క్రికెటర్ యువరాజ్ సింగ్ తండ్రి అరెస్ట్! | Former cricketer Yograj Singh arrested | Sakshi
Sakshi News home page

క్రికెటర్ యువరాజ్ సింగ్ తండ్రి అరెస్ట్!

Published Mon, Aug 25 2014 12:48 PM | Last Updated on Mon, May 28 2018 2:10 PM

క్రికెటర్ యువరాజ్ సింగ్ తండ్రి అరెస్ట్! - Sakshi

క్రికెటర్ యువరాజ్ సింగ్ తండ్రి అరెస్ట్!

చంఢీఘడ్: మాజీ టెస్ట్ క్రికెటర్, భారత క్రికెటర్ యువరాజ్ సింగ్ తండ్రి యోగరాజ్ సింగ్ ను సోమవారం పోలీసులు అరెస్ట్ చేశారు. చండీఘడ్ సమీపంలోని పంచకులలో గొడవ దిగిన యోగరాజ్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తోంది. యోగరాజ్ తోపాటు మరో వ్యక్తిని కూడ ఈ ఘటనలో అరెస్ట్ చేసినట్టు పోలీసులు తెలిపారు. 
 
పంచకులలోని సెక్టర్ 2లో ఆదివారం రాత్రి జన్మదిన వేడుకలకు యోగరాజ్ సింగ్ కుటుంబ సభ్యులు హాజరయ్యారు. వేడుకలు ముగిసిన తర్వాత తిరిగి వెళుతుండగా కారు పార్కింగ్ వద్ద ఓ రిటైర్డ్ డీఎస్పీ కుమారుడికి యోగరాజ్ సింగ్ కు గొడవ జరిగింది. ఈ గొడవలో మాజీ డీఎస్పీ కుమారుడిపై దాడి చేసినట్టు ఫిర్యాదు అందిందని పంచకుల డీసీపీ రాహుల్ శర్మ తెలిపారు. బాధితుడు చేసిన ఫిర్యాదు మేరకు యోగరాజ్ సింగ్ ను అరెస్ట్ చేశామని పోలీసులు తెలిపారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement