DGP Prasada Rao
-
డీజీపీ ప్రసాదరావుకు ఘనంగా వీడ్కోలు
హైదరాబాద్ : డీజీపీ ప్రసాదరావుకు రెండు రాష్ట్రాల పోలీసు సిబ్బంది వీడ్కోలు పలికారు. సమైక్య రాష్ట్రానికి చివరి డీజీపీగా ప్రసాదరావు పనిచేసిన విషయం తెలిసిందే. అంబర్ పేట పోలీస్ గ్రౌండ్స్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ డీజీపీ జేవీ రాముడు, తెలంగాణ డీజీపీ అనురాగ్ శర్మ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రసాదరావు సేవలను గుర్తు చేసుకున్నారు. -
విద్యుత్ ఉద్యోగుల మెరుపు సమ్మెపై డీజీపీ సమీక్ష
హైదరాబాద్: 75 వేల మంది విద్యుత్ ఉద్యోగులు చేస్తున్న మెరుపు సమ్మెపై డీజీపీ ప్రసాదరావు స్పందించారు. మెరుపు సమ్మె పేరుతో చట్టాన్ని అతిక్రమించినవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని డీజీపీ హెచ్చరించారు. ప్రభుత్వం, అధికారులతో చర్చలు జరిపి సమస్యలు పరిష్కరించుకోవాలన్నారు. సమ్మె కారణంగా ప్రజలకు, సంస్థలకు, ఉత్పత్తి రంగాలకు విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగిస్తే చర్యలు తీసుకుంటామన్నారు. విద్యుత్ ఉద్యోగుల మెరుపు సమ్మెపై డీజీపీ ప్రసాదరావు అధికారులతో సమీక్ష జరిపారు. -
అధికారుల కృషి ఫలితమే ఈ గుర్తింపు: డీజీపీ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర పోలీసులు దేశంలోనే ప్రత్యేక గుర్తింపు సాధించడానికి అధికారుల కృషే కారణమని డీజీపీ ప్రసాదరావు కొనియాడారు. పోలీసు విభాగంపై ప్రచురించిన రెండు పుస్తకాలను శుక్రవారం తన కార్యాలయంలో ఆవిష్కరించారు. వీటికి తుదిరూపం ఇవ్వడానికి మాజీ ఐపీఎస్ అధికారి ఎస్.ఉమాపతి, మాజీ అదనపు ఎస్పీ కె.సుధాకర్ ఎంతో కృషి చేశారని డీజీపీ ప్రసంశించారు. ‘గుడ్ ప్రాక్టీసెస్ ఇన్ ఏపీ పోలీసు’ పేరుతో తీసుకొచ్చిన పుస్తకంలో సైబరాబాద్, మెదక్ జిల్లా పోలీసులు ప్రజలకు సేవ చేయడానికి అనుసరించిన విధానాల గురించి వివరించారు. ‘ప్రాజెక్ట్-పీపుల్స్ పోలీసింగ్’ పేరుతో ఉన్న పుస్తకంలో ప్రజలతో స్నేహ భావంతో మెలిగేందుకు తీసుకోవాల్సిన చర్యల్ని పేర్కొన్నారు. అలాగే, ఇప్పటి వరకు రాష్ట్ర పోలీసు విభాగం జారీ చేసిన మెమోలు, మార్గదర్శకాలు, సూచనలు, సలహాలను పొందుపరిచారు. ఈ పుస్తకాలను బ్యూరో ఆఫ్ పోలీసు రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ప్రచురించింది. -
లేక్వ్యూలో కేసీఆర్‌తో సీఎస్ మహంతి భేటీ
హైదరాబాద్ : టీఆర్ఎస్ అధ్యక్షుడు, తెలంగాణ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టనున్న కేసీఆర్‌తో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మహంతి శుక్రవారం భేటీ అయ్యారు. లేక్‌వ్యూ అతిథిగృహంలో ఈ సమావేశం జరుగుతోంది. ఈ సందర్భంగా రాష్ట్ర విభజన ప్రక్రియ, పంపకాలు, స్థానికతపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా కేసీఆర్‌కు వివరిస్తున్నట్లు సమాచారం. కాగా ఉద్యోగుల విభజనపై కేసీఆర్ ప్రధానంగా సీఎస్‌తో చర్చించినట్లు తెలుస్తోంది. అలాగే ఉద్యోగుల విభజనలో ఎలాంటి అవకతవకలు లేకుండా చూడాలని ఆయన సూచనలు చేసినట్లు సమాచారం. మహంతితో పాటు డీజీపీ ప్రసాదరావు కూడా కేసీఆర్‌తో భేటీ అయ్యారు. అంతకు ముందు పలువురు తెలంగాణ ఐపీఎస్, ఇతర ఉన్నతాధికారులు కేసీఆర్‌ను కలిశారు. తాజా పరిణామాలు, విభజన అంశాలపై చర్చించారు. -
ఈవీఎంల భద్రతకు 49 కంపెనీల బలగాలు: డీజీపీ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో లోక్‌సభ,అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఎన్నిలకు సంబంధించిన ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల (ఈవీఎంల) భద్రతకు మొత్తం 49 కంపెనీల కేంద్ర బలగాలను వినియోగిస్తున్నట్టు డీజీపీ బి.ప్రసాదరావు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. మున్సిపల్, జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలను, తెలంగాణ, సీమాంధ్ర ప్రాంతాల్లో లోక్‌సభ, అసెంబ్లీ సీట్ల ఎన్నికలను సజావుగా నిర్వహించడంలో పోలీసుసిబ్బంది, అధికారులు సఫలీకృతులయ్యారని డీజీపీ అభినందించారు. ఇక ఓట్లలెక్కింపు కూడా ప్రశాంతంగా నిర్వహించడానికి తగిన చర్యలు తీసుకున్నామన్నారు. -
సీమాంధ్ర ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి
హైదరాబాద్: సీమాంధ్రలో బుధవారం ఎన్నికల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్టు డీజీపీ ప్రసాద రావు చెప్పారు. మద్యం, డబ్బు పంపిణీపై ప్రత్యేక దృష్టి సారించినట్టు తెలిపారు. సరిహద్దు ప్రాంతాల్లో ప్రత్యేక నిఘా ఉంచామని, ఎన్నికల విధులకు మొత్తం 1.22 లక్షల మంది పోలీసుల బలగాలను మోహరించినట్టు ప్రసాద రావు చెప్పారు. నాలుగు హెలికాప్టర్లను వినియోగిస్తున్నట్టు తెలిపారు. తనిఖీల్లో ఇప్పటివరకు 131 కోట్ల రూపాయిలను స్వాధీనం చేసుకున్నట్టు డీజీపీ చెప్పారు. 48.50 కోట్లను తిరిగి ఇచ్చేశామని తెలిపారు. 90 కేజీల బంగారం స్వాధీనం చేసుకున్నామని వివరించారు. 29,675 కోడ్ ఉల్లంఘన కేసులు, 5,938 ఎఫ్ఐఆర్లు నమోదు చేసినట్టు డీజీపీ చెప్పారు. -
తెలంగాణాలో బందోబస్తుకు మరి కొందరు అధికారులు
హైదరాబాద్: తెలంగాణాలో బుధవారం జరిగే తొలి విడత పోలింగ్ బందోబస్తు ను పర్యవేక్షించడానికి కొందరు సీనియర్ ఐపిఎస్ అధికారులను కూడా నియమిస్తు డీజీపీ బి.ప్రసాదరరావు ఆదేశాలు జారీ చేశారు. ఇందులో హైదరాబాద్నగర కమిషనరేట్ పరిధిలో గోవింద్‌సింగ్, వేణుగోపాలకృష్ణ, వివి శ్రీనిశ్రీనివాసరావు, టి.యోగానంద్‌లు బందోబస్తును పర్యవేక్షిస్తారు. కరీంనగర్ జిల్లాకు వినయ్జ్రంన్రే, మెదక్ జిల్లాకు సివివి ఎస్కె రాజు, సైబరాబాద్‌లో శ్రీకాంత్, మహబూబ్‌నగర్ లో కె.వంకటేశ్వరరావు, నల్లగొండ జిల్లాకు రవిచంద్ర, రంగారెడ్డి జిల్లాకు త్రివిక్రమ్ వర్మ, అదిలాబాద్ జిల్లాకు వెంకట్రామ్రెడ్డి, కరీంనగర్ జిల్లాకు రంజిత్‌కుమార్, వరంగల్,ఖమ్మం, అదిలాబాద్ జిల్లాలో యాంటి నక్సలైట్ టీమ్‌ల పర్యవేక్షణకు చంద్రశేఖర్రెడ్డిలు బందోబస్తులో భాగంగా పర్యవేక్షిస్తారని డీజీపీ కార్యాలయం తెలిపింది. -
వీఐపీల భద్రతపై దృష్టి పెట్టండి
సాక్షి, హైదరాబాద్: నిఘా వర్గాల హెచ్చరికల నేపథ్యంలో ప్రముఖుల భద్రతపై పూర్తిస్థాయి దృష్టి పెట్టాలని డీజీపీ బి.ప్రసాదరావు ఆదేశించారు. ఈనెల 30న జరగనున్న మునిసిపల్ ఎన్నికల బందోబస్తు, సార్వత్రిక ఎన్నికల ఏర్పాట్లను సమీక్షించేం దుకు ఆయన గురువారం కమిషనర్లు, ఎస్పీలతో వీడియోకాన్ఫరెన్స్ నిర్వహించారు. సరిహద్దు రాష్ట్రాలైన ఛత్తీస్‌గఢ్, ఒడిశా నుంచి మావోయిస్టుల ముప్పు పొంచి ఉన్న విషయాన్ని దృష్టిలో ఉంచుకొని ఆ రాష్ట్రాల సరిహద్దుల్లో ఉన్న జిల్లాల్లో మరింత అప్రమత్తంగా ఉండాలని సిబ్బం దికి సూచించారు. ఎన్నికల ప్రచారంతో పాటు పర్యవేక్షణకు వచ్చే వీఐపీలకు పూర్తి స్థాయి భద్రత కల్పిం చాలని ఆదేశించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో స్థానిక పరిస్థితులతో పాటు పార్టీల ప్రభావం ఉంటుందని, ఈ సందర్భంగా చోటుచేసుకునే అల్లర్లు, ఘర్షణల నిరోధంపై ప్రధానంగా దృష్టి పెట్టాలని సూచిం చారు. ఫ్యాక్షన్ ప్రభావిత ప్రాంతాల్లో అసాంఘిక శక్తుల కదలికపై కన్నేసి ఉంచాలన్నారు. ఈ సందర్భం గా పలు జిల్లా ఎస్పీలు తమకు అదనంగా సిబ్బంది అవసరం ఉందనే విషయాన్ని డీజీపీ దృష్టికి తీసుకువచ్చారు. దీంతో మునిసిపల్ ఎన్నికల కోసం కేటాయిం చిన 28 కంపెనీల ఏపీఎస్పీ బలగాలు శనివారం నుంచి ఆయా జిల్లాలకు వస్తాయని, అవసరాన్ని బట్టి మరింత ఫోర్స్ కేటాయిస్తామని డీజీపీ వారికి తెలి పారు. గత ఎన్నికల్లో నమోదైన కేసుల్ని కొలిక్కి తెచ్చి పెండింగ్‌లో ఉన్న నాన్-బెయిలబుల్ వారెంట్లను ఎగ్జిక్యూట్ చేయాలని ఆదేశించారు. ఎన్నికల కోడ్ ఉల్లంఘన కేసుల్లో వాటి తీరుతెన్నుల్ని బట్టి అవసరమైన తక్షణ చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యే వరకు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన చెక్‌పోస్టుల్లో తనిఖీలు, నిఘా, గస్తీ ముమ్మరం చేయాలని సూచించారు. -
ఎన్నికలపై నక్సల్స్ కన్ను : డీజీపీ పసాదరావు
యాక్షన్ టీమ్స్ విరుచుకుపడే అవకాశం ఈ కోణానికీ బందోబస్తులో ప్రాధాన్యం గస్తీ, తనిఖీలు ముమ్మరం సాక్షి, హైదరాబాద్: ‘నిత్యం ఎన్నికల బహిష్కరణకు పిలుపునిచ్చే మావోయిస్టులు ఆ ప్రక్రియను భగ్నం చేసేందుకు ప్రయత్నిస్తారు. సరిహద్దు రాష్ట్రాలైన ఛత్తీస్‌గఢ్. ఒడిశాల్లో కేంద్రీకృతమైన క్యాడర్ నేరుగా చొచ్చుకు రాకపోయినా... ఇద్దరు, ముగ్గురితో కూడిన యాక్షన్ టీమ్‌లు రెక్కీలు నిర్వహించి మెరుపుదాడులు చేసే ప్రమాదం ఉంది’ అని రాష్ట్ర డీజీపీ ప్రసాదరావు అన్నారు. ఈ పరిణామాలను దృష్టిలో పెట్టుకునే బందోబస్తు, భద్రతా ఏర్పాట్లు చేస్తున్నామని ఆయన చెప్పారు. సార్వత్రిక, మున్సిపల్, పంచాయతీరాజ్ ఎన్నికలు ఒకేసారి రావడంతో రాష్ట్ర పోలీసు శాఖ తీసుకుంటున్న చర్యలను మంగళవారం తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీజీపీ వివరించారు. గతంలో జరిగిన ఎన్నికలకు సంబంధించి నమోదైన కేసుల్ని కొలిక్కి తెస్తున్నామని. అభియోగపత్రాల దాఖలుతో పాటు పెండింగ్‌లో ఉన్న 16 నాన్-బెయిలబుల్ వారెంట్లను ఎగ్జిక్యూట్ చేస్తున్నామని తెలిపారు. ఎన్నికల ప్రచార కార్యక్రమాలు నిర్వహించే పార్టీలు, అభ్యర్థులు కచ్చితంగా ముందస్తు అనుమతి తీసుకోవాలన్నారు. ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం, తూర్పు గోదావరి, విశాఖపట్నం రూరల్, శ్రీకాకుళంలో మావోయిస్టుల ప్రభావం ఉందన్నారు. విశాఖ, ఖమ్మం జిల్లాల్లో మారుమూల ప్రాంతాలకు ఎన్నికల సామగ్రి, సిబ్బందిని తరలించడానికి హెలి కాప్టర్లను వినియోగిస్తామని తెలిపారు. ఎన్నికల ప్రచారానికి వచ్చే వీఐపీలకు ఉన్న ముప్పును బట్టి భద్రతను ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. ఘర్షణల నిరోధంపై ప్రత్యేక దృష్టి స్థానిక సంస్థల ఎన్నికల్లో అల్లర్లు, ఘర్షణలకు అవకాశం ఉండటంతో వాటి నిరోధంపై ప్రధానంగా దృష్టి పెట్టామన్నారు. పరోక్షంగా జరిగే మండల, జిల్లా పరిషత్ అధ్యక్షుల ఎంపికప్పుడు కిడ్నాపింగ్‌లకు ఆస్కారం ఉండడంతో వాటిని అరికట్టడానికి ప్రత్యేక చర్యలు తీసుకుంటామన్నారు. అలాగే ఫ్యాక్షన్ ప్రభావిత ప్రాంతాల్లో అసాంఘిక శక్తులపై ప్రత్యేకంగా దృష్టి సారించామన్నారు. ఏ పార్టీకైనా అన్ని ప్రాంతాల్లో ఎన్నికల ప్రచారం చేసే స్వేచ్ఛ ఉంటుందని, ఫలానా వ్యక్తిని ఫలానా ప్రాంతానికి రావద్దని చెప్పే అధికారం ఎవరికీ లేదని అన్నారు. సాధారణ ఎన్నికలకు సంబంధించి రాష్ట్రంలోని 26,135 పోలింగ్ స్టేషన్లను సమస్యాత్మకంగా పరిగణిస్తున్నట్టు ఆయన తెలిపారు. ఇప్పటి వరకు 1,038 చెక్‌పోస్టులు, 942 ఫ్లైయింగ్ స్వ్కాడ్స్ ఏర్పాటయ్యాయని, ఇవి రానున్న రోజుల్లో పెరుగుతాయని పేర్కొన్నారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు 7,085 మందిని బైండోవర్ చేయడంతో పాటు 3,576 లెసైన్డ్స్ ఆయుధాలను డిపాజిట్ చేయించినట్టు వెల్లడించారు. -
హైవేలపై చెక్‌పోస్ట్‌ల ఏర్పాటు: డీజీపీ
-
హైవేలపై చెక్‌పోస్ట్‌ల ఏర్పాటు: డీజీపీ
హైదరాబాద్: ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రంలో పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేస్తున్నట్లు రాష్ట్ర డీజీపీ బయ్యారపు ప్రసాదరావు చెప్పారు. హైవేలపై చెక్‌పోస్ట్‌లను కూడా ఏర్పాటు చేస్తున్నామన్నారు. జిల్లాలలో 30 పోలీస్ యాక్ట్, నగరాల్లో సిటీ పోలీస్ యాక్ట్ అమలులో ఉంటుందని తెలిపారు. మావోయిస్ట్ ప్రభావిత ప్రాంతాల్లో ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. నామినేషన్ల సందర్భంలో పార్టీలు నిబంధనలు ఉల్లంఘించవద్దని కోరారు. పోలింగ్ బూత్‌లలో సీసీ కెమెరాల ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ర్యాలీలు, మీటింగ్‌ల కోసం స్థానిక పోలీసుల అనుమతి తప్పనిసరని డిజిపి చెప్పారు. -
నేతల వెన్నులో వణుకు
కేసుల సమాచారం కోరిన ఎన్నికల కమిషన్ పోలీసు శాఖ ముమ్మర కసరత్తు నియోజకవర్గాల వారీగా బాధ్యతలు కర్నూలు, న్యూస్‌లైన్: రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆదేశాలతో పోలీసు శాఖ రాజకీయ నాయకులపై నమోదైన కేసుల సమాచారాన్ని సేకరిస్తోంది. మంత్రులు.. ఎమ్మెల్యేలు.. ఎమ్మెల్సీలతో పాటు మాజీ ప్రజాప్రతినిధుల పైనున్న కేసుల వివరాలను తెలుసుకునేందుకు పాత ఫైళ్ల దుమ్ముదులుపుతున్నారు. డీజీపీ ప్రసాదరావు మూడు రోజుల క్రితం అన్ని జిల్లాల పోలీసు అధికారులను వివరాల సేకరణపై అప్రమత్తం చేశారు. ఆ మేరకు ఎస్పీ రఘురామిరెడ్డి జిల్లాలోని అన్ని పోలీసు సబ్ డివిజన్ అధికారులకు బాధ్యతలను అప్పగించారు. ఇప్పటి వరకు పంపిన సమాచారాన్ని పై అధికారులకు పంపగా.. పూర్తి నివేదికను త్వరలో ఎన్నికల సంఘానికి అందజేయనున్నట్లు తెలుస్తోంది. మార్చి మొదటి వారంలో ఎన్నికల షెడ్యుల్ వెలువడే అవకాశం ఉందని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి భన్వర్‌లాల్ ప్రకటించడంతో ఈ ప్రక్రియ ముమ్మరమైంది. ఇప్పటికే మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లోని పరిస్థితులతో పాటు సెల్ టవర్ల సంఖ్య వరకు లోతైన సమాచారం సేకరించి ఎన్నికల కమిషన్‌కు నివేదించారు. గతంలో ఎన్నికల సందర్భంగా ఓటర్లను ఒత్తిడి చేసి దౌర్జన్యాలకు పాల్పడిన వ్యక్తులపైనా ఆరా తీస్తున్నారు. ఈసీ ఆదేశాల మేరకు జిల్లాలో ఎన్నికలకు సంబంధించిన బదిలీలు ఇప్పటికే 75 శాతం పూర్తయ్యాయి. ఈనెల 25న కట్ ఆఫ్ డేట్ విధించడంతో మిగిలిన బదిలీలు కూడా పూర్తి చేసేందుకు కసరత్తు జరుగుతోంది. ఇదిలాఉండగా నాయకులపై నమోదైన కేసుల వివరాలను ఎన్నికల కమిషన్ సేకరిస్తుండటంతో నాయకుల్లో గుబులు మొదలైంది. బరిలో నిలిచే సమయానికి కేసులపై కమిషన్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందోనని వారు ఆందోళన చెందుతున్నారు. నేతల అనుచరులపైనా నిఘా: నేతల అనుచరులుగా దౌర్జన్యాలకు, బెదిరింపులకు పాల్పడుతున్న రౌడీ షీటర్ల కదలికలపైనా నిఘా సారించారు. వచ్చే ఎన్నికలు అన్ని పార్టీలకు ప్రతిష్టాత్మకం కావడంతో ఎన్నికల సమయంలో వీరు దేనికైనా సిద్ధపడే అవకాశం ఉందని పోలీసు అధికారులు ముందస్తు చర్యలకు శ్రీకారం చుట్టారు. ఈసీ ఆదేశాలతో ఫ్యాక్షన్ గ్రామాల్లో ప్రస్తుతం ఉన్న పరిస్థితి, ఎన్నికల నాటికి తలెత్తే పరిస్థితులు, తుపాకీ అనుమతులు ఎవరెవరికి ఉన్నాయనే విషయమై సేకరించిన సమాచారాన్ని పోలీసు వర్గాలు ఈసీకి సమర్పించాయి. 2009లో సాధారణ ఎన్నికలు.. 2012లో జరిగిన ఆళ్లగడ్డ, ఎమ్మిగనూరు ఉప ఎన్నికల సందర్భంగా నేతలపై నమోదైన కేసులు 29.04.2012న ఆళ్లగడ్డలో ఉప ఎన్నికల సందర్భంగా చోటు చేసుకున్న పరిణామాలపై టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడుపై 10.05.2012న కేసు(క్రైం నం.48/12) నమోదైంది. ఆయనతో పాటు పత్తికొండ ఎమ్మెల్యే కేఈ ప్రభాకర్, ఆదోని ఎమ్మెల్యే మీనాక్షి నాయుడు, మాజీ మంత్రి ఎన్ఎండీ ఫరూక్, టీడీపీ జిల్లా అధ్యక్షుడు సోమిశెట్టి వెంకటేశ్వర్లు, మాజీ అధ్యక్షుడు బెరైడ్డి రాజశేఖర్‌రెడ్డి, జనార్ధన్‌రెడ్డి, ఎన్‌హెచ్.భాస్కర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ మసాల పద్మజ, ఇరిగెల రాంపుల్లారెడ్డి తదితరులపై ఐపీసీ 188, 156క్లాజ్ 3 సీఆర్పీసీ సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి. 25.05.2012న ఉప ఎన్నికల సందర్భంగా జరిగిన సంఘటన నేపథ్యంలో ఆళ్లగడ్డ మండలం దొర్నిపాడు పోలీస్ స్టేషన్లో టీడీపీ నేత ఇరిగెల రాంపుల్లారెడ్డి, ప్రసాదరెడ్డి, లింగారెడ్డి, నారాయణరెడ్డితో పాటు మరో 12 మందిపై ఐపీసీ 341, 342, 506 సెక్షన్ల కింద కేసు(క్రైం నం.37/12) నమోదైంది. వెల్దుర్తి పోలీస్ స్టేషన్లో పత్తికొండ ఎమ్మెల్యే కేఈ ప్రభాకర్ ఫిర్యాదు మేరకు అదే నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి చెరుకులపాడు నారాయణరెడ్డితో పాటు మరో 11 మందిపై క్రైం నం.114/09 కింద కేసు బనాయించారు. ఇదే స్టేషన్లో కాంగ్రెస్ పార్టీ కార్యకర్త శ్రీనివాసులు ఫిర్యాదు మేరకు క్రైం నం.115/09 కింద కేఈ ప్రభాకర్ సహా మరో పది మందిపై కేసు నమోదైంది. సాధారణ ఎన్నికల సందర్భంగా జలదుర్గంలో పోలింగ్ బూత్ సమీపంలోకి వెళ్లకూడదనే నిబంధనను ఉల్లంఘించినందుకు డోన్ ఎమ్మెల్యే కేఈ క్రిష్ణమూర్తిపై జలదుర్గం పోలీస్ స్టేషన్లో కేసు(క్రైం నం.42/09) నమోదైంది. 2009లో కాటసాని రామిరెడ్డి ప్రజారాజ్యం పార్టీ తరఫున పోటీ చేశారు. ఆ సందర్భంగా విధులకు ఆటంకం కలిగించినట్లు ఎన్నికల సిబ్బంది ఫిర్యాదు చేయడంతో ఉయ్యాలవాడ పోలీస్ స్టేషన్లో కేసు(క్రైం నం.67/09) నమోదైంది. గత సాధారణ ఎన్నికల్లో పోలింగ్ ముందు రోజు నాయకులతో పాటు వారి అనుచరులపై 49 కేసులు నమోదు కాగా.. పోలింగ్ రోజు 24 కేసులు, పోలింగ్ ముగిసిన మరునాడు 13 కేసులు నమోదయ్యాయి. కోడ్ ఉల్లంఘించిన కేసులు, పోలింగ్‌కు ముందు రోజు 72 కాగా.. పోలింగ్ రోజు 7 కేసులు నమోదయ్యాయి. -
తిరుమల భద్రతకు ఎన్ఎస్జీ, ఆక్టోపస్
సాక్షి, తిరుమల : తిరుమల భద్రతకు నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్(ఎన్ఎస్జీ), ఆక్టోపస్ బలగాలు సంయుక్త ఆపరేషన్ నిర్వహిస్తాయని డీజీపీ బి.ప్రసాదరావు వెల్లడించారు. శనివారం ఆయన తిరుమలలోని ఆక్టోపస్ యూనిట్‌ను సందర్శించారు. అనంతరం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఎన్ఎస్జీ బృందంతో ఆక్టోపస్ కలసి పనిచేస్తుందన్నారు. ఇక్కడి అవసరాలు, పరిస్థితిని బట్టి యూనిట్‌ను పెంచుతామన్నారు. పరికరాలు, సిబ్బందిని సంఖ్య పెంచేందుకు ఇక్కడ సౌకర్యాలు, స్థలం సరిపోవటం లేదన్నారు. దీనిపై టీటీడీ ఈవోతో చర్చిస్తామన్నారు. అత్యవసర పరిస్థితుల్లో శ్రీవారి ఆలయ ప్రాకారాలు, గోడల వద్దకు చాలా సులువుగా చేరుకునేలా నిత్యం కమాండోలు ప్రత్యేక శిక్షణ(మాక్‌డ్రిల్) పొందుతున్నారన్నారు. కాగా, శ్రీవారిని డీజీపీ శనివారం కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. పచ్చకర్పూరపు వెలుగులో మూలమూర్తిని దర్శించుకుని ఆనంద పరవశులయ్యారు. -
వేసవిలో పోలీసు బదిలీలు
సాక్షి, హైదరాబాద్: పోలీసుశాఖలో విద్యా సంవత్సరానికి అనుగుణంగా వేసవిలో బదిలీలు చేపట్టేందుకు అధికారులు ప్రణాళిక రూపొందించారు. ప్రతి పోలీస్‌స్టేషన్‌లో కానిస్టేబుల్, ఏఎస్ఐ, ఎస్ఐ, సీఐల వరకు బదిలీలకు సంబంధించి రూపొందించిన నూతన క్యాలెండర్‌ను అమలుచేయాలని డీజీపీ ప్రసాదరావు స్పష్టమైన ఆదేశాలు జారీచేశారు. సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు అనుగుణంగా రెండేళ్ల సర్వీసు పూర్తికాకుండా ఎవరినీ బదిలీ చేయవద్దని పోలీస్ ఎస్టాబ్లిష్మెంట్ బోర్డు చైర్మన్ హోదాలో డీజీపీ ఉత్తర్వులు ఇచ్చారు. ఎప్పుడుపడితే అప్పుడు బదిలీలు చేయడం, విధివిధానాలు లేకపోవడంతో సిబ్బంది ఇబ్బందులకు గురవుతున్నారు. మిగతా ప్రభుత్వ శాఖల్లో మాదిరిగా బదిలీలను చేపట్టడం ద్వారా సిబ్బందిలో మనోస్థైర్యం పెంచాలని పోలీసు ఉన్నతాధికారులు నిర్ణయించారు. కానిస్టేబుల్ నుంచి ఏఎస్ఐ వరకూ బదిలీల విషయంలో రాజకీయ ఒత్తిళ్లు అంతగా లేకున్నా ఎస్ఐ, సీఐ బదిలీలలో ప్రజాప్రతినిధుల జోక్యంతో అధికారుల తలబొప్పికడుతోంది. నూతన మార్గదర్శకాలను పాటించటంపై పోలీసు కో ఆర్డినేషన్ విభాగం అదనపు డీజీ వినయ్‌కుమార్‌సింగ్ త్వరలో డీఐజీ, ఐజీలతో ప్రత్యేక సమావేశం నిర్వహించనున్నారు. బదిలీల క్యాలెండర్ మార్గదర్శకాలివే... ళీ కానిస్టేబుల్ నుంచి సర్కిల్ ఇన్స్పెక్టర్ వరకూ విధ్యా సంవత్సరానికి అనుగుణంగానే బదిలీలు చేయాలి. ళీ అత్యవసర పరిస్థితుల్లో పరిపాలనా సౌలభ్యంకోసం, పదోన్నతి వల్ల ఖాళీలు ఏర్పడినప్పుడు మాత్రమే విద్యా సంవత్సరం మధ్యలో బదిలీలు చేసే అవకాశం ఉంది. ళీ విధి నిర్వహణలో, కేసుల దర్యాప్తులో సామర్థ్యం లేకుండా వ్యవహరించినా... అధికారి స్వచ్ఛందంగా కోరుకున్నా బదిలీ చేయవచ్చు. ళీ ఐదేళ్లు సర్వీసు పూర్తయిన ప్రతి సర్కిల్ ఇన్‌స్పెక్టర్‌నూ అదే రీజియన్‌లోని వేరొక జిల్లాకు పంపాలి. ళీ ఐదేళ్లు సర్వీసు పూర్తయిన ఎస్ఐని ఇతర సబ్ డివిజన్‌కు పంపాలి. కానిస్టేబుల్, హెడ్ కానిస్టేబుల్‌ను మరో సర్కిల్‌కు బదిలీ చేయాలి. ళీ అధికారులు, సిబ్బంది నిర్ణీత గడువుకన్నా ముందుగానే కొన్ని కారణాలతో తిరిగి తమ స్థానాలకు వస్తే వారికి ప్రధానమైన పోస్టులు ఇవ్వరాదు. ళీ ఏసీబీ కేసులు ఎదుర్కొంటున్న సిబ్బందిని ప్రధానమైన పోస్టులకు దూరంగా ఉంచాలి. ళీ స్పెషల్ బ్రాంచ్, సీఐడీ, విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్, ఏసీబీ లాంటి విభాగాలలో పనిచేసి వచ్చిన వారికి ప్రధాన పోస్టులు అప్పగించాలి. -
ఎంపీ పొన్నంపై కరీంనగర్లో కేసు: డీజీపీ
విజయవాడ: ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డిపై వివాదస్పద వ్యాఖ్యలు చేసిన కాంగ్రెస్ ఎంపీ పొన్నం ప్రభాకర్ పై కరీంనగర్లో కేసు నమోదయిందని డీజీపీ ప్రసాదరావు తెలిపారు. దీనిపై చట్టపరంగా ముందుకెళామని చెప్పారు. సీఎం కిరణ్‌ను తెలంగాణలో అడుగుపెట్టనీయబోమని, ఒకవేళ కిరణ్ కుమార్ రెడ్డి హెలికాప్టర్లో వస్తే గాల్లోనే తుపాకీ పెట్టి ఆ హెలికాప్టర్ పేల్చేస్తామని పొన్నం నిన్న వ్యాఖ్యానించారు. కాగా, మావోయిస్టు ప్రభావిత, తీర ప్రాంతాలు, అటవీ ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించామని డీజీపీ ప్రసాదరావు వెల్లడించారు. అటవీశాఖ అధికారులకు ఈనెల 6 నుంచి ఆయుధాలతో ప్రత్యేక శిక్షణ ఇవ్వనున్నట్టు తెలిపారు. ఎర్రచందనం స్మగ్గర్లు తరచుగా అటవీ అధికారులపై దాడులకు పాల్పడుతుండడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. -
'మహిళలపై వేధింపుల కేసులు పెరిగాయి'
-
మహిళలపై వేధింపుల కేసులు పెరిగాయి: డీజీపీ
హైదరాబాద్: తెలంగాణ, సమైక్యాంధ్ర ఆందోళనలను శాంతియుతంగా అదుపుచేశామని డీజీపీ ప్రసాదరావు తెలిపారు. ఎర్రచందనం అక్రమ రవాణాపై 531 కేసుల నమోదు చేశామన్నారు. మొత్తం 3249 మందిని అరెస్ట్ చేశామని వెల్లడించారు. 163 మంది మావోమయిస్టులను అదుపులోకి తీసుకున్నామని, 76 మంది లొంగిపోయారని చెప్పారు. ఈ ఏడాది 1435 అత్యాచారం కేసులు నమోదయ్యాయని తెలిపారు. గతేడాదితో పోలిస్తే అత్యాచారం కేసులు 20.49 శాతం పెరిగాయని పేర్కొన్నారు. 11420 చీటింగ్ కేసులు నమోదయినట్టు చెప్పారు. మహిళలకు వేధింపులపై 25998 కేసులు నమోదు చేశామన్నారు. 2012తో పోలిస్తే మహిళలపై వేధింపుల కేసులు 15.11శాతం పెరిగినట్టు డీజీపీ తెలిపారు. గతంలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల్లో పోలీసులు సమర్థవంతంగా వ్యవహరించారని డీజీపీ అన్నారు. 2009 నుంచి రాష్ట్రంలో ఉద్యమాలు ప్రారంభం అయ్యాయని, తెలంగాణ, సమైక్యాంధ్ర ఆందోళనలు, ఉద్యమాల సమయంలో పోలీసులు ఏ ప్రాంతవాసులకు ఇబ్బంది కలగకుండా వ్యవహరించారన్నారు. పోలీసులు వ్యవహరించిన తీరును డీజీపీ ప్రశంసించారు. ఏడాది ముగుస్తున్న సందర్భంగా రాష్ట్రంలోని శాంతిభద్రతల విషయంలో పోలీసుల వ్యవహరించిన తీరును ఆయన వివరించారు. ముఖ్యంగా ఉద్రిక్త పరిస్థితుల్లో ఆందోళనకారులపై చర్యలు తీసుకునేప్పుడు ఎవరూ మరణించకపోవడం పోలీసుల ఘనత అని ఆయన అన్నారు. -
భద్రతకు భరోసా ...
=ఐటీ కారిడార్ పోలీసింగ్‌తో ఉద్యోగినుల్లో పెరిగిన ఆత్మస్థైర్యం =ఐదు డివిజన్లలో 24 గంటలూ గస్తీ సాక్షి, సిటీబ్యూరో: డీజీపీ ప్రసాదరావు ఈనెల 18నప్రారంభించిన ఐటీ కారిడార్ పోలీసింగ్ మహిళా ఉద్యోగులకు భద్రతపై భరోసా ఇస్తోంది. ప్రత్యేకంగా రూపొందించిన ఐదు గస్తీ వాహనాలు 24 గంటలూ ఐటీ జోన్లోనే తిరుగుతుండటంతో కిడ్నాపర్లు, అసాంఘిక శక్తులకు భయం పట్టుకుంది. ఎవరైనా ‘అభయ’ లాంటి ఘటనలకు సాహసిస్తే వారి తాట తీస్తామని ఐటీ కారిడార్ పెట్రోలింగ్ పోలీసులు స్పష్టం చేస్తున్నారు. మూడు నెలల క్రితం జరిగిన అభయ ఘటనతో సైబరాబాద్ పోలీసులు ఐటీ జోన్‌పై పూర్తిగా దృష్టి పెట్టి భద్రతా చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగానే ఇటీవల ఐటీ కారిడార్ పెట్రోలింగ్ ప్రారంభించారు. ఇన్స్పెక్టర్ రమేష్‌కుమార్ నేతృత్వంలో 80 మంది పోలీసులు ఈ విధుల్లో పని చేస్తున్నారు. మొత్తం ఐదు పెట్రోలింగ్ వాహనాలతో గస్తీ నిర్వహిస్తున్నారు. ఒక్కో వాహనంలో హెడ్ కానిస్టేబుల్‌తో పాటు ఇద్దరు కానిస్టేబుల్ ఉంటున్నారు. 24 గంటలు ఒక బ్యాచ్ చొప్పున విధులు నిర్వహిస్తున్నారు. గతంలో సమాచారం ఇస్తేగాని రాని పోలీసులు.. ఇప్పుడు 24 గంటలూ తమ ప్రాంతంలోనే తిరుగుతుండటంతో ఐటీ ఉద్యోగినులు ధైర్యంగా కార్యాలయాలకు వచ్చి వెళ్తున్నారు. ఐటీ కా రిడార్ను ఐదు డివిజన్లుగా విభజించిన పోలీసులు.. ఒక్కో డివి జన్‌లో ఒక పోలీసింగ్ వాహనంలో గస్తీ నిర్వహిస్తున్నారు. సైబ ర్టవర్, కూకట్పల్లి, కొత్తగూడ, విప్రో, బాలయోగి స్టేడియం, నానక్‌రాంగూడ, రాయదుర్గం, క్వాలిటీజంక్షన్, ఎన్నార్బిట్ మాల్ తదితర జంక్షన్ల వద్ద ఈ వాహనాలుంటాయి. ఈ ప్రాం తంలో కొత్తగా ఏర్పాటు చేసిన చెక్‌పోస్టుల వద్దకు ఈ గస్తీ వాహనాలు వెళ్లి పరిస్థితులను తెలుసుకుంటాయి. చె క్‌పోస్టుల వద్ద రాయదుర్గం,మాదాపూర్, చందానగర్, మియాపూర్ పోలీసులు పికెట్ నిర్వహిస్తున్నారు. ఐటీ జోన్లో చిన్న ఘటన జరిగినా వెంటనే అక్కడికి చేరుకొని బాధితులను ఆదుకుంటున్నారు. బస్సుల రాకపోకల సమయం తెలియడంలేదు... ఐటీ కారిడార్‌లో ప్రతీ అరగంటకు ఒక బస్సు అందుబాటులో ఉంటోంది. అయితే, అవి ఎప్పుడు బస్టాప్‌కు వస్తాయనే సమాచారం తెలియడంలేదు. బస్సు రాక పోకల సమయాలతో బస్టాప్‌లో చార్ట్ ఏర్పాటు చేయాలి. అలాగే, బస్సు షెల్టర్లు కూడా ఏర్పాటు చేయాలి. - రమ్య, ఐటీ ఉద్యోగి పికెటింగ్ కొనసాగించాలి పోలీసుల పికెటింగ్ గతంలో కంటే మెరుగ్గా ఉంది. దీన్ని ఇలాగే కొనసాగిస్తే సమస్యలు తగ్గుతాయి. పోలీసులు మరింత మెరుగైన సేవలందించాలి. బస్టాప్‌లు, రోడ్ల పక్కల గుంపులుగా నిలబడే పోకిరీలను ఎప్పటికప్పుడు మందలించి పంపేయాలి. - సంధ్య, ఐటీ ఉద్యోగి నిర్మానుష్య ప్రాంతాల్లో తాగుబోతుల తిష్ట... ఐటీ కారిడార్‌లోని నిర్మానుష్య ప్రాంతాలు రాత్రి 8 గంటలయితే చాలు తాగుబోతులకు అడ్డాగా మారుతున్నాయి. కొందరు డ్రైవర్లు, జులాయిలు ఆ మార్గంలో వెళ్లే ప్రయాణికులు, సాఫ్ట్వేర్ సిబ్బందితో గొడవకు దిగుతున్నారు. పోలీ సులు ఈ విషయంపై ప్రత్యేక దృష్టి పెట్టాలి. - రమేష్, ఐటీ ఉద్యోగి చీమచిటుక్కుమన్నా స్పందిస్తాం ఐటీ కారిడార్‌లో చీమ చిటుక్కుమ న్నా క్షణాల్లో స్పందించడానికి పూర్తి యంత్రాంగం సిద్ధంగా ఉంది. మా గస్తీని చూసి క్యాబ్, ఆటో డ్రైవర్లు కూడా క్రమశిక్షణతో నడుచుకుం టున్నారు. పోలీసుల వద్ద రిజిస్ట్రేషన్ చేసుకోకుండా ఐటీ జోన్లో తిరిగే వాహనాల డ్రైవర్‌కు రిజిస్ట్రేషన్ చేసుకొనేలా కౌన్సెలింగ్ ఇస్తున్నాం. ఇప్పుడు ఐటీ కారిడార్ భద్రత మొత్తం మా గస్తీ సిబ్బంది కన్నుసన్నల్లోనే ఉంది. - రమేష్‌కుమార్, పెట్రోలింగ్ ఇన్స్పెక్టర్ -
ఆటవికంపై విచారణకు ఆదేశం: డీజీపీ
-
ఆటవికంపై విచారణకు ఆదేశం: డీజీపీ
తిరుపతి: శేషాచల అడువుల్లో పోలీసుల ఆటవిక చర్యలపై.. సాక్షి ప్రసారం చేసిన కథనాలపై ప్రభుత్వం స్పందించింది. దీంతో డీజీపీ ప్రసాదరావు తక్షణమే ఈ ఘటనపై సమగ్ర విచారణ జరపాల్సిందిగా ఆదేశించారు. ఎర్రచందనం కూలీని దాడిచేసింది పోలీసులా..? లేదా అటవీశాఖ సిబ్బందా ? అనేది తెలిపాలని ఆయన ఆదేశించినట్టు తెలుస్తోంది. అంతేకాక దాడి జరిగిన సంఘటనా స్థలాన్ని గుర్తించాలని డీజీపీ స్పష్టీకరించారు. కాగా, శేషాచల అడవుల్లో ఎర్రచందనం కూలీని చిదకబాదిన ఘటనపై హెచ్ఆర్సీ సుమోటోగా స్వీకరించాలని పౌరహక్కుల సంఘం నేతలు క్రాంతిచైతన్య,షామీర్భాషాలు డిమాండ్ చేశారు. మంగళవారం వారు సాక్షితో మాట్లాడారు. తక్షణమే విచారణకు ఆదేశించాల్సిందిగా హెచ్ఆర్సీని వారు కోరారు. లేని పక్షంలో తామే కోర్టును ఆశ్రయిస్తామని చెప్పారు. -
ఎస్కే యూనివర్శిటీలో డీజీపీ ప్రసాదరావుకు సమైక్య సెగ
అనంతపురం: జిల్లాలో డీజీపీ ప్రసాదరావుకు సమైక్య సెగ తగలింది. ఎస్కే యూనివర్శిటిలో పీహెచ్డీ పరీక్షకు హాజరైన డీజీపీ ఎదుట అక్కడి విద్యార్థులు సమైక్యనినాదాలు చేశారు. రాష్ట్ర విభజన బిల్లుపై కేంద్రం నిర్ణయానికి వ్యతిరేకంగా సీమాంధ్ర ఉద్యమం పెద్దెఎత్తున జరిగిన సంగతి తెలిసిందే. ఈ ఉద్యమంలో పాల్గొన్న సమైక్యవాదులు నిరసనలు, ధర్నాలు వంటి ఆందోళన కార్యక్రమాలు చేపట్టారు. ఈ నేపథ్యంలో సమైక్యవాదులపై పలు కేసులు నమోదు చేశారు. ఆ కేసులు ఎత్తివేయాలంటూ విద్యార్ధులు సమైక్య నినాదాలు చేశారు. దీంతో ప్రసాదరావు సమైక్యవాదులపై కేసుల ఎత్తివేత అంశాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని చెప్పినట్టు సమాచారం. ఎస్కే యూనివర్శిటిలో ప్రసాదరావు భౌతికశాస్ర్తంలో పిహెచ్డీ చేస్తున్నారు. -
శాసనసభ సజావుగా సాగేలా చర్యలు: డీజీపీ
సాక్షి, నల్లగొండ: రాష్ట్రంలో నెలకొన్న సున్నిత పరిస్థితుల నేపథ్యంలో ఈ నెల 12 నుంచి జరిగే అసెంబ్లీ సమావేశాలకు ఎలాంటి అవాంతరం కలగకుండా అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు డీజీపీ ప్రసాదరావు తెలిపారు. నల్లగొండ జిల్లా పోలీసు కార్యాలయంలో ఏర్పాటు చేసిన పోలీస్ క్యాంటీన్‌ను మంగళవారం ప్రారంభించారు. జిల్లా పోలీసు అధికారులతో సమావేశమైన అనంతరం మీడియాతో మాట్లాడారు. త్వరలోనే ఎస్ఐ రాత పరీక్ష ఫలితాలు వెల్లడిస్తామని ఆయనీ సందర్భంగా చెప్పారు. విధి నిర్వహణలో చనిపోయిన హోంగార్డులకు సంబంధించి... వారి కుటుంబ సభ్యులకు హోంగార్డు ఉద్యోగాలివ్వడంపై పరిశీలిస్తున్నామని చెప్పారు. ఆర్థికశాఖ ఆమోదం రాగానే హోంగార్డులకు వేతనాల పెంపును వర్తింపజేస్తామని డీజీపీ తెలిపారు. -
రాష్ట్రంలో అనిశ్చిత పరిస్థితి: డీజీపీ
హైదరాబాద్ : రాష్ట్రంలో అనిశ్చిత పరిస్థితి కొనసాగుతోందని రాష్ట్ర డీజీపీ ప్రసాదరావు అన్నారు. ఆయన శనివారం 'మీట్ ది ప్రెస్'లో మాట్లాడుతూ సమస్యలు ఉన్నా పంచాయతీ ఎన్నికలు సజావుగా జరిగాయని... ఎన్నికలు ప్రశాంతంగా జరగటం పోలీసు శాఖ పనితీరుకు నిదర్శనమన్నారు. ఢిల్లీలో జరిగిన డీజీపీల సమావేశంలో కూడా రాష్ట్ర పోలీసుల్ని మెచ్చుకున్నారని తెలిపారు. 2009 నుంచి తెలంగాణ ప్రాంతంలో ఉద్యమం జరుగుతోందన్నారు. ఈ ఏడాది జులై నుంచి సీమాంధ్రలో ఉద్యమం మొదలైందని... అయితే ఉద్యమాల ద్వారా నష్టం కలగకుండా చూడగలిగామని డీజీపీ తెలిపారు. ఉద్యమ అల్లర్ల కేసులో 300 మందిని అరెస్ట్ చేసినట్లు ఆయన చెప్పారు. గత రెండు రోజులుగా సీమాంధ్రలో బంద్ ప్రశాంతంగా కొనసాగుతుందని తెలిపారు. -
డీఎస్పీ సుప్రజపై క్రమశిక్షణా చర్యలు పరిశీలిస్తున్నాం:డీజీపీ
హైదరాబాద్: గుంతకల్ డీఎస్పీ సుప్రజపై క్రమశిక్షణా చర్యల అంశాన్ని పరిశీలిస్తున్నామని డీజీపీ ప్రసాదరావు తెలిపారు. ఆమెను ప్రస్తుతం గ్రేహౌండ్స్‌కు బదిలీ చేశామన్నారు. సుప్రజపై విచారణ చేసి నివేదిక అందించాలని రాయలసీమ ఐజీని ఆదేశించామని ప్రసాదరావు తెలిపారు. ఓ హత్య కేసుకు సంబంధించి ఆదివారం నిందితులకు నడిరోడ్డుపైనే కౌన్సిలింగ్ ఇచ్చిన సుప్రజ మరింత దూకుడుగా వ్యవహరించారు. నిందితులను పట్టుకుని ఊర్లో ఊరేగించడంతోపాటు బహిరంగంగా రోడ్డుపైనే లాఠీలతో వారికి గానాభజానా చేశారు. కౌన్సిలింగ్ అంటే మాటలనుకునేదు. ఏకంగా లాఠీ దెబ్బలతో ప్రత్యేక కౌన్సిలింగ్ ఇచ్చారు. ఈ కౌన్సెలింగ్ చేయించుకున్న నలుగురిలో శేఖర్ అనే వ్యక్తి ఓ హత్య కేసులో ప్రధాన నిందితుడు. స్వయానా పిల్లనిచ్చిన మామనే చంపాడన్న ఆరోపణ అతడిపై వచ్చింది. కొంతకాలం వైవాహిక జీవితాన్ని బాగానే అనుభవించాడు. ఆ తర్వాత అసలు గొడవలు మొదలయ్యాయి. ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యతో విభేదాలు పొడచూపాయి. దీంతో శేఖర్ భార్య పుట్టింటికి వెళ్లిపోయింది. దాంతో ఆమె ఇంటికి వెళ్లి, రమ్మని అడగ్గా ఆమె నిరాకరించింది. దీంతో ఆమె తండ్రి మల్లన్నతో శేఖర్ గొడవపడ్డాడు. ఇద్దరి మధ్య గొడవ తీవ్రంగానే జరిగింది. ఆ తర్వాత మల్లన్నను తన స్నేహితులతో కలిసి శేఖర్ హతమార్చాడన్న ఆరోపణలు వచ్చాయి. పోలీసులు ఈ కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. రెండు రోజుల్లోనే శేఖర్, అతని స్నేహితులను పట్టుకున్నారు. వారందరినీ రోడ్డుపైనే కుళ్లబొడిచారు. గుంతకల్లు డీఎస్పీ సుప్రజ లాఠీ అందుకుని శేఖర్ వీపు విమానం మోత మోగించారు. -
హింసకు పాల్పడితే సహించబోం-డీజీపీ ప్రసాదరావు
-
పోలీస్ శాఖలో ఉన్నత ప్రమాణలకు కృషి: ప్రసాదరావు
హైదరాబాద్: పోలీస్ శాఖలో ఉన్నతమైన ప్రమాణాలకు కృషి చేస్తానని డిజిపిగా అదనపు బాధ్యతలు స్వీకరించిన అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) డెరైక్టర్ జనరల్ డాక్టర్ ప్రసాదరావు చెప్పారు. అదనపు బాధ్యతలు స్వీకరించే ముందు ఆయన సాక్షితో మాట్లాడారు. పోలీస్ సిబ్బందికి ప్రస్తుతం ఉన్న సంక్షేమ పథకాలను పరిశీలించి, మెరుగైన పథకాలు అందించేందుకు ప్రయత్నిస్తానని చెప్పారు. అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా శాంతిభద్రతల విషయంలో జాగ్రత్త వహిస్తానన్నారు. పోలీస్ శాఖను అత్యున్నత స్థాయికి తీసుకువెళతానని చెప్పారు.