full control
-
Russia-Ukraine war: సుద్జా ఉక్రెయిన్ స్వాదీనం
కీవ్: రష్యా పట్టణం సుద్జాను పూర్తిగా స్వాదీనం చేసుకున్నట్లు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ గురువారం ప్రకటించారు. సుద్జా జనాభా ఐదు వేలుంటుంది. చిన్నదే అయినా సుద్జా సరిహద్దులో రష్యాకు పాలనాకేంద్రంగా ఉంది. పశి్చమ సైబీరియా గ్యాస్ నిక్షేపాల నుంచి సుద్జా మీదుగానే ఉక్రెయిన్‌కు పైపుల ద్వారా గ్యాస్ సరఫరా జరుగుతుంది. యూరోప్‌కు రష్యా గ్యాస్ ఎగుమతుల్లో మూడు శాతం సుద్జా మీదుగానే వెళతాయి. అక్కడ ఉక్రెయిన్ మిలటరీ కమాండర్ కార్యాలయాన్ని ఏర్పాటు చేసినట్లు జెలెన్స్కీ వెల్లడించారు. కస్్కలో వెయ్యి చదరపు కిలోమీటర్ల ప్రాంతం తమ నియంత్రణలో ఉందని, 74 జనావాసాలు, వందలకొద్ది రష్యా యుద్ధఖైదీలు తమ ఆధీనంలో ఉన్నారని ఉక్రెయిన్ బుధవారం ప్రకటించింది. 100 మంది రష్యా సైనికులను బందీలుగా పట్టుకున్నామని ఉక్రెయిన్ చెబుతోంది. -
ఎమ్మెల్సీ ఎన్నికలకు భారీ బందోబస్తు
అనంతపురం సెంట్రల్ : ఎమ్మెల్సీ ఎన్నికలు సజావుగా నిర్వహించడానికి జిల్లా ఎస్పీ రాజశేఖరబాబు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. ఒక అదనపు ఎస్పీతో పాటు 9 మంది డీఎస్పీలు, 21 మంది సీఐలు, 121 మంది ఎస్ఐలు, 483 ఏఎస్ఐలు, హెడ్‌కానిస్టేబుల్స్, 1559 మంది కానిస్టేబుల్స్, 380 మంది హోంగార్డులను బందోబస్తుకు నియమించారు. వీరితో పాటు 5 ప్లటూన్లు ఏర్పాటు చేశారు. ఒక్కో గ్రూపులో 35 మంది నుంచి 40 మంది సిబ్బంది ఉంటూ మొబైల్ స్క్వాడ్ వలే పనిచేయనున్నారు. -
నిమజ్జనానికి పటిష్ట బందోబస్తు
అనంతపురం సెంట్రల్ : గణేశ నిమజ్జనం సందర్భంగా నగరంలో పోలీసులు పటిష్టబందోబస్తు ఏర్పాటు చేశారు. ఐదు రోజుల పాటు పూజలందుకున్న వందలాది గణనాథులను అత్యంత భక్తి్రÔ¶ ద్ధలతో నిమజ్జనానికి తరలించే సమయంలో అపశ్రుతులకు తావులేకుండా చర్యలు చేపట్టారు. నేరుగా పోలీస్‌శాఖ అదనపు ఎస్పీ మాల్యాద్రి ఉదయం నుంచి నగరంలో జరుగుతున్న ఏర్పాట్లు, సాయంత్రం నిమజ్జనానికి తరలుతున్న వినాయకుల తీరును పోలీసు కార్యాలయంలోని ఈ – సర్వలెన్స్ కేంద్రం నుంచి సీసీ కెమెరాల పుటేజీల ద్వారా పరిశీలించారు. ఎప్పటకప్పుడు డీఎస్పీలు, సీఐలు, ఎస్ఐలకు సూచనలు చేశారు. జిల్లా కేంద్రంతో పాటు పరిసర మండలాల నుంచి పోలీసు సిబ్బంది బందోబస్తులో పాల్గొన్నారు. నిమజ్జనానికి వెళ్లే వినాయకుల రథాలకు ఇబ్బందులు కలగకుండా ట్రాఫిక్ డీఎస్పీ నరసింగప్ప చర్యలు చేపట్టారు. బయటి వాహనాలు నగరంలోకి ప్రవేశించకుండా ఎక్కడికక్కడ ఆంక్షలు వి«ధిస్తూ ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా పంపించేశారు. -
ఫేస్బుక్ సర్వాధికారాలు ఆయనకే..
శాన్ఫ్రాన్సిస్కో: సామాజిక మీడియా దిగ్గజం ఫేస్బుక్ యాజమాన్య బాధ్యతలు తిరిగి చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, జుకర్ బర్గ్ కు అప్పజెబుతూ సంస్థ వార్షిక సమావేశం తీర్మానించింది. ఈ మేరకు సోమవారం జరిగిన వార్షిక వాటాదారుల సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. 5.7 బిలియన్ల క్లాస్ సి షేర్ల ను కేటాయిస్తూ షేర్ హోల్డర్ల ఓటింగ్ ద్వారా నిర్ణయించారు. ఈ వోటింగ్ ద్వారా ఫేస్బుక్ వ్యవస్థాపకుని ఆధ్వర్యంలోని కంపెనీగా ఫేస్బుక్ అవతరించింది. సంస్థ పై జకర్బర్గ్ కు పూర్తి నియంత్రణను కల్పించింది. ఫేస్బుక్ అధిపతిగా జుకర్ బర్గ్ ను ఎన్నిక చేస్తూ సమావేశం తీర్మానించింది. దీంతోపాటు అతని భార్య డాక్టర్ ప్రిసిల్లా చాన్ కు కూడా దాతృత్వ ఓటింగ్ నియంత్రణా అధికారాన్ని కల్పించారు. మార్క్ అండర్సెన్ , పీటర్ థీల్ సహా మిగతా కంపెనీ బోర్డు డైరెక్టర్లు, పెట్టుబడిదారులు తిరిగి ఎన్నికున్నారు మరోవైపు ఫార్చూన్ నివేదిక ప్రకారం 3 :1 స్టాక్ స్ప్లిట్ కానుంది. దీని ప్రకారం ప్రస్తుత వాటాదారులు కలిగివున్న క్లాస్ ఎ,బి షేర్లకు గాను రెండు సీక్లాస్ షేర్లను వన్ టైం డివిడెండ్ గా అందిస్తారని తెలిపింది . మరోవైపు సుదీర్ఘ కాలం కంపెనీని నడిపించాలని ఆకాంక్షిస్తున్నట్టు జుకర్ బర్గ్ సమావేశంలో ప్రశ్నోత్తరాల కార్యక్రమంలో వెల్లడించారు. ప్రస్తుతం నాలుగు మిలియన్ల ఎ క్లాస్ షేర్లు, 419 మిలియన్ బి క్లాస్ షేర్లు జుకర్ బర్గ్ సొంతం. ఒక్కో క్లాస్ బి షేర్ విలువ 10 ఓట్లకు సమానం. దీంతో వ్యూహాత్మక నిర్ణయాలలో మెజారిటీ ఓటింగ్ పవర్ ను సొంతం చేసుకున్నట్టయింది. ఫేస్బుక్ ప్రస్తుతం 1.6 బిలియన్ పైగా నెలవారీ యాక్టివ్ యూజర్లను కలిగిఉంది. కాగా ఫేస్ బుక్ వ్యవస్థాపకుడు భవిష్యత్తులో ఏదో ఒక సమయంలో ఆయన బాధ్యతల నుంచి నిష్క్రమిస్తే.. అనే అంచనాల నేపథ్యంలో అమెరికా సెక్యూరిటీ అండ్ ఎక్సేంజ్ దగ్గర ఒక ప్రాక్సీని (ఓటింగ్ ద్వారా ఎన్నుకనే ప్రత్యామ్నాయ ప్రతినిధి) ఫైల్ చేసింది. దీనిపై వాటాదారుల అభిప్రాయాలను వోటింగ్ ద్వారా సేకరించనున్నట్టు తెలిపింది. ఒకవేళ జుకర్‌బర్గ్ ఫేస్బుక్ నుంచి తప్పుకుంటే భవిష్యత్తులో ఫేస్‌బుక్‌కు చీఫ్ అయ్యే వ్యక్తికి ఉండే మేనేజ్మెంట్ అధికారాలు పరిమితం అయిపోకుండా జాగ్రత్త తీసుకోవడం కోసమేనని ఫేస్బుక్ బోర్డు తెలిపిన సంగతి తెలిసిందే.