పాట్నా: 2024 ఎన్నికలు సమీపిస్తున్న వేళ.. దేశంలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. ఇటు ప్రతిపక్ష కూటమి ఏర్పాటు దిశగా పలు ప్రతిపక్ష పార్టీలు సన్నాహాలు చేస్తుండగా.. అటు ఎన్డీయే కూడా తన బలాన్ని పెంచుకునే దిశగా పావులు కదుపుతోంది. ఉత్తరప్రదేశ్‌లో బీసీ సామాజిక వర్గానికి ప్రాతినిథ్యం వహిస్తున్న సుహేల్ దేవ్ భారతీయ సమాజ్ పార్టీ ఎన్డీయేలో కలిసిన మరుసటి రోజే బిహార్‌లో మరో పార్టీ బీజేపీతో చేతులు కలిపింది. చిరాగ్ పాశ్వాన్ నేతృత్వంలోని లోక్ జన్‌శక్తి పార్టీ ఎన్డీయే కూటమిలో చేరింది.
బిహార్‌లో చిరాగ్ పాశ్వాన్ లోక్ జన్‌శక్తి పార్టీ ఎన్డీయేలో కలుస్తున్నట్లు తెలిపింది. ఈ మేరకు ఆ పార్టీ అధినేత చిరాగ్ పాశ్వాన్ స్పష్టం చేశారు. ఈ రోజు కేంద్ర హో మంత్రి అమిత్ షా తో జరిగిన సమావేశం అనంతరం ఆయన వెల్లడించారు. ఎన్డీయే కుటుంబంలో చేరుతున్న చిరాగ్ పాశ్వాన్‌ను బీజేపీ చీఫ్ జేపీ నడ్డా స్వాగతం పలికారు. జులై 18న ఎన్డీయే కూటమి ఢిల్లీలో నిర్వహిస్తున్న సమావేశానికి ముందు చిరాగ్ పాశ్వాన్ ఈ నిర్ణయం తీసుకున్నారు.
श्री @iChiragPaswan जी से दिल्ली में भेंट हुई। उन्होंने माननीय प्रधानमंत्री श्री @narendramodi जी के नेतृत्व वाले NDA गठबंधन में शामिल होने का निर्णय लिया है। मैं उनका NDA परिवार में स्वागत करता हूँ। pic.twitter.com/vwU67B6w6H
— Jagat Prakash Nadda (@JPNadda) July 17, 2023
లోక్ జన్‌శక్తి పార్టీని బిహార్‌లో రామ్ విలాస్ పాశ్వాన్ స్థాపించారు. ఆయన ఆరు సార్లు లోక్ సభ ఎన్నికల్లో విజయం సాధించారు. అనంతరం బీజేపీ కూటమి తరపున రాజ్య సభకు కూడా ఎన్నికయ్యారు. ఇప్పుడు తండ్రి బాటలోనే చిరాగ్ కూడా బీజేపీ కూటమిలో చేరారు.
ఇదీ చదవండి: Rajbhar Joins In NDA: ఎస్పీకి దెబ్బ మీద దెబ్బ.. ఎన్డీయే కూటమిలో చేరిన ఎస్‌బీస్పీ..
Comments
Please login to add a commentAdd a comment