sk university
-
ఏపీ లాసెట్‌లో 91.39% ఉత్తీర్ణత
అనంతపురం: రాష్ట్రంలో న్యాయ విద్య డిగ్రీ, పీజీ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించిన ఏపీలాసెట్–2020 ఫలితాల్లో 91.39 శాతం ఉత్తీర్ణత నమోదైంది. ఏపీలాసెట్ ఫలితాలను శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం వీసీ చాంబర్లో రెక్టార్ ప్రొఫెసర్ కృష్ణనాయక్, ఏపీలాసెట్ కన్వీనర్ ప్రొఫెసర్ జ్యోతి విజయకుమార్‌లు గురువారం వెల్లడించారు. అక్టోబర్ 1న ఏపీ లాసెట్ ప్రవేశ పరీక్ష జరుగగా, కోవిడ్ పాజిటివ్ వచ్చిన అభ్యర్థులకు అక్టోబర్ 31న ప్రత్యేకంగా ఏపీ లాసెట్ నిర్వహించారు. అక్టోబర్ 3న ప్రిలిమినరీ కీ విడుదల చేశారు. ఇందులో వచ్చిన అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకుని మూడేళ్ల ఎల్ఎల్బీ ప్రవేశ పరీక్షకు 3 మార్కులు, ఐదేళ్ల ఎల్ఎల్బీ ప్రవేశ పరీక్షకు 1 మార్కు, రెండేళ్ల పీజీ లా కోర్సు ప్రవేశ పరీక్షకు 2 మార్కులు చొప్పున కలిపారు. మొత్తం 18,371 మంది దరఖాస్తు చేయగా, 12,284 మంది పరీక్ష రాశారు. వీరిలో 11,226 మంది (91.39%) అర్హత సాధించారు. అభ్యర్థులు htt p;//rche.ap.gov.in/LAWCET వెబ్సైట్లో తమ ఫలితాలను, ర్యాంకు కార్డులను డౌన్లోడ్ చేసుకోవచ్చు. మూడేళ్ల ఎల్ఎల్బీ ప్రవేశ పరీక్షలో టాపర్స్.. 1) టి.రవీంద్రబాబు (కృష్ణా జిల్లా), 2) కేశమ్ వేణు (ప్రకాశం), 3) అప్పానంద (తూర్పుగోదావరి), 4) పవన్‌కుమార్ (గుంటూరు), 5) జూటూరు దివ్యశ్రీ (అనంతపురం), 6) ఉప్పర సాగర్ (కర్నూలు), 7) పి.నరేంద్ర (కర్నూలు), 8) విజయలక్ష్మి.టి (కృష్ణా), 9) బల్లా ప్రసాదరావు (శ్రీకాకుళం), 10) విజయ్‌కిరణ్ (కృష్ణా) ఐదేళ్ల ఎల్ఎల్బీ ప్రవేశ పరీక్షలో టాపర్స్.. 1) ఆర్.నాగశ్రీ (తెలంగాణ), 2) వి.వీణ (చిత్తూరు), 3) కేజీ కార్తికేయ్ (నెల్లూరు) 4) రాజశ్రీరెడ్డి (తూర్పుగోదావరి) 5) చక్రధర్‌రెడ్డి (కర్నూలు) ఎల్ఎల్ఎం ప్రవేశపరీక్ష టాపర్స్ వీరే.. 1) డి.రవిచంద్ర (తూర్పుగోదావరి), 2) అహల్య చలసాని (కృష్ణా), 3) ఎం.హరికృష్ణ (శ్రీకాకుళం), 4) పి.రచన (చిత్తూరు) 5)యు.తోషిత (కృష్ణా) ఫలితాల కోసం చూడండి.. http://sakshieducation.com/ -
తిర‘కాసు’ వేతనం
అనంతపురం విద్య: కీలకమైన పదవిలో ఉన్న ఓ రిజిస్ట్రార్ బాధ్యాతారాహిత్యంగా వ్యవహరించి అడ్డంగా దొరికిపోయారు. ఆశ్రిత పక్షపాతంతో అడ్డగోలుగా ఆదేశాలు జారీ చేశారు. అయిన వారికి అందినకాడికి దోచుకునే అవకాశం కల్పించారు. అనుమతులు లేకపోయినా.. ఉన్నట్లు సృష్టించి భారీగా లబ్ధి చేకూర్చారు. ఏకంగా రివైజ్డ్ పేస్కేల్ మంజూరయ్యేలా తతంగం నడిపించడం గమనార్హం. జీఓ ఏం చెబుతోందంటే.. ►గతేడాది ఫిబ్రవరి 13న రాష్ట్ర ప్రభుత్వం జీఓ నెంబర్ 14ను జారీ చేసింది. ఇందులో అర్హులైన వారికి రివైజ్డ్ పేస్కేల్–2016 మంజూరు చేయాలని పేర్కొంది. ►మార్చి 20, 2019న ఎస్కేయూ పాలకమండలి సమావేశం(నెంబర్–163) జరిగింది. ఇందులో ఏ–4 అంశంగా ఆర్.పీ.ఎస్–2016ను ఎజెండాగా పేర్కొన్నారు. అయితే కేవలం ప్రొఫెసర్లు, అసోసియేట్, అసిస్టెంట్ ప్రొఫెసర్లు, లైబ్రేరియన్లు, ఫిజికల్ ఎడ్యుకేషన్ విభాగంలో పనిచేసే డైరెక్టర్లకు మాత్రమే ఆర్పీఎస్ వర్తిస్తుందని పాలకమండలి తీర్మానం చేసింది. ఏం చేశారంటే.. ►ఏప్రిల్ 16, 2019లో అప్పటి ఎస్కేయూ వీసీ ప్రొఫెసర్ రహంతుల్లా ఆడిట్‌కు సిఫార్సు చేశారు. ►మే 5, 2019లో ఆడిట్ నివేదికకు అనుగుణంగా వీసీ ప్రొసీడింగ్స్ ఇచ్చారు. కేవలం ప్రొఫెసర్లు, అసోసియేట్, అసిస్టెంట్ ప్రొఫెసర్లు, లైబ్రేరియన్లు, ఫిజికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్లకు ఆర్పీసీ వర్తిస్తుందని.. వెంటనే మంజూరు చేయమని రిజి్రస్టార్‌కు ఆదేశాలు ఇచ్చారు. ►ఏప్రిల్ 16, 2019లో వైస్ ఛాన్స్లర్ ప్రొసీడింగ్స్ లేకుండా, నేరుగా రిజి్రస్టార్.. అసిస్టెంట్ స్టాటిస్టికల్ ఆఫీసర్‌కు లబ్ధి చేకూరేలా ఉత్తర్వులు జారీ చేశారు. శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయంలో పనిచేస్తున్న అసిస్టెంట్ స్టాటిస్టికల్ ఆఫీసర్, తాజా మాజీ రిజి్రస్టార్ వ్యవహార శైలి మొదటి నుంచీ వివాదాస్పదమే. గత ప్రభుత్వ హయాంలో అసిస్టెంట్ స్టాటిస్టికల్ ఆఫీసర్‌కు రెండింతల పదోన్నతులను అక్రమంగా కట్టబెట్టారు. ఇందులోనూ నిబంధనలను పక్కనపెట్టడం చర్చనీయాంశమవుతోంది. ఇంతటితో ఆగకుండా ఏకంగా రివైజ్డ్ పేస్కేలు(2016)ను ఎవరి అనుమతి లేకుండానే మాజీ రిజిస్ట్రార్ మంజూరు చేశారు. వాస్తవానికి రివైజ్డ్ పేస్కేల్‌కు అసిస్టెంట్ స్టాటిస్టికల్ ఆఫీసర్ అనర్హుడు. పాలకమండలిలో ఆమోదం పొందలేదు.. వైస్ ఛాన్స్లర్ ప్రొసీడింగ్స్ ఇవ్వలేదు.. అయినప్పటికీ ఫైలు మీద రిజి్రస్టార్ సంతకం పెట్టి ఎస్టాబ్లిష్మెంట్ సెక్షన్‌కు అనుమతులు ఇచ్చేశారు. అనుకున్నదే తడవుగా ఎస్టాబ్లి‹Ùమెంట్ అప్పటి డిప్యూటీ రిజి్రస్టార్ రాజభక్తిని ప్రదర్శించి రివైజ్డ్ పేస్కేలు మంజూరు చేశారు. బయటపడిందిలా.. ►వాస్తవానికి ఎలాంటి ఉత్తర్వు అయినా వీసీ ప్రొసీడింగ్స్ లేకుండా రిజి్రస్టార్ ఉత్తర్వులు ఇవ్వడానికి వీల్లేదు. వీసీ ప్రొసీడింగ్స్ లేకపోయినా ఉత్తర్వులు ఇవ్వడం చట్టరీత్యా నేరమని నిబంధనలు స్పష్టం చేస్తున్నాయి. అలా ఇచ్చే ఉత్తర్వులు చెల్లవు. ►వీసీ ప్రొసీడింగ్స్ ఉన్నాయా? లేవా? అని ఎస్టాబ్లిష్మెంట్ డిప్యూటీ రిజిస్ట్రార్, అసిస్టెంట్ రిజి్రస్టార్, సూపరింటెండెంట్ క్షుణ్ణంగా పరిశీలించాలి. కానీ ఉద్దేశపూర్వకంగానే ఆర్పీఎస్–2016ను మంజూరు చేసినట్లు స్పష్టమవుతోంది. ►గతేడాది మే చివర్లో నూతన ప్రభుత్వం ఏర్పడటంతో.. జూలైలో ఇంక్రిమెంట్‌కు దరఖాస్తు చేసుకుంటే తతంగం బయటపడుతుందనే ఉద్దేశంతో దరఖాస్తు చేసుకోలేదని తెలుస్తోంది. ►తాజాగా ఈ ఏడాది జూన్ 24న ఇంక్రిమెంట్‌కు దరఖాస్తు చేసుకున్న సమయంలో ఎస్టాబ్లిష్మెంట్ విభాగం పరిశీలించడంతో వెలుగులోకి వచ్చింది. చర్యలు తప్పవు నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే చర్యలు తప్పవు. వీసీ ప్రొసీడింగ్స్ లేకుండా ఆర్పీసీ మంజూరు చేసిన విషయం నా దృష్టికి రాలేదు. ఎస్టాబ్లిష్మెంట్ విభాగం నుంచి రికార్డులు తెప్పించుకుని పరిశీలిస్తాం. అక్రమాలు వీసీ దృష్టికి తీసుకెళ్లి ఆయన ఆదేశాల మేరకు చర్యలు తీసుకుంటాం. – ప్రొఫెసర్ ఎ.మల్లిఖార్జున రెడ్డి, రిజిస్ట్రార్, ఎస్కేయూ -
'బినామి ఆస్తులు కాపాడాలనేది బాబు తాపత్రయం'
సాక్షి, అనంతపురం : అధికార వికేంద్రీకరణ సదస్సు ఎస్కే యునివర్సిటీలోని భువనవిజయం ఆడిటోరియంలో బుధవారం ఘనంగా జరిగింది. ఈ సెమినార్‌కు విద్యార్థి,విద్యార్థినులు భారీగా హాజరై అధికార వికేంద్రీకరణకు జైకొట్టారు. అధికార వికేంద్రీకరణ ద్వారానే అభివృద్ధి సాధ్యమవుతుందని పలువురు ప్రొఫెసర్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి హాజరైన ఏపీ కార్పొరేషన్ చైర్మన్,ఎమ్మెల్యే జక్కంపూడి రాజా మాట్లాడుతూ... రాష్ట్ర విభజన వల్ల ఏపీ చాలా నష్టపోయిందని పేర్కొన్నారు. బినామి ఆస్తులు కాపాడుకునేందుకు చంద్రబాబు తాపత్రయమని దుయ్యబట్టారు. అమరావతిలో మాత్రమే లక్షల కోట్ల పెట్టుబడులు పెట్టి, అభివృద్ధి ఒకే చోట జరగాలంటే ఎలా అని విమర్శించారు. ప్రస్తుతం ఉన్న దృష్యా ఏపీకి మూడు రాజధారుల అవసరం ఎంతో ఉందని, అధికార వికేంద్రీకరణ ద్వారా సమగ్ర అభివృద్ధి జరగుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. అమ్మ ఒడి,రైతు భరోసా పథకాలు చారిత్రాత్మకం అని తెలిపారు.(చంద్రబాబు ఇప్పటికైనా కళ్లు తెరవాలి..) ఏపీలోని 13 జిల్లాలను అభివృద్ధి చేయాలన్నదే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సంకల్పమని రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్‌రెడ్డి పేర్కొన్నారు. లక్షకోట్ల రూపాయలతో అమరావతి నిర్మాణం అవసరమా అని, అభివృద్ధి ఒకచోట జరిగితే మిగిలిన ప్రాంతాలు ఏంకావాలని ఆయన ప్రశ్నించారు. పరిపాలన వికేంద్రీకరణ ద్వారానే అభివృద్ధి సాధ్యం అవుతుందని ప్రకాశ్ రెడ్డి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ వెన్నపూస గోపాల్ రెడ్డి, ఏపీ పాఠశాల విద్య కమిషన్ సీఈఓ ఆలూరు సాంబశివారెడ్డి, వైఎస్సార్ సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మహాలక్ష్మి శ్రీనివాస్, విద్యార్థి సంఘాల నేతలు లింగారెడ్డి, రాధాకృష్ణ తదితరులు పాల్గొన్నారు. -
ఎస్కేయూకు భ'రూసా'
గత ఎన్నికల్లో గెలవడమే పరమావధిగా భావించిన చంద్రబాబు అధికారాన్ని పూర్తిగా దుర్వినియోగం చేశారు. ప్రచారం హోరెత్తించేందుకు నిధులన్నీ ఇష్టానుసారం మళ్లించారు. చివరకు ఎస్కేయూలో సౌకర్యాల కల్పన, కోర్సుల బలోపేతానికి ‘రూసా’ పథకం కింద కేంద్రం ఇచ్చే నిధులనూ వర్సిటీకి పంపకుండా దారిమళ్లించారు. ఖర్చు చేసిన వాటికి లెక్కలు చెప్పాలని ‘రూసా’ అధికారులు కోరగా.. ఖర్చే చేయలేదంటూ మాటమార్చారు. దీంతో సకాలంలో వినియోగించని రూ.15 కోట్లు వెనక్కుపంపాలని అధికారులు ఆదేశాలు జారీ చేయగా.. ప్రస్తుత సర్కారు గడువు పెంచేలా ‘రూసా’ అధికారులతో చర్చలు జరిపి సఫలమైంది. దీంతో రూసా పథకం అమలుకు ఏర్పడిన గ్రహణం తొలగింది. – ఎస్కేయూ ఉన్నత విద్యాసంస్థల్లో మౌలిక సదుపాయాల కల్పన, సౌకర్యాలు, కోర్సులను బలోపేతం చేయడానికి తగిన వనరుల సమీకరణకు రాష్ట్రీయ ఉచ్ఛతార్ శిక్షా అభియాన్(రూసా) పథకం భారీ స్థాయిలో నిధులను మంజూరు చేస్తోంది. న్యాక్(నేషనల్ అసెస్మెంట్ అండ్ అక్రిడిటేషన్ కౌన్సిల్) ఏ–గ్రేడ్ గుర్తింపు ఉన్న వర్సిటీకి రూ.100 కోట్లు, బీ–గ్రేడ్ గుర్తింపు ఉన్న వర్సిటీకి రూ.20 కోట్లు చొప్పున మంజూరు చేస్తోంది. ఈ నేపథ్యంలో న్యాక్ బీ–గ్రేడ్ దక్కించుకున్న ఎస్కేయూకు రూ.20 కోట్ల నిధులు మంజూరుకు మార్గం ఏర్పడింది. తొలి విడతలో 2016 ఫిబ్రవరి నాటికే రూ.10 కోట్ల నిధులను కేంద్రం రూసా రాష్ట్ర ప్రాజెక్ట్ ఆఫీసర్‌కు పంపగా.. ఆ నిధులను అప్పటి టీడీపీ ప్రభుత్వం ఇతర పథకాలకు వినియోగించింది. అనంతరం మరో రూ.5 కోట్లు విడుదల చేయగా వాటిని కూడా ఇతర పథకాలకు మళ్లించారు. అయితే ఖర్చు చేసిన నిధులకు యుటిలైజేషన్ సర్టిఫికెట్లు(యూసీ) పంపాలని గత ప్రభుత్వానికి రూసా అధికారులు లేఖరాశారు. దీంతో 2018 జూలైలో హడావుడిగా వినియోగించిన నిధులను రూ.15 కోట్లను ఎస్కేయూ ఖాతాకు పంపించారు. ఈ క్రమంలో నాలుగు నెలల వ్యవధిలో ఆ నిధులను ఖర్చు పెట్టలేని పరిస్థితి నెలకొనగా.. సకాలంలో ఖర్చు చేయని నిధులను వెనక్కి పంపాలని రూసా పథకం ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. తాజా సర్కార్ విన్నపంతో గడువు పెంపు రూసా పథకం నిధులు ఒక్కసారి వెనక్కి పంపితే...తిరిగి ఏటా అందవు. కరువు జిల్లాలోని వర్సిటీకి నిధుల లభ్యతకు ఇబ్బంది ఏర్పడుతుంది. దీన్ని గుర్తించిన వైఎస్సార్ సీపీ ప్రభుత్వం, ఎస్కేయూ ఉన్నతాధికారులతో మాట్లాడి గతంలో జరిగిన తప్పిదాన్ని ‘రూసా’ ఉన్నతాధికారులకు వివరించింది. కాస్త సమయం ఇవ్వాలని కోరింది. దీంతో అక్కడి అధికారులు 2020 ఆగస్టులోపు రూ.15 కోట్ల నిధులను వినియోగించి యూసీలు పంపితే .. మరో రూ. 5 కోట్ల నిధులు మంజూరు చేస్తామని ఎస్కేయూ ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చారు. ఈ నిధులన్నీ ఖర్చు చేసి వసతులు, కోర్సుల బలోపేతానికి చర్యలు తీసుకుంటే వర్సిటీకి న్యాక్–ఏ గ్రేడ్ కూడా వచ్చే అవకాశం ఉంది. అదే జరిగితే మరో రూ.100 కోట్ల నిధులు మంజూరు కానున్నాయి. వెసులుబాటు కల్పించారు వాస్తవానికి ఆగస్టు 2018లోపు ‘రూసా’ పథకం నిధులను పూర్తిగా ఖర్చు చేయాల్సి ఉంది. అయితే రాష్ట్ర ప్రాజెక్ట్ ఆఫీసర్ ఖాతా నుంచి ఎస్కేయూ ఖాతాకు నిధులు జమ కావడంలో జాప్యం జరిగింది. ఈ అంశాన్ని కేంద్ర రూసా పథకం అధికారులకు స్పష్టంగా వివరించారు. దీంతో నిధుల వినియోగానికి సంబంధించి వెసులుబాటు కల్పించారు. 2020 ఆగస్టులోపు నిధులను వినియోగించి యూసీలు పంపాలని సూచించారు. – ప్రొఫెసర్ ఎండీ బావయ్య, రూసా పథకం కోఆర్డినేటర్, ఎస్కేయూ -
అనంత యాస్కే యూనివర్సిటీలో ఉద్రిక్తత
-
దూరవిద్య పరీక్షల్లో మాస్ కాపీయింగ్
– ఎస్కే దూర విద్య పరీక్షలు ప్రారంభం – సెంటర్ రద్దు అయినా మారని నిర్వాహకుల తీరు – పరీక్షల పేరుతో విద్యార్థుల నుంచి వసూళ్లు – చీటిలు పెట్టి పరీక్షలు రాస్తున్న విద్యార్థులు – పత్తాలేని పర్యవేక్షణ అధికారి? కర్నూలు సిటీ: శ్రీకృష్ణదేవరాయల యూనివర్సిటీ దూర విద్య పరీక్షల్లో జోరుగా మాస్ కాపీయింగ్ జరుగుతోంది. సోమవారం నుంచి ఎస్కే దూర విద్య డిగ్రీ పరీక్షలు నగరంలోని గాయత్రి ఎస్టేట్‌లో ఉన్న ఓ కాలేజీలో పరీక్షలు నిర్వహించారు. యూనివర్సిటీ అధికారి పరీక్ష కేందంలో ఉండి పర్యవేక్షించాల్సి ఉన్నా పరీక్ష మొదలు అయ్యే సమయంలో మాత్రమే ఉండి మధ్యలోనే వెళ్లిపోయినట్లు తెలుస్తోంది. దూర విద్య కేంద్రాల నిర్వాహకులు.. కొందరు విద్యార్థులకు చీటిలు ఇవ్వగా, మరి కొందరు విద్యార్థులు పాత పుస్తకాలు చింపుకొని వెంట తెచ్చుకున్నట్లు సమాచారం. ప్రైవేట్, ప్రభుత్వ ఉద్యోగులు, పదోన్నతుల కోసం, గృహిణులు, నిరుద్యోగులు విద్యార్హత కోసమే అధిక శాతం దూర విద్య ద్వారా డిగ్రీ చదువుతున్నారు. వీరి అవసరాలను ఆసరాగా చేసుకొని నిర్వాహకులు విద్యార్థుల నుంచి రూ.1000 నుంచి రూ.1500 వరకు వసూలు చేసినట్లు తెలిసింది. దూర విద్య కేంద్రాల ద్వారా చదువుతున్న వారి నుంచి యూనివర్సిటీ నిర్ణయించిన ఫీజులు మాత్రమే వసూలు చేయాలి. సెలవు రోజుల్లో తరగతులు నిర్వహించి, సకాలంలో మెటీరియల్ అందజేయాల్సి ఉంది. అయితే యూనివర్సిటీ అధికారులు రెండేళ్లుగా పుస్తకాలను సరఫరా చేయకపోవడంతో నిర్వాహకులకు కలిసి వస్తోంది. దీన్నో అవకాశంగా తీసుకొని పరీక్షలను చూచి రాయిస్తామని విద్యార్థుల నుంచి వసూళ్లు చేస్తున్నారు. చూచిరాతలు జరుగుతుండడంతో గతంలో సెంటర్‌గా ఉన్న కాలేజీని రద్దు చేశారు. అయినా నిర్వాహకుల తీరు మారకపోవడం గమనార్హం. చిట్టీలు పెట్టి పరీక్షలు! శ్రీకృష్ణదేవరాయల యూనివర్సిటీ దూర విద్య పరీక్షల్లో ఏడాదికేడాది చూచిరాతల జోరు పెరుగుతున్నా నియంత్రించ లేకపోతున్నారు. సాధారణంగా దూర విద్య అంటే సెలవు రోజుల్లో క్లాస్‌లు నిర్వహించి, రికార్డులు, సైన్స్ విద్యార్థులకు ల్యాబ్‌లో ప్రాక్టికల్ చేయించాలి. పరీక్షలకు నాలుగు నెలల ముందుగానే కోర్సు మెటీరియల్ ఇవ్వాలి. రెండేళ్లుగా యూనివర్సిటీ అధికారులు ఆదాయంపై ఉన్న ధ్యాస విద్యార్థులకు ఇవ్వాల్సిన మెటీరియల్, క్లాస్‌లు, ల్యాబ్‌పై పెట్టక పోవడం కూడా మాస్ కాపీయింగ్‌కు కారణమనే విమర్శలున్నాయి. ఒకరు తరువాత.. ఇన్విజిలేటర్ సోమవారం ప్రశ్నపత్రం ఇచ్చాక విద్యార్థులు సమాధానాలు చిటీలను చూసి ఒకరు తరువాత ఒకరు రాశారు. పరీక్షల పర్యవేక్షణకు మాత్రం యూనివర్సిటీ నుంచి వచ్చే వారిని నిర్వాహకులు ముందుగానే తమకు అనుకూలమైన వారిని డ్యూటీలో వేయించుకున్నట్లు సమాచారం. అందుకు వచ్చిన అధికారి కాసేపు ఉండి వెళ్లిపోయినట్లు తెలుస్తోంది. ఈ ఏడాది జనవరి నెలలో జరిగిన డిగ్రీ, పీజీ దూర విద్య పరీక్షల్లో కాపీయింగ్ జరిగినట్లు యూనివర్సిటీ అధికారుల విచారణలో తెలడంతో సెంటర్‌ను రద్దు చేశారు. అయితే గాయత్రి ఎస్టేట్‌లోని కాలేజీలో పరీక్షలను నిర్వహించేందుకు మరో వ్యక్తి సెంటర్‌కు అనుమతి ఇవ్వడంతో అక్కడ పరీక్షలు నిర్వహిస్తున్నారు. కాలేజీలోకి ఎవరూ రాకుండా గేట్లు వేసి, మూడు, నాల్గో ఫ్లోర్లో పరీక్షలు నిర్వహించారు. -
ఎన్నాళ్లీ నిరీక్షణ?
– జనవరిలో ముగిసిన దూరవిద్య పరీక్షలు – ఫలితాల విడుదలలో జాప్యం – ఐసెట్ కౌన్సెలింగ్‌కు ఎదురుకానున్న ఇబ్బందులు ఎస్కేయూ : వర్సిటీ దూరవిద్య విధానం ద్వారా వివిధ కోర్సులు అభ్యసిస్తున్న విద్యార్థులు ఫలితాల కోసం నిరీక్షిస్తున్నారు. బీఏ, బీకాం, బీఎస్సీ రెండు, మూడో సంవత్సరం పరీక్షలు సంక్రాంతి పండుగ ముగిసిన వెంటనే జనవరిలో నిర్వహించారు. నెల రోజుల్లో ఫలితాలు విడుదల చేస్తామని పరీక్షల విభాగం అధికారులు ప్రకటించినప్పటికీ ఆ విధంగా చర్యలు తీసుకోలేదు. ఎదురుచూపు.. డిగ్రీ కోర్సులకు సంబంధించి రెండు, మూడు సంవత్సరాల పరీక్షలు రెండు తెలుగు రాష్ట్రాల్లో 30 వేల మంది రాశారు. ఇప్పటికే ఐసెట్ ఫలితాలు విడుదలయ్యాయి. ఐసెట్ ద్వారా ఎంబీఏ, ఎంసీఏ ప్రవేశాలు కల్పిస్తారు. ఇందుకు సంబంధించిన కౌన్సెలింగ్ షెడ్యూల్ ఖరారు అయింది. మరో వైపు వర్సిటీలలో ప్రవేశాలకు నిర్వహించే కామన్ ఎంట్రెన్స్ పరీక్షలు జరగుతున్నాయి. ఎస్కేయూ క్యాంపస్ కళాశాలలు, అనుబంధ పీజీ కళాశాలల్లో ప్రవేశాలకు నిర్వహించే స్కూసెట్–2017 ఈ నెల 29 నుంచి ప్రారంభం కానున్నాయి. పరీక్షలు ముగిసిన రెండు రోజులకే ఆయా వర్సిటీలు కామన్ ఎంట్రెన్స్ పరీక్షలు ఫలితాలు విడుదల చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో డిగ్రీ ఫలితాలు విడుదల కాకపోవడంతో విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. అకడమిక్ క్యాలెండర్ ఇయర్ గాడిలో పడేనా? రెగ్యులర్ కోర్సులకు నిర్వహించినట్లే పరీక్షల నిర్వహణ, మూల్యాంకనం, ఫలితాల ప్రకటన దూరవిద్య విధానలంలో కూడా అమలు చేయాలని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అకడమిక్ క్యాలెండర్ ఇయర్ గాడిలో పడితేనే విద్యార్థులకు విద్యాసంవత్సరం వృథా కాదని చెబుతున్నారు. త్వరలో డిగ్రీ ఫలితాలు ప్రకటిస్తాం.. ఐసెట్ కౌన్సెలింగ్‌లోపే దూరవిద్య డిగ్రీ ఫలితాలను ప్రకటిస్తాం. ఇప్పటికే మూల్యాంకనం ప్రక్రియ పూర్తి అయింది. మార్కుల నమోదును పూర్తి చేయాలని సిబ్బందిని ఆదేశించాం. రెగ్యులర్ డిగ్రీ ఫైనలియర్ ఫలితాలు ఈ నెల 30 లోపు విడుదల చేయనున్నాం. విద్యార్థులెవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. సకాలంలోనే సర్టిఫికెట్లు జారీ చేస్తాం. – జే.శ్రీరాములు, ఎవాల్యుయేషన్స్ డైరెక్టర్, ఎస్కేయూ. -
ఎస్కేయూకు ఎక్కిళ్లు
- వర్సిటీలో తీవ్ర నీటిఎద్దడి - రోజుకు 10 లక్షల లీటర్లు అవసరం - సరఫరా అవుతోంది 2 లక్షల లీటర్లే -ల్యాబ్‌లు, చెట్లు, ఇతరత్రా వాటికి నీరు బంద్ ఎస్కేయూ : శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయంలో తీవ్ర నీటి ఎద్దడి నెలకొంది. గతంలో ఎన్నడూలేని విధంగా సమస్య ఉధృతరూపం దాల్చింది. ఎలా గట్టెక్కాలోనని వర్సిటీ యంత్రాంగం ఆందోళన చెందుతోంది. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపడంలో రాష్ట్ర ప్రభుత్వం, జిల్లా ఉన్నతాధికారులు విఫలమవుతున్నారు. ఫలితంగా వేలాది మంది విద్యార్థులు, వర్సిటీ ఉద్యోగులు అవస్థ పడుతున్నారు. వర్సిటీకి రోజూ పది లక్షల లీటర్ల నీరు అవసరం. ప్రస్తుతం రెండు లక్షల లీటర్లు మాత్రమే సరఫరా అవుతోంది. ప్రధాన వనరులుగా ఉన్న పండమేరు వంకలోని మూడు బోరుబావులు అడుగంటిపోయాయి. సత్యసాయి పథకం ద్వారా రోజూ మూడు లక్షల లీటర్ల నీరు ఇచ్చేవారు. వేసవి కారణంగా ఈ పథకానికి నీటి లభ్యత తగ్గిపోయింది. దీంతో వర్సిటీకి సరఫరా చేయడం లేదు. ప్రస్తుతం మహిళా వసతిగృహంలో ఉండే మూడు బోరుబావులు, చిత్రావతి హాస్టల్ వద్ద ఉండే ఒక బోరుబావి ద్వారా నీటిని సరఫరా చేస్తున్నారు. ఐదింట ఒక వంతు మాత్రమే అందుతుండటంతో పరిస్థితి దయనీయంగా మారింది. ట్యాంకర్లతో సరఫరా నీటి ఎద్దడిని కొద్దిమేరకైనా గట్టెక్కే ఉద్దేశంతో వారం నుంచి ట్యాంకర్లతో సరఫరా చేస్తున్నారు. అత్యవసర విభాగాలు తప్ప తక్కిన వాటికి బంద్ చేశారు. పరీక్షలు పూర్తయిన వెంటనే విద్యార్థులందరూ హాస్టళ్లు ఖాళీ చేయాలని ఆదేశాలు జారీ చేశారు. పరిశోధక విద్యార్థులకు సైతం ఈ ఆదేశాలివ్వడం గమనార్హం. ఉద్యోగ నివాస సముదాయాలకు రెండు, మూడు రోజులకోసారి నీరు సరఫరా చేస్తున్నారు. పడకేసిన పరిశోధన వర్సిటీ ప్రతిష్ట జాతీయ స్థాయిలో పెరగాలంటే సైన్స్ విభాగాల్లో పరిశోధనలే గీటురాయి. అయితే..ల్యాబ్స్‌కు కూడా నీటిని సరఫరా చేయలేని పరిస్థితి ఉత్పన్నమైంది. వర్సిటీ ప్రాంగణంలోని చెట్లకు నీటి సరఫరా పూర్తిగా బంద్ చేయడంతో అవి ఎండిపోతున్నాయి. నీటి ఎద్దడిని శాశ్వతంగా అధిగమించడానికి పెన్నహోబిలం బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ (పీఏబీఆర్) నుంచి ప్రత్యేక పైపులైన్ వేయాలని ఎస్కేయూ యాజమాన్యం పలుమార్లు జిల్లా ఉన్నతాధికారులకు విన్నవించింది. ప్రస్తుతం పీఏబీఆర్ నీరు కలెక్టరేట్ ఎదురుగా ఉన్న సమ్మర్ స్టోరేజీ ట్యాంకుకు వస్తోంది. అక్కడి నుంచి వర్సిటీకి సమీపంలోని పూలకుంట గ్రామం వరకు నీరు సరఫరా చేయడానికి కొత్తగా పైప్‌లైన్ వేస్తున్నారు. దాన్ని కాస్త వర్సిటీ వరకు పొడిగిస్తే సమస్య శాశ్వతంగా తీరుతుంది. ఇటీవల నిర్వహించిన ‘నీరు – ప్రగతి’ కార్యక్రమంలో వర్సిటీలో నీటి ఎద్దడి గురించి వైస్ ఛాన్సలర్ ఆచార్య కె.రాజగోపాల్ నేరుగా సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లారు. అయినా ఎలాంటి హామీ లభించలేదు. ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై దృష్టి వర్సిటీ బోరుబావుల్లో ఆశించినంత నీరు లభించడంలేదు. పండమేరు వంకలో ఉన్న బోరుబావులు అడుగంటిపోయాయి. దీంతో ట్యాంకర్ల ద్వారా సరఫరా చేస్తున్నాం. సమస్యను అధిగమించడానికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై దృష్టి పెట్టాం. –వి.మధుసూదన్ రెడ్డి, సూపరింటెండెంట్ ఇంజినీర్ , ఎస్కేయూ -
భోజనంలో బల్లి!
ఎస్కేయూలో క్యాంటిన్లో ఘటన –ఐదుగురు విద్యార్థులు, ఇద్దరు ఉద్యోగులు ఆసుపత్రిలో చేరిక –కామన్ మెస్‌కు తాళం వేసి ఆందోళన చేసిన విద్యార్థులు ఎస్కేయూ : శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయంలోని కామన్మెస్లో ఆదివారం మధ్యాహ్నం భోజనంలో బల్లిపడి విషతుల్యం కావడంతో ఐదుగురు విద్యార్థులు, ఇద్దరు ఉద్యోగులు అస్వస్థతకు గురయ్యారు. భోజనం చేసిన అరగంటలోపే వాంతులు, వీరేచనాలు కావడంతో బాధితులను హుటాహుటీన అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఒక విద్యార్థికి ఆరోగ్య పరిస్థితి అదుపులోకి రాకపోవడంతో ప్రైవేటు ఆసుపత్రికి తరలించి మెరుగైన వైద్యం చేస్తున్నారు. గ్రూప్–3 రాత పరీక్షతో తప్పిన ముప్పు కామన్ మెస్‌కు 1,070 మంది విద్యార్థులు హాజరుకావాల్సి ఉంది. ఆదివారం గ్రూప్–3 రాతపరీక్ష జరగడంతో కేవలం ఐదుగురు మాత్రమే మెస్‌కు హాజరయ్యారు. వీరితో పాటు సహపంక్తిలో భోజనం చేసిన ఇద్దరు ఉద్యోగులు (మెస్ వర్కర్లు) అస్వస్థకు లోనయ్యారు. దీంతో హరికృష్ణ యాదవ్, అనిల్ కుమార్ , గంగరాజు, మద్దయ్య, బాలముని (విద్యార్థులు), ఆంజినేయులు, అమర్నాథ్ (ఉద్యోగులు/వర్కర్లు) మొత్తం భోజనం చేసిన వారంతా అనారోగ్యం పాలయ్యారు. మెస్‌కు తాళం వేసి ఆందోళన : ఆహారం తిన్న విద్యార్థుల పరిస్థితి ఆందోళనకరంగా మారడంతో , అప్పటికే పరీక్ష రాసి వర్సిటీకి చేరుకున్న విద్యార్థులు కామన్మెస్కు తాళం వేసి ఆందోళన నిర్వహించారు. నాసిరకమైన ఆహారం అందించడం నిత్యకృత్యంగా మారిందని విద్యార్థులు ఆరోపించారు. పరామర్శ : అస్వస్థతకు గురైన విద్యార్థులను, ఉద్యోగులను పలువురు ప్రముఖులు పరామర్శించారు. ఉరవకొండ ఎమ్మెల్యే వై. విశ్వేశ్వరరెడ్డి, రాప్తాడు నియోజకవర్గ వైఎస్సార్సీపీ రాప్తాడు నియోజకవర్గ సమన్వయకర్త తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి, వైఎస్సార్సీపీ పార్టీ క్రమశిక్షణ సంఘం సభ్యుడు ఎర్రిస్వామి రెడ్డి, పార్టీ నాయకులు చవ్వా రాజశేఖర్ రెడ్డి విద్యార్థుల ఆరోగ్య పరిస్థితిని ఆరా తీశారు. ఇలాంటి ఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలని వర్సిటీ ఉన్నతాధికారులను సూచించారు. వైఎస్సార్ విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు బండి పరుశురాం, నరేంద్ర రెడ్డి, భానుప్రకాష్ రెడ్డి, జయచంద్రా రెడ్డి, ఆకుల రాఘవేంద్ర రెడ్డి ,బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర కార్యదర్శి జయపాల్ యాదవ్ తదితురులు కూడా బాధితుల ఆరోగ్య పరిస్థితిని ఆరా తీశారు. అంతకుముందు చికిత్స తీసుకుంటున్న వారిని రిజిస్ట్రార్ ఆచార్య కే.సుధాకర్ బాబు, వార్డెన్ హుస్సేన్ రెడ్డి, ప్రిన్సిపాల్ సీఎన్ కృష్ణానాయక్ పరామర్శించారు. నలుగురు ఉద్యోగుల సస్పెన్షన్: ఆదివారం జరిగిన ఘటనలో బాధ్యులైన నలుగురు ఉద్యోగులపై సస్పెన్షన్ వేటు వేసినట్లు వీసీ ఆచార్య కే.రాజగోపాల్ ‘ సాక్షి’కి తెలిపారు. ఘటనకు బాధ్యులైన కె.ఉజ్జినయ్య, ఎం. జయప్ప, బి.నాగరాజు, కె.రామాంజినేయులను సస్పెండ్ చేసినట్లు వెల్లడించారు. విద్యార్థుల సౌకర్యాలు మెరుగుపరిచేందుకు పటిష్టమైన చర్యలు తీసుకుంటామన్నారు. వార్డెన్, డిప్యూటీ వార్డెన్ నివేదిక అనుగుణంగా ఉద్యోగులపై తక్షణ చర్యలు తీసుకున్నామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆరా వర్సిటీలో ఆదివారం వెలుగులోకి వచ్చిన ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం ఆరా తీసింది. ఈ మేరకు జిల్లా కలెక్టర్ కార్యాలయం నుంచి ఎస్కేయూ రిజిస్ట్రార్ కార్యాలయానికి ఆదివారం సాయంత్రం ఓ లేఖ పంపారు. ఘటనపై సమగ్ర వివరాలు అందజేయాలని కోరారు. -
ఉన్నత విద్య దూరం
- 2016 - 17 విద్యాసంవత్సరం నోటిఫికేషన్ విడుదలపై మీనమేషాలు - గాడితప్పిన అకడమిక్ క్యాలెండర్ ఎస్కేయూ : శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం దూరవిద్య విభాగం యూజీ, పీజీ కోర్సుల పరీక్షలు, ఫలితాల ప్రకటన సమయానుగుణంగా లేకపోవడంతో విద్యార్థులు ఆందోళన చెందతున్నారు. పీజీ కోర్సు కాలవ్యవధి రెండేళ్లయినప్పటికీ సకాలంలో పరీక్షలు నిర్వహించకపోవడంతో కోర్సు పూర్తి కావడానికి మూడేళ్లు పడుతోంది. 34వేల మంది విద్యార్థులకు తప్పని నిరీక్షణ 2015 - 16 విద్యాసంవత్సరానికి సంబంధించి యూజీ, పీజీ మొదటి సంవత్సరం పరీక్షలు ఇప్పటిదాకా నిర్వహించలేదు. 2016 ఆగస్టులోగా పరీక్షలు పూర్తి కావాల్సి ఉన్పప్పటికీ కాలయాపన చేస్తున్నారనే విమర్శలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. బీఏ, బీకాం, బీఎస్సీ, ఎంఏ, ఎంకామ్, ఎమ్మెస్సీ కోర్సుల్లో 34వేల మంది విద్యార్థులు మొదటి సంవత్సరం చదువుతున్నారు. వారికి ఇప్పటికీ ఫస్టియర్ పరీక్షలే పెట్టలేదు. కనీసం ఎప్పుడుంటాయనే విషయంపైనా ఎస్కేయూ అధికారులు స్పష్టమైన ప్రకటన చేయకలేదు. దీంతో విద్యార్థుల్లో ఆందోళన నెలకొంది. నూతన నోటిఫికేషన్ ఎప్పుడో..! ఎస్కేయూకు సింహభాగం ఆదాయం దూరవిద్య విభాగం ద్వారానే వస్తోంది. ఏటా రూ.10 కోట్ల నుంచి రూ.12 కోట్ల వరకు ఆదాయం సమకూరుతోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందించే నిధుల మీద ఆధారపడకుండా స్వతహాగా ఆదాయం చేకూర్చుకునే మార్గాలలో దూరవిద్య ప్రధానమైనది. పొరుగు వర్సిటీలు దీనిని కీలకమైన విభాగంగా పరిగణించి ఆర్థిక సంస్కరణలకు శ్రీకారం చుట్టారు. ఫలితంగా గణనీయమైన ఆదాయం వస్తోంది. గత నాలుగు విద్యాసంవత్సరాల్లోనూ వర్సిటీకి నిధుల పరంగా దూరవిద్య ప్రధానపాత్ర పోషించింది. కానీ అకడమిక్ క్యాలెండర్ క్రమంగా గాఢి తప్పడంతో విద్యార్థులకూ, వర్సిటీకి నష్టం వాటిల్లుతోందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. 2016 - 17 విద్యాసంవత్సరానికి సంబంధించిన నోటిఫికేషన్ ఇంతవరకు విడుదల కాలేదు. -
నేటి నుంచి రీసెట్
ఎస్కేయూ : కృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం రీసెట్ (రీసెర్చ్ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్–2016)ను శుక్రవారం నుంచి నిర్వహించనున్నారు. ఎంఫిల్, పీహెచ్డీ కోర్సుల్లో నిర్వహించే రాత పరీక్షలు ఆదివారం ముగియనున్నాయి. తొలిసారిగా ఆన్లైన్ విధానంలో ప్రవేశ పరీక్షలు జరుపుతున్నారు. ఎస్కేయూ ఇంజినీరింగ్ కళాశాల, ఎస్కేయూ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్, అనంతలక్ష్మి ఇంజినీరింగ్ కళాశాల మూడు పరీక్ష కేంద్రాలను నిర్ధారించారు. మొత్తం 2,500 మంది విద్యార్థులు రాత పరీక్షకు దరఖాస్తు చేసుకొన్నట్లు రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ డీన్ చింతా సుధాకర్ తెలిపారు. పరీక్ష కేంద్రానికి అభ్యర్థులు అరగంట ముందే చేరుకోవాలని సూచించారు. మొత్తం 90 నిమిషాల్లో 100 ప్రశ్నలకు జవాబు ఇవ్వాల్సి ఉంటుందన్నారు. -
ఎస్కేయూకు అరుదైన గుర్తింపు
- రాష్ట్రంలో 3వ ర్యాంకు –జాతీయ స్థాయిలో 96వ ర్యాంకు, ఎస్కేయూ : శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయంకు అరుదైన గుర్తింపు దక్కింది. కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి ప్రకాష్ జవదేకర్ శాస్త్రి భవన్లో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ర్యాంకింగ్ ప్రేమ్ వర్క్ (ఎన్ఐఆర్ఎఫ్) ర్యాంకులను సోమవారం ప్రకటించారు. ఎస్కేయూకు జాతీయ స్థాయిలో 96వ ర్యాంకు, రాష్ట్రంలో 3వ ర్యాంకు దక్కింది. ఎస్వీ యూనివర్సిటీ, ఆంధ్రా వర్సిటీల తరువాత స్ధానం ఎస్కేయూ దక్కించుకోవడం గమనార్హం. ఉన్నత ప్రమాణాలు గల అధ్యాపకులు.. ఉన్నత విద్య ప్రమాణాలు గల అధ్యాపకులు ఎస్కేయూలో పనిచేస్తున్నట్లు ఎన్ఐఆర్ఎఫ్ ప్రకటించింది. పీహెచ్డీ అవార్డు గల 130 మంది అసిస్టెంట్, అసోసియేట్, ప్రొఫెసర్లు పనిచేస్తున్నారు. మొత్తం 171 మంది అధ్యాపకులు ఉన్నారు. ఇందులో 36 మంది మహిళా అధ్యాపకులు ఉన్నారు. 2015–16 విద్యాసంవత్సరంలో డిగ్రీ పూర్తిచేసిన 31 మంది, పీజీ పూర్తిచేసిన 26 మంది విద్యార్థులు , పీహెచ్డీ పూర్తి చేసిన 89 మంది విద్యార్థులు విదేశాల్లో ఉన్నత విద్య అవకాశం కలిగింది. 2015–16 విద్యాసంవత్సరంలో 182 మంది ఎస్సీ, ఎస్టీ , ఓబీసీ కేటగిరి విద్యార్థులు పీహెచ్డీ పూర్తిచేశారు. 187 అంతర్జాతీయ జర్నల్స్, 37 సైటేషన్స్ ఎస్కేయూ అధ్యాపకులు కలిగి ఉన్నారని ఎన్ఐఆర్ఎఫ్ తన అధికార వెబ్సైట్లో పేర్కొంది. సైన్స్ విభాగాల పురోగతితోనే గుర్తింపు.. ఎస్కేయూలో కెమిస్ట్రి, ఫిజిక్స్, బోటనీ, జువాలజీ, బయెటెక్నాలజీ, బయోకెమిస్ట్రి,, సెరికల్చర్ విభాగాల్లో జరుగుతున్న పరిశోధనల ఫలితంగానే జాతీయ స్థాయి గుర్తింపు రావడానికి ఆస్కారం ఏర్పడింది. కెమిస్ట్రి, విభాగంలో అంతర్జాతీయ జర్నల్స్, సైటేషన్స్ ఎక్కువగా ఉన్నాయి. ఫిజిక్స్‌లో ప్రతిష్టాత్మక ఇస్రో ప్రాజెక్టును నిర్వహిస్తున్నారు. 10 సంవత్సరాలుగా విశేషమైన ఫలితాలను ఈ ప్రాజెక్టులు పొందుతున్నాయి. బయోటెక్నాలజీలో డాక్టర్ డి.మురళీధర్ రావు పరిశోధనలకు పేటెంట్ దక్కింది. బోటనీ విభాగంలో అరుదైన మొక్కజాతి మనుగడపై విశేష పరిశోధనలు జరుగుతున్నాయి. బయెకెమిస్ట్రి,లో రామన్రీసెర్చ్ ఫెలోషిప్‌కు డాక్టర్ నరేంద్ర మద్దు ఎంపికయ్యారు. సీఎస్ఐఆర్, డీబీటీ తదితర ప్రాజెక్టుల ద్వారా ఆవిష్కరణలు జరుగుతున్నాయి. ------------------------------ నాణ్యమైన పరిశోధనలతోనే గుర్తింపు.. ప్రామాణికమైన, నాణ్యమైన పరిశోధనలతోనే ఎస్కేయూకు జాతీయ స్థాయి గుర్తింపు వచ్చింది. జాతీయ స్థాయిలో నాణ్యమైన విద్యను అందించే వర్సిటీలో 100లోపు మార్క్ చేరుకోగలిగాం. – కే.రాజగోపాల్, వీసీ, ఎస్కేయూ. --------------------------- సమష్టి సహకారంతోనే: బోధన, బోధనేతర, సాధారణ విద్యార్థులు, పరిశోధక విద్యార్థుల సమష్టి సహకారంతోనే జాతీయ స్థాయి గుర్తింపు వచ్చింది. భవిష్యత్తులో ఉన్నత విద్య, పరిశోధన, విస్తరణ, తదితర అంశాల్లో గణనీయమైన ప్రగతి సాధించడానికి కృషి చేస్తాం. తొలిసారిగా రాష్ట్రంలో మూడవ స్థానం రావడం గర్వకారణం . – కే.సుధాకర్ బాబు, రిజిస్ట్రార్, ఎస్కేయూ. -
ఎస్కేయూను అగ్రగామిగా నిలిపేందుకు కృషి
►వీసీ ఆచార్య కె. రాజగోపాల్ ఎస్కేయూ : శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయాన్ని రాష్ట్రంలో అగ్రగామిగా నిలిపేందుకు కృషి చేస్తున్నట్లు వీసీ ఆచార్య కె.రాజగోపాల్ పేర్కొన్నారు. ఎస్కేయూ వీసీ కాన్ఫరెన్స్ హాలులో అకడమిక్ సెనెట్ కమిటీ సభ్యుల సమావేశం గురువారం నిర్వహించారు. వీసీ అధ్యక్షతన జరిగిన సమావేశంలో పలు కీలక నిర్ణయాలకు కమిటీ సభ్యులు ఆమోదం తెలిపారు. గత పాలక మండలి సమావేశాల్లో తీసుకున్న నిర్ణయాలకు అకడమిక్ సెనెట్ సమ్మతించింది.రూ.57.7 కోట్లు యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ నిధులు, రూ.20 కోట్లు రూసా నిధులు ఉండటంతో మరిన్ని అభివృద్ధి పనులు చేపట్టడానికి అవకాశం ఏర్పడిందని వీసీ పేర్కొన్నారు. ఇండోర్ స్టేడియం నిర్మాణం, వర్సిటీ ప్రహరీ మరమ్మతు, నూతన పరీక్షల విభాగం నిర్మాణం తదితర అభివృద్ధిపనుల చేపట్టనున్నామన్నారు. కార్యక్రమంలో ఎస్కేయూ రెక్టార్ ఆచార్య హెచ్.లజపతి రాయ్, రిజిస్ట్రార్ ఆచార్య కె.సుధాకర్ బాబు, పాలకమండలి సభ్యులు రామయ్య, విజయారావు, నాగ జ్యోతిర్మయి, డాక్టర్ ఎండ్లూరి ప్రభాకర్, డాక్టర్ ముచ్చుకోట బాబు, క్యాంపస్ కళాశాల ప్రిన్సిపాల్ ఆచార్య సీఎన్ కృష్ణానాయక్, ఎస్వీ యూనివర్సిటీ మాజీ వీసీ ఆచార్య కొలకలూరి ఇనాక్, పీవీ రమణా రెడ్డి, అకడమిక్ సెనెట్ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు. -
నేటి నుంచి డిగ్రీ పరీక్షలు ప్రారంభం
– రెగ్యులర్ డిగ్రీ పరీక్షల్లో తొలిసారిగా ఆన్లైన్లో ప్రశ్నాపత్రం – 27వేల మంది విద్యార్థులు పరీక్షలకు దరఖాస్తు ఎస్కేయూ : శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం డిగ్రీ కోర్సులకు సంబంధించి ఫైనలియర్ (రెగ్యులర్), మొదటి, ద్వితీయ సంవత్సరాలకు సంబంధించి (సప్లిమెంటరీ ) పరీక్షలు శుక్రవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఇందుకోసం అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఆన్లైన్లో ప్రశ్నాపత్రం పంపించే విధానం దూరవిద్య పరీక్షల్లో సఫలమైంది. దీంతో రెగ్యులర్ డిగ్రీ పరీక్షల్లోను ఇదేవిధానాన్ని అమలు చేస్తున్నారు. ఎన్క్రిప్టెడ్ పాస్ వర్డ్ ద్వారా ఆయా డిగ్రీ కళాశాలల ప్రిన్సిపాళ్లు ప్రశ్నాపత్రాలు డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. పరీక్షకు నిర్దేశించిన సమయం కంటే గంట ముందు పాస్‌వర్డ్‌ను మెయిల్ ద్వారా, ప్రిన్సిపాళ్లు సెల్‌ఫోన్‌కు మెసేజ్ పంపుతారు. వీటి ద్వారా ప్రశ్నాపత్రాలు డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. మొత్తం 27 వేల మంది విద్యార్థులు పరీక్షలకు దరఖాస్తు చేసుకున్నారు. ఫైనలియర్లో 15 వేల మంది హాజరుకానున్నారు. పరీక్షలకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు డైరెక్టర్ ఆఫ్ ఎవాల్యుయేషన్స్ ఆచార్య రెడ్డి వెంకటరాజు పేర్కొన్నారు. ఆన్లైన్లో ప్రశ్నాపత్రాలు పంపే నూతన విధానంపై డిగ్రీ కళాశాలల ప్రిన్సిపాళ్లకు అవగాహన కల్పించినట్లు ఆయన తెలిపారు. -
టీ–20 క్రికెట్ టోర్నీ ప్రారంభం
ఎస్కేయూ (అనంతపురం) : శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం స్టేడియంలో సోమవారం వర్సిటీ క్యాంపస్ కళాశాలల టీ–20 క్రికెట్ టోర్నీ ప్రారంభమైంది. ఈ సందర్భంగా టోర్నీని ప్రారంభించిన వర్సిటీ ఉపకులపతి ఆచార్య కె.రాజగోపాల్ మాట్లాడుతూ.. త్వరలో ఇండోర్ స్టేడియం నిర్మించనున్నట్లు తెలిపారు. అంతకుముందు ఎంపీఈడీ విభాగం విద్యార్థుల గౌరవ వందనాన్ని స్వీకరించి.. జాతీయ జెండాను ఆయన ఆవిష్కరించారు. కార్యక్రమంలో సైన్సు కళాశాల ప్రిన్సిపాల్ ఆచార్య వి.రంగస్వామి, ఎంపీఈడీ విభాగం ఇన్ఛార్జ్ డాక్టర్ ఎంవీ శ్రీనివాసన్, డాక్టర్ కిరణ్ చక్రవర్తి, శివ తదితరులు పాల్గొన్నారు. సాహస కృత్యాలు అలవోకగా టీ–20 క్రికెట్ టోర్నీ ప్రారంభోత్సవంలో అబ్బురపరిచే విన్యాసాలతో ఎంపీఈడీ విద్యార్థులు ఆకట్టుకున్నారు. ఎంపీఈడీ రెండో సంవత్సరం విద్యార్థి ఏ.సందీప్‌కుమార్ (అలియాస్ జింప్స¯ŒS) చేసిన సాహస కృత్యాలకు అభినందనలు వెల్లువెత్తాయి. పిరమిడ్స్, లెజ్జిమ్స్, స్టంట్స్‌లతో ఆకట్టుకొన్నారు. వీటిని వీక్షించిన ఉపకులపతి ఆచార్య కే.రాజగోపాల్ వేదిక దిగి వచ్చి సందీప్‌ను ఆలింగనం చేసుకుని అభినందించారు. ఎంపీఈడీ బోణి తొలి మ్యాచ్ పరిశోధన, ఎంపీఈడీ విభాగం విద్యార్థుల మధ్య ప్రారంభమైంది. ముందుగా టాస్ గెలిచిన పరిశోధన విద్యార్థుల జట్టు బ్యాటింగ్‌ను ఎంచుకుని, 82 పరుగులకు ఆలౌట్ అయింది. అనంరతం బరిలో దిగిన ఎంపీఈడీ విద్యార్థులు కేవలం పది ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించి శుభారంభం చేశారు. జట్టులో వినయ్‌కుమార్ 34 పరుగులు చేశారు. అలాగే మరో బ్యాట్స్‌మన్ చిరంజీవి ఏడు బంతుల్లో 17 పరుగులు సాధించారు. బౌలింగ్‌లోనూ చిరంజీవి రాణిస్తూ నాలుగు ఓవర్లలో 15 పరుగులు ఇచ్చి మూడు వికెట్లు తీశారు. దీంతో అతనికి మ్యాన్ ఆఫ్‌ది మ్యాచ్‌ను ప్రకటించారు. మధ్యాహ్నం ఎంబీఏ విభాగం, బోధనేతర ఉద్యోగుల మధ్య జరిగింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఎంబీఏ నిర్ణీత 20 ఓవర్లలో 208 భారీ పరుగుల లక్ష్యాన్ని నిర్ధేశించింది. 209 పరుగుల లక్ష్యంతో బరిలోకి తిగిన బోధనేతర ఉద్యోగులు 13 ఓవర్లకు గాను 79 పరుగులకే ఆలౌటయ్యారు. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌గా నవీన్ (ఎంబీఏ) (31 బంతులకు 60 పరుగులు)ను ప్రకటించారు. -
ఎస్కేయూ వేదికగా ప్రత్యేక ఉద్యమం
ఎస్కేయూ : రాష్ట్ర భవిష్యత్తు దృష్ట్యా అనివార్యమైన ప్రత్యేక హోదా సాధనకు కృషి చేద్దామని ఎస్కేయూ ప్రత్యేక హోదా సాధన సమితి జేఏసీ నాయకులు పేర్కొన్నారు. మంగళవారం ఎస్కేయూలో జేఏసీ నాయకులు విలేకరులతో మాట్లాడారు. సమైక్య ఉద్యమ తరహాలో ప్రత్యేక హోదా ఉద్యమాన్ని ఎస్కేయూ వేదికగా విజయవంతం చేసే దిశగా కార్యాచరణ రూపొందిస్తున్నట్లు తెలిపారు.ఈనెల 26న సాయంత్రం 6 గంటలకు జాతీయ రహదారిపై కొవ్వొత్తుల ర్యాలీని ఉంటుందన్నారు. కార్యక్రమంలో అధ్యాపకులు, బోధనేతర సిబ్బంది, విద్యార్థులు, పరిశోధక విద్యార్థులు అందరూ పాల్గొనాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ప్రత్యేక హోదా సాధన సమితి జేఏసీ నాయకుడు డాక్టర్ ఎన్ఆర్ సదాశివారెడ్డి, టి.పురుషోత్తం రెడ్డి, వెంకటరాముడు, చిన్నప్ప, వైఎస్సార్ విద్యార్థి విభాగం నాయకులు క్రాంతి కిరణ్, భాను ప్రకాష్ రెడ్డి, జయచంద్రా రెడ్డి, శ్రీనివాస రెడ్డి, బీసీ విద్యార్థి సంఘం నాయకులు జయపాల్ యాదవ్, కొంకా మల్లికార్జున, ఎస్ఎఫ్ఐ నాయకులు ముస్తఫా తదితరులు పాల్గొన్నారు. -
పీఎఫ్ మొత్తం స్వాహా!
- అవుట్సోర్సింగ్ ఉద్యోగుల పీఎఫ్, ఈఎస్ఐ స్వాహా చేసిన ‘వెంగమాంబ ఏజెన్సీ’ – రూ.29.50 లక్షలు మింగేసి పరారీ – వర్సిటీ నోటీసులు పంపినా స్పందించని వైనం – సెక్యూరిటీ బాండ్లు లేకుండా ఏజెన్సీ నిర్వహణ అప్పగింతపై విమర్శలు ఎస్కేయూ : శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయంలో అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు చెల్లించాల్సిన పీఎఫ్, ఈఎస్ఐ మొత్తం రూ.29.50 లక్షలు ఏజెన్సీ నిర్వాహకుడు స్వాహా చేశాడు. ఉద్యోగులకు నాలుగు నెలలుగా జీతాలు అందలేదు. దీంతో పెండింగ్ ఉన్న వేతనాలు ఉద్యోగులకు చెల్లిస్తేనే పీఎఫ్, ఈఎస్ఐ మొత్తం ఖాతాలో జమ చేస్తామని వర్సిటీ ఉద్యోగులు తేల్చి చెప్పడంతో విషయం బయటపడింది. అయితే ఏజెన్సీ నిర్వాహకుడు పీఎఫ్ మొత్తం కాజేసి పరారీలో ఉన్నాడు. వర్సిటీ యంత్రాంగం ముందుచూపు లేకుండా హడావుడిగా ‘వెంగమాంబ ఏజెన్సీ’కి అప్పగించాలన్న తొందరపాటు నిర్ణయంతో జరగాల్సిన నష్టం జరిగిపోయిందన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. 2015 జూలైలో వర్సిటీలో సెక్యూరిటీ గార్డుల నియామకాలు, నిర్వహణను వెంగమాంబ ఏజెన్సీకి అప్పగించారు. సెక్యూరిటీ నిర్వహణ బాధ్యతను ఎలాంటి టెండర్లు లేకుండా ఏజెన్సీ బాధ్యతను కట్టబెట్టడం మొదలు ఇప్పటి దాకా అంతా వివాదాస్పదమే.నియామకాల్లో భాగంగా ఒక్కో ఉద్యోగితో వెంగమాంబ ఏజెన్సీ నిర్వాహకులు అధికారికంగా రూ.25 వేలు సెక్యూరిటీ బాండ్లు తీసుకున్నారు. తొలుత 60 మంది గార్డులను నియమించారు. ఏజెన్సీకి వర్సిటీ ఒక్కో ఉద్యోగికి నెలకు రూ.9,500 చెల్లిస్తుండగా ..ఉద్యోగులకు మాత్రం రూ.6,500 ఇస్తున్నారు. జీతాల పంపిణీలో అంతరం ఉన్నప్పటికీ ఉద్యోగులు ఎవరూ ఫిర్యాదు చేయలేదని వర్సిటీ ఉన్నతాధికారులు తెలిసీతెలియనట్లు వ్యవహరించారు. మొదటికే మోసం ప్రతి నెలా ఉద్యోగి నికర జీతాన్ని ఏజెన్సీ నిర్వాహకులకు వర్సిటీ చెల్లిస్తోంది. ఇందులో నుంచి ప్రతి ఉద్యోగి పీఎఫ్, ఈఎస్ఐ ఖాతాకు ఏజెన్సీ వారు జమ చేయాలి. ఇంతే మొత్తాన్ని వర్సిటీ కూడా జమ చేస్తుంది. అయితే టెండర్ల ద్వారా నూతన ఏజెన్సీకి అప్పగించాలని గత పాలకమండలిలో నిర్ణయించి.. కొత్త ఏజెన్సీకి అప్పగించేందుకు సిద్ధం చేశారు. దీంతో ఉద్యోగుల పీఎఫ్, ఈఎస్ఐ మొత్తం వెంగమాంబ ఏజెన్సీ చెల్లించాల్సి ఉంది. ఇప్పటి వరకు రూ.29.50 లక్షలు పీఎఫ్, ఈఎస్ఐ మొత్తం వెంగమాంబ ఏజెన్సీ నిర్వాహకుడు స్వాహా చేసినట్లు సమాచారం. నాలుగు నెలల జీతం ఉద్యోగులకు అందలేదు. పీఎఫ్ మొత్తం చెల్లించేంతవరకు ఉద్యోగులకు జీతాలు ఇచ్చేదిలేదని వర్సిటీ ఉన్నతాధికారులు స్పష్టం చేశారు. కారణం జీతాలు ఏజెన్సీ నిర్వాహకుడు ఖాతాలో జమచేయాల్సి ఉండడమే. ఈ నాలుగు నెలల జీతాలు కూడా ఉద్యోగులకు ఇవ్వరేమోనన్న అనుమానం రావడంతో ఈ మేరకు వర్సిటీ ఉన్నతాధికారులు నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. నాలుగు నెలలు జీతమైనా ఆయా వ్యక్తిగత జీతాల ఖాతాల్లోనైనా జమ చేసే విధంగా చర్యలు తీసుకోవాలని ఉద్యోగులు కోరుతున్నారు. సమష్టి బాధ్యత వహించాలి ఏజెన్సీ అప్పగించే ముందు సెక్యూరిటీ బాండ్లు తీసుకొని ఉంటే ఇంత నష్టం జరిగేది కాదు. తాంబూలాలు ఇచ్చేశాం.. తన్నుకు చావండి .. అనే రీతిలో ఏజెన్సీకి మొత్తం చెల్లించేశాము. మాకు సంబంధం లేదనే రీతిలో వర్సిటీ ఉన్నతాధికారుల వైఖరి కారణంగా ఉద్యోగులకు ఆవేదన కలిగిస్తోంది. రూ.25 వేలు డిపాజిట్, నాలుగు నెలల జీతం, ఏడాదిన్నర నుంచి అందాల్సిన పీఎఫ్ మొత్తం ఉద్యోగులకు దక్కాల్సి ఉంది. ఈ నేపథ్యంలో వర్సిటీ ఉన్నతాధికారులు అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు న్యాయం చేసి.. ఏజెన్సీ నిర్వాహకులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని ఉద్యోగులు కోరుతున్నారు. నోటీసులు పంపాం పీఎఫ్ మొత్తాలు జమ చేయాలని వెంగమాంబ ఏజెన్సీ నిర్వాహకుడికి నోటీసులు పంపాం. స్పందించకపోవడంతో అవుట్సోర్సింగ్ ఏజెన్సీ ఉద్యోగులకు జీతాలు నిలిపివేశాం. – డాక్టర్ లక్ష్మీరాం నాయక్, ఫైనాన్స్ ఆఫీసర్, ఎస్కేయూ -
‘చూచి’ చూడనట్లు!
- దూరవిద్య పరీక్షల్లో చూచిరాతలు - విద్యార్థి లేకపోయినా పరీక్షలు రాయిస్తున్న నిర్వాహకులు - అభ్యర్థిని బట్టి రేటు నిర్ణయం - పట్టించుకోని ఎస్కే యూనివర్సిటీ అధికారులు కర్నూలు సిటీ: ఎస్కే (శ్రీకృష్ణ దేవరాయల)యూనివర్సిటీ దూర విద్య పరీక్షలు చూచిరాతలుగా మారాయి. సోమవారం నుంచి ఎస్కే దూర విద్య పీజీ, డిగ్రీ పరీక్షలు మొదలు అయ్యాయి. ఇందుకు నగరంలోని శ్రీబాలశివ డిగ్రీ, జూనియర్ కాలేజీలు కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఈ పరీక్షలను పర్యవేక్షించేందుకు యూనివర్సిటీ నుంచి వచ్చిన అధికారి ‘చూచి’ చూడనట్లు వ్యవహరిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. దీంతో చూచి రాతలు యథేచ్ఛగా సాగుతున్నాయి. వారి రూటు సప‘రేటు’ వివిధ కారణాలతో రెగ్యులర్‌గా కొందరు.. కాలేజీలకు పోయి చదవలేకపోతున్నారు. విద్యార్హత కోసం కొందరు దూర విద్య కేంద్రాలను ఆశ్రయిస్తున్నారు. వీరి నుంచి యూనివర్సిటీ నిర్ణయించిన ఫీజులతో పాటు పరీక్షల రోజున ఖర్చుల పేరుతో నిర్వాహకులు భారీగా డబ్బులు వసూలు చేస్తున్నారు. ఒక్కో కోర్సుకు..ఒక్కో పరీక్షకు వేర్వేరుగా రేటు కడుతున్నారు. పరీక్షల సమయంలో చూచి రాతలు ఉంటాయని ముందే చెబుతున్నారు. అభ్యర్థి పరీక్ష రాయకపోయినా..వేరొకరితో రాయించి పాస్ చేయిస్తామని ఒప్పందం కుదుర్చుకుంటున్నారు. దీంతో ఒకప్పుడు వంద మందితో మొదలు అయిన దూర విద్య కేంద్రం నేడు వేల మంది సంఖ్యను పెంచుకుంది. జిల్లాలో కర్నూలు, కోడుమూరు, ఎమ్మిగనూరు, ఆదోని, నంద్యాలలో ఏజెంట్లను పెట్టి వీరు అడ్మిషన్లు చేయిస్తున్నారు. పుస్తకాలు పెట్టి పరీక్షలు...! సాధారణంగా దూర విద్య అంటే సెలవు రోజుల్లో క్లాస్‌లు నిర్వహించాలి. సైన్స్ విద్యార్థులకు ల్యాబ్‌లో ప్రాక్టికల్స్ చేయించాలి. పరీక్షలకు నాలుగు నెలలకు ముందుగానే కోర్సు మెటీరియల్ ఇవ్వాలి. అయితే యూనివర్సిటీ అధికారుల నిర్లక్ష్యంతో మెటీరియల్ అందడం లేదు. సమయానికి మెటీరియల్ ఇవ్వకపోవడంతో పరీక్షల సమయంలో మెటీరియల్‌కు అదనంగా డబ్బులు వసూలు చేస్తున్నారు. ఈ ఏడాది జరుగుతున్న పరీక్షల్లో.. అధిక శాతం కోర్సులకు సంబంధిత మెటీరియల్‌ను హాల్‌టికెట్‌తో పాటు ఇచ్చారు. దీంతో నేరుగా పరీక్ష కేంద్రంలోనే మెటీరియలో సమాధానాలు చూచి రాస్తున్నారు. దీంతో పాటు ప్రశ్నలకు సమాధానాల చిట్టీలు ఇస్తే ఒక రేటు, మెటీరియల్ ఇచ్చిన వారినే సమాధానాలు వేతుక్కోని రాయమంటే ఒక రేటు నిర్ణయించి వసూలు చేసినట్లు సమాచారం. మొత్తంగా ఒక్కో అభ్యర్థి రూ.1000 నుంచి రూ.2000 వరకు ఇచ్చినట్లు సమాచారం. మరి కొంత మంది పరీక్షలకు హాజరుకాలేకపోయినా.. వారు వారి బదులు మరొకరితో వారే పరీక్ష రాయించాలంటే రూ.10 వేలు వసూలు చేసినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా.. దూర విద్యలో జరుగుతున్న అక్రమాలను అరికట్టేందుకు ఈ ఏడాది ఎస్కే యూనివర్సిటీ ..దూర విద్య బోర్డును రద్దు చేసి, రెగ్యులర్ పరీక్షల బోర్డు పరిధిలోకి తీసుకువచ్చింది. అయినా కేంద్రాల నిర్వాహకుల తీరు మారలేదు. -
నగదు రహిత లావాదేవీలపై అవగాహన ర్యాలీ
అనంతపురం సప్తగిరి సర్కిల్ : ఎస్కేయూ విద్యా విభాగం, కళాశాల జాతీయ సేవా విభాగం ఆధ్వర్యంలో విద్యార్థులు నగరంలో బుధవారం అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఎన్ఎస్ఎస్ కో ఆర్డీనేటర్ రమణ, ప్రోగ్రాం ఆఫీసర్ వెంకట సుబ్బయ్య మాట్లాడుతూ తమ ప్రాంతాల్లోని ప్రజలకు నగదు రహిత లావాదేవీలపై అవగాహన కల్పించాలని విద్యార్థులకు సూచించారు. దత్తత తీసుకున్న గ్రామాల్లో ఇంటింటి సర్వేను నిర్వహించాలన్నారు. బ్యాంకు అకౌంట్, డెబిట్ కార్డులు, రూపే కార్డుల వినియోగంపై వారికి వివరించాలన్నారు. ఎన్ఎస్ఎస్ విభాగం ప్రోగ్రాం ఆఫీసర్ వరలక్ష్మీ, ధనుంజయ, ఆంజినేయులు తదితరులు పాల్గొన్నారు. -
బోధనేతర ఉద్యోగుల జీతాల పెంపు
ఎస్కేయూ : శ్రీ కృష్ణదేవరాయ విశ్వవిద్యాలయంలో పని చేస్తున్న టైం స్కేల్, మినిమమ్ స్కిల్ ఉద్యోగుల జీతాలు పెంచారు. వర్శిటీలో బుధవారం పాలక మండలి సమావేశం జరిగింది. ఇందులో పలు కీలక నిర్ణయాలకు పాలక మండలి ఆమోదం తెలిపింది. రూ 2.91 కోట్లతో రెండు నూతన భవనాల నిర్మాణానికి సమ్మతి తెలిపారు. రూ. కోటితో మందాకిని హాస్టల్ రెండవ అంతస్తు నిర్మాణం కూడా ప్రారంభం కానుంది. పీజీ, యూజీ, దూరవిద్య పరీక్ష విభాగాలను ఒకే గూటికి తీసుకురావాలని నిర్ణయం తీసుకున్నారు. ఇందుకు రూ 1.91 కోట్లతో మరో భవనాన్ని నిర్మించనున్నారు. డైరెక్టర్ ఆఫ్ అడ్మిషన్ కార్యాలయానికి ఎన్టీఆర్ పేరును నామకరణం చేశారు. 2017 ఫిబ్రవరిలో స్నాతకోత్సవం నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు. నూతనంగా 90 ఔట్ సోర్సింగ్ ఉద్యోగల భర్తీకు గతంలో టెండర్లు ఆహ్వానించారు. ఇందులో నాలుగు కంపెనీలు 0 శాతం కమీషన్‌ను టెండర్లు దరఖాస్తు చేశాయి. దీంతో ఆచార్య ఫణీశ్వర రాజు కమిటీను నియమించారు. వారి సూచనల మేరకు కార్తికేయ లిమిటెడ్, విజయవాడ ఔట్సోర్సింగ్ కంపెనీకు నూతన ఉద్యోగుల భర్తీ, నిర్వహణ బాధ్యతలు అప్పగించారు. ఫార్మసీ ప్రిన్సిపల్ ఎంపికకు సంబంధించి గతంలో ముగ్గురుని ఎంపిక చేశారు. మొదట ఎన్నుకున్న వ్యక్తి రాజీనామా చేయడంతో రెండో వ్యక్తిని నియమించారు. దీనికి పాలకమండలి ఆమోదం తెలిపింది. -
ఎస్కేయూ డిగ్రీ పరీక్షలు వాయిదా
ఎస్కేయూ : వర్సిటీ అనుబంధ డిగ్రీ కళాశాలల్లో బీఏ, బీఎస్సీ, బీకామ్ రెండవ సంవత్సరం సప్లిమెంటరీ, 2,3 సెమిస్టర్ పరీక్షలు 28న జరగాల్సిన పరీక్షలు బంద్ కారణంగా వాయిదా వేసినట్లు యూజీ డీన్ జీవన్‌కుమార్ ఓ ప్రకటనలో తెలిపారు. రద్దయిన పరీక్షలు డిగ్రీ రెండవ సంవత్సరం సప్లిమెంటరీ పరీక్షలు డిసెంబర్ 7న, రెండవ సంవత్సరం మూడవ సెమిస్టర్ పరీక్షలు డిసెంబర్ 8న నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. -
కరెన్సీ కోసం వెళితే చితకబాదారు!
ఎస్కేయూ ఉద్యోగిపై పోలీసుల దాష్టీకం అనంతపురం సెంట్రల్: పెద్దనోట్ల మార్పిడి కోసం వెళ్లిన ఓ వ్యక్తిని పోలీసులు చితకబాదారు. ఈ సంఘటన అనంతపురం నగరంలోని సారుునగర్లో ఉన్న ఎస్బీఐ మెరుున్ బ్రాంచ్ వద్ద ఆదివారం చోటు చేసుకుంది. వైఎస్సార్ జిల్లా కమలాపురం మండలానికి చెందిన మాధవరెడ్డి ఎస్కే యూనివర్సిటీలోని భారత వాతావరణ పరిశోధన కేంద్రంలో టెక్నికల్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్నారు. ఆదివారం డబ్బు కోసం సారుునగర్ స్టేట్‌బ్యాంకుకు వెళ్లారు. క్యూలో కొన్ని గంటల సేపు వేచి ఉన్నారు. ఇదే సమయంలో బందోబస్తు నిమిత్తం అక్కడికి వచ్చిన టూటౌన్ ఎస్ఐ జనార్దన్ ఆయన్ను పరుష పదజాలంతో దూషించారు. దీనికి కోపోద్రిక్తుడైన మాధవరెడ్డి ఎస్ఐపై చేరుు చేసుకున్నారు. దీంతో బందోబస్తులో ఉన్న పోలీసులు, త్రీటౌన్ సీఐ ఆయన్ను పట్టుకొని చితకబాదారు. వందలాది మంది ప్రజల సమక్షంలోనే గొడ్డును బాదినట్లు బాదుతూ, బూటు కాలుతో తన్నుకుంటూ స్టేషన్‌కు తీసుకెళ్లారు. స్టేషన్లోనూ కొట్టినట్లు తెలిసింది. తర్వాత ఆయన్ను ఎక్కడుంచారనేది పోలీసులు చెప్పడం లేదు. ఎస్ఐపై చేరుుచేసున్నారనే కారణంతో మాధవరెడ్డిపై కేసు నమోదు చేసినట్లు టూటౌన్ సీఐ తెలిపారు. -
మాయాజాలం
– గతంలోరూ.90 లక్షలు విలువచేసే పరికరాలు గల్లంతు –కొన్ని విభాగాలలో అమర్చకుండానే స్వాహ - ఎస్కేయూలో రూ. లక్షలాది విలువ చేసే పరికరాల ఆచూకీ గల్లంతు - సెంట్రల్ స్టోర్ ఏర్పాటుపై మీనమేషాలు - పరికరాల రికవరీని పట్టించుకోని అధికారులు ఎస్కేయూ : శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయంలో విలువైన పరికరాలు మాయమవుతున్నాయి. ఎస్కేయూలో 30 విభాగాల్లో విద్యార్థులు, అధ్యాపకుల సౌకర్యార్థం రూ.90 లక్షలు వెచ్చించి పరికరాలు కొన్నారు. కానీ వీటిని మొక్కుబడిగా అమర్చి కనిపించకుండా మాయం చేశారు. కొన్ని విభాగాలలో అసలు వాటి ముఖం కూడా చూపించకుండానే స్వాహా చేసేశారనే విమర్శలున్నాయి. ఎన్నాళ్లిలా ...? : ఇచ్చిన ఆర్డర్‌కు, వచ్చిన వస్తువులకు మధ్య వ్యత్యాసం ఉన్నా వాటిని గుర్తించే వ్యవస్థ వర్సిటీలో లేదని విశ్లేషకుల భావన. విభాగాల అవసరాలకు వాటిని ఉపయోగించి, అవసరం లేనపుడు వాటిని భద్రపరిచడానికి సెంట్రల్ స్టోర్ ఏర్పాటు చేయాల్సి ఉన్నా, దాని గురించి పట్టించుకున్న దాఖలాలు లేవు. దీంతో ఎంతో విలువైన వస్తువులు గల్లంతు అవుతున్నాయి. సెంట్రల్ స్టోర్ ఏర్పాటు చేయనున్నట్లు ఉన్నతాధికారులు పేర్కొన్నప్పటికీ అది కార్యరూపం మాత్రం దాల్చలేదు. వర్సిటీ పరిధిలోని ప్రాజెక్టుల కోసం తెప్పించుకొన్న యంత్రాలు, వివిధ ఉపకరణాలు ప్రాజెక్ట్ కాలవ్యవధి ముగిసిన తర్వాత వాటిని యూనివర్సిటీకి అప్పగించాలి. అధికారుల జవాబుదారీతనం లోపంతో అక్రమాలు యథేచ్ఛగా కొనసాగుతున్నాయనే విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ప్రాజెక్ట్ నిర్వహించే ప్రిన్సిపల్ ఇన్వెస్టిగేటర్ అందుకు సంబంధించిన పుస్తకాలను యూనివర్సిటీ సెంట్రల్ లైబ్రరీకి రిపోర్ట్ చేయాలి. ఇవేవీ పట్టనట్టు దర్జాగా అత్యంత విలువైన పుస్తకాలను దారి మళ్లించేస్తున్నారు. దీంతో లక్షలాది రూపాయల పుస్తకాలు విద్యార్థులకు అందుబాటులో రాని పరిస్థితి నెలకొంది. ఇలా పుస్తకాల నుంచి ఇన్వెర్టర్ల వరకు జరుపుతున్న అక్రమాలకు అడ్డుకట్ట వేసే రీతిలో వర్సిటీ యాజమాన్యం చర్యలు తీసుకోవాలని విద్యార్థులు కోరుతున్నారు. ఫిజికల్ వెరిఫికేషన్ చేసి నిగ్గుతేల్చాలని డిమాండ్ చేస్తున్నారు. అధిక ధరకు కొనుగోలు : యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ నిధులను ఖర్చు చేయకపోతే మిగిలిపోతాయనే ఉద్ధేశ్యంతో గత మూడేళ్ల కిందట హడావుడిగా పరికరాలను కొనుగోలు చేశారు. రూ.5 లక్షలు విలువ చేసే పరికరాల సరఫరాకు టెండర్ల ద్వారా పిలవాలని నిబంధనలు చెబుతున్నాయి. కానీ ఏకంగా రూ.90 లక్షలు విలువచేసే పరికరాలను కేవలం కొటేషన్ల ద్వారా కట్టబెట్టారు. ఇందులోనూ బంధుప్రీతి, ఆశ్రిత పక్షపాతాన్ని ప్రదర్శించారన్న ఆరోపణలున్నాయి. అనుకూలమైన కంపెనీలతో కొటేషన్లను ఆహ్వానించి జరపాల్సిన తతంగాలన్నీ నడిపించేశారు. ఇందులోను అస్మదీయులకే దక్కేలా చేశారు. వీటిని పర్చేస్ కమిటీ పరిశీలించి మార్కెట్ ధర కంటే అధిక మెత్తానికి నిర్ధారించారు. ఒక్కో ఇన్వెర్టర్ «(3.5 కేవీ), ఎక్సైడ్ కంపెనీకి చెందిన నాలుగు బ్యాటరీలు మొత్తం కలిపి ఒక యూనిట్‌గా పరిగణించారు. ఒక్కో యూనిట్‌కు రూ. 90 వేలుగా నిర్ణయించారు. వాస్తవానికి మార్కెట్ ధరల ప్రకారం ఒక్కో యూనిట్ రూ.60 వేలుగా ఉంది. రూ.30 వేలు అధిక ధరకు కొనుగోలు చేశారు. వాటిని వినియోగించకుండా సొంత అవసరాలకు వాటిని దారి మళ్లించారు. అన్ని విభాగాలకు ఒకే సారి కొనుగోలు చేస్తే న్యాయపరమైన చిక్కులు వస్తాయని , ఒక్కో విభాగానికి రూ.2.2 లక్షలు పెట్టి విడిగా కొనుగోలు చేసినట్లు రికార్డులు చూపి చేతులు దులుపుకొన్నారు. ఇలా మొత్తం 30 విభాగాల వారీగా కొటేషన్లను ఆహ్వానించారు. మరోవైపు సైన్స్ విభాగంలో ఎల్సీడీ టీవీలను ఒక సీనియర్ ప్రొఫెసర్ ఏకంగా తమ బంధువులకు ధారాదత్తం చేసి తన త్యాగాన్ని చాటుకొన్నారు. ఈ అక్రమాలపై కమిటీ వేసి దర్యాప్తు చేయాలనే డిమాండ్లు అధికమవుతున్నాయి. -
రూల్ ఆఫ్ రిజర్వేషన్ సమాచారం ఏదీ?
– నెల రోజుల్లో రికార్డులు అందించాలి – బ్యాక్లాగ్ పోస్టులు భర్తీ చేయాలి – ఏపీ ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ కారెం శివాజీ ఎస్కేయూ : శ్రీకష్ణదేవరాయ విశ్వవిద్యాలయంలో భర్తీ చేసిన బోధన, బోధనేతర ఉద్యోగాలకు సంబంధించిన రూల్ ఆఫ్ రిజర్వేషన్ సమాచారం, రోస్టర్ పాయింట్ల వివరాలు అందించడంలో అధికారులు విఫలమయ్యారని ఏపీ ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ కారెం శివాజీ అసంతప్తి వ్యక్తం చేశారు. వర్సిటీ ఉన్నతాధికారులు, సాంఘిక, గిరిజన సంక్షేమ శాఖ అధికారులతో బుధవారం ఎస్కేయూలో ఆయన సమీక్ష నిర్వహించారు. 1981 నుంచి నియామకాలు చేపట్టిన ఉద్యోగాల్లో ఎస్సీ, ఎస్టీలు ఎంతమంది ఉన్నారని ప్రశ్నించారు. రోస్టర్ పాయింట్ల రిజిస్టర్, ఉద్యోగుల సమాచారం లేకపోవడంతో అసహనం వ్యక్తం చేశారు. రికార్డులు లేకపోతే ఎన్ని బ్యాక్లాగ్ పోస్టులు ఉన్నాయనే సమాచారం ఎలా ఇస్తారని ప్రశ్నించారు. అరకొరగా సమాచారం ఇచ్చినప్పటికీ, అందులో పెన్సిల్‌తో సరిదిద్ది ఉండటం చూసి రికార్డులు తారుమారు చేస్తున్నారా? అని నిలదీశారు. అధికారులు సరైన సమాచారం అందించకపోవడంతో సమావేశాన్ని అర్ధంతరంగా ముగించారు. నెలరోజుల్లోపు రికార్డులన్నీ సరిచేసి ఉంచాలని ఆదేశించారు. ఎస్సీ, ఎస్టీ బ్యాక్లాగ్ పోస్టులను పాలకమండలి సమావేశంలో ఆమోదింపచేసి, భర్తీ చేయాలని సూచించారు. ఎస్సీ, ఎస్టీ విద్యార్థుల సంక్షేమం, ఉపకార వేతనాల మంజూరు, హాస్టళ్లలో అందించే ఆహారం, తదితర అంశాలను పర్యవేక్షించేందుకు ఒక ఉన్నతాధికారిని నియమించాలన్నారు. పొరుగు సేవల్లోనూ రిజర్వేషన్లు పొరుగు సేవలు(ఔట్ సోర్సింగ్) ఉద్యోగాల్లోనూ రూల్ ఆఫ్ రిజర్వేషన్ తప్పనిసరిగా పాటించాలని కారెం శివాజీ అన్నారు. సమీక్ష అనంతరం విలేకరులతో మాట్లాడిన ఆయన ఉద్యోగాల భర్తీకి సంబంధించిన రికార్డులు అందించడంలో అధికారులు పూర్తిగా విఫలమయ్యారని చెప్పారు. నాన్‌టీచింగ్ పోస్టులు 17, టీచింగ్ పోస్టులు 7 బ్యాక్లాగ్ పోస్టులు భర్తీ చేయాల్సి ఉందన్నారు. -
సెమిస్టర్ పరీక్షల నోటిఫికేషన్
ఎస్కేయూ : శ్రీకష్ణదేవరాయ విశ్వవిద్యాలయం డిగ్రీ మొదటి సెమిస్టర్ సప్లిమెంటరీ/ రెగ్యులర్, మూడవ సెమిస్టర్ రెగ్యులర్ పరీక్షల ఫీజు చెల్లించడానికి నోటిఫికేషన్ విడుదల చేసినట్లు యూజీ డీన్ ఆచార్య ఆర్.జీవన్‌కుమార్ ఓ ప్రకటనలో తెలిపారు. ఆయా కళాశాలల్లో ఆన్లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవడానికి వెసులుబాటు కల్పించామన్నారు. -
ఎస్కేయూ మాజీ ప్రొఫెసర్ మృతి
ఎస్కేయూ : ఎస్కేయూ మాజీ ప్రొఫెసర్ డాక్టర్ కోరాడ మహదేవశాస్త్రి (95) బుధవారం అనంతపురం నగరంలోని ద్వారకానగర్‌లో ఉన్న తన నివాసంలో మృతి చెందారు. ఈయన 1968 నుంచి 1982 వరకు ఎస్కేయూ క్యాంపస్ పీజీ కళాశాలలో తెలుగు ప్రొఫెసర్‌గా విధులు నిర్వర్తించారు. మొదటి తెలుగు విభాగాధిపతిగా, తొలి ప్రిన్సిపల్‌గా పని చేశారు. -
గాడి తప్పిన దూరవిద్య
–పర్యవేక్షణలో అధికారులు విఫలం –పరీక్షల షెడ్యూల్ ప్రకటించని వైనం ఎస్కేయూ : శ్రీకష్ణదేవరాయ విశ్వవిద్యాలయం దూరవిద్య విధానం గాడి తప్పింది. పరీక్షల షెడ్యూల్ ప్రకటన, నిర్వహణ, ఫలితాల ప్రకటన తదితర అంశాలు అకడమిక్ క్యాలెండర్ ప్రకారం నిర్వహించడంలేదు. ఫలితంగా విద్యార్థుల్లో అయోమయం నెలకొంది. పీజీ మొదటి సంవత్సరం పరీక్షలు ఏప్రిల్ చివరి వారంలో పూర్తి చేసినా ఇంతవరకు ఫలితాలు ప్రకటించలేదు. పీజీ రెండో సంవత్సరం పరీక్షలు, డిగ్రీ రెండు , మూడో సంవత్సరం పరీక్షలు ఎపుడు నిర్వహిస్తారో తెలియదు. పీసీపీ తరగతులు నిర్వహించని వైనం రెండు తెలుగు రాష్ట్రాల్లో 233 అధ్యయన కేంద్రాల ద్వారా విద్యార్థులు డిగ్రీ కోర్సును అభ్యసిస్తున్నారు. ద్వితీయ, తతీయ విద్యార్థులకు తప్పనిసరిగా పర్సనల్ కాంట్రాక్ట్ ప్రోగ్రామ్‌ను ప్రతి వారాంతంలో నిర్వహించాలి. దీనిని దూరవిద్య అధికారులు పర్యవేక్షించాలి. కానీ అధికారులు నిర్లక్ష్యం చేస్తున్నారన్న ఆరోపణలున్నాయి. తరగతుల నిర్వహణకు ఒక్కో డిగ్రీ అడ్మిషన్ మీద 20 శాతం ఖర్చును అధ్యయన కేంద్రాల వారికి దూరవిద్య అధికారులు నేరుగా చెల్లిస్తున్నారు. కానీ ఎలాంటి తరగతులు నిర్వహించలేదు. పీసీపీ తరగతులు ఉన్నాయన్న సంగతి విద్యార్థులకు కూడా తెలియకపోవడం ఇందుకు నిదర్శనం . కోర్సులు లేకున్నా ప్రాక్టికల్ పరీక్షలు .. దూరవిద్య అధ్యయన కేంద్రాల నిర్వాహకులు పీసీపీ తరగతులు, ప్రాక్టికల్ , రాత పరీక్షలు ఏ డిగ్రీ కళాశాలో నిర్వహిస్తారో ముందే వెల్లడించాల్సి ఉంది. కొన్ని డిగ్రీ కళాశాల్లో బీఎస్సీ కోర్సులు లేకపోయినప్పటికీ సైన్స్ పరీక్షలకు ప్రాక్టికల్ పరీక్షలు నిర్వహిస్తుండడం వివాదాలకు దారితీస్తోంది. అధ్యయన కేంద్రాల్లో నిర్వహిస్తున్న ప్రాక్టికల్ పరీక్షలు వర్సిటీ దూరవిద్య అధికారుల పర్యవేక్షణలో జరగాల్సి ఉన్నా, పట్టించుకున్న దాఖలాలు లేవు. ప్రాక్టికల్ మార్కులు నిర్ధారించి నేరుగా దూరవిద్య విభాగానికి అధ్యయన కేంద్రాల వారు పంపుతున్నారు. ఈ పరీక్షలకు ఎంత విశ్వసనీయత ఉందనే అంశంపై అనుమానాలు లేకపోలేదు. దూరవిద్య ఆదాయంలో 20 శాతం అధ్యయన కేంద్రాల నిర్వాహకులకు చెల్లిస్తున్నపుడు కనీస ప్రమాణాలు పాటించేలా చూడాల్సిన బాధ్యత దూరవిద్య అధికారులపై ఉందని పులువురు అభిప్రాయపడుతున్నారు. -
గెలుపోటములు సమానం
