Panchkula
-
నాయబ్‌సింగ్ సైనీ అనే నేను..
చండీగఢ్: హరియాణా ముఖ్యమంత్రిగా ఓబీసీ నాయకుడు నాయబ్‌సింగ్ సైనీ ప్రమాణ స్వీకారం చేశారు. పంచకులలోని దసరా గ్రౌండ్లో గురువారం అట్టహాసంగా జరిగిన కార్యక్రమంలో ఆయనతో రాష్ట్ర గవర్నర్ బండారు దత్తాత్రేయ ప్రమాణ స్వీకారం చేయించారు. అలాగే పలువురు ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రమాణం చేశారు. నూతన మంత్రుల్లో ఇద్దరు మహిళలు ఉన్నారు. గురువారం వాలీ్మకి జయంతి కావడంతో ముఖ్యమంత్రి, మంత్రుల ప్రమాణ స్వీకారానికి బీజేపీ నాయకత్వం ఇదే రోజును ముహూర్తంగా ఎంచుకుంది. ప్రమాణ స్వీకారోత్సవానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్‌నాథ్ సింగ్, జేపీ నడ్డా, నితిన్ గడ్కరీ, చిరాగ్ పాశ్వాన్తోపాటు బీజేపీ/ఎన్డీయే పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు యోగి ఆదిత్యనాథ్, భూపేంద్ర పటేల్, ప్రమోద్ సావంత్, హిమంత బిశ్వ శర్మ, విష్ణుదేవ్ సాయి, పుష్కర్‌సింగ్ దామీ తదితరులు హాజరయ్యారు. ప్రమాణ స్వీకారం కంటే ముందు సైనీ గురుద్వారాలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఇటీవల జరిగిన హరియాణా శాసనసభ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. మొత్తం 90 అసెంబ్లీ స్థానాలకు గాను కమలం పార్టీ 48 స్థానాలు గెలుచుకుని వరుసగా మూడోసారి అధికారంలోకి వచి్చంది. మోదీ అభినందనలు హరియాణా సీఎం నాయబ్‌సింగ్ సైనీతోపాటు కొత్త మంత్రులకు ప్రధాని మోదీ అభినందనలు తెలిపారు. మంత్రివర్గం కూర్పు చక్కగా ఉందని ప్రశంసించారు. ఈ మేరకు గురువారం ‘ఎక్స్’లో పోస్టు చేశారు. హరియాణా ప్రజల ఆకాంక్షలను ప్రభుత్వం నెరవేరుస్తుందని, రాష్ట్ర అభివృద్ధిని నూతన శిఖరాలకు చేరుస్తుందని పేర్కొన్నారు. పేదలు, రైతులు, యువత, మహిళలతోపాటు సమాజంలోని ఇతర వర్గాల సంక్షేమం, సాధికారత విషయంలో డబుల్ ఇంజన్ ప్రభుత్వం అద్భుతంగా పనిచేస్తుందన్న విశ్వాసం తనకు ఉందన్నారు. బీజేపీతో మూడు దశాబ్దాల అనుబంధం బీజేపీ సీనియర్ సీనాయకుడు నాయబ్‌సింగ్ సైనీని మరోసారి అదృష్టం వరించింది. హరియాణా సీఎంగా వరుసగా రెండోసారి ఆయన ప్రమాణం చేశారు. ఈ ఏడాది మార్చి నెలలో ఆయన తొలిసారి ముఖ్యమంత్రి అయ్యారు. మనోహర్‌లాల్ ఖట్టర్ స్థానంలో ఆయనను బీజేపీ అధిష్టానం నియమించింది. ప్రభుత్వ వ్యతిరేకతను అధిగమించడంతోపాటు ఓబీసీల ఓట్లపై గురిపెట్టిన కమల దళం అదే వర్గానికి చెందిన సైనీని తెరపైకి తీసుకొచి్చంది. ఈ ప్రయోగం సత్ఫలితాలు ఇచి్చంది. హరియాణాలో బీజేపీ వరుసగా మూడోసారి నెగ్గింది. అనూహ్యంగా పార్టీని గెలిపించిన సైనీకే మళ్లీ సీఎం పీఠం దక్కింది. ఆయన సాధారణ కార్యకర్త స్థాయి నుంచి ముఖ్యమంత్రి స్థాయికి చేరుకున్నారు. సైనీ 1970 జనవరి 25న అంబాలా జిల్లాలోని మీర్జాపూర్ మాజ్రా గ్రామంలో జని్మంచారు. మూడు దశాబ్దాలుగా బీజేపీలో కొనసాగుతున్నారు. పార్టీలో వివిధ బాధ్యతలు నిర్వర్తించారు. 2014లో ఎమ్మెల్యేగా, 2019లో ఎంపీగా గెలిచారు. 2014 నుంచి 2019 దాకా మనోహర్‌లాల్ ఖట్టర్ కేబినెట్లో మంత్రిగా పనిచేశారు. 2023 అక్టోబర్‌లో హరియాణా బీజేపీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టారు. బీజేపీ అధిష్టానం ఆదేశాల మేరకు ఖట్టర్ ఈ ఏడాది మార్చి సీఎం పదవితోపాటు కర్నాల్ ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేశారు. ఖట్టర్ స్థానంలో సైనీ ముఖ్యమంత్రి అయ్యారు. మే నెలలో జరిగిన కర్నాల్ ఉప ఎన్నికలో ఎమ్మెల్యేగా విజయం సాధించారు. అక్టోబర్ 5న జరిగిన అసెంబ్లీ సాధారణ ఎన్నికల్లో లాడ్వా స్థానం నుంచి 16,054 ఓట్ల మెజారీ్టతో జయకేతనం ఎగురవేశారు. -
హరియాణా బీజేపీఎల్పీ నేతగా సైనీ
చండీగఢ్/ పంచకుల: హరియాణా బీజేపీ లెజిస్లేచర్ పార్టీ నాయకుడిగా నాయబ్‌సింగ్ సైనీ ఏకగ్రీవంగా ఎన్నిక య్యారు. బుధవారం పంచకులలో సమావేశమైన బీజేపీ ఎమ్మెల్యేలు సైనీని తమ నాయకుడిగా ఎన్ను కున్నారు. సైనీ పేరును ఎమ్మెల్యే క్రిషన్ కుమార్ బేడీ ప్రతిపాదించగా.. సీనియ ర్ నేత అనిల్ విజ్ బలపరిచారు. అనిల్ విజ్ సైతం సీఎం పదవిని ఆశించినప్పటికీ బీజేపీ అగ్రనేతలు సైనీ వైపు మొగ్గారు. పరిశీలకుడిగా హాజరైన కేంద్ర హోంమంత్రి అమిత్ షా.. సైనీ ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ప్రకటించారు. అనంతరం సైనీ గవర్నర్ బండారు దత్తాత్రేయను కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు సంసిద్ధతను వ్యక్తం చేశారు. ఈనెల 5న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 48 స్థానాలు నెగ్గి హ్యాట్రిక్ విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. అధికారంలోకి రావడం ఖాయమని సర్వేలన్నీ అంచనా వేసిన కాంగ్రెస్ 37 స్థానాల వద్దే నిలిచిపోయింది. హరియాణా ముఖ్యమంత్రి రెండోసారి సైనీ గురువారం ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి మోదీ, రాజ్‌నాథ్ సింగ్‌లతో పాటు బీజేపీ పాలిత రాష్ట్రాల సీఎంలు, ఎన్డీయే సీఎంలు హాజరుకానున్నారు. -
హర్యానాలో బస్సు బోల్తా.. నలభై మంది పిల్లలకు గాయాలు
చండీగఢ్: హర్యానాలోని పంచకుల జిల్లా పింజోర్‌లో ఆర్టీసీ బస్సు బోల్తా పడింది. ఈ ఘటనలో 40 మంది స్కూలు పిల్లలు, ఇతరులకు గాయాలయ్యాయి. గాయపడ్డవారిని పంచకులలోని ఆస్పత్రికి తరలించి చికిత్సఅందిస్తున్నారు. తీవ్రంగా గాయపడ్డ ఓ మహిళను మాత్రం చండీగఢ్‌లోని పీజీఐ ఆస్పత్రికి తరలించారు. డ్రైవర్ అతివేగంగా బస్సు నడపడం వల్లే ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ప్రమాదస్థలికి వెంటనే చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేశారు. రోడ్డు సరిగా లేకపోవడం కూడా ప్రమాదానికి కారణమని పోలీసులు ప్రాథమికంగా భావిస్తున్నారు. -
దారుణం: డాక్టర్ని ఢీకొట్టి.. కారుతో లాక్కెళ్లి..
చంఢీగర్: హర్యానాలో అమానవీయ ఘటన జరిగింది. ఓ డాక్టర్ని కారుతో దాడి చేసి 50 మీటర్ల వరకు అలాగే లాక్కెళ్లారు దుండగులు. పంచకుల ట్రాఫిక్ సిగ్నల్ వద్ద ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. సీసీటీవీ దృశ్యాల ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేపట్టారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. డా. గగన్ తన కుమారున్ని ట్యూషన్ నుంచి ఇంటికి తీసుకువెళ్తున్నాడు. ఈ క్రమంలో ట్రాఫిక్ సిగ్నల్ వద్దకు చేరుకున్నాడు. అదే సమయంలో పక్కనే ఉన్న కారు అతన్ని ఢీ కొట్టింది. గగన్ కారును ఆపే ప్రయత్నం చేసినప్పటికీ కారు డోమ్‌పై అతన్ని అలాగే ఉంచి ముందుకు దూసుకెళ్లారు. దాదాపు 50 మీటర్ల వరకు కారుతోపాటు లాక్కెళ్లారు దుండగులు. #Video: Doctor Dragged For 50 Meters On Car Bonnet In Panchkula Road Rage Incident in Panchkula#PANCHKULA #ROADRAGE #DOCTORDRAGGED #LatestUpdates pic.twitter.com/JQgpinikw6 — mishikasingh (@mishika_singh) August 28, 2023 తీవ్ర గాయాలపాలైన అతన్ని స్థానికులు ఆస్పత్రికి తరలించారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. సీసీటీవీ ఆధారాలతో దుండగుల కోసం గాలింపు చేపట్టారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇదీ చదవండి: ప్రభుత్వ ఆఫీస్‌లో అధికారి మద్యం సేవిస్తూ.. వీడియో వైరల్.. -
సైకో సైకియాట్రిస్ట్ : చితక్కొట్టిన నర్సులు
సాక్షి, చండీగఢ్ : ఒకవైపు కరోనా మహమ్మారి తన ప్రతాపాన్ని చూపిస్తోంది. మరోవైపు కరోనా కట్టడిలో అనేకమంది వైద్యులు, నర్సులు ప్రాణాలకు తెగించి మరీ పోరాడుతున్నారు. అయితే వైద్య వృత్తికే కళంకం తెచ్చేలా కొంతమంది డాక్టర్లు ప్రవర్తిస్తున్నారు. హర్యానాలోని సివిల్ హాస్పిటల్లో ఇలాంటి ఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. డ్యూటీలో ఉన్న నర్సుపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడో వైద్యుడు. ఈ కేసు విచారణలో ఆసుపత్రి వైఖరిపై మండిపడిన నర్సులు డాక్టరుపై దాడి చేసిన ఉదంతం హాట్ టాపిక్‌గా మారింది. పంచకుల సెక్టార్ 6 లోని సివిల్ హాస్పిటల్లో కోవిడ్-19 డ్యూటీలో ఉన్న నర్సుపై డాక్టర్ మనోజ్ కుమార్ అనే మానసిక వైద్యుడు వేధింపులకు తెగబడ్డాడు. దీనిపై నర్సుల సంఘం ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసింది. వైద్యుడి పట్ల కఠినంగా వ్యహరించలేదంటూ ఆగ్రహం వ్యక్తం చేసిన నర్సులు మనోజ్కుమార్పై దాడి చేసి చితక్కొట్టారు. మంగళవారం విచారణ సందర్భంగా చోటు చేసుకున్న ఈ సంఘటనకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. కేసు పూర్వాపరాలు నర్సుల సంఘం అధ్యక్షురాలు కమల్జీత్ కౌర్ సమాచారం ప్రకారం కోవిడ్-19 ఐసోలేషన్ విధుల్లో ఉండగా శనివారం రాత్రి అర్ధరాత్రి 12 గంటలకు మద్యం సేవించి ఉన్న కుమార్ వార్డుకొచ్చి అసభ్యంగా ప్రవర్తించాడు. బాధిత స్టాఫ్ నర్సును సహాయం కోరుతూ ఆమెను నర్సింగ్ గదికి పిలిచాడు. ఆమె గది లోపలికి వెళ్ళినప్పుడు, తలుపు వేసి, ఆమెపై దాడి చేశాడు. మాస్క్‌ను తొలగించి లైంగికంగా వేధించాడు. దీన్ని ప్రతిఘటించిన ఆమెపై దాడి చేశాడు. అయితే ఎలాగోలా తప్పించుకున్న ఆమె తన సహచరులకు, నర్సింగ్ ఇన్‌ఛార్జిలతోపాటు చీఫ్ మెడికల్ ఆఫీసర్ (సీఎంఓ), ప్రిన్సిపల్ మెడికల్ ఆఫీసర్ (పీఎంఓ)లకు ఫిర్యాదు చేశారు. అయితే, ఆసుపత్రి యాజమాన్యం నిందితుడిపై పోలీసులకు సమాచారం ఇవ్వలేదని కౌర్ ఆరోపించారు. అధికారుల చర్యల కోసం తాము రెండు రోజులు వేచి ఉన్నామని తెలిపారు. ఆసుపత్రి సీనియర్ అధికారులు చాలా మంది మహిళలే ఉన్నారు కాబట్టి తమకు న్యాయం జరుగుతుందని ఆశించిన తమకు నిరాశే ఎదురైందని కౌర్ వాపోయారు. పైగా బాధితురాలిని మూడు రోజుల సెలవుపై పంపారన్నారు. సోమవారం మధ్యాహ్నం కేసు నమోదు చేయడానికి పోలీసు స్టేషన్‌కు వెళితే, మహిళా పోలీసు స్టేషన్‌కు వెళ్లమంటూ అక్కడి సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించాని ఆరోపించారు. దీంతో తాము మహిళా కమిషన్‌ను ఆశ్రయించా మన్నారు. నిందితుడిపై ఎటువంటి చర్య తీసుకోకపోగా, విధులను యధావిధిగా నిర్వహిస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోవైపు వైద్యుడిపై (మహిళల పోలీస్ స్టేషన్లో) ఎఫ్ఐఆర్ నమోదు చేశామనీ, కేసును దర్యాప్తు చేస్తున్నామని అసిస్టెంట్ పోలీసు కమిషనర్ నూపూర్ బిష్ణోయ్ చెప్పారు. వైద్యుడిని అదుపులోకి తీసుకోలేదనీ, అతని స్టేట్మెంట్ ఇంకా నమోదు చేయాల్సి ఉందని వెల్లడించారు. ఈ విషయంపై పంచకుల సీఎంఓ డాక్టర్ జస్జీత్ కౌర్ మాట్లాడుతూ అంతర్గత కమిటీ నివేదికను డైరెక్టర్ జనరల్, హెల్త్ సర్వీసెస్ (డిజిహెచ్ఎస్) తో పాటు, మహిళా కమిషన్‌కు కూడా పంపినట్లు తెలిపారు. వైద్యుడిని డిప్యుటేషన్‌పై పంపించామనీ, పోలీసుల విచారణ కొనసాగుతోందని వివరణ ఇచ్చారు. అలాగే చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకుని, డాక్టరుపై దాడి చేసిన వారిపై కూడా విచారణ జరుగుతుందని డిజిహెచ్ఎస్ డా. కాంభోజీ ప్రకటించడం గమనార్హం. మహిళా కమిషన్ అసంతృప్తి: మరోవైపు ఆసుపత్రి యాజమాన్య దర్యాప్తుపై రాష్ట్ర మహిళా కమిషన్ కూడా అసంతృప్తి వ్యక్తం చేసింది. ఈ కేసుపై ఆసుపత్రి అధికారులు సమర్పించిన నివేదికపై ప్యానెల్ సంతృప్తి చెందలేదని మహిళా కమిషన్ వైస్ చైర్మన్ ప్రీతి భరద్వాజ్ ప్రకటించారు. Panchkula: A staff nurse was allegedly eve teased by a doctor at civil hospital Sector-6 Panchkula. Nurses protested against the doctor and also thrashed him in his office. pic.twitter.com/bpX98nTn7P — PRITAM THAKUR (@pritamt2707) July 14, 2020 -
ఆవుల మెడలో రేడియం టేపులు
హరియాణ: పశువులను సంరక్షించాలనే తపనతో ఓ స్వచ్చంద సంస్థ నిర్వహిస్తున్న వినూత్న కార్యక్రమం వార్తల్లో నిలిచింది. వివరాల్లోకి వెళితె.. సర్వ్ కాంట్రాక్టర్ సంగ్ (ఎస్సీఎస్), రెసిడెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్(ఆర్వీఏ) అనే స్వచ్ఛంద సంస్థలు హరియాణాలోని పంచకులలో రోడ్డు ప్రమాదాల నివారణకు, మూగజీవాల పరిరక్షణకు సరికొత్త పంథా ఎంచుకున్నాయి. రాత్రి వేళల్లో రోడ్డు ప్రమాదాల బారిన పడకుండా ఆవులు, కుక్కల మెడల్లో రేడియం టేపులు కట్టారు. ఇప్పటి వరకు హైవేలోని 150 ఆవులకు రేడియం టేపులు కట్టామని నిర్వాహకులు తెలిపారు. ఎస్సీఎస్ ప్రెసిడెంట్ రవీందర్ జజారియా మాట్లాడుతూ.. జంతువులు, రాత్రి వేళ బైక్ నడిపే ప్రజలకు రక్షణ కల్పించడమే తమ ముఖ్య ఉద్దేశమని అన్నారు. ‘పొగ మంచు వల్ల వాహనదారులకు జంతువులు కనిపించవు కనుక.. మంచు కురిసే చోట్ల ప్రమాదాలకు అవకాశం ఎక్కువ. అందుకనే రేడియం టేపుల ఆలోచన వచ్చింది. నాణ్యమైన రేడియం టేపులు ధరించిన జంతువులు వాహనాదారులకు దూరం నుంచి కనిపిస్తాయి. దాంతో వారు జాగ్రత్త పడొచ్చు. కోయంబత్తూరు నుంచి టేపులను కొనుగోలు చేస్తున్నామ’ని తెలిపారు. -
‘వివరాలు ఇవ్వలేదు.. 87 కోట్లు చెల్లించండి’
సాక్షి, న్యూఢిల్లీ : ఆర్టీఐ కింద కోరిన సమాచారాన్ని ఇవ్వడంలో ఎంప్లాయ్మెంట్ ఎక్సేంజ్ కార్యాలయం విఫలమైనందును నష్టపరిహారంగా రూ.87 కోట్లు చెల్లించాలని ఓ నిరుద్యోగి జాతీయ వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్‌లో దావా వేశాడు. దీనిపై స్పందించిన కమిషన్.. వినియోగదారుల హక్కుల పరిరక్షణ చట్టం సెక్షన్ 26 ప్రకారం.. వస్తు, సేవల్లో లోపం కారణంగా తనకు జరిగిన నష్టాన్ని బాధితుడు ప్రతిదారు నుంచి పొందొచ్చు. కానీ, ఈ కేసులో ఫిర్యాదుదారు నిరాధార ఆరోపణలు చేశాడని కమిషన్ అభిప్రాయపడింది. వివరాలు.. ఆర్టీఐ కింద తాను కోరిన సమాచారాన్ని ఇవ్వడంలో ఎంప్లాయ్మెంట్ ఎక్సేంజ్ విఫలమైందని పంచకులకు చెందిన విజయ్‌కుమార్ ఆరోపించారు. సరైన సమాచారం లభించనందున తాను తీవ్రంగా నష్టపోయినట్టు జాతీయ వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్ని ఆశ్రయించాడు. నష్టపరిహారంగా 87 కోట్ల రూపాయలు చెల్లించేలా ఎంప్లాయ్మెంట్ ఎక్సేంజ్‌ను ఆదేశించాలని దావా వేశాడు. దీనిపై స్పందించిన కమిషన్.. ఆర్టీఐ కింద సమాచారాన్ని కోరాడు అనేందుకు విజయ్ వద్ద ఎలాంటి ఫ్రూఫ్ లేదని పేర్కొంది. తప్పుదు ఆధారాలతో కమిషన్‌ను విజయ్ తప్పుదోవ పట్టించాడని మండిపడింది. ఎంతోమందికి సేవలందించాల్సిన కమిషన్ కాలాన్ని వృధా చేశాడని ఆక్షేపించింది. జరిమానాగా విజయ్ రూ.100 చెల్లించాలని కమిషన్ తీర్పు వెలువరించింది. నాలుగు వారాల్లోగా జరిమానా మొత్తం చెల్లించి రశీదు అందించాలని తెలిపింది. ఇలాంటివి పునరావృతమైతే తీవ్ర చర్యలుంటాయని హెచ్చరించింది. -
మహిళపై 40 మంది అత్యాచారం
చండీగఢ్: హరియాణాలోని పంచ్‌కుల జిల్లాలోని మోర్ని ప్రాంతంలో ఓ 22 ఏళ్ల వివాహితను బంధించి నాలుగు రోజుల పాటు దాదాపు 40 మంది అత్యాచారానికి పాల్పడ్డారు. ఘటనకు సంబంధించి ముగ్గురు నిందితులను అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఉద్యోగమిస్తామని చెప్పి తెలిసిన వ్యక్తి ఒకరు తన భార్యను గెస్ట్‌హౌస్‌కు రమ్మన్నారని అక్కడే నాలుగు రోజుల పాటు బంధించి డ్రగ్స్ ఇచ్చి చిత్రహింసలు పెడుతూ అత్యాచారానికి పాల్పడినట్లు బాధితురాలి భర్త మీడియాకు తెలిపారు. ‘జూలై 15 నుంచి 18 వరకు ప్రతిరోజూ 10 మంది అత్యాచారానికి పాల్పడ్డారు. ఎలాగోలా అక్కడి నుంచి బయటపడిన ఆమె నాకు ఫోన్ చేసి అన్ని విషయాలు చెప్పింది. నా భార్య ఇంటికి వచ్చిన వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశాం’అని చెప్పారు. గెస్ట్‌హౌస్ యజమానితో పాటు మేనేజర్, మరొకర్ని పోలీసులు అరెస్టు చేశారు. -
‘లేడీ సింగం’ నైటౌట్.. టెన్షన్ టెన్షన్!
పంచకుల : బాధ్యతలు చేపట్టిన తొలిరోజు నుంచే ఓ లేడీ సింగం గడగడలాడిస్తున్నారు. తమ డిపార్ట్మెంట్ పోలీసుల పనితీరు ఎలా ఉందని తెలుసుకునేందుకు నైటౌట్ చేశారు. భద్రతా చర్యలు ఎలా చేపడుతున్నారో తెలుసుకునేందుకు కమిషనర్‌గా వచ్చిన తొలిరోజు రాత్రి మొత్తం నగరాన్ని పర్యవేక్షించారు. హర్యానాలో ఇది హాట్ టాపిక్‌గా మారింది. చారు బాలి పంచకుల పోలీస్ కమిషనర్(సీపీ)గా సోమవారం ఛార్జ్ తీసుకున్నారు. అయితే రాత్రివేళ మహిళలు, సాధారణ పౌరులకు ఎంతమేరకు తమ పోలీసులు భద్రతా కల్పిస్తున్నారో తెలుసుకోవాలనుకున్నారు చారు బాలి. బాధ్యతలు చేపట్టిన రోజు రాత్రే వాహనంలో పంచకుల రోడ్లపై తిరిగి పర్యవేక్షించి షాక్ తిన్నారు. పలు విధులు, ఏరియాల్లో పోలీసులు డ్యూటీలో లేకపోవడాన్ని డీసీపీ రాజేందర్ కుమార్ మీనాకు మంగళవారం తెలిపారు. పోలీసులు డ్యూటీలో ఎందుకు లేరో తనకు సాధ్యమైనంత త్వరగా వివరాలు ఇవ్వాలని ఆదేశించారు. నైట్ షిఫ్ట్స్‌లో కొందరు పోలీసులను రోస్టర్ విధానంలో ప్రజల భద్రత కోసం నియమించాలని సీపీ చారు బాలి సూచించారు. అయితే కమిషనర్ ఛార్జ్ తీసుకున్న తొలిరోజే తాము డ్యూటీ ఎగ్గొట్టామని తెలిస్తే పరిస్థితి ఏంటని నైట్ డ్యూటీ పోలీసులు కంగారు పడుతున్నారు. తొలిసారి కనుక వార్నింగ్ ఇచ్చి వదిలేస్తారని.. ఇకపై బుద్ధిగా డ్యూటీ చేస్తే సరిపోతుందని పోలీసులు సర్దిచెప్పుకుంటున్నట్లు సమాచారం. లేడీ సింగం అప్పుడే రంగంలోకి దిగారంటూ పంచకుల నగరవాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. -
నగ్న ఫొటోలతో భార్యకు నరకం!
పంచకుల : మతం మారనందుకు ఓ వివాహితకు భర్త నరకం చూపిస్తున్నాడు. ఎంతలా అంటే.. నగ్న ఫొటోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేసి పైశాచిక ఆనందం పొందుతున్నాడు. తనకు నరకం నుంచి విముక్తి కల్పించాలంటూ బాధితురాలు పోలీసులను ఆశ్రయించారు. ఈ ఘటన హర్యానాలోని పంచకులలో చోటుచేసుకుంది. పంచకుల పోలీసుల కథనం ప్రకారం.. ఇటీవల ఓ హిందూ యువతికి స్థానిక ముస్లిం యువకుడితో వివాహం జరిగింది. కొన్ని రోజుల తర్వాత భర్త నుంచి వేధింపులు మొదలయ్యాయి. ఇస్లాం మతంలోకి మారాలంటూ భార్యను ఆ యువకుడు వేధిస్తున్నాడు. అయినా ఆమె ఒప్పుకోకపోలేదు. ఆవేశానికి లోనైన భర్త, తన స్నేహితుడితో కలిసి భార్యను నగ్నంగా ఫొటోలు తీశాడు. అయినా ఆమె మతం మారేందుకు నిరాకరించడంతో ఆగ్రహించిన నిందితులు వివాహిత అశ్లీల చిత్రాలు సోషల్ మీడియాలో పోస్ట్ చేసి పైశాచిక ఆనందం పొందుతున్నారు. వేధింపులు ఇక భరించలేనంటూ బాధితురాలు పోలీసులను ఆశ్రయించారు. కేసు నమోదు చేసిన పోలీసులు శుక్రవారం ఓ నిందితుడిని అరెస్ట్ చేశామని, మరో నిందితుడు పరారీలో ఉన్నట్లు తెలిపారు. మతం మారకపోతే విడాకులు ఇస్తానని కూడా భర్త వేధించేవాడని బాధితురాలు కన్నీటి పర్యంతమయ్యారు. -
అసలు నిజం ఒప్పుకున్న హనీప్రీత్..
ఛండీగఢ్ : వివాదాస్పద దత్తపుత్రిక హనీప్రీత్ ఇన్సాన్ ఎట్టకేలకు అసలు నిజం ఒప్పుకున్నారు. 38 మంది అమాయకుల ప్రాణాలను బలిగొన్న పంచకుల అల్లర్లకు పథకం అమలు చేసింది తానేనని నేరాన్ని అంగీకరించారు. ఈమేరకు ఆమె నోరువిప్పి, నిజాలు వెళ్లగక్కారని హరియాణా సిట్ అధికారులు బుధవారం వెల్లడించారు. రేప్ కేసులో డేరా సచ్ఛా సౌదా చీఫ్ గుర్మీత్ రాం రహీం సింగ్ దోషిగా తేలి, అరెస్టయిన అనంతరం హరియాణ, పంజాబ్ లలో హింస చెలరేగిన సంగతి తెలిసిందే. ప్రధానంగా సీబీఐ కోర్టు ఉన్న పంచకుల పట్టణంలోనైతే హింస తీవ్రరూపం దాల్చడం, అల్లర్లలో 38 మంది అమాయకులు ప్రాణాలు కోల్పోవడం విదితమే. ఈ ఘటనలకు సంబంధించి సూత్రధారిగా భావిస్తోన్న హనీప్రీత్ ను ఇటీవలే అరెస్టు చేశారు. పక్కాగా అమలు చేసిన హనీప్రీత్ : ఇద్దరు మహిళలపై అత్యాచారం కేసులో పంచకుల కోర్టు ఆగస్టు 25న గుర్మీత్ ను దోషిగా నిర్ధారించింది. అదే రోజు ఆయనను పోలీసులు అరెస్టు చేశారు. కోర్టు తీర్పు రావడానికి వారం రోజుల ముందే, అంటే ఆగస్టు 17న డేరా ఆశ్రమంలో కీలక సమావేశం ఒకటి జరిగింది. గుర్మీత్, హనీప్రీత్, డేరా ముఖ్యులు కొందరు పాల్గొన్న ఈ భేటీలో వ్యతిరేక తీర్పు వస్తే ఏం చెయ్యాలనేదానిపై ఒక స్కెచ్ గీశారు. ఆ పథకం ప్రకారమే బాబా అరెస్టైన వెంటనే పలు ప్రాంతాల్లో అల్లర్లు రేపారు. సాధారణ ప్రజలే టార్గెట్ గా హింసకు పాల్పడ్డారు. ఇందుకు అవసరమైన సరంజామా, డబ్బులను డేరా ముఖ్యులు సరఫరా చేశారు. ల్యాప్ టాప్ లో కీలక సమాచారం : ఏయే ప్రాంతాల్లో అల్లర్లు రేపాలో ముందే పథకాన్ని రచించడంతోపాటు అందుకు అయ్యే ఖర్చును ఒక్కో డేరా ముఖ్యుడికి అప్పజెప్పారు. ఎవరెవరు ఏయే ప్రాంతాల్లో అల్లర్లు చేయించారు, ఎంతెత డబ్బులు ఇచ్చారు అన్న సమాచారం మొత్తాన్ని హనీప్రీత్ తన ల్యాప్ టాప్ లో స్టోర్ చేసుకున్నట్లు పోలీసులు చెబుతున్నారు. అయితే ఇప్పుడు కనిపించకుండా పోయిన ఆ ల్యాప్ టాప్ దొరికితే గనుక అందులోని సమాచారం కేసుకు మరింత ఉపయుక్తం కానుందని సిట్ అధికారి ఒకరు వ్యాఖ్యానించారు. -
మాస్టర్ మైండ్ ‘హనీప్రీత్’
సాక్షి, పంచకుల : డేరా సచ్చాసౌధా మాజీ అధిపతి, రేప్ కేసులో 20 ఏళ్ల జైలు శిక్ష అనుభవిస్తున్న గుర్మీత్‌బాబా తీర్పు తరువాత జరిగిన అల్లర్లకు ఆయన దత్త పుత్రిక హనీప్రీత్ ఇన్సాన్‌నే మాస్టర్ మైండ్ అని తెలుస్తోంది. పంచకుల సీబీఐ కోర్టు తీర్పు తీరువాత.. అల్లర్లు, హింసాత్మక ఘటనల కోసం హనీప్రీత్ ఇన్సాన్ కోటి 25 లక్షల రూపాయలు ఖర్చు చేసినట్లు సిట్ అధికారులు చెబుతున్నారు. గుర్మీత్ వ్యవహారంపై ఇన్వెస్టిగేషన్ చేస్తున్న సిట్ అధికారులు.. తాజాగా గుర్మీత్ వ్యక్తిగత సహాయకుడు రాకేష్ కుమార్‌ని విచారణ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ విచారణలోనే పలు విషయాలు వెలుగు చూశాయని సీట్ అధికారి ఏసీపీ ముఖేష్ తెలిపారు. గుర్మీత్‌పై తీర్పు సమయంలో ఆయనతో పాటు దత్తపుత్రిక హనీప్రీత్, వ్యక్తిగత సహాయకుడు రాకేష్ కుమార్ వెంట ఉన్నారు. తీర్పు వెలువడిన వెంటనే అల్లర్లకు వారు పథకం రచించారని అందుకోసం కోటి 25 లక్షల రూపాయలను వినియోగించారని సిట్ అధికారులు ప్రకటించారు. ఇదే విషయాన్ని పంచకుల కమిషనర్ ఆఫ్ పోలీస్ ఏఎస్ చావ్లా సైతం ధృవీకరించారు. గుర్మీత్ అరెస్ట్ తరువాత జరిగిన అల్లర్లకు సంబంధించి ఇప్పటికే సిట్ అధికారులు రాకేష్ కుమార్, హనీప్రీత్‌లను విచారణ చేస్తున్నారు. ఈ అల్లర్లకు సంబంధించిన కీలక వ్యక్తులు ఆదిత్య ఇన్సాన్, పవన్ ఇన్సాన్ల కోసం గాలిస్తున్నట్లు అధికారలు తెలిపారు. ఇదిలా ఉండగా హనీప్రీత్, ఆమె భర్త ఇక్బాల్ సింగ్, సుఖ్‌దీప్‌లు డేరా కోర్ కమిటీ సభ్యులుగా సిట్ అధికారులు చెబుతున్నారు. ఇందులో సుఖ్దీప్ డేరా అనుచరులకు ఆయుధాలను ఉపయోగించడంలో ట్రైనింగ్ ఇచ్చేవాడని పోలీసులు తెలిపారు. డేరా ప్రధానకార్యాలయం నుంచి స్వాధీనం చేసుకున్న కంప్యూటర్ హార్డ్ డిస్క్‌లను ఐటీ విభాగం విశ్లేషణ చేస్తున్నారని చెప్పారు. హార్డ్ డిస్క్‌ల్లోని విషయం బయటకు వస్తే.. మరింత సమాచారం తెలుస్తుందని సిట్ అధికారులు చెబుతున్నారు. -
చిన్నతప్పుతోనే పంచకుల రణరంగం
ఛండీగఢ్: కేంద్ర బలగాలతో ముందస్తు మోహరింపులు, ఇంటర్నెట్ సేవల నిలిపివేత, చెక్ పోస్టుల ఏర్పాటు... ఇవేవీ పంచకులను రణరంగంగా మార్చకుండా ఆపలేకపోయాయి. తీర్పు నేపథ్యంలో జారీ చేసిన నిషేధాజ్నల ఉత్తర్వుల్లోని ఓ చిన్న తప్పిదమే 31 ప్రాణాలు పోయేందుకు కారణమైందన్న వాదన వినిపిస్తోంది. గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్ పై అత్యాచార కేసులో ఈ నెల 25న తీర్పు సందర్భంగా ఉద్రిక్త పరిస్థితులు తలెత్తుతాయని భావించిన హరియాణా ప్రభుత్వం ముందస్తుగా ఓ ఆర్డర్‌ను ఆగష్టు 18న, తిరిగి 22న మరో ఆర్డర్‌ను జారీ చేసింది. వాటిలో పంచకులకు వచ్చే ప్రజలు ఎలాంటి ఆయుధాలు తీసుకురావటానికి వీల్లేందంటూ పేర్కొంది. అయితే జనాలు గుంపులుగా గుమిగూడొద్దనే వ్యాఖ్యను మాత్రం చేర్చలేదు. ఇదే కొంప ముంచిదన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది. ఇక ఈ ఆర్డర్లలో పొరపాటు ఉందంటూ 24వ తేదీ అంటే తీర్పు వెలువరించడానికి సరిగ్గా ఒక్కరోజు ముందు అడ్వొకేట్ జనరల్ బీఆర్ మహాజన్ బీఆర్ మహాజన్ కోర్టుకు కోరి "ఐదుగురి కంటే ఎక్కువ మంది గుమిగూడకుండా ఉండటం" అన్న పదంను చేర్పించి కొత్త ఆర్డర్‌ను తీసుకొచ్చారు. అయితే అప్పటికే సుమారు 2,00,000 మంది అనుచరులు పంచకులకు చేరుకోవటం, వారిని ఖాళీ చేయించే యత్నంలో బలగాలు విఫలమవ్వటం, ఆపై తీర్పు వెలువడటం, ఆగ్రహంతో రెచ్చిపోయిన డేరా అనుచరులు ప్రభుత్వ ఆస్తులను విధ్వంసం చేయటం, మరీ ముఖ్యంగా అల్లర్లలో ప్రాణాలు బలికావటం ఒకదాని వెంట ఒకటి జరిగిపోయాయి. -
హరియాణా ప్రభుత్వానికి హైకోర్టు చివాట్లు
సాక్షి, హరియాణా: పంజాబ్, హరియాణా రాష్ట్రాల ఉమ్మడి హైకోర్టు హరియాణా సర్కారుకు శనివారం చివాట్లు పెట్టింది. రాజకీయంగా లబ్ధి పొందేందుకే ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ ప్రభుత్వం 'పంచకుల'ను తగులబెట్టేలా చేసిందని కోర్టు వ్యాఖ్యానించింది. సీబీఐ కోర్టు తీర్పు అనంతరం రెచ్చిపోతున్న డేరా సచ్చా సౌధా అనుచరులను కట్టడి చేయకుండా వారికి ప్రభుత్వం లొంగిపోయిందని న్యాయమూర్తి పేర్కొన్నారు. గుర్మీత్ కోర్టుకు వెళ్తున్న సమయంలో అన్ని వాహనాలను ఎందుకు అనుమతించారని ప్రశ్నించారు. పంచకుల తగులబడటానికి కారణమైన ఇద్దరు గుర్మీత్ అనుచరులపై దేశ ద్రోహం కేసు నమోదు చేయాలని హైకోర్టు ఆదేశించింది. గుర్మీత్ ఆస్తుల వివరాలను ఈ నెల 29లోగా కోర్టు ముందు ఉంచాలని రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. కాగా, పంచకుల సీబీఐ తీర్పుకు 72 గంటల ముందు నుంచే హరియాణా ప్రభుత్వం ముందస్తు చర్యలను చేపట్టింది. సున్నితమైన ప్రాంతాల్లో ఇంటర్నెట్ సేవలను కూడా నిలిపివేసింది. అయితే, డేరా అనుచరుల దుశ్చర్యల ముందు పోలీసు శక్తి సరిపోలేదు. కాగా, ప్రస్తుతం ఆర్మీ, పారామిలటరీ బలగాలు సిర్సాలోని డేరా ప్రధాన కార్యాలయం నుంచి అనుచరులను బయటకు తరలించేందుకు యత్నిస్తున్నాయి. పంచకుల ఘటనకు బాధ్యత వహిస్తూ ముఖ్యమంత్రి ఖట్టర్ రాజీనామా చేయాలని ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్ డిమాండ్ చేసింది. -
'డేరా' దమనకాండ.. ఉత్తరాది విలవిల
చండీగఢ్: రేప్ కేసులో డేరా సచ్చా సౌదా చీఫ్ గుర్మీత్ రామ్ రహీం సింగ్‌ను కోర్టు దోషిగా తేల్చిన తర్వాత ఉత్తరాది రాష్ట్రాల్లో హింస పెచ్చరిల్లింది. పంజాబ్, హర్యానా రాష్ట్రాల్లో తలెత్తిన ఘర్షణల్లో 31 మంది మృతి చెందారు. వందలాది మంది గాయపడ్డారు. హర్యానాలోని పంచకులలో చిన్నారితో సహా 17 మంది ప్రాణాలు కోల్పోయారు. పంచకుల ప్రత్యేక సీబీఐ కోర్టు తీర్పు వెలువరించగానే గుర్మీత్ రామ్ రహీం సింగ్ మద్దతుదారులు హింస, విధ్వంసాలకు పాల్పడ్డారు. ప్రభుత్వ కార్యాలయాలు, ఆస్తులను లక్ష్యంగా చేసుకుని దాడులకు దిగారు. మీడియా వాహనాలు, ప్రతినిధులపైనా ప్రతాపం చూపించారు. హర్యానాలో రెండు రైల్వే స్టేషన్లు, పవర్‌గ్రిడ్, పెట్రోల్ పంప్‌నకు నిప్పుపెట్టారు. ఢిల్లీలోనూ నిరసనకారులు విధ్వంసాలకు దిగారు. ఆనంద్ విహార్ ప్రాంతంలో రైలు, రెండు బస్సులను దగ్ధం చేశారు. రాజస్థాన్‌లోని శ్రీగంగానగర్‌లో నిరసనకారులు విద్యుత్ సబ్ స్టేషన్ కార్యాలయానికి నిప్పు పెట్టారు. పంచకులతో పోలీసులు జరిపిన కాల్పుల్లో 17 మంది మృతి చెందారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశముందని వార్తలు వస్తున్నాయి. మరోవైపు గుర్మీత్‌ను హెలికాఫ్టర్‌లో రోహతక్‌కు తరలించారు. అల్లర్లకు పాల్పడిన 1000 డేరా సచ్చా సౌదా కార్యకర్తలకు అదుపులోకి తీసుకున్నట్టు హర్యానా అదనపు డీజీపీ మహ్మద్ ఆకిల్ తెలిపారు. డేరా సచ్చా సౌదా ప్రధాన కార్యాలయం ఉన్న సిర్సాకు అదనపు భద్రతా దళాలను తరలించారు. హర్యానా, పంజాబ్ రాష్ట్రాల్లో పలు ప్రాంతాల్లో కర్ఫ్యూ విధించారు. ఉత్తరప్రదేశ్‌లోని నోయిడాతో పాటు పలు జిల్లాల్లో 144 సెక్షన్ అమల్లోకి తెచ్చారు. దేశ రాజధాని ఢిల్లిలోనూ భద్రతను పెంచారు. తమ రాష్ట్రానికి మరిన్ని బలగాలు పంపాలని కేంద్రాన్ని పంజాబ్ ప్రభుత్వం కోరింది. -
డేరా సచ్చా సౌదా విధ్వంసం.. టెన్షన్
చండీగఢ్: అత్యాచార కేసులో డేరా సచ్చా సౌదా చీఫ్ గుర్మీత్ రామ్ రహీం సింగ్‌ను పంచకుల ప్రత్యేక సీబీఐ కోర్టు దోషిగా తేల్చడంతో హింస చెలరేగింది. పంజాబ్, హర్యానా రాష్ట్రాల్లో గుర్మీత్ అనుచరులు పలుచోట్ల అల్లర్లకు దిగారు. హర్యానాలోని పంచకులలో ఆందోళనకారులు రెచ్చిపోయారు. మూడు మీడియా వాహనాలకు నిప్పుపెట్టారు. నిరసనకారులను చెదరగొట్టేందుకు లాఠిచార్జి చేసి, టియర్ గ్యాస్ ప్రయోగించారు. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు గాల్లోకి కాల్పులు జరిపారు. ఈ ఘటనల్లో 70 మంది వరకు గాయపడినట్టు తెలుస్తోంది. పలువురు మీడియా ప్రతినిధులకు కూడా గాయాలయ్యాయి. పోలీసుల కాల్పుల్లో ఐదుగురు నిరసనకారులు మృతి చెందినట్టు వార్తలు వస్తున్నాయి. పంజాబ్‌లోని మాలౌట్ రైల్వే స్టేషన్, పెట్రోల్ పంపునకు నిప్పుపెట్టారు. బతిండా ప్రాంతంలోనూ హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయి. ముందుజాగ్రత్తగా ఐదు జిల్లాల్లో కర్ఫ్యూ విధించారు. ప్రజలు శాంతియుతంగా ఉండాలని, సంయమనం పాటించాలని పంజాబ్ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్ విజ్ఞప్తి చేశారు. హింసాత్మక ఘటనలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఉద్రిక్త పరిస్థితుల దృష్ట్యా రైల్వే శాఖ రెండు రాష్ట్రాల్లో 201 రైళ్ల సర్వీసులను రద్దు చేసింది. గుర్మీత్‌ను దోషిగా నిర్ధారిస్తూ కోర్టు తీర్పు చెప్పడంతో దేశ రాజధాని ఢిల్లీలో భద్రతను కట్టుదిట్టంచేశారు. మరోవైపు రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఫోన్లో మాట్లాడారు. పంజాబ్ ఐదు జిల్లాల్లో తీవ్ర ఉద్రిక్తత, కర్ఫ్యూ విధింపు మన్సా ప్రాంతంలో రెండు పోలీసు వాహనాలు దగ్ధం ఛనన్‌వాల్‌లో టెలిఫోన్ ఎక్స్ఛేంజీకి నిప్పు పెట్టిన నిరసనకారులు లుథియానాలో భారీగా పోలీసులు, భద్రతా దళాల మొహరింపు హర్యానా పంచకులలో పోలీసుల కాల్పులు, ఐదుగురు మృతి పంచకులలో ఆదాయపన్ను శాఖ ఆఫీసు, షాపింగ్ మాల్, ధియేటర్ల ధ్వంసం పంచకుల: హోటల్ హాలీడే ఇన్ వద్ద నిరసనకారులు, భద్రతా దళాల మధ్య ఘర్షణ సిర్సాలో ఇండియా టుడే సిబ్బందిపై దాడి, కెమెరామెన్ ప్రదీప్ గుప్తాకు గాయాలు సిర్సాకు ర్యాపిడ్ యాక్షన్ బలగాలు తరలింపు పంచకులకు అదనంగా 600 మంది సైనికులను తరలించిన ఆర్మీ -
రేప్ కేసులో దోషిగా తేలిన గుర్మీత్ సింగ్
- సంచలన తీర్పు చెప్పిన పంచకుల సీబీఐ కోర్టు - హరియాణ, పంజాబ్‌లో హై అలర్ట్.. రోడ్లపైనే బాబా అనుచరులు పంచకుల: దేశవ్యాప్తంగా తీవ్ర ఉంత్కంఠ రేపిన అత్యాచారాల కేసులో పంచకుల సీబీఐ ప్రత్యేక కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. తనను తాను దేవుడి అవతారంగా చెప్పుకునే గుర్మీత్ సింగ్ అలియాస్ బాబా గుర్మీత్ సింగ్ రాం రహీంను అత్యాచారం కేసులో దోషిగా తేలారు. 2002లో గుర్మీత్ తన ఆశ్రమంలో సాధ్విలుగా ఉన్న ఇద్దరు మహిళలపై అత్యాచారానికి పాల్పడినట్లు సాక్ష్యాధారాలున్నాయన్న కోర్టు.. అతను ముమ్మాటికీ శిక్షార్హుడేనని పేర్కొంది. అయితే గుర్మీత్‌కు విధించే శిక్షలను సోమవారం ఖరారు చేయనున్నట్లు న్యాయమూర్తులు తెలిపారు. కోర్టు తీర్పును అనుసరిస్తూ హరియాణా పోలీసులు.. గుర్మీత్ సింగ్‌ను అదుపులోకి తీసుకుని, అంబాలా సెంట్రల్ జైలుకు తరలించారు. అంతకు ముందు కోర్టుకు హాజరయ్యేందుకు గుర్మీత్ 300 వాహనాల కాన్వాయ్‌తో హల్చల్ చేశారు. రెండు రాష్ట్రాల్లో హై అలర్ట్: డేరా సచ్చా సౌదా చీఫ్ గుర్మీత్ రామ్ రహీం సింగ్‌పై అత్యాచార ఆరోపణలకు సంబంధించిన కేసులో శుక్రవారం తీర్పు వెలువడనుండటంతో హరియాణా, పంజాబ్ నివురుగప్పిన నిప్పులా ఉన్నాయి. గుర్మీత్ మద్దతుదారులు, అభిమానులు దాదాపు లక్ష మంది వరకూ పంచకుల చేరుకున్నట్టు తెలుస్తోంది. ఈ పరిణామాలతో పంచకులతో పాటు పంజాబ్, హరియాణాల్లోని సున్నితమైన ప్రాంతాల్లో పోలీసులకుతోడు 15 వేలమంది పారామిలిటరీ బలగాలను మోహరించారు. అన్ని జిల్లాల్లోనూ 144 సెక్షన్ విధించారు. డేరా సచ్చా సౌదాకు పంజాబ్, హరియాణాల్లో లక్షలాది మంది మద్దతుదారులు ఉన్నారు. దీంతో ఈ రెండు రాష్ట్రాల్లోనూ హైఅలర్ట్ ప్రకటించారు. ముందుజాగ్రత్త చర్యగా ఇరు రాష్ట్రాల్లోనూ 72 గంటల పాటు మొబైల్ ఇంటర్నెట్ సేవలను నిలుపుదల చేశారు. సోషల్ మీడియాలో పోస్టులపై అధికారులు నిఘా పెట్టారు. పంచకులకు వెళ్లే బస్సులు, రైళ్లపై ఆంక్షలు విధించారు. పంజాబ్, హరియాణా ప్రభుత్వాలకు పూర్తి సహకారం అందిస్తామని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. తన ఆశ్రమంలో ఇద్దరు సాధ్వీలపై గుర్మీత్ రామ్‌రహీం సింగ్ అత్యాచారానికి పాల్పడ్డారని 2002లో ఆరోపణలు వచ్చాయి. దీనికి సంబంధించి పంజాబ్, హరియాణా హైకోర్టు ఆదేశాల మేరకు సీబీఐ డేరా చీఫ్‌పై కేసు నమోదు చేసింది. తీర్పు నేపథ్యంలో సిస్రాలోని 3 గ్రామాల్లో కర్ఫ్యూ విధించారు. (ఆ బాబా సీక్రెట్ ఏంటి?) -
కుటుంబాన్ని చంపి తాను ఉరేసుకుని..
పాంచ్కుల: రాఖీ పౌర్ణమి మరొక్క రోజులో ఉందనగా.. ఉత్తరప్రదేశ్‌లోని ఓ కుటుంబంలో విషాదం నెలకొంది. ఇంటి యజమాని తన భార్యను, ముగ్గురు కూతుళ్లను హత్య చేసి.. ఆపై తానూ ఉరేసుకుని ప్రాణాలు వదిలాడు. దీంతో ఆ చుట్టుపక్కల విషాద ఛాయలు అలుముకున్నాయి. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం యూపీలోని ఉన్నావో జిల్లాలో నీరజ్ అనే 30 ఏళ్ల వ్యక్తి ముందుగా తన భార్య రాజ్ కుమారిని (27) గొంతునులిమి హత్య చేశాడు. అనంతరం తన ముగ్గురు కూతుళ్లు నవిత(5), శివాని(2), అనన్య(7 నెలలు)లను కూడా గొంతు నులిమి చంపేశాడు. ఆ తర్వాత ఇంట్లో సీలింగ్ ఫ్యాన్‌కు ఉరేసుకుని ప్రాణాలు విడిచాడు. కుటుంబంలో మనస్ఫర్ధలే ఈ ఘటనకు దారి తీసి ఉంటాయని పోలీసులు ప్రాథమిక అంచనాకు వచ్చారు. -
క్రికెటర్ యువరాజ్ సింగ్ తండ్రి అరెస్ట్!
చంఢీఘడ్: మాజీ టెస్ట్ క్రికెటర్, భారత క్రికెటర్ యువరాజ్ సింగ్ తండ్రి యోగరాజ్ సింగ్ ను సోమవారం పోలీసులు అరెస్ట్ చేశారు. చండీఘడ్ సమీపంలోని పంచకులలో గొడవ దిగిన యోగరాజ్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తోంది. యోగరాజ్ తోపాటు మరో వ్యక్తిని కూడ ఈ ఘటనలో అరెస్ట్ చేసినట్టు పోలీసులు తెలిపారు. పంచకులలోని సెక్టర్ 2లో ఆదివారం రాత్రి జన్మదిన వేడుకలకు యోగరాజ్ సింగ్ కుటుంబ సభ్యులు హాజరయ్యారు. వేడుకలు ముగిసిన తర్వాత తిరిగి వెళుతుండగా కారు పార్కింగ్ వద్ద ఓ రిటైర్డ్ డీఎస్పీ కుమారుడికి యోగరాజ్ సింగ్ కు గొడవ జరిగింది. ఈ గొడవలో మాజీ డీఎస్పీ కుమారుడిపై దాడి చేసినట్టు ఫిర్యాదు అందిందని పంచకుల డీసీపీ రాహుల్ శర్మ తెలిపారు. బాధితుడు చేసిన ఫిర్యాదు మేరకు యోగరాజ్ సింగ్ ను అరెస్ట్ చేశామని పోలీసులు తెలిపారు.