ఎస్కే యూనివర్శిటీలో డీజీపీ ప్రసాదరావుకు సమైక్య సెగ
అనంతపురం: జిల్లాలో డీజీపీ ప్రసాదరావుకు సమైక్య సెగ తగలింది. ఎస్కే యూనివర్శిటిలో పీహెచ్‌డీ పరీక్షకు హాజరైన డీజీపీ ఎదుట అక్కడి విద్యార్థులు సమైక్యనినాదాలు చేశారు. రాష్ట్ర విభజన బిల్లుపై కేంద్రం నిర్ణయానికి వ్యతిరేకంగా సీమాంధ్ర ఉద్యమం పెద్దెఎత్తున జరిగిన సంగతి తెలిసిందే. ఈ ఉద్యమంలో పాల్గొన్న సమైక్యవాదులు నిరసనలు, ధర్నాలు వంటి ఆందోళన కార్యక్రమాలు చేపట్టారు. ఈ నేపథ్యంలో సమైక్యవాదులపై పలు కేసులు నమోదు చేశారు.
ఆ కేసులు ఎత్తివేయాలంటూ విద్యార్ధులు సమైక్య నినాదాలు చేశారు. దీంతో ప్రసాదరావు సమైక్యవాదులపై కేసుల ఎత్తివేత అంశాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని చెప్పినట్టు సమాచారం. ఎస్కే యూనివర్శిటిలో ప్రసాదరావు భౌతికశాస్ర్తంలో పిహెచ్‌డీ చేస్తున్నారు.