నరేశ్ ముద్దుపేరు ఏంటో చెప్పేసిన పవిత్ర | Pavitra Lokesh Revealed Naresh Nick Name ETV Promo | Sakshi
Sakshi News home page

Pavitra Lokesh Naresh: షోలో రెచ్చిపోయిన నరేశ్-పవిత్రా లోకేశ్!

Published Tue, Sep 5 2023 7:46 PM | Last Updated on Tue, Sep 5 2023 8:19 PM

Pavitra Lokesh Revealed Naresh Nick Name ETV Promo - Sakshi

తెలుగు ఇండస్ట్రీలో మిగతా కపుల్స్ సంగతేమో గానీ నరేశ్-పవిత్రా లోకేశ్ మాత్రం వేరే లెవల్ అని చెప్పొచ్చు. ఎందుకంటే నరేశ్ ఇప్పటికే పలుమార్లు పెళ్లి చేసుకుని విడిపోయాడు. పవిత్ర కూడా ఇలానే పెళ్లి చేసుకుని విడిగా ఉంటుంది. అలాంటిది వీళ్లిద్దరూ ఒక్కటయ్యారు. ఈ మధ్య తమ జీవితం ఆధారంగా 'మళ్లీ పెళ్లి' పేరుతో ఓ సినిమా కూడా తీసిపడేశారు. అలాంటి ఈ ఇద్దరూ చాన్నాళ్ల తర్వాత జంటగా స్టేజీపై కనిపించారు. కొత్త జంటలా సందడి చేశారు.

(ఇదీ చదవండి: పెళ్లి గురించి హింట్ ఇచ్చిన అనుష్క.. కానీ!)

వినాయక చవితి సందర్భంగా ఓ ఎంటర్‌టైన్‌మెంట్ షో టెలికాస్ట్ కాబోతుంది. ఇందులోనే నరేశ్-పవిత్రా లోకేశ్ జంటగా పాల్గొన్నారు. కొన్నాళ్ల ముందు నుంచి ఎక్కడైనా సరే ఇద్దరూ జంటగా కనిపిస్తున్నారు. కెమిస్ట్రీ పండిస్తున్నారు. ఈసారి కూడా దానికి ఏ మాత్రం తక్కువ కాదు అనేలా.. స్టేజీపై 'మాస్టారూ మాస్టారూ' పాటకు డ్యాన్స్ చేయడంతోపాటు ముద్దులు కూడా పెట్టారు. అలానే నరేశ్‌ని ముద్దుగా ఏమని పిలుస్తుందో పవిత్ర బయటపెట్టింది.

'మళ్లీ పెళ్లి' ప్రమోషన్ లో భాగంగా పవిత్రని అమ్ములు అని ముద్దుగా పిలుస్తానని నరేశ్ చెప్పాడు. పవిత్ర మాత్రం నరేశ్‌ని 'రాయ' అని ముద్దుగా పిలుస్తుందట. తాజాగా రిలీజ్ చేసిన షో ప్రోమోలో ఈ విషయాన్ని పవిత్రా లోకేశ్ బయటపెట్టింది. ఇక వీళ్లపై హైపర్ ఆది చిన్నగా పంచులు కూడా వేయడం ఆసక్తికరంగా మారింది. ఏదేమైనా నరేశ్-పవిత్రా లోకేశ్ మరోసారి సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయ్యేలా ఉన్నారు.

(ఇదీ చదవండి: 'బిగ్‌బాస్'లో గొడవలు మొదలుపెట్టిన శోభాశెట్టి!)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement