చంఢీగడ్: హర్యానాలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. హర్యానాలోని నూహ్‌కు సమీపంలోని కుండలి-మనేసర్-పల్వాల్ ఎక్స్‌ప్రెస్ వేపై ఓ బస్సులో ఆకస్మత్తుగా మంటలు చెలరేగాయి. దీంతో బస్సులో ప్రయాణం చేస్తున్న 8 మంది భక్తులు మృతి చెందారు. పలువురికి తీవ్ర గాయాలు అయ్యాయి. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు.
हरियाणा के नूंह जिले में बड़ा हादसा। टूरिस्ट बस में आग लगी। 8 यात्री जिंदा जले। काफी यात्री झुलस गए। ये सभी मथुरा–वृन्दावन से दर्शन करके पंजाब–हरियाणा की तरफ लौट रहे थे। रात 2 बजे कुंडली–मानेसर–पलवल एक्सप्रेस वे पर हादसा हुआ है।#haryana #Accident pic.twitter.com/Be0gInGJiq
— ShivRaj Yadav (@shivayadav87_) May 18, 2024
ఉత్తరప్రదేశ్‌లోని మధుర, బృందావనం యాత్రకు వెళ్లి వస్తుండగా శుక్రవారం అర్థరాత్రి ఈ ప్రమాదం చోటు చేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. ఈ ప్రమాదంపై దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై నూహ్ ఎమ్మెల్యే అఫ్తాబ్ అహ్మద్ విచారం వ్యక్తం చేశారు. ఈ ఘటనలో వృద్ధులు, మహిళలు, పిల్లలు సహా పలువురు గాయపడ్డారని తెలిపారు.
VIDEO | At least eight people were killed when the bus they were travelling in caught fire on the Kundli-Manesar-Palwal (KMP) Expressway near Nuh, #Haryana, late on Friday.
(Source: Third Party) pic.twitter.com/xeE7XkhBGD— Press Trust of India (@PTI_News) May 18, 2024
Comments
Please login to add a commentAdd a comment