నరేశ్-పవిత్రా లోకేష్‌ల జంట ఇప్పుడు టాలీవుడ్ ట్రెండింగ్‌గా మారింది. వీరిద్దరు కలిసి గత కొంతకాలంగా సహజీవనం చేస్తున్న సంగతి తెలిసిందే. త్వరలోనే పెళ్లి కూడా చేసుకోబోతున్నారు. వీళ్ల రిలేషన్‌షిప్ గురించి ఎప్పుడో అందరికి తెలుసు. కానీ ఈ మధ్య ‘మళ్ళీ పెళ్లి’సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడం.. ఆ స్టోరీ వీళ్ల పర్సనల్ లైఫ్‌కు సంబంధించింది కావడంతో ఈ జంట మళ్లీ వార్తల్లో నిలిచింది. మొన్నటి వరకు వరుస ఇంటర్వ్యూలతో యూట్యూబ్‌ని షేక్ చేసిన ఈ జంట .. ఇప్పుడు మీడియాకు కాస్త దూరంగా ఉంటుంది.
కానీ సోషల్ మీడియాలో మాత్రం ఈ జంట గురించి చర్చ ఆగడం లేదు. ఏదో రకంగా వీరి పేర్లు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఇక తాజాగా పవిత్ర విషయంలో నరేశ్ చేసిన ఓ పనిపై నెటిజన్స్ ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇంతకీ నరేశ్ చేసిన ఆ గొప్ప పని ఏంటంటే.. పవిత్రతో పరీక్షలు రాయించాడు.
(చదవండి: పెళ్లి ఎప్పుడు.. మాధవీలత స్ట్రాంగ్ కౌంటర్! )
పవిత్రకు తన మాతృభాష అయిన కన్నడలో పీహెచ్‌డీ చేయాలని కోరిక. అందుకోసం ఎంట్రెన్స్ ఎగ్జామ్స్ రాయడానికి బళ్ళారి వెళ్లారు. ఆమెతో పాటు నరేశ్ కూడా బళ్ళారి వెళ్లి.. పరీక్ష రాసేంత వరకు అక్కడే ఉన్నాడట. దగ్గరుండి మరీ పరీక్ష రాయించడంతో నెటిజన్స్ నరేశ్‌పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. గొప్ప పని చేశావంటూ మెచ్చుకుంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment