నిమజ్జనానికి పటిష్ట బందోబస్తు | full control of ganeshnimajjanam | Sakshi
Sakshi News home page

నిమజ్జనానికి పటిష్ట బందోబస్తు

Published Sat, Sep 10 2016 12:43 AM | Last Updated on Tue, Aug 21 2018 5:54 PM

నిమజ్జనానికి పటిష్ట బందోబస్తు - Sakshi

నిమజ్జనానికి పటిష్ట బందోబస్తు

అనంతపురం సెంట్రల్‌ : గణేశ నిమజ్జనం సందర్భంగా నగరంలో పోలీసులు పటిష్టబందోబస్తు ఏర్పాటు చేశారు. ఐదు రోజుల పాటు పూజలందుకున్న వందలాది గణనాథులను అత్యంత భక్తి్రÔ¶ ద్ధలతో నిమజ్జనానికి తరలించే సమయంలో అపశ్రుతులకు తావులేకుండా చర్యలు చేపట్టారు. నేరుగా పోలీస్‌శాఖ అదనపు ఎస్పీ మాల్యాద్రి ఉదయం నుంచి నగరంలో జరుగుతున్న ఏర్పాట్లు, సాయంత్రం నిమజ్జనానికి తరలుతున్న వినాయకుల తీరును పోలీసు కార్యాలయంలోని ఈ – సర్వలెన్స్‌ కేంద్రం నుంచి సీసీ కెమెరాల పుటేజీల ద్వారా పరిశీలించారు.

ఎప్పటకప్పుడు డీఎస్పీలు, సీఐలు, ఎస్‌ఐలకు సూచనలు చేశారు. జిల్లా కేంద్రంతో పాటు పరిసర మండలాల నుంచి పోలీసు సిబ్బంది బందోబస్తులో పాల్గొన్నారు. నిమజ్జనానికి వెళ్లే వినాయకుల రథాలకు ఇబ్బందులు కలగకుండా ట్రాఫిక్‌ డీఎస్పీ నరసింగప్ప చర్యలు చేపట్టారు. బయటి వాహనాలు నగరంలోకి ప్రవేశించకుండా ఎక్కడికక్కడ ఆంక్షలు వి«ధిస్తూ ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా పంపించేశారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement