జమ్ములో ఎన్నికల నిర్వహణకు సిద్ధం: కేంద్రం | Article 370 Case: Supreme Court Asks Centre For Timeframe To Restore Jammu And Kashmir Statehood - Sakshi
Sakshi News home page

Article 370 Case: జమ్ములో ఏ క్షణమైనా ఎన్నికల నిర్వహణకు సిద్ధం: కేంద్రం

Published Thu, Aug 31 2023 10:45 AM | Last Updated on Thu, Aug 31 2023 5:03 PM

Centre Give Timeframe For Jammu Kashmir Statehood Updates - Sakshi

ఢిల్లీ:  జమ్ము కశ్మీర్‌ స్వయంప్రతిపత్తికి సంబంధించిన ఆర్టికల్‌ 370 రద్దుకు వ్యతిరేకంగా దాఖలైన పలు పిటిషన్లపై గురువారం సుప్రీంకోర్టులో విచారణ జరుగుతోంది. జమ్ముకు రాష్ట్ర హోదా ఎప్పుడు పునరుద్దరిస్తుందనే అంశంపై ఇవాళ సుప్రీంకు కేంద్రం ఒక స్పష్టత ఇవ్వాల్సి ఉంది. ఈ క్రమంలో వాదనలు వినిస్తున​ కేంద్రం.. అక్కడ ఎన్నికల నిర్వహణకు సిద్ధమని కేంద్రం స్పష్టం చేసింది.

జమ్మూకశ్మీర్‌లో ఎన్నికల నిర్వహణ పూర్తిగా ఎన్నికల సంఘం, రాష్ట్ర ఎన్నికల సంఘం చేతుల్లో ఉందని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా చెప్పారు. మొత్తం మూడు దశల్లో ఎన్నికలు జరగాల్సి ఉందని ధర్మాసనానికి తెలిపారు. పంచాయతీ, మున్సిపల్, అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరగాలని చెప్పారు. అలాగే.. జమ్మూ కశ్మీర్‌కు రాష్ట్ర హోదా కల్పించే అంశానికి కాల వ్యవధిని నిర్ణయించలేమని తుషార్ మెహతా సుప్రీంకోర్టు ధర్మాసనానికి స్పష్టం చేస్తూనే.. కేంద్ర పాలిత ప్రాంతంగా తాత్కాలికమేనని పేర్కొన్నారు.  పూర్తి రాష్ట్రంగా మార్చడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు చెప్పారు. 

జమ్మూ కశ్మీర్‌ని గణనీయమైన స్థాయిలో అభివృద్ధి చేసినట్లు సుప్రీంకోర్టుకు సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా తెలిపారు. కొత్త ప్రాజెక్టులు భారీ స్థాయిలో వస్తున్నాయని చెప్పారు. ఉగ్రవాద చర్యలు 42.5 తగ్గాయని వెల్లడించారు. చొరబాటు ఘటనలు 90.20 శాతం తగ్గాయని తెలిపారు. 2023లోనే ఏకంగా కోటి మంది పర్యటకులు కశ్మీర్‌ లోయను సందర్శించారని పేర్కొన్నారు. 

జమ్మూకశ్మీర్‌కు రాష్ట్ర హోదా కల్పించే అంశంలో కేంద్రం  నేడు కీలక ప్రకటన చేయనుంది. నాలుగేళ్లుగా కేంద్ర పాలిత ప్రాంతంగా ఉన్న జమ్మూకశ్మీర్‌కు ఎప్పుడు రాష్ట్ర హోదా కల్పించనున్నారనే సమాచారాన్ని నేడు సుప్రీంకోర్టుకు నివేదించనుంది.

ఆర్టికల్ 370 రద్దును సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌లపై సుప్రీంకోర్టు విచారణ జరుపుతున్న విషయం తెలిసిందే. మంగళవారం పిటీషనర్ల వాదనలు విన్న తర్వాత సీజేఐ చంద్రచూడ్.. జమ్మూ కశ్మీర్‌లో ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించాలని కేంద్రాన్ని కోరారు. ఈ మేరకు ఎప్పటివరకు ఈ ప్రక్రియను పూర్తి చేస్తారో కూడా తెలపాలని ప్రశ్నించారు.

ఈ క్రమంలో వాదనలు వినిపించిన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా.. జమ్మూ కశ్మీర్‌కు రాష్ట్ర హోదాపై సానుకూల అంశాన్ని గురువారం తెలుపుతామని ధర్మాసనానికి విన్నవించారు. జమ్మూ కశ్మీర్‌ను కేంద్ర పాలిత ప్రాంతంగా తాత్కాలికంగానే ఉంచనున్నామని, లఢక్‌ మాత్రం యూనియన్ టెరిటరీగానే ఉంటుందని కోర్టుకు ఆయన స్పష్టం చేశారు.

జమ్మూ కశ్మీర్‌కు ప్రత్యేక రాష్ట్ర హోదాను కల్పిస్తున్న ఆర్టికల్ 370ని రద్దు చేస్తూ 2019లో కేంద్రం నిర్ణయం తీసుకుంది. ప్రతిపక్ష నాయకులు విమర్శలను పక్కకు పెట్టి ఆ రాష్ట్రాన్ని లఢక్, జమ్మూ కశ్మీర్‌ రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజించింది. ప్రతిపక్షాల ప్రశ్నలకు సమాధానమిస్తూ.. అక్కడ పరిస్థితులు సాధారణ స్థితికి వచ్చాక మళ్లీ రాష్ట్ర హోదా కల్పిస్తామని అప్పట్లో ప్రభుత్వం తెలిపింది.    

ఇదీ చదవండి: రక్షా బంధన్ రోజున ఇలాంటి తీర్పు ఇస్తాననుకోలేదు


 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement