decides
-
తెరుచుకున్న ‘పూరీ’ ద్వారాలు.. తొలి హమీ నిలబెట్టుకున్న బీజేపీ
ఒడిశాలోని పూరి జగన్నాథ ఆలయాలనికి గల నాలుగు ద్వారాలు వేదమంత్రోచ్ఛారణల నడుమ నేటి (గురువారం) ఉదయం తెరుచుకున్నాయి. రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటైన దరిమిలా జరిగిన క్యాబినెట్ భేటీలో తొలుత పూరి ఆలయ నాలుగు ద్వారాలు తెరవాలని నిర్ణయించారు. దీనిని సర్కారు వెంటనే అమలులోకి తెచ్చింది. నూతన ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝితోపాటు మంత్రులంతా పూరీ దేవాలయ నాలుగు ద్వారాలను తెరిచే కార్యక్రమంలో పాల్గొన్నారు. భక్తులకు కూడా ప్రవేశం కల్పించారు. ప్రస్తుతం ఆలయంలో ఘనంగా పూజలు జరుగుతున్నాయి. 12 వ శతాబ్దం నాటి ఈ పురాతన ఆలయంలో నేటి వరకూ ఒక్క ద్వారం నుంచే భక్తులను అనుమతిస్తున్నారు. దీంతో పలు ఇబ్బందులు ఎదురవుతున్నాయి.కరోనా మహమ్మారి వ్యాప్తి ముందునాటి వరకూ పూరీ ఆలయంలోని నాలుగు ద్వారాల నుంచి కూడా భక్తుల ప్రవేశానికి అనుమతి ఉండేది. కోవిడ్-19 విజృంభణ సమయంలో కేవలం ఒక్క ద్వారం నుంచే భక్తుల ప్రవేశానికి అనుమతి కల్పించారు. నాటి నుంచి నవీన్ పట్నాయక్ ప్రభుత్వం ఆలయానికి గల మూడు ద్వారాలను తెరవలేదు.ఈ నేపధ్యంలో భక్తులకు ఏర్పడుతున్న ఇబ్బందులకు గమనించిన బీజేపీ.. పూరీ ఆలయంలోని నాలుగు ద్వారాలను తెరిపిస్తామని ఎన్నికలకు ముందు హామీనిచ్చింది. రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటు కాగానే బీజేపీ ఈ హామీని నిలబెట్టుకుంది. బుధవారం జరిగిన తొలి క్యాబినెట్ భేటీలో పూరీ ఆలయానికి రూ.500 కోట్ల కార్పస్ ఫండ్ ఏర్పాటు చేయాలని కూడా నిర్ణయించారు. క్యాబినెట్ సమావేశం ముగిసిన వెంటనే సీఎంతో పాటు మంత్రులంతా పూరీకి చేరుకున్నారు. #WATCH | Puri: Morning visuals from the Puri Jagannath Temple where all four gates are to be opened for devotees in the presence of CM Mohan Charan Majhi and all of the Ministers of Odisha.Odisha CM Mohan Charan Majhi along with Deputy Chief Ministers KV Singh Deo and Prabhati… pic.twitter.com/zyQFTKrG8x— ANI (@ANI) June 13, 2024 -
ఇద్దరు భార్యల ముద్దుల భర్త.. చెరో పదిహేను రోజులు..
భోపాల్:వివాహం అనేది మనిషి జీవితంలో ఎంతో ప్రత్యేకమైనది. సంతోషాలతో పాటు కష్టాలను కూడా తెచ్చిపెడుతుంది. దంపతుల మధ్య విభేదాలు రావడం, పరిష్కరించుకోవడం నిత్యం జరిగేపనే. అయితే.. మధ్యప్రదేశ్‌లోని ఉజ్జెయినిలో ఓ వ్యక్తికి కూడా వివాహ జీవితంలో ఓ క్లిష్టపరిస్థితి ఎదురైంది. మరి ఆ చిక్కుముడిని పరిష్కరించుకున్న తీరు చూస్తే ఆశ్చర్యపోతారు..! మొదటి భార్య ఉండగానే రెండో వివాహం చేసుకున్నాడో వ్యక్తి. రెండో పెళ్లి చేసుకున్నప్పటికీ మొదటి భార్యతో కలిసి జీవించడానికి ఆసక్తితో ఉన్నాడు. రెండు పెళ్లి చేసుకున్నప్పటికీ భర్తను విడిచి పెట్టడానికి మొదటి భార్య అంగీకరించలేదు. తన భర్తతోనే ఉంటానని కోరింది. కానీ ఈ విషయం రెండో భార్యకు నచ్చలేదు. మొదటి భార్యను పదిహేను ఏళ్ల క్రితం వివాహం చేసుకున్నాడు. వారి మధ్య నిరంతరం గొడవలు జరుగుతుండటంతో ఆమె ఉండగానే భర్త రెండో పెళ్లి చేసుకున్నాడు. రెండో పెళ్లి చేసుకున్న తర్వాత తన భర్తను విడిపోవడానికి మొదటి భార్య ఒప్పుకోలేదు. కానీ రెండో భార్య ఇందుకు ఇష్టపడలేదు. దీంతో ఆమె న్యాయపరమైన మార్గాన్ని అనుసరించింది. కేసు నమోదు చేయడంతో ఈ గొడవ పరామర్శ కేంద్రాన్ని చేరింది. వీరికి సమస్యకు ఏం పరిష్కారం ఇవ్వాలో తెలియక అధికారులు తికమకపడ్డారు. ఇక నెలరోజులను చెరో పదిహేను చొప్పున పంపకాలకు అందరూ అంగీకరించడంతో వివాదం ముగిసింది. మరి ఈ రకమైన జీవిత విధానానికి మీరేమంటారు...? ఇదీ చదవండి: తరగతి గదిలోకి చొరబడి.. విద్యార్థుల సాక్షిగా భార్యకు తీన్ తలాక్! -
ఎన్డీయే కూటమిలో చేరిన మరో కీలక పార్టీ..
పాట్నా: 2024 ఎన్నికలు సమీపిస్తున్న వేళ.. దేశంలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. ఇటు ప్రతిపక్ష కూటమి ఏర్పాటు దిశగా పలు ప్రతిపక్ష పార్టీలు సన్నాహాలు చేస్తుండగా.. అటు ఎన్డీయే కూడా తన బలాన్ని పెంచుకునే దిశగా పావులు కదుపుతోంది. ఉత్తరప్రదేశ్‌లో బీసీ సామాజిక వర్గానికి ప్రాతినిథ్యం వహిస్తున్న సుహేల్ దేవ్ భారతీయ సమాజ్ పార్టీ ఎన్డీయేలో కలిసిన మరుసటి రోజే బిహార్‌లో మరో పార్టీ బీజేపీతో చేతులు కలిపింది. చిరాగ్ పాశ్వాన్ నేతృత్వంలోని లోక్ జన్‌శక్తి పార్టీ ఎన్డీయే కూటమిలో చేరింది. బిహార్‌లో చిరాగ్ పాశ్వాన్ లోక్ జన్‌శక్తి పార్టీ ఎన్డీయేలో కలుస్తున్నట్లు తెలిపింది. ఈ మేరకు ఆ పార్టీ అధినేత చిరాగ్ పాశ్వాన్ స్పష్టం చేశారు. ఈ రోజు కేంద్ర హో మంత్రి అమిత్ షా తో జరిగిన సమావేశం అనంతరం ఆయన వెల్లడించారు. ఎన్డీయే కుటుంబంలో చేరుతున్న చిరాగ్ పాశ్వాన్‌ను బీజేపీ చీఫ్ జేపీ నడ్డా స్వాగతం పలికారు. జులై 18న ఎన్డీయే కూటమి ఢిల్లీలో నిర్వహిస్తున్న సమావేశానికి ముందు చిరాగ్ పాశ్వాన్ ఈ నిర్ణయం తీసుకున్నారు. श्री @iChiragPaswan जी से दिल्ली में भेंट हुई। उन्होंने माननीय प्रधानमंत्री श्री @narendramodi जी के नेतृत्व वाले NDA गठबंधन में शामिल होने का निर्णय लिया है। मैं उनका NDA परिवार में स्वागत करता हूँ। pic.twitter.com/vwU67B6w6H — Jagat Prakash Nadda (@JPNadda) July 17, 2023 లోక్ జన్‌శక్తి పార్టీని బిహార్‌లో రామ్ విలాస్ పాశ్వాన్ స్థాపించారు. ఆయన ఆరు సార్లు లోక్ సభ ఎన్నికల్లో విజయం సాధించారు. అనంతరం బీజేపీ కూటమి తరపున రాజ్య సభకు కూడా ఎన్నికయ్యారు. ఇప్పుడు తండ్రి బాటలోనే చిరాగ్ కూడా బీజేపీ కూటమిలో చేరారు. ఇదీ చదవండి: Rajbhar Joins In NDA: ఎస్పీకి దెబ్బ మీద దెబ్బ.. ఎన్డీయే కూటమిలో చేరిన ఎస్బీస్పీ.. -
రూ. 2 లక్షల పరిమితి తొలగింపు
న్యూఢిల్లీ: దేశానికి ఖ్యాతితెచ్చే క్రీడాకారులను తయారుచేసే భారత కోచ్‌లకు కేంద్ర క్రీడా శాఖ శుభ వార్త చెప్పింది. భారతీయ కోచ్‌ల జీతాలను గరిష్టంగా రూ. 2 లక్షలకే పరిమితం చేస్తూ ఇప్పటి వరకు ఉన్న నిబంధనను ఎత్తివేస్తున్నట్లు ప్రకటించింది. స్వదేశీ కోచ్‌లు మరింత మెరుగైన ఫలితాలు రాబట్టేలా ఈ చర్య వారిని ప్రోత్సహిస్తుందని తెలిపింది. కోచింగ్ వైపు భారత మాజీ ఆటగాళ్లను కూడా ఆకర్షించడమే తమ లక్ష్యమని కేంద్ర క్రీడా మంత్రి కిరణ్ రిజిజు పేర్కొన్నారు. ‘చాలా మంది భారత కోచ్‌లు గొప్ప ఫలితాలను అందిస్తున్నారు. వారి కష్టానికి తగిన ప్రతిఫలం దక్కాల్సిందే. మేటి అథ్లెట్లను తయారు చేసేందుకు అత్యుత్తమ కోచ్‌లు కావాలనే మేం కోరుకుంటాం. అలాంటప్పుడు వారికి లభించే ఆర్థిక ప్రయోజనాలపై పరిమితి విధించకూడదని భావిస్తున్నాం. ఇకనుంచి నాలుగేళ్లకుగానూ కోచ్‌లతో కాంట్రాక్టు చేసుకుంటాం’ అని రిజిజు వివరించారు. కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయం పట్ల జాతీయ బ్యాడ్మింటన్ చీఫ్ కోచ్ పుల్లెల గోపీచంద్ హర్షం వ్యక్తం చేశారు. మాజీ అథ్లెట్లు కోచింగ్ వైపు మొగ్గుచూపితే దేశంలో క్రీడల అభివృద్ధి వేగంగా జరుగుతుందని అన్నారు. -
నెల్లూరులో యువ ఓటర్లదే అంతిమ తీర్పు
సాక్షి, నెల్లూరు(పొగతోట): ఈ దఫా జరిగే సార్వత్రిక ఎన్నికల్లో అభ్యర్థుల జయాపజయాలు యువత చేతుల్లో ఉన్నాయి. ఓటు నమోదుకు ఎన్నికల సంఘం కల్పించిన అవకాశాన్ని యువకులు సద్వినియోగం చేసుకున్నారు. జిల్లాలో యువ ఓటర్లు అధికంగా ఉన్నారు. 2019 సార్వత్రిక ఎన్నికల్లో 18 నుంచి 39 ఏళ్ల లోపు నవ..యువతరం ఓట్లు కీలకం కానున్నాయి. యువ ఓట్లు ఎటు వైపు మొగ్గు చూపితే ఆ అభ్యర్థులకు విజయం వరించినట్లే. జిల్లాలో ఓటర్లు 22,06,652 లక్షల మంది ఓటర్లు ఉన్నారు. జిల్లాలో 18 నుంచి 39 ఏళ్ల వయస్సు ఓటర్లు 10,52,397 మంది ఉన్నారు. 40 నుంచి 59 సంవత్సరాల వయస్సు ఓటర్లు 81,7303 మంది ఉన్నారు. జిల్లాలో 80 సంవత్సరాల వయస్సు పైబడిన వారు 27,723 మంది ఉన్నారు. 18 నుంచి 19 సంవత్సరాల వయస్సు ఓటర్లు 27,507 మంది మాత్రమే ఉన్నారు. ఈ నెల 25వ తేదీన తుది ఓటర్ల జాబితా విడుదల చేయనున్నారు. నూతన జాబితాలో సుమారు 1.60 లక్షల ఓటర్లు పెరిగే అవకాశం ఉంది. 2011 జనాభా లెక్కల ప్రకారం జనాభా సంఖ్య 20,63604 మంది ఉన్నారు. 8 ఏళ్లలో జనాభా పెరిగారు. ప్రస్తుతం జిల్లా జనాభా 32 లక్షలకు పైగా ఉన్నారు. -
పప్పు ధాన్యాల ధరలకు కళ్లెం..!
న్యూఢిల్లీ: నింగిని తాకుతున్న పప్పుధాన్యాల ధరలను అదుపు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలకు దిగింది. పప్పుధాన్యాల నిల్వలను భారీ ఎత్తున పెంచాలని ఆర్ధిక వ్యవహారాల కేబినెట్ కమిటీ (సీసీఈఏ) నిర్ణయించింది. ప్రస్తుతం 8 లక్షలుగా ఉన్న బఫర్ స్టాక్ ను 20 లక్షలకు పెంచాలని నిర్ణయించింది. దేశీయ సేకరణ ద్వారా 10 లక్షల టన్నులు, దిగుమతి ద్వారా 10 లక్షల టన్నులను సేకరించనున్నట్టుతెలిపింది. పప్పుధాన్యాల నిల్వలు పెంచితే అది భవిష్యత్తులో ధరలకు కళ్లెం వేయడానికి ఉపయోగపడుతుందని సీసీఈఏ అంచనా వేస్తోంది. కాగా ఈ ఏడాది జూన్ లో సబ్సిడీపై కిలో రూ.120కు విక్రయించేందుకు వీలుగా పప్పుధాన్యాల నిల్వలను 8లక్షల టన్నులకు పెంచిన సంగతి తెలిసిందే. -
ఫేస్బుక్ సర్వాధికారాలు ఆయనకే..
శాన్ఫ్రాన్సిస్కో: సామాజిక మీడియా దిగ్గజం ఫేస్బుక్ యాజమాన్య బాధ్యతలు తిరిగి చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, జుకర్ బర్గ్ కు అప్పజెబుతూ సంస్థ వార్షిక సమావేశం తీర్మానించింది. ఈ మేరకు సోమవారం జరిగిన వార్షిక వాటాదారుల సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. 5.7 బిలియన్ల క్లాస్ సి షేర్ల ను కేటాయిస్తూ షేర్ హోల్డర్ల ఓటింగ్ ద్వారా నిర్ణయించారు. ఈ వోటింగ్ ద్వారా ఫేస్బుక్ వ్యవస్థాపకుని ఆధ్వర్యంలోని కంపెనీగా ఫేస్బుక్ అవతరించింది. సంస్థ పై జకర్బర్గ్ కు పూర్తి నియంత్రణను కల్పించింది. ఫేస్బుక్ అధిపతిగా జుకర్ బర్గ్ ను ఎన్నిక చేస్తూ సమావేశం తీర్మానించింది. దీంతోపాటు అతని భార్య డాక్టర్ ప్రిసిల్లా చాన్ కు కూడా దాతృత్వ ఓటింగ్ నియంత్రణా అధికారాన్ని కల్పించారు. మార్క్ అండర్సెన్ , పీటర్ థీల్ సహా మిగతా కంపెనీ బోర్డు డైరెక్టర్లు, పెట్టుబడిదారులు తిరిగి ఎన్నికున్నారు మరోవైపు ఫార్చూన్ నివేదిక ప్రకారం 3 :1 స్టాక్ స్ప్లిట్ కానుంది. దీని ప్రకారం ప్రస్తుత వాటాదారులు కలిగివున్న క్లాస్ ఎ,బి షేర్లకు గాను రెండు సీక్లాస్ షేర్లను వన్ టైం డివిడెండ్ గా అందిస్తారని తెలిపింది . మరోవైపు సుదీర్ఘ కాలం కంపెనీని నడిపించాలని ఆకాంక్షిస్తున్నట్టు జుకర్ బర్గ్ సమావేశంలో ప్రశ్నోత్తరాల కార్యక్రమంలో వెల్లడించారు. ప్రస్తుతం నాలుగు మిలియన్ల ఎ క్లాస్ షేర్లు, 419 మిలియన్ బి క్లాస్ షేర్లు జుకర్ బర్గ్ సొంతం. ఒక్కో క్లాస్ బి షేర్ విలువ 10 ఓట్లకు సమానం. దీంతో వ్యూహాత్మక నిర్ణయాలలో మెజారిటీ ఓటింగ్ పవర్ ను సొంతం చేసుకున్నట్టయింది. ఫేస్బుక్ ప్రస్తుతం 1.6 బిలియన్ పైగా నెలవారీ యాక్టివ్ యూజర్లను కలిగిఉంది. కాగా ఫేస్ బుక్ వ్యవస్థాపకుడు భవిష్యత్తులో ఏదో ఒక సమయంలో ఆయన బాధ్యతల నుంచి నిష్క్రమిస్తే.. అనే అంచనాల నేపథ్యంలో అమెరికా సెక్యూరిటీ అండ్ ఎక్సేంజ్ దగ్గర ఒక ప్రాక్సీని (ఓటింగ్ ద్వారా ఎన్నుకనే ప్రత్యామ్నాయ ప్రతినిధి) ఫైల్ చేసింది. దీనిపై వాటాదారుల అభిప్రాయాలను వోటింగ్ ద్వారా సేకరించనున్నట్టు తెలిపింది. ఒకవేళ జుకర్‌బర్గ్ ఫేస్బుక్ నుంచి తప్పుకుంటే భవిష్యత్తులో ఫేస్‌బుక్‌కు చీఫ్ అయ్యే వ్యక్తికి ఉండే మేనేజ్మెంట్ అధికారాలు పరిమితం అయిపోకుండా జాగ్రత్త తీసుకోవడం కోసమేనని ఫేస్బుక్ బోర్డు తెలిపిన సంగతి తెలిసిందే.