special movement
-
అన్నా చెల్లెలి అనురాగం.. చెల్లిపై ఉప్పోంగిన ఆప్యాయతతో..
-
Rahul Gandhi: అన్నాచెల్లెలి అనురాగం
సృష్టిలో బంధాలు వేటికవే ప్రత్యేకం. అందునా అన్నాచెల్లెళ్ల అనుబంధం ఇంకా ప్రత్యేకం. ఒకవైపు అన్న రాజకీయాల్లో భాగంగా విరామం లేకుండా భారత్ జోడో పాదయాత్ర చేపట్టి కుటుంబానికి దూరంగా ఉంటున్నాడు. మరోవైపు ఆ సోదరి పార్టీలో క్రియాశీలక వ్యవహారాల్లో పాలు పంచుకుంటూ ముందుకు సాగుతోంది. ఇక ఈ ఇద్దరూ ఒకచోట చేరారు. అలిసి పోయిన అన్న రాహుల్ గాంధీతో సరదాగా సంభాషించింది సోదరి ప్రియాంక గాంధీ వాద్రా. ఉప్పోంగిన ఆప్యాయతతో సోదరి మెడ చుట్టూ చేతులేసి.. ప్రేమతో ఆమెను దగ్గరకు తీసుకుని ముద్దు పెట్టారాయన. తన జీవితంలో తన అన్న రాహుల్ బెస్ట్ ఫ్రెండ్ అని ఆమె గతంలోనే ప్రకటించుకున్నారు. ఇక రాహుల్ సైతం సోదరి విషయంలో అన్నగా ఏనాడూ తన బాధ్యతలను విస్మరించబోనని ప్రకటించుకున్నారు. ఈ అన్నాచెల్లెల అనుబంధం చిన్నప్పటి నుంచి ధృడంగా ఉంటోంది. యూపీలో భారత్ జోడో యాత్ర సందర్భంగా.. ఒకే వేదికపై వీళ్లిద్దరూ కూర్చని సరదాగా ముచ్చటించుకున్నారు. అన్న ఆప్యాయంగా దగ్గరకు తీసుకోవడంతో ప్రియాంక నవ్వు ఆపుకోలేకపోయింది. ఆ ప్రత్యేక క్షణాలు కెమెరా కంటికి చిక్కాయి. ❤️❤️ pic.twitter.com/9MIQKMIdAQ — Congress (@INCIndia) January 3, 2023 వారిద్దరి ఆప్యాయత, అనురాగాన్ని తెలిపే ఈ సన్నివేశానికి సంబంధించిన దృశ్యాలు వైరల్ అవుతున్నాయి. ఎన్నికల నాటికి పార్టీని మళ్లీ ఉత్సాహ పరిచే లక్ష్యంతో కాంగ్రెస్ భారత్ జోడో యాత్ర చేపట్టింది. ప్రస్తుతం యూపీలో కొనసాగుతున్న ఈ యాత్ర.. నెలాఖరులో జమ్మూ కశ్మీర్లో చివరి దశకు చేరుకోనుంది. -
అమ్మగా.. సీఈవోగా అంజలీ సూద్..
అంజలీ సూద్ ‘వీమియో’ కంపెనీ సీఈవో. వీడియో హోస్టింగ్, షేరింగ్, సర్వీసెస్ ఇస్తుండే అమెరికన్ కంపెనీ వీమియో. ఆరేళ్ల క్రితం వీమియోలో చేరారు అంజలీ. మొదట మార్కెటింగ్ హెడ్, తర్వాత జనరల్ మేనేజర్, గత నాలుగేళ్లుగా సీఈవో. వీమియో ఈ నెల 25న పబ్లిక్ షేర్స్‌కి వెళ్లింది. ఆ ఘనమైన సందర్భాన్ని ట్విట్టర్లో చిన్న ఫొటోతో అతి శక్తిమంతంగా ప్రకటించారు అంజలీ సూద్. అది ఆమె నాస్డాక్ బిల్డింగ్ ఎదురుగా నిలుచుని ఉన్న ఫోటో అయితే కాదు. కొడుకును ఎత్తుకుని తన ఆఫీస్ క్యాబిన్ డోర్ దగ్గర నిలుచుని ఉన్న ఫొటో! వీమియోలో మొదట చేరినప్పుడు గానీ, తర్వాత ఆ కంపెనీకి సీఈవో అయినప్పుడు గానీ, రెండేళ్ల క్రితం ఫార్చూన్ అండర్ 40 జాబితాలో 14వ స్థానంలో ఉన్నప్పుడు గానీ అంజలీ సూద్ నుంచి వర్కింగ్ మదర్స్ పొందిన స్ఫూర్తి బయటికేమీ కనిపించలేదు. ఇప్పుడు ఆ కంపెనీ పబ్లిక్ షేర్స్‌కి వెళ్లి నాస్డాక్లో లిస్ట్ అయినప్పుడు కూడా ఆమె తన రెండేళ్ల వయసున్న కొడుకును ఎత్తుకుని ఉన్న ఫొటోను ట్విట్టర్లో షేర్ చేయకపోయి ఉంటే అది కూడా ఒక మామూలు విషయంగానే నిలిచిపోయేది. ఫొటోతోపాటు అంజలి (37) పెట్టిన కామెంట్ ఎలా ఉందో చూడండి. ‘‘అమ్మ కాలింగ్ బెల్ కొట్టడానికి ముందే వచ్చి అదృష్టం ఆమెను హత్తుకుపోయింది’’ అని! పబ్లిక్ షేర్స్‌కి ఓపెనింగ్ బెల్ ఇవ్వడానికి ముందే తన కంపెనీ ప్రజల్లోకి వెళ్లిపోయింది అని చెప్పడం ఆమె ఉద్దేశం. ‘‘ఇలాంటి రోజు ఒకటి వచ్చిందంటే నమ్మలేక పోతున్నాను’’ అని కూడా ఆ పోస్ట్‌లో రాశారు అంజలి. ఒక పెద్ద కంపెనీ సీఈవో పింక్ సూట్, బూట్లు ధరించి ఆఫీస్‌లో తన కొడుకు ను ఎత్తుకుని చిరునవ్వులు చిందిస్తూ ఉన్న ఫొటో మహిళా సాధికారతకు మాత్రమే కాదు, సంపూర్ణాధికారతకు ప్రతీకలా కనిపించింది. సాధారణ భాషలో చెప్పాలంటే వర్కింగ్ మదర్స్ అందరికీ ఆ ఫొటో భలే ముచ్చటగా అనిపించింది. బహుశా అంజలిలో ఎవరికి వారు తమను చూసుకుని ఉంటారు. శక్తి పొంది ఉంటారు. ఇంటి పనీ, ఆఫీస్ పనీ అంటూ మల్టీ టాస్కింగ్ చెయ్యడం ఏ తల్లికీ సాధ్యం అయ్యే పని కాదు. ‘‘కానీ పిల్లలు సాధ్యం చేయిస్తారు’’ అని ఒక నెట్ యూజర్ అంజలికి థమ్స్ అప్ ఇచ్చారు. ‘‘అలసిన శరీరానికి విశ్రాంతి, అలసిన మనసుకు పిల్లలు’’ అని మరొక మహిళ ట్వీట్ చేశారు. మొదటి ఫొటోను షేర్ చేసిన నాలుగు నిముషాలకు ఈ ఫొటోను షేర్ చేశారు అంజలి. కంపెనీ ‘పబ్లిక్’ షేర్స్‌కి వెళ్లిన సందర్భాన్ని డైరెక్టర్స్‌తో కలిసి షేర్స్ చేసుకుంటున్న ఆ మొదటి ఫొటో కన్నా, కొడుకును ఎత్తుకుని ఉన్న రెండో ఫొటోనే నెటిజన్స్‌ని ఎక్కువ ఆకట్టుకుంది. అనేక వందలసార్లు షేర్ అయింది. ఒక మదర్.. వర్కింగ్ ఉమన్‌గా తన కెరీర్లో అద్భుతాలు సాధించడానికి పిల్లలు శక్తినిస్తారు అనే సందేశాన్ని అంజలి ఆ ఫొటో ద్వారా అందించ తలచినట్లున్నారు. అది సరిగ్గా అందవలసిన వారికే అందింది. పిల్లల బాధ్యతలు తల్లి కెరీర్‌కు ప్రతిబంధకాలు కావని చెప్పలేం. కానీ కెరీర్లోఎదిగే క్రమంలో అవహించే నిస్సత్తువను పోగొట్టే మంత్రదండాలు పిల్లల చిరువ్వులూ, ఇంటికి వచ్చీరాగానే ఎత్తుకోమని ఏడుస్తూ వారు చేసే డిమాండ్లూ! -
ఎస్కేయూ వేదికగా ప్రత్యేక ఉద్యమం
ఎస్కేయూ : రాష్ట్ర భవిష్యత్తు దృష్ట్యా అనివార్యమైన ప్రత్యేక హోదా సాధనకు కృషి చేద్దామని ఎస్కేయూ ప్రత్యేక హోదా సాధన సమితి జేఏసీ నాయకులు పేర్కొన్నారు. మంగళవారం ఎస్కేయూలో జేఏసీ నాయకులు విలేకరులతో మాట్లాడారు. సమైక్య ఉద్యమ తరహాలో ప్రత్యేక హోదా ఉద్యమాన్ని ఎస్కేయూ వేదికగా విజయవంతం చేసే దిశగా కార్యాచరణ రూపొందిస్తున్నట్లు తెలిపారు.ఈనెల 26న సాయంత్రం 6 గంటలకు జాతీయ రహదారిపై కొవ్వొత్తుల ర్యాలీని ఉంటుందన్నారు. కార్యక్రమంలో అధ్యాపకులు, బోధనేతర సిబ్బంది, విద్యార్థులు, పరిశోధక విద్యార్థులు అందరూ పాల్గొనాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ప్రత్యేక హోదా సాధన సమితి జేఏసీ నాయకుడు డాక్టర్ ఎన్ఆర్ సదాశివారెడ్డి, టి.పురుషోత్తం రెడ్డి, వెంకటరాముడు, చిన్నప్ప, వైఎస్సార్ విద్యార్థి విభాగం నాయకులు క్రాంతి కిరణ్, భాను ప్రకాష్ రెడ్డి, జయచంద్రా రెడ్డి, శ్రీనివాస రెడ్డి, బీసీ విద్యార్థి సంఘం నాయకులు జయపాల్ యాదవ్, కొంకా మల్లికార్జున, ఎస్ఎఫ్ఐ నాయకులు ముస్తఫా తదితరులు పాల్గొన్నారు.