phd entrance exam
-
పరీక్షా ఫలితాలు విడుదల.. పవిత్రా లోకేష్ రిజల్ట్ ఏంటంటే
నరేశ్-పవిత్రా లోకేష్‌ల జంట మళ్లీ ఇప్పుడు టాలీవుడ్ ట్రెండింగ్‌గా మారింది. వీరిద్దరు కలిసి గత కొంతకాలంగా సహజీవనం చేస్తున్న సంగతి తెలిసిందే. వీళ్లిద్దరి రిలేషన్షిప్ గురించి పక్కన పెడితే. తాజాగా పవిత్రా లోకేష్ గురించి ఒక వార్త వైరల్ అవుతుంది. రీసెంట్గా కన్నడ యూనివర్సిటీ పీహెచ్డీ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ ఫలితాలు విడుదలయ్యాయి. అందులో పవిత్రా లోకేష్ సహా 259 మంది అభ్యర్థులు ఉత్తీర్ణులయ్యారు. (ఇదీ చదవండి; క్లీంకార గురించి చిరంజీవి చెప్పిందే నిజం అయిందా.. కలిసొచ్చిన వేల కోట్లు) కన్నడ విశ్వవిద్యాలయంలో సైన్స్ ఇన్స్టిట్యూట్తో పాటు, భాషా ఇన్స్టిట్యూట్, సోషల్ సైన్స్ ఇన్స్టిట్యూట్, లలిత ఆర్ట్ ఇన్స్టిట్యూట్లు వివిధ విభాగాల కింద పరిశోధన అందించబడుతుంది. ఇందులోని మూడు సంస్థలలో పీహెచ్డీ చేసేందుకు 981 మంది ఎంట్రన్స్ పరీక్ష రాశారు. కానీ 259 మంది అభ్యర్థులు మాత్రమే ఉత్తీర్ణులయ్యారని కన్నడ యూనివర్సిటీ ఛాన్సలర్ సుబ్బన్న రాయ్ తెలిపారు. (ఇదీ చదవండి: బాధలో ఉన్నాం.. దయచేసి ఇలాంటి పని చేయకండి: నటి) కన్నడ విశ్వవిద్యాలయంలోని అధ్యయన విభాగంలో అందుబాటులో ఉన్న సీట్లను మెరిట్ ఆధారంగా ఫిల్ చేస్తామని ఆయన తెలిపారు. పవిత్రకు తన మాతృభాష అయిన కన్నడలో పీహెచ్డీ చేయాలని కోరిక ఉండేదని గతంలో చెప్పేది. అందులో భాగంగా భాషా నికాయ ఆధ్వర్యంలో బెల్గాం ఎక్స్టెన్షన్ సెంటర్లో పరిశోధన చేసేందుకు పవిత్రా లోకేష్ పరీక్ష రాశారు. మే 30న ఈ ఉమ్మడి ప్రవేశ పరీక్ష నిర్వహించారు. ఆ సమయంలో తన వెంట నరేష్ కూడా వెళ్లారు. తాజాగ విడుదలైన ఫలితాలతో ఆమె సంతోషంగా ఉన్నా అక్కడి యూనివర్సిటీలో సీట్ వచ్చే విషయంపై ఇంకా క్లారిటీ లేదు. -
పవిత్రతో పరీక్షలు రాయించిన నరేశ్.. నెటిజన్స్ ప్రశంసలు
నరేశ్-పవిత్రా లోకేష్‌ల జంట ఇప్పుడు టాలీవుడ్ ట్రెండింగ్‌గా మారింది. వీరిద్దరు కలిసి గత కొంతకాలంగా సహజీవనం చేస్తున్న సంగతి తెలిసిందే. త్వరలోనే పెళ్లి కూడా చేసుకోబోతున్నారు. వీళ్ల రిలేషన్షిప్ గురించి ఎప్పుడో అందరికి తెలుసు. కానీ ఈ మధ్య ‘మళ్ళీ పెళ్లి’సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడం.. ఆ స్టోరీ వీళ్ల పర్సనల్ లైఫ్‌కు సంబంధించింది కావడంతో ఈ జంట మళ్లీ వార్తల్లో నిలిచింది. మొన్నటి వరకు వరుస ఇంటర్వ్యూలతో యూట్యూబ్‌ని షేక్ చేసిన ఈ జంట .. ఇప్పుడు మీడియాకు కాస్త దూరంగా ఉంటుంది. కానీ సోషల్ మీడియాలో మాత్రం ఈ జంట గురించి చర్చ ఆగడం లేదు. ఏదో రకంగా వీరి పేర్లు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఇక తాజాగా పవిత్ర విషయంలో నరేశ్ చేసిన ఓ పనిపై నెటిజన్స్ ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇంతకీ నరేశ్ చేసిన ఆ గొప్ప పని ఏంటంటే.. పవిత్రతో పరీక్షలు రాయించాడు. (చదవండి: పెళ్లి ఎప్పుడు.. మాధవీలత స్ట్రాంగ్ కౌంటర్! ) పవిత్రకు తన మాతృభాష అయిన కన్నడలో పీహెచ్డీ చేయాలని కోరిక. అందుకోసం ఎంట్రెన్స్ ఎగ్జామ్స్ రాయడానికి బళ్ళారి వెళ్లారు. ఆమెతో పాటు నరేశ్ కూడా బళ్ళారి వెళ్లి.. పరీక్ష రాసేంత వరకు అక్కడే ఉన్నాడట. దగ్గరుండి మరీ పరీక్ష రాయించడంతో నెటిజన్స్ నరేశ్‌పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. గొప్ప పని చేశావంటూ మెచ్చుకుంటున్నారు. -
ప్రతిభ చాటిన సిద్దిపేట జిల్లావాసి
సాక్షి, హైదరాబాద్: జాతీయ వ్యవసాయ పరిశోధన మండలి (ఐకార్) నిర్వహించిన నేషనల్ పీహెచ్డీ పుడ్ టెక్నాలజీ ప్రవేశ పరీక్షలో సిద్దిపేట్ జిల్లా నంగునూర్ మండలం మగ్ధుంపూర్కు చెందిన అచ్చిన పోషాద్రి (34) మొదటి ర్యాంకు సాధించాడు. దీంతో పాటు జాతీయ డైరీ పరిశోధన సంస్థ నిర్వహించిన పీహెచ్డీ ప్రవేశ పరీక్షలోనూ ఫస్ట్ ర్యాంక్ సాధించాడు. ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ వర్సిటీలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న పోషాద్రి జాతీయ పరీక్షలకు సిద్ధమవుతూ రెండు ప్రవేశ పరీక్షల్లోనూ దేశంలోనే ర్యాంకు సాధించారు. ర్యాంకుల రారాజు పోషాద్రి... 2007లో ఐకార్ నిర్వహించిన పీజీ ప్రవేశ పరీక్షలో కూడా పోషాద్రి మొదటి ర్యాంకు సాధించాడు. 2013లో ఐకార్‌లో శాస్త్రవేత్తగా ఎంపికయ్యారు. దేశంలో ఫుడ్ టెక్నాలజీ విభాగంలో నిర్వహించిన వివిధ పోటీ పరీక్షలలో మొదటి ర్యాంకు సాధించారు. ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో పదేళ్లుగా వివిధ పరిశోధనలు చేశారు. పరిశోధన ఫలితాలు అంతర్జాతీయ జర్నల్స్‌లోనూ ప్రచురితమయ్యాయి. ఇప్పటివరకు 25 రీసెర్చ్ పేపర్స్, 2 పుస్తకాలు రాశారు. పోషాద్రి రాసిన హ్యాండ్ బుక్ ఫర్ పుడ్ టెక్నాలజీ పుస్తకం ఫుడ్ టెక్నాలజీ రంగంలో దేశంలోనే ఎక్కువగా విక్రయం జరిగింది. ఫుడ్ సైంటిస్ట్‌గా 15 కొత్తరకమైన ఆహార పదార్థాలను తయారుచేశాడు. గతంలో ఇక్రిశాట్లో శాస్త్రవేత్తగా పనిచేసినప్పుడు అక్కడ ఆహార పరిశోధన ల్యాబ్‌ను ఏర్పాటు చేయడంలో కీలక పాత్ర పోషించారు. చిరు ధాన్యాలు, జొన్నల నుంచి వివిధ రకాల విలువ ఆధారిత ఉత్పత్తులు తయారుచేశారు. ప్రస్తుతం ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయానికి చెందిన కృషి విజ్ఞాన కేంద్రంలో శాస్త్రవేత్తగా పనిచేస్తున్న పోషాద్రి, గిరిజన ప్రాంతాలలో సుమారు 10 బహుళార్ధక ప్రయోజనాలున్న చిన్న సైజు మిల్లులు నెలకొల్పి గిరిజన కుటుంబాలకు నాణ్యమైన పోషక విలువలు గల ఆహార పదార్థాలను వారు పండించే వ్యవసాయ ఉత్పత్తుల నుంచి తయారు చేసుకునే విధంగా తోడ్పాటు అందిస్తున్నారు. రాష్ట్రంలోని రైతులు, ఔత్సాహికులకు ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో స్టార్టప్స్ నెలకొల్పానుకునేవారికి పోషాద్రి సాంకేతిక సలహాలు ఇస్తున్నారు. ప్రైవేట్ రంగంలో పేరుమోసిన ఆహార సంస్థలైన నెస్లే, ఐటీసీ, ఎంటీఆర్ పుడ్స్, బాంబినో, బ్రిటానియా, ఓలం వంటి ఎంఎన్సీ కంపెనీల్లో ఉద్యోగాలు వచ్చినా ఆసక్తి చూపలేదు. -
ఒకరికి బదులు మరొకరు పరీక్ష రాస్తూ దొరికిపోయారు
ఎస్వీ యూనివర్సిటీ క్యాంపస్ (తిరుపతి) : శ్రీ వేంకటేశ్వర యూనివర్సిటీలో పీహెచ్‌డీలో ప్రవేశానికి నిర్వహించిన రీసెట్- 2015లో ఒక విద్యార్థి స్థానంలో మరొకరు పరీక్ష రాస్తూ పట్టుబడ్డారు. ఈ సంఘటనపై ఎస్వీయూ క్యాంపస్ పోలీసులు కేసు నమోదు చేసి, విచారిస్తున్నారు. పోలీసుల కథనం మేరకు... ఎస్వీ యూనివర్సిటీలో పీహెచ్‌డీలో ప్రవేశానికి గురువారం ప్రవేశ పరీక్ష నిర్వహించారు. కాగా శ్రీ పద్మావతి మహిళా జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన పరీక్ష కేంద్రంలో ఫిజిక్స్ పాఠ్యాంశానికి సంబంధించిన ప్రవేశ పరీక్షకు ఆనంద్‌రావు అనే విద్యార్థి హాజరుకావాల్సి ఉంది. అయితే అతని స్థానంలో సిద్ధయ్య అనే విద్యార్థి పరీక్ష రాస్తుండగా అధికారులు గుర్తించారు. ఎస్వీయూ వీసీ రాజేంద్ర, రిజిస్ట్రార్ దేవరాజులు, అడ్మిషన్ డెరైక్టర్ భాస్కర్‌రెడ్డి ఈ సంఘటనపై విచారణ జరిపి, ఇంకో విద్యార్థి పరీక్ష రాస్తున్నట్లు నిర్ధారణకు వచ్చారు. సదరు విద్యార్థిని ఎస్వీయూ క్యాంపస్ పోలీస్ స్టేషన్లో అప్పగించారు. -
ఎస్కే యూనివర్శిటీలో డీజీపీ ప్రసాదరావుకు సమైక్య సెగ
అనంతపురం: జిల్లాలో డీజీపీ ప్రసాదరావుకు సమైక్య సెగ తగలింది. ఎస్కే యూనివర్శిటిలో పీహెచ్డీ పరీక్షకు హాజరైన డీజీపీ ఎదుట అక్కడి విద్యార్థులు సమైక్యనినాదాలు చేశారు. రాష్ట్ర విభజన బిల్లుపై కేంద్రం నిర్ణయానికి వ్యతిరేకంగా సీమాంధ్ర ఉద్యమం పెద్దెఎత్తున జరిగిన సంగతి తెలిసిందే. ఈ ఉద్యమంలో పాల్గొన్న సమైక్యవాదులు నిరసనలు, ధర్నాలు వంటి ఆందోళన కార్యక్రమాలు చేపట్టారు. ఈ నేపథ్యంలో సమైక్యవాదులపై పలు కేసులు నమోదు చేశారు. ఆ కేసులు ఎత్తివేయాలంటూ విద్యార్ధులు సమైక్య నినాదాలు చేశారు. దీంతో ప్రసాదరావు సమైక్యవాదులపై కేసుల ఎత్తివేత అంశాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని చెప్పినట్టు సమాచారం. ఎస్కే యూనివర్శిటిలో ప్రసాదరావు భౌతికశాస్ర్తంలో పిహెచ్డీ చేస్తున్నారు. -
‘పీహెచ్డీ’ ఫలితాల్లో అక్రమాలు జరగలేదు
తెయూ(డిచ్పల్లి), న్యూస్‌లైన్ : తెయూ పీహెచ్డీ ప్రవేశ పరీక్ష ఫలితాల్లో ఎలాం టి అక్రమాలు జరగలేదని వీసీ అక్బర్ అలీఖాన్ తెలి పారు. గురువారం తన చాంబర్లో ఆయన విలేకరుల తో మాట్లాడారు. ఈ ఏడాది 13 విభాగాల్లో పరీక్షలు నిర్వహించామన్నారు. గతేడాది సబ్జెక్టివ్ టైప్ పరీక్షను నిర్వహించగా, ఈసారి ఆబ్జెక్టివ్ టైప్ పరీక్షను నిర్వహిం చామన్నారు. 100 మార్కులకు గాను ఎస్సీ, ఎస్టీలకు 30, బీసీలకు 40, ఓసీలకు 50 మార్కులు కటాఫ్ మా ర్కులుగా నిర్ణయించినట్లు చెప్పారు.2013, జూలై 30న 13 సబ్జెక్టులకు పీహెచ్డీ ప్రవేశ పరీక్ష నిర్వహించగా 411 మంది విద్యార్థులు హాజరయ్యారని తెలిపారు. ప్రవేశ పరీక్ష ఫలితాలను రిజల్ట్స్ కమిటీ ఆమోదం తీసుకుని మంగళవారం యూనివర్సిటీ వెబ్సైట్లో పెట్టిన ట్లు తెలిపారు. ప్రకటించిన జాబితా ప్రకారం ప్రవేశ పరీక్షలో 216 మంది ఉత్తీర్ణులైనట్లు వీసీ తెలిపారు. ఈ విషయమై అదేరోజు సాయంత్రం కొందరు విద్యార్థి సంఘాల నాయకులు తన వద్దకు వచ్చి 13 సబ్జెక్టులకు గాను 5 సబ్జెక్టుల్లో 50 శాతం కంటే తక్కువ ఉత్తీర్ణత వచ్చిందని, విద్యార్థుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకు ని కటాఫ్ మార్కులను తగ్గించాలని వినతి పత్రం అం దజేశారని తెలిపారు. డీన్స్‌తో సమావేశం నిర్వహించి న్యాయం జరిగేలా చూస్తానని తాను హామీ ఇచ్చానని తెలిపారు. తాను స్వయంగా హామీ ఇచ్చినా బుధవా రం ఉదయం కళాశాల తరగతులు ప్రారంభమైన తర్వాత రెండో పీరియడ్‌లో 670 మంది విద్యార్థులను తరగతులు బహిష్కరింపజేయడం దారుణమన్నారు. ఏదైనా సమస్య ఉంటే తన దృష్టికి తీసుకువస్తే పరిష్కరిస్తానని, ఇలా తరగతులు బహిష్కరించడం, అందోళనలు నిర్వహించడం చేయవద్దని విద్యార్థి సంఘాల నాయకులను ఆయన కోరారు. వర్సిటీ అభివృద్ధికి విఘాతం తరగతులు బహిష్కరించడం వల్ల వర్సిటీ అభివృద్ధికి విఘాతం కలుగుతుందని, విద్యార్థులకు నష్టం జరుగుతుందని వీసీ ఆవేదన వ్యక్తం చేశారు. ఉన్నత విద్యామండలి నిబంధనల ప్రకారమే కటాఫ్ మార్కులు నిర్ణయించామన్నారు. అయినా విద్యార్థుల వినతి ప్రకారం డీన్స్ సమావేశం నిర్వహించి 50 శాతం ఉత్తీర్ణత కంటే తక్కువ వచ్చిన 5 సబ్జెక్టులకు సంబంధించి కటాఫ్ మార్కులు 5 మార్కులను తగ్గించాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్(సీఓఈ) నసీం ఆధ్వర్యంలో తగ్గించిన కటాఫ్ మార్కుల మేరకు తిరిగి పరీక్షా పేపర్లను పరిశీలించి రెండు రోజు ల్లో ఫలితాలను మళ్లీ ప్రకటిస్తామని వీసీ స్పష్టం చేశా రు. ఈ నిర్ణయం ద్వారా విద్యార్థులకు న్యాయం జరుగుతుందని తాను ఆశిస్తున్నానని తెలిపారు. విలేకరుల సమావేశంలో సీఓఈ నసీం పాల్గొన్నారు.