కొన్నాళ్ల ముందు ఇండస్ట్రీలో ఓ జంట గురించి తెగ మాట్లాడుకున్నారు. విచిత్రం ఏంటంటే వాళ్ల లైఫ్ ని సినిమాగా తీసి మరీ థియేటర్లలో రిలీజ్ చేశారు. అవును మీరు ఊహించింది కరెక్టే. వాళ్లే నరేశ్-పవిత్రా లోకేశ్. 'మళ్లీ పెళ్లి' అని సినిమా వీళ్లు చేయడం మాటేమో గానీ కొన్నాళ్లపాటు తెగ ట్రెండ్ అయ్యారు. సరేలే వీళ్ల గురించి అందరూ మర్చిపోయారు అనుకునే టైంలో మరోసారి చర్చనీయాంశమయ్యారు. నరేశ్ పెళ్లిళ్లపై హైపర్ ఆది కామెంట్స్ దీనికి కారణం?
విజయనిర్మల వారసుడిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన నరేశ్.. తొలుత హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్టుగా సూపర్ ఫామ్‌లో ఉన్నాడు. నటుడిగా ఇతడిని వంకపెట్టడానికి లేదు. కానీ వ్యక్తిగతంగా మాత్రం ఎప్పటికప్పుడు వార్తల్లో నిలుస్తూనే ఉంటాడు. ఎందుకంటే ఇప్పటికే పలు పెళ్లిళ్లు చేసుకున్న నరేశ్.. మాజీ భార్య రమ్య రఘుపతితో దూరంగా ఉంటున్నాడు. అదే టైంలో నటి పవిత్రా లోకేశ్‌తో రిలేషన్‌లో ఉన్నాడు.
(ఇదీ చదవండి: విజయ్ సేతుపతికి ఇంత పెద్ద కూతురు ఉందా?)
నరేశ్-పవిత్రా లోకేశ్ కలిసి తమ బంధంపై 'మళ్లీ పెళ్లి' అనే మూవీ తీయడం.. దానిపై రమ్య రఘుపతి కోర్టుకెళ్లడం లాంటి విషయాలు అప్పట్లో హాట్ టాపిక్ అయ్యాయి. సరే దాని గురించి వదిలేస్తే.. వీళ్లిద్దరూ జంటగా ఓ తెలుగు ఛానెల్‌లో ప్రసారం కాబోతున్న వినాయక చవితి ఈవెంట్‌లో పాల్గొన్నారు. దీని ప్రోమో తాజాగా రిలీజ్ చేశారు. ఇందులో భాగంగానే హైపర్ ఆది.. నరేశ్‌పై ఫన్నీగా కౌంటర్ వేశాడు.
'నాకు ఒక పెళ్లే అవ్వట్లేదు. పెళ్లి, మళ్లీపెళ్లి ఎలా సార్?' అని హైపర్ ఆది.. స్టేజీపై అందరూ చూస్తుండగానే నరేశ్‌ని అడిగేశాడు. పక్కనే పవిత్రా లోకేశ్ ఉంది. ఈ క్రమంలోనే ఈ క్వశ్చన్‌కి నరేశ్ నవ్వి ఊరుకున్నాడు. ప్రోమో కాబట్టి పెద్దగా రివీల్ చేయలేదు. బహుశా ఫుల్ ఈవెంట్‌లో నరేశ్ చెప్పిన ఆన్సర్ చూపిస్తారేమో? ఏదేమైనా అలా పెళ్లిళ్ల గురించి డైరెక్ట్‌గా అడిగేయడం అందరినీ ఆశ్చర్యపరిచింది.
(ఇదీ చదవండి: 'ఫ్యామిలీ మ్యాన్' చిరంజీవి చేయాల్సింది.. కానీ!)
Comments
Please login to add a commentAdd a comment