అందరికీ ‘సకల’ వేతనం ఇవ్వాలి | give to payscale all people | Sakshi
Sakshi News home page

అందరికీ ‘సకల’ వేతనం ఇవ్వాలి

Published Sun, Jul 31 2016 9:05 PM | Last Updated on Mon, Sep 4 2017 7:13 AM

సమావేశంలో మాట్లాడుతున్న నాయకులు

సమావేశంలో మాట్లాడుతున్న నాయకులు

ౖయెటింక్లయిన్‌కాలనీ : ఎలాంటి కొర్రీలు పెట్టకుండా సకలజనుల సమ్మె వేతనాలు అత్యవసర సిబ్బందితో సహా అందరికీ ఇవ్వాలని హెచ్‌ఎంఎస్‌ ఆర్జీ–2 ఉపాధ్యక్షుడు నాచగోని దశరథంగౌడ్‌ డిమాండ్‌ చేశారు. స్థానిక ప్రెస్‌భవన్‌లో ఆదివారం మాట్లాడారు. సకలజనుల సమ్మె వేతనాల్లో సకల కొర్రీలు పెట్టి ఇచ్చేందుకు యాజమాన్యం కుట్రపన్నుతోందని దీన్ని అడ్డుకోవాల్సిన బాధ్యత గుర్తింపు యూనియన్‌పై ఉందన్నారు. తామే ఇప్పిచ్చామని పేర్కొంటున్న గుర్తింపు సంఘం నాయకులు కొర్రీలకు వారే బాధ్యత వహిస్తారా అని ప్రశ్నించారు. ఇప్పటికై గుర్తింపు సంఘం బాధ్యతాయుతంగా ముందుకు సాగి సకలజనుల సమ్మె వేతనాలు అందరికీ వర్తింపజేసేలా చూడాలని కోరారు. లేని పక్షంలో ప్రాతినిధ్య సంఘాలను కలుపుకుని ముందుకు వెళ్లి అందరికీ న్యాయం జరిగేలా చూడాలన్నారు. ఏదిఏమైనా ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో కీలకపాత్ర వహించిన సింగరేణి కార్మికులకు సకలజనుల సమ్మెవేతనాలు చెల్లించడం సంతోషకరమన్నారు. కొంత ఆలస్యమైనా ముఖ్యమంత్రి ఇచ్చిన మాట నిలబెట్టుకున్నందుకు కృతజ్ఞతలు తెలిపారు. సమావేశంలో జమీల్, ప్రతాప్‌రావు, వీరస్వామి, సోమయాజులు తదితరులు పాల్గొన్నారు. 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement