తిర‘కాసు’ వేతనం  | Revised Payscale Was Granted Without The Approval Of The Governing Body And VC In SK University | Sakshi
Sakshi News home page

తిర‘కాసు’ వేతనం 

Published Sun, Jul 5 2020 7:27 AM | Last Updated on Sun, Jul 5 2020 7:49 AM

Revised Payscale Was Granted Without The Approval Of The Governing Body And VC In SK University - Sakshi

అనంతపురం విద్య: కీలకమైన పదవిలో ఉన్న ఓ రిజిస్ట్రార్‌ బాధ్యాతారాహిత్యంగా వ్యవహరించి  అడ్డంగా దొరికిపోయారు. ఆశ్రిత పక్షపాతంతో అడ్డగోలుగా ఆదేశాలు జారీ చేశారు. అయిన వారికి అందినకాడికి దోచుకునే అవకాశం కల్పించారు. అనుమతులు లేకపోయినా.. ఉన్నట్లు సృష్టించి భారీగా లబ్ధి చేకూర్చారు. ఏకంగా రివైజ్డ్‌ పేస్కేల్‌ మంజూరయ్యేలా తతంగం నడిపించడం గమనార్హం. 

జీఓ ఏం చెబుతోందంటే..
గతేడాది ఫిబ్రవరి 13న రాష్ట్ర ప్రభుత్వం జీఓ నెంబర్‌ 14ను జారీ చేసింది. ఇందులో అర్హులైన వారికి రివైజ్డ్‌ పేస్కేల్‌–2016 మంజూరు చేయాలని పేర్కొంది.  
మార్చి 20, 2019న ఎస్కేయూ పాలకమండలి సమావేశం(నెంబర్‌–163) జరిగింది. ఇందులో ఏ–4 అంశంగా ఆర్‌.పీ.ఎస్‌–2016ను ఎజెండాగా పేర్కొన్నారు. అయితే కేవలం ప్రొఫెసర్లు, అసోసియేట్, అసిస్టెంట్‌ ప్రొఫెసర్లు, లైబ్రేరియన్లు, ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌ విభాగంలో పనిచేసే డైరెక్టర్లకు మాత్రమే ఆర్‌పీఎస్‌ వర్తిస్తుందని పాలకమండలి తీర్మానం చేసింది.  

ఏం చేశారంటే..
ఏప్రిల్‌ 16, 2019లో అప్పటి ఎస్కేయూ వీసీ ప్రొఫెసర్‌ రహంతుల్లా ఆడిట్‌కు సిఫార్సు చేశారు.  
మే 5, 2019లో ఆడిట్‌ నివేదికకు అనుగుణంగా వీసీ ప్రొసీడింగ్స్‌ ఇచ్చారు. కేవలం ప్రొఫెసర్లు, అసోసియేట్, అసిస్టెంట్‌ ప్రొఫెసర్లు, లైబ్రేరియన్లు, ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌ డైరెక్టర్లకు ఆర్‌పీసీ వర్తిస్తుందని.. వెంటనే మంజూరు చేయమని రిజి్రస్టార్‌కు ఆదేశాలు ఇచ్చారు.  
ఏప్రిల్‌ 16, 2019లో వైస్‌ ఛాన్స్‌లర్‌ ప్రొసీడింగ్స్‌ లేకుండా, నేరుగా రిజి్రస్టార్‌.. అసిస్టెంట్‌ స్టాటిస్టికల్‌ ఆఫీసర్‌కు లబ్ధి చేకూరేలా ఉత్తర్వులు జారీ చేశారు. 

శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయంలో పనిచేస్తున్న అసిస్టెంట్‌ స్టాటిస్టికల్‌ ఆఫీసర్, తాజా మాజీ రిజి్రస్టార్‌ వ్యవహార శైలి మొదటి నుంచీ వివాదాస్పదమే. గత ప్రభుత్వ హయాంలో అసిస్టెంట్‌ స్టాటిస్టికల్‌ ఆఫీసర్‌కు రెండింతల పదోన్నతులను అక్రమంగా కట్టబెట్టారు. ఇందులోనూ నిబంధనలను పక్కనపెట్టడం చర్చనీయాంశమవుతోంది. ఇంతటితో ఆగకుండా ఏకంగా రివైజ్డ్‌ పేస్కేలు(2016)ను ఎవరి అనుమతి లేకుండానే మాజీ రిజిస్ట్రార్‌ మంజూరు చేశారు. వాస్తవానికి రివైజ్డ్‌ పేస్కేల్‌కు అసిస్టెంట్‌ స్టాటిస్టికల్‌ ఆఫీసర్‌ అనర్హుడు. పాలకమండలిలో ఆమోదం పొందలేదు.. వైస్‌ ఛాన్స్‌లర్‌  ప్రొసీడింగ్స్‌ ఇవ్వలేదు.. అయినప్పటికీ ఫైలు మీద రిజి్రస్టార్‌ సంతకం పెట్టి ఎస్టాబ్లిష్‌మెంట్‌ సెక్షన్‌కు అనుమతులు ఇచ్చేశారు. అనుకున్నదే తడవుగా ఎస్టాబ్లి‹Ùమెంట్‌ అప్పటి డిప్యూటీ రిజి్రస్టార్‌ రాజభక్తిని ప్రదర్శించి రివైజ్డ్‌ పేస్కేలు మంజూరు చేశారు. 

బయటపడిందిలా.. 
వాస్తవానికి ఎలాంటి ఉత్తర్వు అయినా వీసీ ప్రొసీడింగ్స్‌ లేకుండా రిజి్రస్టార్‌ ఉత్తర్వులు ఇవ్వడానికి వీల్లేదు. వీసీ ప్రొసీడింగ్స్‌ లేకపోయినా ఉత్తర్వులు ఇవ్వడం చట్టరీత్యా నేరమని నిబంధనలు స్పష్టం చేస్తున్నాయి. అలా ఇచ్చే ఉత్తర్వులు చెల్లవు. 
వీసీ ప్రొసీడింగ్స్‌ ఉన్నాయా? లేవా? అని ఎస్టాబ్లిష్‌మెంట్‌ డిప్యూటీ రిజిస్ట్రార్, అసిస్టెంట్‌ రిజి్రస్టార్, సూపరింటెండెంట్‌ క్షుణ్ణంగా పరిశీలించాలి. కానీ ఉద్దేశపూర్వకంగానే ఆర్‌పీఎస్‌–2016ను మంజూరు చేసినట్లు స్పష్టమవుతోంది.  
గతేడాది మే చివర్లో నూతన ప్రభుత్వం ఏర్పడటంతో.. జూలైలో ఇంక్రిమెంట్‌కు దరఖాస్తు చేసుకుంటే తతంగం బయటపడుతుందనే ఉద్దేశంతో దరఖాస్తు చేసుకోలేదని తెలుస్తోంది.  
తాజాగా ఈ ఏడాది జూన్‌ 24న ఇంక్రిమెంట్‌కు దరఖాస్తు చేసుకున్న సమయంలో ఎస్టాబ్లిష్‌మెంట్‌ విభాగం పరిశీలించడంతో వెలుగులోకి వచ్చింది. 

చర్యలు తప్పవు 
నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే చర్యలు తప్పవు. వీసీ ప్రొసీడింగ్స్‌ లేకుండా ఆర్‌పీసీ మంజూరు చేసిన విషయం నా దృష్టికి రాలేదు. ఎస్టాబ్లిష్‌మెంట్‌ విభాగం నుంచి రికార్డులు తెప్పించుకుని పరిశీలిస్తాం. అక్రమాలు వీసీ దృష్టికి తీసుకెళ్లి ఆయన ఆదేశాల మేరకు చర్యలు తీసుకుంటాం.  
– ప్రొఫెసర్‌ ఎ.మల్లిఖార్జున రెడ్డి,  రిజిస్ట్రార్‌, ఎస్కేయూ   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement