భద్రతకు భరోసా ... | Ensuring the safety of ... | Sakshi
Sakshi News home page

భద్రతకు భరోసా ...

Published Mon, Dec 30 2013 5:04 AM | Last Updated on Thu, Sep 27 2018 3:58 PM

భద్రతకు భరోసా ... - Sakshi

భద్రతకు భరోసా ...

 =ఐటీ కారిడార్ పోలీసింగ్‌తో ఉద్యోగినుల్లో పెరిగిన ఆత్మస్థైర్యం
 =ఐదు డివిజన్లలో 24 గంటలూ గస్తీ

 
సాక్షి, సిటీబ్యూరో: డీజీపీ ప్రసాదరావు ఈనెల 18నప్రారంభించిన ఐటీ కారిడార్ పోలీసింగ్ మహిళా ఉద్యోగులకు భద్రతపై భరోసా ఇస్తోంది.  ప్రత్యేకంగా రూపొందించిన ఐదు గస్తీ వాహనాలు 24 గంటలూ ఐటీ జోన్‌లోనే తిరుగుతుండటంతో కిడ్నాపర్లు, అసాంఘిక శక్తులకు భయం పట్టుకుంది. ఎవరైనా ‘అభయ’ లాంటి ఘటనలకు సాహసిస్తే వారి తాట తీస్తామని ఐటీ కారిడార్ పెట్రోలింగ్ పోలీసులు స్పష్టం చేస్తున్నారు. మూడు నెలల క్రితం జరిగిన అభయ ఘటనతో సైబరాబాద్ పోలీసులు ఐటీ జోన్‌పై పూర్తిగా దృష్టి పెట్టి భద్రతా చర్యలు చేపట్టారు.

ఇందులో భాగంగానే ఇటీవల ఐటీ కారిడార్ పెట్రోలింగ్ ప్రారంభించారు. ఇన్‌స్పెక్టర్ రమేష్‌కుమార్ నేతృత్వంలో 80 మంది పోలీసులు ఈ విధుల్లో పని చేస్తున్నారు. మొత్తం ఐదు పెట్రోలింగ్ వాహనాలతో గస్తీ నిర్వహిస్తున్నారు. ఒక్కో వాహనంలో హెడ్ కానిస్టేబుల్‌తో పాటు ఇద్దరు కానిస్టేబుల్ ఉంటున్నారు. 24 గంటలు ఒక బ్యాచ్ చొప్పున విధులు నిర్వహిస్తున్నారు. గతంలో సమాచారం ఇస్తేగాని రాని పోలీసులు.. ఇప్పుడు 24 గంటలూ  తమ ప్రాంతంలోనే తిరుగుతుండటంతో ఐటీ ఉద్యోగినులు ధైర్యంగా కార్యాలయాలకు వచ్చి వెళ్తున్నారు.

ఐటీ కా రిడార్‌ను ఐదు డివిజన్లుగా విభజించిన పోలీసులు..  ఒక్కో డివి జన్‌లో ఒక పోలీసింగ్ వాహనంలో గస్తీ నిర్వహిస్తున్నారు.  సైబ ర్‌టవర్, కూకట్‌పల్లి, కొత్తగూడ, విప్రో, బాలయోగి స్టేడియం, నానక్‌రాంగూడ, రాయదుర్గం, క్వాలిటీజంక్షన్, ఎన్నార్బిట్ మాల్ తదితర జంక్షన్ల వద్ద ఈ వాహనాలుంటాయి.  ఈ ప్రాం తంలో కొత్తగా ఏర్పాటు చేసిన చెక్‌పోస్టుల వద్దకు ఈ గస్తీ వాహనాలు వెళ్లి పరిస్థితులను తెలుసుకుంటాయి. చె క్‌పోస్టుల వద్ద రాయదుర్గం,మాదాపూర్, చందానగర్, మియాపూర్ పోలీసులు పికెట్ నిర్వహిస్తున్నారు. ఐటీ జోన్‌లో చిన్న ఘటన జరిగినా వెంటనే అక్కడికి చేరుకొని బాధితులను ఆదుకుంటున్నారు.
 
 బస్సుల రాకపోకల సమయం తెలియడంలేదు...
 ఐటీ కారిడార్‌లో ప్రతీ అరగంటకు ఒక బస్సు అందుబాటులో ఉంటోంది. అయితే, అవి ఎప్పుడు బస్టాప్‌కు వస్తాయనే సమాచారం తెలియడంలేదు. బస్సు రాక పోకల సమయాలతో బస్టాప్‌లో చార్ట్ ఏర్పాటు చేయాలి. అలాగే, బస్సు షెల్టర్లు కూడా ఏర్పాటు చేయాలి.
 - రమ్య, ఐటీ ఉద్యోగి
 
 పికెటింగ్ కొనసాగించాలి
 పోలీసుల పికెటింగ్ గతంలో కంటే మెరుగ్గా ఉంది. దీన్ని ఇలాగే కొనసాగిస్తే సమస్యలు తగ్గుతాయి. పోలీసులు మరింత మెరుగైన సేవలందించాలి.  బస్టాప్‌లు, రోడ్ల పక్కల గుంపులుగా నిలబడే పోకిరీలను ఎప్పటికప్పుడు మందలించి పంపేయాలి.
 - సంధ్య, ఐటీ ఉద్యోగి
 
 నిర్మానుష్య ప్రాంతాల్లో తాగుబోతుల తిష్ట...
 ఐటీ కారిడార్‌లోని నిర్మానుష్య ప్రాంతాలు రాత్రి 8 గంటలయితే చాలు తాగుబోతులకు అడ్డాగా మారుతున్నాయి. కొందరు డ్రైవర్లు, జులాయిలు ఆ మార్గంలో వెళ్లే ప్రయాణికులు, సాఫ్ట్‌వేర్ సిబ్బందితో గొడవకు దిగుతున్నారు.  పోలీ సులు ఈ విషయంపై ప్రత్యేక దృష్టి పెట్టాలి.
 - రమేష్, ఐటీ ఉద్యోగి
 
 చీమచిటుక్కుమన్నా స్పందిస్తాం
 ఐటీ కారిడార్‌లో చీమ చిటుక్కుమ న్నా క్షణాల్లో స్పందించడానికి పూర్తి యంత్రాంగం సిద్ధంగా ఉంది. మా గస్తీని చూసి క్యాబ్, ఆటో డ్రైవర్లు    కూడా క్రమశిక్షణతో నడుచుకుం టున్నారు. పోలీసుల వద్ద రిజిస్ట్రేషన్   చేసుకోకుండా ఐటీ జోన్‌లో తిరిగే వాహనాల డ్రైవర్‌కు రిజిస్ట్రేషన్ చేసుకొనేలా కౌన్సెలింగ్ ఇస్తున్నాం. ఇప్పుడు ఐటీ కారిడార్ భద్రత మొత్తం మా గస్తీ సిబ్బంది కన్నుసన్నల్లోనే ఉంది.
 - రమేష్‌కుమార్, పెట్రోలింగ్ ఇన్‌స్పెక్టర్
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement