Time Fix
-
జమ్ములో ఎన్నికల నిర్వహణకు సిద్ధం: కేంద్రం
ఢిల్లీ: జమ్ము కశ్మీర్ స్వయంప్రతిపత్తికి సంబంధించిన ఆర్టికల్ 370 రద్దుకు వ్యతిరేకంగా దాఖలైన పలు పిటిషన్లపై గురువారం సుప్రీంకోర్టులో విచారణ జరుగుతోంది. జమ్ముకు రాష్ట్ర హోదా ఎప్పుడు పునరుద్దరిస్తుందనే అంశంపై ఇవాళ సుప్రీంకు కేంద్రం ఒక స్పష్టత ఇవ్వాల్సి ఉంది. ఈ క్రమంలో వాదనలు వినిస్తున కేంద్రం.. అక్కడ ఎన్నికల నిర్వహణకు సిద్ధమని కేంద్రం స్పష్టం చేసింది. జమ్మూకశ్మీర్‌లో ఎన్నికల నిర్వహణ పూర్తిగా ఎన్నికల సంఘం, రాష్ట్ర ఎన్నికల సంఘం చేతుల్లో ఉందని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా చెప్పారు. మొత్తం మూడు దశల్లో ఎన్నికలు జరగాల్సి ఉందని ధర్మాసనానికి తెలిపారు. పంచాయతీ, మున్సిపల్, అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరగాలని చెప్పారు. అలాగే.. జమ్మూ కశ్మీర్‌కు రాష్ట్ర హోదా కల్పించే అంశానికి కాల వ్యవధిని నిర్ణయించలేమని తుషార్ మెహతా సుప్రీంకోర్టు ధర్మాసనానికి స్పష్టం చేస్తూనే.. కేంద్ర పాలిత ప్రాంతంగా తాత్కాలికమేనని పేర్కొన్నారు. పూర్తి రాష్ట్రంగా మార్చడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు చెప్పారు. జమ్మూ కశ్మీర్‌ని గణనీయమైన స్థాయిలో అభివృద్ధి చేసినట్లు సుప్రీంకోర్టుకు సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా తెలిపారు. కొత్త ప్రాజెక్టులు భారీ స్థాయిలో వస్తున్నాయని చెప్పారు. ఉగ్రవాద చర్యలు 42.5 తగ్గాయని వెల్లడించారు. చొరబాటు ఘటనలు 90.20 శాతం తగ్గాయని తెలిపారు. 2023లోనే ఏకంగా కోటి మంది పర్యటకులు కశ్మీర్ లోయను సందర్శించారని పేర్కొన్నారు. Petitions challenging the abrogation of Article 370 in SC | Solicitor General Tushar Mehta, appearing for Centre, tells Supreme Court that it is ready for elections in Jammu and Kashmir at any time now. pic.twitter.com/mhiqqWPBbf — ANI (@ANI) August 31, 2023 జమ్మూకశ్మీర్‌కు రాష్ట్ర హోదా కల్పించే అంశంలో కేంద్రం నేడు కీలక ప్రకటన చేయనుంది. నాలుగేళ్లుగా కేంద్ర పాలిత ప్రాంతంగా ఉన్న జమ్మూకశ్మీర్‌కు ఎప్పుడు రాష్ట్ర హోదా కల్పించనున్నారనే సమాచారాన్ని నేడు సుప్రీంకోర్టుకు నివేదించనుంది. ఆర్టికల్ 370 రద్దును సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు విచారణ జరుపుతున్న విషయం తెలిసిందే. మంగళవారం పిటీషనర్ల వాదనలు విన్న తర్వాత సీజేఐ చంద్రచూడ్.. జమ్మూ కశ్మీర్లో ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించాలని కేంద్రాన్ని కోరారు. ఈ మేరకు ఎప్పటివరకు ఈ ప్రక్రియను పూర్తి చేస్తారో కూడా తెలపాలని ప్రశ్నించారు. #BREAKING Supreme Court asks when the Statehood of Jammu and Kashmir will be restored. Asks when elections will be allowed. Asks SG to get instructions on a definition timeline.#JammuKashmir #Article370 https://t.co/SK9wl5B5Ia — Live Law (@LiveLawIndia) August 29, 2023 ఈ క్రమంలో వాదనలు వినిపించిన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా.. జమ్మూ కశ్మీర్‌కు రాష్ట్ర హోదాపై సానుకూల అంశాన్ని గురువారం తెలుపుతామని ధర్మాసనానికి విన్నవించారు. జమ్మూ కశ్మీర్‌ను కేంద్ర పాలిత ప్రాంతంగా తాత్కాలికంగానే ఉంచనున్నామని, లఢక్ మాత్రం యూనియన్ టెరిటరీగానే ఉంటుందని కోర్టుకు ఆయన స్పష్టం చేశారు. Justice Kaul: suppose you carve out portion of assam into a union territory and also make assam into a UT.. SG: Too extreme an example..... but one state cannot be declared a UT under article 3... but there needs to be separation... CJI: creation of UTs post independence..… — Bar & Bench (@barandbench) August 29, 2023 జమ్మూ కశ్మీర్‌కు ప్రత్యేక రాష్ట్ర హోదాను కల్పిస్తున్న ఆర్టికల్ 370ని రద్దు చేస్తూ 2019లో కేంద్రం నిర్ణయం తీసుకుంది. ప్రతిపక్ష నాయకులు విమర్శలను పక్కకు పెట్టి ఆ రాష్ట్రాన్ని లఢక్, జమ్మూ కశ్మీర్ రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజించింది. ప్రతిపక్షాల ప్రశ్నలకు సమాధానమిస్తూ.. అక్కడ పరిస్థితులు సాధారణ స్థితికి వచ్చాక మళ్లీ రాష్ట్ర హోదా కల్పిస్తామని అప్పట్లో ప్రభుత్వం తెలిపింది. ఇదీ చదవండి: రక్షా బంధన్ రోజున ఇలాంటి తీర్పు ఇస్తాననుకోలేదు -
ఇక ఫేస్బుక్లో టైమ్ మేనేజ్మెంట్
పారిస్: ఫేస్బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ల్లో మీరు ఎక్కువ సమయం గడిపేస్తున్నారని బాధపడుతున్నారా..? ఫేస్బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లకు రోజుకు పరిమిత సమయమే కేటాయించాలని కోరుకునే వారికోసం ఈ రెండు సోషల్ మీడియా సైట్లలో టైమ్ మేనేజ్మెంట్ ఆప్షన్లను ప్రవేశపెట్టనున్నట్లు ఫేస్బుక్ ప్రకటించింది. దీనిలో భాగంగా నోటిఫికేషన్లను పరిమితం చేయడం, ఎంతసేపు ఆయా సైట్లలో గడిపారో తెలుసుకునేలా కొత్త ఆప్షన్లను తీసుకురానున్నట్లు తెలిపింది. దీనికోసం యూజర్లు ముందుగా ఎంత సమయం ఈ సైట్లలో గడపాలనుకుంటున్నారో సమయం ఫిక్స్చేసుకోవాలి. తర్వాత ఫేస్బుక్ నుంచి ఓ అలర్ట్ వస్తుంది. దీంతో యూజర్లు ఈ సైట్లను వదిలి ఇతర పనుల్లో నిమగ్నం అయ్యే అవకాశం ఉంటుందని సంస్థ భావిస్తోంది. అలాగే మొబైల్స్‌కు వచ్చే ఫేస్బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ల నోటిఫి కేషన్లను డీయాక్టివేట్ చేసుకునే ఆప్షన్‌ను ప్రవేశపెట్టనున్నట్లు వెల్లడించింది. -
ముహూర్తాల వెర్రీ... డెలివర్రీ!
సాక్షి, కడప : కాలం మారుతున్న కొద్దీ ట్రెండ్లు మారిపోతున్నాయి. బిడ్డలు నెలలు నిండిన తర్వాత పుట్టడం పాతకాలం.. మూహూర్తం చెప్పిన ప్రకారం పుట్టడం నేటికాలం.. 9 నెలల పాటు అమ్మ కడుపులో గడిపిన బిడ్డను బయటికి తెచ్చే సమయంపై తల్లిదండ్రులు పెడుతున్న శ్రధ్ద అంతా ఇంతా కాదు. శిశువు పుట్టకమునుపే.. పురోహితుల వద్దకు వెళ్లి పంచాం గాలు వెతికి ముహూర్తం ఖరారుచేస్తున్నారు. డెలివరి డేట్‌కు ముందు ఒక నెల నుంచి జాతకాలు.. తిధి.. నక్షత్రం.. రోజు.. రాహుకాలం.. యమగండం..ఘడియలు.. లాంటివి చూసుకుని ఆసుపత్రి వైపు అడుగులు వేస్తున్నారు. ఎందుకంటే గతంలో మాదిరికాకుండా ఇప్పు డు డెలివరీ డేట్ ముందుగానే తెలుస్తుండటంతో ఎక్కువమంది ‘ఒకరోజు’ ఫిక్స్ చేసుకుంటున్నారు. శుభఘడియలను చూసుకుని ఇంట్లో నుంచి బయట పడుతున్నారు. బిడ్డ పుట్టకమునుపే.... మూడు నెలల ముందో వైద్యులు డెలివరీ డేట్ ఇస్తారు. ఎప్పటికప్పుడు బిడ్డ పరిస్థితిని చూస్తూ పలు సూచనలు, సలహాలు ఇస్తూ వస్తుంటారు. ఈ నేపథ్యంలోనే తల్లిదండ్రులు పురోహితుల వద్దకు వెళ్లి సర్వం సిద్ధం చేసుకుంటున్నారు. గతంలో లేకపోయినా ఇటీవల కాలంలో చాలామంది సెంటిమెంట్‌ను ఫాలో అవుతూ వస్తున్నారు. ఇంటి దేవతలకు ఇష్టమైన రోజును ఎంపిక చేసుకుని ఎవరికి వారు ముందుకు వెళుతున్నారు. పుట్టిన మరుక్షణమే ఆస్పత్రి యాజమాన్యం ఇచ్చిన సమయాన్ని తీసుకుని జాతకాన్ని రాయిస్తున్నారు. శుభఘడియల్లో ఆపరేషన్ చేయించినా దోషాలతో బిడ్డ పుట్టినా అందుకు అనుగుణంగా దోష నివారణకు శాంతిపూజలు చేపడుతున్నారు. ఇలా బిడ్డ పుట్టకమునుపు...పుట్టిన తర్వాత తల్లిదండ్రులు, కుటుంబీకులు ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటూ వస్తున్నారు. ముహూర్తాల వెర్రీలో.. : ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రులకు వెళుతున్న వారిలో చాలామంది ముహూర్తాలను చూసుకునే నిర్ణయాలు తీసుకుంటున్నారు. దాదాపు 30 నుంచి 40 శాతం మంది తిథి, ఘడియలు, నక్షత్రాలు చూసుకుని ఆస్పత్రులకు వెళుతున్నట్లు తెలుస్తోంది. అయితే ప్రసవానికి ఇంకా సమయమున్నా ముహూర్తాల వెర్రిలో పడి వారం, పదిరోజుల ముందే ఆపరేషన్‌కు సిద్ధమవడం కరెక్టు కాదని పెద్దలు సూచిస్తున్నారు. ఎందుకంటే బిడ్డ తల్లి కడుపులో తొమ్మిది నెలలు నిండేవరకు ఉంటేనే ఆరోగ్యంగా ఉంటాడన్నది వైద్యుల సూచన. అయితే తల్లిదండ్రుల కోరిక మేరకు...ముహూర్తాలు తర్వాత లేదనో క్రమంతోనే తప్పనిసరి పరిస్థితుల్లో కొందరు వైద్యులు సిజిరేయిన్ చేయాల్సి వస్తోంది. రెండు, మూడు రోజుల వ్యవధిలో చేసినా ఏం కాదుగానీ, పది, పదిహేనురోజుల తేడాతో ఆపరేషన్ చేసి బిడ్డను బయటికి తీస్తే అనేక సమస్యలు ఉత్పన్నమవుతాయని ౖగైనకాలజిస్టులు స్పష్టం చేస్తున్నారు. ముహుర్తాలలో డెలివరీలు శ్రావణమాసం, మాఘమాసం, కార్తీక మాసం, రంజాన్ మాసం, క్రిస్మస్ పండుగ రోజులలో డెలివరీల సందడి కనిపిస్తోంది. మంచి రోజులు వస్తాయంటే ఒకపక్క పెళ్లిళ్ల సందడి ఉండగా, మరోపక్క ఈ శుభముహూర్తాల సమయంలోనే బిడ్డ పుడితే జాతకంతోపాటు భవిష్యత్తు బంగారంగా ఉంటుందని పలువురు దంపతులు భావిస్తున్నారు. మంచిరోజులు ఉన్న సందర్భాలలో గర్భవతులతో ఆస్పత్రులలో కూడా హడావుడి కనిపిస్తోంది. వారం, తిథి, నక్షత్రం చూసుకుంటున్నారు డెలివరీ డేట్‌కు ఒకరోజు అటు, ఇటు ముహూర్తం అడుగుతున్నారు. వారం, తిథి, నక్షత్రం, తారాబలం, లగ్నబలం చూసుకున్న తర్వాతనే ఆపరేషన్ చేయించుకుంటున్నారు. రెండు, మూడు ఏళ్ల కిందట అంతగా లేకపోయినా, ప్రస్తుతం చాలామంది ప్రసవాలకు సంబంధించి ముహూర్తాలు అడుగుతున్నారు. మంచిరోజు చూసుకునే ఆపరేషన్‌కు వెళుతున్న రోజులొచ్చాయి. పూర్వాషాడ నక్షత్రంలో అధిపతి శుక్రుడు, ఉత్తరాషాడ నక్షత్రంలో అధిపతి రవి కాబట్టి ఈ రెండు నక్షత్రాల్లో జన్మించిన అన్ని ఫలితాలు అందుతాయని శాస్త్రంలో ఉంది. మొత్తానికైతే ఎక్కువగా పంచాంగాలు, ముహూర్తాలు చూసుకుని డెలివరీకి వెళుతున్నారు. – పి.రామ్మోహన్‌శర్మ, అర్చకులు, అమరేశ్వరస్వామి ఆలయం, కడప -
శ్రీవారు బహువచనం... స్త్రీల పనులు ఏకవచనం
బయటికెళ్లడానికి ముఖం కడుక్కున్నాక కాస్తంత పౌడర్ పూసుకుని వచ్చేప్పటికి మావారు హడావిడిగా మళ్లీ ఇంటెనక్కు వెళ్తున్నారు. ‘‘ఎక్కడికండీ?’’ అని అడిగా. ‘‘ఇందాకే గడ్డం గీసుకున్నానా... నువ్వు తయారయ్యే లోపు మళ్లీ పెరిగింది. కాస్త మరోసారి షేవింగ్ చేసుకుని వస్తా’’ అని శ్రీవారి జవాబు. ఈ సందర్భంగా నన్ను మరింత ఉడికించడానికి ఆయన మరో జోకు చెప్పారు. ‘‘ఓ మహిళా ఆఫీసర్‌తో ఒక స్త్రీకి అప్పాయింట్మెంట్ టైము ఫిక్సయిందట. సదరు సమయం సాయంత్రం ఆరుగంటలకు అనుకుందాం. ఇక్కడ వాళ్లాయన ఒక ట్రిక్కు ప్లే చేశాట్ట. అసలు టైము గురించి తన భార్యకు చెప్పకుండా సాయంత్రం నాలుగ్గంటలకు అని చెప్పాట్ట. నాలుగ్గంటలకల్లా ఆమె తయారయ్యేలా సకల జాగ్రత్తలు తీసుకుంటూ, ఆమెను అదిలిస్తూ, కదిలిస్తూ, తొందరచేస్తూ ఎలాగోలా ఆరుగంటలకల్లా ఆమె సదరు మహిళాధికారి ఆఫీసులో ఉండేట్టు చూశాట్ట. అప్పటికి ఆ అధికారిణి రాలేదట. సదరు అధికారిణి తీరిగ్గా ఆరున్నరకు వచ్చిందట. ఎలాగైతేనేం... అరగంట ఆలస్యంగానైనా మీటింగు ఫలప్రదంగా ముగిసిందట. తిరుగు ప్రయాణంలో ఆ భార్యగారు వాళ్లాయన మీద చింతనిప్పులు చెరుగుతూ ‘చూశారా... నన్ను తొందరపెడుతూ సరిగ్గా రెడీ కానివ్వలేదు. మీరు నాలుగ్గంటలకంటూ తొందర చేశారుగానీ... ఆమె ఆరున్నరకు వచ్చింది. మీ మాట విని త్వరగా తయారై వచ్చి ఉంటే రెండున్నర గంటలు వెయిట్ చేయాల్సి వచ్చేది కదా’ అందట. దానికా భర్త ‘పిచ్చిదానా... మీరిద్దరూ మాట్లాడుకునే సమయంలో సదరు అధికారిణి భర్తా, నేనూ కూడా మీటింగేసుకున్నాం. ‘అసలు అప్పాయింట్మెంట్ టైమ్ చెప్పకుండా మా ఆవిడకు నాలుగ్గంటలకని చెప్పానండి’ అని నేనంటే... ‘మీరు నయం. ఈ టైమ్ ఫిక్స్ చేస్తూ మా ఆవిడతో ఈ మీటింగ్ మూడింటికి అని చెప్పా’ అంటూ తన గోడు వెళ్లబోసుకున్నాడు’’ అంటూ భార్యలు రెడీ అయ్యే తీరుపై ఓ సెటైరేశారు. ఆయన జోకుల్లో ఒకింత చమత్కారం ఉంటే ఉంటుందేమోగాని... క్రూరత్వం మాత్రం తప్పకుండా నాలుగింతలుంటుంది. ఆడవాళ్లు తయారవ్వడంపైనా, వాళ్ల మేకప్పైనా జోకులేయని మగజీవి ఉంటుందంటే నమ్మడం కష్టం. ఇంతకీ మావారు చేసిందల్లా అలా షేవింగూ, స్నానం మాత్రమే. నేను తయారవ్వడం అనే ప్రక్రియలో చేసిన పనులు... మా బుజ్జిదానికి స్నానం చేయించి, బట్టలు తొడిగి జడలు వేయడం, మా బుజ్జిగాణ్ణి తయారు చేయడం. స్నానమదీ చేసి, మేం రెడీ అయ్యేలోపు పిల్లలిద్దరికీ టిఫిన్లూ, శ్రీవారికి కాఫీ ...ఇలాంటి గట్రా, గట్రా, ఎట్సెట్రా పనులన్నీ ఎన్నెన్నో ఉంటాయి. ఆయన మాత్రం ఆఫీసు పని తప్ప... మరో పని ముట్టరు. చేత్తో చెంచా పట్టరు. ఒకవేళ అన్ని పనులుగానీ ఆయన చేయాల్సి వస్తే దానికి పెట్టుకునే ముద్దు పేరు ‘మల్టీ టాస్కింగ్’. ఇప్పుడంటే ఏదో ఒక పడికట్టుపదం కనిపెట్టారుగానీ... దాన్ని డిస్కవర్ చేయకముందునుంచీ అనాదిగా మహిళలందరూ చేస్తున్న పని అదే. ముద్దుగా చెప్పాలంటే ‘మల్టీ టాస్కింగ్’. శ్రీవారు ఒక్కరే. కానీ ఆయనను ‘వారు’గా గౌరవించి బహువచన రూపంలో సమాజం తరతరాలుగా సంబోధిస్తూ వచ్చింది. నిజానికి మహిళలకు ఎన్నో పనులు. మరెన్నో కార్యాలు. అయినా దాన్నంతా కలిపి ‘ఇంటిపని’గా ఏకవచనంలో అభివర్ణించింది.