
రాష్ట్ర డీజీపీ ప్రసాదరావు
హైదరాబాద్: ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రంలో పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేస్తున్నట్లు రాష్ట్ర డీజీపీ బయ్యారపు ప్రసాదరావు చెప్పారు. హైవేలపై చెక్‌పోస్ట్‌లను కూడా ఏర్పాటు చేస్తున్నామన్నారు. జిల్లాలలో 30 పోలీస్ యాక్ట్, నగరాల్లో సిటీ పోలీస్ యాక్ట్ అమలులో ఉంటుందని తెలిపారు. మావోయిస్ట్ ప్రభావిత ప్రాంతాల్లో ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.
నామినేషన్ల సందర్భంలో పార్టీలు నిబంధనలు ఉల్లంఘించవద్దని కోరారు. పోలింగ్ బూత్‌లలో సీసీ కెమెరాల ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ర్యాలీలు, మీటింగ్‌ల కోసం స్థానిక పోలీసుల అనుమతి తప్పనిసరని డిజిపి చెప్పారు.