patrolling police
-
సలాం.. పోలీస్!
ప్రొద్దుటూరు క్రైం : వాహనాలు లేక అర్థరాత్రి సమయంలో రైల్వే స్టేషన్ నుంచి నడుచుకుంటూ వెళ్తున్న తల్లీకూతుళ్లను పోలీసులు వారి వాహనంలో కూర్చోపెట్టుకొని ఇంటి వద్ద వదలిపెట్టారు. విజయవాడ నుంచి రైలులో వచ్చిన తల్లీకూతుళ్లు ఆదివారం రాత్రి 11.45 గంటల సమయంలో ప్రొద్దుటూరు శివారులోని రైల్వే స్టేషన్లో దిగారు. అయితే ఆ సమయంలో ఎలాంటి ఆటోలు లేకపోవడంతో కుటుంబ సభ్యులకు ఫోన్ చేసినా వారు లిఫ్ట్ చేయలేదు. దీంతో చేసేదేమి లేక ఇద్దరూ నడుచుకుంటూ వెళ్తుండగా పెట్రోలింగ్ పోలీసులు వారిని ఆపడంతో జరిగిన విషయాన్ని తెలిపారు. దిశ యాప్ గురించి వివరించిన పోలీసులు మహిళల సెల్ఫోన్లలో యాప్‌ను డౌన్ లోడ్ చేశారు. వాహనాలు చెడిపోయినప్పుడు గానీ, బస్సులు, ఆటోలు తిరగని సమయాల్లో దిశ యాప్ ద్వారా పోలీసుల సాయాన్ని పొందవచ్చని సూచించారు. అంతేగాక ఏదైనా ముప్పు జరిగే అవకాశం ఉన్న సమయంలో కూడా యాప్‌కు సంబంధించిన ఎస్ఓఎస్ బటన్‌ను నొక్కినట్లైతే వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని రక్షణగా నిలుస్తారని వివరించారు. తర్వాత మహిళలను వాహనంలో కూర్చోపెట్టుకొని హనుమాన్ నగర్‌లోని వారి ఇంటి వద్ద వదిలి పెట్టారు. అర్థరాత్రి సమయంలో తమను క్షేమంగా ఇంటికి చేర్చిన సీఐ వెంకటరమణ, హెడ్ కానిస్టేబుల్ శ్రీనివాసులు, కానిస్టేబుల్ తిరుమలకు మహిళలు కృతజ్ఞతలు తెలిపారు. -
ట్రాక్‌పై పడుకుని చావుని ఆహ్వానించాడు, కానీ
భువనగిరి: జీవితంపై విరక్తితో ఆత్యహత్య చేసుకోవాలని భావించిన యువకుడిని ఆదివారం భువనగిరి పోలీసులు కాపాడారు. రైల్వే ట్రాక్‌పై పడుకొని యువకుడు ఆత్మహత్యకు పాల్పడుతున్నాడంటూ 100కి ఫోన్ రావడంతో, సకాలంలో స్పందించిన పెట్రోలింగ్ వాహన సిబ్బంది.. వెంటనే రైల్వే ట్రాక్ వద్దకు చేరుకొని యువకుడిని కాపాడారు. ఆతరువాత భువనగిరి పోలీసులు అతనికి కౌన్సిలింగ్‌ను నిర్వహించి,కుటుంబసభ్యులకు అప్పజెప్పారు. కాగా, సకాలంలో స్పందించి ఆగమేఘాల మీద సంఘటన స్థలానికి చేరుకొని నిండు ప్రాణాన్ని కాపాడిన పెట్రోలింగ్ వాహన సిబ్బంది రామారావు, శ్రీనివాస్‌లను రాచకొండ పోలీసు కమీషనర్ మహేశ్ భగవత్ అభినందించారు. ఈ విషయాన్ని రాచకొండ పోలీసులు ట్విటర్లో షేర్ చేయగా, సదరు పెట్రోలింగ్ వాహన సిబ్బందిపై అభినందనల వర్షం కురుస్తోంది. On receipt of #Dial100 call @BhongirTownPS #PatrollingStaff B.Rama Rao PCO, and N. Srinivas HGO #rescued a person who was attempting to commit #suicide by lying on the #Railway track. Later BhongirTown Police given #counseling and handed over to his family. pic.twitter.com/URTh5eRkWS — Rachakonda Police (@RachakondaCop) January 24, 2021 -
పోలీసు శాఖలో.. 'మెమో' కలకలం
సాక్షి, నిజామాబాద్: రాత్రి వేళల్లో దొంగతనాలు, దోపిడీలను అరికట్టేందుకు నిర్వహించే పెట్రోలింగ్ విధులను పోలీసులు నిర్లక్ష్యం చేస్తున్నారు. ఈ విధుల కోసమే నియమితులైన సి బ్బంది, వారిని పర్యవేక్షించే అధికారులు తమకేమీ పట్టనట్లు అలసత్వం ప్రదర్శిస్తున్నారు. దీంతో నిజామాబాద్ నగరంతో పాటు, జిల్లా వ్యాప్తంగా తరచూ దోపిడీలు, దొంగతనాలు చోటు చేసుకుంటున్నాయి. ఏకంగా నగరంలోని ప్రధాన వ్యాపార కూడళ్లు, దుకాణ సముదాయాలను సైతం దొంగలు యథేచ్ఛగా లూటీ చేస్తున్నారు. ఈ ఘటనలు పరిశీలిస్తే పెట్రోలింగ్ విధులు నిర్వర్తించే అధికారులు, సిబ్బంది నిర్లక్ష్యం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. దీన్ని సీరియస్‌గా తీసుకున్న సీపీ కార్తికేయ చర్యలకు ఉపక్రమించారు. ఇటీవల సుమారు 35 మందికి మెమోలు జారీ చేశారు. ఇందులో ఎస్ఐలు, ఎస్హెచ్ఓలు సైతం ఉన్నారు. వారి వారి పోలీస్స్టేషన్లలో పెట్రోలింగ్ విధులు నిర్వర్తించే సిబ్బందిపై పర్యవేక్షణ లేకుండా అలసత్వం వహించినందుకు నిర్ణయం తీసుకున్నారు. నిబంధనల ప్రకా రం ఆయా పోలీస్స్టేషన్ల పరిధిలో రాత్రి పది గంటల నుంచి ఉదయం ఆరు గంటల వరకు పెట్రోలింగ్ నిర్వహించాలి. షిఫ్టుల వారీగా విధులు నిర్వర్తిస్తుంటారు. ఎన్ని గంటలకు ఏఏ రూట్లో తిరగాలి.. ఏ పాయింట్ వద్ద ఎన్నిగంటలకు హాజరుకావాలి. వంటివన్నింటిని ప్రత్యేకంగా చార్ట్ రూపొందించి నిర్దేశిస్తారు. ఆ మేరకు పెట్రోలింగ్ విధులు నిర్వర్తించాలి. అయితే పోలీసు అధికారుల నిర్లక్ష్యం కార ణంగా సిబ్బంది ఈ విధులను తూతూ మంత్రంగా నిర్వహిస్తున్నారు. జీపీఆర్ఎస్తో గుర్తింపు.. అందివచ్చిన సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుని పోలీసు వ్యవస్థలో జరుగుతున్న లోపాలను అధికారులు సరి చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇందులో భాగంగా పెట్రోలింగ్ వాహనాలకు జీపీఆర్ఎస్ పరికరాన్ని అమర్చారు. పరికరం అమర్చితే ఆ వాహనం ఎక్కడెక్కడ తిరిగింది.. ఎక్కడ ఎంత సేపు ఆగింది.. అనేది పూర్తి స్థాయిలో ఆన్లైన్లో రికార్డు అవుతుంది. ఇలా రికార్డులను ఆధారంగా చేసుకుని ఉన్నతాధికారులు అలసత్వం వహించిన అధికారులు, సిబ్బందిపై చర్య లు చేపడుతున్నారు. సిబ్బంది కొరత.. మరోవైపు పోలీసుశాఖలో ఖాళీలతో కింది స్థాయిలో పనిచేసే సిబ్బందిపై భారం పడుతోంది. ఆయా పోలీస్స్టేషన్లకు సరిపడా కానిస్టేబుళ్లు లేరు. దీంతో ఉన్న కొద్ది మందిపైనే పనిభారం పెరుగుతోంది. దీనికి తోడు ఏమైనా ప్రత్యేక ఉత్సవాలు, వీఐపీల పర్యటనలు, సభలు, సమావేశాలు జరిగినప్పుడు కింది స్థాయి సిబ్బంది ఇబ్బందులకు గురవుతున్నారు. తగినంత సిబ్బంది లేకపోవడం కూడా పెట్రోలింగ్ విధులు నిర్వర్తించడం ఇబ్బందిగా మారు తోందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. -
‘లేడీ సింగం’ నైటౌట్.. టెన్షన్ టెన్షన్!
పంచకుల : బాధ్యతలు చేపట్టిన తొలిరోజు నుంచే ఓ లేడీ సింగం గడగడలాడిస్తున్నారు. తమ డిపార్ట్మెంట్ పోలీసుల పనితీరు ఎలా ఉందని తెలుసుకునేందుకు నైటౌట్ చేశారు. భద్రతా చర్యలు ఎలా చేపడుతున్నారో తెలుసుకునేందుకు కమిషనర్‌గా వచ్చిన తొలిరోజు రాత్రి మొత్తం నగరాన్ని పర్యవేక్షించారు. హర్యానాలో ఇది హాట్ టాపిక్‌గా మారింది. చారు బాలి పంచకుల పోలీస్ కమిషనర్(సీపీ)గా సోమవారం ఛార్జ్ తీసుకున్నారు. అయితే రాత్రివేళ మహిళలు, సాధారణ పౌరులకు ఎంతమేరకు తమ పోలీసులు భద్రతా కల్పిస్తున్నారో తెలుసుకోవాలనుకున్నారు చారు బాలి. బాధ్యతలు చేపట్టిన రోజు రాత్రే వాహనంలో పంచకుల రోడ్లపై తిరిగి పర్యవేక్షించి షాక్ తిన్నారు. పలు విధులు, ఏరియాల్లో పోలీసులు డ్యూటీలో లేకపోవడాన్ని డీసీపీ రాజేందర్ కుమార్ మీనాకు మంగళవారం తెలిపారు. పోలీసులు డ్యూటీలో ఎందుకు లేరో తనకు సాధ్యమైనంత త్వరగా వివరాలు ఇవ్వాలని ఆదేశించారు. నైట్ షిఫ్ట్స్‌లో కొందరు పోలీసులను రోస్టర్ విధానంలో ప్రజల భద్రత కోసం నియమించాలని సీపీ చారు బాలి సూచించారు. అయితే కమిషనర్ ఛార్జ్ తీసుకున్న తొలిరోజే తాము డ్యూటీ ఎగ్గొట్టామని తెలిస్తే పరిస్థితి ఏంటని నైట్ డ్యూటీ పోలీసులు కంగారు పడుతున్నారు. తొలిసారి కనుక వార్నింగ్ ఇచ్చి వదిలేస్తారని.. ఇకపై బుద్ధిగా డ్యూటీ చేస్తే సరిపోతుందని పోలీసులు సర్దిచెప్పుకుంటున్నట్లు సమాచారం. లేడీ సింగం అప్పుడే రంగంలోకి దిగారంటూ పంచకుల నగరవాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. -
బుచ్చంపేట వద్ద 104 కిలోల గంజాయి పట్టివేత
విశాఖపట్నం జిల్లా రోలుగుంట మండలం బుచ్చంపేట వద్ద 104 కిలోల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ సంఘటనకు సంబంధించి ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసులు పెట్రోలింగ్ చేస్తుండగా ఈ ఇద్దరు పట్టుబడ్డారు. కేసు నమోదు చేసి నిందితులను స్టేషన్‌కు తరలించారు. -
భద్రతకు భరోసా ...
=ఐటీ కారిడార్ పోలీసింగ్‌తో ఉద్యోగినుల్లో పెరిగిన ఆత్మస్థైర్యం =ఐదు డివిజన్లలో 24 గంటలూ గస్తీ సాక్షి, సిటీబ్యూరో: డీజీపీ ప్రసాదరావు ఈనెల 18నప్రారంభించిన ఐటీ కారిడార్ పోలీసింగ్ మహిళా ఉద్యోగులకు భద్రతపై భరోసా ఇస్తోంది. ప్రత్యేకంగా రూపొందించిన ఐదు గస్తీ వాహనాలు 24 గంటలూ ఐటీ జోన్లోనే తిరుగుతుండటంతో కిడ్నాపర్లు, అసాంఘిక శక్తులకు భయం పట్టుకుంది. ఎవరైనా ‘అభయ’ లాంటి ఘటనలకు సాహసిస్తే వారి తాట తీస్తామని ఐటీ కారిడార్ పెట్రోలింగ్ పోలీసులు స్పష్టం చేస్తున్నారు. మూడు నెలల క్రితం జరిగిన అభయ ఘటనతో సైబరాబాద్ పోలీసులు ఐటీ జోన్‌పై పూర్తిగా దృష్టి పెట్టి భద్రతా చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగానే ఇటీవల ఐటీ కారిడార్ పెట్రోలింగ్ ప్రారంభించారు. ఇన్స్పెక్టర్ రమేష్‌కుమార్ నేతృత్వంలో 80 మంది పోలీసులు ఈ విధుల్లో పని చేస్తున్నారు. మొత్తం ఐదు పెట్రోలింగ్ వాహనాలతో గస్తీ నిర్వహిస్తున్నారు. ఒక్కో వాహనంలో హెడ్ కానిస్టేబుల్‌తో పాటు ఇద్దరు కానిస్టేబుల్ ఉంటున్నారు. 24 గంటలు ఒక బ్యాచ్ చొప్పున విధులు నిర్వహిస్తున్నారు. గతంలో సమాచారం ఇస్తేగాని రాని పోలీసులు.. ఇప్పుడు 24 గంటలూ తమ ప్రాంతంలోనే తిరుగుతుండటంతో ఐటీ ఉద్యోగినులు ధైర్యంగా కార్యాలయాలకు వచ్చి వెళ్తున్నారు. ఐటీ కా రిడార్ను ఐదు డివిజన్లుగా విభజించిన పోలీసులు.. ఒక్కో డివి జన్‌లో ఒక పోలీసింగ్ వాహనంలో గస్తీ నిర్వహిస్తున్నారు. సైబ ర్టవర్, కూకట్పల్లి, కొత్తగూడ, విప్రో, బాలయోగి స్టేడియం, నానక్‌రాంగూడ, రాయదుర్గం, క్వాలిటీజంక్షన్, ఎన్నార్బిట్ మాల్ తదితర జంక్షన్ల వద్ద ఈ వాహనాలుంటాయి. ఈ ప్రాం తంలో కొత్తగా ఏర్పాటు చేసిన చెక్‌పోస్టుల వద్దకు ఈ గస్తీ వాహనాలు వెళ్లి పరిస్థితులను తెలుసుకుంటాయి. చె క్‌పోస్టుల వద్ద రాయదుర్గం,మాదాపూర్, చందానగర్, మియాపూర్ పోలీసులు పికెట్ నిర్వహిస్తున్నారు. ఐటీ జోన్లో చిన్న ఘటన జరిగినా వెంటనే అక్కడికి చేరుకొని బాధితులను ఆదుకుంటున్నారు. బస్సుల రాకపోకల సమయం తెలియడంలేదు... ఐటీ కారిడార్‌లో ప్రతీ అరగంటకు ఒక బస్సు అందుబాటులో ఉంటోంది. అయితే, అవి ఎప్పుడు బస్టాప్‌కు వస్తాయనే సమాచారం తెలియడంలేదు. బస్సు రాక పోకల సమయాలతో బస్టాప్‌లో చార్ట్ ఏర్పాటు చేయాలి. అలాగే, బస్సు షెల్టర్లు కూడా ఏర్పాటు చేయాలి. - రమ్య, ఐటీ ఉద్యోగి పికెటింగ్ కొనసాగించాలి పోలీసుల పికెటింగ్ గతంలో కంటే మెరుగ్గా ఉంది. దీన్ని ఇలాగే కొనసాగిస్తే సమస్యలు తగ్గుతాయి. పోలీసులు మరింత మెరుగైన సేవలందించాలి. బస్టాప్‌లు, రోడ్ల పక్కల గుంపులుగా నిలబడే పోకిరీలను ఎప్పటికప్పుడు మందలించి పంపేయాలి. - సంధ్య, ఐటీ ఉద్యోగి నిర్మానుష్య ప్రాంతాల్లో తాగుబోతుల తిష్ట... ఐటీ కారిడార్‌లోని నిర్మానుష్య ప్రాంతాలు రాత్రి 8 గంటలయితే చాలు తాగుబోతులకు అడ్డాగా మారుతున్నాయి. కొందరు డ్రైవర్లు, జులాయిలు ఆ మార్గంలో వెళ్లే ప్రయాణికులు, సాఫ్ట్వేర్ సిబ్బందితో గొడవకు దిగుతున్నారు. పోలీ సులు ఈ విషయంపై ప్రత్యేక దృష్టి పెట్టాలి. - రమేష్, ఐటీ ఉద్యోగి చీమచిటుక్కుమన్నా స్పందిస్తాం ఐటీ కారిడార్‌లో చీమ చిటుక్కుమ న్నా క్షణాల్లో స్పందించడానికి పూర్తి యంత్రాంగం సిద్ధంగా ఉంది. మా గస్తీని చూసి క్యాబ్, ఆటో డ్రైవర్లు కూడా క్రమశిక్షణతో నడుచుకుం టున్నారు. పోలీసుల వద్ద రిజిస్ట్రేషన్ చేసుకోకుండా ఐటీ జోన్లో తిరిగే వాహనాల డ్రైవర్‌కు రిజిస్ట్రేషన్ చేసుకొనేలా కౌన్సెలింగ్ ఇస్తున్నాం. ఇప్పుడు ఐటీ కారిడార్ భద్రత మొత్తం మా గస్తీ సిబ్బంది కన్నుసన్నల్లోనే ఉంది. - రమేష్‌కుమార్, పెట్రోలింగ్ ఇన్స్పెక్టర్