పరిశ్రమలకు పంట భూములు ఇవ్వం
-
జీవనాధారమైన పొలాలు లాక్కోవద్దు..
-
విచారణ కోసం వచ్చిన రెవెన్యూ సిబ్బందిని అడ్డుకున్న రైతులు
-
పలు ప్రాంతాల్లో రాస్తారోకో, ధర్నా
సంగెం / గీసుకొండ : పరిశ్రమల పేరుతో తా ము తరతరాలుగా సాగుచేస్తున్న భూములను లాక్కోవద్దని సంగెం మండలంలోని పలు గ్రా మాల రైతులు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు టెక్స్‌టైల్ ఏర్పాటుకు భూములు పరిశీలించేందుకు గురువారం వచ్చిన రెవెన్యూ సిబ్బందిని అడ్డుకున్నారు. గీసుకొండ, సంగెం మండలాల్లో పలు గ్రామాల్లో ఉన్న ప్రభుత్వ భూమి, అసైన్డ్ భూ ములను గతంలో టెక్స్‌టైల్ పార్కు కోసం రెవె న్యూ అధికారులు సర్వే చేశారు. ఇక్కడ 300 ఎకరాల వరకు ప్రభుత్వ భూమి ఉందని గుర్తించి నా.. చివరకు ధర్మసాగర్ మండలం దేవునూరి గుట్టల ప్రాంతంలో టెక్స్‌టైల్ పార్కు ఏర్పాటు కు ప్రభుత్వం నిర్ణయించింది. అయితే, తొలుత గుర్తించిన ప్రభుత్వ భూమితో పాటు రైతుల నుంచి మరో వెయ్యి ఎకరాల భూమి సేకరించి ఇక్కడ టీఎస్–ఐపాస్‌లో భాగంగా తెలంగాణ ప్రభుత్వం ఇండస్ట్రియల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్(టీఎస్‌ఐఐసీ) ద్వారా ఇండస్ట్రియల్ పా ర్క్ ఏర్పాటు చేసే ఆలోచనలో ఉంది. సమీపంలోనే రైల్వేస్టేçÙన్(స్టేçÙన్ చింతల్‌పల్లి) ఉండటం వల్ల రవాణాకు అనుకూలంగా ఉంటుందని ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇందులో భాగంగా రై తుల భూములను పరిశీలించేందుకు రెవెన్యూ ఉద్యోగులు రాగా రైతులు అడ్డుకున్నారు. ఈ మే రకు మండల రెవెన్యూ ఇన్‌స్పెక్టర్లు హరతి, వేణు విఆర్వోలు కృష్ణమూర్తి, సత్యనారాయణ, శ్రీనివాస్, సదయ్య, దేవేందర్‌తో పాటు ముగ్గురు వీఆర్‌ఏలు కృష్ణానగర్, చింతలపల్లి గ్రామాల్లోని భూముల పరిశీలనకు వెళ్లగా రైతు లు కృష్ణానగర్ క్రాస్‌రోడ్ వద్ద, సంగెం–వరంగల్ రహదారిపై రాస్తారోకో నిర్వహించి ఉద్యోగులకు వెనక్కి పంపారు. ఆ తర్వాత ఉద్యోగు లు చింతలపల్లికి రాగా ఇక్కడి రైతులు కూడా సారవంతమైన భూములను పరిశ్రమల కోసం సేకరించడం సరికాదని అభ్యంతరం తెలిపారు. చింతలపల్లి ఎంపీటీసీ మాజీ సభ్యుడు తీగల రవీందర్, దుడ్డె దామోదర్‌తో పాటుగా రైతులు పి.రాజన్న, దుడ్డె వెంకన్న, సాయిలు, నర్సింగరావు, రాజేశ్, శ్రీను, రఘు, బిక్షపతి, వెంకటేశ్వర్లు పాటు వందలాది మంది పాల్గొన్నారు.
ఊకల్–సంగెం రోడ్డుపై..
పరిశ్రమల స్థాపనకు అవసరమైన భూమి కోసం ఉద్యోగులు చేస్తున్న పరిశీలనను రైతులు అడ్డుకున్నారు. మండలంలోని ఊకల్ హవేలీకి ఉద్యోగులు రాగా రైతులు అడ్డుకుని ఊకల్–సంగెం రోడ్డుపై రాస్తారోకో చేశారు. ఎంఆర్‌ఐ భవానీ, వీఆర్వోలు గట్టికొప్పుల రాంబాబు, నాగరాజు, సమ్మయ్యలు ఊకల్ రైతుల వద వివరాలు ఆరా తీయడంతో పాటు భూములు ఇచ్చేందుకు ముందుకొచ్చే రైతులు ఫారం–1 పూర్తి చేసి ఇవ్వాలని కోరారు. దీంతో రైతులు ససేమిరా అనడంతో పాటు ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి, గీసుకొండ తహసీల్దార్ రావాలంటూ నినాదాలు చేశారు. విషయం తెలుసుకున్న గీసుకొండ పోలీసులు రైతులను శాంతింపజేశారు. ఈ విషయమై గీసుకొండ తహసీల్దార్ శ్రీనివాస్‌ను వివరణ కోరగా పరిశ్రమ స్థాపన కోసమే రైతులను భూములు అడగడానికి రెవెన్యూ సిబ్బందిని పంపించామని తెలిపారు. అయితే, భూములు ఇవ్వడానికి నిరాకరిస్తే బలవంతంగా సేకరించడం ఉండదని స్పష్టం చేశారు.