samaikya slogans
-
ఎస్కే యూనివర్శిటీలో డీజీపీ ప్రసాదరావుకు సమైక్య సెగ
అనంతపురం: జిల్లాలో డీజీపీ ప్రసాదరావుకు సమైక్య సెగ తగలింది. ఎస్కే యూనివర్శిటిలో పీహెచ్డీ పరీక్షకు హాజరైన డీజీపీ ఎదుట అక్కడి విద్యార్థులు సమైక్యనినాదాలు చేశారు. రాష్ట్ర విభజన బిల్లుపై కేంద్రం నిర్ణయానికి వ్యతిరేకంగా సీమాంధ్ర ఉద్యమం పెద్దెఎత్తున జరిగిన సంగతి తెలిసిందే. ఈ ఉద్యమంలో పాల్గొన్న సమైక్యవాదులు నిరసనలు, ధర్నాలు వంటి ఆందోళన కార్యక్రమాలు చేపట్టారు. ఈ నేపథ్యంలో సమైక్యవాదులపై పలు కేసులు నమోదు చేశారు. ఆ కేసులు ఎత్తివేయాలంటూ విద్యార్ధులు సమైక్య నినాదాలు చేశారు. దీంతో ప్రసాదరావు సమైక్యవాదులపై కేసుల ఎత్తివేత అంశాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని చెప్పినట్టు సమాచారం. ఎస్కే యూనివర్శిటిలో ప్రసాదరావు భౌతికశాస్ర్తంలో పిహెచ్డీ చేస్తున్నారు. -
అదే జోరు.. జనోద్యమం @ 122
సాక్షి నెట్వర్క్: సమైక్యాంధ్ర పరిరక్షణోద్యమం వరుసగా 122వ రోజూ శుక్రవారం సీమాంధ్ర జిల్లాల్లో కొనసాగింది. చిత్తూరు జిల్లా మదనపల్లెలో విద్యార్థులు భారీ ర్యాలీ నిర్వహించి సమైక్య నినాదాలను హోరెత్తించారు. సైమైక్యాంధ్ర మ్యాప్ ఆకారంలో కూర్చుని రాష్ట్రాన్ని విభజించవద్దని నినదించారు. గుంటూరు జిల్లా నరసరావుపేటలో శుక్రవారం జరిగిన రచ్చబండ కార్యక్రమానికి హాజరైన ప్రజలు, అధికారులతో మంత్రి కాసు కృష్ణారెడ్డి సమైక్యాంధ్ర జిందాబాద్, విభజన వద్దు... సమైక్యాంధ్ర ముద్దు... అని నినాదాలు చేయించారు. ఇక్కడ నినాదాలు ఢిల్లీ పెద్దలకు వినిపించాలంటూ గట్టిగా నినాదాలు చేయించారు. అమరవీరుల త్యాగాల ఫలితంగా, తెలుగు వారి ఆశయాలకు అనుగుణంగా తొలిసారిగా రూపుదిద్దుకున్న భాషాప్రయుక్త రాష్ట్రాన్ని విభజిస్తుంటే చూస్తు ఊరుకోబోమని కృష్ణా జిల్లా కలిదిండి జేఏసీ నాయకులు హెచ్చరించారు. విభజనకు పరోక్షంగా సహకరిస్తున్నారంటూ కేంద్ర మంత్రి చిరంజీవి దిష్టిబొమ్మను దహనం చేశారు. నాగాయలంకలో జేఏసీ నాయకులు రాస్తారోకో చేసి రోడ్డుపై బైఠాయించారు. సమైక్యాంధ్ర విద్యార్థి జేఏసీ ఆధ్వర్యంలో కర్నూలులోని కొండారెడ్డి బురుజు వద్ద విద్యార్థి సమరభేరి నిర్వహించారు. వైఎస్సార్సీపీ శ్రేణుల పాదయాత్ర గడపగడపకూ వైఎస్సార్ కాంగ్రెస్ సమైక్యనాదం పేరిట పార్టీ నేతలు పలు నియోజకవర్గాల్లో పాదయాత్రలు చేపట్టి ఇంటింటికీ వెళ్లి సమైక్యాంధ్ర ఆవశ్యకతను, రాష్ట్ర పరిరక్షణకు పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి చేస్తున్న నిర్విరామకృషిని వివరిస్తున్నారు. తూర్పుగోదావరి, నెల్లూరు, అనంతపురం, కడపలో పాదయాత్రలు జరిగాయి. చిత్తూరులో పార్టీ కార్యకర్తలు రాస్తారోకో చేశా రు. ఇక కృష్ణా, విజయనగరం, వైఎస్ఆర్ జిల్లా, చిత్తూరు జిల్లాల్లో దీక్షలు నిరవధికంగా కొనసాగుతున్నాయి. -
ఆర్టి.. యూటీలొద్దు.. జనోద్యమం @ 119
సాక్షి నెట్వర్క్: రాయల్ తెలంగాణ (ఆర్టి)... హైదరాబాద్ యూటీ... ఇటువంటి ప్రతిపాదనలేమీ వద్దని సమైక్యాంధ్రప్రదేశ్‌ను యథాతథంగానే ఉంచాలని సీమాంధ్ర ప్రజ నినదిస్తోంది. అడ్డగోలు ప్రతిపాదనలతో రాష్ట్రాన్ని అస్తవ్యస్తం చేస్తుంటే చూస్తూ ఊరుకోబోమని తెగేసి చెబుతోంది. సమైక్యాంధ్ర పరిరక్షణోద్యమం వరుసగా 119వ రోజైన మంగళవారం కూడా సీమాంధ్ర జిల్లాల్లో ఉద్ధృతంగానే సాగింది. ధర్నాలు, రాస్తారోకోలు, మానవహారాలు, యూపీఏ ప్రభుత్వ దిష్టిబొమ్మల దహనాలతో ఉద్యమాన్ని హోరెత్తించారు. చిత్తూరు జిల్లా మదనపల్లెలో విద్యార్థులు 119 సంఖ్య ఆకారంలో కూర్చొని సమైక్య నినాదాలు చేశారు. తిరుపతిలో న్యాయవాదులు కోర్టు విధులను బహిష్కరించారు. నగరంలో యువకులు భారీ మోటార్ బైక్ ర్యాలీ నిర్వహించారు. రాష్ట్ర విభజనపై కేంద్రమంత్రులు, ప్రజాప్రతినిధులు, వివిధ పార్టీల విధానాలు, తీరుతెన్నులపై కృష్ణాజిల్లా జగ్గయ్యపేటలో విద్యార్థులు మాక్ పార్లమెంట్ నిర్వహించారు. మున్సిపల్ కూడలి వద్ద నడిరోడ్డుపై నిర్వహించిన ఈ ప్రదర్శనలో విద్యార్థులు మంత్రులు, స్పీకర్, రాష్ట్ర ఎంపీల ముఖచిత్రాల మాస్క్‌లు ధరించి రాష్ర్ట విభజన వద్దంటూ తీర్మానించారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో విద్యార్థులు రాస్తారోకో చేసి మానవహారం నిర్మించారు. సీమాంధ్ర ప్రజల సమైక్య డిమాండ్‌ను కేంద్ర ప్రభుత్వం పట్టించుకోకపోవడాన్ని నిరసిస్తూ సమైక్యాంధ్ర పొలిటికల్ జేఏసీ ఆధ్వర్యంలో విశాఖ నగరంలో సీడబ్ల్యూసీ, జీఓఎమ్ దిష్టిబొమ్మను దహనం చేశారు. వైఎస్సార్సీపీ శ్రేణుల ఉద్యమపథం సమైక్యాంధ్ర పరిరక్షణకు అలుపెరుగని పోరాటం చేస్తున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు మంగళవారం పలు నియోజకవర్గాల్లో పాదయాత్రలు చేపట్టి ఇంటింటికీ వెళ్లి సమైక్యాంధ్ర ఆవశ్యకతను, రాష్ట్ర పరిరక్షణకు పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి చేస్తున్న అవిరళ కృషిని వివరిస్తున్నారు. -
విధులు నిర్వర్తిస్తూ.. జనోద్యమం @ 115
సాక్షి నెట్వర్క్: సమైక్యాంధ్ర పరిరక్షణోద్యమం వరుసగా 115వ రోజైన శుక్రవారం కూడా సీమాంధ్ర జిల్లాల్లో కొనసాగింది. పలు జిల్లాల్లో జోరున వర్షం కురుస్తున్నా ఉద్యమం మాత్రం సడలలేదు. ఎన్జీవోలు ఓవైపు కార్యాలయాల్లో విధులకు హాజరవుతూ మరోవైపు ఉద్యమంలో చురుగ్గా పాల్గొంటున్నారు. చిత్తూరులో న్యాయవాదులు సర్వమత ప్రార్థనలు నిర్వహించారు. తిరుపతిలో సాప్స్ ఆధ్వర్యంలో మానవహారం, రాస్తారోకో చేశారు. పుంగనూరులో బీసీ సంఘం, ఆర్టీసీ జేఏసీ ఆధ్వర్యంలో సమైక్యవాదులు అర్ధనగ్నంగా మోకాళ్లపై నిలబడి సమైక్య నినాదాలు చేశారు. సమైక్య ఉద్యమాన్ని తక్కువచేస్తూ మాట్లాడిన పీసీసీ మాజీ చీఫ్ డి. శ్రీనివాస్ దిష్టిబొమ్మను కృష్ణాజిల్లా కలిదిండిలో జేఏసీ నాయకులు దహనం చేశారు. అవనిగడ్డలో నిర్వహిస్తున్న రిలే దీక్షలు శుక్రవారం భారీవర్షంలోనూ కొనసాగాయి. తూర్పుగోదావరి, నెల్లూరు, అనంతపురం తదితర జిల్లాల్లో వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో ఆందోళనలు సాగాయి. అనేకచోట్ల గడపగడపకూ వైఎస్సార్పీపీ పేరిట పాదయాత్రలు కూడా నిర్వహించారు. మంత్రి కాసుకు సమైక్య సెగ గుంటూరు జిల్లా దాచేపల్లి మండలం నారాయణపురంలో మంత్రి కాసు వెంకటకృష్ణారెడ్డికి సమైక్య సెగ తగిలింది. రచ్చబండ కార్యక్రమానికి హాజరయ్యేందుకు వెళ్తున్న ఆయన కాన్వాయ్‌ని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అడ్డుకున్నారు. కాసు కారు దిగి ఆందోళనకారుల వద్దకు రాగా, మంత్రి పదవికి రాజీనామా చేసి సమైక్య ఉద్యమంలో పాల్గొనాల్సిందిగా నినాదాలు చేశారు. విభజనను అడ్డుకునేందుకు సర్వశక్తులూ ఒడ్డుతామని ఆయన చెప్పడంతో ఆందోళన విరమించారు. -
ముక్కలు కానివ్వం.. సమైక్యవాదుల ప్రతిన
108రోజులకు చేరిన ఉద్యమం సాక్షి నెట్వర్క్: సమైక్యాంధ్ర పరిరక్షణోద్యమం 108వరోజూ శుక్రవారం సీమాంధ్ర జిల్లాల్లో ఉద్ధృతంగా సాగింది. ఎట్టి పరిస్థితుల్లో రాష్ట్రాన్ని ముక్కలు కానివ్వబోమని ప్రతిజ్ఞ చేశారు. బెజవాడ బార్ అసోసియేషన్ (బీబీఏ) న్యాయవాదులు విజయవాడలో రైల్‌రోకో చేపట్టేందుకు విఫలయత్నం చేశారు. న్యాయవాదుల ప్రతిఘటనతో అక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. కృష్ణాజిల్లా రెడ్డిగూడెం మండలం నాగులూరుకు చెందిన 74ఏళ్ల గోగులమూడి రామకోటిరెడ్డి కాలినడకన 54 కిలోమీటర్ల దూరంలో ఉన్న జమలాపురం శ్రీ వెంకటేశ్వరస్వామిని దర్శించుకునేందుకు బయల్దేరి వెళ్లారు. పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో ఉపాధ్యాయులు రాస్తారోకో చేశారు. చిత్తూరు జిల్లా మదనపల్లెలో ఉద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో ముస్లిం లు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. విద్యార్థులు జాతీయ రహదారిని దిగ్బంధించారు. కాగా, రాష్ట్రాన్ని విభజించాలని కేంద్రం తీసుకున్న నిర్ణయానికి ఏ రాజకీయ పార్టీ అయినా మద్దతు తెలియజేస్తే ఎస్కేయూ విద్యార్థి జేఏసీ ఆధ్వర్యంలో మిలిటెంట్ పోరాటాలు చేయడంతో పాటు అవసరమైతే భౌతిక దాడులకు కూడా వెనుకాడే ప్రసక్తే లేదని సమైక్యాంధ్ర విద్యార్థి జేఏసీ అధ్యక్షుడు పరుశురాంనాయక్ హెచ్చరించారు. మంత్రి రఘువీరా, ఎమ్మెల్యే గుప్తాకు సమైక్యసెగ అనంతపురం జిల్లా కదిరిలో మంత్రి రఘువీరారెడ్డిని సమైక్యవాదులు అడ్డుకున్నారు. రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఎన్నికల్లోపు తెలంగాణపై ఎలాంటి నిర్ణయాలు తీసుకోకుండా ప్రయత్నం చేస్తున్నట్లు మంత్రి రఘువీరా చెప్పారు. అనంతపురంలో డీసీసీ అధ్యక్షుడు, గుంతకల్లు ఎమ్మెల్యేమధుసూదన్గుప్తాను శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీ (ఎస్కేయూ) జేఏసీ నాయకులు అడ్డుకుని సమైక్య నినాదాలు చేశారు. మోసం చేసిందని చెబుతున్న పార్టీలో ఎలా కొనసాగుతారని ప్రశ్నించారు. వైఎస్సార్ సీపీ శ్రేణుల ఉద్యమపథం వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి పిలుపుమేరకు సమైక్యాంధ్ర పరిరక్షణకు పార్టీ శ్రేణులు శుక్రవారం కూడా విభిన్నరూపాల్లో ఆందోళనలు కొనసాగించాయి. తూర్పుగోదావరి పి.గన్నవరం మండ లం ముంగండపాలెంలో, ప్రత్తిపాడు నియోజకవర్గంలో జడ్డంగి అన్నవరం, తూర్పు లక్ష్మీపురం గ్రామా ల్లో గడపగడపకూ వైఎస్సార్సీపీ సమైక్యనాదం పేరిట పాదయాత్రలు నిర్వహించారు. నెల్లూరు జిల్లా పొదలకూరు మండలం బిరదవోలులో సమైక్య దీవెనయాత్ర చేపట్టారు.బాలాయపల్లి మండలం కాలగంధ, కాట్రగుంట, కరిమెనగుంట గ్రామాల్లో, అనంతపురం జిల్లా నల్లమాడలో పాదయాత్రలు చేపట్టారు. చిత్తూరులో గడపగడపకూ సమైక్యశంఖారావం పేరిట పాదయాత్ర జరిగింది. జిల్లాలోని పలమనేరులో మాజీ ఎమ్మెల్యే అమరనాథరెడ్డి రిక్షాతొక్కి నిరసన తెలిపారు. -
‘సమైక్య రచ్చ’బండ
న్యూస్‌లైన్ నెట్వర్క్: రచ్చబండ కార్యక్రమాలు గురువారం సమైక్య నినాదాలతో రచ్చరచ్చగా మారాయి. విజయనగరం జిల్లా సతివాడలో జరిగే రచ్చబండలో పాల్గొనేందుకు వచ్చిన పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణను కారు దిగగానే సమైక్యవాదులు అడ్డుకున్నారు. చిత్తూరు జిల్లాలో నిర్వహించిన రచ్చబండ కార్యక్రమం కొంత ఉద్రిక్తంగా మారింది. సమైక్యవాదమా... వేర్పాటువాదమా స్పష్టం చేసి తర్వాత ప్రసంగించాలంటూ సమైక్యవాదులు ప్రజాప్రతినిధులను నిలదీశారు. సత్యవేడు నియోజకవర్గం నారాయణవనంలో చింతామోహన్ ప్రసంగిస్తుండగా కార్మిక సంఘాలు, వైఎస్ఆర్సీపీ, టీడీపీ నేతలు అడ్డుకున్నారు. అదే సభలో టీడీపీ ఎమ్మెల్యే హేమలతను ‘ గత రచ్చబండలో ఇచ్చిన అర్జీలకే దిక్కులేదు. కొత్త అర్జీలు ఎందుకు’ అని నిలదీశారు. తూర్పు గోదావరి జిల్లా ఏలేశ్వరంలో కేంద్ర మంత్రి పళ్లంరాజుకు సమైక్యసెగ తగిలింది. నగర పంచాయతీ కార్యాలయ భవనం శంకుస్థాపన కార్యక్రమానికి వచ్చిన మంత్రిని పాతబస్టాండ్ ఎదుట వైఎస్సార్సీపీ శ్రేణులు, సమైక్యవాదులు అడ్డుకున్నారు. సమైక్యాంధ్రకు మద్దతుగా రాజీనామా చేయాలని పట్టుబట్టారు. పళ్లంరాజు మాట్లాడుతూ తాను సమైక్యాంధ్రకే కట్టుబడి ఉన్నానని అందుకే రాజీనామా చేయలేదన్నారు. ఆరని విభజన సెగ: రాష్ట్రాన్ని సమైక్యంగానే ఉంచాలంటూ సీమాంధ్రలో జరుగుతున్న ఉద్యమం గురువారం 107వ రోజుకు చేరుకుంది. బాలల దినోత్సవం రోజున నెహ్రూవిగ్రహం సాక్షిగా ఉద్యమాన్ని ఉధృతం చేశారు. రాష్ట్ర విభజన మానుకోవాలని.. జీవోఎం సభ్యులకు మంచి బుద్ధి ప్రసాదించాలని అనంతపురం జిల్లా హిందూపురంలో విశాలాంధ్ర పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో చిన్నారులు జవహర్లాల్ నెహ్రూ విగ్రహానికి పూలు సమర్పించి విన్నవించారు. వైఎస్సార్సీపీ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో ‘రాష్ట్ర విభజన-విద్యార్థుల భవిషత్తు’ అంశంపై అవగాహన సదస్సు నిర్వహించారు. చిత్తూరు జిల్లా మదనపల్లిలో వెలుగు సంస్థ చిన్నారులు భారీ ర్యాలీ తీయగా, పుంగనూరులో ఉద్యోగ జేఏసీ చైర్మన్ వరదారెడ్డి ఆధ్వర్యంలో రాస్తారోకో చేపట్టారు. కుప్పంలో ఐక్య జేఏసీ ఆధ్వర్యంలో విద్యార్థి గర్జన నిర్వహించారు. పశ్చిమగోదావరి జిల్లా భీమవరం ప్రకాశం చౌక్ లో రైతులు దీక్షలో కూర్చున్నారు. కళాశాలలు విద్యార్థులు మానవహారం ఏర్పాటు చేశారు. ఆకివీడు పోలిటికల్ జేఏసీ ఆధ్వర్యంలో గ్రామంలోని అన్ని పాఠశాలల విద్యార్థులు దీక్షలో కూర్చున్నారు. సమైక్యాంధ్రపై విద్యార్థులకు వ్యాసరచన, వక్తృత్వ పోటీలు నిర్వహించారు. కొనసాగిన వైఎస్సార్సీపీ దీక్షలు చిత్తూరు జిల్లా పలమనేరులో వైఎస్ఆర్ సీపీ రిలేదీక్షలు కొనసాగాయి. ైబెరైడ్డిపల్లెలో మాజీ ఎమ్మెల్యే అమరనాథ్‌రెడ్డి సమైక్య పర్యటనను కొనసాగించారు. శ్రీకాళహస్తిలో వైఎస్ఆర్సీపీ రాష్ట్ర నాయకుడు గౌతంరెడ్డి ముఖ్యఅతిథిగా పార్టీ కార్యకర్తలు భారీబైక్ ర్యాలీ నిర్వహించారు. కృష్ణా జిల్లా కైకలూరులో వైఎస్సార్ సీపీ నియోజకవర్గ సమన్వయకర్త దూలం నాగేశ్వరరావు ఆధ్వర్యంలో పార్టీ కార్యాల యం వద్ద కొనసాగుతున్న రిలే దీక్షలు గురువారానికి 100వ రోజుకు చేరాయి. -
సీమాంధ్రలో మార్మోగుతున్న నినాదం
సాక్షి నెట్వర్క్: పైలీన్ తుపాను గడియల్లోనూ.. దసరా శరన్నవరాత్రి వేడుకల్లోనూ సీమాంధ్రలో ఒక్కటే నినాదం మార్మోగుతోంది. ‘సేవ్ సమైక్యాంధ్రప్రదేశ్’.. తుపాను ప్రభావిత ప్రాంతాల్లో భారీవర్షాలు కూడా లెక్కచేయక జనం రోడ్లపైకి సమైక్యనినాదాలు హోరెత్తించారు. ఇక అమ్మవారి నవరాత్రి వేడుకల్లో రాష్ర్టం ముక్కలు కాకుండా ఒక్కటిగా ఉండాలంటూ ప్రత్యేక పూజలు చేపట్టారు. వరుసగా 74వరోజైన శనివారం సమైక్యవాదులు వివిధరూపాల్లో ఆందోళనలు కొనసాగించారు. శ్రీకాకుళం పాలకొండలో వర్షం కురుస్తున్నా ఎన్జీవోలు, ఉపాధ్యాయులు రాస్తారోకో నిర్వహించారు. బెలగాంలో దుర్గాదేవి అవతారంలో తెలుగుతల్లి సమైక్యాంధ్ర ద్రోహులపై ఆగ్రహంచినట్లు వినూత్న తరహాలో నిరసన ప్రదర్శన నిర్వహించారు. తూర్పుగోదావరి జిల్లా అనపర్తిలో జరిగిన రైతు, మహిళ, కార్మిక గర్జనకు వేలాది మంది పోటెత్తారు. ఏపీ ఎన్జీఓ సంఘం జిల్లా చైర్మన్ ఆశీర్వాదం, కార్యదర్శి పితాని త్రినాథ్ మాట్లాడుతూ విభజనను అడ్డుకోకుండా పదవుల్లో కొనసాగుతూ డ్రామాలాడుతున్న సీమాంధ్ర మంత్రులు, ఎంపీలకు రాజకీయ భవిష్యత్ లేకుండా చేస్తామని హెచ్చరించారు. అనంతపురం జిల్లా ధర్మవరంలో సమైక్య నినాదంతో విద్యార్థులు గర్జించారు. వైఎస్సార్ జిల్లా రాయచోటి ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిలో వైద్యులు, వైద్యసిబ్బంది ఓపీ సేవలు నిలిపేశారు. రైల్వేకోడూరులో విద్యార్థులు ‘సేవ్ ఆంధ్రప్రదేశ్’ అంటూ మానవహారం, మైదుకూరులో విద్యార్థులు భారీ ర్యాలీ చేపట్టారు. సమైక్య ద్రోహి ఎంపీ చింతామోహన్ అంటూ నినాదాల్ని హోరెత్తించారు. కర్నూలు జిల్లా ఆలూరులో ఉద్యోగ జేఏసీ నాయకుల ఆధ్వర్యంలో ధర్నా, రాస్తారోకో నిర్వహించారు. కృష్ణాజిల్లా నాగాయలంకలో రహదారులను దిగ్భంధించి వంటావార్పు చేపట్టారు. గుంటూరు జిల్లా ప్రత్తిపాడులో పత్తి మొక్కలతో రైతులు ఆందోళన చేపట్టారు. రేపల్లెలో రైతుగర్జన సభ నిర్వహించారు. నీటిపారుదల శాఖ ఉద్యోగులు ఇరిగేషన్ కార్యాలయం నుంచి ఎన్జీఓ హోమ్ వరకు ర్యాలీ నిర్వహించారు. కాగా, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో గడగడపకూ సమైక్యనినాదం పేరిట కార్యక్రమం నిర్వహించారు. సమైక్యాంధ్ర దళిత జేఏసీ కన్వీనర్ హత్య నెల్లూరు, న్యూస్‌లైన్: సమైక్యాంధ్ర దళిత జేఏసీ రాష్ట్ర కన్వీనర్ బిరదవోలు చిరంజీవి (35) దారుణహత్యకు గురయ్యారు. నెల్లూరు రూరల్ మండలం ఆమంచర్లకు చెందిన చిరంజీవి మృతదేహం గ్రామ సమీపంలోని కాలువలో ఉండగా పశువుల కాపర్లు గమనించారు. చిరంజీవి గొంతు, వీపుపై కత్తితో పొడిచి హత్య చేసినట్లు సీఐ సుధాకర్‌రెడ్డి తెలిపారు. మృతుడి మోటారు సైకిల్ రోడ్డు పక్కనే ఉంది. రాజకీయాల్లో చురుగ్గా పాల్గొనే చిరంజీవి సమైక్య ఉద్యమంలో భాగంగా దళిత జేఏసీని ఏర్పాటు చేసి రాష్ట్ర కన్వీనర్‌గా ఎన్నికయ్యారు. ఆధారాలు సేకరించామని, నిందితులను త్వరలో పట్టుకుంటామని సీఐ చెప్పారు. తేరుకున్న విజయనగరం సాక్షి ప్రతినిధి, విజయనగరం: అల్లర్లతో అతలాకుతలమైన విజయనగరం తేరుకుంటోంది. ఇన్నాళ్లూ పగలూ రాత్రీ భయంతో ఇళ్లలో గడిపిన జనం ఇప్పుడిప్పుడే వీధుల్లోకి వస్తున్నారు. అధికారులు పగటి పూట కర్ఫ్యూను సడలించడంతో ప్రజలు సరుకులు కొనుక్కునేందుకు మార్కెట్ బాట పడుతున్నారు. దసరా, మరో వారంలో జరగనున్న పైడితల్లమ్మ పండుగలకు ఏర్పాట్లు చేసుకునే నిమిత్తం ప్రజలు కొనుగోలు బాట పట్టారు. దాదాపు రెండునెలల తరువాత పట్టణంలో సందడి నెలకొంది. కాగా, ఆదివారం ఉదయం ఆరు నుంచి రాత్రి ఎనిమిది గంటల వరకు కర్ఫ్యూను సడలిస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. -
ఒక్కటే లక్ష్యం.. మార్మోగుతున్న సమైక్యనాదం
జోరువర్షంలోనూ ఆగని జనోద్యమం సాక్షి నెట్వర్క్: రాష్ట్రం ఒక్కటిగా ఉండటం కంటే మరో ప్రత్యామ్నాయమే లేదంటూ సీమాంధ్రలో ఎగసిన జనోద్యమం వరుసగా 48వరోజైన సోమవారం నాడూ ఉద్ధృతంగా సాగింది. కోస్తా రాయలసీమల్లోని పలు జిల్లాల్లో ఎడతెరపి లేకుండా వర్షాలు కురిసినా జనం లెక్కచేయక రోడ్లపైకి వచ్చి సమైక్యనినాదాలు హోరెత్తించారు. రాష్ట్రం ముక్కలైతే తాగునీటికి తీవ్ర ఇబ్బంది ఎదురవుతుందని విశాఖపట్నం జిల్లా ఆనందపురం మండలం శొంఠ్యాంలో వందలాదిమంది మహిళలు ఖాళీ బిందెలతో నిరసన వ్యక్తం చేశారు. వర్శిటీ అధ్యాపక జేఏసీ ఆధ్వర్యంలో ఏయూ మెయిన్ గేట్ నుంచి సిరిపురం వరకు వందలాదిమంది జాతీయ పతాకాన్ని ప్రదర్శించారు. ‘క్రీడా గర్జన’ పేరిట తూర్పుగోదావరి జిల్లా రావులపాలెంలో జాతీయ రహదారిని దిగ్బంధించి ఆటలు ఆడారు. తాళ్లరేవులో పురోహితుడు ఏలూరు వెంకట కామేశ్వరరావు పంట కాలువలో శవాసనం వేసి 10 గంటల పాటు నీటిపై తేలియాడి సుమారు 10కిలోమీటర్లు తిరుగుతూ నిరసన తెలిపారు. పశ్చిమగోదావరి జిల్లా నిడదవోలులో గంగపుత్రుల ఆధ్వర్యంలో పశ్చిమ డెల్టా ప్రధాన కాలువలో విజ్జేశ్వరం నుండి శెట్టిపేట వరకు 25 బోట్లతో సోమవారం ర్యాలీ నిర్వహించారు. విజయనగరం జిల్లా బొబ్బిలిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అర్ధనగ్న ప్రదర్శన నిర్వహించారు. శ్రీకాకుళం జిల్లా వజ్రపుకొత్తూరు మండలం బెండిగేటులో తప్పెటగుళ్ల ప్రదర్శనతో నిరసన చేపట్టారు. విజయవాడలో ఈ నెల 20న నిర్వహించ తలపెట్టిన సేవ్ ఆంధ్రప్రదేశ్ సభ విజయవంతం కావాలని మహిళా ఉద్యోగులు దుర్గగుడిలో అమ్మవారికి మెట్ల పూజలు చేశారు. వ్యవసాయ, పశుసంవర్ధక, ఉద్యానవన శాఖల ఆధ్వర్యంలో 56మంది ఉద్యోగులు ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ వారికి గుంటూరులో రక్తాన్ని అందజేశారు. ఒంగోలులో ఆర్యవైశ్యులు రాష్ట్రం సమైక్యంగా ఉండాలని కోరుకుంటూ యజ్ఞం నిర్వహించారు. ఈ దీక్షలకు వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి మద్దతు తెలిపి మాట్లాడారు. శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా గూడూరులో వైఎస్సార్ సీపీ నియోజకవర్గ సమన్వయకర్త పాశం సునీల్‌కుమార్ నేతృత్వంలో జలదీక్ష చేపట్టారు. అనంతపురం జిల్లా వ్యాప్తంగా ప్రైవేటు పాఠశాలల విద్యార్థులకు రోడ్లపైనే విద్యాబోధన చేసి నిరసన వ్యక్తం చేశారు. ైవెృఎస్సార్ జిల్లా ప్రొద్దుటూరులో టింబర్ డిపోల వర్తకులు భారీ ర్యాలీ నిర్వహించారు. చిత్తూరు జిల్లా తిరుపతిలో టీటీడీ కల్యాణకట్టకు చెందిన నాయీబ్రాహ్మణులు మేళతాళాలతో ర్యాలీ నిర్వహించారు. చంద్రగిరిలో సమైక్యవాదులు తమిళనాడుకు చెందిన టాక్సీలు, కార్లు, ఇతర వాహనాలను ఆపి‘కేంద్రమంత్రి చిదంబరం ప్రకటనతో ఆంధ్ర రాష్ట్రం అతలాకుతలమైందని, మీరైనా ఆయనకు బుద్ధి చెప్పాలని’ అభ్యర్థించారు. రాష్ట్రాన్ని ముక్కలు చేయవద్దంటూ కర్నూలు జిల్లా తుగ్గలి మండలంలోని 19 గ్రామ పంచాయతీలు తీర్మానం చేసిన ప్రతులను రాష్ట్రపతి, ప్రధానికి పంపారు. విభజిస్తే బూట్‌పాలిష్ చేసుకోవాల్సిందే : భూమన రాష్ట్ర విభజన జరిగితే విద్యావంతులు బూట్ పాలిష్ చేసుకుని బతకాల్సిందేనని తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి అభిప్రాయపడ్డారు. ఆయన సోమవారం తిరుపతిలోని వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహం వద్ద వర్షంలో తడుస్తూ బూట్ పాలిష్ చేశారు. ఈ సందర్భంగా భూమన విలేకరులతో మాట్లాడుతూ విద్యావంతులకు ఉద్యోగాలు లేకపోతే బూట్ పాలిష్ లాంటి కార్యక్రమాలు చేసుకుని జీవనం సాగించాల్సిందేనన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు ఢిల్లీ వెళ్లడం ప్యాకేజీ మాట్లాడుకోవడానికేనని ఆరోపించారు. తర్వాత తెలంగాణ లో పర్యటించడానికి బాబు సన్నాహాలు చేసుకుంటున్నారని భూమన తెలిపారు. గుండెపోటుతో జేఏసీ కో-కన్వీనర్ మృతి గుంతకల్లు (అనంతపురం), న్యూస్‌లైన్ : సమైక్యాంధ్ర ఉద్యమంలో చురుగ్గా పాల్గొంటున్న గుంతకల్లు ప్రభుత్వాస్పత్రి వైద్యుడు, జేఏసీ కో కన్వీనర్ డాక్టర్ సుమంత్‌కుమార్ (59) సోమవారం ఉదయం టీవీలో ఉద్యమ వార్తలు చూస్తూ గుండెపోటుతో మృతి చెందారు. ఇతని స్వస్థలం రాజమండ్రి కాగా, ఉద్యోగ రీత్యా ఇక్కడి ప్రభుత్వాస్పత్రిలో ఈఎన్టీ స్పెషలిస్టుగా పనిచేస్తూ గత ఏడాది రిటైరయ్యారు. రాష్ట్ర విభజన ప్రకటన వెలువడినప్పటి నుంచి.. గుంతకల్లు జేఏసీ కో కన్వీనర్‌గా పోరాటం చేశారు. హోరెత్తిన సమైక్య ‘గర్జన రాజమండ్రి రోడ్ కమ్ రైలు వంతెనపై రైతుల మహార్యాలీ సాక్షి, నెట్వర్క్ : రాష్ట్రం సమైక్యంగా ఉండాలని కోరుతూ సోమవారం సీమాంధ్రలోని పలుచోట్ల ‘గర్జన’లు హోరెత్తాయి. రాజమండ్రి-కొవ్వూరు రోడ్ కమ్ రైల్వే వంతెనపై వ్యవసాయశాఖాధికారుల జేఏసీ ఆధ్వర్యంలో ‘రైతు గర్జన’ చేపట్టారు. ఉభయ గోదావరి జిల్లాలకు చెందిన పదివేలమందికి పైగా రైతులు ట్రాక్టర్లతో వంతెనపై మహా ర్యాలీ నిర్వహించారు. రాష్ర్ట విభజన జరిగితే నదులన్నీ ఎండిపోయి సీమాంధ్ర ప్రాంతమంతా ఎడారిని తలపిస్తుందని అధికారులు లెక్కలతో సహా వివరించారు. అమలాపురంలో వేలాది మంది విద్యార్థులు ‘విద్యార్థిగర్జన’ చేపట్టారు. పశ్చిమగోదావరి జిల్లా ఆకివీడులో సమైక్యాంధ్ర ఉద్యమ జేఏసీ ఆధ్వర్యంలో నిర్వహించిన లక్ష గళ గర్జన విజయవంతమైంది. గర్జన సందర్భంగా ఎంపీ కనుమూరి బాపిరాజును హిజ్రాగా చిత్రీకరించిన ఫ్లెక్సీని ఏర్పాటు చేయటం వివాదాస్పదమైంది. విశాఖ జిల్లా నర్సీపట్నంలో సమైక్య గర్జన ఆకట్టుకుంది. విజయనగరంలో జరిగిన ధూం..ధాం కార్యక్రమంలో కళాకారులు హోరెత్తించారు. కృష్ణాజిల్లా గుడివాడలో మునిసిపల్ జేఏసీ ఆధ్వర్యంలో సింహగర్జన చేపట్టారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం బ్రహ్మదేవి గ్రామంలో బ్రహ్మగర్జన పేరుతో పెద్ద ఎత్తున సభ, ర్యాలీ, రాస్తారోకో నిర్వహించారు. ప్రకాశం జిల్లా మార్టూరులో జాతీయ రహదారిపై రైతుగర్జన, మార్కాపురంలో చేపట్టిన ‘విద్యార్థి గర్జన’, చిత్తూరు జిల్లా నగరిలో మహిళా గర్జన నిర్వహించారు. గుంటూరు జిల్లా చిలకలూరిపేటలో లక్ష జన సమైక్య రణభేరి, మంగళగిరిలో సమైక్య మహిళా శంఖారావం కార్యక్రమాలు విజయవంతమయ్యాయి. ఆగని ప్రజాగ్రహం .. కడపలో మంత్రులకు, ఎంపీల ఇళ్లకు ‘హెచ్చరిక’ పోస్టర్లు సాక్షి నెట్వర్క్ : కాంగ్రెస్, టీడీపీ నేతలపై జనాగ్రహం కొనసాగుతోంది. సోమవారం విజయనగరంలో టీడీపీ ఎమ్మెల్యేలలితకుమారిని అడ్డుకున్నారు. విజయనగరం నుంచి రామభద్రాపురం వెళ్తున్న కాంగ్రెస్ ఎమ్మెల్సీ కోలగట్ల వీరభద్రస్వామిని గజపతినగరంలో జేఏసీ సభ్యులు అడ్డుకున్నారు. విశాఖలోని జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద కాంగ్రెస్ కార్యకర్తలు చేపట్టిన దీక్షా శిబిరం వద్దకు వస్తున్న టి.సుబ్బరామిరెడ్డిని అక్కడే ఉన్న ఉపాధ్యాయులు అడ్డుకుని గోబ్యాక్ అంటూ నినాదాలు చేశారు. వైఎస్సార్ జిల్లా కడపలో మంత్రులు, ఎంపీల ఇళ్లకు ‘హెచ్చరిక’ పోస్టర్లను అంటించారు. ఈ నెల 18వ తేదీలోపు మంత్రులతో పాటు ఎంపీ సాయిప్రతాప్ రాజీనామాలు ఆమోదింపచేసుకుని సమైక్య ఉద్యమంలో పాల్గొనాలని, లేనిపక్షంలో వారి ఇళ్ల వద్దే దీక్షలకు దిగుతామని హెచ్చరించారు. అనంతపురం జిల్లా ఉరవకొండలో జేసీ దివాకరరెడ్డి బస్సులను అడ్డుకున్నారు. శ్రీకాకుళం జిల్లా టెక్కలిలో ఎమ్మెల్యే కొర్ల భారతి ఇంటిని జేఏసీ నేతలు ముట్టడించారు. కాశీబుగ్గలో టీడీపీ నేతలు బండారు సత్యనారాయణమూర్తి, శివాజీలను అడ్డుకోగా, కర్నూలులో న్యాయవాదులు మంత్రి టీజీ వెంకటేష్‌కు చెందిన మౌర్య ఇన్ హోటల్‌ను ముట్టడించారు.