ఆవిష్కరణలతోనే నవ సమాజం
ఎస్కేయూ : నూతన ఆవిష్కరణలతోనే నవ సమాజం సిద్ధిస్తుందని అనంతపురం రేంజ్ డీఐజీ జె.ప్రభాకర్ రావు అన్నారు. శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయంలోని ఫిజిక్స్ విభాగంలో ప్రతిభావంతులైన విద్యార్థులకు ఇన్‌సె్పౖర్ కార్యక్రమాలు బుధవారం ప్రారంభమయ్యాయి. ముఖ్య అతిథి డీఐజీ మాట్లాడుతూ శాస్త్ర సాంకేతిక పురోగతితోనే దేశాభివృద్ధి సాధ్యమన్నారు. నిష్ణాతుల ప్రసంగాలు విని శాస్త్రీయత పెంచుకోవాలని విద్యార్థులకు సూచించారు.
అంతకుముందు వర్సిటీలో ఇస్రో ప్రాజెక్ట్ ప్రయోగాలను ఆయన పరిశీలించారు. ఆచార్య రాజూరి రామకృష్ణారెడ్డి, ఇస్రో శాస్త్రవేత్త కోటేశ్వరరావు మాట్లాడారు. కార్యక్రమంలో ఎస్కేయూ క్యాంపస్ కళాశాల సైన్స్ ప్రిన్సిపల్ ఆచార్య రంగస్వామి, ఆచార్య రామాంజిప్ప, ఆచార్య జీవన్‌కుమార్, ఇన్‌సె్పౖర్ ప్రోగ్రాం కోఆర్డినేటర్ డాక్టర్ రాంగోపాల్, డాక్టర్ శంకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.