
చండీగఢ్: హర్యానాలోని పంచకుల జిల్లా పింజోర్‌లో ఆర్టీసీ బస్సు బోల్తా పడింది. ఈ ఘటనలో 40 మంది స్కూలు పిల్లలు, ఇతరులకు గాయాలయ్యాయి. గాయపడ్డవారిని పంచకులలోని ఆస్పత్రికి తరలించి చికిత్సఅందిస్తున్నారు.
తీవ్రంగా గాయపడ్డ ఓ మహిళను మాత్రం చండీగఢ్‌లోని పీజీఐ ఆస్పత్రికి తరలించారు. డ్రైవర్ అతివేగంగా బస్సు నడపడం వల్లే ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ప్రమాదస్థలికి వెంటనే చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేశారు. రోడ్డు సరిగా లేకపోవడం కూడా ప్రమాదానికి కారణమని పోలీసులు ప్రాథమికంగా భావిస్తున్నారు.