పంచకుల సీపీ చారు బాలి (పాత చిత్రం)
పంచకుల : బాధ్యతలు చేపట్టిన తొలిరోజు నుంచే ఓ లేడీ సింగం గడగడలాడిస్తున్నారు. తమ డిపార్ట్‌మెంట్ పోలీసుల పనితీరు ఎలా ఉందని తెలుసుకునేందుకు నైటౌట్ చేశారు. భద్రతా చర్యలు ఎలా చేపడుతున్నారో తెలుసుకునేందుకు కమిషనర్‌గా వచ్చిన తొలిరోజు రాత్రి మొత్తం నగరాన్ని పర్యవేక్షించారు. హర్యానాలో ఇది హాట్ టాపిక్‌గా మారింది.
చారు బాలి పంచకుల పోలీస్ కమిషనర్(సీపీ)గా సోమవారం ఛార్జ్ తీసుకున్నారు. అయితే రాత్రివేళ మహిళలు, సాధారణ పౌరులకు ఎంతమేరకు తమ పోలీసులు భద్రతా కల్పిస్తున్నారో తెలుసుకోవాలనుకున్నారు చారు బాలి. బాధ్యతలు చేపట్టిన రోజు రాత్రే వాహనంలో పంచకుల రోడ్లపై తిరిగి పర్యవేక్షించి షాక్ తిన్నారు. పలు విధులు, ఏరియాల్లో పోలీసులు డ్యూటీలో లేకపోవడాన్ని డీసీపీ రాజేందర్ కుమార్ మీనాకు మంగళవారం తెలిపారు. పోలీసులు డ్యూటీలో ఎందుకు లేరో తనకు సాధ్యమైనంత త్వరగా వివరాలు ఇవ్వాలని ఆదేశించారు. నైట్ షిఫ్ట్స్‌లో కొందరు పోలీసులను రోస్టర్ విధానంలో ప్రజల భద్రత కోసం నియమించాలని సీపీ చారు బాలి సూచించారు.
అయితే కమిషనర్ ఛార్జ్ తీసుకున్న తొలిరోజే తాము డ్యూటీ ఎగ్గొట్టామని తెలిస్తే పరిస్థితి ఏంటని నైట్ డ్యూటీ పోలీసులు కంగారు పడుతున్నారు. తొలిసారి కనుక వార్నింగ్ ఇచ్చి వదిలేస్తారని.. ఇకపై బుద్ధిగా డ్యూటీ చేస్తే సరిపోతుందని పోలీసులు సర్దిచెప్పుకుంటున్నట్లు సమాచారం. లేడీ సింగం అప్పుడే రంగంలోకి దిగారంటూ పంచకుల నగరవాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment