కీవ్: రష్యా పట్టణం సుద్జాను పూర్తిగా స్వాదీనం చేసుకున్నట్లు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ గురువారం ప్రకటించారు. సుద్జా జనాభా ఐదు వేలుంటుంది. చిన్నదే అయినా సుద్జా సరిహద్దులో రష్యాకు పాలనాకేంద్రంగా ఉంది. పశి్చమ సైబీరియా గ్యాస్ నిక్షేపాల నుంచి సుద్జా మీదుగానే ఉక్రెయిన్‌కు పైపుల ద్వారా గ్యాస్ సరఫరా జరుగుతుంది.
యూరోప్‌కు రష్యా గ్యాస్ ఎగుమతుల్లో మూడు శాతం సుద్జా మీదుగానే వెళతాయి. అక్కడ ఉక్రెయిన్ మిలటరీ కమాండర్ కార్యాలయాన్ని ఏర్పాటు చేసినట్లు జెలెన్‌స్కీ వెల్లడించారు. కస్‌్కలో వెయ్యి చదరపు కిలోమీటర్ల ప్రాంతం తమ నియంత్రణలో ఉందని, 74 జనావాసాలు, వందలకొద్ది రష్యా యుద్ధఖైదీలు తమ ఆధీనంలో ఉన్నారని ఉక్రెయిన్ బుధవారం ప్రకటించింది. 100 మంది రష్యా సైనికులను బందీలుగా పట్టుకున్నామని ఉక్రెయిన్ చెబుతోంది.
Comments
Please login to add a commentAdd a comment