బహుమతులు అందజేస్తున్న ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి
-
ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి
ఏన్కూరు: విద్యార్థులు చదువుతో పాటు క్రీడలపైన ఆసక్తి చూపాలని ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి కోరారు. స్థానిక గురుకుల విద్యాలయంలో ఐదు జిల్లాలస్థాయి గురుకుల విద్యాలయాల జోనల్ క్రీడా పోటీలు ఆదివారం ముగిశాయి. విజేతలకు ఆయన బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా ఎంపీ పొంగులేటి మాట్లాడుతూ..రాష్ట్ర ప్రభుత్వం గురుకుల విద్యాలయాల అభివృద్ధికి నిధులు కేటాయిస్తోందని, కాంట్రాక్ట్ టీచర్ల ఉద్యోగాలు భర్తీ కోసం ముఖ్యమంత్రితో చర్చిస్తానని తెలిపారు. విద్యార్థులు కూడా చదువుతో పాటు క్రీడల్లో రాణించాలని కోరారు. ఎన్సెస్పీ భూములు గురుకుల విద్యాలయానికి కేటాయించాలని, గురుకుల విద్యాలయం ప్రహరీ సమస్య పరిష్కరించాలని గురుకుల విద్యాలయం ప్రిన్సిపాల్ జితేంద్రప్రసాద్ ఎంపీని కోరారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ పూల రవీందర్, గురకుల విద్యాలయం జాయిట్ సెక్రటరీ వెంకటనర్సయ్య, ఏజీఏ వసంతరావు, ఎంపీపీ బాణోతు మాధవి, తహసీల్దార్ చప్పిడి నాగరాజు, ఎంపీడీఓ కె.పాపారాణి, చైర్మ¯ŒS రాంబాబు, ఎంపీటీసీ మేడ ధర్మారావు పాల్గొన్నారు.
మూడు రోజులుగా కొనసాగిన ఐదు జిల్లాల గురుకుల విద్యాలయాల కబడ్డీ, వాలీబాల్, ఖోఖో జోనల్ క్రీడా పోటీలు ఆదివారం ముగిశాయి. కబడ్డీలో ప్రథమ బహుమతిని నందిమేడారం(కరీంనగర్), ద్వితీయ బహుమతిని వేలేరు( వరంగల్), ఖోఖో ప్రథమ బహుమతిని మడ్నూర్(నిజామాబాద్), ద్వితీయ నందిమేడారం(కరీంనగర్), వాలీబాల్‌లో ప్రథమ బండారుపల్లి(వరంగల్), ద్వితీయ వేలేరు (వరంగల్), టెన్నికాయిట్‌లో ప్రథమ వేలేరు( వరంగల్), ద్వితీయ ఏన్కూరు(ఖమ్మం), బ్యాడ్మింట¯ŒS ప్రథమ ఏన్కూరు(ఖమ్మం), ద్వితీయ వేలేర్ (వరంగల్) విద్యార్థులు సాధించారు.