ఎస్కేయూ వేదికగా ప్రత్యేక ఉద్యమం | special movement to sk university | Sakshi
Sakshi News home page

ఎస్కేయూ వేదికగా ప్రత్యేక ఉద్యమం

Published Tue, Jan 24 2017 10:19 PM | Last Updated on Tue, Sep 5 2017 2:01 AM

ఎస్కేయూ వేదికగా ప్రత్యేక ఉద్యమం

ఎస్కేయూ వేదికగా ప్రత్యేక ఉద్యమం

ఎస్కేయూ : రాష్ట్ర భవిష్యత్తు దృష్ట్యా అనివార్యమైన ప్రత్యేక హోదా సాధనకు కృషి చేద్దామని ఎస్కేయూ ప్రత్యేక హోదా సాధన సమితి జేఏసీ నాయకులు పేర్కొన్నారు. మంగళవారం ఎస్కేయూలో జేఏసీ నాయకులు విలేకరులతో మాట్లాడారు. సమైక్య ఉద్యమ తరహాలో ప్రత్యేక హోదా ఉద్యమాన్ని ఎస్కేయూ వేదికగా విజయవంతం చేసే దిశగా కార్యాచరణ రూపొందిస్తున్నట్లు తెలిపారు.ఈనెల 26న సాయంత్రం 6 గంటలకు జాతీయ రహదారిపై కొవ్వొత్తుల ర్యాలీని ఉంటుందన్నారు.

కార్యక్రమంలో అధ్యాపకులు, బోధనేతర సిబ్బంది, విద్యార్థులు, పరిశోధక విద్యార్థులు అందరూ   పాల్గొనాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ప్రత్యేక హోదా సాధన సమితి జేఏసీ నాయకుడు డాక్టర్‌ ఎన్‌ఆర్‌ సదాశివారెడ్డి, టి.పురుషోత్తం రెడ్డి, వెంకటరాముడు, చిన్నప్ప, వైఎస్సార్‌ విద్యార్థి విభాగం నాయకులు క్రాంతి కిరణ్, భాను ప్రకాష్‌ రెడ్డి, జయచంద్రా రెడ్డి, శ్రీనివాస రెడ్డి, బీసీ విద్యార్థి సంఘం నాయకులు జయపాల్‌ యాదవ్, కొంకా మల్లికార్జున, ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు ముస్తఫా తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement