తెలిపింది. ఒకవేళ జుకర్‌బర్గ్ ఫేస్‌బుక్ నుంచి తప్పుకుంటే భవిష్యత్తులో ఫేస్‌బుక్‌కు చీఫ్ అయ్యే వ్యక్తికి ఉండే మేనేజ్‌మెంట్ అధికారాలు పరిమితం అయిపోకుండా జాగ్రత్త తీసుకోవడం కోసమేనని ఫేస్‌బుక్ బోర్డు తెలిపిన సంగతి తెలిసిందే.
ఫేస్బుక్ సర్వాధికారాలు ఆయనకే..
Published Tue, Jun 21 2016 11:26 AM | Last Updated on Thu, Jul 26 2018 5:23 PM
Advertisement