– ప్రారంభమైన ఎస్కేయూ అంతర్ కళాశాలల మహిళా ఆటల పోటీలు హిందూపురం టౌన్ : క్రీడల్లో గెలుపోటములు సమానమని వక్తలు పేర్కొన్నారు. శుక్రవారం పట్టణంలోని ఎన్‌ఎస్‌పీఆర్ ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల ఆధ్వర్యంలో ఆర్గనైజింగ్ కమిటీ చైర్మన్ శంకరయ్య, ఆర్గనైజింగ్ కార్యదర్శి పీడీ ముస్తఫా కమల్ బాషా శ్రీ కష్ణదేవరాయ విశ్వవిద్యాలయ అంతర్ కళాశాలల మహిⶠల ఆటల పోటీలను స్థానిక ఎంజీఎం మైదానంలో నిర్వహించారు. ఎన్‌ఎస్‌పీఆర్ ప్రిన్సిపల్ శంకరయ్య కార్యక్రమానికి అధ్యక్షత వహించగా ముఖ్య అతిథులుగా బీసీ కార్పొరేషన్ చైర్మన్ రంగనాయకులు, ఎస్కేయూ స్పోర్ట్స్ డైరెక్టర్ జెస్సీ, మున్సిపల్ చైర్పర్సన్ లక్ష్మి, మాజీ మున్సిపల్ చైర్మన్ విద్యాసాగర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎన్‌ఎస్‌పీఆర్ కళాశాల ఆధ్వర్యంలో 4 ఏళ్లుగా ఈ పోటీలు నిర్వహిస్తున్నామన్నారు. ఆటల్లో క్రీడా స్ఫూర్తితో మెలిగినప్పుడే ఉన్నత స్థాయికి చేరుకోగలుతారని చెప్పారు. పీవీ సింధు, సాక్షి మాలిక్‌ను స్ఫూర్తిగా తీసుకుని ఆటల్లో రాణించాలన్నారు. అనంతరం నిర్వహించిన పోటీల్లో పలు జట్లు విజయం సాధించాయి. పోటీల్లో శ్రీకష్ణ దేవరాయ విశ్వవిద్యాలయ పరిధిలోని 16 కళాశాలల నుంచి క్రీడాకారులు పాల్గొన్నారు. ఆటల పోటీలు ఆదివారం వరకు కొనసాగనున్నాయి. అనంతరం ఎస్కేయూ జట్టును ఎంపిక చేస్తామన్నారు. కార్యక్రమంలో వివిధ కళాశాలల ప్రిన్సిపళ్లు శ్రీనివాసులు, ఈశ్వర్‌రెడ్డి, ఆనంద్‌నాయక్, వాణి కళాశాల కరస్పాండెంట్ ప్రభుకుమార్, మదానీ డిఫెన్స్ అకాడమీ సభ్యులు ఫకద్దీన్, ఎస్కేయూ ఫిజికల్ డైరెక్టర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు జబీవుల్లా, కార్యదర్శి కెనడీ, ఎంజీఎం పీడీ లోక్‌నాథ్, కళాశాల వైస్ ప్రిన్సిపల్ అంజలీదేవి పాల్గొన్నారు. -
ఎస్కేయూలో 8 నుంచి దసరా సెలవులు
ఎస్కేయూ : శ్రీకష్ణదేవరాయ విశ్వవిద్యాలయం క్యాంపస్ కళాశాలకు ఈనెల 8 నుంచి 16 వరకు దసరా సెలవులు నిర్ధేశించినట్లు ప్రిన్సిపాల్ ఆచార్య సీఎన్ కష్ణానాయక్ శుక్రవారం తెలిపారు. అకడమిక్ ఇయర్ క్యాలెండర్ ప్రకారం సెలవులు ప్రకటించామన్నారు. -
ఇంటర్ మార్కుల జాబితా జారీ
అనంతపురం ఎడ్యుకేషన్ : మార్చిలో జరిగిన ఇంటర్, జూన్‌లో జరిగిన సప్లిమెంటరీ పరీక్షలకు సంబంధించి ద్వితీయ సంవత్సరం విద్యార్థుల మార్కుల జాబితా బోర్డు నుంచి వచ్చినట్లు ఆర్ఐఓ వెంకటేశులు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. బుధవారం నుంచి వీటిని పంపిణీ చేస్తామని పేర్కొన్నారు. ఆయా కళాశాలల ప్రధానాచార్యులు వచ్చి తీసుకెళ్లాలని ఆదేశించారు. -
యూజీ సెకండ్ సెమిస్టర్ ఫలితాల విడుదల
అనంతపురం టౌన్ : యూజీ ఎగ్జామినేషన్ సెకండ్ సెమిస్టర్ ఫలితాలను ఎస్కేయూ వీసీ ప్రొఫెసర్ రాజగోపాల్ శనివారం విడుదల చేశారు. బీఏలో 1,832 మంది హాజరుకాగా 138 మంది, బీఎస్సీలో 5,993 మందికి గాను 1,634, బీ కాంలో 7525 మందికి 1,197, బీబీఏలో 310కి 70 మంది ఉత్తీర్ణులయ్యారు. మొత్తంగా 15,660 మంది పరీక్ష రాయగా 3039 మంది పాసయ్యారు. 19.41 శాతం ఉత్తీర్ణత సాధించారు. రెక్టార్ శ్రీధర్, రిజిస్ట్రార్ ఏవీ రమణ, యూజీ ఎగ్జామినేషన్ డీన్ జీవన్‌కుమార్, కో ఆర్డినేటర్ అక్తార్, రీవాల్యుయేషన్ కో ఆర్డినేటర్ మునినారాయణప్ప, డిప్యూటీ రిజిస్ట్రార్ శ్రీరాములు నాయక్, అసిస్టెంట్ రిజిస్ట్రార్ శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. -
ఎస్కేయూలో ముందస్తు అరెస్టులు
ఎస్కేయూ : రాష్ట్ర బంద్ నేపథ్యంలో శనివారం ఉదయం ఇటుకలపల్లి పోలీసులు విద్యార్థి నా యకులను ముందస్తుగా అదుపులోకి తీసుకొన్నారు. బంద్ నిర్వహించకుండా ఎక్కడికక్కడ పోలీసులు అడ్డుకొన్నారు. ఈ నేపథ్యం లో విద్యార్థులు వ్యూహాత్మకంగా ఆందోళనలు నిర్వహించారు. వర్సిటీ క్యాంపస్ కళాశాలల్లో వేరువేరుగా విడిపోయి నిరసనలు చేపట్టారు. ఎట్టకేలకు పరిపాలన స్తంభించేలా బంద్ నిర్వహించడంలో విద్యార్థి నాయకులు సఫలీకృతులయ్యా రు. రాప్తాడులో జెడ్పీపో్లర్ లీడర్, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు వెన్నపూస రవీంద్రరెడ్డిని, ఎస్కేయూ జేఏసీ నాయకుడు డాక్టర్ సదాశివారెడ్డి, విద్యార్థి నాయకులను అరెస్ట్ చేసి ఇటుకలపల్లి పోలీసు స్టేషన్‌కు తరలించారు. రోడ్డెక్కిన రెండు నిమిషాల్లోనే.. వైఎస్సార్ విద్యార్థి విభాగం ఎస్కేయూ అధ్యక్షుడు గెలివి నారాయణ రెడ్డి, భానుప్రకాష్‌రెడ్డి ఆధ్వర్యంలో విద్యార్థులు జాతీయ రహదారిపై ధర్నా చేయడానికి వచ్చారు. రెండు నిమిషాల్లోనే పోలీసులు వచ్చి బలవంతంగా జీపుల్లోకి ఎక్కించారు. అనంతరం వారు పోలీసు స్టేషన్ ఆవరణంలో ఆందోళనలు నిర్వహించా రు. వైఎస్సార్ విద్యార్థి విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జీవీ లింగారెడ్డి, రాష్ట్ర కార్యదర్శి నరసింహా రెడ్డి, క్రాంతికిరణ్, శ్రీనివాస రెడ్డి, ఎన్ఎస్యూఐ పులిరాజు, ఏఐఎస్ఎఫ్ విశ్వవిద్యాలయాల కన్వీనర్ రామాంజినేయులు, వెంకటేశులు , బీసీ విద్యార్థి సంఘం జయపాల్ యాదవ్, మల్లిఖార్జున, లక్ష్మీనారాయణ , ఎస్ఎఫ్ఐ నాయకులు చంద్ర శేఖర్, ముస్తఫాను అరెస్ట్ చేశారు. -
నేడు ఏపీసెట్
ఎస్కేయూ : ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎలిజిబులిటీ టెస్ట్– 2016 ను ఆదివారం నిర్వహించనున్నట్లు రీజినల్ కోఆర్డినేటర్ ఆచార్య భాస్కర్ తెలిపారు. అనంతపురం నగరం, ఎస్కేయూలో మొత్తం 16 పరీక్ష కేంద్రాల్లో రాత పరీక్ష నిర్వహిస్తున్నట్లు చెప్పారు. అనంతపురం రీజియన్‌లో మొత్తం 9,900 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకొన్నట్లు వివరించారు. హాల్‌టికెట్‌తో పాటు తప్పనిసరిగా ఏదేని గుర్తింపు కార్డును తమ వెంట తీసుకరావాలని సూచించారు. -
హోదా కోసం ఎస్కేయూ బంద్
ఎస్కేయూ : ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందేనని డిమాండ్ చేస్తూ గురువారం ఎస్కేయూలో బంద్ నిర్వహించారు. వర్సిటీ ఎదురుగా ఉన్న జాతీయ రహదారిపై విద్యార్థులు ఆందోళన చేపట్టారు. కార్యక్రమంలో ప్రత్యేక హోదా సాధన సమితి నాయకులు డాక్టర్ సదాశివారెడ్డి, వైఎస్సార్ విద్యార్థి సంఘం రాష్ట్ర కార్యదర్శి నరసింహారెడ్డి, నాయకులు క్రాంతికిరణ్, వై. భానుప్రకాష్‌రెడ్డి, జ్ఞానానందరెడ్డి, ఎన్ఎస్యూఐ నాయకులు పులిరాజు, అంకే శ్రీనివాసులు, బీసీ విద్యార్థి సంఘం నాయకులు జయపాల్‌యాదవ్, కే.మల్లిఖార్జున, లక్ష్మీనారాయణ , ఏఐఎస్ఎఫ్ నాయకులు రామాంజినేయులు, వెంకటేశులు, సుబ్బరాయుడు తదితరులు పాల్గొన్నారు. -
ఖోఖో విజేత ఎస్కేపీ జట్టు
– షటిల్ బ్యాడ్మింటన్ విన్నర్స్ ఎస్ఎస్బీఎన్ జట్టు – ఫుట్‌బాల్ ఫైనల్స్‌లో∙అనంతపురం ఆర్ట్స్, పీవీకేకే జట్లు గుంతకల్లు టౌన్ : ఎస్కేయూ గ్రూప్–బీ టోర్నమెంట్లో భాగంగా స్థానిక ఎస్కేపీ ప్రభుత్వ డిగ్రీ కాలేజి క్రీడామైదానంలో శుక్రవారం జరిగిన ఖోఖో ఫైనల్ మ్యాచ్ ఉత్కంఠగా సాగింది. గుంతకల్లు ఎస్కేపీ ప్రభుత్వ డిగ్రీ కాలేజీ జట్టు ఉరవకొండ ప్రభుత్వ డిగ్రీ కాలేజీ జట్టుపై 24–16 పాయింట్లతో విజయం సాధించింది. కాస్మొపాలిటన్ ఇండోర్ స్టేడియంలో నిర్వహించిన షటిల్ బ్యాడ్మింటన్ ఫైనల్ మ్యాచ్‌లో ఎస్ఎస్బీఎన్ జట్టు 2–0 స్కోరుతో బుక్కపట్నం జట్టుపై విజయం సాధించింది. గుంతకల్లు ఎస్కేపీ ప్రభుత్వ డిగ్రీ కాలేజీ, అనంతపురం ఆర్ట్స్ కాలేజీ మధ్య జరిగిన ఫుట్‌బాల్ మొదటి సెమీఫైనల్స్‌లో ప్రభుత్వ ఆర్స్ కాలేజీ జట్టు 3–0 గోల్స్‌తో ఫైనల్స్‌కు చేరుకుంది. రెండో సెమీఫైనల్స్ మ్యాచ్ అనంతపురం పీవీకేకే, హిందూపురం సప్తగిరి yì గ్రీ కాలేజీ జట్ల మధ్య జరిగింది. ఈ మ్యాచ్‌లో పీవీకేకే జట్టు విజయం సాధించినట్లు స్థానిక ప్రభుత్వ డిగ్రీ కాలేజి ప్రిన్సిపల్ డాక్టర్ జ్ఞానేశ్వర్, ఫిజికల్ డైరెక్టర్ జయలక్ష్మి తెలిపారు. ఫుట్‌బాల్ ఫైనల్ మ్యాచ్ శనివారం ఉదయం జరుగనుంది. ఎస్కేయూనివర్సిటీ స్పోర్ట్స్ సెక్రటరీ డాక్టర్ జెస్సీ ఈ క్రీడలను పరిశీలించారు. వివిధ కాలేజీల ఫిజికల్ డైరెక్టర్లు, క్రీడాకారులు పాల్గొని క్రీడలను వీక్షించారు. -
అంతా అప్రజాస్వామికం
– నోటిఫికేషన్ లేకుండానే వర్శిటీల పాలకమండలి సభ్యుల నియామకం – సమాన అవకాశాలకు పాతరేసిన ప్రభుత్వం – సీనియర్ ప్రొఫెసర్ కోటాలో అనుభవంలేని ప్రొఫెసర్ల ఎంపిక ఎస్కేయూ/ జేఎన్టీయూ : శ్రీకష్ణదేవరాయ విశ్వవిద్యాలయం, జేఎన్టీయూ అనంతపురం పాలకమండలి సభ్యుల నియామకం ఆంధ్రప్రదేశ్ యూనివర్సిటీల యాక్ట్–1991కు విరుద్ధంగా జరిగింది. ఈ ఏడాది ఫిబ్రవరి 26న జరిగిన వర్శిటీల్లోని పరిపాలన, ఆర్థిక పరమైన అత్యున్నత హోదాగల పాలక మండలి సభ్యుల నియామకంలో నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించారన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. వర్సిటీ ప్రొఫెసర్లకు తెలియకుండా భర్తీ : ఆంధ్రప్రదేశ్ యూనివర్సిటీల యాక్ట్ – 1991 , సెక్షన్ 18 (2) ప్రకారం పాలకమండలి సభ్యుల నోటిఫికేషన్‌కు నామినేషన్లు ఆహ్వానించాల్సి ఉంది. యూనివర్సిటీ క్యాంపస్ కళాశాలలో ఒక సీనియర్ ప్రొఫెసర్, క్యాంపస్ కళాశాలలో ఒక ప్రిన్సిపల్, క్యాంపస్ కళాశాలలో ఒక ప్రొఫెసర్ / అధ్యాపకుడు, అనుబంధ కళాశాలల్లో ఒక అధ్యాపకుడు, అనుబంధ కళాశాలల్లో ఒక ప్రిన్సిపల్, విభిన్న రంగాల నుంచి నలుగురు ప్రముఖుల నుంచి నామినేషన్లు దాఖలు చేయాలి. కానీ నియామకాల్లో అలా ఎవరినీ కోరలేదు. కనీసం యూనివర్సిటీ నుంచి ఎంపిక చేయబోయే వారి బయోడేటాలు తెప్పించుకోలేదు. ఎస్కేయూలో జీవో నం. ఎంఎస్ 13, జేఎన్టీయూ అనంతపురంలో జీవో నం.15 ప్రకారం నేరుగా పాలకమండలి సభ్యుల పేర్లను ప్రభుత్వం ఎంపిక చేయడంతో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సమాన అవకాశాలకు పాతర : రాజ్యాంగంలోని 14వ అధికరణ ద్వారా అందరికీ సమాన అవకాశాలు కల్పించాలి. పాలకమండలి సభ్యుల నోటిఫికేషన్ ఇచ్చి ఉంటే అందరూ దరఖాస్తు చేసుకునేవారు. నిష్ణాతుల దరఖాస్తులు పరిశీలించే అవకాశం ఉండేది. ఆంధప్రదేశ్ యూనివర్సిటీస్ యాక్ట్–1991 ప్రకారం సెక్షన్ 33 (2) ప్రకారం పాలక మండలి సభ్యుల నియామకంలో తప్పిదాలు జరిగినా.. చట్టాన్ని అతిక్రమించి భర్తీ చేసినా ఛాన్సలర్, వైస్ ఛాన్సలర్ దష్టికి తీసుకెళ్లాలి. పాలకమండలి సభ్యులు ఛాన్సలర్ విశ్వాసం ఉన్నంత వరకూ పదవిలో ఉంటారు. మూడేళ్ల కాలంలో ఛాన్సలర్ వారిని ఎప్పుడైనా తొలగించొచ్చు. వైస్ ఛాన్సలర్ల నియామకంలో సెర్చ్ కమిటీ ద్వారా ఎంపిక చేసే పద్ధతి అవలంబిస్తున్నారు. కానీ నిర్ణయాలకు ఆమోదం తెలిపే కీలకమైన పాలకమండలి సభ్యుల ఎంపికలో మాత్రం నియంతత్వ ధోరణితో వ్యవహరిస్తుండడం వివాదాస్పదమవుతోంది. ఎస్కేయూ వీసీకి ఫిర్యాదు : తాజాగా పాలకమండలి సభ్యుల నియామకం చేసిన పద్ధతి రాజ్యాంగ విరుద్ధమని ఎస్కేయూ వీసీ ఆచార్య కే.రాజగోపాల్‌కు కొందరు అధ్యాపకులు గత నెల రెండో వారంలో ఫిర్యాదు చేశారు. సీనియర్ ప్రొఫెసర్ కోటాలో పాలక మండలి సభ్యుడిని నియమించారు. 2013లో ప్రొఫెసర్‌గా ఉద్యోగోన్నతి వచ్చిన వారు సీనియర్ ప్రొఫెసర్ ఎలా అవుతారని అందులో పేర్కొన్నారు. వర్సిటీల యాక్ట్‌కు విరుద్ధంగా భర్తీ చేశారని చాన్సలర్ దష్టికి తీసుకెళ్లాలని అందులో కోరారు. -
విద్యార్థుల సంక్షేమం పట్టదా?
– నాసిరకం భోజనంతో అనారోగ్యం – మూడు గంటలపాటు విద్యార్థుల ఆందోళన ఎస్కేయూ : వర్సిటీలోని హాస్టళ్లలో నాసిరకమైన భోజనం అందజేస్తున్నారని విద్యార్థులు బుధవారం ఆందోళనకు దిగారు. నిత్యం కుళ్లిపోయిన కూరగాయలు, నాసిరకం బియ్యం సరఫరా చేస్తున్నా చర్యలు తీసుకొన్న దాఖలాలు లేవన్నారు. ఇందుకు నిరసనగా వర్సిటీ సెంట్రల్ లైబ్రరీ నుంచి పరిపాలన భవనం వరకు విద్యార్థి ఐకాస ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించి బైఠాయించారు. 3 గంటలపాటు ఆందోళన చేశారు. కొందరు విద్యార్థులు టీసీలు ఇచ్చేస్తే వెళ్లిపోతామన్నారు. రెక్టార్ శ్రీధర్, రిజిస్ట్రార్ వెంకటరమణ ఆందోళన చేస్తున్న విద్యార్థులకు నచ్చచెప్పడంతో వారు ఆందోళన విరమించారు. వైఎస్సార్ విద్యార్థి విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి.వి.లింగా రెడ్డి, జిల్లా అధ్యక్షుడు బండి పరుశురాం, క్రాంతికిరణ్, జయచంద్రా రెడ్డి, భానుప్రకాష్ రెడ్డి , అంకే శ్రీనివాసులు, అశ్వర్థ, శ్రీనివాసులు, ఓబులేసు, బాలరాజు, నారాయణ రెడ్డి, గోవర్ధన్, లింగ, నల్లప్ప, మనోహర్, ఎస్ఎఫ్ఐ చంద్రశేఖర్, జీవీఎస్ అశోక్ నాయక్, నరేష్ నాయక్ తదితరులు పాల్గొన్నారు. -
బోధన.. వేదన
– అధ్యాపక పోస్టుల కేటాయింపులో అసంతృప్తి – ప్రాధాన్యమున్న విభాగాలకు రిక్తహస్తం – అప్రాధాన్య విభాగాలకు పోస్టుల మంజూరు – ఆరు విభాగాలకు ఒక్కో పోస్టుతో సరి ఎస్కేయూ : రాష్ట్ర వ్యాప్తంగా వర్సిటీల్లో బోధన పోస్టులు భర్తీ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఉమ్మడి రాత పరీక్ష నిర్వహించి ఆయా వర్సిటీలు ఇంటర్వ్యూలు నిర్వహించాలనే ప్రతిపాదన ఉంది. ఆయా వర్సిటీలకు సంబంధించి విభాగాల వారీగా ప్రొఫెసర్, అసోసియేట్, అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల జాబితాను రూపొందించారు. ఇందుకు రోస్టర్ పాయింట్లు నిర్ధారించాల్సి ఉంది. శ్రీకష్ణదేవరాయ విశ్వవిద్యాలయంలోని విభాగాల వారీగా నిర్ధారించిన బోధన పోస్టులు సమతూకం పాటించలేదనే విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ఏళ్ల తరబడి బోధన పోస్టుల కోసం నిరీక్షించిన వారికి నిరాశ తప్పలేదు. మరో వైపు బోధన పోస్టులు కేటాయించని విభాగాల్లో సిబ్బంది కొరత యథాతథం కానుంది. తెరపైకి ఆంధ్ర భారతి 5 విభాగాలకు ఒక్క పోస్టును కూడా కేటాయించకుండా నిరాశ కలిగించారు. బయోటెక్నాలజీ, ఫిజికల్ ఎడ్యుకేషన్, అడల్ట్ ఎడ్యుకేషన్ ,హిందీ , సెరికల్చర్ విభాగాలకు అసిస్టెంట్, అసోసియేట్, ప్రొఫెసర్ పోస్టులు నిర్ధారించలేదు. రెండు దఫాలుగా భర్తీ చేస్తామని ప్రకటించిన నేపథ్యంలో సెరికల్చర్ విభాగానికి మాత్రం రెండో దఫా నోటిఫికేషన్లో ఒక అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టును కేటాయించారు. ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ ఇంజినీరింగ్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ , కంప్యూటర్ సైన్సెస్ , సివిల్, మెకానికల్ ఇంజినీరింగ్, ఫార్మసీ విభాగాలకు కేవలం ఒకే ఒక అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టు కేటాయించి చేతులు దులుపుకొన్నారు. ప్రస్తుతం తెలుగు విభాగాన్ని తెలుగు తులనాత్మక సాహిత్య శాఖ అని పిలుస్తున్నారు. కానీ పోస్టులు పొందుపరిచిన జాబితాలో ఆంధ్రభారతి అనే పేరు ఉంది. దీంతో రోస్టర్ పాయింట్లు మారే ప్రమాదం లేకపోలేదు. తెలుగు తులనాత్మక అధ్యయన శాఖ అనే పేరుతో ‘ టీ’ అనే అక్షరంతో రోస్టర్ పాయింట్లు ప్రారంభం కావాల్సి ఉంది. ఆంధ్రభారతి అనే పేరును వెబ్సైట్లో ప్రకటించడంతో ‘ఏ’ అనే అక్షరాన్ని రోస్టర్ పాయింట్లు నిర్ధారించడానికి తీసుకొంటారు. ఇలాంటి చిక్కులు ఉత్పన్నమవుతున్నాయి. ఎకనామిక్స్ విభాగంలో ప్రాజెక్ట్ గడువు పూర్తీ అయినప్పటికీ స్టాటిస్టికల్ ఆఫీసర్ పోస్టు ఉన్నట్లు చూపడంతో న్యాయపరమైన చిక్కులు ఎదురుకానున్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. -
ఎడ్‌సెట్ కౌన్సెలింగ్ ప్రారంభం
ఎస్కేయూ : బీఈడీ కోర్సుల్లో ప్రవేశాలు నిర్వహించే ఎడ్‌సెట్–2016 కౌన్సెలింగ్ ఆదివారం ప్రారంభమైంది. ఎస్కేయూ హెల్ప్‌లైన్ సెంటర్లో జరుగుతున్న సర్టిఫికెట్ల పరిశీలనకు 281 మంది విద్యార్థులు హాజరైనట్లు కోఆర్డినేటర్ ఆచార్య సుధాకర్ తెలిపారు. ఫైబర్‌గ్రిడ్ పనిచేయకపోవడతో ఎస్కేయూలోని ల్యాన్ (లోకల్ ఏరియా నెట్వర్క్) ద్వారా విద్యార్థులకు అవకాశం కల్పించి సర్టిఫికెట్ల పరిశీలన సజీవుగా జరిపినట్లు పేర్కొన్నారు. -
నేడు డిగ్రీ రీవాల్యుయేషన్ ఫలితాలు
ఎస్కేయూ: శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం పరిధిలో డిగ్రీ మొదటి, రెండో సంవత్సరం డిగ్రీ రీవాల్యుయేషన్ ఫలితాలు ఆదివారం విడుదల చేస్తున్నట్లు యూజీ డీన్ ఆచార్య జీవన్‌కుమార్ తెలిపారు. -
కలుషిత ఆహారం తిని విద్యార్థులకు అస్వస్థత
అనంతపురం సెంట్రల్/ఎస్కేయూ : ఎస్కేయూలోని వసతి గృహంలో గురువారం రాత్రి కలుషిత ఆహారం తిని విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. గంగ, మహానంది వసతి గృహంలోని విద్యార్థులు మెస్ హాలులో భోజనం చేశారు. అయితే తిన్న అరగంటకే విద్యార్థులకు వాంతులు, విరేచనాలు మొదలయ్యాయి. మొత్తం 30 మంది విద్యార్థులు అస్వస్థతకు గురి కాగా హుటాహుటిన 108లో, యూనివర్సిటీ వాహనాలు, పోలీసు వాహనాల్లో అనంతపురం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అయితే అస్వస్థతకు గురైన విద్యార్థుల సంఖ్య మరింత పెరగనుండడంతో మరిన్ని వాహనాలను హాస్టళ్ల వద్ద సిద్ధం చేసి ఉంచారు. కాగా ఈ ఘటనపై విద్యార్థులు హాస్టల్ ఆవరణంలో ధర్నా చేపట్టారు. -
ఆవిష్కరణలతోనే నవ సమాజం
ఎస్కేయూ : నూతన ఆవిష్కరణలతోనే నవ సమాజం సిద్ధిస్తుందని అనంతపురం రేంజ్ డీఐజీ జె.ప్రభాకర్ రావు అన్నారు. శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయంలోని ఫిజిక్స్ విభాగంలో ప్రతిభావంతులైన విద్యార్థులకు ఇన్‌సె్పౖర్ కార్యక్రమాలు బుధవారం ప్రారంభమయ్యాయి. ముఖ్య అతిథి డీఐజీ మాట్లాడుతూ శాస్త్ర సాంకేతిక పురోగతితోనే దేశాభివృద్ధి సాధ్యమన్నారు. నిష్ణాతుల ప్రసంగాలు విని శాస్త్రీయత పెంచుకోవాలని విద్యార్థులకు సూచించారు. అంతకుముందు వర్సిటీలో ఇస్రో ప్రాజెక్ట్ ప్రయోగాలను ఆయన పరిశీలించారు. ఆచార్య రాజూరి రామకృష్ణారెడ్డి, ఇస్రో శాస్త్రవేత్త కోటేశ్వరరావు మాట్లాడారు. కార్యక్రమంలో ఎస్కేయూ క్యాంపస్ కళాశాల సైన్స్ ప్రిన్సిపల్ ఆచార్య రంగస్వామి, ఆచార్య రామాంజిప్ప, ఆచార్య జీవన్‌కుమార్, ఇన్‌సె్పౖర్ ప్రోగ్రాం కోఆర్డినేటర్ డాక్టర్ రాంగోపాల్, డాక్టర్ శంకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
అందరూ ఒకే సబ్జెక్టు ఫెయిలా..?
ఎస్కేయూ: మూడు కళాశాలల్లోని విద్యార్థులందరూ ఎమ్మెస్సీ మేథమేటిక్స్ గ్రాఫ్ థియరీ సబ్జెక్టు ఎలా ఫెయిల్ అవుతారని ఎస్ఎఫ్ఐ నాయకులు ప్రశ్నించారు. కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ (సీఈ) ఎం.ఎ.ఆనంద్ చాంబర్ ఎదుట బైఠాయించారు. అన్ని సబ్జెక్టుల్లో ప్రథమశ్రేణిలో ఉత్తీర్ణులై ఆ ఒక్క సబ్జెక్టులో ఎందుకు ఫెయిల్ అయ్యారో చెప్పాలని డిమాండ్ చేశారు. విద్యార్థులు రాసిన సమాధాన పత్రాలు పునఃపరిశీలించాలని కోరారు. కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ రాష్ట్ర నేత ఓ కొండన్న, ఎస్కేయూ నాయకులు ముస్తఫా, అశోక్, పవన్‌కుమార్, నరేష్, నాగేంద్ర తదితరులు పాల్గొన్నారు. -
త్వరలో స్కూటా ఎన్నికలు
ఎస్కేయూ : శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం అధ్యాపకుల సంఘం (స్కూటా ) ఎన్నికలు త్వరలో జరగనున్నాయి. రిటర్నింగ్ అధికారిగా ఆచార్య అమర్నాథ్ దాస్‌ను నియమించారు. అయితే స్కూటాలో 21 అసిస్టెంట్ ప్రొఫెసర్లు, 10 వ ప్లాన్ ద్వారా నియామకమైన 8 మంది అసిస్టెంట్ ప్రొఫెసర్లకు సభ్యత్వం ఇవ్వకూడదనే ప్రతిపాదనను రిటర్నింగ్ అధికారి తిరస్కరించినట్లు తెలిసింది. ఇదిలా ఉండగా, నామినేషన్‌కు చివరి తేదీ బుధవారం అయినప్పటికీ ఎవరూ నామినేషన్ దాఖలు చేయలేదు. బోటనీ విభాగంలో బుధవారం సీనియర్ ప్రొఫెసర్లు నామినేషన్ అంశంపై చర్చించారు. ఎన్నికలు జరపాలా? లేక ఏకగ్రీవంగా కార్యవర్గాన్ని ఎన్నుకోవాలా? అనే అంశాలపై భిన్న అభిప్రాయాలు వ్యక్తం అయ్యాయి. -
నాసిరక ఆహారంపై ఆందోళన
ఎస్కేయూ: ఎస్కేయూ ఇంజనీరింగ్ కళాశాలకు చెందిన తుంగభద్ర హాస్టల్లో సోమవారం రాత్రి వడ్డించిన ఆహారం నాసిరకంగా ఉందని విద్యార్ధులు ఆందోళన చేపట్టారు. ఉడకని అన్నం ఎలా తినాలని అధికారులను ప్రశ్నించారు. ఇందుకు నిరసనగా హాస్టల్ ముందు ౖ»ñ ఠాయించి ధర్నా చేపట్టారు. ప్రతి రోజు ఇదే తరహాలో నాసిరకంగా భోజనం అందిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రశ్నిస్తే ఫెయిల్ చేస్తామని బెదిరిస్తున్నారని వాపోయారు. మంగళవారం నుంచి నిరవధిక ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు. -
ఎస్కేయూకు సౌర వెలుగులు
ఎస్కేయూ: శ్రీకృష్ణదేవరాయ విశ్వవి ద్యాలయంలో సౌర విద్యుదుత్పత్తికి సన్నాహాలు చేస్తున్నట్లు వీసీ ఆచార్య కె.రాజగోపాల్ అన్నారు. స్వాత్రంత్య వేడుకలను పురస్కరించుకుని సోమవారం ఎస్కేయూ స్టేడియంలో జాతీ య జెండాను ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ వర్సిటీలో ఒక మెగా వాట్ సౌర విద్యుదుత్పత్తి చేయనున్నామన్నారు. సెంటర్ ఫర్ సెల్యూలార్ మాలిక్యులార్ బయాలజీ పరిశోధన సంస్థ వారు వర్సిటీలో అదనపు పరిశోధన సంస్ధను ఏర్పాటు చేయనున్నారని వెల్లడించారు. 23న జెండా పండుగ: ఈ నెల 23న ఎస్కే యూనివర్సిటీ విద్యార్థులతో జెండా పండుగ నిర్వహిస్తామన్నారు. కార్యక్రమంలో రెక్టార్ ఆచార్య జి. శ్రీ« దర్,ఆచార్య సీఎన్ కృష్ణానాయక్, ఆచార్య బి.పణీశ్వర రాజు , డాక్టర్ బి. జెస్సీ పాల్గొన్నారు. -
నకిలీ వికలాంగుల లీలలు
శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయంలో సకలాంగులైన ఉద్యోగులు వికలాంగులుగా అవతారమెత్తారు. వి కలాంగ ఉద్యోగులకు దక్కాల్సిన అ లవెన్సులు ప్రతినెలా నొక్కేస్తున్నారు. దీంతో లక్షలాది రూపాయలు వర్సిటీ ఖజానాకు చిల్లుపడుతోంది. మరోవైపు పీజీ , ‘లా’, పీహెచ్డీ అభ్యసిస్తున్న వికలాంగ విద్యార్థులకు దక్కాల్సిన సౌకర్యాల కోసం ఏళ్ల తరబడి అధికారుల చుట్టూ తిరుగుతున్నా ఫలితం లేకపోయిందని వారు వాపోతున్నారు. అన్ని విశ్వవిద్యాలయాల్లోను మెస్ బిల్లులు పూర్తిగా మినహాయింపు ఉన్నా, వర్సిటీలో అమలు చేయడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తుదకు వికలాంగ విద్యార్థులకు వస్తున్న ప్రాజెక్ట్‌లు కూడా వారికి దక్కకుండా చేస్తున్నారు. కానీ ప్రతి నెలా వికలాంగుల పేరుతో వర్సిటీ చెల్లిస్తున్న అలవెన్సులు స్వాహా చేస్తున్న ఉద్యోగులపై చర్యలు తీసుకొన్న పాపాన పోలేదు. నకిలీ మెడికల్ సర్టిఫికెట్లతో పబ్బం ప్రతి నెలా ఒక్కో ఉద్యోగికి ప్రత్యేక అలవెన్స్ జీతం కాకుండా అదనంగా రూ. 1350 వర్సిటీ చెల్లిస్తుంది. ఈ అలవెన్స్‌ను తీసుకోవడానికి ఆరోగ్య అధికారి నుంచి ధ్రువీకరణ పత్రం తీసుకరావాల్సి ఉంటుంది. పీహెచ్సీ 60శాతం పైగా ఉంటేనే వీరికి అలవెన్సు తీసుకోవడానికి అర్హత ఉంటుంది. అది కూడా జన్మతా గానీ, ప్రమాదవశాత్తు వికలాంగులై ఉండాలి. అయితే తప్పుడు ధ్రువీకరణ పత్రాలను పొందుపరచి ప్రతినెలా అలవెన్సులు స్వాహా చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ యూనివర్సిటీ యాక్ట్ ప్రకారం పనిచేసే శాశ్వత కార్మికులకు విధి నిర్వహణలో ఏదైనా ప్రమాదం జరిగితే వాళ్లకు స్వాంతన కలిగించడం కోసం ఈ అలవెన్సులు చెల్లించాలని సూచించింది. కానీ వేలికి స్వల్పపాటి గాయమైనా కూడా పీహెచ్ కోటాలో ఈ విధంగా లబ్ధి పొందడం గమనార్హం. రెండు దశాబ్దాలుగా అక్రమాలు రెండు దశాబ్దాలకుపైగా వికలాంగుల∙కోటాలో అలవెన్సులు తీసుకొంటున్నారని సమాచారం. మొత్తం 26 మంది ఉద్యోగులు వికలాంగ అలవెన్సు తీసుకొంటున్నారు. ఇందులో 12 మంది సకలాంగులు అయినప్పటికీ ప్రత్యేక అలవెన్సు తీసుకోవడం గమనార్హం. ఏ విధమైన వికలాంగత్వం లేకపోయినప్పటికీ వికలాంగులుగా పరిగణించి ధ్రువపత్రాలు ఏవిధంగా ఇచ్చారు. అవి సరైన పత్రాలా? కాదా? అని అధికారులు పరిశీలించిన దాఖలాలు లేవు. -
ఏపీ లాసెట్ ఫలితాలు విడుదల
అనంతపురం : శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో నిర్వహించిన ఏపీ లాసెట్ ఫలితాలను రాష్ట్ర సమాచార శాఖ మంత్రి పల్లె రఘునాథరెడ్డి శుక్రవారం ఎస్కేయూలోని పాలకభవనంలో విడుదల చేశారు. ఏపీ లాసెట్‌ను మే 28న నిర్వహించారు. మొత్తం 10,499 మంది హాజరుకాగా , 9,841(93.73 శాతం) మంది ఉత్తీర్ణులైనారు. మూడేళ్ల ఎల్ఎల్బీ కోర్సు ప్రవేశ పరీక్షకు 7,914 మంది హాజరుకాగా 7,556 మంది (95.12 శాతం), ఐదేళ్ల ఎల్ఎల్బీ కోర్సు ప్రవేశ పరీక్షకు 2,033 మంది హాజరుకాగా 1,770 మంది (87.06 శాతం), ఎల్ఎల్ఎం (పీజీ కోర్సు) ప్రవేశ పరీక్షకు 522 మంది హాజరుకాగా 515 మంది (98.66 శాతం ) అర్హత సాధించారు. గతేడాదితో పోలిస్తే 8 శాతం ఉత్తీర్ణత పెరిగింది. -
ప్రిన్సిపల్ అవినీతిపై విచారణ చేపట్టాలి
అనంతపురం: శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీ ఇంజనీరింగ్ కళాశాల ప్రిన్సిపల్ నాగభూషణ రాజుపై విచారణ చేపట్టాలని శుక్రవారం విద్యార్థి సంఘాలు డిమాండ్ చేశాయి. విద్యార్థులకు చెందిన ఫీజు రీయింబర్స్ బకాయిలు ఇటీవల ప్రభుత్వం విడుదల చేసినా స్టూడెంట్స్ కు చెల్లించకుండా సొంత అవసరాల నిమిత్తం వాడుకున్న ప్రిన్సిపల్‌పై చర్యలు తీసుకోవాలని యూనివర్సిటీ పాలక భవనం ఎదుట ఆందోళన చేపట్టారు. ప్రిన్సిపల్ రూ.కోటి 38 లక్షల అవినీతికి పాల్పడ్డారని విద్యార్ధి సంఘాల నాయకులు తెలిపారు. ఈ ఆందోళనలో ఏబీవీపీతో పాటు వైఎస్సార్సీపీ విద్యార్థి విభాగం, ఐటీ విభాగం నాయకులు పాల్గొన్నారు. -
అనంతపురం ఎస్కేయూనివర్సిటీలో ర్యాగింగ్
-
విద్యార్థుల ఉద్యమం.. ఎస్కేయూలో ఉద్రిక్తత
చంద్రబాబు సర్కారు తీరుపై విద్యార్థులు ఉద్యమించడంతో అనంతపురంలోని శ్రీ కృష్ణదేవరాయ విశ్వవిద్యాలయంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. అనంతపురం - చెన్నై జాతీయ రహదారిని విద్యార్థులు దిగ్బంధించారు. స్వగ్రామానికి వెళ్తున్న ఆంధ్రప్రదేశ్ డీజీపీ జాస్తి వెంకట రాముడిని కూడా వాళ్లు అడ్డుకున్నారు. విద్యార్థులు రోడ్డుపై పడుకోవడంతో వారిని అక్కడినుంచి తరలించేందుకు పోలీసులు ప్రయత్నించగా, వాళ్లతో వాగ్వాదానికి దిగారు. ఎస్జీటీ ఉద్యోగాల్లో బీఈడీ విద్యార్థులకు అవకాశం కల్పించాలని విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు. చంద్రబాబు సర్కారు కంటే పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం మేలని ఎస్కే యూనివర్సిటీ విద్యార్థులు అన్నారు. కేంద్రంతో వైరుధ్యం ఉన్నా కూడా ఎస్జీటీ ఉద్యోగాల్లో బీఈడీ విద్యార్థులకు అనుమతి ఇచ్చారని, కానీ ఇక్కడ మాత్రం అలా చేయడం లేదని అన్నారు. -
మార్కుల తగ్గుదలపై విద్యార్థుల ఆగ్రహం
అనంతపురం : శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీ పరిధిలోని డిగ్రీ, పీజీ పరీక్షల రీవాల్యుయేషన్లో మార్కులు తగ్గడంపై విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్సార్ విద్యార్థి విభాగం, బీసీ విద్యార్థి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఆనంద్‌ను ఘెరావ్ చేశారు. సంఘటన వివరాల ప్రకారం.. ఎమ్మెస్సీ కెమిస్ట్రీ చదువుతున్న విద్యార్థులకు సంబంధిత సబ్జెక్ట్ లో తక్కువ మార్కులు రావడంతో 70 మంది విద్యార్థులు రీవాల్యుయేషన్‌కు దరఖాస్తు చేసుకోగా ఫలితాల్లో అందరినీ ఫెయిల్ చేశారని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో వచ్చిన మార్కుల కంటే తక్కువ మార్కులు నమోదు చేసి చూపించారని ఆరోపించారు. రీవాల్యుయేషన్లో ఫెయిల్ అయిన విద్యార్థులకు మరోమారు రాత పరీక్షలకు దరఖాస్తు చేసుకోవడానికి నేడు ఆఖరి రోజు కావడంతో దరఖాస్తు గడువు పెంచాలని రిజిస్ట్రార్ ఆచార్య కె.దశరథరామయ్యను కోరారు. రీవాల్యుయేషనలో అక్రమాలు జరిగాయని రిజిస్ట్రార్‌తో వాగ్వాదం చేశారు. ఈ కార్యక్రమంలో జయచంద్రారెడ్డి, కె.మల్లిఖార్జున, చిన్న శంకర్‌నాయక్, బంగారప్ప, సిద్దప్ప తదితరులు పాల్గొన్నారు. -
నేనే పెద్దరౌడీనంటూ వీసీ వీరంగం
అనంతపురం: ఎస్కే యూనివర్సిటీ వైస్ చాన్సలర్ రామకృష్ణారెడ్డి విద్యార్థి సంఘం నాయకులపై చిందులు తొక్కారు. తానే పెద్ద రౌడీనని, రోడ్డుపైకి వస్తే తేల్చుకుందామంటూ వీరంగం సృష్టించారు. ఎస్కే యూనివర్సిటీలో అధికార టీడీపీ మద్దతుదారులకు ఉద్యోగాలు ఇవ్వడంపై వైఎస్ఆర్ సీపీ విద్యార్థి విభాగం అభ్యంతరం వ్యక్తం చేసింది. విద్యార్థి విభాగం నాయకుడు లింగారెడ్డి తదితరులు వీసీని కలసి ఈ విషయం గురించి ప్రశ్నించారు. ఈ సందర్భంగా వీసీ రామకృష్ణారెడ్డి, విద్యార్థి సంఘం నాయకుల మధ్య వాగ్వాదం జరిగింది. వీసీ రెచ్చిపోయి తానే పెద్ద రౌడీనంటూ, లింగారెడ్డికి వార్నింగ్ ఇచ్చారు. ఆయన చొక్కా పట్టుకుని లాగేందుకు ప్రయత్నించారు. -
మిస్టరీ వీడని హరిత హత్య కేసు
అనంతపురం క్రైం, న్యూస్‌లైన్ : బుక్కరాయసముద్రం మండలం కొర్రపాడు గ్రామ శివారులోని గుట్టల్లో 2012 మార్చి 21 తెల్లవారుజామున దారుణ హత్యకు గురైన హరిత (25) కేసు నేటికీ మిస్టరీగానే మిగిలిపోయింది. అప్పట్లో సంచలనం రేపిన ఈ కేసులో నిందితులను ఓ అమాత్యుడు రక్షిస్తున్నట్లు ఆరోపణలున్నాయి. దాదాపు రెండేళ్లు కావస్తున్నా కేసు పురోగతి లేకపోవడంతో పోలీసుల చిత్తశుద్ధిపై అనుమానాలు తలెత్తుతున్నాయి. బెళుగుప్ప మండలం ఆవులదిన్నె గ్రామానికి చెందిన హరిత (25) శింగనమల మండలం మట్లగొందిలోని తన అక్క ఇంట్లో ఉండేది. ఉన్నత విద్య నిమిత్తం అక్క ఇంట చేరిన ఆమె.. ఎస్కే యూనివర్సిటీలో ఎంకామ్ పూర్తి చేసింది. అనంతరం నగరంలోని ఓ ప్రైవేట్ కంపెనీలో రిసెప్షనిస్ట్‌గా చేరింది. అక్కడ వచ్చే వేతనం తక్కువ కావడంతో ఆర్డీటీలో ఎస్టీఎల్ పోస్టుకు దరఖాస్తు చేసుకుంది. ఆమెను 2012 మార్చి 18న ఇంటర్వ్యూకు పిలిచారు. దీంతో మట్లగొంది నుంచి నగరానికి వచ్చింది. ఇంటర్వ్యూ పూర్తయిన తర్వాత నగర శివారులోని ఆర్డీటీ కార్యాలయం నుంచి ఆటోలో ఆర్టీసీ బస్టాండుకు చేరుకుంది. అప్పటికే సమయం సాయంత్రం 6.30 గంటలు కావడంతో బావ కొర్రి రాముడుకు ఫోన్ చేసి ఆలస్యానికి గల కారణాన్ని తెలియజేసింది. అలాగే ఓ అపరిచిత వ్యక్తి మీకు సన్నిహితుడినంటూ తనను పరిచయం చేసుకున్నాడని చెప్పింది. ఫోన్లో మాట్లాడిన ఆ వ్యక్తి ‘అన్నా నేను శివ. పాపను బస్సు ఎక్కించి పంపుతా’నని చెప్పాడు. అయితే.. గ్రామానికి ఎనిమిది గంటలకు చేరాల్సిన హరిత ఆర్టీసీ బస్సు వచ్చినా అందులో కనిపించలేదు. దీంతో కుటుంబ సభ్యులు గాలింపు చేపట్టారు. ఆచూకీ లేకపోవడంతో మార్చి 19న స్థానిక త్రీటౌన్ పోలీసులకు కొర్రి రాముడు ఫిర్యాదు చేశాడు. ఇంటికి వచ్చేందుకు బస్సెక్కినట్లు చెప్పిన హరిత కనిపించడం లేదని ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఇదిలా ఉండగా.. మార్చి 21న బుక్కరాయసముద్రం మండలం కొర్రపాడుకు చెందిన గొర్రెల కాపరులు కాలి వున్న గుర్తు తెలియని యువతి మృతదేహాన్ని కనుగొన్నారు. పోలీసులకు సమాచారమిచ్చారు. రంగంలోకి దిగిన పోలీసులు ఆ మృతదేహం హరితదేనని నిర్ధారించారు. ఆమె వద్ద హ్యాండ్ బ్యాగుతో పాటు పసుపు కొమ్మలు, సెల్‌ఫోన్ లభించాయి. దీంతో ఆమెను వివాహం చేసుకుంటానని చెప్పి నమ్మించి.. ఈ ప్రాంతానికి తీసుకువచ్చి హతమార్చినట్లు పోలీసులు ప్రాథమిక దర్యాప్తులో నిర్ధారించారు. సెల్‌ఫోన్‌లోని కాల్ డేటా కూడా తీశారు. అయితే అందులో హంతకులకు సంబంధించిన వివరాలేవీ లభించలేదని అప్పట్లో ఆ సర్కిల్ ఇన్స్పెక్టర్ వెల్లడించారు. అత్యాచారం... ఆపై హత్య! హరితను గుర్తు తెలియని వ్యక్తులు నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి అత్యాచారం చేసి, ఆపై చున్నీతో ఉరివేసి చంపిన ఆనవాళ్లు ఉన్నాయని పోలీసులు తెలిపారు. మార్చి 18 రాత్రే కడతేర్చి ఉండవచ్చని ప్రాథమికంగా నిర్ధారించారు. ఈ ఘటనలో అనుమానితులను బుక్కరాయసముద్రం పోలీసులు అప్పట్లో అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. అంతలో ఓ అమాత్యుడు నిందితులకు మద్దతుగా జోక్యం చేసుకోవడంతో పోలీసులు మిన్నకుండిపోయినట్లు సమాచారం. ఈ కేసు దర్యాప్తు విషయంపై బుక్కరాయసముద్రం ఎస్.ఐ మోహన్‌కుమార్‌ను ‘న్యూస్‌లైన్’ సంప్రదించగా.. తాను కొత్తగా బాధ్యతలు స్వీకరించానని, ఫైల్‌ను పూర్తిగా పరిశీలించాల్సి ఉందని చెప్పారు. -
విద్యార్థిగా మారిన డీజీపీ!
ఎస్కేయూలో ప్రీ పీహెచ్డీ పరీక్షకు హాజరు రాష్ట్ర పోలీసుశాఖలో అత్యున్నత పదవిలో ఉన్న డీజీపీ బయ్యారపు ప్రసాదరావు విద్యార్థిగా మారారు. శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం(ఎస్కేయూ)లో భౌతికశాస్త్రంలో పరిశోధన చేసేందుకు ప్రభుత్వ అనుమతితో ఎగ్జిక్యూటివ్ కోటా కింద పీహెచ్‌డీలో పేరు నమోదు చేసుకున్న ప్రసాదరావు.. ఇందులో భాగంగా పీహెచ్‌డీకి అర్హత పొందేందుకు అవసరమైన ప్రీ పీహెచ్డీ పేపర్-1 (రీసెర్చ్ మెథడాలజీ) పరీక్షను శనివారం మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 గంటల వరకు రాశారు. ఆదివారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పేపర్-2 (లైట్ అండ్ మ్యాటర్ ఇంటరాక్షన్) పరీక్ష రాయనున్నారు. డీజీపీకి సమైక్య సెగ :ఎస్కేయూలో ప్రీ పీహెచ్డీ పరీక్ష రాసి వెళుతున్న డీజీపీని విద్యార్థి జేఏసీ నాయకులు అడ్డుకున్నారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని కోరుతూ ఉద్యమించిన విద్యార్థులపై బనాయించిన అక్రమ కేసులను ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. డీజీపీ స్పందిస్తూ.. కేసుల ఎత్తివేత వ్యవహారం తన పరిధిలో లేదని, ప్రభుత్వం దృష్టికి తీసుకెళతానని హామీ ఇచ్చారు. -
ఎస్కే యూనివర్శిటీలో డీజీపీ ప్రసాదరావుకు సమైక్య సెగ
అనంతపురం: జిల్లాలో డీజీపీ ప్రసాదరావుకు సమైక్య సెగ తగలింది. ఎస్కే యూనివర్శిటిలో పీహెచ్డీ పరీక్షకు హాజరైన డీజీపీ ఎదుట అక్కడి విద్యార్థులు సమైక్యనినాదాలు చేశారు. రాష్ట్ర విభజన బిల్లుపై కేంద్రం నిర్ణయానికి వ్యతిరేకంగా సీమాంధ్ర ఉద్యమం పెద్దెఎత్తున జరిగిన సంగతి తెలిసిందే. ఈ ఉద్యమంలో పాల్గొన్న సమైక్యవాదులు నిరసనలు, ధర్నాలు వంటి ఆందోళన కార్యక్రమాలు చేపట్టారు. ఈ నేపథ్యంలో సమైక్యవాదులపై పలు కేసులు నమోదు చేశారు. ఆ కేసులు ఎత్తివేయాలంటూ విద్యార్ధులు సమైక్య నినాదాలు చేశారు. దీంతో ప్రసాదరావు సమైక్యవాదులపై కేసుల ఎత్తివేత అంశాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని చెప్పినట్టు సమాచారం. ఎస్కే యూనివర్శిటిలో ప్రసాదరావు భౌతికశాస్ర్తంలో పిహెచ్డీ చేస్తున్నారు. -
ఎస్కేయూలో వేడిక్కిన వాతావరణం
-
ఎస్కేయూ వద్ద ఉద్రిక్తత..
ఎస్కేయూ, న్యూస్‌లైన్ : సమైక్యాంధ్ర ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడింది. ఆంధ్రప్రదేశ్‌ను విభజిస్తే తమ భవిష్యత్తు బజారు పాలేనంటూ ఎస్కేయూ విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేశారు. 72 రోజులుగా అనంతపురం నగరంలో జరుగుతున్న సమైక్యాంధ్ర ఉద్యమంలో తామూ పాలుపంచుకుంటామని ఎస్కేయూ సమైక్యాంధ్ర జేఏసీ ఆధ్వర్యంలో బయల్దేరిన విద్యార్థులను పోలీసులు అడ్డుకున్నారు. నగరంలోకి వెళ్లరాదని ఆంక్షలు విధించారు. మూడు గంటల పాటు పోలీసులు, విద్యార్థుల మధ్య తోపులాట జరిగింది. కొందరు విద్యార్థులు సొమ్మసిల్లిపడిపోయారు. అనంతపురంలో జరిగే ఉద్యమంలో పాల్గొనేందుకు తమకు అనుమతి ఇవ్వాలని ఎస్కేయూ విద్యార్థులు కోరగా.. పోలీసులు ససేమిరా అన్నారు. ఏదేమైనా తాము ఉద్యమంలో పాల్గొంటామని గురువారం ఉదయమే వందలాది మంది విద్యార్థులు బస్సుల్లో వెళ్లేందుకు సిద్ధమయ్యారు. అప్పటికే జిల్లా కేంద్రం నుంచి డీఎస్పీ దయానందరెడ్డి, సీఐలు మహబూబ్‌బాషా, గోరంట్ల మాధవ్, గురునాథ్‌బాబు, శ్రీనివాసులు, విజయకుమార్, పలువురు ఎస్ఐలు, స్పెషల్ పార్టీ పోలీసులతో యూనివర్సిటీకి చేరుకున్నారు. వర్సిటీ విద్యార్థులు నగరంలోకి వస్తే అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకునే అవకాశమున్నందున అనుమతిచ్చేది లేదని పోలీసులు తేల్చి చెప్పారు. దీంతో పోలీసులు, విద్యార్థుల మధ్య అర గంటకుపైగా వాగ్వాదం జరిగింది. అనంతరం అనేక మంది విద్యార్థులు బస్సుల్లో పంగల్ రోడ్డు వద్దకు చేరుకున్నారు. అప్పటికే అక్కడికి చేరుకున్న పోలీసు బలగాలు బస్సులను అడ్డుకున్నాయి. విద్యార్థులంతా బస్సులు దిగి పోలీసులను ప్రతిఘటించారు. తామేమైనా వీధి రౌడీలమా.. అంటూ ఆగ్రహించారు. నగరంలోకి వెళ్లి తీరతామని ఆక్రోశం వెళ్లగక్కారు. పోలీసు వలయాన్ని ఛేదించుకొని విద్యార్థులు పంగల్ రోడ్డు నుంచి నగరంలోకి వెళ్లాలని పరుగులు తీశారు. పోలీసులూ వారిని వెంబడించారు. ఆర్డీటీ స్టేడియం, టీవీ టవర్ వరకూ విడతల వారీగా విద్యార్థులు పరుగెత్తారు. వారిని పోలీసులు ఎక్కడిక క్కడ అడ్డుకుని ఈడ్చి పారేశారు. నగరం నుంచి అదనపు బలగాలను పంపించిన ఉన్నతాధికారులు అక్కడికి చేరుకోగానే ఓ సీఐ ‘మీరు మనుషులా.. కాదా.. ఒక్కసారి చెప్తే వినబడదా.. కొడుకుల్లారా.. మీ ఇష్టం’ అంటూ విద్యార్థుల మీదకు వెళ్లారు. పోలీసుల నుంచి తప్పించుకున్న పలువురు విద్యార్థులు రోడ్డుపై స్పృహ తప్పిపడిపోగా.. మరికొంత మందిని పోలీసులే విచక్షణారహితంగా తోసివేశారు. ప్రొఫెసర్ డాక్టర్ సదాశివరెడ్డి పంగల్ రోడ్డులో సొమ్మసిల్లిపడిపోయారు. పోలీసులు ప్రతాపం చూపిస్తున్నారంటూ ఆవేదన వ్యక్తంచేశారు. మరింత రెచ్చిపోయిన పోలీసులు విశ్వవిద్యాలయాల జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ రాజేశ్వరరావునూ ఈడ్చిపారేశారు. విద్యార్థినులను సైతం మహిళా పోలీసులు అడ్డుకోగా వారు రోడ్డుపైనే బైఠాయించి పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ప్రాణాలర్పించైనా సమైక్యాంధ్రను సాధించుకుంటామని ప్రతిన బూనారు. మూడు గంటల హైడ్రామా అనంతరం పలువురు సమైక్యవాదులను జీపుల్లో ఇటుకలపల్లి పోలీస్‌స్టేషన్‌కు తరలించి.. వదిలేశారు. -
ఎస్కే యూనివర్శిటీలో కేంద్రమంత్రులకు సమాధి
అనంతపురం : రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలంటూ సీమాంధ్రలో ఆందోళనలు, నిరసనలు కొనసాగుతూనే ఉన్నాయి. అనంతపురం జిల్లాలో సమైక్య ఆందోళనలు నేటికి 50వ రోజుకు చేరుకున్నాయి. ఈ సందర్భంగా శ్రీ కృష్ణ దేవరాయ యూనివర్శిటీ విద్యార్థులు, ఉద్యోగులు వినూత్నంగా తమ నిరసనలు తెలిపారు. ప్రజల మనోభీష్టం కన్నా... పదవులు పట్టుకుని వేలాడుతున్న కేంద్ర మంత్రులకు విద్యార్థులు, ఉద్యోగులు బుధవారం ఉదయం సమాధి కట్టి నిరసనలు తెలియచేశారు. కేంద్రమంత్రులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఇక ఉరవకొండలో పొట్టి శ్రీరాములు విగ్రహానికి సమైక్యవాదులు వంద టెంకాయలు కొట్టారు. అలాగే జిల్లా వ్యాప్తంగా సమైక్య నినాదాలు మోర్మోగుతున్నాయి. అనంతపురం నగరంలో జాక్టో ఆధ్వర్యంలో నిన్న రిలే దీక్షలు కొనసాగించిన ఉపాధ్యాయులు... కేంద్ర మంత్రుల దిష్టిబొమ్మలతో శవయాత్ర నిర్వహించారు. సప్తగిరి సర్కిల్లో మానవహారం నిర్మించి... దిష్టిబొమ్మలను దహనం చేశారు. ‘మొద్దునిద్రలో ఉన్న మంత్రులను గునపాలతో గుచ్చి లేపుతున్నట్లు’గా ఉపాధ్యాయులు స్థానిక టవర్‌క్లాక్ సర్కిల్లో వినూత్న ప్రదర్శన చేపట్టారు.